Update 17

అలా కళ్ళు మూసుకోగానే ఒక ముసలాయన వచ్చి నన్ను లేపాడు, నా కట్టు అంతా సరిచేసి, తెగ పెద్దలు పిలుస్తున్నట్టు చెప్పాడు, తన వెనకే వెళ్ళాను ఒక చోట పెద్దవాళ్లంతా కూర్చుని ఉన్నారు, నేను వెళ్ళగానే అందరూ నిల్చున్నారు....

అక్కడికి వెళ్లి అందరిని కూర్చోమని నేను కూర్చున్నాను.

ఒక పెద్దాయన లేచి "బాబు ఏమిచ్చినా నీ రుణం తీర్చుకోలేనిది, మాకోసం అంత డబ్బు ఎందుకు ఖర్చుపెట్టావో తెలుసుకోవచ్చా?" అన్నాడు.

"మీరు అలా ఎం అనుకోవద్దు, నాకు ముందు నుంచి డబ్బు మీద మోజు లేదు నా దెగ్గర అదీ ఇపుడు కావాల్సినంత ఉంది, నేను ఈ పని చేసేటప్పుడు మా అమ్మని తలుచుకున్నాను అంతే ఇక ఒక్క క్షణం కూడా ఆలోచించాల్సిన అవసరం రాలేదు " అన్నాను.

"మీ అమ్మగారు ఎక్కడున్నా పది కాలాల పాటు చల్లగా ఉండాలి" అన్నాడు.

ఇప్పుడు తను బతికి లేదు లెండి అన్నాను.

"బాబు మీరు ఇక్కడికి వచ్చినప్పుడు మీ ఒళ్ళంతా గాయాలు, రెండు కత్తి పోట్లు ఉన్నాయి, మీ ఒంటి మీద దెబ్బలు అవి నాటు అడివి పట్టు దెబ్బలు, మీరు ఎవరితో గొడవ పెట్టుకున్నారో తెలియదు కానీ మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి, అలాగే ఇంకొకటి అన్ని దెబ్బలు తిన్నా మీరు ఇంకా బతికే ఉన్నారు అంటేనే మాకు అర్ధమవుతుంది మీరు సామాన్యులు కారని, మా గుర్తుగా మీ రుణం తీరేట్టుగా ఈ జలం స్వికరించండి అని ఒక చిన్న మట్టి గిన్నెలో తీసుకొచ్చారు అదీ పసరు, జీగట జిగటగా ఉంది వంకాయ రంగులో మెరుస్తుంది దాన్నే చూస్తుండటం చూసి...

ఆ తెగ పెద్దాయన బాబు ఇది పవిత్ర జలం ఇది ప్రతి వంద సంవత్సరాలకి ఒకసారి మా పవిత్ర చెట్టు నుండి వస్తుంది, ప్రతి సారి ఈ తేగని పరిపాలించే వాళ్ళ కుమారుడికి అంటే తరువాత రాజుకి ఇది ఇస్తారు కానీ ఈ సారి నాకు సంతానం కలుగ లేదు, అందుకే ఈ తెగకి రాజు గా మిమ్మల్ని ప్రకటిస్తూ ఈ జలం మీకు అందివ్వాలని నిర్ణయించాం... ఈ జలం తాగినవారు రెండు సార్లు మరణం పొందుతారు....

చిన్నా : అంటే నాకు అర్ధం కాలేదు..

ఈ జలం తాగితే ఒక సారి మరణించిన తరువాత ఈ జలం ఔషుదాం మళ్ళీ ప్రాణం పోస్తుంది అందుకే అన్నాను ఇది తాగితే రెండు సార్లు చనిపోవచ్చు అని....

చిన్నా : కానీ ఇది నేను తాగాలేను, అత్యాశ కొద్దీ తాగినా నేను ఇక్కడ ఉండలేను...

ఆ పెద్దయ్య నా చెయ్యిని పట్టుకుని నా అరచేతిని చూస్తూ "మాకు తెలుసు అందుకు మాకు అభ్యంతరం కూడా లేదు కానీ నీ భార్య కవల సంతానాలలో ఒకరిని మాకు అప్పగించాలి తానే మాకు రాజు అవుతాడు, ఇది మా విన్నపము మాత్రమే నీ సంతానం మాకు రాజు అవుతే అదే మేము తీర్చుకునే నీ రుణం" అన్నాడు.

నాకు ఎం చెయ్యాలో అర్ధం కాలేదు కళ్ళు మూసుకుని అమ్మని తలుచుకున్నాను అమ్మ నవ్వు మొహం కనిపించింది, వాళ్ళకి నా సంతానంలో ఒకరిని ఇస్తానని ఒప్పుకున్నాను, నాకు ఆ జలం ఇచ్చారు తాగాను వెంటనే స్పృహ తప్పినట్టనిపించింది.

....................................................

పెద్దయ్య : ఈ అబ్బాయి వాళ్ళ అమ్మ చనిపోయిందని చెప్తున్నాడు కానీ తన చేతి రాత ప్రకారం ఈ అబ్బాయి అమ్మ ఇంకా బతికే ఉండాలి, ఇతని చేతిలో ధన రేఖ, ఆయుష్షు రేఖ అస్సలు ఒక చోట నిలువడం లేదు ప్రతి నిమిషం కష్టాలు, ఆవేదనలు, రోదనలు అయినా ఎలా మాములుగా ప్రవర్తించగలుగుతున్నాడు, నాకు ఏమి అర్ధం కావటంలేదు.

తెగ రాజు : ఈ అబ్బాయి మాములు వ్యక్తి కాదు అని నాకు చూడగానే అనిపించినది కానీ మీరు చెప్పడం వల్ల నాకు తెలుస్తుంది ఈ అబ్బాయి జాతకం పాతికెళ్ళ క్రితం మనం కాపాడిన పసి దాని జాతకం రెండూ ఒకేలా ఉన్నట్టున్నవి ఒక సారి గమనించండి, అందరూ చిన్నా చెయ్యి చూసారు అవును అచ్చు ఒకే లాగ ఉన్నది.

ఆ పచ్చ రంగు అంగుళికము తీసుకురండి, ఒక గుహ లాంటి రూమ్ లోకి వెళ్లి పెద్దాయన నల్ల దారం కట్టిన ఉంగరం తీసుకొచ్చి చిన్నా మెడలో వేసాడు

లేచి చూసే సరికి నా చేతి గాయం మానిపోయింది, వెనుక కత్తి పొట్లూ మానీనట్టే ఉన్నాయి, ఇంతక ముందుకంటే నా బాడీ ఆక్టివ్ గా ఉన్నట్టు అనిపించింది, బైటికి వచ్చాను ఎవరిని చూసిన అందరు వంగి వంగి దండాలు పెడుతున్నారు నాకు అదీ నచ్చలేదు...

పెద్దయ్య దెగ్గరికి వెళ్ళాను మళ్ళీ అదే దండాలు అందరిని పిలవమన్నాను, అందరిని పిలిచాడు "నేను మీ రాజును కాను నాకు ఇప్పటినుంచి ఎవ్వరు దండాలు పెట్టొద్దు అని గట్టిగానే చెప్పాను" విన్నారు....

నా మెడలో పచ్చ రంగు ఉంగరం వేలాడటం గమనించాను అదీ అమూల్య ఫోటోల్లో అమ్మ పెట్టుకున్న ఉంగరం వెంటనే వాళ్ళ దెగ్గరికి వెళ్ళాను, వాళ్ళు నన్ను చూడగానే నాకు ఎదురు వస్తూ.....

చిన్నా : ఈ ఉంగరం.

పెద్దయ్య : చెప్తాను అంతా చెప్తాను పాతికెళ్ళ క్రితం ఒక చిన్నది జ్వరం తో రోడ్ గుండా ఒక్కటే నడుస్తూ వెళ్తుండగా మా వాళ్ళు చూసి ఆ పసి దాన్ని ఎత్తుకొచ్చారు.... అమ్మాయి చాలా తేజస్సు కల బిడ్డ వారం రోజుల్లో కోలుకుంది కానీ మా దెగ్గర ఉండటానికి ఇష్ట పడలేదు తన చేయి చూసింది అప్పుడే నీ చేతి రాతలు తన చేతి రాతలు ఒకేలా ఉన్నాయి...... ఒక రాత్రి మేమేవ్వరము చుడకుండా ఈ ఉంగరం ఇక్కడే వదిలేసి వెళ్ళిపోయింది, అప్పటి నుంచి ఈ ఉంగరం ఇక్కడే ఉండిపోయింది, నిన్న నీ చేయి చూసినప్పుడు తను గుర్తొచ్చి ఆ ఉంగరం నీ మెడలో వేసాము...

చిన్నా : అవును ఇది మా అమ్మకి సంబంధించిన ఉంగరం.

పెద్దయ్య : ఐతే మా ఊహ నిజమే మీ అమ్మ.....

ఇంకొక అతను : పెద్దయ్య ఆ అబ్బాయి ని విశ్రాంతి తీసుకోనివ్వండి అన్ని తరువాత మాట్లాడుకోవచ్చు....

నేను అక్కడనుంచి బైటికి వచ్చేసాను.....

పెద్దయ్య : ఎందుకు మధ్యలో ఆపేసావు ఆ అబ్బాయికి వాళ్ళ అమ్మ బతికే ఉందని తెలియాలి.....

"ఆ అబ్బాయిని గమనిస్తూనే ఉన్నాను ఇక్కడ ఉన్న ప్రతి రాత్రి నిద్ర లో ప్రతి అరగంటకి ఒక సారి వాళ్ళ అమ్మని తలుచుకుంటున్నాడు, ఏ పని చెయ్యాలన్న కళ్ళు మూసుకొని వాళ్ళ అమ్మని తలుచుకుంటున్నాడు, నువ్వు ఇప్పుడు లేనిపోని ఆశలు పుట్టించకు, పోయిన సారి నువ్వు చెప్పిన జాతకం తప్పింది అప్పుడే మర్చిపోయావా?

పెద్దయ్య ఇంకేం మాట్లాడలేదు, కానీ ఈ అబ్బాయి విషయం లో నా జాతకం తప్పయ్యేదే లేదు అనుకున్నాడు....

......................................................

వారం రోజుల నుండి ఇక్కడున్న ఆచారాలు, పద్ధతులు ముఖ్యంగా వారి యుద్ధ కళలు అన్ని నేర్చుకుంటున్నాను, ఒకరోజు ప్రాక్టీస్ లో ఉండగా ఒక కాల్ వచ్చింది.

పది రోజుల తరువాత మొదటి కాల్, ఎత్తాను రషీద్ ఈ అడవుల్లో హైవే దెగ్గర ఉన్నాను అని గుర్తులు చెప్పాడు, అక్కడున్న ఇద్దరు మనుషులని తీసుకుని రషీద్ ని కలవడానికి హైవే వైపు వెళ్ళాను, గంట నడక ప్రయాణం తరువాత రషీద్ కనిపించాడు, తెగ మనుషులని అక్కడే రషీద్ కి కనిపించకుండా దాక్కోమని చెప్పి రషీద్ ని పట్టుకుని అవతల వైపు అడివిలోకి వెళ్ళాను, ఇక్కడున్న తెగ ప్రజల గురించి బైటవాళ్ళకి తెలియడం నాకు ఇష్టం లేదు....

రషీద్ : సర్ మీరు బతికే ఉన్నారు.....

చిన్నా : ఏమైందో నాకు మొత్తం తెలియాలి....

రషీద్ : సర్ సునీల్ గారు నాకు ఒక రాత్రి కాల్ చేసారు....

సునీల్ : రషీద్ చెప్పేది జాగ్రత్తగా విను నాకు ఇక్కడ చాలా విషయాలు తెలిసాయి నా కూతురు మానస డబ్బుకి ఆశ పడి నన్ను విక్రమ్ ని చంపాలని చూస్తున్నారు నువ్వు ఇక్కడికి రావద్దు ఇవ్వాల్టి తో నా చావు కంఫర్మ్ అని నాకు అర్ధమైంది నువ్వు వెంటనే విక్రమ్ భార్య ని కాపాడు తనని ఎలా అయినా విక్రమ్ దెగ్గరికి చేర్చు.....

ఇవే నాతో సునీల్ గారు అన్న ఆఖరి మాటలు, ఆ వెంటనే నేను అనురాధ గారి దెగ్గరికి బైల్దేరాను అప్పటికే మీ ఫ్రెండ్ రవికుమార్ అనురాధ గారిని తీసుకెళ్లారు నేను వాళ్ళ కంట పడకుండా తప్పించుకున్నాను, సునీల్ గారు పోయినప్పటి నుండి రవి మనుషులు నన్ను వెతుకుతూనే ఉన్నారు... నా సామ్రాజ్యం మొత్తం నాశనం అయింది ఇక్కడ కూడా ఎక్కువ సేపు ఉండలేను సర్ మీకేమైనా కావాలా నన్ను ఇక్కడ ఉండమంటారా?

చిన్నా : లేదు నువ్వు ఇక్కడనుంచి వెళ్ళిపో నిన్ను నేను ఇప్పుడు కాపాడలేను ఎటైనా దూరంగా వెళ్ళిపో డబ్బు కావాలంటే ఫోన్ చెయ్....

రషీద్ : అలాగే సర్.....

అక్కడనుంచి గుడానికి తిరిగి వచ్చాను అమ్ములు డబ్బు కోసం అందరిని చంపడం ఛా అస్సలు నమ్మబుద్ధి కావట్లేదు తను అడిగితే నా ఆస్థి మొత్తం రాసిస్తానని తనకీ తెలుసు ఇంకేదో ఉంది...

ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను రవి వాళ్ళకి ఎదురు నిలబడితే మళ్ళీ చావుని కొని తెచ్చుకోడమే వాళ్ళని కొట్టాలంటే నాకు ఉన్న ఏకైక మార్గం ఈ తెగ ప్రజల దెగ్గర ఉన్న మెలుకువలు నేర్చుకోడమే.... ఎన్ని రోజులైనా సరే అన్ని నేర్చుకోవాలని డిసైడ్ అయ్యాను.....

కానీ అను ఎక్కడుంది ఎం చేస్తుంది, మానస ఎంత దుర్మార్గలకి పాల్పడినా అను జోలికి మాత్రం వెళ్ళదు.... అని అనుకోవాలి, ఇప్పుడు నేను బైటికి వస్తే నాతో పాటు ఈ ప్రజలకి కూడా లేని పోనీ కష్టాలు... వీళ్ళు ఎదుర్కొగలరు కానీ నా సమస్యలను వీళ్ళ మీద వేయడం నాకు ఇష్టం లేదు అలా ఆలోచిస్తూనే తిరిగి గుడానికి వెళ్ళాను... అను ఎం చేస్తున్నావ్, ఎక్కడున్నావ్ నా వల్ల నీ జీవితం కూడా తలకిందులు అయిపోయింది, నన్ను నమ్ముకున్న వారినేవ్వరిని కాపాడుకోలేక పోతున్నాను నా మీద నాకే అసహ్యంగా ఉంది....

అర్ధ రాత్రి విక్రమ్ ఫోన్ చేసేవరకి అప్పటి వరకు వాడి ఊహల్లో ఉన్న నాకు నిద్ర మొత్తం ఎగిరిపోయింది, ఆనందంగా ఎత్తాను కానీ వాడి మాటలు విన్నతరువాత ఎందుకో భయంగా ఉంది, విక్రమ్ ఇప్పటి వరకు ఎ రోజు అలా భయంగా మాట్లాడిందే లేదు, మానసంతా ఏదో భయం భయంగా అనిపించింది, విక్రమ్ లేని ఇన్ని రోజులు ఆనందం గానే వాడి ఊహల్తో గడిపేస్తునాన్ను కానీ ఈ అర్ధ రాత్రి నాకు ఇప్పుడు భయం వేస్తుంది, మానస దెగ్గరికి వెళ్ళడానికి బట్టలు సర్దుకున్నాను....

ఇంకా సునీల్ గారు రాలేదు.... తలుపు కొట్టిన చెప్పుడు విని డోర్ తెరిచాను ఎదురుగా ఎవరో ఒక పది మంది ఉన్నారు అందరు నల్ల డ్రెస్ లోనే ఉన్నారు కొంచెం భయంగానే ఉన్నా ధైర్యంగా నిల్చున్నాను.

"భయపడకండి నా పేరు రవి విక్రమ్ అన్న పంపించాడు "

అను : హో రవి అంటే మీరేనా అన్నయ్య, మీరంటే విక్రమ్ కి చాలా ఇష్టం, మీ గురించి చాలా చెప్పారు, మానసకి మీకు పెళ్లి అనుకుంటున్నారట కదా...

రవి : ముందు అక్కడికి వెళదాం...

అను : ఒక్క నిమిషం అన్నయ్య వస్తున్నాను...

రవి అనుని కార్ ఎక్కించుకుని సునీల్ ఇంటి వైపు కాకుండా వేరే దిక్కుగా వెళ్లడం గమనించి "అన్నయ్య సునీల్ గారి ఇల్లు అటు వైపు కదా?"

రవి : మానస అక్కడ లేదు మానస పూజ అందరు మా ఇంటిదేగ్గరే ఉన్నారు, ఇప్పుడు మా ఇంటికే వెళ్తున్నాము.

అను : (ఇంటికా కానీ మానసకి ఎవ్వరు లేరుకదా నాకు తెలియకుండా తనెప్పుడు ఇల్లు కట్టుకుంది, విక్రమ్ నాతో చెప్తాడు కదా) కార్ కాళీ స్థలం లో ఫ్లైట్ ముందు ఆగింది ఫ్లైట్ చూడగానే కొంచెం భయం వేసింది ఇది ఎక్కడికి తీసుకెళతుందో తెలీదు ఎందుకో మనసులో విక్రమ్ కి దూరంగా వెళ్తున్నట్టు ఉంది ఫ్లైట్ ఎక్కాలనిపించలేదు..

రవి అనురాధా ఇబ్బందిని గమనించి మానస కి ఫోన్ చేసి అనుకి ఇచ్చాడు.

అను : హలో

మానస : అను భయపడకు, నేను జాగ్రత్తగానే ఉన్నాను ఇక్కడికి రా నీకు కొన్ని నిజాలు తెలియాలి అని కాల్ కట్ చేసింది.

ఎందుకో మానసతో మాట్లాడిన తరువాత కొంచెం భయం తగ్గినా మనసులో ఏదో తెలియని భయంగానే ఉంది, ఫ్లైట్ ఎక్కి కూర్చున్నాను...

ఫ్లైట్ స్టార్ట్ అయింది బ్యాగ్ లోనుంచి సంధ్య అమ్మ ఫోటో తీసాను, విక్రమ్ కి ఏ పని చేసిన వాళ్ళ అమ్మని తలుచుకోడం అలవాటు, ఎందుకో అమ్మ ఫోటో తీసి చూడాలనిపించింది, విక్రమ్ ఎక్కుడున్నవ్ నువ్వు నా పక్కన ఉంటే బాగుండు అనుకుని సంధ్య అమ్మ ఫోటో మళ్ళీ బ్యాగ్ లో పెట్టి కళ్ళు మూసుకున్నాను ఎందుకో నీరసంగా ఉంది రాత్రి నుంచి, తెగ బాత్రూం వస్తుంది, వాసనా మంచి నీళ్ల టేస్ట్ అన్ని వేరేగా ఉన్నాయ్....

అక్కడనుంచి మూడు గంటల తరువాత ఒక దీవిలో ల్యాండ్ అయ్యింది..

చుట్టూ సముద్రం జన సంచారం లేదు ఎదురుగా పెద్ద కొండలు మధ్యలో మెట్లు అందరు వెళ్తున్నారు వాళ్ళ వెనకాలే వెళ్ళాను చాలా మెట్లు ఎక్కిన తరువాత పెద్ద డోర్స్ రెండూ తెరుచుకున్నాయి... లోపలికి వెళ్ళాను అన్ని ఇల్లు ఒక చిన్న రాజ్యమే ఉంది ఇక్కడ, కార్ ఎక్కి ఎదురుగా ఒక రెండూ కిలోమీటర్స్ ఉంటుందేమో పెద్ద పాలస్ లాగా ఉంది అక్కడికి తీసుకెళ్లారు... మొత్తం ఎటు చూసినా సెక్యూరిటీ లోపలికి వెళ్ళాము, స్వర్గం లా ఉంది ఆ పాలస్, ఇలాంటి ఇంత అందమైన కట్టడం నేను ఇప్పటివరకు చూడలేదు...

..............................................................

మానస : అమ్మా రవి అన్నయ్య అనురాధ ని తీస్కోచాడు..

దేవి : నాకెందుకు చెప్తున్నావ్ అస్సలు అక్కడే చంపేయాల్సింది, ఇక్కడి దాకా అనవసరంగా తీసుకొచ్చారు చంపేయండి.

మానస : అమ్మా ఆ విషయమే నీతో మాట్లాడాలి..

దేవి : కోపంగా "ఏంటి?"

మానస : అనురాధ ని చంపడానికి నేను ఒప్పుకోను, తనని వదిలేయండి....

దేవి : నాకే ఎదురు తిరుగుతున్నావా, ఎదురు తిరిగి బతుకుదామానేనా...?

మానస : రెండూ మోకాళ్ళ మీద కూర్చుని "అమ్మ నేను ఇప్పటి వరకు మిమ్మల్ని ఏమడగలేదు, మీకోసం నా ప్రేమని త్యాగం చేశాను, నా ప్రాణానికి ప్రాణం నేను ప్రేమించిన నా విక్రమ్ ని మోసం చేశాను, తనని చంపుకున్నాను ఇవన్నీ నేను మీకోసం చేసిన త్యాగాలుగా చెప్పట్లేదు, మీ వల్ల నేను చాలా కోల్పోయాను నేను చేసిన మోసం నన్ను నా జీవితాంతం వెంటాడుతుంది దానికి బదులుగా నేను అడిగింది ఒక్క ప్రాణం మాత్రమే "

"అను చాలా సున్నిత మనస్కురాలు ఇవేమి తనకీ తెలియవు తన వల్ల ఎటు వంటి ఆపద కలుగదు నేను మాట ఇస్తున్నాను "

దేవి : అలాగేలే పో ఇంతకీ నా వదిన ఎలా ఉంది?

మానస : ఇందాకే అత్తని కలిసాను, విక్రమ్ చనిపోయాడని చెప్పాను, ముందు కంగారు పడ్డా విక్రమ్ చనిపోయాడంటే నమ్మట్లేదు, మొండి పట్టు మీద ఉంది చిన్నా బతికే ఉన్నాడని.

దేవి : నేను నమ్మట్లేదు నా అల్లుడు చనిపోయాడంటే, మీరు చెప్పడమే కానీ కంఫర్మ్ గా కాదు వాడిది ఈ వంశపు రక్తమే కదా అందుకే నమ్మలేకపోతున్నాను.

మానస : అమ్మ ఒక వేళ చిన్నా బ్రతికే ఉంటే కత్చితంగా నన్ను, అను ని వెతుక్కుంటూ కత్చితంగా వస్తాడు..

దేవి : అంత నమ్మకమా వాడంటే, వాడు కూడా నిన్ను ప్రేమించాడా?

మానస : లేదు నాలో అత్తని చూసుకున్నాడు, నేనే బావని ప్రేమించాను...

దేవి : ఏడుస్తున్నావా?

మానస : లేదు అదీ నువ్వు నాకు నేర్పించలేదు.

దేవి : నీ మొహం చూస్తూనే అర్ధమవుతుంది నువ్వు వాడి వల్ల ఎంతగా మారిపోయావో... ఇక్కడనుంచి వెళ్ళిపో...

మానస మోకాళ్ళ మీద నుంచి లేచి బైటికి వచ్చింది.... అక్కడ అను కనిపించింది....

పెద్ద హాల్ లాగా ఉండే ప్రదేశానికి వచ్చాము ఎదురుగా మానస వచ్చింది తన డ్రెస్సింగ్ స్టైల్ డిఫరెంట్ గా ఉంది, పరిగెత్తుకుంటూ వెళ్లి కౌగిలించుకున్నాను, విడిపించుకుంది ఏమైందా అన్నట్టు చూసాను.

మానస : ఎలా ఉన్నావ్ అను.

అను : బానే ఉన్నాను మానస కానీ ఏంటి ఇదంతా, నీకు మేము తప్ప ఎవ్వరు లేరు కదా ఈ దీవి, ఈ పాలస్ నీ డ్రెస్ ఏంటి ఇదంతా??

మానస : అన్ని తరువాత చెప్తాను, ముందు నీకు తెలియాల్సిన ముఖ్యమైన విషయాలు చాలా ఉన్నాయ్ అన్ని వివరంగా తెలుస్తాయి....

అని పాలస్ వెనక్కి చాలా దూరం తీసుకెళ్ళింది.

మానస : అను నువ్వు ఉండ బోయేది ఇక్కడే నువ్వు జీర్ణించుకోవాల్సిన విషయం విక్రమ్ చనిపోయాడు...

ఆ మాట వినగానే నాకు నవ్వు వచ్చింది "ఏంటి మానస ప్రాంక్ హా, విక్రమ్ ఎక్కడ చూసి దాదాపు రెండు నెలలు అవుతుంది ఎక్కడ దాక్కున్నాడు నా మొగుడు ".

మానస : అనురాధ నువ్వు నమ్మినా నమ్మకపోయినా విక్రమ్ ఇక మనకి లేడు, లోపల విక్రమ్ అమ్మ గారు ఉన్నారు వెళ్లి పలకరించు కానీసం నిన్ను చూస్తే అయినా తను కొంచెం కుదుట పడుతుంది అని అక్కడనుంచి వెళ్ళిపోయింది అనుని చూడకుండా కళ్ళ నిండా నీళ్లతో....

అనుకి ఒక్కసారిగా ఎం అర్ధం కాలేదు ఇప్పటి వరకు తను విన్నదంతా నిజమేనా కళ్ళు తిరిగి పడిపోయింది.... తను పడిన శబ్దానికి మానస వెనక్కి తిరిగి చూసింది వెనకే మానస అత్త సంధ్య అనురాధ ని పట్టుకుని ఉంది, తన చెయ్యి పట్టుకుని పరీక్షించి చూసింది.

మానస వైపు చూసి : మానస ఈ అమ్మాయి ప్రేగ్నన్ట్, ఎవ్వరు ఈ అమ్మాయి ఇంకేంతమందిని పొట్టన పెట్టుకుంటారు మీ దూరశ కోసం, పాపం ఏ కన్న తల్లి బిడ్డో సంతోషంగా ఉండాల్సిన సమయంలో మీ వల్ల ఇక్కడ చిక్కుకుపోయింది....

మానస కళ్ళలో నీళ్లు ఆగలేదు అక్కడ్నుంచి పారిపోయింది, ఎవరో వెంటాడినట్టు ఉంది, ఎవ్వరో కాదు నేను చేసిన పాపలే నన్ను వెంటాడుతున్నాయి నాకు బతకాలని లేదు...విక్రమ్ నన్ను క్షమించు రా, వచ్చే జన్మలో అయినా నీకు పెళ్ళాం గా పుట్టి నీకు సేవలు చేసుకుంటాను.....

సంధ్య కళ్ళు తిరిగి పడిపోయిన అనురాధ ని లోపలికి తీసుకెళ్లి మంచం మీద పడుకోబెట్టింది.....

సంధ్య ఆశ్చర్య పడిన విషయం ఏంటంటే అనురాధ విక్రమ్ పేరు కలవరించడం... ముందు ఆశ్చర్యపోయిన తరువాత అనురాధ లేచే వరకు ఓపికగా తననే చూస్తూ ఉండిపోయింది....

సంధ్య : ఇంత చిన్న వయసులో ఇన్ని కష్టాలు అదీ ఇప్పుడు మాములు మనిషివి కావు, ఏ సంబంధం లేకుండా నిన్ను ఎందుకు తీసుకొచ్చారు, చూస్తే మా మనిషిలా కూడా లేవు, కానీ ఎందుకో నిన్ను చూస్తుంటే నా సొంత మనిషిలా అనిపిస్తున్నావ్ ఎవరు నువ్వు, చూస్తే నీకు ఎలాంటి శక్తులు లేనట్టున్నాయ్, మాములు బాడీ ఇలాంటి కృరుల చేతిలో ఎలా చిక్కావ్..... నిన్ను ఆ దేవుడే కాపాడాలి...

అనురాధ చిన్నగా కళ్ళు తెరిచింది తన కళ్ళు ఎదురుగా ఉన్న మనిషిని చూసి నమ్మలేకపోయింది ఎందుకంటే ఎదురుగా ఉన్నది సంధ్య కాబట్టి... తనని చూస్తూ అమ్మా అని పిలిచి మళ్ళీ కళ్ళు తిరిగి పడిపోయింది.

ఇప్పుడు ఆశ్చర్యపోవడం సంధ్య వంతు అయ్యింది....

అనుకి మళ్ళీ మెలుకువ వచ్చి కళ్ళు తెరిచేసరికి సంధ్య అను నే చూడటం గమనించి వెంటనే లేచి కూర్చుంది....

సంధ్య : తల్లి జాగ్రత్త నువ్వు ప్రేగ్నన్ట్ వి..

ఆ విషయం విన్న అనుకి ఆనందం ఆగలేదు, సంధ్యని కౌగిలించుకొని నవ్వుతూనే గట్టిగా ఏడవడం మొదలుపెట్టింది, ఆ రోదనకి సంధ్య బెదిరినా అనుని సముదాయించి మంచం మీద కూర్చోబెట్టి కళ్ళు తుడిచింది....

అను : అమ్మా విక్రమ్ చనిపోయాడని చెప్తున్నారు అని ఇంకా గట్టిగా ఏడవటం మొదలు పెట్టింది...

సంధ్య : అంటే తల్లి నువ్వు....?

అను : విక్రమ్ భార్యని, నీ కోడల్ని అమ్మా.... అని ఏడుస్తూనే చెప్పింది.

సంధ్యకి కన్నీళ్లు ఆగలేదు, నా కోడలా నా బిడ్డ పెళ్లి చేసుకున్నాడా.. అంటే నీ కడుపులో ఉంది నా వారసులా? ఎంత సంతోషంగా ఉందొ చెప్పలేను....

అను : అమ్మా???

సంధ్య : తల్లీ భయపడకు చిన్నాకి ఎం కాలేదు ఆరోగ్యంగా ఉన్నాడు, నేను చెప్తున్నా కదా నా చిన్నాకి ఎం కాలేదు...

అను : కానీ వాళ్ళు......

సంధ్యా : ష్ ష్.... నేను చెప్తున్నా కద తల్లీ చిన్నాకి ఎం కాలేదని, వాడికి ఏమైనా అయితే ఈ గుండె ఆగిపోతుంది... ఈ పాటికి నీ కోసం వెతుకుతుంటాడు, నేను బతికే ఉన్నా అని తెలిసిన ఇరవై నాలుగు గంటల్లో మన ముందు ఉంటాడు, నీ భర్త ఇంకా ఇక్కడ ఇంకా లేడంటే ఏదో ముఖ్యమైన పని మీద ఉండి ఉంటాడు, లేదా నీ జాడ ఇంకా తెలియకుండా అయినా ఉండాలి..

అను సంధ్య చెప్పేది అంత ఏడుపు ఆపేసి వింటుంది కొంచెం ధైర్యంగా నే ఉన్నా భయం గా కూడా ఉంది.

అను నీరసాన్ని గమనించిన సంధ్య తల్లీ ఏమైనా తిందువు లే అని లోపలి నుంచి ఫ్రూట్స్ కోసుకొచ్చింది, అను ఇంకా బాధపడటం చూసి...

సంధ్య : తల్లీ నీ పేరెంటమ్మా?

అను : అను.... అనురాధ..

సంధ్య : అనురాధ... చక్కటి పేరు ఇంద కొంచెం తిను అస్సలే కడుపు తో ఉన్నావు, నీకు చిన్నా కడుపులో ఉన్నప్పుడు విషయాలు చెప్పనా?

అను : హ్మ్మ్.....

సంధ్య : కట్ చేసిన పళ్ళు అనుకి తినిపిస్తూ "చిన్నా కడుపులో ఉన్నప్పుడు నాతో మాట్లాడే వాడు తెలుసా...

అను : ఎలా?

సంధ్య : అదీ అంతే తల్లికి బిడ్డకి సంబంధించిన విషయం, వాడు నన్ను మొదటసారి తన్నినప్పుడు నా ఆనందం వర్ణించలేనిది, నేను రోజు ఒక కొత్త విషయం వాడితో మాట్లాడేదాన్ని... చెప్పిన విషయం మళ్ళీ చెప్పామనుకో తన్నే వాడు.... వాడు పుట్టాకే నా జీవితంలో ఆనందం, సుఖం అన్ని అనుభవించాను వాడు నన్ను మొదటి సారి అమ్మ అని పిలిచినప్పుడు ఈ లోకాన్నే మర్చిపోయాననుకో...

పాలు తాగిన తరువాత వాడే నా జాకెట్ ఉక్స్ పెట్టి నా పైట కనిపించకుండా నా చుట్టూ కప్పి వెళ్ళేవాడు...

నీకింకోటి చెప్పనా చిన్నా అస్సలు మధ్యాహ్నం పూట పడుకోడు మరి ఇప్పుడు ఎలా ఉన్నాడో తెలీదు కానీ మధ్యాహ్నం పూట చిన్నా ని బలవంతంగా పడుకోపెట్టినా మనల్ని నిద్రపుచ్చి వాడు బైటికి వెళ్లిపోయేవాడు, మాయోడు ఎప్పుడు మాయ చేస్తూ ఉంటాడు.....అని మురిసిపోయింది.

చిన్నా లెక్కల్లో చాలా ఫాస్ట్ తెలుసా, మనం క్వశ్చన్ కి ఆన్సర్ ఫస్ట్ స్టెప్ వేసేలోపు చిన్నా ఆన్సర్ రాసేస్తాడు, అంత ఫాస్ట్, ఇంతకీ చిన్నా ఎం చదువుకున్నాడు, బలంగా ఉంటాడా, సున్నితంగా ఉంటాడా రఫ్ గా ఉంటాడా, ఇప్పటివరకు ఎవరితో అయినా గొడవ పడ్డాడా, పడే ఉంటాడు వాడికి కోపం చాలా ఎక్కువ, జోకులు వేస్తాడా సీరియస్ గా ఉంటాడా, అవతలి వాళ్ళతో ఎలా మాట్లాడతాడు, పక్క వాళ్ళకి హెల్ప్ చేస్తాడా, వాడికి కంపెనీ రాసిచాను వాళ్ళని కలిశాడా, ఇప్పుడు ఎలా ఉన్నారు.

నీతో ఎలా ఉంటాడు, నిన్ను ఆటపట్టిస్తాడా? నన్నయితే తెగ ఆడించేవాడు... ఏదైనా అనుకున్నాడంటే మాత్రం సాధించేదాకా వదలడు నా బంగారు కొండ... వాడికి ఆలు ఫ్రై పప్పు చారు అంటే చాలా ఇష్టం నీతో చేపించుకుంటాడా.... నేను లేకుండా ఎన్ని కష్టాలు పడ్డాడో నాకోసం ఎంత ఏడ్చి ఉంటాడో....

అను కళ్లార్పకుండా వినడం చూసి "ఏమైంది అను"... అంది.

అను : మీ అబ్బాయి కూడా ఇంతే మిమ్మల్ని ఇలానే తలుచుకునేవాడు.

సంధ్య : అవునా నేను గుర్తున్నానా వాడికి?

అను : గుర్తుండడమా అస్సలు మిమ్మల్ని తలుచుకోకుండా లేవడు, లేవంగానే మనసులో మిమ్మల్ని తలుచుకుని ఆ తరువాతే లేస్తాడు, ఏ పని చెయ్యాలన్న మిమ్మల్ని తలుచుకుంటాడు, చాలా సార్లు ఒంటరిగా పిచ్చి వాడిలా మీతో మాట్లాడుకోడం చూసాను... నాకైతే ఒక్కోసారి చికాకు వచ్చేసేది అమ్మ అమ్మా అని గోలకి....

అనుక్షణం మిమ్మల్ని గుర్తు చేసుకుంటాడు ఏదైనా తినేటప్పుడు కూడా వంకాయ ఫ్రై అంటే మా అమ్మకి ఎంత ఇష్టమో అని... ప్రతి పనిలో ఆలోచనలో విక్రమ్ అన్ని పనుల్లో మీరే ఉంటారు....

సంధ్య ఆనందానికి అవధులు లేవు, అలాంటి కొడుకు పుట్టినందుకు దేవుడికి దండం పెట్టుకుంది.

అను అదీ చూసి నవ్వుకుంది.

సంధ్య : ఇంకా చెప్పు విక్రమ్ గురించి మీరిద్దరూ ఎలా కలిశారు ఎలా పెళ్లి చేసుకున్నారు అయినా నీ మెడలో తాళి లేదేంటి, నీ చేతికి ఉంగరం కూడా లేదు నా బిడ్డ గురించి నీకు తెలిసినదంతా నాకు చెప్పవా?

అను : అమ్మా నాకు కొన్ని సందేహాలు ఉన్నాయి మీరు చనిపోయారని మిమ్మల్ని మా వాళ్లే చంపేసారని విన్నాను, కానీ ఇదంతా ఎలా మీకేం కాకపోతే విక్రమ్ మీ నుంచి ఎలా దూరం అయ్యాడు, అస్సలు ఈ పాలస్, ఈ మనుషులు ఎవ్వరు వీళ్లంతా, ఇక మానస తన గురించి నాకేం అర్ధం కావట్లేదు అస్సలు ఇక్కడ ఎం జరుగుతుంది.....

సంధ్యా : ఇదంతా పెద్ద కద తీరికగా చెప్పుకుందాం ముందు నువ్వు ఫ్రెష్ అవ్వు చాలా అలిసిపోయావ్ మనకి ఇక్కడ మాట్లాడుకోడం తప్ప వేరే పని ఉండదు, ముందు ఫ్రెష్ అవ్వు పో......

అను ఫ్రెష్ అవ్వడానికి లోపలికి వెళ్ళింది..... మానస లోపలికి వచ్చింది.

సంధ్య : మానస ఎందుకోచ్చావ్...

మానస : అను ఎలా ఉందొ చూద్దామని....

సంధ్య : మీరు వదిలేస్తే బతుకుద్ది అయినా నీకు అను ఎలా తెలుసు ఎం చెప్పి మోసం చేసావు... మీకు అలవాటే కదా నమ్మించి మోసం చెయ్యడం..

నా కొడుకు వచ్చేంత వరకే మీ ఆటలు.

నా కొడుకు నన్ను చూసిన రోజే ఈ సామ్రాజ్యం, మీరు, మీ దురాశలు అన్ని అంతం అవుతాయి...

మానస అక్కడ నుంచి వెళ్ళిపోయింది.

కొంచెం సేపటికి అను బైటికి వచ్చింది.

సంధ్య : అను మానస నీకెలా పరిచయం...

అను : మానస నాకు కాదు విక్రమ్ కి పరిచయం తనలో నిన్ను చూసుకునే వాడు, మానసకి కూడా విక్రమ్ అంతే వాళ్ళిద్దరినీ చూస్తే అమ్మ కొడుకులేమో అనుకుంటారు ఎవరైనా....

సంధ్య : ఇలా కాదు మొత్తం మొదటి నుంచి నాకు అంతా తెలియాలి...

అను : అమ్మా ముందు మీరు చెప్పండి అస్సలు మీరు బతికుండడం ఎలా??? ఏంటి ఇదంతా..?

సంధ్య : సరే చెపుతాను విను.....​
Next page: Update 18
Previous page: Update 16