Update 08.2
సౌజన్య మేడమ్ కేబిన్ దగ్గరకి వెళ్ళి డోర్ తట్టి
“ Excusemi మేడమ్ , may I come in !”అని అంటే లోపల నుంచి
“ yes !!”అని అనడంతో నేను డోర్ తీసుకొని లోపలికి వెళ్ళాను . నేను వెళ్ళగానే ఆ డోర్ మూసుకున్నాక నేను ఆమె టేబల్ దగ్గరకి వెళ్తూ ఉంటే సౌజన్య మేడమ్ నాతో
“రండి .... Sir ..... రండి .....
నేను వచ్చి ఇంత సేపు అయ్యాక కూడా ఇంకా రాలేదని అనుకుంటూ ఉన్నా ,
అప్పుడే వచ్చేశారే , అయ్యాయ అమ్మాయిలతో కబుర్లు
“అంటే మేడమ్ , ఏదో పరిచయం చేసుకుందామని” అని అంటే ఆమె
“రండి వచ్చి కూర్చోండి... అలా నిలబడి మాట్లాడుతున్నారే ”
అని వ్యంగ్యంగా అంటూ “తమరి దగ్గర ఈ టాలెంట్ కూడా ఉందా”
“ఎం టాలెంట్ మేడమ్ !”
“వచ్చీ రాగానే అమ్మాయిలతో కబుర్లు , ఏంటి లైన్ లో పెడుతున్నవా !”
“అలాంటిది ఏమీ లేదు మేడమ్”
“ఏదో నీ ప్రెసెంటేషన్ బాగా నచ్చి మా కంపనీ కి బాగా సపోర్ట్ ఇస్తావని జాబ్ ఇస్తే …… నువ్వేమో అమ్మాయిలతో ....”
“మేడమ్ అలాంటిది లేదు ...... నమ్మండి” అని నేను అనగానే తన ఫేస్ ఫీలింగ్ వెంటనే మార్చేసి మెత్తగా ఒక జీర గొంతుతో నాతో
“సరే .... నిన్ను కాక ఇంకెవరిని నమ్ముతా బావ !” అని అనింది .
బావ అని అనడంతో నేను కొంచెం షాక్ అయ్యి ఆమెతో
“బావ .... ఎవర్ని మేడమ్”
“ఇంకెవర్ని బావ , నిన్నే ...... అయినా మనిద్దరమేగా ఇక్కడ ఉన్నాం , మరి మేడమ్ అంటావే ..... సౌజన్య అనో లేక సౌజి అనో పిలవోచ్చుగా !”
అని అంటూ ఉంది.
ఆమె మాటలు విని నా మనసులో నేను “ అమ్మో .... ఇదేదో తేడాగా ఉంది .. ఎందిరా నా కర్మ ఇలా తగలాడింది” అని అనుకుంటూ ఆమెతో
“మేడమ్ , నా పరిస్తితి నాకే అర్ధం కాటంలేదు ...... దయచేసి నేను ఎందుకు వచ్చానో చెపుతా”
అని అంటూ ఉంటే ఆమె
“అంత తొందరైతే ఏలా బావ !!! నీ మరదలు చెప్పేది వినొచ్చుగా!!!”
అని బుంగమూతి పెడుతూ ముద్దు ముద్దుగా అడుగుతూ ఉంటే మళ్ళీ నేను నా మనసులో
“ఈవిడ ఏంటి , ఇలా పిలుస్తూ ఉంది,
నా దరిద్రం ఇంతేనేమో !
ఎలాగోలా ఈమెని request చేసి అడ్వాన్స్ తీసుకోవాలి ”
అని అనుకోని
“మేడమ్ నాకు కాస్త అడ్వాన్స్ ఇప్పించండి .... చాలా అవసరం”
“ఎందుకు ఫ్రెండ్స్ కి పార్టీ ఇవ్వాల ?”
“ఫ్రెండ్స్ ఆ .. హుమ్ .... నా మొహానికి ఫ్రెండ్స్ కూడానా ! అలాంటిది ఏమీ లేదు మేడమ్”
“మరి నువ్వు తాగడానికా !”
“అలాంటి అలవాట్లు నాకు లేవు మేడమ్ .... వేరే పర్సనల్ విషయం లో డబ్బు అవసరం”
“పర్సనల్ ఆ ....
రాత్రి నీ పర్సనల్ లో ఎం జరిగిందో నాకు తెలియదనుకున్నావా......
పర్సనల్ అంట పర్సనల్ ......
మూసుకొని చెప్పరా ”
అని కొంచెం కోపంతో అనింది.
ఆమె చెప్పింది నిజమే. నిన్న రాత్రి జరిగిన దానికన్నా ఇంకా వేరే పర్సనల్ ఏముంటుంది .
సరే నిజం చెప్పదాం అని అనుకొంటుంటే ఆమె మళ్ళీ నాతో
“సరే దేనికోచెపితే అప్పుడు ఇప్పించాలో లేదో చెపుతా” అని అంటే నేను
“ రాత్రి స్వర్ణ మేడమ్ .....” అని అంటూ ఉంటే మద్యలో కల్పించుకొని
“హలో , మిస్టర్ .....
మేడమ్ గీడం అని అనకుండా నువ్వు ఎలా పిలుస్తావో అలానే పిలువు .....
ఇక్కడ మనిద్దరమే ఉన్నాం”
అని అంటే నేను “ సరే ..... రాత్రి నా స్వర్ణ ......” అని అంటూ ఉంటే మళ్ళీ మద్యలో కల్పించుకొని
“స్వర్ణ నుంచి నేరుగా ‘నా స్వర్ణ’ చాలా ఉందే” అని అనింది.
“మేడమ్ ... చెప్పనిస్తారా లేదా ” అని కొంచెం కోపంతోనే అన్నా .
అందుకు ఆమె
“సరే .... ఆ కోపం కాస్త తగ్గించి చెప్పు” అని నా మాటలు వినసాగింది.
నేను ఆమెతో
“రాత్రి నా స్వర్ణ నన్ను తన మెడలో తాళికట్టి నన్ను తన సొంతం చేసుకోవాలని ఆశ పడింది”
అని నేను అంటే సౌజన్య ఆశ్చర్యం తో
“అమ్మో ! తాళే ..... కట్టావా ?” అని నాతో అని
తన మనసులో “ దొంగ లంజా, నాకు ఈ విషయం చెప్పలేదే ! చెపుతా దాని సంగతి” అని అనుకుంది.
నేను ఆమెతో “ లేదు , తాళి కట్టాలంటే నా మనసు అంగీకరించలేదు”
“అంత ఆశగా అడిగితే ఎందుకు కట్టలేదు ...... తాను ఎంత ఫీల్ అయ్యుంటుందో..... చ” అని చెప్పి
తన మనసులో “తాళి కట్టలేదని బాద పడే నాతో చెప్పలేదేమో .... చ ... అనవసారంగా తిట్టుకున్నానే ..... సారీ స్వర్ణ” అని అనుకుంది .
ఆ తరువాత నేను
“ఎందుకో నాకే తెలియదు మేడమ్ ...... నేను కట్టలేదని చాల బాద పడింది.
తన బాద చూసి నా స్వర్ణ ప్రేమకి ప్రతిఫలంగా ఏదో ఒకటి చేయాలని నా జీతంతో ఒక గోల్డ్ చైన్ తనకి కొనివ్వాలని అనుకుంటున్నా.
అందుకే 10,000 అడ్వాన్స్ కావాలి మేడమ్”
“నీకేమైనా పిచ్చా , 10,000 తో చైన్ కొనిస్తే ఆంటీ తీసుకుంటుంది అని అనుకున్నావా !
మా ఆంటీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంతో తెలుసా ?
అసలు తన రేంజ్ ఏంటో తెలుసా ?
తన కంపెనీ వీక్లీ టర్నోవర్ ఎంతో తెలుసా ! దాదాపు రెండు వందల కోట్లు.
తొక్కలో ఒక 10,000 పెట్టి గోల్డ్ చైన్ కొనిస్తే అది సంతోష పడుతుంది అనుకున్నావా !”
“మీరు చెప్పేదాకా తను అంత రిచ్ అని తెలియదు మేడమ్
కానీ , తనకి ఎంత ఆస్తి ఉన్నా ఆ అస్తితో నాకు అనవసరం లేదు
నాకు కావలసింది నా స్వర్ణ ప్రేమ , తన మనసు సంతోషంగా ఉండటం .
నేను ఇచ్చే ఆ 10,000 లతో కొన్న గోల్డ్ చైన్ తన మనసుకి సంతోషాన్ని ఇస్తుంది”
“అబ్బా ...... అంత కరెక్ట్ గా ఎలా చెప్పగలవ్ ? తన గురించి అంత తెలుసా !”
“తన గురించి ఏమీ తెలియదు .. .. కానీ మేడమ్ , నా స్వర్ణ మనసు మాత్రం నాకు తెలుసు .
తాను నేను తెచ్చే వస్తువు విలువ చూడదు ..
నా స్వర్ణ ఎప్పటికీ నా మనసుని మాత్రమే చూస్తుంది . అదే నా నమ్మకం”
అని అంటే నా మాటలకి ఆమె ఆ కుర్చీ లోనుంచి పైకి లేచి నాతో
“నచ్చావు బావ !
ఇందుకేరా నిన్ను నా మనసు బావ బావ అంటూ ప్రేమగా పిలిచేది ......
పో వెళ్ళి తీసుకో నీ 10,000 తీసుకో ....”
అని అప్పుడే ఎవరికో ఫోన్ చేసి కాష్ తెప్పించి నా చేతికి ఇచ్చింది.
నాకు అడ్వాన్స్ ఇచ్చినందుకు సంతోషంతో ఆమెతో
“చాల థాంక్స్ మేడమ్ , నా అవసరం అర్ధం చేసుకున్నందుకు”
అని చెప్పి ఆ రూమ్ నుంచి వెళుతుంటే
నాతో చివరిగా
“ రవీ ..... ఇదే ప్రేమతో నా ఆంటీ ని కాదు నీ స్వర్ణ ని జీవితాంతం ప్రేమగా చూసుకోవా”
“నా ఊపిరి ఉన్నంత వరకు నా స్వర్ణని వదిలి పెట్టను” అని మనసారా చెప్పాను.
అప్పడు సౌజన్య నా కళ్ళలోకి చూస్తూ “లవ్ you బావ !” అని ఎంతో ప్రేమగా చెప్పింది.
ఆమె నుంచి ఆ మాట ఊహించని నేను ఆమెనే చూస్తూ ఉన్నా.
సౌజన్య మేడమ్ చెప్పిన ఆ మాట కచ్చితంగా తన మనసులో నుంచి వచ్చిందని ఆమె కళ్ళని చూస్తేనే అర్ధం అవుతుంది. తను ‘లవ్ you’ చెపితే నాలో ఏదో తెలియను అనుభూతి కలిగి తనని చూస్తూ ‘ ఈ మాట నా జీవితంలో ఏ మార్పు తీసుకొస్తుందో’ అని మనసులో అనుకుంటూ ఆమెనే చూస్తూ మౌనంగా ఆ సౌజన్య ఛాంబర్ నుంచి బయటికి వచ్చాను.
అలా బయటికి వచ్చి నేరుగా ఒక గోల్డ్ షోరూం కి వెళ్ళి నా మనసుకు నచ్చిన , స్వర్ణకు నొప్పే ఒక సన్నని బంగారు గొలుసు చూసా . అది సరిగా 9999 ధర ఉంది. నేను అనుకున్నట్టుగా ఆ చైన్ ని నా జీతం అడ్వాన్స్ డబ్బులతో కొనుక్కొని సంతోషంతో నాకోసం ఒక అద్దె ఇంటిని వెతకడానికి నా నడక సాగించా.
అలా రవి తనకోసం ఒక అద్దె ఇల్లు వెతుక్కుంటూ ఉంటే , మరో పక్క రవికి కాబోయే కొలీగ్స్ అయిన సరిత , నికితలు వాలా ఆఫీసు ఛాంబర్ లో మాట్లాడుకుంటూ ఉన్నారు
ముందుగా సరిత నికితతో
“చూశావా నిక్కి, ఆ రవి ఇంకా జాబ్ లో జాయిన్ అవ్వలేదు అప్పుడే నీకు లైన్ వేస్తున్నాడు”
“లైన్ వేస్తే వెయ్యని .... నికేమమ్మ నొప్పి”
“ఏందే అలా అంటున్నావ్ ..... నచ్చాడా”
“చాలా ....”
“అంతలా ఏమి నచ్చిందే..... పెద్ద కండలు కూడా లేవు పైగా నీ రంగు కూడా కాదు ”
“రంగు , కండలు కాదక్కా కావాలిసింది మనసు , తనని చూస్తుంటేనే తెలుస్తుంది చాల మంచి వాడని , అది చాలదా”
“ఏమోనమ్మ నీ మనసు నీ ఇస్టం” అని నికితకి చెప్పి
తన మనసులో
“ఇది చెప్పింది నిజమే ,అబ్బాయిలో ఉండాల్సింది కండలు, రంగు కాదు మనసు .... మంచితనం
అయినా దీన్ని అని ఏమి ..... వాడిని చూస్తే పెళ్ళయిన నాకే మనసు పీకేస్తుంది
మనిషి రంగు తక్కువ అయినా ఆ ముఖంలో ఏదో తేజస్సు . కళగా ఉండే మొహం .
ఎందుకో రవి మీద మనసు మల్లుతూ ఉంది !
చూద్దాం ఈ అనుభూతి ఏవైపుకు దారితీస్తుందో !
మా ఇద్దరి జీవితంలో వీడి పాత్ర ఎలా ఉందో !”
అని అనుకుంటూ తన పనిలో లీనమైంది.