Update 03

రాకేష్ నీ చంపడం కమల్ కీ సిగరెట్ వెలిగించినంత సేపు కూడా పట్టదు కానీ వాడికి వాడి అబ్బ తొడు ఉన్నంత వరకు వాడికి ధైర్యం అందుకే ఆ ధైర్యం నీ చంపాలీ అనుకున్నాడు, కమల్ ఎప్పుడు అవతల వాడి భయం లో తన ధైర్యం వెతుక్కుంటూ ఉంటాడు అందుకే వాళ్ల క్వారీ కార్మికుల తో స్ట్రైక్ చేయించి నారాయణ నీ క్వారీ వైపు వెళ్లేలా చేసి తను లైలా ఇంటి దెగ్గర ఉన్న రాకేష్ కార్ కొట్టేసి క్వారీ వైపు వెళుతున్న నారాయణ కీ ఎదురుగా లైట్ లేకుండా బండి నడుపుతూ వస్తూ సడన్ గా లైట్ వేశాడు దాంతో గుర్రాలు భయపడి కెనాల్ లోకి దూకేశాయి అలా తెలివిగా నారాయణ నీ చంపాడు కమల్ ఆ కార్ రాకేష్ పేరు మీద ఉంది కాబట్టి తన మీద కేసు రాకుండా జాగ్రత్త పడ్డాడు కమల్.

కానీ కమల్ కొట్టిన స్ట్రోక్ కీ శ్రీకాంత్ కీ fuse లేచి పోయింది ఎందుకు అంటే కమల్ మీద ఎటాక్ చేసిన తరువాత రాకేష్ భయం తో శ్రీకాంత్ దగ్గరికి వెళ్ళాడు అప్పుడు అతని దాచి పెట్టి కమల్ కోసం ఎదురు చూస్తున్నాడు వస్తే రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని జైలు లో వేయాలని కానీ నారాయణ నీ చంపి రాకేష్ నీ అందులో ఇరీకిస్తాడు అని ఊహించలేదు దాంతో శ్రీకాంత్ కీ కమల్ గురించి ఒక విషయం అర్థం అయ్యింది తను దేనికి లోంగడు, బెదరడు వాడి బుద్ధి బలం ముందు ఎవరూ సాటి రారు అని ఇంక వాడితో యుద్ధం చేయడం అనవసరం అని అర్థం అయ్యింది ఆ తర్వాత రాకేష్ నీ, కమల్ నీ ఇద్దరిని కోర్టు లో అప్పగించారు ఇద్దరి వైపు సాక్షుల కథనం ప్రకారం ఇద్దరు ఆ హత్య చేయలేదు అన్నట్లు అప్పుడు లైలా నీ కమల్ సాక్ష్యం గా ప్రవేశ పెట్టినప్పుడు రాకేష్ తరుపున లాయర్ ఆమె చేసే వృత్తి వల్ల తన సాక్ష్యం చెల్లదు అని చెప్పాడు దానికి కమల్ బోను లోకి వచ్చి "your honor మన రాజ్యాంగ పరంగా సాక్ష్యం అనేది కీలకం అది ఎవరూ చెప్పారు వాళ్ల వృతి తో మనకు సంబంధం లేదు ఆ అమ్మాయి తన కుటుంబ కష్టాలు వల్ల అలా అయ్యింది కానీ న్యాయం కోసం వచ్చి సాక్ష్యం చెబితే తనని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేశారు న్యాయస్థానం లో ఇలా ఎలా ఒక ఆడపిల్ల నీ అవమానిస్తారు" అని emotional డైలాగ్ చెప్పి లైలా సాక్ష్యం చెల్లెలా చేశాడు దాంతో రాకేష్ లాయర్ తల పట్టుకుని కూర్చున్నాడు సాక్ష్యము సరిగ్గా లేదు అని కోర్టు కేసు కొట్టేసింది.

ఆ తర్వాత కొన్ని రోజులకు శ్రీకాంత్ కమల్ కోసం క్లబ్ కీ వచ్చాడు తనని చూసి కమల్ "ఏంటి సార్ ఇలా వచ్చారు ఇక్కడ క్రిమినల్స్ ఉంటారు సెక్యూరిటీ ఆఫీసర్లు కాదు" అని వెటకారం గా మాట్లాడాడు దాంతో శ్రీకాంత్ "నాకూ ఒక హెల్ప్ కావాలి" అని అడిగాడు దానికి కమల్ ఏంటి అన్నట్లు అడిగాడు ఆ తర్వాత శ్రీకాంత్ కీర్తన కీ బెంగళూరు లో యూనివర్సిటీ లో మెడికల్ msc సీటు ఇప్పించాలి అని అడిగాడు అప్పుడు కమల్ "మీ సెక్యూరిటీ అధికారి influence, లేకపోతే మీ పార్టనర్ మినిస్టర్ నీ అడగోచ్చు కదా" అన్నాడు దానికి శ్రీకాంత్ "మా ఎవరి influence పని చేయకే కదా నిన్ను అడిగింది" అన్నాడు దాంతో కమల్ తన ఫోన్ తీసి ఒక మెసేజ్ పంపించాడు శ్రీకాంత్ కీ జ్యూస్ తీసుకోని రమ్మని చెప్పి జాగింగ్ కీ వెళ్లాడు అప్పుడు ఒక కార్ వచ్చి ఆగింది అందులో నుంచి ఒక వ్యక్తి వచ్చి శ్రీకాంత్ కాలు మీద పడి మరీ సీట్ confirmation లెటర్ ఇచ్చాడు దాంతో శ్రీకాంత్ షాక్ అయ్యాడు నాలుగు రోజుల నుంచి ప్రయత్నిస్తున్న జరగని పని నాలుగు నిమిషాల్లో కమల్ పూర్తి చేశాడు అని ఆ తర్వాత లెటర్ తీసుకోని వెళ్లిపోయాడు ఇది చూసిన కమల్ "ఓరీ నా బావమరిది థాంక్స్ కూడా చెప్పకుండా పోయావ్ కదరా" అని అనుకున్నాడు.

ఇది జరిగిన వారం తరువాత తను బెంగళూరు లో వెళ్లుతుంటే ఒక ముసలి అతను తన కార్ ముందే పడిపోయాడు అతని తీసుకోని హాస్పిటల్ కి వెళ్ళాడు అక్కడ అతనికి ట్రీట్మెంట్ ఇస్తుంటే కీర్తన నీ చూశాడు వెళ్లి కొంచెం మాట్లాడాడూ కానీ తను బుంగ మూతి పెట్టుకుని అలిగి ఉంది ఆ తర్వాత ఎలాగో కొద్ది సేపు బుజ్జగించే సరికి నవ్వింది అప్పుడు ఇంకో సారి ఏ అమాయకులను చంపననీ మాట తీసుకుంది ఇది అంత చూస్తున్న ఆ ముసలి ఆయన నవ్వుతూ

"కళ్లతో చూసిన నిజాలకు

చెవుల తో విన్న ప్రశ్నకు

తెర వెనుక నడిచిన బాగోతానికి

సంక్షీప్త సమాధానం కర్మ

నువ్వు నిన్న నడిపిన నీడ

నేడు నీ ముందు మృత్యువు లా వస్తుంది" అని అన్నాడు కమల్ వైపు చూస్తూ.

కమల్ నీ చూస్తూ ఆ ముసలి ఆయన నవ్వుతూ "పగవాడు భయం లో ధైర్యం వెతుక్కునే వీరుడ నీ కర్మలు నీ చుట్టూ చెరబోతున్నాయి" అని చెప్పి చిన్నగా నవ్వాడు అప్పుడు కీర్తన అతని చూసి "ఎలా ఉంది తాత ఏమీ భయం లేదు సరిగ్గా తిండి లేక నీరసం వచ్చి పడిపోయారు అంతే సాయంత్రానికి ఇంటికి వెళ్లిపోవచ్చు" అని చెప్పింది కాకపోతే ఆ ముసలి ఆయన "తిండి పెట్టడానికి ఎవ్వరూ ఉన్నారు అమ్మ అందరూ పోయారు కానీ నేను ఒక్కడినే ఎందుకు మిగిలి ఉన్నానో తెలియదు ఎక్కడికి వెళ్లాలి తెలియదు ఎప్పుడు మరణం నా వాకిట వస్తుందో అని ఎదురు చూపు తప్ప ఈ ముసలి ప్రాణం వేరే ధ్యాస లేదు" అని చెప్పాడు అది విని కీర్తన మనసు కరిగిపోయింది కమల్ వైపు చూసింది దాంతో కమల్ కీ అర్థం అయ్యింది

"లెక్కలు చూసేకి వచ్చా పెద్దయ్య" అని అడిగాడు దానికి వచ్చు అన్నట్లు తల ఆడించాడు అతని పేరు అడిగితే "ముండి" అని చెప్పాడు ఇది ఏమీ విచిత్రమైన పేరు అనుకోని నవ్వాడు కమల్ కానీ ముండి మాత్రం అది పట్టించుకోలేదు ఆ రోజు సాయంత్రం ముండి, కమల్ ఇద్దరు కలిసి త్రిపుర వెళ్లారు బాబా ఖాన్ ఇంట్లోకి ముండి అడుగు పెట్టగానే బాబా ఖాన్ సాకుతున్న ఆవులు రంకెలు వేస్తున్నాయి గట్టిగా గాలి వీచింది ఆ తర్వాత ముండి నీ చూడగానే బాబా ఖాన్ మనసు ఏదో కీడు శంకించింది.

అప్పుడు కమల్, ముండి నీ బాబా ఖాన్ కీ పరిచయం చేస్తూ మన మైనింగ్ క్వారీ లో అకౌంట్స్ చూడడానికి పెడదాం అని అడిగాడు బాబా ఖాన్ ముండి నీ చూశాడు అతని చెక్కు చెదరని చిరునవ్వు పిల్లి కళ్లు నుదుటి మీద కుంకుమ తిలకం కండ కూడా లేని పలచని దేహం ఏదో సరిగ్గా లేదు అని అర్థం అవుతుంది కానీ కమల్ ఏది అయిన ఆలోచించి చేస్తాడు అని ధైర్యం తో సరే అన్నాడు, దానికి ముండి చాలా వినయం తో బాబా ఖాన్ కీ నమస్కారం పెట్టి కమల్ తో కలిసి క్వారీ వైపు వెళుతున్న సమయంలో అక్బర్ బయటికి వచ్చి "అబ్బు నజీమా తల్లి కాబోతుంది" అని చెప్పాడు దానికి బాబా ఖాన్ ముండి వైపు చూశాడు అతను రాగానే ఇంట్లో ఒక శుభవార్త వచ్చింది అని సంతోషించాడు కానీ బాబా ఖాన్ మనసులో అనుకున్న మాట ముండి చదివేశాడు "మంచి జరిగిన మరునిమిషం లో జరుగున్నది మంచి అని అనుకోవడం అవివేకం ఈ మంచి జరుగు విస్ఫోటనం కీ నాంది" అని తనలో తానే మాట్లాడుతూ ఉంటే కమల్ ముసలాయన కదా ఏదో పిచ్చి పిచ్చి గా మాట్లాడుతూ ఉంటాడు అని అనుకున్నాడు.

ముండి పనిలో చేరిన కొన్ని రోజుల తరువాత అలీ వచ్చి అకౌంటు లో రాయకుండా డబ్బు తీసుకోని వెళుతుంటే ముండి అలీ నీ డబ్బు తీసుకోనీవ లేదు దాంతో అలీ అతని కొట్టాడు అప్పుడే వచ్చిన ఆకాశ్ ఇది అంత చూసి అలీ నీ సముదాయించడానికి చూశాడు అప్పుడు ముండి "ఒకరి కండ బలం చూసుకుని బ్రతికే వాడివి నీకు ఎందుకు అంత రోషం" అని అలీ నీ తిట్టాడు దాంతో అలీ పక్కన ఉన్న కుర్చీ తో ముండి నీ కొట్టాడు అప్పుడు ఆకాశ్ కోపం లో అలీ నీ కొట్టాడు దాంతో అలీ ఆకాశ్ నీ కొట్టాడు అప్పుడే వచ్చిన కమల్ అలీ తన అన్న ను కొట్టినందుకు అలీ నీ కొట్టాడు అప్పుడే వచ్చిన బాబా ఖాన్ అందరినీ ఆపి జరిగిన దానికి అలీ తో ముండి కీ క్షమాపణలు చెప్పించాడు దాంతో ముండి నవ్వి మనసులో "ఆరిపోయే దీపం కీ వెలుగు ఎక్కువ ఆయుషు తీరే వ్యక్తి ప్రాణం మీద తీపి ఎక్కువ నీకు అది దక్కదు" అని అన్నాడు.

ఇది ఇలా ఉంటే ఒక రోజు శ్రీకాంత్ ఇంట్లో పేపర్ చదువుతు ఉన్నపుడు తన కొడుకు చింటు టివి చూస్తూ ఉన్నాడు అందులో రామాయణం సినిమా వస్తుంటే భక్తి ఎక్కువ ఉన్న శ్రీకాంత్ అమ్మ ఆ సినిమా చూస్తూ చింటు కీ అందులో జరిగే ఒక్కో సన్నివేశం కీ వెనుక ఉన్న కథ చెబుతూ ఉంది అప్పుడు సినిమా లో శివ ధనస్సు విరిచే సీన్ చూసి "నానమ్మ ఆ weapon నీ రాముడు తప్ప ఎవరూ లిఫ్ట్ చేయలేదా" అని అడిగాడు దానికి ఆమె "ఆ ధనస్సు శివుడు తన శక్తి మొత్తం పోసి తయారు చేశాడు దాని భక్తి తో పట్టుకుంటేనే మన మాట వింటుంది" అని చెప్పింది దానికి చింటు "అసలు ఆ weapon తో శివునికి ఏమీ పని" అని అడిగాడు దానికి ఆమె "పూర్వం తారకేశుడు అనే రాక్షసుడు కీ ముగ్గురు కొడుకులు ఉన్నారు అతను చనిపోయిన తర్వాత అతని కొడుకులు దేవులనీ హీంసీస్తుంటే వాళ్ళని చంపడానికి శివుడు బ్రహ్మ విష్ణు ముగ్గురు కలిసి ఆ అన్న తమ్ములని చంపారు కానీ వాళ్లు చాలా తెలివైన వాళ్లు కానీ వాళ్లతో ఒక వ్యక్తి చేరి వాళ్ళని ధర్మం తప్పేలా చేశాడు వాళ్లు చనిపోయిన తర్వాత అతను ఈ అన్న తమ్ములు ఏ యుగంలో పుట్టిన నేను వచ్చి వాళ్ల మరణశాసనం రాస్తా అని శపథం చేశాడు" అని చెప్పాడు ఇది అంత వింటున్న శ్రీకాంత్ కు మెదడు లో కమల్ మెదిలాడు.

క్వారీ లో జరిగిన అవమానానికి అలీ గుండె రగిలిపోయింది దాంతో వాడు ముండి నీ ఏదో చేయాలి అనుకున్నాడు కానీ అక్బర్ ఆ నొప్పి నీ కమల్ కీ ఇవ్వమని చెప్పాడు దాంతో అలీ అర్థం కాన్నట్టు చూశాడు అప్పుడు అక్బర్, అలీ చేతిలో కీర్తన ఫోటో పెట్టి వెళ్లిపోయాడు కీర్తన ఫోటో చూస్తూ సిగరెట్ వెలిగించి గట్టిగా నవ్వాడు అలీ.

మరుసటి రోజు మధ్యాహ్నం శ్రీకాంత్ భోజనం కోసం ఇంటికి వచ్చాడు అప్పుడు వాళ్ల అమ్మ భోజనం వడ్డిస్తూ ఉంటే తనని కూర్చోమని చెప్పాడు అప్పుడే కీర్తన బయటికి వెళ్లడం చూశాడు శ్రీకాంత్ కానీ పట్టించుకోలేదు ఆ తర్వాత వాళ్ల అమ్మ తో "నిన్న చింటు కీ ఏదో కథ చెప్పావు నాకూ అది మళ్లీ చెప్పు" అని అడిగాడు శ్రీకాంత్, అప్పుడు వాళ్ల అమ్మ ఇలా చెప్పింది "పూర్వం తారకేశుడు అనే రాక్షసుడు ఉన్నాడు అతనికి శివుని సంతానం తో మాత్రమే మరణం కలగాలని వరం పొందాడు ఆ తర్వాత కార్తీకేయుడు పుట్టి అతని సంహారం చేశాడు ఆ తర్వాత అతని ముగ్గురు కొడుకులు అయిన తారకాకశ, విద్యున్మాలి, కమలాకశా వాళ్లు అమరులు కావాలి అని తప్పస్సు చేశారు అప్పుడు బ్రహ్మ దేవుడు వేరే ఏదైనా కోరుకొమని చెప్పాడు దాంతో వాళ్లు మూడు కోటలు కోరారు అందులో ఉన్నపుడు వాళ్ళకి మరణం ఉండకుడదు అని చెప్పాడు అప్పుడు బ్రహ్మ దేవుడు వెయ్యి సంవత్సరాల కీ ఒక సారి ఆ మూడు కోటలు ఒకే తిథి లో వస్తాయి అది కూడా ఒక క్షణ కాలం వరకే అప్పుడే మీ అంతం కలుగుతుంది అని చెప్పాడు దానికి త్రిపుర అని పేరు పెట్టమని చెప్పాడు వాళ్లు ఆ కోటలు వదిలి రారు ఎవరికి హాని కలిగించే విధంగా లేరు అప్పుడు ఇంద్రుడు శివునికి మొర పెట్టుకున్నారు దాంతో శివుడు కూడా వాళ్లు ఎవరికి హాని చేయడం లేదు అలా ఏ తప్పు చేయని వాళ్ళని ఎలా అంతం చేయాలి అని చెప్పాడు, అప్పుడు ఇంద్రుడు విష్ణుమూర్తి దగ్గరికి వెళ్లితే ఆయన కూడా అదే చెప్పాడు పైగా వాళ్లు శివ భక్తులు ఆయన వల్లే వారి అంతం ఉంది అని చెప్పి ఒక మాయ సాదువును సృష్టించి అతనికి సకల వేదాలతో పాటు మరో వేదం నేర్పించాడు ఆ ఐదవ వేదం నీ ఆ ముగ్గురికి నేర్పమని చెప్పాడు అలా అతని వాళ్ల దగ్గరికి పంపాడు అతను వీలు పాటించే ధర్మాలు కాకుండా వేరే వేదాలు పాటించే లా చేశాడు అలా వాళ్ల కర్మలు పండిన రోజు దేవతల కోరిక మేరకు శివుడు రుద్రుడు గా మారి తన శివ ధనస్సు తో విష్ణువు నీ అస్త్రం గా మార్చి త్రిపుర నీ నాశనం చేశాడు ఆ తర్వాత విష్ణువు తను సృష్టించిన మాయ సాదువును చిరంజీవి గా దివించీ ప్రజల మధ్య కాకుండా ఎడారి లో మళ్లీ ఇంకో అసుర సమహరం వరకు తిరిగి రావ్వోదు అని శపించాడు" ఇలా వాళ్ల ఒక పురాణ కథ శ్రీకాంత్ కీ చెప్పింది.

ఇది అంత విన్న శ్రీకాంత్ భోజనం చేయకుండా హడావిడి గా బయలుదేరి వెళ్లాడు అదే రోజు కమల్ క్వారీ లో ఉంటే ముండి ఆకాశ్, కమల్ వైపు చూసి నవ్వాడు అది చూసి ఆకాశ్ "ఏంది పెద్దయ్య నవ్వుతానావు ఏమీ కథా " అని అడిగాడు దానికి ముండి "కాబోయే ఏకఛత్రాధిపతులను చూసి ఒక సేవకుడి విధేయత" అని చెప్పాడు దానికి కమల్ నవ్వుతూ "పని చూసుకో జాతాకాలు చెప్పొద్దు" అన్నాడు అప్పుడే కీర్తన క్లబ్ కీ వస్తున్న అంటే హెలికాప్టర్ లో బెంగళూరు బయలుదేరాడు కమల్ అది చూసి ముండి "అగ్గిపుల్ల నీ ముట్టుకుంటే కాలును చెయ్యి ఆడపిల్ల మానం జోలికి వస్తే భస్మం అవును మగవాడి జీవితం" అని చెప్పాడు.

ఇది ఇలా ఉంటే అక్కడ రాకేష్ ఇంట్లో తన తండ్రి దినం భోజనం చేస్తూ ఉంటే అతని మేనమామ "ఆ నా కొడుకు నీ అబ్బ నీ సంపి బయట తీరగాతాంటే కాలు కడిగిన వాడిని నాకే రక్తం మరుగుతాంది, కడుపున పుట్టినోడివి ఆ కోర్టు లోనే వాడి తల నరికి జైలు కీ పోయింటే నువ్వు మగాడివి అనిపించుకుంటాటివి మగతనం లేని నీలాంటోడికీ నా బిడ్డ ఇచ్చిన చూడు నా చెప్పుతో కొట్టుకోవాలా" అని అన్నాడు ఇది ఏమీ పట్టించుకోకుండా మటన్ ముక్కలు తింటూ ఉన్న రాకేష్ తన మామ అన్న చివరి మాటకు కోపంతో తన చేతిలో రోమేంక తో వాడి గొంతులో దింపి దాని బయటికి తీసి ఆ రక్తం అంటుకున ఎముక జుర్రుకున్నాడు ఆ తర్వాత ఆయన ప్రాణాల కోసం కొట్టు మిట్టాడుతుంటే తన పళ్లెం పట్టుకుని తన మామ పక్కన కూర్చుని అన్నం తింటూ "సంపితేనే మగాడ మామ ఆడు మగాడు నా అబ్బ నీ సంపి కూడా రొమ్ము ఇరుసుకుంటా మేము వాడిని సంపుతాము అని భయం లేకుండా తిరుగుతానాడే అది మగతనం మా అబ్బ సేపినాడు బుద్ధి బలం, కండ బలం ఉన్నోడిని సింహం నీ ఏటాడినట్టు ఏటాడాలి" అంటు అతని పల్స్ చూసి తన మనుషుల తో "రేయ్ మామ ఆసుపత్రికి తోల్కాపారీ మహా అయితే గొంతు పొది" అని అన్నాడు ఇది అంత గుమ్మం దగ్గర నుంచి చూస్తున్న అక్బర్ ఒక్క సారిగా రాకేష్ లో ఇంత క్రూరత్వం ఉందా అని ఆశ్చర్యంగా చూశాడు ఇంటికి వచ్చింది శత్రువు అయిన భోజనం పెట్టడం సీమ సంప్రదాయం అక్బర్ నీ భోజనం కీ రమ్మని సైగ చేశాడు రాకేష్ అక్బర్ మాత్రం రక్తం చేత్తో రక్తపు కూడు తింటున్న రాకేష్ నీ చూసి మొదటిసారి అక్బర్ వెన్నులో వణుకు మొదలైంది.

రాకేష్, అక్బర్ ఇద్దరు భోజనం చేసిన తరువాత అక్బర్ నారాయణ ఫోటో కీ పూవులు వేసి నివాళులర్పించాడు ఆ తర్వాత రాకేష్ తో పాటు సోఫా లో కూర్చుని ఉన్నాడు రాకేష్ ఏంటి సంగతి అన్నట్టు సైగ చేశాడు దానికి అక్బర్ "చూడు రాకేష్ మీ అబ్బ కీ మా అబ్బు కీ గొడవలు ఉన్న సంగతి తెలిసిందే కాకపోతే ఇన్ని రోజులుగా ఎప్పుడు మాకు తనని చంపే అవసరం రాలేదు చంపితే ఆ కమల్ గాడే చంపి ఉంటాడు" అని చెప్పాడు దానికి రాకేష్ "నాకూ కూడా ఆ సంగతి తెలుసు అక్బర్ భాయ్ ఇప్పుడు నువ్వు యాలా వచ్చినావు అది చెప్పు" అని అడిగాడు దానికి అక్బర్ "రెండు పిల్లులు కొట్టుకుంటూ ఉంటే ఒక కోతికి మేలు జరిగింది అంటా మన రెండు కుటుంబాలు చాలా సంవత్సరాల నుండి ఈ చోటు నీ పరిపాలిస్తున్నాం కానీ మన పేరు ఈ జిల్లా లోనే ఎవరికి తెలియదు ఆ అన్న తమ్ముల పేరు మాత్రం రెండు రాష్ట్రాల్లో వినిపిస్తోంది పాతవి అని మారిపోదాం మీ అబ్బ, మా అబ్బు ఇద్దరు ఈ పని చేసినట్లు అయితే మనకు ఎప్పుడో మేలు జరిగేది కానీ కాలేదు అందుకే నేను శత్రుత్వం నీ బంధుత్వం చేయడానికి వచ్చా నీ చినాయన కూతురు నీ నా తమ్ముడి కీ ఇచ్చి పెళ్లి చేద్దాం అని అడిగేదానికి వచ్చిన ఈ పెళ్లి జరిగితే మనకు చాలా లాభం ఉంది మా దగ్గర బలం నీ దగ్గర పలుకుబడి ఉంది పైగా కమల్ గాడు ఎవరిని వదిలలేదు వాడి రక్తం వాసన కోసం ఒక రాబందుల సైన్యం ఎదురు చూస్తోంది చెప్పు మనం చేతులు కలిపి వాడిని లేకుండా చేస్తే తప్ప మనం బ్రతుకలేము" అని చెప్పాడు దానికి రాకేష్ కూడా కొద్దిసేపు ఆలోచించి దానికి ఒప్పుకున్నాడు.

శ్రీకాంత్ హడావిడిగా త్రిపుర వెళ్లి అక్కడ క్వారీ లో ఆకాశ్ నీ కలవడానికి వెళ్లాడు అప్పుడు అక్కడ ముండి శ్రీకాంత్ నీ చూసి "గొంతులో కరలాని దాచిన చంద్రశేఖరుడ కాలం నీ కనుసైగ లో నడిపించే అది రూపుడా పాహిమాంమ్" అంటూ ఏదో చెప్పాడు దానికి శ్రీకాంత్ ఎవడో పిచ్చోడు అనుకున్నాడు కానీ ఆకాశ్ దగ్గరికి వెళ్లుతు ముండి నీ ఒకసారి చూసి షాక్ అయ్యాడు ఎందుకంటే తన అమ్మ చెప్పిన కథ లో ఆ మాయ సాదువు నీ పోలి ఉన్నాడు దాంతో ఆకాశ్ దగ్గరికీ హడావిడి గా వెళ్లి కమల్ జాతకం కావాలి అని అడిగాడు దానికి ఆకాశ్ ఆశ్చర్యం తో చూస్తూ బహుశా పెళ్లి కీ ముహూర్తం తో వస్తాడు ఏమో అని జాతకం ఇచ్చాడు అది తీసుకోని హడావిడి గా తిరుపతి బయలుదేరాడు శ్రీకాంత్ ఇది అంతా చూస్తూ ఉన్న ముండి "ఆ జన్మ లో వారి ప్రాణాలు తీసిన రుద్రేశవరా ఇప్పుడు నువ్వు ఎంత ప్రయత్నం చేసిన కూడా ఈ జన్మలో కూడా వారి చావు నీ చేతిలో మరణశాసనం నా చేతిలో" అని చెప్పాడు.

బెంగళూరు వెళ్లిన కమల్ క్లబ్ లో కీర్తన కోసం వెతికాడు తను ఎక్కడ లేదు అప్పుడు గెస్ట్ హౌస్ లోకి వెళితే అక్కడ అలీ మనుషులు ఉన్నారు పైన ఎవరో అమ్మాయి గొంతు వినిపించింది కమల్ సిగరెట్ వెలిగించి "ఎవరూ రా కాలేజీ అమ్మాయా తొందరగా కానీవమను నా పిల్ల వచ్చే టైమ్ అయ్యింది" అని చెప్పి ఫోన్ చేశాడు కీర్తన కీ అప్పుడు కీర్తన ఫోన్ పైన నుంచి వినిపించింది దాంతో పాటు అలీ అరుపు కూడా వినిపించింది "హే తలుపు తీయే" అంటు అరిచాడు కమల్ ఫోన్ రావడంతో కీర్తన ఫోన్ ఎత్తింది "నువ్వు ఏ రూమ్ లో ఉన్నావు" అని అడిగాడు దానికి కీర్తన 8 నెంబర్ రూమ్ అని చెప్పింది దానికి కమల్ "నువ్వు బాత్రూమ్ లోకి వెళితే కిటికీ నుంచి కిందకు దూకు అక్కడ గడ్డి ఉంటుంది నువ్వు సేఫ్" అని చెప్పాడు దానికి కీర్తన అలాగే చేసింది ఆ తర్వాత కమల్ అలీ మనుషులు అందరినీ చంపి అలీ దగ్గరికి వెళ్ళాడు వాడు కమల్ మీద దాడి చేశాడు కానీ కమల్ వాడి కాలు చెయ్ విరిచి త్రిపుర కీ బయలుదేరాడు.

అక్కడ అప్పటికే రాకేష్ కుటుంబం తో బాబా ఖాన్ పెళ్లి కీ ఒప్పుకొని నిశ్చితార్థం చేశారు అప్పుడే కమల్ తన కార్ లో అలీ నీ లాకుని వచ్చి అక్కడ పడేసి జరిగింది చెప్పాడు దానికి బాబా ఖాన్ అలీ నీ కొట్టి క్షమాపణ అడగమని చెప్పాడు దానికి కమల్ తన గన్ తీసి "బాబా నువ్వు నేను ఏమీ అడిగిన ఇస్తా అని మాట ఇచ్చావు ఇప్పుడు అడుగుతున్న నాకూ వీడి ప్రాణం కావాలి" అని కమల్ మాట పూర్తి కాక ముందే బాబా ఖాన్ కమల్ నీ కాలితో తన్ని "కాపలా కుక్క నేను పడేసిన ఎంగిలి మెతుకులు తిని నా ముందే పెరిగిన పెంపుడు కుక్క వీ నువ్వు ఒడిలో కూర్చోబేటుకున్ని మూతి నాకీంచుకుంటే రాజు వీ అయి పోయావు అనుకున్నావ" అని అప్పటి వరకు తన మనసులో ఉన్న విషం మొత్తం కక్కాడు బాబా ఖాన్.

అక్కడ తిరుపతి లో తన ఇంటి ఆస్థాన గురువు దగ్గరికి వెళ్ళాడు శ్రీకాంత్ ఆయన కమల్ జాతకం చూసి "భయం లేని ధీరుడు ఇతను చావు కీ బెదరడు విశ్వాసం కీ నిలువెత్తు నిదర్శనం కానీ కోపం కీ ప్రళయ కాలారుద్రుడు ఇతని జీవితం లో ఏకచ్ఛత్రాధిపతి కానున్నాడు కానీ ఇతనికి కళ్యాణ రేక నే ఇతని ఆయువు తీసే కాల సర్పం కానుంది" అని చెప్పాడు అది విని శ్రీకాంత్ భయపడాడు.

జరిగినది తెలిసి కమల్ ఏమీ చేస్తాడు అని భయపడి విద్యుత్, ఆకాశ్ ఇద్దరు వచ్చారు అప్పటికే అక్కడ బాబా ఖాన్ శవం పడి ఉంది (బాబా ఖాన్ చెప్పిన మాటలు విని క్షణం కూడా ఆలోచించకుండా గన్ లో ఉన్న అని బుల్లెట్స్ బాబా ఖాన్ గొంతు లో దింపి కత్తి తో అలీ తల నరికి గుమ్మం ముందు పడేశాడు కమల్) ఇది చూసి కమల్ అన్న లు ఇద్దరూ ఆశ్చర్యంగా చూశారు అప్పుడే రాకేష్ బాబా ఖాన్, అక్బర్, అలీ కోసం మూడు కూర్చీలు చేయించాడు ఒకటి బంగారం తో, వెండితో ఇంకొకటి, ఇనుము తో ఒకటి అది చూసిన కమల్ బంగారం కుర్చీ లో తన పెద్ద అన్న నీ, వెండి లో చిన్న అన్న నీ, ఇనుము లో తను కూర్చుని త్రిపుర కీ వాళ్లే కొత్త రాజులు అని ప్రకటించాడు కమల్.

కమల్ బాబా ఖాన్ నీ చంపి త్రిపుర కీ తనని తన అన్నలు ఇద్దరిని రాజులు గా ప్రకటించిన తరువాత త్రిపుర, బళ్లారి జిల్లా, కర్నాటక, ఆంధ్ర, మొత్తం వీళ్ల అండర్ లోకి వచ్చింది అప్పటికే ముంబై కూడా కమల్ కాలు కింద ఉండే సరికి అందరూ కమల్ కింద బ్రతికడం మొదలు పెట్టారు నారాయణ ఎన్నో ఏళ్లుగా ప్రయత్నం చేస్తున్న బాబా ఖాన్ క్వారీ వెనుక బంగారం తో ఉన్న అడవి గురించి తెలుసుకున్నాడు దాని బాబా ఖాన్ రాసినట్టు రాసి దాని అక్బర్ పేరు మీద ఉంచినట్టు ఒక నకిలీ పత్రాలు తయారు చేసి ఉంచారు ఎందుకంటే అది భవిష్యత్తులో ఫారెస్ట్ డిపార్టుమెంటు వాళ్లు కేసు వేసిన అది అక్బర్ మీదకు వెళ్లే లాగా కమల్ తెలివిగా చేశాడు ఆ తర్వాత మైనింగ్ మినిస్టర్ తో అగ్రిమెంట్ కింద వాళ్లు ఎక్కడ మైనింగ్ పెట్టిన దానికి స్టేట్ లో పర్మిట్ ఇవ్వాలి అలా చేస్తే తనని ప్రాణాలతో వదులుతాం అని చెప్పాడు కమల్ దాంతో మినిస్టర్ వాళ్లు చెప్పినట్లు చేస్తూ ఉన్నాడు, ఆ అడవి లో మైనింగ్ మొదలు పెట్టాలి అంటే అక్కడ ఉన్న అడవి జనాలు కాలి చేయాలి వాళ్లు అక్కడే గొర్రెల పెంపకం, చెట్లు నరికి అమ్ముకుని జీవనం సాగిస్తున్నారు దానికి పాపం వేసి కమల్ రాత్రికి రాత్రే వాళ్ళని కార్చిచ్చు కాల్చేసింది అన్నట్టు సాక్ష్యం సృష్టించి వాళ్లని మంట లో కాల్చి చంపేసాడు అ తరువాత అక్కడ బంగారం మైనింగ్ మొదలు పెట్టారు.

బాబా ఖాన్ చనిపోయిన తర్వాత కమల్ కీ మంచి చెడు చెప్పడానికి ఎవరూ లేరు బాబా ఖాన్ చెడ్డవాడు అయినా అప్పుడప్పుడు ఇది మంచి అని చెడు అని చెప్పేవాడు ఇప్పుడు అలా ఎవ్వరూ లేరు దాంతో ముండి ది రాజ్యం అయ్యింది అసలే అదుపు తప్పి ఉన్న వాళ్ళని తన మాటలతో రెచ్చగొట్టి ఇంకా తప్పులు చేయిస్తున్నాడు శ్రీకాంత్ కీ బళ్లారి నుంచి హైదరాబాద్ కీ ట్రాన్స్ఫర్ అయ్యింది కాకపోతే శ్రీకాంత్ లేకపోతే ఇక్కడ తమ ప్రాణాలకు గ్యారంటీ లేదు అర్థం అయ్యింది రాకేష్, అక్బర్ కీ అందుకే మినిస్టర్ తో మాట్లాడి శ్రీకాంత్ ట్రాన్స్ఫర్ కాన్సిల్ చేయించారు ఆ తర్వాత ఒక రోజు కీర్తి షాపింగ్ కోసం బెంగళూరు లో ఒక మాల్ కీ వెళ్లింది అక్కడ ఎవరో తనను ఇబ్బంది పెట్టారు దాంతో కీర్తి ఆకాశ్ కీ ఫోన్ చేసింది అప్పుడు ఆకాశ్ కమల్ కీ ఫోన్ చేయమని చెప్పాడు దానికి కీర్తి "కమల్ కీ ఫోన్ చేస్తే ఇక్కడ ఎవరూ ప్రాణాలతో ఉండరు" అని చెప్పింది దానికి ఆకాశ్ కూడా నిజమే అని చెప్పి బెంగళూరు లో తన మనుషులకు ఫోన్ చేశాడు కీర్తి ఒక కాఫీ షాప్ లో కూర్చుని ఉంటే వాళ్లు మళ్లీ వచ్చారు అప్పుడే ఆకాశ్ మనుషులు వచ్చి కీర్తి నీ ఏడిపిస్తున్న వాళ్ళని కొట్టి తనకు సెక్యూరిటీ లాగా బయటకు తీసుకొని వెళ్లి కార్ లో ఇంటికి పంపించారు.

ఇలా ఉంటే రాకేష్ ఎలాగైనా సరే అన్న తమ్ములో ఎవరో ఒకరు చస్తే కానీ పని కాదు అనుకున్నాడు అందుకే ఒక రోజు ఆకాశ్ తన కొడుకు కోసం మంగళూరు వెళుతు ఉంటే త్రిపుర దాటి బళ్లారి లోకి వచ్చిన తర్వాత ఉరి పొలిమేర లో బాంబులు పేల్చి కార్ నీ ఆపేసారు కాకపోతే ఆకాశ్ అందరినీ రివర్స్ లో చంపి రాకేష్ వెంటపడ్డాడు కాకపోతే రాకేష్ మొత్తం ఊరు అంతా పరిగెత్తీ ఎస్పి ఆఫీసు ముందుకు వచ్చి ఆగి సెక్యూరిటీ ఆఫీసర్లను తనని కాపడమని బ్రతిమాలాడు అప్పుడు శ్రీకాంత్ సాక్ష్యం తో సహ దొరికేసరికి ఆకాశ్ నీ అరెస్ట్ చేశాడు, రాకేష్ ముందు ఓవర్ confidence తో వచ్చాడు కానీ ఆకాశ్ బలం ముందు తను నిలబడలేడు అని అర్థం అయ్యింది అప్పుడు తన తండ్రి చెప్పిన మాట గుర్తు వచ్చింది బలం ఉన్న వాడిని తెలివితో ఒడించాలి అని అందుకే ఇలా ప్లాన్ చేసి ఇరికించాడు ఆ తర్వాత కమల్ లాయర్ తో సహ వచ్చి తన అన్నను విడిపించుకొని వెళ్లడానికి చూశాడు కానీ అది మర్డర్ అటెంప్ట్ కాబట్టి కుదరదు పైగా 10 మంది చనిపోయి ఉన్నారు అని బెయిల్ కూడా చెల్లదు అని చెప్పాడు మినిస్టర్ తో రికమెండ్ చేయించడానికి ఫోన్ చేస్తే వాడు ఫోన్ ఎత్తడం లేదు.

దాంతో కమల్ కీర్తి కీ ఫోన్ చేసి కలవాలి అని చెప్పాడు అలా ఒక గంట తరువాత శ్రీకాంత్ కీ ఫోన్ చేశాడు కమల్ "బావ ఒక్కసారి టివి పెట్టు బ్రేకింగ్ న్యూస్ నీ చెల్లి గురించి" అని చెప్పి ఫోన్ పెట్టేసాడు దాంతో కంగారుగా టివి పెట్టాడు శ్రీకాంత్ చూస్తే కీర్తి, కమల్ ఇద్దరు గుడి లో పెళ్లి చేసుకుంటున్నారు అప్పుడు శ్రీకాంత్ కీ తన సిద్ధాంతి చెప్పిన మాట గుర్తుకు వచ్చింది "అతని కళ్యాణ రేక కాల సర్పం కానుంది" అని గుడి లో ఒక మూల కూర్చుని ఒక్కడే పాము నిచ్చెన ఆట ఆడుతున్న ముండి కమల్ వైపు చూస్తూ "కష్టపడి ఎక్కిన ప్రతి మెట్టు వరం అలా కాకుండా విచ్చలవిడితనం తో ఎక్కిన ప్రతి నిచ్చెన చివర ఒక కాల సర్పం ఎదురు చూస్తూ ఉంటుంది" అని అన్నాడు అప్పుడు కమల్, కీర్తి మెడలో తాళి కట్టిన మరుక్షణం ఎవరో కమల్ నీ కాల్చేసారు.

కమల్, కీర్తన మెడలో తాళి కట్టిన వెంటనే ఎవరో కమల్ నీ కాల్చేసారు అప్పుడు కమల్ మనుషులు వాడిని కార్ లో వేసి హాస్పిటల్ కీ తీసుకోని వెళ్లారు ఇది అంత టివి లో చూస్తున్న శ్రీకాంత్ షాక్ అయ్యి అలాగే తన కుర్చీలో నుంచి లేచి గట్టిగా అరుస్తూ గోడని కొట్టాడు అప్పుడు ఆకాశ్ కీ కమల్ నుంచి ఫోన్ వచ్చింది అది శ్రీకాంత్ ఏత్తాడు "హలో బావా ఎలా ఉంది స్ట్రోక్ కాల్చింది నిజం, బుల్లెట్ దిగింది నిజం కాకపోతే నేను చచ్చాను అనేది మాత్రం అబద్ధం చూడు మా అన్న నీ వదిలితేనే నేను బయటకు వెళ్లతా లేదు అనుకో నేను నువ్వు ఎన్ని రోజులు మా అన్నను జైలు లో పెడతావో అని రోజులు నేను కోమ్మా లో ఉంటా నేను మీడియా ముందు పెళ్లి చేసుకోడానికి పిచ్చోడినా ఇప్పుడు నీ చెల్లి మొగుడు తాళి కట్టిన మరుక్షణం చావు దాక వెళ్లాడు అని బయటకు తెలిస్తే ఇంత నష్ట జాతకం ఉన్న పిల్లను చేసుకోడానికి ఎవ్వరూ రారు పైగా నీ చెల్లి కూడా ఇంకొకరిని చేసుకోదు కాబట్టి డిసైడ్ చేసుకో నాటకం ఆడే వాడిని ఎందుకు నిజం బుల్లెట్ దింపిచుకున్నా అనే కదా నీ డౌట్ నీ చెల్లి డాక్టర్ కదా దాని నమ్మించోదు నా అన్న ఎంత తొందరగా బయటికి వస్తే నీ చెల్లి తాళి నిలబడతాది " అని చెప్పి ఫోన్ పెట్టి డాక్టర్ తో కుట్లు సరిగ్గా వెయ్యి అని వార్నింగ్ ఇచ్చాడు కమల్ చెప్పింది విన్న తర్వాత శ్రీకాంత్ ఆవేశం లో తన టేబుల్ నీ ఎత్తి పడేశాడు అలా ఒక 5 నిమిషాల పాటు ఆలోచించి ఆకాశ్ నీ రిలీస్ చేశాడు శ్రీకాంత్ దాంతో ఆకాశ్ "నువ్వు ఎవరితో అయిన పెట్టుకో నా తమ్ముడూ తో మాత్రం పెట్టుకోకూ వాడు నువ్వు ఆలోచించే లోపు నీ కాలు కింద భూమిని కదిలించి నిన్ను భూసమాధి చేయగలడు" అని చెప్పి హాస్పిటల్ కీ వెళ్లాడు.

హాస్పిటల్ లో ఉన్న కీర్తన ఏడుస్తు నే కూర్చుని ఉంది అప్పుడు డాక్టర్ వచ్చి రిస్క్ లేదు రేపు సాయంత్రం వరకు observation లో పెట్టాలి అని చెప్పి వెళ్లాడు దాంతో కీర్తన కొంచెం సంతోషీంచింది రాధా తనని తీసుకుని ఇంటికి వెళ్లింది ఆ తర్వాత మరుసటి రోజు సాయంత్రం కమల్ హాస్పిటల్ నుంచి తన అన్నలు ఇద్దరి తో కలిసి వచ్చాడు అది చూసి కీర్తన పరిగెత్తుతూ వెళ్లి కమల్ నీ గట్టిగా కౌగిలించుకుంది ఆ తర్వాత రాధా ఒక హారతి తెచ్చి కొత్త జంట కు దిష్టి తీసి ఇంట్లోకి పిలిచింది, అక్కడ మినిస్టర్ కూతురు సంధ్య కూడా కమల్ కోసం ఎదురు చూస్తూ ఉంది కమల్, కీర్తన ఇద్దరు రాగానే ఒక గిఫ్ట్ ఇచ్చి పెళ్లి శుభాకాంక్షలు చెప్పింది అప్పుడు చిన్న కూడా వచ్చి సంధ్య నీ ఆ రోజు ఇంట్లోనే ఉండమని అడిగాడు దానికి ఆకాశ్ సిగ్గు పడుతూ ఉంటే విద్యుత్ అది చూసి ఆకాశ్, కమల్ ఇద్దరిని పక్కకు తీసుకోని వెళ్లి "ఎందీ అన్న మేడమ్ నీ చూస్తే ఈ మధ్య సిగ్గు పడుతున్నావ్ ఏంటి కథ" అని అడిగాడు విద్యుత్ దానికి ఆకాశ్ "ఏమోరా ఆ మేడమ్ నీ చూస్తాంటే నాకూ ఏదో అయితాంది ఏదో మీ వదిన మేనమామ బిడ అని నాయన మాట ఇచ్చినాడు అని ఇష్టం తోనే చేసుకుంటీ కాకపోతే కలిసి బతికే దానికి లేక పాయ ఈ అమ్మి బాగుండాది దానికి తోడు చిన్న గానికీ కూడా బాగా ప్రేమ చూపూతాంది అందుకే వాడికి పుట్టిన పాలి నుంచి అమ్మ ప్రేమ తెలీదాయే పెళ్లి చేసుకుందాం అని అనిపిస్తాంది కానీ ఆమె పెద్ద చదువులు చదివింది మనిషి మాట తీరు తెనె లేక తీయగా ఉంటాదీ నేను రౌడీ గాడిని నేను ఏటా చేసుకునేదీ" అని అన్నాడు ఆకాశ్ ఇది అంత తలుపు చాటు నుంచి వింటుంది సంధ్య తరువాత లోపలికి వచ్చింది విద్యుత్, కమల్ ముందే ఆకాశ్ నీ గట్టిగా కౌగిలించుకున్ని తన ఇష్టం చెప్పింది కానీ ఆకాశ్ కీ ఏమీ అర్థం కాక తన తమ్ములను అడిగాడు దానికి కమల్ తల కొట్టుకొని "నా మొద్దు అన్న నువ్వు అంటే ఇష్టం అని దానికి అర్థం" అని చెప్పాడు అలా ముగ్గురు కలిసి డాన్స్ చేశారు.

నెల రోజుల తరువాత శ్రీకాంత్ అక్కడ ఉండలేక హైదరాబాద్ ట్రాన్స్ఫర్ చేయించుకుని వెళ్లాడు అక్కడ లోకల్ డ్రగ్స్ మాఫియా లో ఇద్దరు ముఖ్యమైన వాళ్ళని అరెస్ట్ చేశాడు దానికి వాళ్ల బాస్ శ్రీకాంత్ కీ ఫోన్ లో వార్నింగ్ ఇచ్చాడు అయిన శ్రీకాంత్ భయపడక పోవటంతో శ్రీకాంత్ కొడుకు చింటు నీ కిడ్నాప్ చేశాడు తన కొడుకును రిలీస్ చేయడానికి జైలు లో ఉన్న ఎదరు బయటకి రావాలి అని డీల్ పెట్టారు ఈ విషయం కీర్తన అమ్మ కీర్తన కీ చెప్పింది అప్పుడు కమల్ బయటికి వెళుతుంటే కీర్తన ఈ విషయం చెప్పింది కానీ కమల్ ఏమీ పట్టించుకోకుండా వెళ్లిపోయాడు అది చూసి కీర్తన బాధ పడుతు డైనింగ్ దెగ్గర కూర్చుని ఆలోచిస్తూ ఉంది ఒక గంట తరువాత రాధా వచ్చి జ్యూస్ ఇచ్చి "పొద్దున నుంచి ఏమీ తినలేదు ఇది తాగు లేదు అంటే మీ ఆయన నా మీద సిరీయస్ అవుతాడు" అని చెప్పింది అయిన కూడా కీర్తన తాగలేదు అప్పుడే కమల్ నుంచి ఒక వీడియో కాల్ వచ్చింది కోపం తో తీటాలి అని లిఫ్ట్ చేసింది కానీ సడన్ గా చింటు నీ చూసి షాక్ అయ్యింది "ఏంటి మేడమ్ హ్యాపీ ఆ వదిన చెప్పింది ఏమీ తినలేదు అంట బెంగళూరు నుంచి హైదరాబాద్ దగ్గర ఏమైనా ఫ్లయిట్ లేట్ అయ్యింది సరే ఇప్పుడయినా భోజనం చెయ్యి" అని ఫోన్ పెట్టేశాడు కమల్, దాంతో కీర్తన మొహం వెయ్యి దీపాల కాంతి తో వెలిగింది "కమల్ ఉన్నంత వరకు మనకు ఏమి కాదు ఈ కుటుంబం ఇంత హాయిగా ఉంది అంటే అదీ కమల్ వల్లే ప్రమాదం నీడ కూడా మన దాక రానివ్వడు" అని చెప్పి వెళ్లిపోయింది చింటు నీ తీసుకోని కమిషనర్ ఆఫీసు కీ వెళ్లాడు కమల్ తన కొడుకు సేఫ్ గా రావడంతో శ్రీకాంత్ సంతోష పడ్డాడు.

వెళ్లుతున్న కమల్ నీ పిలిచి థాంక్స్ చెప్పాడు శ్రీకాంత్ "నేను ఇప్పటి వరకు చేసిన ప్రతి మర్డర్ నా ఫ్యామిలీ కోసం చేశా నాకూ ముందు ఫ్యామిలీ ఆ తర్వాతే డబ్బులు, పవర్, అధికారం బాబా నాకూ తండ్రి లాంటి వాడు అనుకున్న, అక్బర్,అలీ నా తమ్ములు అనుకున్న కానీ వాళ్లు నన్ను కాపలా కుక్క గానే చూశారు నీకు నచ్చిన నచ్చక పోయిన నేను నీ ఫ్యామిలీ నువ్వు నా ఫ్యామిలీ మన జోలికి వస్తే వాడికీ భూమి మీద అదే ఆఖరి ఊపిరి" అని చెప్పాడు కమల్ శ్రీకాంత్ డ్రగ్స్ మాఫియా బాస్ ఎక్కడ అని అడిగాడు దానికి కమల్ వాడు పారిపోయాడు అని చెప్పాడు నిజానికి వాడిని ఆకాశ్ క్వారీ లో బాంబ్ పెట్టి పేల్చి చంపేశాడు, ఇది ఇలా ఉంటే ముండి ముగ్గురు అన్నదమ్ముల జాతక చక్రం చూసి వాళ్ల పాపాలు ఏమీ ఇంకా తార స్థాయి కీ చేరుకో లేదు అని ఆశ్చర్య పోయాడు అప్పుడు తనకు అర్థం అయ్యింది వాళ్ల ప్రేమ వాళ్ళని కాపాడుతుంది అని దాంతో వాళ్ల ప్రేమ నీ ముందు చంపాలి అని ఆలోచిస్తూన్నాడు.​
Next page: Update 04
Previous page: Update 02