Update 21
కాల చక్రం ముప్పై ఐదు సంవత్సరాల తిరిగిన తరువాత.
లొకేషన్ బెంగుళూరు, పెద్ద స్థలం చుట్టూ కాంపౌండ్ వాల్ అక్కడక్కడా గోడ పగిలిపోయి ఉంది, ఫెన్సింగ్ కూడా మొత్తం ఓడిపోయింది , రెండు బండ్ల మీద వచ్చిన ఆ ఇద్దరు జంటలు లోపలికి వెళ్లారు, మొత్తం ఎండిపోయిన గడ్డి ఇంతకముందు పూలు పెంచారేమో మట్టి చదునుగా ఉంది.
నలుగురు మధ్యలో శిదిలావస్థలో ఉన్న ఒక ఇల్లు దెగ్గరికి నడుచుకుంటూ వెళ్లారు అక్కడ ఎవరో ముసలావిడ, మాములు బూడిద రంగు కాటన్ చీర కట్టుకుని ఇంత పెద్ద ఎడారి లాంటి స్థలంలో నాలుగు పచ్చటి రోజా మొక్కలకి నీళ్లు పోసి, ఆ మొక్కల నుంచి నాలుగు రోజా పూలు తెంపి ఇంటి వెనక్కి వెళ్తుంది.
ఆమెని పిలిచారు, వెనక్కి తిరిగి వాళ్ళని చూసి ఆశ్చర్యంగా రెండు అడుగులు వెనక్కి వేసింది కాని ఇది తన మనవళ్ల కుట్రేమో అని బయటపడకుండా "ఎవరు కావాలి మీకు? ఒకవేళ మిమ్మల్ని నా మనవళ్ళు పంపించి ఉంటే వెనక్కి వెళ్లిపోండి వాళ్ళు అనుకునేది జరగాలంటే అది నేను చచ్చిపోయాకే అని చెప్పండి" అంది.
ఆ నలుగురిలో మొదటి వాడు "అమ్మా మేము ఇక్కడ సంధ్యగారిని కలవడానికి వచ్చాము మీరు...?" అన్నాడు.
దానికి ఆ ముసలావిడ మాట్లాడిన అబ్బాయి గొంతులో ఉన్న మర్యాదని గుర్తించి "నేనే సంధ్యని బాబు, ఏం కావాలి?" అంది.
"అమ్మా! మీరు ఇలాగ ఇక్కడ ఉన్నారెంటి?" అన్నాడు.
దానికి ఆ ముసలావిడ నవ్వి వెనక్కి తిరిగి వాళ్ళకి కనిపించకుండా ఆశ్చర్యంగా నోటి మీద చెయ్యి వేసుకుని వెళ్ళిపోతుంది పువ్వులు పట్టుకుని..
ఇంతలో ఆ అబ్బాయి పక్కనే ఉన్న అమ్మాయి "అమ్మా మేము మీ అబ్బాయి విక్రమాదిత్య గురించి తెలుసుకోడానికి వచ్చాము మాకు చెప్తారా?" అంది.
దానికి ఆమె ముందుకి వెళ్తూనే ఒక నవ్వు నవ్వి "చెప్తాను లే ముందు నాకు మీరెవరో చెప్పండి, నా కొడుకు గురించి ఎందుకు తెలుసుకోవాలనుకుంటున్నారో కూడా చెప్పండి" అని ఇంటి వెనక్కి వెళ్ళిపోయింది
నలుగురు ఆమెని అనుసరిస్తూ ఇంటి వెనక్కి వెళ్లారు అక్కడ నాలుగు సమాధులు ఉన్నాయి, రోజు జాగ్రత్తగా చూసుకుంటారేమో చాలా నీట్ గా ఉన్నాయ్ ఆ సమాధులు, వాటిని ఆ ముసలావిడ ఆప్యాయంగా నవ్వుతూ చూసి తన చేతులతో స్పృశిస్తూ ఒక్కో సమాధి మీద ఒక్కో పువ్వు పెట్టి అక్కడున్న రెండో సమాధి తల సైడ్ కి వచ్చి సమాధికి ముద్దు ఇచ్చింది.
నలుగురు అటు వైపుకి వెళ్లారు ఒక్కో సమాధి మీద ఉన్న పేర్లు చదువుతు, మొదటి దాని మీద మానస అని, మూడవ దాని మీద అనురాధ అని చివరి సమాధి మీద శశి అని ఇక ముసలావిడ ముద్దు పెట్టిన రెండవ దాని మీద విక్రమాదిత్య అని సువర్ణక్షరాలతో రాసి ఉంది, అది చూసి ఆ నలుగురు ఆశ్చర్యపోయారు...
సంధ్య తన బిడ్డ సమాధికి ఆనుకుని కూర్చొని వాళ్ళని చూస్తూ "ఇంతకీ మీ పేర్లు కూడా చెప్పలేదు నాకు" అంది.
నలుగురు షాక్ లోనే సంధ్య ముందు కూర్చొని ఇందాక మాట్లాడిన అబ్బాయి "అమ్మా! నా పేరు విక్రమ్ తను నా భార్య మానస, ఇక తను నా స్నేహితుడు ఆదిత్య అతని మరదలు అనురాధ" అన్నాడు.
విన్న సంధ్య ఆశ్చర్యపోయి తన కొడుకు సమాధిని చూస్తూ "విధి లిఖితం" అని నవ్వుతూ "మీరిద్దరూ ఫ్రెండ్స్ అన్నారు కానీ ఇద్దరు చూడటానికి కొంచెం ఒకేలా ఉన్నారు" అని తన సందేహం తెలియచేస్తూనే..."చెప్పండి మీకేం కావాలి" అంది.
విక్రమ్ : అది మాకు తెలీదు తనకీ నాకు ఈ మధ్యే స్నేహం కుదిరింది కానీ అది ఎంత మంచి స్నేహం అంటే ఒకరి కోసం ఒకరం చచ్చిపోయే అంత....ఇక మేము ఒచ్చిన పని విక్రమాదిత్య గారి గురించి తెలుసుకోవాలి, తను ఎలా చనిపోయాడు, ఈ దేశానికి ఇంత మంచి చేసిన అతని గురించి ఎందుకు మాట్లాడుకోవట్లేదు, కనీసం తన ఫోటో కూడా నెట్ లో దొరకలేదు మాకు...తను చేసిన మంచి అంతా నాశనం అవుతుంటే మీరు ఎలా చూస్తూ ఊరుకున్నారు, మాకు తన కథ చెప్పరా?" అని అడిగాడు...
సంధ్య వాళ్ళని చూస్తూ విక్రమాదిత్య కధ చెప్పడం ఆరంభించింది, నలుగురు శ్రద్ధగా వింటున్నారు, ఇంకొకపక్క....
ఫోన్లో... "రేయ్ చందు ఆ ముసలిదాన్ని వేసేయ్యమని సుపారీ వచ్చింది, చంపడానికి మనోళ్ళని తీసుకెళ్ళోద్దు పది మంది పిల్లల్ని తీసుకెళ్ళు, ఎలా ఉండాలంటే సంధ్య ఫౌండేషన్ బాధితులు కోపం తట్టుకోలేక ఆ ముసలిదాన్ని చంపేశారని రేపు న్యూస్ లో రావాలి".... "అలాగే అన్న సాయంత్రానికి గుడ్ న్యూస్ వింటావ్" అని కాల్ కట్ చేశాడు.
సుమారు రెండు గంటల వరకు కథ విన్న తరువాత సంధ్యని చూసి ఆ నలుగురు...
విక్రమ్ : మానస అంత మోసం చేసిందా?
మానస : కాదు ప్రేమించింది, కానీ మానస ఆ తరువాత బతికే ఉందా చనిపోయిందా?
విక్రమ్ : మానస చిన్నప్పటి నుంచి అనాధ ఆశ్రమంలో ఎందుకు ఉంది.
ఆదిత్య : అమ్మా! మీరు ముందే చనిపోయారు కదా ఎలా బతికారు...
అను : అనురాధ గారికి ఏమైంది, ఆ అడవికి వెళ్ళాక? విక్రమాదిత్య గారు మిమ్మల్ని కలుసుకున్నారా?
మళ్ళీ ఏదో అడగబోతుండగా సంధ్య వాళ్లందరిని ఆపి....
సంధ్య : ఆగండి ఆగండి, మీకు చాలా సందేహాలు అనుమానాలు ఉన్నాయని తెలుసు, మీరు అడిగిన వాటి కంటే నా కొడుకు నన్ను ఎక్కువే అడిగాడు, వాడికి చెప్పిన సమాధానాలే మీకు చెప్తాను...
ఇంతలో ఇంటి ముందు గోల గోలగా సౌండ్ వస్తుంటే అందరూ ముందుకి వెళ్లారు....ఒక పదిహేను మంది అందులో పది మంది ఇంకా మీసాలు రాని పిల్లలు... చేతిలో కత్తులతో వస్తున్నారు, అది చూసి విక్రమ్ మరియు ఆదిత్య అలెర్ట్ గా సంధ్య ముందు నిలబడ్డారు.
సంధ్య : వాళ్ళని ఆపొద్దు ఈ కధలో చివరిగా మిగిలింది నేనే, దీని కోసమే నేను ఎదురుచూస్తున్నాను నన్ను పోనివ్వండి నా కొడుకు దెగ్గరికి వెళ్ళిపోతాను...
ఆదిత్య : అమ్మా మీరు ఈ కోరిక మాకు కథ చెప్పకముందు కోరి ఉంటే కనీసం ఆలోచించే వాళ్ళం.
విక్రమ్ : ఇన్ని ట్విస్టులు పెట్టి నేను పోతానంటే ఎలా ఒక రెండు నిముషాలు టైం ఇవ్వండి ఆ పిచ్చి కుక్కలని తరిమి వచ్చేస్తాం..ఆ తరువాత మిమ్మల్ని చాలా అడగాలి మానస అను ఇద్దరు సంధ్య గారిని లోపలికి తీసుకెళ్లండి...
వచ్చిన అందరిని విక్రమ్, ఆదిత్య ఇద్దరు కలిసి కుమ్మేశారు, ఇంటి లోపల నుంచి మానస అనురాధ కేకలు విని లోపలికి పరిగెత్తారు...
లోపల మానస అనురాధ భయంగా కింద కూర్చుని తల ఎత్తి చూస్తున్నారు, ఇద్దరు వెళ్లి వాళ్ళని పట్టుకుని.
విక్రమ్ : మానస ఏమైంది?
ఆదిత్య : అను...?
అను, మానస ఇద్దరు చేతులు ఎత్తి పైన చీకట్లో దీపాల మధ్యన గోడకి తగిలించి ఉన్న ఫోటోలని చూపించారు...
విక్రమ్ మరియు ఆదిత్య ఇద్దరు తలలు ఎత్తి ఆ ఫోటోలని చూసారు... ఆదిత్య ఆశ్చర్యపోయి రెండు అడుగులు వెనక్కి వేసి పడబోతుంటే విక్రమ్ ఆదిత్య భుజం మీద చెయ్యి వేసాడు.
అను మానస కూడా నిలబడ్డారు... నలుగురు ఆశ్చర్యంగా సంధ్యని చూసారు...............

నలుగురు ఆశ్చర్యంగా సంధ్య వైపు చూసారు, సంధ్య ఏం మాట్లాడలేదు.
ఆదిత్య : విక్రమాదిత్య అచ్చు మాలాగే ఉన్నాడేంటి?
సంధ్య : ఆ ప్రశ్న అడగాల్సింది నేను, మీరే నా కొడుకు పోలికలతో ఉన్నారు.
విక్రమ్ : కానీ ఎందుకు?
మానస : మరి నాకు అనురాధకి కూడా ఇవే పేర్లు ఉన్నాయి మరి మేము ఎందుకు వాళ్ళలా లేము.
విక్రమ్ : నువ్వు నీ పిచ్చి డౌట్లు ఆగు.. అమ్మా మీరు చెప్పండి.
సంధ్య : నాకు తెలీదు, మీకేమైనా తెలిస్తే నాకు చెప్పండి.
ఆదిత్య విక్రమ్ ఇద్దరు ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు.. నలుగురు కింద కూలబడ్డారు ఎవ్వరికి ఏం అర్ధం కావడంలేదు.
విక్రమ్ : ఆదిత్య మీ అమ్మ నాన్నా గురించి చెప్పు వాళ్ళు ఎక్కడనుంచి?
ఆదిత్య : ఇద్దరు ఒక మాములు ఎంప్లొయ్స్ కి పుట్టిన వాళ్ళు, చిన్నప్పుడే చనిపోవడంతో మా నాన్న అత్తయ్య వాళ్ళ స్వయంకృషితో ఎదిగారు, మా అమ్మ తరపు కూడా అంతా క్లీన్.. కానీ మా అత్తయ్యే ఉన్నపళంగా గొడవ పెట్టుకుని మా నుంచి దూరంగా వెళ్ళిపోయింది దానికి కారణం నాకు తెలీదు కానీ నా అనుమానం అంత వరకే కానీ దానికి దీనికి ఎటువంటి సంబంధం లేదు.
విక్రమ్ : మా అమ్మ నాన్నా ఇద్దరు ఆనాధలు ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు, నాన్న తన చిన్నతనం గురించి నాకు పూర్తిగా చెప్పాడు, కానీ అమ్మ చిన్నప్పుడు తన గురించి ఏదో చెపుతూ మధ్యలో ఆగిపోయింది నాకు అది ఇంకా గుర్తే..
ఆదిత్య : అంటే ఏంటి నువ్వనేది?
విక్రమ్ : నేనేమి అనట్లేదు కానీ విక్రమాదిత్య కధ వినలేదా.. అయన గురించి ప్రతి ఒక్కటి రహస్యమే, ప్రతి పని అలానే ఉంది, అన్ని ట్విస్టులు టర్నులు ఆయన జీవించినన్ని రోజుల్లో ఏ ఒక్క రోజు కూడా ప్రశాంతంగా లేడు.. ఎప్పుడు ఏదో ఒక సమస్య.. దేన్ని నమ్మడానికి లేదు.. ఏమైనా జరిగి ఉండొచ్చు ఒకసారి ఆలోచించు.. ఆదిత్య అనే చిన్న పాత్ర నీది నీ మరదలుతొ సంతోషంగా ఉన్న నీ జీవితంలోనే ఏవేవో జరిగాయి అలాంటిది ఈ విక్రమాదిత్య అనే పాత్ర మన జీవితాలతో పోల్చుకుంటే ఒక మహా వృక్షం లాంటిది.. ఏదైనా జరిగే అవకాశం ఉంది.
ఆదిత్య : ఆన్సర్లు దొరకడం కష్టమే కానీ అవునా కాదా అని మాత్రం చెప్పగలను.
విక్రమ్ : అర్ధం కాలేదు..
ఆదిత్య సంధ్య వైపు తిరిగాడు.
ఆదిత్య : విక్రమాదిత్య వాడిన వస్తువులు ఎక్కడున్నాయి?
సంధ్య : తెస్తాను
ఆదిత్య : అను వైపు మానస వైపు చూసి హెయిర్ శాంపిల్ దొరికితే చాలు, లేదంటే సమాధి తవ్వడమే.. ఇక విక్రమ్ మీ అమ్మని నాన్నని, అను నువ్వు అత్త వాళ్ళని అమ్మ వాళ్ళని అందరిని రమ్మను.
అను : వాళ్ళు పిలిస్తే వస్తారా
ఆదిత్య : రావాలి లేకపోతే వచ్చి అందరి చేతులు కోసి మరి బ్లడ్ శాంపిల్ తీసుకుంటా అని చెప్పు.. పిలు పిలు పిలు అందరిని పిలు.. విక్రమ్ నువ్వు మానస ఆ పని మీద ఉండండి దానికంటే ముందు అను మన నలుగురి బ్లడ్ సాంపిల్స్ తీసుకో.. అన్ని ల్యాబ్ కి పంపించు.. ఎవరైనా ఉన్నారా
అను : రమేష్ ఉన్నాడుగా, వాడు చేస్తాడులే
ఆదిత్య : వాడు మనకి ఇలా ఉపయోగ పడుతున్నాడన్నమాట... హహ
ఆదిత్య అనురాధ బైటికి వెళ్లి ఇంజెక్షన్స్ శాంపిల్ కలెక్షన్స్ తీసుకొస్తే మానస విక్రమ్ ఈలోగా విక్రమాదిత్యకి సంబంధించిన వాటిలో నుంచి దువ్వెనలో ఒక పొడుగు వెంట్రుకతో పాటు ఇంకో చిన్న వెంట్రుక దొరికింది.. సంధ్యకి చూపించారు.. చూసి గుర్తు తెచ్చుకుని చిన్న వెంట్రుక పట్టుకుని అది తన కొడుకుదే అని కంఫర్మ్ చేసింది.
ఆదిత్య అను లోపలి రాగానే విక్రమ్ మానస ఎదురు వచ్చారు
మానస : శాంపిల్ దొరికింది..
ఆదిత్య : అను శాంపిల్ కలెక్ట్ చేసుకో, అనగానే అనురాధ విక్రమ్ నుంచి మానస నుంచి అలాగే ఆదిత్య నుంచి, ఆ తరువాత ఆదిత్య అను నుంచి కూడా బ్లడ్ శాంపిల్ తీసాడు... ఇవి రమేష్ దెగ్గరికి చేర్చాలి.
అనురాధ : మానస మన హీరో ఉన్నాడుగా పిలు
ఆదిత్య : ఎవరు
మానస : సుభాష్ ద లవర్ బాయ్
విక్రమ్ : వాడా, వాడు బెంగుళూర్ లో ఏం చేస్తున్నాడు
మానస : ఎవరో జర్నలిస్ట్ దెగ్గర డ్రైవర్ గా పని చేస్తున్నాడు.. పని మీద ఇక్కడే ఉన్నాడు వాడైతే ఎంత దూరం అయినా చిటికలో డెలివరీ ఇస్తాడు.
ఆదిత్య : ఫోన్ చెయ్యండి మరి
మానస : మీరే చేసుకోండి.. అని నవ్వింది.. దానికి అనురాధ కూడా మీరే చెయ్యండి అంది.
విక్రమ్ ఫోన్ తీసి సుభాష్ కి కాల్ చేసాడు..
విక్రమ్ : రేయి ఎక్కడున్నావ్
సుభాష్ : ఎవడ్రా నువ్వు ?
విక్రమ్ : విక్రమ్.. (కోపంగా)
సుభాష్ : అన్నా నువ్వా అన్నా, చెప్పు చెప్పు
విక్రమ్ : నీ ఫోన్ స్క్రీన్ మీద నా పేరు పడింది అని నాకు తెలుసు కావాలని గెలుకుతున్నావ్ కదరా
సుభాష్ : నీతో నాకు జోకులేంటన్నా, చెప్పు ఎందుకు ఫోన్ చేసావ్.
విక్రమ్ : పని ఉంది
సుభాష్ : చేసుకో అన్నా దానికి నాకు ఫోన్ చెయ్యడం దేనికి
విక్రమ్ : రేయి నీతోటె పని ఉంది..
సుభాష్ : రాలేను చాల బిజీ
విక్రమ్ కోపంగా మానస వైపు చూసి "చాలా సంతోషమా ఇక మాట్లాడు వాడు ఎవ్వరి మాట వినడు" అని ఫోన్ మానస చేతికి ఇచ్చాడు.
మానస : (నవ్వుతూ ఫోన్ తీసుకుని) హలో సుబ్బు
సుభాష్ : ఆ.. చెప్పు
మానస : అవసరం పడిందిరా, నువ్వు తప్ప ఎవ్వరు చెయ్యలేరు
అనురాధ : అవును సుబ్బు నువ్వొస్తే నీకు మా నర్స్ ని పరిచయం చేస్తా, మంచి ఆఫర్ మళ్ళి మిస్ అయిపోతావ్.
సుభాష్ : అందరూ ఒకే దెగ్గర ఉన్నారన్న మాట.. సరే సరే ఇంక సాగదీయకండి... వస్తున్నా లొకేషన్ పంపించండి.
మానస : మంచోడు మా త...
సుభాష్ :వస్తానని చెప్పాను కదా మళ్ళి తమ్ముడు అని వరసలు కలపకండి.. హలో హలో...
మానస : ఆ ఉన్నా
సుభాష్ : ఇంతకీ ఆ నర్స్ పేరేంటి?
మానస అను వైపు చూసింది అయోమయంగా, అనుకి ఏం చెప్పాలో తెలీక..
అను : వాయిలా హట్
సుభాష్ : ఏంటి? వాయిలా హట్ ఆ.. అదేం పేరు ?
మానస : కావాలా వద్దా, ఇక్కడ అర్జెంటు అంటేనో..
సుభాష్ : ఆ సరే సరే వస్తున్నా
మానస ఫోన్ పెట్టేసి హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుని అందరి వైపు చూసింది. విక్రమ్ ఆదిత్య ఇద్దరు కోపంగా ఉండటం చూసి అను మానసలు నవ్వుకున్నారు.
ఆదిత్య : ఇంతకీ ఆ వాయిలా హట్ ఎవరు?
అను : అలియా భట్ పేరు చెపితే కనిపెడతాడని అలా తిరగేసి చెప్పా తింగరోడు నమ్మేసాడు.. అని పగలబడి నవ్వింది... అందరూ కడుపు పట్టుకుని నవ్వుకున్నారు..
విక్రమ్ : పాపమే వాడు, వాడి లవ్ ఏదో సెట్ చెయ్యొచ్చు కదా..
మానస : అబ్బో అదో పెద్ద కధలే.. మనది తేలాక వాడిని కూడా సెట్ చేద్దాం.. ఇదిగో లైవ్ లోకేషన్ పంపించాడు వాడు వచ్చేసరికి రెండు గంటలు పడుతుంది. ఈలోగా ఏం చేద్దాం..
విక్రమ్ : అక్కడ రోజా మొక్కలు ఉన్నాయ్ కదా, ఇంకొన్ని మొక్కలు నాటుదాం పదండి, మళ్ళి ఈ నేలని పచ్చగా మార్చుదాం ఏమంటారు..
అను : ఏమంటాం ఓకే అంటాం.. పదండి.
నాలుగు మొక్కలు నాటారో లేదో సుభాష్ కారు డ్రిఫ్ట్ అవుతూ వచ్చి ఆగింది ఆదిత్య టైం చూసుకుని, మానస వైపు చూసాడు.
ఆదిత్య : రెండు గంటలన్నావ్, వీడేమో అరగంటలో ఊడిపడ్డాడు.
మానస : వాలియా హట్ ఎఫెక్ట్ లే..
ఆదిత్య విక్రమ్ నవ్వు ఆపుకోలేక వెనక్కి తిరిగి చెట్లు నాటడం మొదలు పెట్టారు.
సుభాష్ : ఎక్కడా నా వాయీలాకు ఎక్కడా
అను లోపలనుంచి సాంపిల్స్ బాక్స్ తెచ్చి సుబ్బిగాడి చేతిలో పెట్టింది.
మానస : ముందు ఇది అర్జెంటు
సుభాష్ : మరి నా వాయీలాకు
అను : ముందు పొయ్యి రారా..
సుభాష్ : అక్కడ మా మేడంని వదిలేసి వచ్చాను తెలుసా అస్సలే కోపిష్టిది.. ఇదిగో ఫోన్ చేస్తుంది.. హలొ మేడం..
అక్షిత : ఎక్కడ చచ్చావ్ రా
సుభాష్ : మేడం టాయిలెట్ కి వచ్చాను మేడం, సగంలో ఉన్నా ఆపుకొని వచ్చేయమంటారా
అక్షిత : ఈ రికరికలే తగ్గించుంటే మంచిది, దానికి నా కార్ ఎందుకు తీసుకుపోయావ్
సుభాష్ : వచ్చేస్తున్నా, అయిపోవచ్చింది..
అక్షిత : నీ వల్ల ఇప్పటికి నాలుగు కార్లు మార్చాను, నా మొగుడికి తెలిసిందంటే నిన్ను నన్ను చీరేస్తాడు..
సుభాష్ : వస్తున్నా.. హలో.. మేడం సిగ్నల్ లేదు నేను మళ్ళి చేస్తా
అక్షిత : నటుడివిరా నువ్వు
సుభాష్ ఫోన్ కట్టేసి మానస వైపు చూసి "చూసావా ఎలా గోల చేస్తుందో.. అట్లుంటది మనతోని" వెళ్ళాలి ఇది ఎక్కడ డెలివరీ చెయ్యాలి.
అను : లొకేషన్ పంపించా
సుభాష్ : జాగ్రత్తగా పెట్టారా
అను : ఆ.. నీ స్పీడ్ గురించి తెలిసిందేగా నువ్వు ఎంత స్పీడ్ గా వెళ్లినా ఏం కాదు..
సుభాష్ : బై.. ఇంతకీ వీళ్లేందుకు తెగ పని చేస్తునట్టు నటిస్తున్నారు.
మానస : విన్నారంటే తంతారు పో..
సుభాష్ : నా వాయిలు జాగ్రత్త.. అని కార్ స్టార్ట్ చేసి ముందుకు దూకించాడు.
అందరూ నవ్వుకుని మళ్ళి చెట్లు నాటడం మొదలు పెట్టారు, సంధ్య నలుగురిని చూసి లోపలి వెళ్లి విక్రమ్ ఫోటో వెనకాల ఉన్న ఇంకొక ఫోటో తీసి చూసి కళ్ళు తుడుచుకుంది..
సాయంత్రానికి ఇటు అను ఆదిత్య వాళ్ళ కుటుంబాలు ఇటు విక్రమ్ కి సంబంధించిన సలీమా విక్రమ్ వాళ్ళ నాన్న వచ్చారు అందరూ లోపలికి వస్తుంటే సంధ్య బైటికి వచ్చింది..
ఇంతలో డిఎన్ఏ రిపోర్ట్స్ మెసేజ్ అనుకి వచ్చి ఆ వెంటనే కాల్ వచ్చింది.. ఆదిత్యని కేక వేసింది..
అను : హలో బావా.. థాంక్స్ రా
రమేష్ : వద్దు అలా పిలవకు, నువ్వు నాకు దింపిన బాణాలు ఇంకా బైటికి రాలేదు, పేరు పెట్టి పిలువు చాలు.. అని పెట్టేసాడు.
ఆదిత్య ఫోన్లో రిపోర్ట్స్ చదివి విక్రమ్ వైపు చూసాడు.
విక్రమ్ : ఏమైంది?
ఆదిత్య : రిపోర్ట్స్ మ్యాచ్ అవుతున్నాయి..
ఇంతలో బైట సలీమా గొంతు విని విక్రమ్ తో పాటు అందరూ బైటికి వచ్చారు.. అక్కడ సలీమా గేట్ దెగ్గరే విక్రమ్ వాళ్ళ అమ్మ కావ్యని పిలుస్తు లోపలికి లాగుతుంటే కావ్య మాత్రం అటు వైపు చూసి భయపడుతూ గేట్ గట్టిగా పట్టుకుని ఉంది.
అందరూ ఎవరి వైపు చూస్తుందా అని చూస్తే ఇంటి గడప దెగ్గర నిల్చొని ఉన్న సంధ్య ని చూసి ఆగిపోయిందని విక్రమ్ కి ఆదిత్యకి అర్ధం అయింది..
విక్రమ్ : ఆదిత్య.. మా అమ్మకి ఏదో తెలుసు.. అని ఎదురు వెళ్లి కావ్యని చూసాడు..
కావ్య : విక్రమ్ నువ్వు ఇక్కడ.. ఇక్కడ నువ్వు ఉండకూడదు పదా వెళదాం.. అని సైగ చేస్తూ చెయ్యి పట్టుకుని లాగింది.. కావ్య ఎప్పుడు ఇలా ప్రవర్తించడం చూడని తన మొగుడు కొడుకు కూతురు సలీమ అందరూ షాక్ అయిపోయారు.