Update 01

రాత్రి 11 గంటల సమయంలో తన ఇంటి ముందు ఆవేశము తో తన కార్ నుంచి కిందకు దిగి ఒక చేత్తో గన్ ఇంకో చేత్తో తన నోట్లో తాగుతున్న సిగరెట్ తీసి దాని విసిరేసి తన అనుచరులను అందరినీ వెళ్లిపోమని సైగ చేశాడు కమల్, తన ఇంట్లోకి వెళ్లగానే హాల్ లో ఉన్న మూడు కుర్చీలు చూస్తూ ఉన్నాడు ఒకటి బంగారం తో చేసిన కుర్చీ ఇంకోటి వెండి తో చేసింది మూడోది ఇనుము తో చేసిన కుర్చీ వాటి వెనుక ఉన్న గోడకి దండలు వేసి ఉన్న మూడు ఫొటోలు చూస్తూ తన చేతిలో ఉన్న గన్ నీ లోడ్ చేస్తూ వెళ్లి బంగారు కుర్చీలో కూర్చున్నాడు కమల్, వెనుక ఉన్న గోడ పైన ఫోటో లో ఉన్న తన ఇద్దరు అన్నలు తండ్రి ఫోటో వైపు చూసి కుర్చీలో వెనకు వాలి ఉగ్రముగా ఉరుముతున్న మెరుపులు మధ్య కళ్లు మూసుకుని తన గతం లోకి వెళ్ళాడు కమల్.

(కొన్ని సంవత్సరాల క్రితం)

బళ్లారి చుట్టు పక్కల గ్రామాల్లో మైనింగులు అని ఇద్దరు నేర సామ్రాజ్యంకి మకుటం లేని మహారాజులు ఒకరు నారాయణ గౌడ, ఇంకొకరు బాబా ఖాన్ వీళ్ల ఇద్దరి మధ్య బళ్లారి జిల్లాలోని ఒక పట్టణం అయిన త్రిపుర మీద ఆధిపత్య పోరులో ఎప్పుడు త్రిపుర లో ఎప్పుడు ఏదో ఒక గొడవ జరుగుతున్నే ఉంది బాబా ఖాన్ కీ ముఖ్య అనుచరుడు తారకేశ, బాబా ఖాన్ కీ మంచి మిత్రుడు కూడా బాబా ఖాన్ కీ శివ నారయణ నుంచి ఎలాంటి ఆపద రాకుండా ఒక వజ్ర కవచం లా ఉండేవాడు.

బాబా ఖాన్ తో పోలిస్తే నారాయణ గౌడ కే ఎక్కువ మైనింగ్ స్థలం ఉన్న కానీ బాబా ఖాన్ కీ తెలియని ఒక రహస్యం నారాయణ గౌడ కీ తెలుసు బాబా ఖాన్ మైనింగ్ ఉన్న చోటు వెనుక ఉన్న అడవి ప్రాంతంలో బంగారం ఉంది గోల్డ్ మైనింగ్ కోసం ఎలాగైనా బాబా ఖాన్ అడ్డు తొలగించాలని ఆలోచిస్తూ ఉన్నాడు నారాయణ కాకపోతే తారకేశ నీ దాటి బాబా ఖాన్ మీదకు వెళ్లే దమ్ము లేదు, అందుకే ప్రతి సంవత్సరం హిందూపుర్ లో మొహరం పండుగ తిరునాళ్లు కీ బాబా ఖాన్ తప్పకుండా వెళ్ళతాడు అదే అదునుగా నారాయణ పధకం పన్నాడు రాత్రి ఊరుస్సు మొదలు కాగానే బాబా ఖాన్ నామాజ్ కోసం దర్గ లోకి వెళ్ళాడు అప్పుడు తారకేశ బయట తన ముగ్గురు కొడుకులు అయిన ఆకాశ్, విద్యుత్, కమల్ ముగ్గురికి బొమ్మలు కోనిస్తు ఉన్నాడు పెద్దోడు ఆకాశ్ ఆవేశము ఎక్కువ చదువు మానేసి తన తండ్రి దెగ్గర ఉంటున్నాడు, రెండోవాడు విద్యుత్ చాలా తెలివైనవాడు చదువులో దిట్ట, మూడో వాడు కమల్ వీడు ఇంకా చిన్నపిల్లోడు కాకపోతే ఈ కథను నడిపించేది వీడే.

బాబా ఖాన్ నామాజ్ పూర్తి చేసుకొని బయటకు రాగానే నారాయణ జనరేటర్ పేల్చేసాడు సరిగ్గా బాబా ఖాన్ తల నరికి చంపే ప్రయత్నంలో అడ్డుగా వచ్చిన తారకేశ తల ఎగిరిపోయింది దాంతో ఆకాశ్ ఆవేశము లో కత్తి తో నారాయణ నీ వెంబడిస్తు వెళ్లాడు.

(16 సంవత్సరాల తర్వాత)

బాబా ఖాన్ తన కనుసైగ లో త్రిపుర నీ పరిపాలిస్తూ ఉన్నాడు తనకు ఉన్న ఇద్దరు కొడుకులను కాదు అని తన కోసం ప్రాణాలు ఇచ్చిన తారకేశ కొడుకులు అయిన ఆకాశ్, విద్యుత్, కమల్ కీ వాళ్ల సామర్ధ్యం తగ్గట్టు గా వ్యాపారులు పంచిబేటాడు బాబా ఖాన్ ఆకాశ్ కీ ఉన్న కండ బలం వల్ల వాడికి మైనింగ్ పనులు ఇచ్చాడు టౌన్ లో రౌడీయిజం, భూమి ఆక్రమణ అని ఆకాశ్ వల్లే జరుగుతాయి, ఇంక మైనింగ్ నుంచి వచ్చే ఇనుము నీ విద్యుత్ చదువుకున్నాడు కాబట్టి వాడి బుద్ధి బలం నమ్మి వాడిని బినామీ గా ఉంచి ఐరన్ ఓర్ ఏక్సపోర్ట్ ఐంపోర్ట్ కంపెనీ పెట్టి మంగళూరు లో నుంచి లీగల్ బిజినెస్ చేస్తున్నారు, ఇంక కమల్ కీ బెంగళూరు లో ఉన్న గుర్రాల రెసింగ్ క్లబ్ ఇచ్చాడు.

బళ్లారి జిల్లా కీ కొత్తగా వచ్చిన కలెక్టర్ దృష్టికి బాబా ఖాన్ మైనింగ్ గురించి వచ్చింది దాంతో 16 సంవత్సరాలుగా ఒక చెయ్యి పోగొట్టుకోని ఇంట్లోనే ఉన్న నారాయణ కలెక్టర్ నీ కొనేసి ఆ మైనింగ్ ఆపాలని ఆర్డర్ పంపాడు దాంతో బాబా ఖాన్ ఇద్దరు కొడుకులు అయిన అక్బరుద్దీన్, అలీఖాన్ కలెక్టర్ నీ లేపేయాలి అని ఆవేశం తో ఊగిపోయారు కానీ బాబా ఖాన్ కీ తెలుసు ఈ పని ఒక్కడే చేయగలడు అని దాంతో కమల్ కీ విషయం అందించాడు సాయంత్రానికి కలెక్టర్ ఆఫీసు లో మీటింగ్ కి రమ్మని చెప్పాడు.

సాయంత్రం బాబా ఖాన్ మీటింగ్ కీ వచ్చాడు అక్కడ నారాయణ నీ చూసి ఇది తన పని అని అర్థం అయ్యింది, బాబా ఖాన్ వచ్చిన 5 నిమిషాలకు లోపల ఉన్న కలెక్టర్ పరుగున వచ్చి బాబా ఖాన్ కాలు మీద పడి మరీ ఆర్డర్ పేపర్ చించి భయం తో దండాలు పెట్టాడు అప్పుడు నారాయణ ఏమీ జరిగిందో అర్థం కాక చూస్తూ ఉంటే కమల్ రావడం చూసి భయం తో అక్కడి నుంచి పారిపోయాడు నారాయణ అది చూసి నారాయణ కొడుకు రాకేష్ ఆశ్చర్య పోయాడు.

(కలెక్టర్ కూతురుని కాలేజ్ నుంచి ఆ పాప వచ్చే బస్ నీ వాళ్ల మైనింగ్ జరిగే చోటుకు ఆకాశ్ తన మనుషులతో తెప్పించాడు తరువాత బస్ డీజిల్ అయిపోయింది అని బాంబులు పెట్టిన చోట బస్ ఆపేసారు అది అంత ఆకాశ్ వీడియో కాల్ లో చూసిన కలెక్టర్ భయం తో బయటకు పరిగెత్తుతూ వచ్చాడు ఇది అంతా ప్లాన్ చేసింది కమల్)

కమల్ నీ చూసి తన తండ్రి భయంతో వణుకుతూ ఉండడం చూసిన రాకేష్ "ఏంది అబ్బ ఆ పిల్ల నా కొడుకును చూసి భయపడి పరుగులు తీసినావు" అని అడిగాడు అప్పుడు నారాయణ "వాడు పిల్లోడు కాదురా నిక్కర్ ఏసుకున్నే రోజుల్లోనే మనల్నోని 25 మంది చంపి ఉండాడు నా చెయ్యి ఆడి అన్న తీసిన్నారు అనుకుంటాన్నారు లా కాదు ఆడే మెడ దాక వచ్చిన కత్తిని భుజం మీద నరికి పోయినాడు బతుకుపో అని ఆడు ఏసిన ఎంగిలి బతుకు బతుకుతనా" అని చెప్పాడు.

నారాయణ కమల్ గురించి చెప్పింది విని షాక్ అయ్యాడు రాకేష్ "ఏంది అబ్బ నువ్వు చెప్పింది ఈ కమల్ గాడు నీ చెయ్యి నరికనాడా" అని ఆశ్చర్యంగా అడిగాడు దానికి నారాయణ అవును అని తల ఆడించాడు.

( ఆ రోజు రాత్రి జరిగిన సంఘటన)

తారకేశ తల నరికిన తరువాత బాబా ఖాన్ నీ నరకబోతుంటే ఆకాశ్ నారాయణ మీదకి కత్తితో దాడి చేశాడు దాంతో నారాయణ తన కార్ ఎక్కి పారిపోయాడు అడవి దారిలో పారిపోయాడు కానీ లేపాక్షి బార్డర్ లోకి తన కార్ రాగానే కమల్ బైక్ మీద ఎదురుగా వచ్చి బాంబులు వేశాడు దాంతో నారాయణ కీ సెక్యూరిటీ గా ఉన్న జీప్ లు గాలిలో ఎగిరాయి నారాయణ కార్ కూడా ఆ విధ్వంసం లో ఎగిరి పడింది బాంబ్ వల్ల ఎవ్వరూ మిగలేదు నారాయణ బయట పడ్డాడు అప్పటికే కమల్ జీప్ చాటున కత్తి తో దాడి చేయడానికి సిద్ధంగా ఉండి నారాయణ మీదకు దుక్కాడు కానీ నారాయణ కమల్ గొంతు, చెయ్యి పట్టుకుని లేపి "నా కొండెగా నా తోడ అంత కండ లేదు పాంట్ ఏసుకునే వయస్సు రాలేదు నను సంపేదానికి వచ్చీనావు రా" అని గొంతు నులిమి చంపబోతుంటే తన రెండో చెయ్యి మోచేతి తో నారాయణ తల మీద బలంగా గుద్ది కింద పడేశాడు ఆ తర్వాత వాడి భుజం మీద కాలు పెట్టి కత్తి తో మెడ నరకకుండా "నువ్వు ఇప్పుడే చావకుడదు నీ పతనం చూసి నువ్వే చావాలి ఇంక నుంచి మా బాబా జోలికి వస్తే నీ మెడ నే నరుకుతా పో పోయి నిక్కర్ వేసుకున్నే ఒక పోటేగాడు నాకూ ప్రాణ భిక్షం పెట్టాడు అని చెప్పుకో" అని ఆవేశం తో నారాయణ కుడి చేయి నరికి వెళ్లిపోయాడు కమల్.

ఇది అంత విన్న రాకేష్ ఆవేశములో కమల్ మీదకు పోతుంటే నారాయణ ఆపి "కండ బలం ఉన్నోడిని బుద్ధి బలం తో గెలవోచ్చు, బుద్ధి బలం ఉన్నోడిని బలహీనత మీద గెలవోచ్చు, కానీ వాడికి బుద్ధి బలం, కండ బలం రెండు ఉన్నాయి గెలవడం చాలా కష్టం అదును చూసి సింహం నీ వేటాడినట్టు వేటాడాలి" అని చెప్పి తన కొడుకును తీసుకోని వెళ్లాడు నారాయణ.

కలెక్టర్ ఆఫీసు నుంచి బయటకు రాగానే బాబా ఖాన్ కమల్ నీ దగ్గరికి తీసుకోని "నువ్వు ఒక్కడివి చాలురా నా సామ్రాజ్యం సుఖంగా ఉంటుంది అన్న ధైర్యం తో బ్రతకోచ్చు సరే కానీ రాత్రికి పిల్లోలు క్లబ్ కాడికి వస్తారు వాళ్లకు ఏమీ కావాలో చూసుకో" అని చెప్పాడు బాబా ఖాన్ దానికి కమల్ కూడా సరే బాబా అని చెప్పి కార్ ఎక్కించి పంపించి తన కార్ లో తిరిగి బెంగళూరు వెళ్లాడు అప్పటికే అక్బరుద్దీన్, అలీఖాన్ ఇద్దరు క్లబ్ లోకి వచ్చి మందు వాసన, సిగరెట్ పొగతో క్లబ్ లోని గెస్ట్ హౌస్ నీ నింపేశారు వాళ్లకు వంట చేసి పెట్టే ఒక అమ్మాయి మందులోకి ఐటమ్స్ తెచ్చింది అప్పటికే డ్రగ్స్ మత్తులో మునిగి పోయిన అలీ ఆ అమ్మాయిని చూశాడు ( అలీ కీ అమ్మాయిలు మీద మోజు ఎక్కువ) ఆ అమ్మాయి చెయ్యి పట్టుకుని మీదకు లాగాడు తను వాడిని కొట్టి విడిపించుకొని బయటకు పరిగెత్తుతూ ఉంది అప్పుడు కమల్ ఆ అమ్మాయిని కొట్టి తీసుకోని వచ్చి అలీ పక్కన పడేశాడు అప్పుడు వెళుతున్న కమల్ నీ అక్బర్ చిటికె వేసి పిలిచి "మందు పోయి గ్లాస్ లో నువ్వు ఈ క్లబ్ కీ ఓనర్ ఏమో కానీ ఈ క్లబ్ మా అబ్బు ది అయిన నువ్వు నాకూ ఇష్టం మా తప్పులు అని బయటకు రానివ్వకుండా చూస్తావు ఆ పిల్ల పని పిల్ల కాబట్టి దాని వాడి పక్కలో పండబెట్టావు అదే నువ్వు మనసు పడ్డ పిల్ల అయితే ఇలాగే పంపుతావా" అని చెప్పి నవ్వాడు అక్బర్, దానికి కమల్ "నేను మనసు పడ్డ అమ్మాయి మీద చెయ్యి వేస్తే ఎగిరేది వాడి చెయ్యి మాత్రమే కాదు తల కూడా అక్బర్" అని చెప్పి వెళ్లిపోయాడు.

ఇది అంతా చూసిన క్లబ్ వాచ్ మెన్ తను ప్రేమించిన పిల్లను తన ముందే పాడు చేస్తుంటే ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో తన మీద తనకు అసహ్యం వేసింది దాంతో ఆ వంట పిల్లను తీసుకోని సెక్యూరిటీ అధికారి స్టేషన్ కీ వెళ్లాడు కంప్లయింట్ ఇవ్వడానికి అప్పుడే కమల్ వచ్చాడు స్టేషన్ కీ కమల్ నీ చూసి ఇద్దరు కంగారు పడ్డారు "మీ వంట గ్యాస్ పేలి మీ అమ్మ, నాన్న చచ్చారు" అని ఆ వంట పిల్లను వాచ్ మెన్ నీ క్లబ్ కీ తీసుకోని పోయాడు కానీ చూస్తే ఆ అమ్మాయి అమ్మ నాన్న ఇద్దరు బాగానే ఉన్నారు కానీ ఆ మంట లో వాచ్ మెన్ అమ్మ తగలబడిపోయింది, అది చూసి వాడు పిచ్చోడు అయ్యాడు ఇది అంత తన కార్ లో నుంచి చూస్తున్న బాబా ఖాన్ కమల్ నీ రమ్మని సైగ చేశాడు "మరి ఆ పిల్ల సంగతి ఏంటి" అని అడిగాడు దానికి కమల్ "బాబా ఆ పిల్ల నోరు మూసుకుని ఉండాలి అంటే ఆ పిల్ల నీ అలీ కీ ఇచ్చి పెళ్లి చేసి ఇంట్లో పడేస్తే జీవితం లో నోరు తెరవదు" అని చెప్పాడు అది విని అలీ "నేను ఆ కూలి దాని చేసుకొను" అని అన్నాడు దానికి బాబా ఖాన్ వాడిని కొట్టి "కమల్ చెప్పింది మాత్రం చెయ్యి" అని చెప్పి వెళ్లిపోయాడు కానీ అక్బర్ కీ, అలీ కీ చిన్నప్పటి నుంచి వాళ్ల ముగ్గురికి ఇచ్చిన హోదా ప్రేమ తమ తండ్రి తమకు ఇవ్వలేదు అని వాళ్ల ముగ్గురి మీద మంట ఇప్పుడు ఈ సంఘటన తో ఆ మంట కీ నూనె పోసినట్టు అయ్యింది.

కమల్ చెప్పినట్లు అలీ ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు ఆ తర్వాత కమల్ అలీ దగ్గరికి వచ్చి "రేయ్ పెళ్లి పేరు వరకే అది మళ్లీ నోరు ఎత్తకుండా అది పేరుకు మాత్రమే నీ పెళ్లాం కానీ నీ ఇంటి పనిమనిషి కిందే లేక నీ పాత పద్ధతి ప్రకారం నువ్వు ఉండొచ్చు" అని చెప్పాడు కానీ అలీ మాత్రం కోపం లోపల దాచుకుంటా ఉన్నాడు, ఆ కోపం తో తన భార్యను జుట్టు పట్టుకుని ఇంట్లోకి లాకుని వెళ్లి కిచెన్ లో పడేసి "ఒక రోజు నా పక్కలో పడుకుంటే నా ఇంట్లోకి వచ్చావ్ కానీ నా పెళ్లాం మాత్రం కావు ఈ వంట గది నీ చోటు ఈడనే వండు చచ్చేదాకా ఇక్కడే పడి ఉండు ముండా" అని కాలు తో కొట్టి వెళ్లిపోయాడు ఆ అమ్మాయి లేచి కళ్లు తుడుచుకొని తన పని తాను చేసుకుంటూ పోతుంది, ఆవేశం లో ఉన్న అలీ నీ అక్బర్ ఒక బీర్ ఇచ్చి కూల్ చేశాడు "రేయ్ అది లేబర్ దీ దాంతో మనకు పనిలా దాని తెచ్చి ఇంట్లో పెట్టినాడు చూడు ఆ ముసలి నాయాల్ని వాడు నెత్తిన పెట్టుకుని చూసుకునే ఆ అన్నదమ్ములకు దెబ్బ వేయాలి దానికి టైమ్ ఉంది" అని చెప్పాడు.

మరుసటి రోజు ఉదయం కమల్ క్లబ్ కీ కొంతమంది అమ్మాయిలు వచ్చి stallion లో ఉన్న గుర్రాలు చూస్తూ వాటితో ఫొటోలు దిగుతు ఉంటే అక్కడ పని చేస్తున్న ఒక కుర్రాడు వచ్చి ఏమీ కావాలి అని అడిగాడు అప్పుడు ఆ అమ్మాయిల లీడర్ అయిన కీర్తన ముందుకు వచ్చి "మేము హార్స్ రైడింగ్ నేర్చుకోవాలి ఎవరిని కలవాలి" అని అడిగింది దానికి ఆ కుర్రాడు "మా సార్ వస్తారు జాగింగ్ చేస్తున్నారు" అని చెప్పాడు "జాగింగ్ అంటే పార్క్ నుంచి రావాలి లేట్ ఏమో కదా అయిన పది గంటలకు జాగింగ్ ఏంటి" అని అడిగింది దానికి వాడు నవ్వి గుర్రాలు పరిగెత్తుతూ ఉన్న ట్రాక్ వైపు చూపించాడు ఆ గుర్రాల మధ్య బాగా కండలు తిరిగిన ఒక బారి శరీరం ఉన్న 25 సంవత్సరాల కుర్రాడు రేసుగుర్రాల మధ్య ఇంకో రేసుగుర్రం లాగా పరిగెత్తుతూ ఉన్నాడు, వాడిని చూడగానే కీర్తన మొహం మీద ఉన్న కురులు ఆటోమేటిక్ గా గాలిలోకి లేచ్చాయ్ అప్పుడు పక్కన ఉన్న తన ఫ్రెండ్ "యార్రి ఈ హుడుగా హీ మ్యాన్ అప్ప తరే ఇదారే" (ఎవడే వీడు హీ మ్యాన్ కీ అమ్మ మొగుడు లా ఉన్నాడు) అని కన్నడ లో అనింది జాగింగ్ అయిపోయి షర్ట్ వేసుకుని వచ్చాడు కమల్ అలా కమల్ నీ నేరుగా చూసిన కీర్తన డైరెక్ట్ గా I love you అని చెప్పింది దానికి అందరూ షాక్ అయ్యారు కానీ కమల్ నవ్వుతూ తన అన్న విద్యుత్ నుంచి ఫోన్ వస్తే వెళ్లాడు కానీ కీర్తన మాత్రం కమల్ వెళుతున్న కార్ నీ చూస్తూ ఉంది.

ఆ రోజు సాయంత్రం బాబా ఖాన్ అందరికీ అలీ పెళ్లి అయినందున పార్టీ ఇస్తున్నారు దానికి చాలా పెద్ద పెద్ద విఐపి లు వచ్చారు వాళ్లతో పాటు కమల్ అన్నలు ఆకాశ్, విద్యుత్ కూడా వాళ్ల ఫ్యామిలీ తో వచ్చారు ఆకాశ్ భార్య తన డెలివరీ సమయంలో చనిపోయింది ఉన్న ఒక్క కొడుకును విద్యుత్ దెగ్గర ఉంచి చదివిస్తున్నాడు, విద్యుత్ ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు తనతో పాటు తెలివిగా బ్రిటన్ లో తన కంపెనీ పనులు సాగించడానికి బ్రిటన్ లో చాలా పలుకుబడి ఉన్న ఒక భారతీయ బిజినెస్ మ్యాన్ కూతురుని చేసుకున్నాడు, అందుకే మూడు నెలల పాటు ఇండియా లో మూడు నెలల పాటు బ్రిటన్ లో ఉంటాడు తన భర్త కు రెండో పెళ్లి అయ్యింది అని విద్యుత్ భార్య రాధా కు తెలియదు కానీ బ్రిటన్ లో ఉన్న తన రెండో భార్య నిత్య కీ రాధా గురించి తెలుసు.

ఇలా పార్టీ సాగుతూ ఉంటే మైనింగ్ మినిస్టర్ తన కూతురు సంధ్య తో పాటు ఫంక్షన్ కి వచ్చాడు పేరుకు మినిస్టర్ కూతురు అయిన ఒక కాలేజ్ లో టీచర్ గా పని చేస్తోంది తనని చూసి గుర్తు పట్టిన ఆకాశ్ కొడుకు వెళ్లి పలకరించాడు అప్పుడే వాళ్ల దగ్గరికి వచ్చిన ఆకాశ్ తన కొడుకును భోజనం చేయడానికి తీసుకోని వెళ్లుతుంటే సంధ్య తనని గుర్తు పట్టి "మీరు ఆకాశ్ కదా అప్పుడప్పుడు మీరు మా ఇంటికి వస్తుంటారు చూశాను మిమ్మల్ని చిన్న మీ కొడుకా" అని అడిగింది దానికి ఆకాశ్ "అవును మేడమ్ నేను ఎలాగో పెద్ద చదువుకోలా పైగా నాయన పోయినాక ఇంక బాబా కాడనే పెరిగిన తమ్ములని చదివించిన పైగా ఈడు నా లేక కాకుండా వాళ్ల చిన్నాయానల లేక అవ్వాలి అని చదివిస్తాన్నా" అని చెప్పాడు "మీ అబ్బాయి చాలా మంచోడు తెలివైనవాడు నాకూ బాగ ఇష్టం వీడు అంటే" అని చెప్పింది సంధ్య అలా వాళ్ల మధ్య స్నేహం కుదిరింది.

ఆ తర్వాత కమల్ డ్రింక్ తాగుతూ ఉంటే బాబా ఖాన్ వచ్చి "ఏమిరా మీ అన్నలు కుటుంబం తో సహా వస్తే నువ్వు మాత్రం లింగు లింగు అని ఒక్కడివే వచ్చినావు పెళ్లి చేసుకున్నేదిలా" అని అడిగాడు దానికి కమల్ నవ్వి "మనవి గ్యారంటీ లేని బతుకులు బాబా పెళ్లి చేసుకుని ఏమీ చేసుకోవాలా" అని అన్నాడు దానికి బాబా "అవును పొద్దున ఎవరో అమ్మి నిన్ను ప్రేమిస్తున్న అనింది అంట చెప్పు నచ్చితే ఈ ఇంటికి చిన్న కోడల్ని చేసేదాం" అని నవ్వుతూ అడిగాడు దానికి కమల్ "హమ్ నీ దాక వచ్చిందా అది ఎవరో తిక్కది ఏదో సినిమా లో హీరో నీ చూసి నను వాడిలా ఊహించుకోని చెప్పింది ఆశ గా ఉంటే నువ్వు చేసుకో పెళ్లి" అని అన్నాడు.

అలా పార్టీ జరుగుతున్న సమయంలో జిల్లాకు వచ్చిన కొత్త ఎస్పి సరాసరి బాబా ఖాన్ ఇంట్లోకి వచ్చి అక్బరుద్దీన్ నీ షర్ట్ పట్టుకుని కొట్టుకుంటూ అరెస్ట్ చేసి తీసుకోని వెళ్లుతుంటే బాబా ఖాన్ అడ్డుగా నిలబడి ఏమీ జరిగింది అని అడిగాడు అప్పుడు ఎస్పి "మీ అబ్బాయి తన అనుచరుడుని నిన్న రాత్రి తాగిన మైకం లో చంపేసాడు అందుకే అరెస్ట్" అని చెప్పి అక్బర్ నీ తీసుకోని వెళ్లుతు కిచెన్ కిటికీ నుండి చూస్తున్న అలీ భార్య వైపు చూసి తల ఆడించి అక్బర్ నీ తీసుకోని వెళ్లాడు.

కొత్త ఎస్పి అక్బర్ నీ తీసుకోని వెళ్లుతుంటే మినిస్టర్ నీ వెళ్లి ఆపమని చెప్పాడు బాబా ఖాన్ కానీ మినిస్టర్ "చూడు బాష మేము నీకు అండగా ఉంటామని హామీ ఇవ్వలేదు పైగ వాడు పూర్తి ఆధారాలతో సహా నీ కొడుకును తీసుకోని వెళ్లాడు నేను ఏమీ చేయలేను" అన్నాడు, అప్పుడు ఆకాశ్ స్టేషన్ కీ లాయర్ తో వెళ్లి బెయిల్ పేపర్లు చూపించాడు కానీ ఎస్పి మాత్రం "రాత్రి టైమ్ కదా సార్ బెయిల్ ఎలా వస్తుంది అరే మెజిస్ట్రేట్ సంతకం కూడా ఉందే ముందుగానే అని పేపర్లు రెడీగా పెట్టార రేపు కోర్టు లో సాక్ష్యం తో సహ మీ వాడిని పెడుతా అప్పుడు ఏమీ చేయగలరో చేసి చూపించండి" అన్నాడు, దానికి ఆకాశ్ బయటికి వచ్చి కమల్ కీ ఫోన్ చేసి జరిగింది అంతా చెప్పాడు దానికి కమల్ "ఆ సాక్ష్యం కోర్టుకు వస్తేనే కదా శిక్ష పడేది నేను చూసుకుంటా" అని ఫోన్ పెట్టేసి తన కార్ ముందు ఉన్న బైక్ నీ ఫాలో అవుతున్నాడు అప్పుడు ఆ బండి ఎదురుగా ఒక లగేజ్ వ్యాన్ లో సరుకులు తీసుకోని వెళ్లుతున్నారు అప్పుడు కమల్ విజిల్ వేయగానే ఆ వ్యాన్ లో నుంచి ఒక ఫ్రీడ్జ్ నీ బయటికి విసిరారు అప్పుడు ఆ బైక్ మీద వెళ్లే అతను సడన్ బ్రేక్ వేసి కింద పడ్డాడు అప్పుడు వ్యాన్ లో వాళ్లు అతని కట్టెసి ఫ్రీడ్జ్ లో పడేసి చెక్ పోస్టు దాటి తప్పించుకున్నారు.

(అలీ పెళ్లి జరిగిన రాత్రి అక్బర్, అలీ ఇద్దరు ఇంటి మేడ పైన కూర్చుని మందు తాగుతున్నారు అప్పుడు అక్బర్ ఫ్రెండ్ రైట్ హ్యాండ్ ఇమ్రాన్ వచ్చి వాళ్ల తో కలిసి మందు తాగుతూ ఉన్నాడు అప్పుడు మందు మత్తులో "అయిన కమల్ గాడు లేకపోతే అలీ గా నువ్వు బెంగళూరు జైలులో చిప్ప కూడు తింటా ఉంటివి ఈ పాటికే, అక్బర్ భాయ్ నువ్వు కూడా తక్కువ కాదు గా ఆ పిల్ల నీ ఇద్దరు కలిసి రేప్ చేసిన నీ తమ్మునికి పడింది బొక్క కానీ ఏ మాట కీ ఆ మాట కమల్ గాడు మీ కింద పని చేస్తున్నట్లు లా మీరే వాడి కింద బతుకుతానారు రేపు ఈ త్రిపుర కీ వాడే కింగ్ " అని ఇమ్రాన్ మాట పూర్తి కాక ముందే అలీ, అక్బర్ ఇద్దరి చేతిలో ఉన్న బీర్ బాటిల్స్ రెండు ఓకే సారి ఇమ్రాన్ తల పైన పగిలాయి ఆ తర్వాత అక్బర్ తన చేతిలో ఉన్న బీర్ బాటిల్ తో ఇమ్రాన్ గొంతులో పొడిచి చంపాడు ఇది అంత అక్బర్ దగ్గర పని చేసే కొత్త కుర్రాడు మొత్తం రికార్డ్ చేశాడు అప్పుడు వాడు అది రికార్డ్ చేయడం చూసిన అలీ భార్య వాడికి డబ్బులు ఇచ్చి అది కొత్త ఎస్పి కీ ఇవ్వమని చెప్పింది కానీ కొత్త కుర్రాడు ఎస్పి దెగ్గర పని చేసే కొత్త కానిస్టేబుల్ వాడినే ఇప్పుడు కమల్ కిడ్నాప్ చేశాడు)

అలా ఆ కానిస్టేబుల్ నీ కిడ్నాప్ చేసి తీసుకోని తన క్లబ్ కీ తీసుకోని వెళ్లాడు వాడిని కట్టెసి ఉంచారు తన కార్ మీద కూర్చుని పక్కన ఉన్న వాడితో గన్ ఇప్పించుకున్నాడు కమల్ తరువాత కిందకి దిగి గన్ లోడ్ చేసి ఆ కానిస్టేబుల్ దగ్గరికి వెళ్ళాడు వాడు నవ్వుతూ "నువ్వు నను చంపిన ఆ సాక్ష్యం ముందే ఎస్పి దగ్గరికి పంపిన ఏమీ చేయలేవు" అన్నాడు, దానికి కమల్ గట్టిగా నవ్వుతూ "రేయ్ నేను నిన్ను చంపితే నాకూ ఏమీ వస్తుంది రా అయిన నువ్వు రేపు కోర్టు టైమ్ కీ కోర్టు కీ వెళ్లాలి ఈ లోగా నీకు ఏమీ జరిగిన ఆ ఎస్పి మా మీదకు వస్తాడు అని నాకూ తెలుసు ఇంక నువ్వు పంపిన వీడియో అంటావా అది ఎప్పుడో మీ ఎస్పి what's app నుంచి వాడి ఫోన్ నుంచి cloud నుంచి కూడా డిలీట్ చేశా" అన్నాడు దానికి ఆ కానిస్టేబుల్ షాక్ అయ్యాడు, "మీ మనుషులే మా గ్యాంగ్ లో ఉంటార మా వాళ్లు మీలో ఉన్నారు ఈ జిల్లా కలెక్టర్ ఆఫీసు నుంచి సెక్యూరిటీ అధికారి స్టేషన్, గవర్నమెంట్ ఉద్యోగం లో చేరే ప్రతి ఒక్కరి జాతకం నా దగ్గర ఉంటుంది ప్రతి ఆఫీసు లో మా నెట్వర్క్ ఉంది అడుగు అడుగున నా మనుషులు ఉన్నారు ఇలాంటి స్టంట్స్ ఏస్తారు అనే ఇంక ఆ వీడియో అంటావ నీ ఫోన్ నుంచి మా వాళ్లు మీ ఎస్పి కీ ఒక వైరస్ పంపారు దాంతో డాటా మొత్తం డిలీట్ చేయాలి" అని చెప్పాడు కమల్ దాంతో ఆ కానిస్టేబుల్ దిగులు పడ్డాడు అప్పుడు కమల్ "నువ్వు దిగులు పడోద్దు నీకు ఈ ఉద్యోగం స్పోర్ట్స్ కోటా లో వచ్చింది అంట కదా చిన్న బెట్ నీకు నాకూ నువ్వు గెలిస్తే ఈ కేసు కీ నేను అడ్డు రాను ఓడిపోతే నీకు చావు" అని అన్నాడు.

దానికి ఆ కానిస్టేబుల్ ఆశ గా తల ఆడించాడు అప్పుడు కమల్ వాడి కట్లు విప్పి గట్టిగా విజిల్ వేశాడు లోపల stallion లో నుంచి రెండు మదం ఎక్కిన అడవి గుర్రాలు పరిగెత్తుతూ వచ్చి కమల్ పక్కన నిలబడి ఉన్నాయి "గేమ్ చాలా సింపుల్ భాయ్ మొత్తం మూడు రౌండ్లో నువ్వు నా టైమ్ ఈ గుర్రాల స్పీడ్ బీట్ చేసి నిలబడితే వదిలేస్తా" అని చెప్పి తను కూడా షర్ట్ విప్పి ట్రాక్ లోకి వెళ్లి నిలబడాడు కమల్ ఆ తర్వాత విజిల్ వేశాడు దాంతో గుర్రాలు పరుగెత్తాయి వాటితో పాటు వీలు ఇద్దరు కూడా పరిగెత్తారు కమల్ రోజు గుర్రాల మధ్య పరిగెత్తే వాడు కావడంతో గుర్రాల వేగం తో సమానంగా పరిగెత్తుతూ ఉన్నాడు కానీ ఆ కానిస్టేబుల్ మొదటి రౌండ్ లో నిలబడాడు కానీ రెండో రౌండ్ లో కింద పడ్డాడు అప్పుడు వాడిని గుర్రాలు తొక్కబోతుంటే కమల్ వాడిని కాపాడి "రేపు కోర్టు గేట్ దెగ్గర కలుదాం అని చెప్పి" వెళ్లిపోయాడు, కమల్ గ్యాంగ్ లో ఒకడు "ఏంది భాయ్ వాడిని వదిలేశావ్ గుర్రాల కింద తొక్కించకుండా" అని అన్నాడు దానికి కమల్ నవ్వి వెళ్లిపోయాడు మరుసటి రోజు ఉదయం కోర్టు బయట ఎస్పి తన ఫోన్ లో డాటా మొత్తం పోయి ఇంక చివరి ఆధారంగా ఉన్న ఆ కానిస్టేబుల్ కోసం చూస్తు ఉన్నాడు అంతలో అతను వచ్చాడు ఎదురుగా ఉన్న ఎస్పి, కమల్ వైపు చూశాడు తను సాక్ష్యం చెప్తే ఎక్కడ తనను చంపుతారో అని నిన్న రాత్రి తనని వదిలేసిన దానికి కారణం తన చావు వాయిదా పడింది అని అర్థం అయ్యి ఏమీ చేయాలో తెలియక రోడ్డు దాటి వస్తూ ఒక లారీ కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు దానికి ఎస్పి షాక్ అయ్యాడు ఆ తర్వాత కోర్టు లో కూడా కేసు నిలబడ లేదు దాంతో అక్బర్ రీలిస్ అయ్యాడు.

ఆ తర్వాత ఇంటికి వెళ్లిన తర్వాత తన తండ్రి అక్బర్ నీ కాకుండా కమల్ నీ కౌగిలించుకున్నాడు అని కోపంతో రగిలిపోతు లోపలికి వచ్చి "అబ్బు నీకు మేము కొడుకులమా వాళ్లు కొడుకులా" అని అడిగాడు అక్బర్ దానికి బాబా ఖాన్ తన పక్కన ఉన్న కుక్క కీ బిస్కెట్ వేశాడు అది వచ్చి అతని కాలు నాకింది "ఇప్పుడు ఆ బిస్కెట్ వేశా అని దాని మీద నాకూ ప్రేమ లేదు కానీ దానికి నా మీద విశ్వాసం తగ్గలేదు అదే నేను వాళ్ల ముగ్గురు తో చేస్తోంది ప్రేమ అనే బిస్కెట్ వేసిన అని రోజులు వాళ్లు మన మీద ఈగ కూడ రానివ్వరు మీరు నా ప్రేమ చూస్తున్నారు కానీ నేను వాళ్ల బలం చూశా పెద్దవాడు, రెండో వాడి కంటే చిన్నోడు చాలా ప్రమాదం వాడు బాంబ్ కీ ఉండే ఒత్తి వాడిని అలా ప్రేమ అనే దారం తో కట్టి ఉంచాలి పొరపాటున ఆ ఒత్తి జారీపోతే ఆ బాంబ్ మన మీద పేలుతుంది ఎప్పటికైనా ఈ త్రిపుర మీదే" అని తన అసలు రూపం కొడుకుల ముందు పెట్టాడు బాబా ఖాన్.

అక్బర్ అరెస్ట్ అయిన నెల రోజుల తరువాత ఒక రోజు మైసూర్ మహారాజా పాలెస్ లో మైసూర్ మహారాజా వంశస్థుల నుంచి బాబా ఖాన్ కీ ఒక ఫంక్షన్ కి పాలెస్ కి ఫ్యామిలీ తో సహ రావాలి అని పిలుపు వచ్చింది ఒకేసారి అంత పెద్ద మనుషుల నుండి పిలుపు రావడంతో బాబా ఖాన్ కీ ఆనందం వేసింది తన కోడలు ఇద్దరిని వద్దు అని అక్బర్, అలీ ఇద్దరిని తీసుకోని సెక్యూరిటీ కోసం కమల్ నీ తీసుకోని వెళ్లారు అప్పుడు అక్కడికి వెళ్లాక తెలిసింది రాజ వంశస్థులు బాబా ఖాన్ నీ మాత్రమే కాదు నారాయణ గౌడ నీ కూడా పిలిచారు అని అతని తో పాటు వాళ్ల కొడుకు రాకేష్ కూడా వచ్చాడు ఆ తర్వాత అందరూ ఒకరినొకరు కోపంగా చూసుకుంటు లోపలికి వెళ్లారు అక్కడ యువరాజు కీ నిశ్చితార్థం జరుగుతోంది అందుకు చాలా గ్రాండ్ గా పార్టీ జరుగుతూ ఉంది బాబా ఖాన్ ముందుగా వెళ్లి యువరాజు కీ శుభాకాంక్షలు చెప్పాడు ఆ తర్వాత నారాయణ వెళ్లాడు అప్పుడు మహారాజు వాళ్ల ఇద్దరిని ఉండమని చెప్పి రాకేష్, అక్బర్, అలీ, కమల్ నలుగురిని పక్కన వేరే రూమ్ లోకి వెళ్లమని చెప్పాడు.

దాంతో నలుగురు అక్కడికి వెళ్లుతుంటే కీర్తన సడన్ గా వచ్చి కమల్ చెయ్యి పట్టుకుని ఫంక్షన్ జరుగుతున్న హాల్లోకి తీసుకోని వెళ్లింది అక్కడ అందరూ సాల్సా డాన్స్ చేస్తున్నారు "హే ఏంటి ఇక్కడికి తీసుకోని వచ్చావ్" అని అడిగాడు కీర్తన నీ చూసి "పెళ్లి కూతురు నా ఫ్రెండ్ అందరికీ డాన్స్ పార్టనర్ ఉన్నారు నాకూ ఎవరూ లేరు అని దిగులు తో బయటికి వస్తే నువ్వు కనిపించావు అందుకే నిన్ను డాన్స్ పార్టనర్ గా తీసుకున్న నీకు డాన్స్ రాదా" అని అడిగింది దాంతో కమల్ కీర్తన నడుము చుట్టూ చెయ్యి వేసి దగ్గరికి లాగి తనతో డాన్స్ చేశాడు అక్కడ ఉన్న వాళ్లు అందరూ అలిసి పోయిన కూడా వీలు ఇద్దరు ఇంకా డాన్స్ చేస్తున్నారు ఆ తర్వాత యువరాజు, మహారాజు, కీర్తన ఫ్రెండ్ పెళ్లి కూతురు కూడా లేచి మరి చప్పట్లు కొట్టారు అది చూసి బాబా ఖాన్ కూడా కమల్ వైపు చూసి నవ్వుతూ చప్పట్లు కొట్టాడు.

ఆ డాన్స్ తరువాత మహారాజా కమల్ నీ పిలిచి స్పెషల్ లంచ్ కీ కీర్తన తో సహ పిలిచారు లంచ్ కి వెళ్లుతుంటే కీర్తన, కమల్ చెయ్యి చుట్టూ తన చెయ్యి వేసి దగ్గరగా చేరి "I love you" అని చెప్పింది దానికి కమల్ నవ్వి తన చేతి నుంచి చెయ్యి విడిపించుకొని ముందుకు వెళ్లాడు దానికి కీర్తన గట్టిగా "I love you" అని అరిచింది అప్పుడు కమల్ వెనకు చిరాకుగా తిరిగి కీర్తన నీ పక్కకు లాకుని వెళ్లి "ఏంటి మొన్నటి నుంచి చూస్తున్న I love you అని నేను ఎవరో తెలుసా ఎలాంటి వాడిని తెలుసా నేను ఒక రౌడీ నీ వైట్ కాలర్ క్రిమినల్ నీ" అని చెప్పాడు కమల్ దానికి కీర్తన "నాకూ నీ గురించి అంత తెలుసు పది సంవత్సరాల వయసు లోనే నువ్వు 25 మంది నీ చంపి ఇప్పుడు ఈ పొజిషన్ కీ వచ్చావు నీకు ఇద్దరు అన్నయ్య లు ఒకరు రౌడీయిజం, మైనింగ్ బిజినెస్ చూసుకుంటున్నాడు మీ చిన్న అన్నయ్య export బిజినెస్ చూసుకుంటున్నాడు నీకు మీ బాబా అంటే చాలా ఇష్టం ఆయన కోసం ఏమైనా చేస్తావ్" అని కమల్ జాతకం మొత్తం చెప్పింది దానికి షాక్ అయిన కమల్ "సెక్యూరిటీ ఆఫీసర్లకు కూడా నా గురించి ఇన్ని విషయాలు తెలియవు కదే సరే టచ్ లో ఉండు ఫ్రెండ్స్ గా మాత్రమే ఉందాం" అని చెప్పి లంచ్ కీ వెళ్లాడు అక్కడ రాజా వారు కమల్, కీర్తన ఇద్దరికి రెండు ఉంగరాలు ఇచ్చారు ఆ తర్వాత బాబా ఖాన్ కమల్ నీ పిలిచి "ఈ అమ్మాయేనా చాలా బాగుంది వాళ్ల ఇంట్లో మాట్లాడమంటావా" అని అడిగాడు దానికి కమల్ ఒక దండం పెట్టి రాజా వారు చెప్పిన రూమ్ కి వెళ్ళాడు అక్కడ చూస్తే కొంతమంది పహిల్వాన్ లు రాకేష్, అక్బర్, అలీ నీ కొట్టి కట్టి పడేశారు.

ఆ తర్వాత వాళ్ళని చూసి కమల్ అందరినీ కొట్టాడు కానీ ఆ రూమ్ లో ఉన్న ఒక వస్తువు కూడా విరగకుండా జాగ్రత్తగా అందరి ఎముకలు విరగోటాడు అప్పుడు మైనింగ్ మినిస్టర్, రాజా వారు, బాబా ఖాన్, నారాయణ లోపలికి వచ్చారు "నేను మీ నలుగురికి పెట్టిన పరీక్షల్లో కమల్ నువ్వు గెలిచావు నువ్వు ఒకడివే ఉండు మిగిలిన వాళ్ళు బయటకు వెళ్లండి అని బాబా ఖాన్, మైనింగ్ మినిస్టర్ తప్ప నారాయణ నీ కూడా బయటకి పంపారు,బయటకు వచ్చిన తర్వాత నారాయణ తన కొడుకు తో అక్బర్, అలీ ఇద్దరికి విని పించేలా "పనోడికీ ఉన్న పౌరుషం రోషం లో వీల్లకు పావు భాగం కూడా లేదు కదరా" అని నవ్వుతూ వెళ్లాడు.

ఆ తర్వాత లోపల రాజ వారు కమల్ కీ ఒక మిషన్ ఇచ్చారు దానికి కమల్ కూడా సరే అన్నాడు.

రాజా వారు చెప్పిన మిషన్ ఒప్పుకొని బాబా ఖాన్ తో సహ బయటికి వచ్చాడు కమల్ తిరిగి త్రిపుర బయలుదేరారు అప్పుడు కమల్ బాబా తో "బాబా మైసూర్ లో కూడా మన మైనింగ్ మొదలు పెడితే" అని అడిగాడు దానికి బాబా ఖాన్ "కష్టం రా అవి అని ఆ రాజా వంశస్థుల చేతుల్లో ఉంది మనకు ఇవ్వరు" అని చెప్పాడు దానికి కమల్ "ఒకవేళ వచ్చేలా చేస్తే ఏమీ ఇస్తావు" అని అడిగాడు దానికి బాబా ఖాన్ నవ్వి "నువ్వు అడిగింది ఇస్తా" అని మాట ఇచ్చాడు.

(వారం రోజుల తరువాత)

టివి వార్తల్లో ఒక బ్రేకీంగ్ న్యూస్ వస్తోంది "మైసూర్ మహారాజా వారి సంస్థాన నగలు మైసూర్ నుంచి హూబ్లీ మీదుగా గోవా లో ఎగ్జిబిషన్ కోసం ప్రభుత్వం వాటిని తరలిస్తుండగా వాటిని ఎవరో దొంగలించారు, గత 55 సంవత్సరాల నుండి ఇవి కేంద్ర ప్రభుత్వం అధీనం లో ఉంది అప్పుడప్పుడు ఎగ్జిబిషన్ కోసం వాటిని గూడ్స్ రైలు మార్గం ద్వారా పంపుతారు ఈ విషయం తెలిసి చాలా పకడ్బందీగా కదిలే రైలు లోకి వచ్చి మరీ దొంగలించారు ఇందుకు గాను ప్రభుత్వం తమకు తమ నగల తో పాటు నష్ట పరిహారం చెల్లించాలని మైసూర్ మహారాజా వారి ప్రస్తుత రాజా వారు చెప్పారు " అని న్యూస్ వచ్చింది.

(ఆ రోజు రాజా వారు కమల్ కీ ఇచ్చిన మిషన్ ఇదే చాలా సంవత్సరాలుగా వాళ్ల ఆస్థాన నిధులు ప్రభుత్వం అధీనం లో ఉన్నాయి వాటి నుంచి వచ్చే అద్దె కూడా సరిగ్గా లేదు పైగా తమ నగలు తాము చూసుకోడానికి సవా లక్షల అప్లికేషన్లు ఫార్మాలిటీస్ అందుకే విసుగు ఎత్తిన రాజా వారు వాటిని దొంగలించాలి అని నిర్ణయం తీసుకున్నారు కానీ తను చేయించే ఈ పని బయటి వాడు ఎవరైనా చేయాలి అలా మైనింగ్ మినిస్టర్ ద్వారా బాబా ఖాన్, నారాయణ గురించి తెలుసుకున్న రాజా వారు వాళ్లకు పెట్టిన పరిక్ష లో కమల్ గెలిచాడు)

ఆ తరువాత రాజా వారు చెప్పిన దాని ప్రకారం నిధి గూడ్స్ రైలు ద్వారా వస్తుంది అంటే అదీ ఏ స్టేషన్ లో ఆగదు కాబట్టి దారిలోనే పని పూర్తి చేయాలని నిర్ణయం తీసుకున్నాడు కమల్ మైసూర్ నుంచి గోవా వెళ్లాలి అంటే మధ్యలో హుబ్లీ వస్తుంది దాని తరువాత దూద్ సాగర్ వాటర్ ఫాల్స్ వస్తాయి (చెన్నై ఎక్స్ప్రెస్ సినిమా లో చూపిస్తారు చూడండి ఆ వాటర్ ఫాల్స్) ఆ వాటర్ ఫాల్స్ దగ్గర ట్రైన్ స్లో అవుతుంది అదే రైట్ టైమ్ అనుకున్నాడు దాంతో తన చిన్న అన్న సహాయం తో కొన్ని equipment లండన్ నుంచి తేప్పించాడు ఆ బ్రిడ్జి చాలా గట్టిది అందుకే ట్రాక్ మీద నుంచి ఒక తాడుతో మైనింగ్ explosions తో ఒక బావి కీ రెండు వైపులా నుంచి సమానంగా వెళ్లే లాగా అమర్చి పెట్టాడు ఆ తర్వాత ట్రైన్ వస్తుంటే అది దారిలో తాడు కట్ చేసి ముందుకు వచ్చేసింది ఆ ఫ్రీక్వెన్సీ లో మైనింగ్ explosion వేగంగా వచ్చి ట్రాక్ కీ తగిలి బ్లాస్ట్ అయ్యింది అప్పుడు ట్రైన్ రెండుగా విడిపోయి ఉంది అలా కమల్ వాటర్ ఫాల్స్ పై నుంచి ట్రైన్ మీదకు దూకి లోపల ఉన్న సెక్యూరిటీ వాళ్ళని కొట్టి నిధి తీసుకోని వచ్చేశాడు కాకపోతే మొన్న రాజా వారు ఇచ్చిన ఉంగరం అక్కడే ట్రైన్ లో పడిపోయింది.

నిధి తీసుకోని వచ్చిన తర్వాత రాజా వారు కమల్ కీ ఫోన్ చేశాడు అప్పుడు బాబా ఖాన్ కూడా పక్కనే ఉన్నాడు అప్పుడు కమల్ ఫోన్ స్పీకర్ లో పెట్టి మాట్లాడుతూ ఉన్నాడు "శబాష్ నేను నీ మీద పెట్టిన నమ్మకం నిలబెట్టావ్ రెండు రోజుల తరువాత నిధి నా గోడౌన్ కీ తెచ్చి నీ వాటా పట్టుకుని వేళ్లు" అని చెప్పాడు దానికి కమల్ "రాజా వారు మీరు నాకూ 1% వాటా ఇస్తా అన్నారు అంటే మీకు ప్రభుత్వం నుంచి వచ్చే 2000 కోట్లు కాకుండా మీకు మీ నగలు కూడా మిగిలాయి ఇప్పుడు అసలు డీల్ కీ వద్దాం 1% కాదు 35% మా షేర్" అది విని అక్కడ రాజా ఇక్కడ అక్బర్ కూడా షాక్ అయ్యి ఏదో అనబోతే బాబా ఖాన్ ఆగు అని సైగ చేశాడు, "రేయ్ పిచ్చి పట్టిందా 35% ఏంటి పిల్ల నాయాలా నువ్వే ఈ దొంగతనం చేశావు అని ఒక ఫోటో మీడియా కీ ఇస్తే సాయంత్రానికి జైలులో ఉంటావు" అని ఆవేశంగా అన్నాడు రాజా దానికి కమల్ నవ్వుతూ "మీరు మొన్న నాకూ ఇచ్చిన పని మొత్తం మీరు వాగిన ప్రతి మాట 1080p HD quality వీడియో రూపంలో నా దగ్గర ఉన్నాయి నేను దొరికితే మీరు దొరుకుతారు" అని చెప్పాడు (ఆ రోజు బాబా ఖాన్ చేతికి ఉన్న ఆపిల్ వాచ్ లోని కెమెరా నీ తన ఫోన్ తో కంట్రోల్ చేసి ఆ రూమ్ లో జరిగినది అంతా రికార్డ్ చేశాడు కమల్) ఇలా వీళ్ల ఫోన్ మధ్య లో సిబిఐ వాళ్లు ఎంక్వయిరీ కోసం వచ్చారు రాజా ఫోన్ కట్ చేయడం మరిచి పోయారు ఆ సిబిఐ వాళ్లు కమల్ అక్కడ పడేసిన ఉంగరం చూపించి దాని గురించి అడిగారు దాంతో రాజా వారు అది నిధి లోని ఉంగరం అని చెప్పారు దాంతో సిబిఐ వాళ్లు ఇంకా కొన్ని ప్రశ్నలు వేసి వెళ్లిపోయారు.

దాంతో భయపడిన రాజా వారు 35% ఇవ్వడానికి ఒప్పుకొని రెండు రోజుల్లో డబ్బులు పంపుతా అని చెప్పాడు.

(కానీ ట్విస్ట్ ఏంటి అంటే సిబిఐ అధికారులు గా వచ్చింది కమల్ అన్న విద్యుత్)​
Next page: Update 02