Update 09.1
( రవి మాటలలో )
స్వర్ణ కోసం బంగారు గొలుసు తీసుకున్న నేను అద్దె ఇంటి కోసం వెతుకుతూ ఉన్నా. మద్యానం ఇంకా అన్నం కూడా తినలేదు. తినాలని అనిపించడంలేదు. ఎలాగైనా ఈ రోజు ఒక్క మంచి ఇల్లు వెతికి పట్టుకోవాలని గట్టిగా నిర్ణయయించుకున్నా. మా కంపెనీ కి దగ్గరలో ఉన్న ప్రతి వీది వీది నడుచుకుంటూ వెతుకుతూ ఉన్నా. నా దరిద్రం కొద్ది ఇప్పటిదాకా ఒక్క ఇంటికి to-let బోర్డు పెట్టలేదు. నాలో ఓపిక చచ్చిపోతుంది.
చాలా సేపటినుంచి నడిచి నడిచి నాలో శక్తి మొత్తం హరించింది. ఇక ఎక్కువ దూరం నడిచే ఓపిక లేక అక్కడ ఉన్న ఓ చెట్టు నీడలో నిలబడి నేను తెచ్చుకున్న మంచి నీళ్ళు తాగుతూ నాకు ఎదురుగా ఉన్న ఓ ఇల్లు చూసా.
ఆ ఇంటి గేట్ కు ఒక To-let బోర్డు తగిలించి ఉంది. దాన్ని చూడగానే ‘ఇంత సేపు నేను పడిన శ్రమకి మొదటి ఫలితం దొరికింది’ అని అనుకోని సంతోషంతో ఓ బలమైన నిట్టూర్పు వదిలి రోడ్డు దాటుతూ ఆ ఇంటి వైపు వెళుతున్నా.
నా కర్మ కొద్ది ఆ ఇంట్లోనుంచి ఒక ఆమె వచ్చి ఆ గేట్ కి ఉన్న to-let బోర్డు ని తీసేస్తున్నారు. చేతిదాక వచ్చిన అవకాశం చేజారీ పోయిందని నిరాశపడి చివరిగా ఇంకా ఏదైనా అవకాశం ఉంటుడేమో అన్న తలంపుతో ఆమె ఎందుకు ఆ tolet బోర్డు ని తీసేస్తున్నదో తెలుసుకోవాలని ఆ ఇంటి దగ్గరకి వెళ్ళాను.
నేను వెళ్ళేటప్పటికే ఆమె ఇంట్లోకి వెళుతూ ఉంది. అలా వెళుతున్న ఆమెని గేట్ బయట నుంచి
“ ఎక్స్క్యూస్ మీ మేడమ్”
అని పిలవగానే ఇంట్లోకి పోతున్న ఆమెకి నా మాటలు వినిపించి ఒక చేతిలో ఆ tol-et బోర్డు పట్టుకునే నన్ను చూసింది. నేను మొదటి సారి ఆమెని ముందువైపు నుంచి చూసా. ఇందాక దూరం నుంచి చూసి చాలా వయస్సు ఉన్న ఆమెలా అనిపించింది.
కానీ ఇప్పుడు ముందునుంచి దగ్గరగా చూస్తూ ఉంటే తెలుస్తుంది ఆమెకి పెద్ద వయస్సు అవ్వలేదని. ఆమెకి ఓ 35 సంవత్సరాల వయసు ఉండవచ్చ. మరి తెల్లగా కాకుండా కొద్దిగా తెలుపు రంగులో , నా కన్నా కొద్దిగా ఎత్తుగా ఉంది. ఆమె మొహం చాలా చక్కగా అందంగా ఉంది. కానీ ఆ ముఖం లో ఒక గాంభీర్యం దాగి ఉంది. ఆ గాంభీర్యం చూసిన ఎవరైనా ఆమెతో మర్యాదగా ఉండాలని అనుకుంటారు.
ఆమె మరి లావుగా లేదు . అలాగని సన్నగా లేదు కానీ బాగా కండ పట్టి ఉంది. కానీ ఆ కండ ఎక్కడ ఉండాలో అక్కడే ఉంది. అనవసరమైన కొవ్వు బాగాలు ఎక్కడా లేవు.
ఒక్క మాటలో చెప్పాలంటే ఆమె నన్ను గాని ఒక్క గుద్దు గుద్దితే నేను కచ్చితంగా నేలను కరుచుకునేలా ఉంది . ఇవన్నీ ఆమెలో పైకి కనిపించే విషయాలే. కానీ నా మనసుకు ఎందుకో ఆమె బయటకి కనిపించే మనిషి కాదని , ఆమె లోపల చాలా మృదువైన మనిషి దాగి ఉన్నదని చూస్తుంటే నాకు అర్ధమవుతూ ఉంది.
ఇవన్నీ ఆమె గేట్ దగ్గరకి వచ్చే సమయంలోనే నా మనసులో వచ్చిన ఆలోచలు. ఆమె నా దగ్గరకి వచ్చి
“ఎవరు మీరు మీకు ఎం కావాలి?” అని అడిగితే నేను
నమస్తే మేడమ్, ఇందాక ఆ చెట్టు కింద నిలచిని నీళ్ళు తాగుతుంటే మీ ఇంటి గేట్ కి to-let బోర్డు కనిపించింది.
తీరా ఇక్కడికి వచ్చేటప్పటికి మీరు ఆ బోర్డు తీసేశారు.
నేను అద్దె ఇల్లు కోసం వెతుకుతూ వచ్చాను. అందుకే మిమ్మల్ని పిలిచింది.
ఇంకా ఇల్లు ఖాళీ గా ఉందా మేడమ్?
అని చెప్పాను. నేను చెప్పిన మాటలు విని ఆమె నాతో
నీకేదో లక్కుంది, అందుకే దాదాపు నెల రోజుల నుంచి to-let బోర్డు పెడితే చాలా మంది చూసి నచ్చక వెళ్లిపోయారు.
ముందు ఫ్యామిలీ కె ఇద్దాం అని అనుకున్నాం కానీ ఎవ్వరూ చెరక పోయేసరికి బ్యాచ్చలర్స్ కి కూడా ఇద్దాం అని అనుకున్న వచ్చే వాళ్ళ అవతారం చూసి ఇవ్వాబుద్ది కాలేదు.
అందుకే ఇక ఎవ్వరికీ అద్దెకి ఇవ్వకుండా ఈ to-let బోర్డు ని తీస్తుంటే నువ్వు చివరిగా వచ్చావు.
నిన్ను చూస్తే బుద్ది మంతుడిలాగే ఉన్నావ్. పద్దతిగా ఉంటాను అంటే ఇల్లు అద్దెకి ఇస్తా. ఏమంటావ్ ?
“మీకు ఎలాంటి ఇబ్బంది రాకుండా పద్దతిగా ఉంటాను మేడమ్”
“ఆ అందరూ ఇదే మాట అంటారని పక్కింటి పిన్ని గారు ఎప్పుడూ చెపుతుంటారు, అందుకే ఆవిడ బ్యాచ్చలర్స్ కి ఇల్లు ఇవ్వదు”
“నేను అలాంటి వాడిని కాదు మేడమ్, మీరు చెప్పినట్టే పద్దతిగా ఉంటాను”
“పద్దతి అంటే , తాగుడు, సిగరెట్లు లాంటి అలవాటు ఏమి ఉండకూడదు, నీకోసం ఫ్రెండ్స్ ఎవ్వరూ రాకూడదు. ముక్యంగా గర్ల్ ఫ్రెండ్స్”
“నేను ఈ సిటీకి కొత్త మేడమ్, ఇక్కడ నాకు ఎవ్వరూ ఫ్రెండ్స్ లేరు. గర్ల్ ఫ్రెండ్స్ అస్సలే లేరు”
“సరే చెపుతున్నావుగా చూస్తా. అలా కాకుండా పద్దతిగా ఉండలేదని తెలిస్తే ఇంటినుంచి గెంటేస్తా”
“అంత దూరం రానివ్వను మేడమ్ మీరే చూస్తారుగా”
“చూస్తా , సరే ఆ పక్కన ఉండేదే నువ్వు ఉండబోయే ఇల్లు . ఇల్లు చిన్నది కాస్త పాత కాలం ఇల్లు. వెళ్ళి చూసి చెప్పు” అని అక్కడ ఇంట్లోకి వెళ్ళే మెట్ల మీద కూర్చుంది.
ఆమె చెప్పగానే నేను ఆ ఇంటి వైపు వెళ్ళాను. ఆ ఇల్లు తూర్పు వాకిలి. ఆమె చెప్పినట్టు ఆ ఇల్లు చిన్నదే. లోపలకి వెళ్ళి చూసా కొత్తగా paint చేసినట్టు ఉన్నారు. ఆ ఇంట్లో ఒక కిచెన్ , హాల్ లాగా గది. వాటితో పాటు ఒక చిన్న గది.
హాల్లో నుంచి ఇంటి వెనుకకి దారి. ఆ దారిలో పోయి చూసా. ఆ ఇంటి వెనుక చాలా చక్కగా చిన్న చిన్న కుండీలలో మొక్కలు ఉన్నాయి. ఒక సపోటా చెట్టు ఉంది. ఆ చెట్టు పక్కనే బాత్రూమ్. బాత్రూమ్ దగ్గరే ఒక నీళ్ళ తొట్టి .
మొత్తానికి ఒక పల్లెటూరిలో ఉన్న రకంగా ఉంది. నేను చూసే ఇల్లు కి , ఆ ఓనర్ వాళ్ళ ఇంటికి మద్య ఓ పది అంకణాల ఖాళీ స్తలం ఉంది. అక్కడ కొన్ని పూల మొక్కలు ఉన్నాయి. మొత్తానికి కొత్తగా పెళ్ళయిన దంపతులు ఉండగల ఇల్లు.
ఆ ఇల్లు చాలా నచ్చింది. చివరిగా అద్దె నా స్తోమతకి తగ్గట్టుగా ఉంటే ఇక ఏమాత్రం ఆలస్య చేయకుండా అడ్వాన్స్ ఇచ్చి రేపే ఇంట్లో చేరవచ్చు ఆని అనుకోని ఆమె దగ్గరకి వెళ్ళాను.
అక్కడ ఆమె అదే మెట్ల మీద కూర్చొని ఒక చేతిని గడ్డం కింద పెట్టుకొని నన్నే చూస్తూ నేను వచ్చానని గమనించకుండా ఏదో లోకంలో ఉండిపోయింది. నేను ఆమెని పిలిచేదాక ఈ లోకం లోకి రాలేదు. నేను ఆమెని పిలిచి ఆమెతో
“ఇల్లు నచ్చింది మేడమ్. అద్దె ఎంతొ చెప్పండి”
“సరే , ఇల్లు చిన్నది కాబట్టి అద్దె తక్కువే, నెలకి 7,000 .
అడ్వాన్స్ 2 నెలలది ఇవ్వాలి. అంటే 14,000.
సరే అంటే చెప్పు ఒకసారి మా ఆయనకు ఫోన్ చేసి నీ విషయం చెప్పి అప్పుడు చెపుతా”
అని అంటే నేను నా మనసులో 7,000 నా తాహతకి తగ్గా అద్దెనే అని అనుకోని ఆమెతో
“నా తాహతకి తగ్గ అద్దే మేడమ్ నేను చెరతాను”
“సరే బాబు, ఇంతకీ ఉద్యోగం ఉందిగా !”
“ఉంది మేడమ్ , SS GROUPS లో మార్కెటింగ్ డిపార్ట్మెంట్లో జాబ్. 15,000 జీతం”
“సరే అబ్బాయ్, ఉండు నేను వెళ్ళి మా ఆయనతో మాట్లాడి వస్తా” అని ఆమె లోపలకి వెళ్ళింది.
ఆమె వెళ్ళగానే ఆ పక్కనే ఉన్న మెట్లమీద కూర్చొని నా అలసట తీర్చుకుంటూ ఉన్నా.
కొంత సమయానికి ఆ ఇంటి ఓనర్ నా దగ్గరకి వచ్చింది. నేను ఆమెని చూసి పైకి లేచి నిలబడితే ఆమె నాతో
“చెప్పాగా నికేదో లక్ ఉందని , జాబ్ చేస్తున్నావ్ అని మా ఆయనకి చెపితే ఇందాక నేను చెప్పిన conditions మీకు చెప్పి మీరు ఒప్పుకుంటే అడ్వాన్స్ తీసుకోమని చెప్పారు. ఏమంటావ్”
“చాలా సంతోషం మేడమ్ , ఈ ఇల్లు మా ఆఫీసు కి చాలా దగ్గరగా ఉంటుంది, అందుకే ఇల్లు చాలా నచ్చింది మేడమ్.
ఇందాకే చెప్పగా మేడమ్, మీ షరతులు అన్నీ నాకు సమ్మతమే .
నా నుంచి మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు”అని అన్నాను.
అందుకు ఆమె నాతో
“అయితే అడ్వాన్స్ 14,000 ఇచ్చి ఎప్పుడు వస్తావో చెప్పు”అని అనింది.
అందుకు నేను “మేడమ్, ఇప్పుడు నా చేతిలో డబ్బులు లేవు , ఇందాకే ఒక ATM చూశాను. ఓ 15 నిమిషాలలో డబ్బులు తీసుకొని వస్తాను మేడమ్ . అప్పటిదాకా ఇంకెవ్వరికి ఇల్లు ఇవ్వకండి. తప్పక వస్తాను”
“సరే, బాగా అలసి పోయినట్టు ఉన్నావ్ ఏదైనా జూస్ తెస్తాను తాగి వెళ్ళు”
“ఇప్పుడు వద్దులే మేడమ్ , నేను వెళ్ళి డబ్బులు తెస్తా”
అని ఆ ATM దగ్గరకి నడుచుకుంటూ వెళుతూన్న. అలా నడుస్తూ నా మనసులో నేను
“చాలా థాంక్స్ దేవుడా ..... నాకోసమే ఈ ఇల్లు ఉంచావు.
ఇక్కడి నుంచి నా ఆఫీసు చాలా దగ్గరే. పైగా మెయిన్ రోడ్డు కూడా కనిపిస్తూ ఉంటుంది. చాల చాల థాంక్స్
అని దేవుడికి థాంక్స్ చెపుతూ వెళుతూ ఉన్నాను.
రవి అలా డబ్బుల కోసం వెళుతూ ఉంటే ఇక్కడ అంటే రవి ఉండబోయే ఇంటి ఓనర్ ఒక్కటే బయట మెట్ల మీద కూర్చొని రవి వెళ్ళిన వైపే చూస్తూ ఉంది. ఆమె ఉన్న ఇల్లు నేల నుంచి ఎత్తుగా ఉండటం వలన ఆ ఇంట్లోకి వెళ్లాలంటే 5 మెట్లు ఎక్కాలి. ఆ మెట్లలో పైన ఉన్న ఒక మెట్టు మీద కూర్చొని తనలో తానే మాట్లాడుకుంటూ
“బహుశా వాడి కోసమే అనుకుంటా ఎవ్వరికీ ఇల్లు నచ్చలేదు.
చూడటానికి పద్దతిగా ఉండే అబ్బాయి లాగానే ఉన్నాడు. మనిషి రంగు తక్కువే అయినా అలసిపోయిన మొహంలో కూడా ఏదో కళ ఉంది. మరి గర్ల్ ఫ్రెండ్స్ లేరని అంటున్నాడే , పైగా ఎలాంటి చెడు అలవాట్లు లేవని అంటున్నాడు. వాడు చెప్పేది నిజమే అని ఆ విషయం చెప్పేటప్పుడు తన కళ్ళని చూస్తేనే తెలుస్తూ ఉంది.
నేనేంటి వాడు వీడు అని అనుకుంటున్నా , అయ్యో ఆయన పేరు కూడా కనుక్కోలేదే !!!
ఏంటి వాడు నుంచి ఆయన అనే దగ్గరకు ! నాకు తెలియకుండానే వచ్చానా !
సరేలే ఇల్లు నచ్చింది అన్నాడుగా రాడా ... వచ్చాక అడుగుతా పేరు వివరాలు మొత్తం తెలుసుకునే ఇంటి తాళాలు చేతిలో పెడతా.
అయినా నేనేంటి ఇక్కడ కూర్చోని వాడికోసం ఎదురుచూడటం !
అయినా వస్తాడుగా లోపలకి పోతే పోలా !”
అని లేవబోతూ మళ్ళీ తనలో తానే
“లేదు రానీ , ఎందుకో వాడిని మళ్ళీ మళ్ళీ చూడాలి అని అనిపిస్తుంది. ఇక్కడే ఉంటా”
అని మళ్ళీ అక్కడే కూర్చొని గేటు వైపే ఆశగా చూస్తూ ఉంది. తన ప్రవర్తన తనకే కొత్తగా అనిపించి
“ఎవరో పేరు ఊరు తెలియని కొత్త వ్యక్తి కోసం ఎదురు చూడటమా ! ఏమైంది నాకు ?
ఆయన కోసమా లేక ఆయన తెచ్చే అడ్వాన్స్ డబ్బు కోసమా?
ఛీ .... నా దగ్గర డబ్బు లేకనా ! కట్టిన చీర కట్టని స్తాయి లో ఉన్నాను. మరి వాడు తెచ్చే డబ్బు ఎప్పుడూ చూడలేదనా ?
అలాంటిది లేదే నేను చూడని డబ్బుల కట్టలా !
ఏమిటి ఈ వింత అనుభూతి .... మాటి మాటికి వాడు వాడు అని, ఆయన అని అంటూ ఉన్నానే ! కనీసం అబ్బాయి అనో , లేక బాబు అని నా నోటి నుంచి రావటం లేదే ?
ఏదో మనసుకు దగ్గరైన వ్యక్తిని పిలిచినట్టు వాడు , ఆయన అని అంటున్నానే !
అయ్యో దేవుడా ఏమిటి నా పరిస్తితి నాకే అర్ధం కాటంలేదే !
పెళ్ళయి పిల్లలు ఉన్న దాన్ని , అలాంటి నాకు ఎన్నడూ ఎవరిని చూసినా కలగని ఏదో తెలియని భావన వీడిని చూస్తే కలుగుతుందే ?
ఇన్ని రకాలైన ప్రశ్నలు నా మనసులో ఉన్నా నా లో అలజడి లేకుండా మనసు నిమ్మలంగా ప్రశాంతంగా ఉంది.
ఏది ఏమైనా చాల రోజుల తరువాత నా మనసు ప్రశాంతంగా ఉంది
అని అనుకుంటూ ఆ గేటు వైపే అతని ( రవి ) రాక కోసం ఎదురు చూస్తూ ఉంది.
ఇక్కడ ఈమే పరి పరి విదాలుగా తన మనసులో యోచన చేస్తూ అక్కడే రవి కోసం ఎదురు చూస్తూ ఉంది. ఇక అటు వైపు, రవి ATM కి వెళ్ళి తను హైదరాబాద్ కి వచ్చేతప్పుడు బ్యాంకు లో వేసుకున్న 20,000ల లో 14,000 డ్రా చేసి వస్తూ ఉన్నాడు. అతని దగ్గర 20,000 ఉన్నా కూడా ఆ డబ్బులు తనవి కాదని తన జీతం లో నుంచే స్వర్ణకి కొనివ్వాలని ఈ 20,000 లని తాకలేదు.
అవే ఇప్పుడు తనకు నచ్చిన అద్దె ఇంట్లో ఉండటానికి ఉపయోగ పడబోతున్నాయి. ఆ డబ్బులు తీసుకొని నేరుగా రవికి నచ్చిన ఇంటికి వచ్చి గేటు తీయబోతూ అక్కడ మెట్లమీద కూర్చొని ఉన్న ఆ ఇంటి ఓనర్ ని చూస్తూ
( రవి మాటలలో )
నేను డబ్బులు తీసుకొని ఆ ఇంటికి వచ్చి గేటు తీస్తుంటే ఎదురుగా ఆ ఇంటి ఓనర్ ఎవరికోసమో ఎదురుచూస్తున్నటు ఆ మెట్లు మీద కూర్చొని ఉంది. నేను రావడం చూసిన ఆమె నన్ను చూడగానే ఆమె ముఖం లో ఒక్క సారిగా సంతోషం కనిపించింది.
ఆమె కళ్ళలో కాంతి , వెలుగుతున్న మొహం తో నన్ను చూసి పైకి లేచి నా కళ్ళలోకే చూస్తూ ఉంది. ఆ చూపులో ఎలాంటి దురాలోచన లేదని నా మనసుకి స్పస్టంగా అనిపిస్తూ ఉంది. అప్పడు నేను ఆమెతో
“మేడమ్ , ఇవిగోండి అడ్వాన్స్ డబ్బులు 14,000” అని ఆమె చేతికి ఇచ్చాను.
నేను ఎప్పుడైతే ఆమెతో మాట్లాడానో అప్పుడు ఆమె ఈ లోకంలోకి వచ్చినట్టుగా నాతో
“హా , ఏమన్నావు ?” అని అంటే నేను
“అడ్వాన్స్ డబ్బులు మేడమ్, తీసుకోండి” అని ఇచ్చాను. నేను ఇచ్చిన డబ్బులు తీసుకొని లెక్కపెట్టి నాతో
“ok .... 14,000 ఉన్నాయి.
చూడు .........”
అని అంటుంటే నేను “నా పేరు రవికుమార్ మేడమ్”
“హా, పేరు బాగుంది రవి .... రవి అని పిలవచ్చా?”
“పర్లేదు మేడమ్ రవి అని పిలవండి”
“హుం .... ఒకే రవి డబ్బులు అన్నీ కరెక్ట్ గా ఉన్నాయి.
హా అన్నట్టు నా పేరు మాదవి , మా ఆయన పేరు ప్రకాష్.
ఇక్కడే ఒక ఆఫీసు లో మేనేజర్ గా పనిచేస్తున్నాడు”
అని ఆమెని పరిచయం చేసుకుని మళ్ళీ నాతో “మరి ఎప్పుడు ఇంట్లో చేరుతున్నావ్?”
“రేపు ఉదయం చేరుతాను మేడమ్ , పెద్దగా సామాన్లు ఏవి లేవు ఇక్కడకి వచ్చాకే కొనుక్కోవాలి”
“సరే .... హా .. ఒక విషయం చెప్పడం మర్చిపోయా......
నువ్వు ఉండే ఇల్లు మా మావయ్య ఒకప్పుడు ఉన్నది.
మామయ్య అంటే మా ఆయన తండ్రి గారు. వాళ్ళు చాలా సంవత్సరాలుగా అక్కడే ఉన్నారు.
కొన్ని కారణాల వల్ల ఇప్పుడు ఇక్కడ లేరు.
ఆ ఇల్లు అంటే మా ఆయనకి చాలా sentiment .
సో నువ్వు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి.
లేక పోతే మా ఆయన కోపానికి నువ్వు బలి అవ్వాల్సిందే” అని చెప్పింది.
అప్పుడు నేను “ sentiment అన్నారు, నా సొంత ఇల్లు లాగా చూసుకుంటాను మేడమ్”
“అబ్బో .... సొంత ఇల్లు అని మా ఇంటిని అమ్మేస్తావేమో” అని నవ్వింది.
ఆమె నవ్వు చూడ చక్కగా ఉంది. ఆమె నవ్వును చూస్తూ
“ బలే వారే , ఏదో నా సొంత ఇంటిని ఎలా అయితే చూసుకుంటానో అలా అని ఉదాహరణగా చెప్పాను” అని అన్నా.
“సర్లే రవి , నేనేదో సరదాకి అన్నలే .. ఉండు జూస్ తీసుకొస్తా” అని డబ్బులు తీసుకొని లోపలకి వెళ్ళింది.
కొద్ది సేపటికి రెండు గ్లాసుల్లో మాంగో జూస్ తీసుకొచ్చి నాకు ఒక గ్లాస్ ఇచ్చి ఆమె ఒక గ్లాస్ తీసుకొని మళ్ళీ మెట్లమీద కూర్చొని నాతో
“నువ్వూ .... కూర్చో రవి” అని అంటే
ఆమె కూర్చున్న ఒక మెట్టు కింద ఇంకో మెట్టు మీద కూర్చొని జూస్ తాగుతూ ఉన్నా. ఆమె జూస్ తాగుతూ నన్ను తదేకంగా చూస్తూ ఉంది. ఆమె ఎందుకు అలా తదేకంగా చూస్తూ ఉందో అర్ధం కాక నేను ఆ ఇంటి లోగిలిలో ఉన్న చెట్లని చూస్తూ ఉన్నా. మంచి ఎండకి వచ్చానుగా చల్లని జూస్ తాగుతూ చెట్లని చూస్తున్నా.
మాదవి గారికి మొక్కలు పెంచాలంటే ఆశక్తి ఏమో. ఆ ఇంటి లోగిలిలో అన్నీ రకాల పూల మొక్కలు , పండ్ల చెట్లు ఉన్నాయి. ఆ ఇల్లు మొత్తం ఓ 40 అంకణాలు ఉంటుంది. అందులో ఓ 15 అంకణాలు వాళ్ళ ఇల్లు కట్టుకొని మిగిలిన మొత్తం దాదాపుగా చెట్లే ఉన్నాయి. ఇక extra గా నేను ఉండబోయే చిన్న ఇల్లు. అది కేవలం 5 అంకణాల కట్టుబడే ఉంటుంది.
అక్కడ చాల చెట్లు ఉండటం వల్ల చిన్న చిన్న పిచ్చుకలు ఉన్నాయి. వాటిని చూసి నేను చాల సంవత్సరాలు అయ్యింది. వాటి చిన్న చిన్న శబ్దాలు వింటూ ఆ పూల అందాలు చూస్తూ మాదవి గారు తెచ్చిన జూస్ మొత్తం తాగేసాను.
ఇక అక్కడ నుంచి వెళ్దామని పైకి లేచి నా గ్లాస్ ఓ మూలగా పెట్టి ఆమెతో
“ఇక నేను వెళ్తాను మాదవి గారు”
అని అనగానే ఆమె పైకిలేచి నాతో “సరే రవి రేపు కలుద్దాం” అని చక్కని మంచి నవ్వు నవ్వింది.
ఆ నవ్వులో ఏదో తెలియని ఆకర్షణ , మాయ . ఆ నవ్వును చూస్తూ ఆ ఇంటినుంచి బయటకి వచ్చాను.
అప్పటికి సమయం 3 గంటలు అయ్యింది.
నా ఉద్యోగం గురించి అమ్మకి చెప్పాలని అమ్మకి ఫోన్ చేసి జాబ్ విషయం చెప్పి అద్దె ఇంటిగురించి కూడా చెప్పాను. అమ్మ నాన్న ఎంతో సతోషించారు. అమ్మ నన్ను ఒక సారి మామయ్య ఇంటికి వెళ్ళి వాళ్ళకు కూడా ఉద్యోగ విషయం చెప్పమని చెప్పింది.
ఇక అమ్మ చెప్పినట్టు ఒక సారి మామయ్య ఇంటికి వెళ్ళి నా ఉద్యోగం గురించి చెప్పి రెండు రోజులు వాళ్ళ ఇంటిలో నాకు ఆశ్రయం ఇచ్చినందుకు థాంక్స్ చెప్పడానికి ఆటోలో బయలుదేరను.
మాదవి ఇంటి నుంచి రవి వెళ్ళగానే ఆ మెట్లమీద నుంచి కిందకి దిగి గేటుదగ్గరకి వచ్చి అక్కడ రోడ్డులో వెళుతున్న రవిని కనుమరుగయ్యేంత వరకు చూసి తిరిగి ఇంటిలోకి వెళ్ళింది. అలా ఇంట్లోకి వెళ్ళిన మాదవి మంచం మీద పనుకొని తన మనసులో
“అబ్బా వాడిని చూడగానే నా మనసు సంతోషతో గెంతులేసింది.
వాడినే చూస్తూ ఏదో తెలియని లోకంలోకి వెళ్ళాను. వాడి కళ్ళలో ఏమో సంతోషం. వాడి సంతోషాన్ని చూస్తూ నా చూపు తిప్పుకోలేక పోయా.
అలా సూటిగా చూడటం వాడు చూసాడు. అలా నన్ను చూసి ఏమనుకున్నాడో!
వాడి పక్కన కూర్చుంటే ఏదో తెలియని అనుభూతి.
రేపు వస్తాను అన్నాడుగా. ఇక రేపటి నుంచి వాడు ఇక్కడే ఉంటాడు. రోజూ వాడిని చూస్తూ వీలయితే వాడి పక్కనే కూర్చొని వాడితో మాట్లాడుతూ ఉండొచ్చు
ఏది ఏమైనా నా జీవితంలో ఒక అబ్బాయితో సరదాగా నవ్వింది ఇదే మొదటి సారి
చూద్దాం రవి తో ఇంకెంత సరదాగా ఉంటానో ”
అని రవి గురించే ఆలోచిస్తూ సమయాన్ని గడుపుతూ ఉంది.