Update 04

ఒక రోజు ఇంట్లో రాధా ఒక్కటే ఉన్న సమయంలో ముండి ఇంటికి వెళ్లి అకౌంటు బుక్స్ ఇచ్చి వెళ్లి వస్తా అని అన్నాడు దానికి రాధా కాఫీ తాగి వెళ్ళమన్ని చెప్పింది దానికి ముండి సరే అని అక్కడే కూర్చుని ఉన్నాడు అప్పుడే అక్కడికి వచ్చిన విద్యుత్ తన ఫోన్ టేబుల్ మీద వదిలి లోపల ఏదో ఫైల్ కోసం వెళ్లాడు ఫోన్ unlock లో ఉండటం తో ముండి ఆ ఫోన్ తీసుకొని విద్యుత్ రెండో భార్య అయిన నిత్య కీ ఫోన్ చేసి మిస్డ్ కాల్ ఇచ్చి మళ్లీ ఫోన్ నీ టేబుల్ మీద పెట్టి సైలెంట్ గా కూర్చుని ఉన్నాడు రాధా కాఫీ తెచ్చి ఇచ్చింది తరువాత అప్పుడే నిత్య నుంచి ఫోన్ అది చూసి రాధా షాక్ అయ్యింది నిత్య, విద్యుత్ ఇద్దరు lip to lip కిస్ చేస్తూ ఉన్న ఫోటో పడింది దాంతో పాటు డార్లింగ్ అని కూడా ఉండడం తో రాధా కాఫీ కప్పు చేత్తో వదిలేసి ఏడుస్తు కూర్చుంది అప్పుడే విద్యుత్ వచ్చి ఫోన్ లో డార్లింగ్ మిస్డ్ కాల్ ఉండటం చూసి పక్కనే రాధా ఏడుస్తు ఉండటం చూసి తనకి విషయం అర్థం అయ్యింది అప్పుడు రాధా ఏమీ మాట్లాడలేదు విద్యుత్ మాట్లాడించడానికి ప్రయత్నం చేస్తే రాధా విద్యుత్ నీ కొట్టి తన రూమ్ లోకి వెళ్లి తలుపు వేసుకుంది దాంతో విద్యుత్ మళ్లీ నిత్య నుంచి ఫోన్ వచ్చిన కట్ చేసి రాధా నీ పిలుస్తూ ఉన్న తను తలుపు తీయలేదు అప్పుడు విద్యుత్ గట్టిగా తలుపు తోసుకుని లోపలికి వెళ్లి చూడగా రాధా తన బట్టలు తీసుకోని బయటికి వెళుతూ ఉంది విద్యుత్ ఎంత ఆపాలని చూసిన వినిపించుకోకుండా వెళ్లిపోవడానికి నిర్ణయం తీసుకుంది అప్పుడు విద్యుత్ తన చెయ్యి పట్టుకుని ఆపాలని చూస్తే లాగి కొట్టి వదిలి వెళ్ళిపోయింది.

ఇది ఇలా ఉంటే ఆకాశ్, కమల్, కీర్తన అందరూ కలిసి మినిస్టర్ ఇంటికి వెళ్లారు అక్కడ సంధ్య కీ ఆకాశ్ కీ పెళ్లి గురించి మాట్లాడారు కానీ మినిస్టర్ దానికి ఒప్పుకోలేదు అప్పుడు కమల్ సంధ్య, కీర్తన నీ లోపలికి వెళ్లమని సైగ చేశాడు ఆ తర్వాత తన దగ్గర ఉన్న ఫైల్ ఒకటి మినిస్టర్ కీ ఇచ్చాడు కమల్ అది చూసి షాక్ అయ్యాడు మినిస్టర్ అందులో బాబా ఖాన్ తో తను చేసిన అక్రమ మైనింగ్ గురించి అన్ని వివరాలు ఉన్నాయి దానికి తోడు మైసూర్ గ్రానైట్ క్వారీ లు కూడా టెండర్ లేకుండా తనకు నచ్చిన వాళ్లకు రాసినట్టు ఉన్న డాక్యుమెంట్ అని ఉన్నాయి అది చూసి మినిస్టర్ లో కంగారు మొదలు అయ్యింది అప్పుడు కమల్ తన సూట్ సరి చేసుకుని కాలు మీద కాలు వేసి చిటికె వేసి మినిస్టర్ నీ పిలిచి "నువ్వు ఇప్పుడు సిఎం రేస్ లో ఉన్నావు పైగా దీంట్లో ఎక్కడ మా పేర్లు లేవు వస్తే అక్బర్ గాడు నీతో జైలు కీ వస్తాడు అదే నేను చెప్పినట్లు చేస్తే వచ్చే పది సంవత్సరాల పాటు నువ్వే సిఎం దానికి నేను హామీ నువ్వు ఎంఎల్ఏ ల కోసం రూపాయి కూడా నీ జేబు నుంచి తీయాల్సిన పని లేదు అంతా నేను చూసుకుంటా నీ కూతురు కీ నీ

ఇష్టం లేకుండా పెళ్లి చేస్తే మా ఇంటికి ఒక తల్లి స్థానం వస్తుంది అదే నువ్వు నీ చేత్తో పెళ్లి చేస్తే నీకు రాజకీయం లో తిరుగు లేని స్థానం ఉంటుంది లేదు అంటే జీవితాంతం జైలు లో చిప్ప కూడే" అని కమల్ మాట పూర్తి కాక ముందే మినిస్టర్ వచ్చి కమల్ కాలు పట్టుకున్నాడు దానికి కమల్ "నావి కాదు కానీ మా అన్నవి పట్టుకో" అన్నాడు దానికి వెంటనే మినిస్టర్ "రేయ్ ఒక మినరల్ వాటర్ బాటిల్ తీసుకోని రండి అల్లుడు కీ కాలు కడగాలి" అని చెప్పాడు ఆ తర్వాత తన కూతురు ముందే ఆకాశ్ కాలు కడిగి కన్యాదానం చేసి దెగ్గర లో ఉన్న ముహూర్తం కే పెళ్లి చేస్తా అని చెప్పాడు.

రాధా వెళ్లిపోయిన బాధ లో ఇంట్లో నే మందు తాగుతూ ఉన్నాడు విద్యుత్ విషయం తెలిసి కమల్ మంగళూరు వెళ్లాడు కీర్తన తో కలిసి ఇంట్లో విద్యుత్ ఒక్కడే ఉన్నాడు అప్పుడు ముండి రాకేష్ కీ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు మంగళూరు వెళ్లి రాధా నీ convince చేయాలి అని చూశారు కానీ రాధా అసలు తిరిగి రావడానికి నిరాకరించింది "మీ అన్న నను కాలేజీ లో పెళ్లి చేసుకుని నాకూ అంటూ అయిన వాళ్లు లేకుండా చేశాడు ఇంత బాధ లో పుట్టింటికి కూడా వెళ్లలేని పరిస్థితి నాది నాకూ పిల్లలు పుట్టరు అని తెలిసి మీ అన్న బాధ పడుతుంటే చిన్న నీ నా కన్న కొడుకు లాగా నిన్ను పెద్ద కొడుకు లాగా ప్రేమ తో సాకితే చాలా పెద్ద బహుమతి ఇచ్చారు అయ్యా నా గుండెల్లో నీకు తప్ప ఎవరికీ స్థానం లేదు అన్నాడు ఇప్పుడు ఎక్కడ ఆ స్థానం దయచేసి నన్ను ఇలాగ ఉండనీవు మళ్లీ నేను ఆ ఇంటికి రాను " అని కమల్ నీ బయటకు తోసి తలుపు వేసింది రాధా దాంతో కమల్, కీర్తన తో కలిసి తిరిగి బెంగళూరు వెళ్లాడు అక్కడికి వెళ్లి చూస్తే ఇళ్లు మొత్తం చీకటి గా ఉంది ఎక్కడ పడితే అక్కడ బుల్లెట్స్ పడి ఉన్నాయి ఆ తర్వాత విద్యుత్ కోసం వెతికితే తను ఆ చీకటిలో తన ఆరి కాలి కింద రాకేష్ నీ ఒత్తి పెట్టి సిగరెట్ ని వెలిగించిన వెళుతురు లో కనిపించాడు అప్పుడు కమల్ డ్రైవర్ తో కీర్తన నీ క్లబ్ లో గెస్ట్ హౌస్ కీ పంపించాడు.

మరుసటి రోజు ఉదయం అక్బర్ లేచి తన ఇంటి గుమ్మం తలుపు తీసి బయటకు వచ్చి చూస్తే ఒక చెట్టు పెట్టి ఉంది అందులో ఒక లెటర్ ఉంది తీసి చూస్తే "జూమ్మా ముబారక్" అని ఉంది అప్పుడు సరిగ్గా చూస్తే ఆ చెట్టు కింద కుండీ బదులు రాకేష్ తల ఉంది.

రాకేష్ తల నరికి తన ఇంటి ముందే పెట్టేసరికి అక్బర్ కీ భయం మొదలు అయ్యింది ఇంకా లిస్ట్ లో తరువాత ఉన్నది నేనే అని దాంతో మినిస్టర్ దెగ్గరికి వెళ్ళాడు స్పెషల్ ప్రొటెక్షన్ కోసం కానీ మినిస్టర్ ఇప్పుడు ఎన్నికల హడావిడి లో ఉన్నాడు పైగా తన కూతురు కీ ఇంకో నాలుగు రోజులో ఆకాష్ తో పెళ్లి కాబట్టి ఇంక అక్బర్ తో పొత్తు పెట్టుకోవడం మంచిది కాదు అని అర్థం అయ్యింది అందుకే అక్బర్ నీ పట్టించుకోకుండా ప్రచారం కీ వెళ్ళిపోయాడు దాంతో అక్బర్ భయం తో ఏమి చేయాలో తెలియక ఉంటె మైసూర్ రాజా నుంచి ఫోన్ వచ్చింది దాంతో అక్బర్ మైసూర్ వెళ్ళాడు అక్కడ రాజా అక్బర్ కీ ఒక సలహా ఇచ్చాడు సాయంత్రం తన కొడుకు నీ రాజుగా పట్టాభిషేకం చేస్తున్న ఆ ఫంక్షన్ కీ కీర్తన ,కమల్ ఇద్దరు వస్తున్నారు అని కాబట్టి వాళ్ళ రెండో అన్న అయిన విద్యుత్ నీ వేసేయొచ్చు అని చెప్పాడు దాంతో అక్బర్ మళ్లీ కమల్ కీ ఈ ప్లాన్ తెలిస్తే ఎలా అని అడిగాడు అక్బర్ దాంతో రాజా నవ్వుతు "ఈ సారి కమల్ తన లాక్ తనే వేసుకున్నాడు నువ్వు ఏమి భయపడొద్దు వాడు రాడు" అని ధైర్యం చెప్పాడు రాజా దాంతో అక్బర్, రాకేష్ ఇంటికి వెళ్లాడు అక్కడ అందరూ వాడి శవం మీద పడి ఏడుస్తున్నారు కానీ వాడి చెల్లి (అదే అలీ కీ ఇచ్చి పెళ్లి చేయాలి అనుకున్న పిల్ల) మాత్రం ఏమీ పట్టనట్టు కూర్చుని ఉంది చెప్పడం మరిచి పోయా అలీ గాడు చనిపోయిన రోజు నుంచి ఈ పిల్ల తన బొట్టు, గాజులు లేకుండా మొగుడు పోయిన వితంతువు లాగా తయారు అయి ఉంటుంది.

అక్బర్ నీ చూసి కొంచెం పక్కకు పిలిచింది వెళ్లిన తర్వాత కొంతమంది తన మనుషులను పిలిచింది అందులో ముంబై మాఫియా డాన్ లాలా తమ్ముడూ కూడా ఉన్నాడు వాడు తన అన్న పగ తీర్చుకోడానికి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాడు వాడికి అక్బర్ తో పరిచయం చేసింది వాళ్లు ఇద్దరు ఈ రోజు సాయంత్రానికి విద్యుత్ నీ చంపడానికి ప్లాన్ చేసారు విద్యుత్ నిత్య నీ కలిసేందుకు హైదరాబాద్ వెళ్లాడు ఏదో బిజినెస్ మీటింగ్ కోసం నిత్య హైదరాబాద్ వచ్చింది దాంతో సాయంత్రం కీ హైదరాబాద్ వెళ్లాలి అని ప్లాన్ చేసారు ఈ లోగా కమల్, కీర్తన ఇద్దరు మైసూర్ వెళ్లారు పట్టాభిషేకం కార్యక్రమంలో ఉండగా రాజా వారి పూర్వీకుల నిధి నుంచి కొట్టేసి ఇచ్చిన necklace వేసుకొని వచ్చింది కీర్తన ప్రోగ్రాం జరుగుతుండగా ఆ necklace మిస్ అయ్యింది అని అందరూ గెస్ట్ లని లాక్ చేసి వాళ్ల ఫోన్ కూడా తీసుకున్నారు ఆ తర్వాత ఆ necklace కీర్తన మెడ లో ఉండటం తో కీర్తన నీ పక్కకు తీసుకొని వెళ్లారు వాళ్ళని ఎంక్వయిరీ చేస్తున్నాం అనే పేరు తో కీర్తన తో కొంచెం అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు అప్పుడు కమల్ బలవంతంగా లోపలికి వచ్చి జరిగింది తెలుసుకొని వాళ్ళని కొట్టి కీర్తన తో బయటికి వచ్చి ఎర్ర బడ్డ కళ్లతో రాజా దగ్గరికి వెళ్లి ఆ necklace తిరిగి ఇచ్చి వినయం తో నమస్కారం పెట్టి "నను టచ్ చేసిన వదిలేసేవాడిని కానీ నా ఫ్యామిలీ నీ టచ్ చేశావ్ నీకు నీ తరువాత నీ వంశం లేకుండా చేస్తా" అని చెప్పి వెళ్లిపోయాడు కమల్ దానికి రాజా నవ్వుతూ పిల్ల నాకొడుకు ఏమీ పీకుతాడు అని అనుకున్నాడు.

కమల్ వెళ్లిన ఒక గంట తరువాత రాజా యువరాజు నీ వెతుకుతూ ఉన్నాడు ఎక్కడికి వెళ్లాడు అని తీరా చూస్తే ఒక సెక్యూరిటీ వాడు వచ్చి యువరాజు బాత్రూమ్ లో పడి ఉన్నాడు అని చెబితే రాజా వెళ్లి చూసి షాక్ అయ్యాడు ఎందుకంటే అక్కడ తన కొడుకు నగ్నంగా మగతనం తెగి పడి ఉన్నాడు అప్పుడు తనకు కమల్ చెప్పిన మాట గుర్తుకు వచ్చింది "నీ వంశం లేకుండా చేస్తా" అని అన్న మాట గుర్తుకు వచ్చి గట్టిగా అరిచాడు.

ఇక్కడ హైదరాబాద్ లో నిత్య, విద్యుత్ ఇద్దరు కలిసి ఒక రెస్టారెంట్ లో డిన్నర్ చేసి కార్ లో బళ్లారి బయలుదేరారు దారిలో వాళ్ల కార్ వెనుక రెండు బైక్ రావడం గమనించాడు విద్యుత్ ఏదో అనుమానం వచ్చి బండి పక్క సందులోకి తిప్పితే ఒక బైక్ వాడు సందు చివర ఆగి ఉంటే ఇంకొకడు కార్ నీ overtake చేసి వెళ్లాడు దాంతో విద్యుత్ బండి ఆపి రివర్స్ లో వెనుక బైక్ వాడి దగ్గరికి వెళ్లుతుంటే వాడు గన్ తో firing మొదలు పెట్టాడు అప్పుడు విద్యుత్ స్పీడ్ పెంచి వాడి మీద నుంచి బండి ఎక్కించి వెళ్లిపోయాడు అది చూసి ముందు వెళ్లినవాడు బైక్ తిప్పి రిటర్న్ వచ్చి ఎటాక్ చేశాడు గన్ తో అప్పుడు ఇంకా రెండు కార్లు ఛేజ్ చేయడం మొదలు పెట్టారు వాళ్ళని అలా తప్పించుకుంటు వెళుతున్న విద్యుత్ కార్ నీ పక్క సందు నుంచి స్పీడ్ గా వచ్చిన వేరే ఏదో కార్ గుద్దుకోవడం తో విద్యుత్ కార్ బోల్తా పడింది అలా నిత్య సీట్ బెల్ట్ పెట్టుకోవడం తో బ్రతికింది కానీ చెయ్యి విరిగి గొంతులో గాజు పెంకు దిగింది విద్యుత్ ముందు అద్దం నుంచి ఎగిరి రోడ్డు మీద పడితే తన కార్ తన మీదే పడి చనిపోయాడు.

మరుసటి రోజు విద్యుత్ శవం చూడడానికి అందరూ వచ్చారు అప్పుడే హాస్పిటల్ నుంచి నిత్య నీ కూడా తీసుకొని వచ్చారు ఒక పూల మాలతో వచ్చాడు శ్రీకాంత్ విద్యుత్ శవం మీద దండ వేసి ఏడుస్తు ఉన్నాడు శ్రీకాంత్ అతని చూసిన నిత్య ఆక్సిడేంట్ చేసింది శ్రీకాంత్ అని చెప్పడానికి ప్రయత్నం చేస్తుంది కానీ అది ఎవరికీ అర్థం కావడం లేదు.

శ్రీకాంత్ నీ చూసిన నిత్య విద్యుత్ నీ చంపింది వాడే అని చెప్పడానికి చాలా ట్రై చేసింది కానీ తను విద్యుత్ చనిపోయిన బాధ లో ఉంది అనుకున్నారు కానీ తను అసలు ఏమీ చెప్పాలి అనుకుంటుందో అర్థం కాలేదు ఎవరికి శ్రీకాంత్ నిత్య తన గురించి చెప్పాలి అని చూస్తోంది అని అర్థం అయ్యింది కానీ తన గొంతు సరిగ్గా లేదు కుడి చెయ్యి విరిగింది అని చిన్న ధైర్యం తో అక్కడి నుంచి వెళ్లిపోతుంటే ముండి వచ్చి "నమస్కారం ప్రభు" అన్నాడు దానికి శ్రీకాంత్ కీ కోపం వచ్చి వాడిని పక్కకు లాగి "నువ్వే కదా ఆ మాయ సాదువు" అని అడిగాడు అవును అన్నట్లు తల ఆడించాడు ముండి "ఆ జన్మలో వాళ్ళని చంపి మళ్లీ ఈ జన్మలో ఎందుకు వచ్చావు" అని అడిగాడు దానికి ముండి నవ్వుతూ "నేను వాళ్ల చావుకు మరణశాసనం రచించే కారణ రూపిని మాత్రమే కానీ వాళ్ళని చంపేది నువ్వే ఆ జన్మలో వాళ్ళని పశుపతి అవతారం లో శివుడు సంహరించాడు ఈ జన్మలో ఆ శివుడి అంశ లో పుట్టిన నువ్వు వాళ్ళని చంపుతావు మొన్న వాడు ఒక్కడు ఉంటే కూడా చంపడానికి ఎవరి వల్ల కాలేదు కానీ నువ్వు చేసిన ఆక్సిడేంట్ వల్లే ఎందుకు చనిపోయాడు ఆలోచించు" అని అన్నాడు దానికి శ్రీకాంత్ "లేదు నేను వాళ్ళని చంపను వాళ్లు నా కుటుంబం నా చేతులతో నా చెల్లి జీవితం నాశనం చేయలేను " అని అన్నాడు దానికి ముండి నవ్వుతూ "బంధుత్వం నీ చేతులు కట్టేసిన కాలం, విధి తమ ధర్మాలు అవి తప్పకుండా పాటిస్తాయి ప్రభు"అని చెప్పి వెళ్లిపోయాడు.

ముండి చెప్పింది విన్న శ్రీకాంత్ బాధ లో కార్ ఎక్కి హైదరాబాద్ బయలుదేరాడు ప్రయాణం లో ఆ రోజు రాత్రి జరిగిన సంఘటన గుర్తుకు చేసుకున్నాడు ఓల్డ్ సిటీ లో దొంగ నోట్ల చలామణి అవుతున్న ఇన్ఫర్మేషన్ మీద రైడ్ కీ వెళ్లాడు శ్రీకాంత్ తన టీం తో అక్కడ పెద్ద ఫైరింగ్ జరిగింది ఆ హడావిడి లో ఆ గ్రూప్ నాయకుడు తప్పించుకున్నాడు వాడిని ఛేజ్ చేస్తూ వెళ్లిన శ్రీకాంత్ కంట్రోల్ రూమ్ కీ ఫోన్ చేసి Ford Endeavour బ్లూ కలర్ కార్ ఎక్కడ వెళ్లుతుందో చెప్పమని ట్రాఫిక్ surveillance కీ చెప్పాడు అప్పుడు విద్యుత్ కూడా అదే మాడల్ కార్ లో ఉన్నాడు శ్రీకాంత్ కార్ నెంబర్ చూడలేదు దాంతో విద్యుత్ కార్ తను పట్టుకోవాల్సిన కార్ అనుకోని దాని రూట్ మ్యాప్ తీసుకొని అటు వైపు వెళ్లాడు విద్యుత్ తన పక్క సందులో వెళ్లుతున్నట్లూ మ్యాప్ లో చూపిస్తే దానికి ముందు వచ్చే సర్కిల్ లో దాని ఆప్పోచ్చు అని ఆ సర్కిల్ వైపు వేగంగా వెళ్లి విద్యుత్ కార్ కీ అడ్డుగా పెట్టాలి అనుకున్నాడు కానీ పొరపాటు గా కార్ నీ గుద్దీ ఆక్సిడేంట్ చేశాడు దాంతో విద్యుత్ చనిపోయాడు అది అంత గుర్తు తెచ్చుకున్న శ్రీకాంత్ కీ ఇందాక ముండి చెప్పిన మాట గుర్తుకు వచ్చింది విధి అనేది చేతులు కట్టుకుని కూర్చోదు అని దాంతో తరువాత ఎవరిని తను చంపుతానో అన్న భయం పట్టుకుంది శ్రీకాంత్ మనసులో.

విద్యుత్ దినం కార్యక్రమంలో ఉండగా మినిస్టర్ వచ్చి కమల్, ఆకాశ్ నీ ఓదార్చాడు పెళ్లి ఒక రెండు నెలల పాటు వాయిదా వేసి ఎన్నికల తరువాత గ్రాండ్ గా చేద్దాం అని అన్నాడు దానికి ఇద్దరు కూడా సరే అన్నారు ఆ తర్వాత ఎన్నికల కోసం ఇస్తా అన్న డబ్బు గురించి అడిగాడు మినిస్టర్ దానికి కమల్ "మీకు కావాల్సింది మీకు వస్తుంది భోజనం చేసి వెళ్ళండి" అని చెప్పాడు కమల్ గొంతు లో ఆవేశం అర్థం అయ్యింది మినిస్టర్ కీ అందుకే ఇంకో మాట మాట్లాడకుండా వెళ్లిపోయాడు ఆ తర్వాత కమల్ తన లారీ డ్రైవర్ ఒక్కడిని పిలిచి "ఈ రోజు ఎన్ని లోడ్ లు పోతున్నాయి" అని అడిగాడు దానికి అతను నాలుగు అన్నాడు దాంతో కమల్ ఆలోచించి "5 లారీలు తీసుకొని వెళ్లు నీలీకళ్ నుంచి అనంతపురం రూట్ వైపు వెళ్ళండి అక్కడి నుంచి హైదరాబాద్ దగ్గర అవుతుంది" అని చెప్పాడు అది అంత విన్న ఆకాశ్ షాక్ అయ్యి "రేయ్ పిచ్చి పట్టిన్నాదా ఏంది ఆ రూట్ మొత్తం సెక్యూరిటీ అధికారి చెక్ పోస్ట్ లు ఉన్నాయి పైగా ఎలక్షన్ టైమ్ దొరికితే 700 వందల కోట్లు మొత్తం పోతాయి " అన్నాడు దానికి నవ్వుతూ కమల్ "నాకూ తెలీదు ఆనుకుంటివా ఇప్పుడు ఆ వచ్చింది ఎవడు తెలుసా opposition పార్టీ వాడి డ్రైవర్ కానీ మన కింద పని చేస్తున్నాడు ఇప్పుడు వాడు నీలీకళ్ వైపు పోయి సెక్యూరిటీ ఆఫీసర్లకు దొరికి పోతాడు అప్పుడు మనం నల్లకలువ రోడ్డు లో బెంగళూరు హైవే నుంచి మంగళూరు పోయి ఆడ మన పోర్ట్ నుంచి container లో హైదరాబాద్ పోతాయి" అని చెప్పాడు ఇది విని ఆకాశ్ షాక్ అయ్యాడు.

ఇది ఇలా ఉంటే నిత్య శ్రీకాంత్ గురించి చెప్పాలి అని కీర్తన నీ పిలిచి చిన్న బుక్ లో నుంచి ఒక పేపర్ చింపింది కానీ ఇక్కడ ఎవరికి తెలియని విషయం ఏంటి అంటే నిత్య ఒక left hander అందుకే తనకు ఆక్సిడేంట్ చేసింది శ్రీకాంత్ అని రాసి కీర్తన కీ ఇచ్చింది కానీ నిత్య కీ తెలియనిది ఏంటి అంటే శ్రీకాంత్ కీర్తన అన్న అనే విషయం దాంతో తను ఆ లెటర్ కీర్తన కీ ఇచ్చి కమల్ కీ ఇవ్వు అనింది కీర్తన ఆ లెటర్ తీసుకొని కమల్ దగ్గరికి వెళ్లుతు ఏమీ రాసింది అని చూసింది ఆ లెటర్ చదివి కీర్తన షాక్ లో అలాగే ఉండిపోయింది ఆ చేతిలో లెటర్ ని గాలికి వదిలేసింది అది ఎగురుతు వెళ్లి సోఫా లో ఉన్న కమల్ మీదే పడింది.

కమల్ మీద ఆ లెటర్ పడగానే కీర్తన కీ ఒక్కసారిగా ఊపిరి ఆగినంత పని అయ్యింది కమల్ ఆ లెటర్ తీసుకొని చదివి వెనుక ఉన్న కీర్తన వైపు చూశాడు కీర్తన భయం తో వెనకు జరుగుతూ డైనింగ్ టేబుల్ కీ తగిలి ఆగిపోయింది అప్పుడు కమల్ ఆ లెటర్ తీసి కీర్తన కీ ఇచ్చి "ఇందులో ఏమీ రాసి ఉంది" అని అడిగాడు అప్పుడు కీర్తన షాక్ అయ్యి మళ్లీ పేపర్ వైపు చూస్తే అంతా ఇంగ్లీష్ లో ఉంది దాంతో కీర్తన "నీకు ఇంగ్లీష్ రాదా" అని అడిగింది దానికి కమల్ అవును అన్నట్లు తల ఆడించాడు దాంతో కీర్తన కొంచెం ఊపిరి పీల్చుకున్ని "ఏమీ లేదు అక్క కీ కొన్ని మందులు కావాలి అంటే అవే రాశాను అవును నువ్వు ఇంగ్లీష్ బాగానే మాట్లాడుతూ ఉంటావు కదా" అని అడిగింది అప్పుడు కమల్ కీర్తన చెవిలో "అది మా విద్యుత్ అన్న బ్లూ టూత్ నుంచి చెప్తే నేను దాని రివర్స్ లో చెప్పే వాడిని అంతే నాకూ ఇంగ్లీషు చదవడం రాయడం రాదు" అని చెప్పాడు అది విని షాక్ అయిన కీర్తన "మరి మనం కలిసి చూసిన సినిమాలు అని ఇంగ్లీష్ సినిమాలే కదా" అని అడిగితే "నేను వచ్చింది దాంట్లో ఫైట్స్, ఛేజ్ సీన్స్ చూడడానికి అంతే" అని చెప్పాడు ఇది అంత విన్న కీర్తన కు నవ్వు వచ్చింది కానీ నిత్య ఇక్కడే ఉంటే తన అన్న కు ప్రమాదం అని గుర్తు వచ్చి "కమల్ అక్క కీ ఇక్కడి కంటే లండన్ లోనే మంచి ట్రీట్మెంట్ వస్తుంది తనని లండన్ పంపితే మంచిది అని నా అభిప్రాయం ఒక డాక్టర్ గా చెబుతున్నా అర్థం చేసుకో" అని చెప్పింది కీర్తన దాంతో కమల్ కీ కూడా ఇదే కరెక్ట్ అనిపించింది అంతే సాయంత్రానికి ఒక ఫ్లయిట్ బుక్ చేసి దాంట్లో నిత్య నీ తిరిగి పంపించాడు వెళ్లే ముందు తనకు మాట ఇచ్చాడు విద్యుత్ నీ చంపిన వాడిని తీసుకొని వచ్చి తన ముందే ముక్కలు ముక్కలుగా నరికి చంపుతా అని అది విని నిత్య సంతోషంగా వెళ్లింది కానీ కీర్తన మనసు ఏదో కీడు శంకించింది.

మరుసటి రోజు ఉదయం వాళ్ల అమ్మ నీ కలిసి వస్తా అని చెప్పి హైదరాబాద్ వెళ్లింది కీర్తన కానీ తను వెళ్లింది శ్రీకాంత్ కోసం చూస్తే ఇంట్లో లేడు కమిషనర్ ఆఫీసు లో ఉన్నాడు అని తెలిసి వెళుతుంది అక్కడ ఏదో మీటింగ్ లో ఉన్నాడు శ్రీకాంత్ కానీ కీర్తన రావడం చూసి ఒక 10 నిమిషాల పాటు బ్రేక్ తీసుకున్నారు అప్పుడు కీర్తన ఆవేశం లో వచ్చి శ్రీకాంత్ నీ లాగి కొట్టింది అప్పుడు తన పక్కన కానిస్టేబుల్స్ కీర్తన మీదకు వస్తే శ్రీకాంత్ వాళ్ళని ఆపి నా చెల్లి అని చెప్పి కాఫీ పంపించమని వాళ్ళని బయటికి పంపాడు ఆ తర్వాత కీర్తన ఎందుకు వచ్చిందో శ్రీకాంత్ కీ అర్థం అయ్యి విద్యుత్ ఎలా చనిపోయాడు అని క్లియర్ గా చెప్పాడు తను కావాలి అని చేయలేదు అని చెప్పి తనను క్షమించమని ప్రాధేయపడాడు కానీ ముండి గురించి తన వల్ల ఆకాశ్ కీ కమల్ కీ ఉన్న ప్రమాదం గురించి చెప్పలేదు ఎక్కడ కీర్తన ఇంకా ఎక్కువ కంగారు పడుతుందో అని ఆ తరువాత కీర్తన కీ కొన్ని ఫోటోలు ఇచ్చి కమల్ నీ divert చేయమని చెప్పాడు దాంతో కీర్తన అన్న మీద ప్రేమతో భర్త మీద భయం తో దానికి ఒప్పుకుంది అలా ఆ ఫోటో లో లాలా తమ్ముడూ ఉన్నాడు ఆ ఫోటో తో కీర్తన తిరిగి బెంగళూరు వెళ్లింది.

కీర్తన ఇచ్చిన ఫోటో నీ ముంబై లో తన అండర్ లో ఉన్న లాలా rival గ్యాంగ్ కీ పంపించి వాడిని లేపేయమని చెప్పాడు ఒక వెళ్ల దొరికితే బెంగళూరు తీసుకోని రమ్మని చెప్పాడు అప్పుడు మినిస్టర్ నుంచి ఫోన్ వచ్చింది కమల్ కీ విజయవాడ లో ఇద్దరు sitting ఎంఎల్ఏ లు తమ పార్టీకి కీ అడ్డు వచ్చేలా ఉన్నారు అని వాళ్ళని ఏదో ఒకటి చేయమని చెప్పాడు దాంతో కమల్ ఆ ఎంఎల్ఏ లు సొంతం పెద్దమ్మ, పిన్నమ్మ పిల్లలు అని తెలుసుకొని వాళ్ల దగ్గరికి ఆకాశ్ నీ పంపి మొదటి అతని pa కీ ఒక 4 కోట్లు ఇచ్చి ఏమీ మాట్లాడకుండా వచ్చేయమని చెప్పాడు ఆ తర్వాత కమల్ రెండో అతనికి ఫోన్ చేసి మీ అన్నయ్య కీ పార్టీ ఫండ్ ఇచ్చాము మాకు విజయవాడ లో ఒక రెండు ఫ్యాక్టరీ లు పెట్టడానికి పర్మిట్ ఇప్పించమని అడిగాడు దాంతో రెండో అతను నాలుగు కోట్ల గురించి ఫోన్ చేస్తే ఆ నాలుగు కోట్ల గురించి తెలియని మొదటి ఎంఎల్ఏ తెలియదు అని చెప్పాడు తనకు వాటా ఇవ్వాలి అని భయం తో ఇలా చెప్పాడు అనుకోని రెండో అతను ఈ విషయం బయటకు పంపితే మొదటి అతను జైలు కు పోతాడు ఫ్యాక్టరీ లో కమిషన్ నొక్కేయచ్చు అని ప్లాన్ చేసి ఆ విషయం మీడియా కీ లీక్ చేశాడు రెండో అతను మొదటి వ్యక్తి తక్కువ వాడు కాదు రెండు అతని అక్రమాల గురించి చెప్పాడు దాంతో ఇద్దరు జైలు కు వెళ్లి disqualify అయ్యారు.

అప్పుడు ముంబై లో లాలా తమ్ముడూ దొరికితే వాడిని బెంగళూరు తెచ్చి కమల్ కీ అప్పగించారు వాడిని కమల్ రేస్ క్లబ్ లో అడవి గుర్రాల తో తొక్కించీ torture పెట్టాడు కానీ వాడు భయం లేకుండా నవ్వుతూ "రేయ్ నీ అన్న మీద ఎటాక్ చేసింది మేమే కానీ వాడిని చంపింది ఒక సెక్యూరిటీ అధికారి వాడు ఎవడో నాకూ మాత్రమే తెలుసు" అని అన్నాడు దాంతో కమల్ వాడి దగ్గరికి వచ్చి అడిగాడు కానీ వాడు తన మెడలో ఉన్న సైనైడ్ మింగి చనిపోయాడు, దాంతో వెంటనే కమల్ శ్రీకాంత్ కీ ఫోన్ చేశాడు శ్రీకాంత్ ఫోన్ ఎత్తగానే "మా అన్న నీ చంపింది ఒక సెక్యూరిటీ అధికారి వాడు ఎవ్వడో నాకూ 48 గంటల్లో కావాలి లేదు అంటే హైదరాబాద్ లో ఆ తర్వాత గంట నుంచి గంట కు ఒక సెక్యూరిటీ అధికారి శవం మీ సెక్యూరిటీ ఆఫీసర్లకు దొరుకుతుంది" అని చెప్పాడు కమల్ ఇది విన్న శ్రీకాంత్ కంగారు తో భయం తో ఏమీ చేయాలో తెలియక అయోమయానికి గురయ్యాడు.

కమల్ నుంచి ఫోన్ వచ్చిన తర్వాత శ్రీకాంత్ ఆలోచన లో పడ్డాడు ఎలా కమల్ నీ divert చేయాలి అని అలా ఆలోచిస్తూ ఉండగానే ఒక రోజు అయిపోయింది కమల్ ఇంట్లో శ్రీకాంత్ ఫోన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు అప్పుడు శ్రీకాంత్ నుంచి ఫోన్ వచ్చింది దాంతో కమల్ ఆవేశం గా ఫోన్ ఎత్తగానే "వాడు దొరికాడు ఎక్కడికి తీసుకోని రావాలి" అని అడిగాడు శ్రీకాంత్ దాంతో కమల్ మైనింగ్ సైట్ కీ తీసుకోని రమ్మని చెప్పి ఫోన్ పెట్టి ఆవేశం గా బయలుదేరారు ఆకాశ్, కమల్ ఇద్దరు త్రిపుర వెళ్లారు ఇక్కడ కీర్తన భయం తో దేవుడి రూమ్ లోకి వెళ్లి తన అన్నకు, భర్త కు ఎవరికి ఏమీ కాకుండా చూడమణి వేడుకుంది. ఆకాశ్, కమల్ ఇద్దరు త్రిపుర వెళ్లేసరికి అక్కడ శ్రీకాంత్ ఒక్క సెక్యూరిటీ అధికారి వాడి చేతులు నోరు కట్టెసి తీసుకోని వచ్చి పడేశాడు ఆ తర్వాత వాడిని కమల్ ముందు పడేసి వాడు ఆక్సిడేంట్ స్పాట్ లో ఉన్నట్లు cctv వీడియో చూపించాడు దాంతో ఆకాశ్ విజిల్ వెయ్యగానే మొత్తం మైనింగ్ సైట్ లో ఉన్న వాళ్ళ మనుషులు అంతా రాళ తో ఆ పోలీసోడు మీద దాడి చేశారు అప్పుడు వాడు ఆ రాళ్ల దెబ్బలు తట్టుకోలేక శ్రీకాంత్ దగ్గరికి వెళ్ళి వాడి గన్ తీసుకోని శ్రీకాంత్ నీ కాల్చాడు అది శ్రీకాంత్ చేతికి తగిలింది దాంతో కమల్ తిరిగి వాడిని కాల్చే లోపు వాడే గన్ తలకు పెట్టుకొని కాల్చుకొని చనిపోయాడు వాడు చనిపోయిన తర్వాత ఆకాశ్ కీ కోపం తగ్గక పోయేసరీకి ఒక గునపం తెచ్చి వాడిని పొడిచి పొడిచి తన కోపం తీర్చుకున్నాడు ఈలోగా కమల్ శ్రీకాంత్ నీ కార్ లో హాస్పిటల్ కీ తీసుకోని వెళ్లాడు.

కార్ సైడ్ అద్దం నుంచి చనిపోయిన వాడిని చూస్తూ కళ్లు మూసుకుని ఉన్నాడు శ్రీకాంత్ ఆ తర్వాత తను చేసిన పని ఒక్కసారి తన కళ్ల ముందు కదిలింది ఆ చనిపోయిన వాడు సెక్యూరిటీ అధికారి కాదు నెల క్రితం శ్రీకాంత్ అరెస్ట్ చేసిన డ్రగ్స్ డీలర్ కమల్ ఇచ్చిన వార్నింగ్ కీ ఏమీ చేయలేని పరిస్థితి లో ఉన్న శ్రీకాంత్ కీ వీడిని ఎన్కౌంటర్ చేయమని ఆర్డర్ వచ్చింది దాంతో వాడిని భయపెట్టి వాడు ఒక సహాయం చేస్తే వాడికి సెక్యూరిటీ అధికారి ప్రొటెక్షన్ ఇచ్చి informer గా పెట్టుకుంటాను అని చెప్పి మొన్న sezie చేసిన దొంగ నోట్లు తెచ్చి వాడికి 40 లక్షలు అడ్వాన్స్ కింద ఇస్తున్నట్లు నమ్మించి వాడిని తీసుకోని కమల్ దగ్గరికి వెళ్ళాడు సెక్యూరిటీ ఆఫీసర్లు చావడం కంటే ఒక క్రిమినల్ చావడమే మేలు అనుకున్నాడు శ్రీకాంత్ అందుకే వాడికి సెక్యూరిటీ అధికారి లాగా కటింగ్ చేయించి సెక్యూరిటీ అధికారి డ్రస్ వేసి వాడి ఫోటో నీ తన మొహం తో ఫోటో షాప్ చేసి తన బదులు వాడిని బలి ఇచ్చి తన బావ నీ శాంతి చేయాలని ప్లాన్ చేశాడు అసలు విషయం తెలియకుండా వచ్చిన ఆ క్రిమినల్ రాళ్ల దెబ్బ పడగానే తన చావు కనిపించడం మొదలు అయ్యింది అందుకే శ్రీకాంత్ నీ కాల్చి ఆ నరకం అనుభవిస్తు చచ్చే బదులు తనే చావడం మంచిది అనుకోని తనని తాను కాల్చుకొని చనిపోయాడు ఇలా తను అనుకున్నది అనుకున్నటు జరిగినందుకు శ్రీకాంత్ ఊపిరి పీల్చుకున్నాడు బుల్లెట్ దిగడం కూడా మంచిదే అనుకున్నాడు.

అక్కడ మైసూర్ రాజా తన కొడుకు కు జరిగిన దానికి పగ తీర్చుకోవాలి అని చెప్పి అక్బర్ తో కీర్తన కోసం కమల్ ఇది చేశాడు కాబట్టి తన పరువు బజారు పాలు అవ్వాలి అని చెప్పాడు దానికి అక్బర్ ముందు వెనుక ఆలోచించకుండా ఆవేశము లో కమల్ ఇంటికి వెళ్లాడు కానీ అప్పటికే శ్రీకాంత్ హాస్పిటల్ లో ఉన్నాడు అని ఫోన్ రావడంతో కీర్తన హాస్పిటల్ కీ బయలుదేరింది కీర్తన బయటకు వెళ్లడం చూసిన అక్బర్ తనని ఫాలో అవుతూ వెళ్లాడు దారి opposite నుంచి వచ్చి తన కార్ నీ కీర్తన కార్ కీ అడ్డు పెట్టాడు ఆ తర్వాత కీర్తన బయటికి లాగి రేప్ చేయడానికి చూశాడు కానీ అదే దారిలో హాస్పిటల్ కి వెళ్లుతున్న ఆకాశ్ వచ్చి కీర్తన నీ కాపాడాడు కాకపోతే ఆ గొడవ లో అక్బర్ ఆకాశ్ నీ పొడిచి పారిపోయాడు అప్పుడు కీర్తన ఆకాశ్ కీ ఫస్ట్ ఎయిడ్ చేసి హాస్పిటల్ కి తీసుకోని వెళ్లి జరిగింది అంతా కమల్ కీ చెప్పి గట్టిగా కమల్ నీ కౌగిలించుకుని ఏడుస్తు ఉంది దాంతో కమల్ అక్బర్ కోసం వెళ్లాడు అప్పుడు ఫస్ట్ ఎయిడ్ తరువాత ఆకాశ్ తన రూమ్ కిటికీ దగ్గర సిగరెట్ తాగుతు ఉన్నాడు అప్పుడే శ్రీకాంత్ అమ్మ, వాళ్ల భార్య ఇంకా కొడుకు వచ్చారు వాళ్లు వచ్చిన కార్ నెంబర్ వైపు చూసి మళ్ళీ అనుమానంతో ఆ కార్ వైపు చూస్తే అది ఇందాక శ్రీకాంత్ చూపించిన cctv వీడియో లో ఉన్న కార్ నెంబర్.​
Next page: Update 05
Previous page: Update 03