Update 13.2
( రవి మాటలలో )
చూస్తూ చూస్తూనే ఒక్క రోజులో దాదాపుగా నేను చేయాల్సిన పనిని నేర్చుకున్నాను. నికిత వలననే నేను ఇంత త్వరగా చేర్చుకోగలిగానని కచ్చితంగా చెప్పగలను. సాయంత్రం 4 గం 30 నిముషాలు అవుతుండగా నేను,నికిత ఉన్న కామన్ ఛాంబర్ లోకి వచ్చిన సరిత నాతో “డెయిలీ ఈ టైమ్ కి ఆఫీసు నుంచి వెళ్ళొచ్చు రవి . ఒక్కోసారి పని ఉంటే మాత్రం పని పూర్తయ్యేదాకా ఉండాలి” అని చెప్పడంతో ఇక నేను కొత్తగా అద్దెకి తీసుకున్న ఇంటికి వెళ్ళడానికి సిద్దామయ్యాను.
ఆఫీసు బయటకి వచ్చి ఇంటికి కావలసిన కొన్ని వస్తువులు కొనుక్కోవాలని అనుకుంటూ ఆలోచిస్తూ ఉండగా నేనున్న దగ్గరకి సరిత స్కూటీ పై నా ముందుకు వచ్చి ఆగి నాతో “లిఫ్ట్ ఏమైనా కావాలా” అని అడిగిండి. అందుకు నేను “వద్దు సరిత , నేను ఆటోలో వెళ్తాను , పైగా కొన్ని వస్తువులు కొనుక్కోవాలి” అని చెప్పాను. అందుకు తను “అంటే షాపింగ్ అనమాట ఎం వస్తువులు ” అని అడిగిండి.
నేను తనకి సమాదానం చెప్పేటప్పుడు అక్కడకి నికిత కూడా తన స్కూటీ వేసుకొని వచ్చి సరిత పక్కన ఆపి నా మాటలు వింటూ ఉంది. నికితని చూసి పలకరింపుగా ఒక నవ్వు నవ్వి సరితతో “ఈ రోజే ఒక హౌస్ లో రెంట్ కి దిగాను. ఇంట్లో రైస్ కుక్కర్ కూడా లేదు. సో దానితో పాటు చిన్న పత్రాలు కొనుక్కోవాలి” అని చెప్పాను.
నేను చెప్పిన మాటలు వినిన నికిత నాతో “అయితే నేను నీతో వస్తా రవి”అని నికిత అంటూ ఉంటే సరిత నికితతో “రవితో నేను వెళ్తాలే నికిత నువ్వు చాలా అలిసిపోయావుగా ఇక రూమ్ కి వెళ్ళు. మళ్ళీ షాపింగ్ అంటే కస్టం కదా” అని అంటే నికిత “ నేనేం అలిసిపోలేదు అంతగా ఉంటే నువ్వే రూమ్ కి వెళ్ళు అక్క ” అని సమాదానం చెప్పింది.
అందుకు సరిత “చెప్పిన మాట వినడం మంచి లక్షణం నిక్కి, నేను వెళ్తా అన్నగా ఇక ఎం మాట్లాడకు” అని చెపితే నికిత కాస్త కోపంగా “రూమ్ కి రావా అప్పుడు చెపుతా అక్క నీ సంగతి ” అని సరిత కి చెప్పి నాతో “ బై రవి నితో షాపింగ్ కి వద్దాం అని అనుకుంటే ఒకరికి ఏదోలా ఉంది , ఇక నేను వెళ్తాను ” అని చెప్పి సరిత వైపు ఒక చూపు చూసి స్కూటీ లో తన రూమ్ కి బయలుదేరింది.
నికిత వెళ్లిన తరువాత నేను అక్కడే ఉన్న సరిత తో “నికిత ఫీల్ అయినట్టుంది గా , అలా ఎందుకు అన్నావ్ సరిత ?” అని అంటే తను “నిక్కి ఏమీ ఫీల్ అవ్వలేదులే ...... నేనున్నాగా నీకు హెల్ప్ చేయడానికి పైగా నాకు పెద్దగా పనిలేదు ఇంకేం మాట్లాడకు వచ్చి స్కూటీ ఎక్కు” అని చెప్పింది.
సరిత చెప్పినట్టుగా స్కూటీ ఎక్కి తనతో పాటు బయలుదేరి షాప్ కి వెళ్ళాము. ఇంట్లో చేరాను కానీ ఇంకా పాలు పొంగించలేదుగా అని పాలు కాయడానికి కావలసిన కొన్ని పాత్రలు, రైస్ కుక్కర్ , ఇండక్షన్ స్టౌ తీసుకున్నాను. ఇక నేను వెళ్తాను అని అంటే మీ ఇంటిదాక దింపుతా అని చెప్పిన సరితతో నేను “అమ్మో మా ఓనర్ ఆంటీ ముందే చెప్పింది. ఎవ్వరూ నాతో ఇంటికి రాకూడదని . ఇక నువ్వు నన్ను ఇంటిదగ్గర దింపడం చూస్తే నన్ను కాళీ చేయమంటుందేమో” అని అంటే నా బయం చూసి సరిత “సరే రవి మరి అంతగా బయపడకు నువ్వు జాగ్రత్తగా వెళ్ళు” అని చెప్పి తను వెళ్ళిపోయింది.
ఇక నేను ఒక ఆటో మాట్లాడుకొని ఇంటికి వెళ్ళాను. అలా ఇంటికి వెళ్లి మెయిన్ గెట్ ఓపెన్ చేస్తుంటే ఇంటిలోపల చెట్లకి నీళ్ళు పడుతున్న మాదవి ఆంటీ నాకు కనిపించింది. ఆంటీని పలకరిస్తే ఆమె నాతో “ఏంటి రవి షాపింగ్ చేశావా” “అవునాంటీ, ఉదయం పాలు కూడా పొంగించలేదు అందుకే ఇండక్షన్ స్టౌ తెచ్చుకున్నాను” అని చెప్పాను.
అందుకు ఆంటీ నాతో “ఇండక్షన్ స్టౌ తెచ్చుకున్నావా , బలే వాడివే మా ఇంట్లో ఒక గ్యాస్ స్టౌ , extra సిలిండర్ కూడా ఉంది. సిలిండర్ కి డబ్బులు నువ్వే పెట్టుకుంటా అంటే నువ్వు ఉన్నంత కాలం అవి వాడుకోవచ్చు. ఏమంటావ్?”
“చాల థాంక్స్ ఆంటీ , మీరు అన్నట్టే సిలిండర్ కి డబ్బులు కడతా” అని చెప్పాను. అప్పుడు మాదవి ఆంటీ నాతో “మరి ఇంకేం ఆ స్టోర్ రూమ్ లో ఉన్నాయి పద” అని నన్ను ఆ స్టోర్ రూమ్ కి తీసుకెళ్లింది. అక్కడ ఉన్న ఆ గ్యాస్ స్టౌ ని , సిలిండర్ ని నేను ఉండే ఇంటికి తీసుకెళ్ళాను.
గ్యాస్ కి సిలిండర్ కనెక్షన్ ఇచ్చి మాదవి ఆంటీతో “ఆంటీ, మొదట మీ చేత్తో స్టౌ వెలిగించండి” అని చెప్పితే ఆంటీ “నేనా వద్దేమో రవి” అని అనింది. అందుకు నేను “ పర్లేదు ఆంటీ ప్లీస్” అని request చేస్తే ఆంటీ తన చేత్తో స్టౌ వెలిగించింది. ఆ స్టౌ పై పాలు పెట్టి అవి పొంగే దాకా వేచి ఉన్నాం.
పాలు పొంగ బోతుండగా అంకుల్ కూడా ఇంటికి వచ్చాడు. తనని కూడా నేను ఉన్న ఇంటికి పిలిపించి ఆంటీ మరియు అంకుల్ కి కాఫీ ఇచ్చాను. కాఫీ తాగాక ఆంటీ అంకుల్ ఇద్దరూ వెళ్లిపోయారు. వాళ్ళు వెళ్ళాక రైస్ కుక్కర్ లో రైస్ పెట్టుకొని వచ్చీరాని ఒక కూర చేసుకొని స్నానానికి వెళ్ళాను. స్నానం చేసి వచ్చిన నేను అన్నం తినేసి సాయంత్రం సామాన్లతో పాటు తెచ్చుకున్న కొత్త చాప వేసుకొని అలసట తీర్చుకోడానికి నా నడుము వాల్చాను.
కొద్దిసేపటికి స్వర్ణ నాకు కాల్ చేస్తే తనతో మాట్లాడుతూ “నువ్వు ఎప్పుడొస్తావో , అప్పుడు నీకో విషయం చెప్పాలి స్వర్ణ” అని చెపితే స్వర్ణ నాతో “మరి కొన్ని పనులు ఉన్నాయి మావ , నేను రావడానికి మరో రెండు రోజులు అయ్యేలా ఉంది. నేను రాగానే నీకు చెపుతా వెంటనే ఇంటికి వచ్చేయ్ మనిద్దరం మళ్ళీ ఎంజాయ్ చేద్దాం ” అని చెప్పి కాల్ కట్ చేసింది.
‘మొత్తానికి నా ఉద్యోగ జీవితంలో మొదటి రోజు పూర్తయింది. ఇక ప్రశాంతంగా నిద్రపోతాను’ అని అనుకుంటూ నిద్రలోకి జారుకున్నాను.