Update 02

కమల్ ఆ రోజు దొంగతనం చేసిన తరువాత బ్రిడ్జి కింద ఉన్న విద్యుత్ మనుషులు లోపల ఏమైనా క్లూ ఉంది ఏమో అని చెక్ చేయడానికి వెళ్లారు అప్పుడు వాళ్లకు ఆ ఉంగరం దొరికింది దాని తీసుకోని విద్యుత్ దగ్గరికి వెళ్ళాడు అప్పుడు కమల్ ముందు అనుకున్న స్కీమ్ తో పాటు ఫ్రెష్ గా ఇంకో స్కీమ్ ప్లాన్ చేశాడు, రెండో స్కీమ్ ప్రకారం గవర్నమెంట్ ఇచ్చే నష్టపరిహారం నోకేయాలీ అని ప్లాన్ చేశాడు అది అయ్యింది మొదటి స్కీమ్ ప్రకారం మైసూర్ నుంచి మైసూర్ చాముండేశ్వరీ దేవి అమ్మవారి కొండ కీ వెళ్లే దారిలో బ్లాక్ గ్రానైట్ ఉంది అని కమల్ కీ తెలిసింది అందుకే ఆ అడవి ప్రాంతంలో లో మైనింగ్ కంపెనీ పెట్టాలి అని ప్లాన్ చేశాడు ఇప్పుడు ఆ వీడియో ద్వారా ఆ మైనింగ్ ల్యాండ్ రాయించుకోవాలీ అని ప్లాన్ చేసి రాజా వారిని మైనింగ్ మినిస్టర్ నీ తన క్లబ్ కీ రమ్మని చెప్పాడు ఆ మీటింగ్ కీ అక్బర్, అలీ రాలేదు కానీ ఆకాశ్ వచ్చాడు.

అప్పుడు తన షేర్ కింద 35% డబ్బు ఇచ్చిన తరువాత రాజా వారు ఆ వీడియో డిలీట్ చేయమని చెప్పాడు అప్పుడు రాజా వారికి విద్యుత్ వీడియో కాల్ చేశాడు తన laptop లో వాళ్లు చేసిన ప్లానింగ్ కీ సంబంధించిన వీడియో నీ చూపించాడు దాంతో కమల్ "భయపడ్డోదు అది బయటికి రాదు అతను మా మనిషి కాకపోతే ఇప్పుడు ఇంకో డీల్ ఇది ఓకే అయితే ఆ వీడియో శాశ్వతంగా ఉండదు" అని చెప్పాడు దానికి రాజా వారు కూడా ఒప్పుకొని ఏంటి అని అడిగాడు అప్పుడు వాళ్ల సంస్థానం కిందకి వచ్చే ఆ గ్రానైట్ కొండ తన అన్న పేరు మీద రాయమని చెప్పాడు దానికి అక్కడ ఉన్న వాళ్లు అందరు షాక్ అయ్యారు కమల్ అడిగేది చాక్లెట్ కాదు ఇవ్వడానికి అది చాలా పెద్ద గవర్నమెంట్ టెండర్ లో ఉంది ఇప్పుడు అది కమల్ కీ ఇవ్వాలి అంటే చాలా కష్టం కాకపోతే జుట్టు వాడి చేతిలో ఉంది కాబట్టి రాజా వారు ఒప్పుకున్నారు కానీ మైనింగ్ మినిస్టర్ దానికి ఒప్పుకోలేదు ఎందుకంటే ఇప్పుడు ఆ టెండర్లు నుంచి కమిషన్ దాని దక్కించుకోవడానికి వచ్చే లంచాలు తిని ఈ సారి ఎన్నికల్లో సిఎం అవ్వాలి అని ప్లాన్ చేశాడు కాకపోతే కమల్ ఇలా ప్లేట్ మారుస్తాడు అని ఊహించలేదు.

దాంతో మినిస్టర్ ఆవేశము తో లేచి "ఏంటి ఇది ఆ టెండర్ కోసం ఎంతో మంది పోటీ పడుతున్నారు నీకు చాక్లెట్ ఇచ్చినట్లు తెచ్చి నోట్లో పెట్టాలా వాడి జుట్టు నీ చేతిలో ఉంది నన్ను ఏమీ పీకుతావు" అని అన్నాడు మినిస్టర్ ఆవేశం చూసి ఆకాశ్ కంగారు పడితే కమల్ నవ్వి లేచి "సరే మినిస్టర్ గారు రేపు ఉదయం డీల్ ఫైనల్ చేద్దాం అంటారు మంచిది" అని వినయం తో నమస్కారం పెట్టి బయటకు వెళ్లాడు అప్పుడు మినిస్టర్ కీ ఒక ఫోన్ వచ్చింది ఏంటి అంటే ముంబై లోని ఒక మాఫియా డాన్ లాలా కర్ణాటక లో డ్రగ్స్ డీలర్ షిప్ మినిస్టర్ కీ ఇచ్చాడు ఆ డ్రగ్స్ నీ fertilizer ముసుగు లో మంగళూరు పోర్ట్ నుంచి విద్యుత్ సహాయం తో ఆ container లను తెప్పిస్తూ ఉంటాడు ఇప్పుడు ఆ container లు పేలిపోయింది అని ఫోన్ వచ్చింది అది మొత్తం 800 కోట్ల మాల్ ఇప్పుడు అంత డబ్బు ఎక్కడి నుంచి తీసుకోని రావాలి అని ఆలోచిస్తూ ఉంటే కమల్ నుంచి వీడియో కాల్ వచ్చింది అందులో container సేఫ్ గా ఉంది కాకపోతే కమల్ చెప్పినట్లు చేయక పోతే అది నిజం అవుతుంది అని వార్నింగ్ ఇచ్చాడు దాంతో చేసేది లేక రాజా, మినిస్టర్ ఇద్దరు ప్రభుత్వం నుంచి వచ్చే నష్టపరిహారం నుంచి టెండరు కు వచ్చే వాళ్ళని కొని ఎవరూ టెండర్ కీ రాకుండా చేసి ఆకాశ్ కీ వచ్చేలా చేశారు ఆ తర్వాత నుంచి బళ్లారి జిల్లా వరకు మాత్రమే కింగ్ అయిన బాబా ఖాన్ ఆంధ్ర, కర్ణాటక కీ సుప్రీమ్ డాన్ అయ్యాడు.

ఇలా ఉంటే ఒక రోజు కీర్తన బర్త్ డే పార్టీకి అన్న తమ్ములు ముగ్గురు కలిసి వెళ్లారు పైగా మైసూర్ రాజా వారి నిధి నుంచి బాగ నచ్చిన ఒక నెక్లేస్ కొట్టేసాడు కమల్ దాని తీసుకోని బర్త్ డే గిఫ్ట్ గా వెళ్లాడు అక్కడికి వెళ్లిన తర్వాత కీర్తన తన ఫ్యామిలీ నీ పరిచయం చేస్తా అని తీసుకువెళ్లింది అప్పుడు తన అన్నయ్య నీ చూపించింది అతని చూసి ముగ్గురు షాక్ అయ్యారు వీళ్లను చూసి అతను షాక్ అయ్యాడు ఎందుకంటే అతను బళ్లారి ఎస్పి శ్రీకాంత్.

కీర్తన అన్న శ్రీకాంత్ నీ చూసిన తర్వాత ముగ్గురు బయటికి వచ్చి కార్ లో కూర్చుని ఉన్నారు అప్పుడు ఆకాశ్ ఆవేశం లో "రేయ్ ఆ పిల్ల మనల్ని పట్టించేదానికే వచ్చింది అందుకే నిన్ను ప్రేమిస్తున్నా అని నాటకాలు ఆడుతుంది" అని అన్నాడు దానికి విద్యుత్, కమల్ ఇద్దరు వాళ్ల అన్న వైపు చిన్న లుక్ ఇచ్చి గట్టిగా నవ్వారు "అన్న ఆ పిల్లకు అంత తెలివి లేదు దానికి పరీక్ష ముందు రోజు క్వశ్చన్ పేపర్ తీసుకోని వెళ్లి ఇచ్చి కాపీ కొట్టించిన కూడా దానికి రాయడం రాదు అంత మొద్దు మొహం దీ" అని చెప్పాడు కమల్, ఆ తర్వాత విద్యుత్ మాట్లాడుతూ "జాక్ పాట్ అంటే ఇదే ఆ పిల్ల నీ నువ్వు ప్రేమిస్తున్నా అని చెబితే ఆ ఎస్పి నీ మన కంట్రోల్ లో పెట్టుకోవచ్చు అసలే వాడికి మన గ్యాంగ్ మీద డేగ కన్ను పడింది అందుకే వాడి చెల్లి మన రాడార్ లో ఉంటే మనకు కలిసి వస్తుంది" అని చెప్పాడు దానికి కమల్ కూడా కరెక్ట్ అని ఆలోచించి లోపల పార్టీ లోకి వెళ్లారు అప్పుడే కేక్ వచ్చింది కీర్తన ఫ్యామిలీ కంటే ముందే కమల్, కీర్తన దగ్గరికి వెళ్లి తనని గట్టిగా కౌగిలించుకున్నాడు ఆ తర్వాత అందరినీ పిలిచి అందరూ చూస్తూ ఉండగా "I love you" చెప్పాడు కీర్తన ఫ్యామిలీ షాక్ అయ్యారు కానీ కీర్తన మాత్రం ఆనందం తో కమల్ నీ ముద్దు పెట్టుకోబోతు తన ఫ్యామిలీ గుర్తు వచ్చి గట్టిగా hug చేసుకుంది ఆ తర్వాత చుట్టాలు ముందు ఏమీ అనలేదు వాళ్ల అమ్మ నాన్న కాకపోతే కీర్తన వాళ్ల నాన్న ఫ్రెండ్ కమల్, విద్యుత్ నీ గుర్తు పట్టి వాళ్లు బాగా డబ్బు ఉన్న వాళ్లు అని చెప్పడం తో ఆయనకు కూడా కమల్ మీద సాఫ్ట్ కార్నర్ మొదలు అయ్యింది.

పార్టీ తరువాత శ్రీకాంత్ కీర్తన రూమ్ లోకి వెళ్లి తన గొంతు పట్టుకొని గోడకి అణిచి "ఆ క్రిమినల్ నా కొడుకు తప్ప నీకు ఇంక ఎవ్వరూ దొరకలేద వాడు వాడి గ్యాంగ్ ఏదో రోజు నా చేతిలో చస్తారు మర్యాదగా వాడిని మరిచిపో లేదు అంటే చెల్లి వీ అని కూడా చూడకుండా ఏదో ఒక పెండింగ్ కేసులో నిన్ను బుక్ చేసి లోపల పెట్టిస్తా ఇక్కడ వాడిని లేపేస్తా ఆ తర్వాత నిన్ను బయటకు తెచ్చి పెళ్లి చేస్తా" అని వార్నింగ్ ఇచ్చి బయటకు వెళ్లుతుంటే కీర్తన "Best of luck" అని చెప్పింది దానికి శ్రీకాంత్ "ఏమీ చూసి అంత ధైర్యం నీకు" అని అడిగాడు దానికి కీర్తన "ఆన్సర్ నీకే తెలుసు మళ్లీ నేను చెప్పాల సరే చెప్తా నువ్వు సీక్రెట్ గా పెట్టిన informer నీ నీ కళ్ల ముందే చంపితే ఏమీ పీక లేక పోయావు అది వాడు, వాడు చెడ్డోడు కావచ్చు కానీ మగాడు నీలాగా దాక్కోని యుద్ధం చేయడు ఏది ఏమైనా ఎదురుగా నిలబడి చేసి చూపిస్తాడు దమ్ముంటే వాడిని ఒక కేసు లో లోపల వేయి నేను నువ్వు ఎవరిని చూపిస్తే వాడితో పెళ్లి చేసుకుంటా లేదు అంటే వేరే ఆప్షన్ లేదు నా కమల్ గెలుస్తాడు" అని ఛాలెంజ్ చేసింది.

అలా అప్పటి నుంచి కీర్తన, కమల్ రేసింగ్ క్లబ్ లో బయట షాపింగ్ మాల్, కాఫీ షాప్ లో కలుస్తూ ఉండేవారు అప్పుడు కీర్తన లోని అమాయకత్వం, చిన్న పిల్లల మనస్తత్వం చూసి కమల్ కీ మెల్లగా తన మీద ప్రేమ పెరిగింది , ఒక రోజు రేసింగ్ క్లబ్ కీ రాజా వారు తన గుర్రం నీ తెచ్చారు రేస్ కీ అప్పటికే కమల్ గుర్రం మీద బారి బెట్టింగ్ రిజిస్ట్రేషన్ అయ్యింది కాకపోతే రాజా వారి గుర్రం మీద కూడా సమానంగా పందెం కట్టారు అప్పుడు రాజా వారి గుర్రం అరేబియన్ బ్రీడ్ దాని చూస్తేనే అది గెలుస్తుంది అని కమల్ కీ అర్థం అయ్యింది అందుకే తన జాకీ తో కావాలి అని ఒడిపోమని చెప్పాడు ఆ తర్వాత తన డబ్బు కూడా రాజా వారి గుర్రం మీద పెట్టాడు రేస్ మొదలు అయిన తర్వాత కమల్ గుర్రం గెలిచింది దాంతో కమల్ షాక్ అయ్యాడు ఆ తర్వాత కమల్ బయటకు వచ్చి చూస్తే మినిస్టర్, రాజా, నారాయణ ముగ్గురు కలిసి ఒకే కార్ లో వెళ్లడం కనిపించింది ఆ తర్వాత తన జాకీ కోసం వెతుకుతూ ఉంటే వాడు చనిపోయి ఉన్నాడు అప్పుడు కమల్ కీ ఒక ఫోన్ వచ్చింది "ఏం చిన్నోడా ఏటుంది షాక్" అని నారాయణ నవ్వుతూ అన్నాడు దానికి మినిస్టర్, రాజా వారు కూడా నవ్వారు అప్పుడు ఆ జాకీ నీ చంపి తన ప్లేస్ లో వచ్చిన వ్యక్తి లాలా మనిషి అని తెలిసింది దాంతో కమల్ సైలెంట్ గా ఫోన్ పెట్టేసాడు.

ఆ మరుసటి రోజు ఉదయం మినిస్టర్ కీ ఫోన్ వచ్చింది అర్జెంటు గా టివి పెట్టమని దాంతో టివి పెట్టిన మినిస్టర్ ఆ న్యూస్ చూసి షాక్ అయ్యాడు ముంబై మాఫియా డాన్ నీ చంపి ముంబై హర్బర్ లో వేలాడతీసి ఉంచిన శవం టివి లో వచ్చింది దాంతో షాక్ లో ఉన్న మినిస్టర్ కీ కమల్ నుంచి ఫోన్ వచ్చింది ఆ ఫోన్ ఎత్తాలి అంటే మినిస్టర్ కీ ఓణుకు మొదలు అయ్యింది కానీ ధైర్యం చేసి ఫోన్ ఎత్తాడు మిగిలిన ఇద్దరిని కూడా కాన్ఫరెన్స్ కాల్ లో పెట్టమని చెప్పాడు "మీరు ఎవరూ నిన్న మీ వెనుక ఉన్నాడు అని నన్ను ఒడించాలి అనుకున్నారో వాడినే నరక ద్వారం ముందు నిల్చోబేటా మిమ్మల్ని కూడా వాడి దగ్గరికి పంపడం పెద్ద పని కాదు కాబట్టి నన్ను గెలీకీతే ఏమీ అవుతుందో అర్థం అయ్యింది కదా పైగా వాడి పేరు మీద వాడి rival గ్యాంగ్ నాలుగు కోట్లు సూపారీ పెట్టారు నష్టం పూడ్చుకోవాలి కదా అందుకే డీల్ కింద నాలుగు కోట్లు నా బ్యాంక్ అకౌంటు లో పెట్టా ముంబై మీద నా కాలు పెట్టా మినిస్టర్ గారు ఇక నుంచి కర్ణాటక లోకి నో డ్రగ్స్ ఎందుకంటే నిన్న రాత్రి మీ fertilizer ఫ్యాక్టరీ బాంబ్ బ్లాస్ట్ అయ్యింది ఇన్సూరెన్స్ ఉంది కదా " అని అడిగి ఫోన్ పెట్టేసాడు.

ఆ రోజు సాయంత్రం ముగ్గురు కలిసి మందు కొడుతూ ఉన్నారు కమల్ ఉన్నంత వరకు వాళ్లు ఏమీ చేయలేరు అని ఫిక్స్ అయ్యారు అందుకే వాడిని లేకుండా చేయాలని ప్లాన్ చేసారు కాకపోతే ఎలా అని ఆలోచిస్తూ ఉంటే "నేను చెప్తా" అంటూ వాళ్ల తో పాటు వచ్చి కూర్చున్నాడు శ్రీకాంత్.

మినిస్టర్ కృష్ణాప్ప, రాజా రవీంద్ర దత్త, ఎస్పి శ్రీకాంత్, నారాయణ నలుగురు కీ ఉన్న కామన్ శత్రువు కమల్ శ్రీకాంత్ కమల్ కీ చట్టపరం గా శిక్ష వేయాలి అని ఆలోచిస్తూ ఉన్నాడు అందుకు అవసరమైన క్లూ కోసం వీళ్ల దగ్గరికీ వచ్చాడు కానీ మిగిలిన వాళ్లకు వాడిని చంపాలీ అని ఉంది అందుకు వాడిని బలహీనత మీద కొట్టాలి అనుకున్నారు వాడి అన్నలు ఇద్దరిని చంపితే వాడు వీక్ అవుతాడు అనుకున్నారు అందుకే శ్రీకాంత్ తాగి పడిపోయిన తరువాత ముగ్గురు ప్లాన్ చేస్తున్నారు ప్రతి ఆదివారం ఆకాశ్ తన కొడుకును చూసుకోడానికి మంగళూరు వెళ్లతాడు ఆ రోజు అన్న తమ్ముడూ ఇద్దరు కలిసి వాడితో సమయం గడుపుతారు ఆ తర్వాత పోర్ట్ లో ఉన్న విద్యుత్ ఆఫీసు లో తన భార్య చేసిన వంట తో అందరు కలిసి భోజనం చేస్తారు ఆ తర్వాత ఆఫీసు నుంచి బయటికి వస్తే container క్రేన్ ఒకటి ఆ ఆఫీసు బయట ఉంటుంది ఆ క్రేన్ నీ బాంబ్ బ్లాస్ట్ లో పేల్చి వాళ్ళని ఆక్సిడేంట్ లో చనిపోయారు అన్నట్టు చూపించాలి అనుకుంటారు ఇలా మొత్తం ప్లాన్ చేసి ఆదివారం కోసం ఎదురుచూస్తున్నారు అంతలో ఆదివారం వచ్చింది.

ఆకాశ్ మంగళూరు బయలుదేరాడు తన వెనుక మినిస్టర్ పంపిన కిల్లర్ కూడా అతని ఫాలో అవుతూ వెళ్లుతు ఉన్నాడు ఆ రోజు విద్యుత్ అతని భార్య రాధ ఆకాశ్ అతని కొడుకు చిన్న నలుగురు బీచ్ కీ వెళ్లారు తరువాత సినిమా కీ వెళ్లారు ఇక్కడ కమల్ బెంగళూరు లో కొత్త గుర్రాల కీ ట్రైనింగ్ ఇస్తున్నాడు అప్పుడు మధ్యాహ్నం అందరూ పోర్ట్ కీ భోజనం కీ వెళ్లారు, అప్పుడు మినిస్టర్ పంపిన కిల్లర్ తన దగ్గర ఉన్న మోషన్ కాప్చర్ కెమెరా తో లైవ్ చూపిస్తున్నాడు ముగ్గురికి అప్పుడు మినిస్టర్ కమల్ కీ ఫోన్ చేశాడు "ఏం కమల్ ఎలా ఉన్నావ్" అని అతని మాట పూర్తి కాక ముందే ఫోన్ కట్ చేశాడు కమల్ దాంతో కోపం వచ్చి ఆ లైవ్ లింక్ నీ కమల్ కీ పంపాడు అది చూసి కూడా కమల్ ఏమీ స్పందించలేదు ఒక పది నిమిషాల తర్వాత కమల్ మినిస్టర్ కీ ఒక లింక్ పెట్టాడు అది ఓపెన్ చేసి చూస్తే పోర్ట్ ఆఫీసు నుంచి కమల్ అన్న లు వదిన వాళ్ల కొడుకు తో పాటు మినిస్టర్ కూతురు సంధ్య కూడా వాళ్లతో ఉంది అది చూసి షాక్ అయిన మినిస్టర్ వెంటనే ఆ కిల్లర్ కీ ఫోన్ చేశాడు కానీ ఆ ఫోన్ కాన్ఫరెన్స్ ద్వారా కమల్ కీ కనెక్ట్ అయ్యింది, "నువ్వు పంపిన ఆ కిల్లర్ గాడి పరిస్థితి చూస్తావా" అని చెప్పి ఫోన్ కీ ఒక లైవ్ లింక్ పెట్టాడు ఆ కిల్లర్ నీ కట్టెసి కొట్టి సొర చెప్పలకు ఆహారం గా పడేశారు ఆకాశ్ మనుషులు అప్పుడు కమల్ మినిస్టర్ కీ ఫోన్ చేసి "నాకూ నన్ను నా అన్న లను కాపాడుకోవడం రెండు తెలుసు కాబట్టి ఇంకో సారి మా జోలికి వస్తే నీ తల అసెంబ్లీ ముందే నరుకుతా నీ పక్కన ఉన్న ఆ జోకర్ గాల్లకు కూడా చెప్పు" అని ఫోన్ పెట్టేసాడు.

(ఆ రోజు రాత్రి శ్రీకాంత్ బాగ తాగేసి పడిపోయాడు అప్పుడు వీలు ఈ ప్లాన్ వేస్తుండగా కీర్తన శ్రీకాంత్ కీ ఫోన్ చేసింది ఆ ఫోన్ శ్రీకాంత్ జేబులో నుంచి జారి కింద పడింది అప్పుడు ఆ ఫోన్ లిఫ్ట్ అయ్యింది దాంతో వాళ్లు మాట్లాడింది మొత్తం విని కమల్ తో చెప్పింది ఆ తర్వాత కమల్ తన అన్న తో టీచర్ నీ కూడా భోజనం కీ తీసుకోని వెళ్లమని చెప్పాడు)

ఇది ఇలా ఉంటే ఒక రోజు ఎస్పి ఆఫీసు లో పని చేసే కుర్రాడు కమల్ కీ ఫోన్ చేశాడు ఎస్పి ఒక మర్డర్ కేసు లో తనను అరెస్ట్ చేయడానికి వస్తున్నాడు అని దాంతో లాయర్ తో మాట్లాడి anticipatory bail తెప్పించాడు ఆ తర్వాత తనకు ఆరోగ్యం బాగాలేదు అని హాస్పిటల్ లో చేరాడు ఆ తర్వాత బెయిల్ ఆర్డర్ చూసి డాక్టర్ రిపోర్ట్ చూసి ఎస్పి అతని అరెస్ట్ చేయలేదు మరుసటి రోజు కోర్టు కీ రమ్మని చెప్పి వెళ్లాడు, ఆ మరుసటి రోజు ఉదయం కోర్టు కీ వెళ్లిన తర్వాత ఎస్పి అలీ భార్య నీ తీసుకోని వచ్చాడు, ఆ రోజు వాచ్ మెన్ అమ్మ నీ మంట లో తగలబెట్టిన కేసు కింద ఇలా ప్లాన్ చేశాడు శ్రీకాంత్ కానీ ఆ అమ్మాయి కోర్టు లో సాక్ష్యం మార్చి చెప్పింది ఆ ముసలి ఆమెకు మతిస్థిమితం లేదు అని గ్యాస్ లీక్ చేసి చనిపోయింది అని చెప్పింది.

ఆ తర్వాత కోర్టు బయట కమల్ దగ్గరికి వచ్చి ఆ అమ్మాయి "అన్న థాంక్స్ అన్న నేను ప్రేమించిన వాడిని మళ్లీ మామూలు మనిషిని చేసినందుకు అందుకే నీకు ఏమీ కాకుడదు అని అబద్ధం చెప్పా" అని చెప్పింది దానికి కమల్ నవ్వి ఆ అమ్మాయిని వాచ్ మెన్ తో సహ ఒక కార్ లో పంపించాడు కానీ ఆ కార్ ఊరి చివర వెళ్లగానే బాంబ్ బ్లాస్ట్ లో పేలి పోయింది ఈ వార్త విని సిగరెట్ వెలిగిస్తు నవ్వడం మొదలు పెట్టాడు కమల్.

శ్రీకాంత్ తనని అరెస్ట్ చేయడానికి వస్తున్నాడు అని తెలియగానే తను ఈ మధ్య చేసిన మర్డర్ గురించి వెతికాడు దాంతో ఆ వాచ్మెన్ వాళ్ల అమ్మ నీ చంపిన విషయం గుర్తుకు వచ్చింది దాంతో వాడిని మెంటల్ హాస్పిటల్ నుంచి బయటకు తెప్పించాడు ఆ తర్వాత వాడిని అలీ పెళ్లాం నీ కలవడానికి పంపడం వల్ల తనకీ కమల్ మీద గౌరవం పెరిగి సాక్ష్యం తప్పు చెప్పింది శ్రీకాంత్ వల్ల ధైర్యం తెచ్చుకున్న ఆ అమ్మాయిని emotion ద్వారా తన దారి లోకి తెచ్చుకున్నాడు ఆ తర్వాత మళ్లీ ఎప్పుడైనా ధైర్యం వస్తే అనే అనుమానం తో తనను కూడా చంపేసాడు దాంతో శ్రీకాంత్ జరిగినది మొత్తం కీర్తన కీ చెప్పేసాడు దాంతో కీర్తన చాలా బాధ పడింది తను తప్పించుకోవడం కోసం ఒక అమాయక జంట నీ చంపి తను సంతోష పడుతున్నాడు అని తలుచుకొంటే తనకు గుండె బరువు ఎక్కింది వెంటనే క్లబ్ కీ వెళ్లింది అక్కడ కమల్ కొత్త గుర్రాన్ని ట్రైన్ చేస్తూ ఉన్నాడు అప్పుడు కీర్తన వచ్చి కమల్ నీ లాగి పెట్టి కొట్టింది కమల్ కోపం తో తన జుట్టు పట్టుకుని తన మొహం మీద లాకుని కోపం గా చూశాడు కానీ కీర్తన కళ్లలో భయం లేదు "నువ్వు ఇన్ని రోజులు క్రిమినల్ అయిన కూడా నువ్వు చంపేది చెడ్డ వాళ్ళని కదా అనుకున్న కానీ నువ్వు అమాయకులను కూడా చంపుతావు అని ఇప్పుడే తెలిసింది ఇన్ని రోజులు నీ లాంటి వాడిని ప్రేమించినందుకు నా మీద నాకే అసహ్యం గా ఉంది" అని చెప్పింది.

దానికి కమల్ కీర్తన నీ పక్కకు తోసి "పో నాకూ నువ్వు అవసరం లేదు అందుకే ఈ పెళ్లి ప్రేమ నాకూ నా చీకటి జీవితం కీ అడ్డు అందుకే నేను ఎప్పుడు ఈ ప్రేమ లో పడలేదు ఇక నుంచి మళ్లీ ఇక్కడికి రావ్వోదు" అని అరిచాడు దానికి కీర్తన ఏడుస్తూ వెళ్లింది, ఇలా కమల్, కీర్తన ప్రేమ మొగ్గ లోనే వాడిపోయింది అలా చిరాకుగా బయటకు వచ్చి త్రిపుర కీ బయలుదేరిన కమల్ కార్ మీద ఎటాక్ జరిగింది అది ఎవరూ చేశారో కమల్ కీ అర్థం అయ్యింది ఆ తర్వాత బెంగళూరు లోని ఒక రెడ్ లైట్ ఏరియా కీ వెళ్లాడు అక్కడ లైలా అనే వేశ్య దగ్గరికి వెళ్ళాడు తను కమల్ నీ చూసి "చాలా రోజులకు సార్ గారికి ఇటు వైపు గాలి మళ్లింది" అని వయ్యారంగా అడిగింది దానికి కమల్ ఒక లక్ష రూపాయల కట్ట తన ముందు పడేసి రాకేష్ ఫోటో చూపించి "వీడు ఈ రెండు రోజుల్లో ఇక్కడికి ఏమైనా వచ్చాడా" అని అడిగాడు దానికి లైలా అవును అన్నట్లు తల ఊపింది దానికి కమల్ ఇంకో లక్ష ఇచ్చి "నా కోసం సెక్యూరిటీ ఆఫీసర్లు వస్తే నేను ఈ రోజు మధ్యాహ్నం నుంచి రేపు సాయంత్రం వరకు ఇక్కడే ఉన్నాను అని చెప్పాలి" అంటు తన గన్ తీసి ఒక కర్చీఫ్ తో మొహం కప్పుకొని పక్కనే వేరే ఐటం ఇంట్లోకి వెళ్లి అక్కడ ఉన్న రాకేష్ మనిషిని వాడి కాలి మీద కాల్చి రాకేష్ గురించి అడిగాడు అప్పుడు వాడు తెలియదు అని చెప్పాడు, దాంతో కమల్ వాడిని వాళ్ల మైనింగ్ క్వారీ కార్మికులను అర్జెంటు గా స్ట్రైక్ చేయమని చెప్పు అని బెదిరించాడు వాడు అలా చేసిన తరువాత కమల్ వెళ్లిపోయాడు.

మరుసటి రోజు ఉదయం త్రిపుర లోని ఒక కెనాల్ లో ఒక శవం తేలింది అని తెలిసి శ్రీకాంత్ స్పాట్ కీ వెళ్లాడు ఆ తర్వాత క్రేన్ సహాయంతో ఆ శవం బయటికి తీస్తే అది నారాయణ బాడి ఏమీ జరిగింది అని సెక్యూరిటీ అధికారి లు చుట్టు క్లూ కోసం చూశారు అప్పుడు వాళ్లకు తెలిసింది ఏంటి అంటే ఆ కెనాల్ లో రెండు గుర్రాలు కూడా శవాలను కూడా బయటకు తీశారు ఆ తర్వాత వాళ్లకు తెలిసింది ఏంటి అంటే నారాయణ రోజు సాయంత్రం ఒక్కడే కెనాల్ పక్కన ఉన్న తోట కీ గుర్రం బండి మీద వచ్చి వెళుతు ఉంటాడు ఈ రోజు క్వారీ లో కార్మికులు స్ట్రైక్ చేస్తున్నారు అని తెలిసి హడావుడి గా బయలు దేరాడు అప్పుడు ఈ ఆక్సిడేంట్ అయ్యింది అని వాళ్ళకి అర్థం అయ్యింది కాకపోతే శ్రీకాంత్ కీ ఇందులో కమల్ హస్తం ఉందా అనే అనుమానం మొదలు అయ్యింది అప్పుడే అక్కడ కొన్ని కార్ టైర్ గుర్తులు కనిపించాయి వాటిని ఫోటో తీసి సిటీ లో ఉన్న అన్ని వర్క్ షాప్ లకి పంపించారు.

ఇక్కడ బాబా ఖాన్ కీ ఆనందం తో కాలు నెల మీద నిలబడలేదు కానీ సెక్యూరిటీ ఆఫీసర్లకు కమల్ దొరికితే ఎలా అని చెప్పి వాడిని abscond అవ్వమని చెప్పాడు కానీ కమల్ నవ్వుతూ "చంపినది నేనే కానీ దొరికేది నేను కాదు బాబా" అని చెప్పాడు దానికి అందరూ అర్థం కానట్టు చూశారు శ్రీకాంత్ ఆఫీసు లో ఉండగా ఆ టైర్ గుర్తుల ఇన్ఫర్మేషన్ వచ్చింది ఏంటి అని చూస్తే ఆ కార్ రాకేష్ పేరు మీద ఉంది.​
Next page: Update 03
Previous page: Update 01