Update 22
విక్రమ్ తన తల్లి కావ్యని నడిపించుకుంటూ లోపలికి తీసుకొచ్చి కూర్చోబెట్టాడు, కావ్య గోడ మీద ఉన్న ఫోటోలని చూసి ఆ పక్కనే ఆదిత్య నాన్నని అనురాధ అమ్మని చూసి కళ్ళు తిరిగి పడిపోయింది.
విక్రమ్ : అమ్మా.. ఆదిత్య అని పిలవగానే అను వెళ్లి కావ్యని పడుకోబెట్టి చెక్ చేసి లేచింది.
అను : కళ్ళు తిరిగి పడిపోయింది అంతే, జర్నీ చేసింది కదా కొంచెం సేపు రెస్ట్ తీసుకోనివ్వండి. అని అందరి వైపు చూసి ముందు ఫ్రెష్ అవ్వండి ఎందుకు పిలిపించానో వివరంగా చెపుతాను అని ఆదిత్య పక్కన నిలబడింది. అను అమ్మ ఆదిత్య నాన్న కూడా సంధ్యని కొంచెం ఆశ్చర్యంగానే చూసారు.
విక్రమ్ నేరుగా సంధ్య దెగ్గరికి వెళ్లి నిలబడ్డాడు.
విక్రమ్ : అమ్మా మీరు మాకు ఇంతవరకు ఏమి చెప్పలేదు, ఏమైందో ఇక నైనా చెప్పండి.
సంధ్య కింద కూర్చోగానే తన పక్కనే విక్రమ్, మానస, ఆదిత్య, అనురాధ కూర్చున్నారు.
సంధ్య : ముందు మీకు అస్సలు ఎవరు ఎవరు మీకు ఏమి అవుతారో చెపుతాను వినండి. మీరు ఇరువురు బావ బామ్మర్దులు ఆ విషయం మీకు తెలుసునా?
విక్రమ్ : ఎం మాట్లాడుతున్నారు
సంధ్య : కావ్య మీకు ఏమి చెప్పలేదా
విక్రమ్ : మీకు మా అమ్మ పేరు ఎలా తెలుసు
సంధ్య : ఎందుకంటే తను నాకు ఒకరకంగా మనవరాలు ఇంకోరకంగా కూతురి వరస కాబట్టి.
ఆదిత్య : బుర్ర హీట్ ఎక్కి పోతుంది అండి.
సంధ్య : చెపుతాను, మానస చనిపోక ముందే వాళ్లిద్దరూ పడవలో ఉన్నప్పుడు నా కొడుకు వల్ల స్కలించి ఆ వీర్యాన్ని విక్రమాదిత్య చేతికి ఇచ్చింది. నా కొడుక్కి అది ఎందుకో అర్ధం కాకపోయినా మానసకి ఏదో తెలుసని దాన్ని భద్రంగా దాచాడు. మానస చనిపోయిన తరువాత తన దేహాన్ని నేరుగా అడవిలోకి తీసుకొచ్చాడు అక్కడే నా కొడుక్కి చాలా నిజాలు తెలిసాయి.
నా కోడలు అనురాధ ఆ తెగ నాయకుడు చెప్పినట్టుగానే ఇద్దరు ఆరోగ్యవంతులైన బలమైన బిడ్డలకి జన్మనిచ్చింది. ఒకరికి తన పిన్ని మరియు గురువు ఐన శశి అని నామకరణం చేసి మాట ఇచ్చినట్టుగా ఆ బిడ్డకి పాలు మానగానే తెగకి అప్పగిస్తానని చెప్పాడు ఇక ఇంకొక కొడుక్కి మానస్ అని పేరు పెట్టాడు. ఆ తరువాత అక్కడనుంచి సెలవు తీసుకుని అందరం ఇంటికి వచ్చాక మానస చనిపోయిన వార్త చెప్పి మేము ఉన్న ఈ ఇంటి వెనకే సమాధి కట్టించాడు.
ఆ తరువాత మనిషి బానే ఉన్నా మానస వాడి జీవితంలో లేని లోటు మేము గమనించాము కంపెనీలు ఆస్తులు వీటి గురించి పట్టించుకోవడం మానేశాడు, ఎవ్వరికి తెలీకుండా మాత్రం అప్పుడప్పుడు తెగ ప్రజలని కలిసి వస్తూ ఉండేవాడు.. రెండేళ్లు గడవగానే తన కొడుకు శశి ని తెగకి అప్పగించి మానస్ ని నాకు అప్పగించి అనురాధని తీసుకుని టూర్ కి వెళుతున్నానని తిరిగి సంవత్సరానికి తిరిగి వచ్చాడు. ఆ సంవత్సరంన్నర గ్యాప్ లోనే ఎవ్వరికి తెలియకుండా అనురాధ మానస వీర్యం ద్వారా ఒక కూతురిని కన్నది తన పేరు రక్ష అని నామకారణం చేసి ఎవ్వరికి తెలియకుండా ఎక్కడో దూరంగా ప్రపంచానికి సంబంధం లేని ఒక ఆఫ్రికా తెగ జాతికి ఆ పాపని అందించాడు. నాకు అప్పుడు అర్ధంకాలేదు ఆ బిడ్డకి రక్ష అని ఎందుకు పేరు పెట్టాడో.
తరువాత అప్పుడప్పుడు ఇక్కడున్న తెగ వాళ్ళని కలుస్తున్నా ఎవ్వరికి తెలియనివ్వలేదు అది మా ముగ్గురి మధ్యే ఉండాలని నిర్ణయించుకున్నాం. నాకు తెలుసు వాడు ఎం చేస్తున్నాడో అక్కడ వాడి కొడుకు కూతుర్లని చూసుకుంటున్నాడు ఎవరో కాదు మీ అమ్మ. అని విక్రమ్ ని చూసింది.
విక్రమ్ : మా అమ్మా...
సంధ్య : అవును నా చెల్లెలు ఐన శశి నా కొడుకు విక్రమాదిత్య మీద మనుసు పడి వాడితో రమించింది, దాని వల్ల తను గర్భవతి ఆవ్వడం అదే సమయంలో తనని బంధించడానికి వస్తున్నారన్న వార్త తెలియడంతో తన నాలుగు నెలల గర్భాన్ని, తనకి తెలిసిన విద్యలు ఉపయోగించి పిండాన్ని వేరు చేసి ఆ పిండం కడుపులో లేకపోయినా ఎదిగేలా తన శిష్యురాలికి అప్పగించింది.. ఈ విషయం ఆ దీవిలో తనని ఉరి తీసే ముందుకు ఆఖరి చూపుగా కలిసినప్పుడు తనే నాకు స్వయంగా చెప్పింది.. అని కళ్ళు తుడుచుకుంటూ.. విక్రమ్ వెళ్లి తెగ ప్రజల సాయంతో, నా చెల్లెలి శిష్యురాలి సాయంతో ఆ పిండాలని వాళ్ళ తెలివితేటలతో విద్యాలతో బతికించారు అందులో నుంచి ముగ్గురు సంతానం జన్మించారు. ముందుగా పుట్టిన పెద్దమ్మాయికి కావ్య అని ఆ తరువాత బైటికి తీసిన అబ్బాయికి రాజు అని తరవాత అమ్మాయికి సరిత అని పేరు పెట్టాడు
ఆదిత్య : మా నాన్న పేరు రాజు, అత్తయ్య పేరు సరిత.
సంధ్య : అవును అవకతవకల వల్ల ముగ్గురు పుట్టుకతోటే రోగాలతో పుట్టారు, కావ్యకి మాట రాదు, రాజుకి మూర్చ రోగం ఉంది, ఇక సరితకి మతి స్థిమితం అప్పుడప్పుడు సరిగ్గా పని చెయ్యదు.
విక్రమ్ ఆదిత్య ఒకరినొకరు చూసుకుని అవుననని తల ఊపారు.. అను మానస కూడా ఆశ్చర్యంగా చూసారు.
మానస : మరీ మా పేర్లు కూడా అవే.. మేము కూడా
సంధ్య : మీకేం సంబంధం లేదు, యాదృశ్చికం అంతే..
విక్రమ్ : అమ్మా... తరువాత ఏమైంది..?
సంధ్య : నాకు సగం సగం మాత్రమే తెలుసు కానీ నా కొడుకు మీ అమ్మ కావ్యతో తను చనిపోతాను అని తెలిసిన ముందుకు రోజు, చివరిగా కావ్యతో చాలా మాట్లాడాడు. ఐదేళ్ళ వయసున్న కావ్యని అనాధ ఆశ్రమంలో చేర్చి మిగతా ఇద్దరినీ తన కింద నమ్మకంగా పని చేసే ఒకతనికి సంతానం లేకపోవడంతో ఆయనకి అప్పగించారు.
ఇదంతా ఒక చెవితో వింటున్న సరితకి రాజుకి ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో అర్ధం కాలేదు, ఇద్దరు స్పృహ కోల్పోయిన సంధ్య వైపు చూసారు.
ఇంతలో యాభై మంది వరకు మనుషులు వచ్చి ఇంటిని చుట్టు ముట్టి తలలకి గున్నులు పెట్టి అందరినీ కంట్రోల్లోకి తీసుకున్నారు, ఆదిత్య ఎదురు తిరగబోతే విక్రమ్ అది ఇక్కడున్న వాళ్లందరిని ప్రమాదంలో పడేస్తుందని వద్దని వారించాడు. ఆదిత్య విక్రమ్ తోపాటు అందరినీ అదుపులోకి తీసుకుని, కాళ్ళు చేతులు కట్టేసి ట్రక్కులోకి ఎక్కించి తీసుకువెళ్లారు. ఇద్దరికీ ఏం చెయ్యాలో అస్సలు అర్ధం కాలేదు.
ట్రక్కు నేరుగా కేరళ చివరికి వెళ్లి అందరి కళ్ళకి గంతలు కట్టి అక్కడనుంచి అందరిని షిప్ ఎక్కించి సముద్రపు దారి గుండా ఒక దీవిలోకి తీసుకెళ్లారు. అందరిని వేరే బండిలోకి ఎక్కించి ఒక పెద్ద కోట ముందు ఆపి అందరిని దించి కళ్ళగంతలు తీసేసారు.
ఆదిత్య, విక్రమ్ కళ్ళ గంతలు ఊడిపోగానే వాళ్ళకి ఎదురుగా కనిపించింది ఒక పెద్ద కోట, సుమారు కోటలోకి ప్రవేశించడానికే ముప్పై మెట్లు తెల్లగా పాల రాతిలో మెరిసిపోతున్నాయి. ముందుకు వెళ్ళమని ఆదిత్యని బల్లెంతో పొడిచాడు ఒకడు, అందరూ మెట్లు ఎక్కుతుంటే విక్రమ్ తన అమ్మ కావ్య భుజం మీద చెయ్యి వేసి చిన్నగా నడిపించుకుంటూ చుట్టు పక్కన ఉన్న పరిసరాలు గమనించసాగాడు.
అన్ని పకడ్బందీగా ఉన్నాయి, బల్లాలతో నిల్చొని కాపలా కాస్తున్న వాళ్ళ వస్త్రాధారణ కొంచెం విచిత్రంగా ఉన్నా చాల బలంగా ఉన్నారు, మెట్లు ఎక్కి ద్వారం ముందుకు వెళ్ళగానే పెద్ద ద్వారం తెరుచుకుంది. వెనకాల ఉన్న వాళ్ళు ముందుకు నెడుతుంటే అందరూ లోపలికి నడుస్తున్నారు. ఇటు మానస తల్లి దండ్రులకి అటు ఆదిత్య తల్లి దండ్రులకి ఏమి అర్ధం కావడంలేదు. సంధ్య మాత్రం అంతకుముందుకు ఈ దీవి మీద తను అడుగు పెట్టినప్పడు జరిగిన సంగతులు, తన చిన్నతనం ఒక్కొక్కటి నెమరు వేసుకుంటూ భయపడుతూ ఒక్కో అడుగు వేస్తుంది, కారణం ఇప్పుడు తన కొడుకు బ్రతికిలేడు ఉండుంటే తన అడుగుల్లో ధైర్యం ఇంకోలా ఉండి ఉండేది.
విక్రమ్ అన్ని గమనిస్తున్నాడు, ప్రతీ పది అడుగులకి ఒక నింజా సూట్లో భుజానికి రెండు కత్తులుతో నిలుచొని ఉన్నారు వీళ్లందరు నడుములకి ఎరుపు రంగు రిబ్బన్ కట్టుకున్నారు. ఆదిత్య కోపంగా ముందుకు నడుస్తుంటే విక్రమ్ తల ఎత్తి చూసాడు, గోడ మీద వరసగా చేతిలో బాణాలు పట్టుకుని నిలుచున్నారు వాళ్ళ నడుములకి బులుగు రంగు రిబ్బన్ ఉంది కరాటే వాళ్ళు కట్టుకున్నట్టు కానీ అందరూ నల్ల డ్రెస్ లోనే ఉన్నారు. ఎవ్వరి మొహాలు కనిపించడంలేదు.
చుట్టు పచ్చదనం వరసగా పెట్టిన చెట్ల మధ్యలో నుంచి నేరుగా నడుచుకుంటూ వెళితే కోట అసలైన తలుపులు ఉన్నాయి ముందు కాపలాగా ఒక వంద మంది వరకు ఉంటారు, అందరి చేతుల్లో గొడ్డళ్లు తెల్ల షర్టుల మీద నల్ల సూట్స్ వేసుకుని వున్నారు చేతికి వాచీలు చెవిలో మైక్రోఫోన్స్ టెక్నాలజీ వాడుతున్నారు కానీ ఎవ్వరి చేతిలో గన్స్ కానీ ఇంకేరకమైన టెక్ వెపన్స్ గాని లేకపోవడం విక్రమ్ ని కొంచెం ఆశ్చర్య పరిచింది. వాళ్ళ మధ్యలో నుంచి వాళ్ళని చూస్తూనే లోపలికి వెళ్లారు. కుడి వైపు తిప్పి నేరుగా నడిపించి ఇంకో ఇనప డోర్ తెరిచారు, విక్రమ్ తల వెనక్కి తిప్పి చూడబోతే ఒకడు గొడ్డలితో గొంతు దెగ్గర పెట్టుకుని నరికేస్తానని వార్నింగ్ ఇచ్చాడు.
అందరిని లోపలికి తోసి తలుపులు వేశారు, ఎదురుగా కనిపించిన దృశ్యం చూసి అందరికి ఒంట్లో వణుకు పుట్టింది, ఒక అమ్మాయిని సంకలో చెయ్యి వేసి గట్టిగా పట్టుకుని నిల్చున్నాడు ఒకడు, చూడ్డానికి అమ్మాయి పల్లెటూరి మొహంలా ఉంది వాడి కాళ్ళు పట్టుకుని బతిమిలాడుతుంది, కొట్టద్దు అని. కొరడా చప్పుళ్ళకి తల తిప్పి చూసారు, ఇంకో అమ్మాయి టీ షర్ట్ మరియు జీన్స్ లో కొంచెం బక్కగా ఉంది. ఇందాక బల్లెం పట్టుకున్న వాళ్ళ గుంపులో ఒకడు అనుకుంటా ఆ అమ్మాయిని కొడుతుంటే ఇక్కడ అమ్మాయిని పట్టుకున్నవాడు లెక్కబెడుతున్నాడు.
పద్మ : మీ కాళ్ళు పట్టుకుంటాను వదిలెయ్యండి, ఇంతకముందే కొట్టారు మళ్ళి కొడితే చచ్చిపోతుంది. మీకు దణ్ణం పెడతాను వదిలెయ్యండి.
అక్షిత : (ఇంతకముందు మూతి మీద షూతో తన్నినందువల్ల, నోట్లో నుంచి రక్తం కారుతుంది) వదిన నువ్వు వాడి కాళ్ళు వదిలేయి అని అరవగానే పద్మ వాడి కాళ్ళు వదిలెయ్యగానే అక్షిత తల తిప్పి లోపలికి వచ్చిన ఆదిత్య వాళ్ళని చూసింది కళ్ళలో నీళ్లు ఉండటం వల్ల అంతా మసకగా కనిపించేసరికి మళ్ళి కళ్ళు మూసుకుంది.
ఇంతలో డోర్ చప్పుడు అయితే అందరూ అటువైపు చూసారు, ఒకడు టీ షర్ట్ వేసుకుని లోపలికి వచ్చాడు.
శశి : అందరి ప్రయాణం బానే జరిగిందా, ఏం కోడలు పిల్లా అంటూ అక్షిత దెగ్గరికి వెళ్లి కొట్టేవాడు చేతిలో ఉన్న కొరడా తీసుకుని చుట్టు తిప్పి వీపు మీద పడేలా గట్టిగా కొట్టాడు. అక్షిత నోట్లో నుంచి ఉమ్ము తీగలుగా రక్తంతో కలిసి ఎర్రగా కారింది. ఇంకోసారి తప్పించుకునే ఆలోచనలు చేశావంటే నేనేం చేస్తానో నాకే తెలీదు.
అక్షిత : నువ్వు ఏమి పీకలేవని మాకు తెలుసు, వెళ్ళు.
శశి అక్షిత వంక కోపంగా చూసి కొరడాతో కొట్టి ఆదిత్య వంక విక్రమ్ వంక చూసాడు, వాళ్ళిద్దరి వెనక ఉన్న సంధ్య వైపు కూడా చూసాడు.
శశి : విక్రమ్, ఆదిత్య ఇద్దరు మా నాన్న పోలికలతో, హహ.. మా నాన్నని దొంగచాటుగా చంపినందుకు ఆ బాధ మా అన్న దమ్ములనిద్దరిని బాగా కలవర పెట్టింది. ఈ సరి మీలో ఆయనని చూసుకుని కసి తీరా చంపుతాం. కంగారు పడకండి మీ చావుకి ఇంకా టైం రాలేదు. మొదట చంపాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అని జేబులో నుంచి చిన్న చీటీ తీసాడు.
అప్పటి వరకు చిన్న శాంపిల్ చూపిస్తా అనగానే పక్కనే ఉన్న కర్టెన్స్ కింద పడ్డాయి, పెద్ద ఐనప రాడ్డులతో చేసిన జైలులాగ ఉంది అది అందులో దాదాపు వంద మంది వరకు ఉన్నారు, చిన్న పిల్లలు ఆడోళ్లు మగవాళ్ళు. కర్టెన్స్ కింద పడగానే ఏం జరుగుతుందా అని భయం భాయంగా లేచి నిల్చున్నారు. శశి చిటికె వెయ్యగానే కొంతమంది బాణాలతో చుట్టు ముట్టారు. ఇంకో చిటికె వెయ్యగానే వరస పెట్టి వాళ్ళ మీదకి బాణాలు వదిలారు. చూస్తున్న మానసకి అనురాధకి ఏడుపు వచ్చేసింది, మానస గజ గజ వణికిపోయింది, సలీమా కళ్ళు తిరిగి పడిపోయింది. అనురాధ అమ్మ సరిత భయంతో తన అన్నయ్య చెయ్యి పట్టుకుంది. అందరూ కళ్ళు మూసుకున్నారు. రెండు నిమిషాల్లో మొత్తం రక్తపాతంతో తడిచిపోయింది నేలంతా.
శశి : ఇంకో చిటికె వెయ్యగానే ఆదిత్య శశిని చూసాడు. ఇది చిన్న శాంపిల్ మాత్రమే మిమ్మల్ని చాలా దారుణంగా చంపుతాను. మొదట వాసు వాడిని ముక్కలు ముక్కలుగా నరికిన తరువాత, ఆదిత్య నువ్వు నాకు అడ్డం వచ్చావ్ కాబట్టి నిన్ను నేనే చంపుతాను, విక్రమ్ మా తమ్ముడికి ఎదురేళ్లాడు కాబట్టి వాడిని మా తమ్ముడు చూసుకుంటాడు. మీ అందరికంటే నన్ను బాగా ఇర్రిటేట్ చేసినవాడు ఇంకోడున్నాడు సుభాష్. వాడిని మీ అందరి ముందు ఎంత దారుణంగా చంపుతానంటే మీరు నా చేతుల్లో చావడం కంటే మిమ్మల్ని మీరే చంపుకోడం నయం అనుకుంటారు. మర్చిపోయాను నానమ్మ అని సంధ్యని చూసాడు.
సంధ్య : మీ చావు దెగ్గర పడింది, రక్ష వచ్చేంత వరకే మీ ఆటలు
శశి : పిచ్చి నానమ్మ, పోయిన సారి జరిగింది మరిచిపోయావా, దెబ్బకి కోమాలోకి పోయింది ఆ రక్ష. ఇప్పుడు అది లేచి మమ్మల్ని చంపుతుందనుకుంటున్నావా అని నవ్వాడు. అయినా మా నాన్ననే చంపిన వాళ్ళం ఈ బచ్చా గాళ్ళేంత.
సంధ్య : నా కొడుకు మీరు చంపితే చావలేదు, వాడికి వాడు నిర్ణయించుకున్నాడు కాబట్టి వెళ్ళిపోయాడు.
శశి : అచ్చా
అక్షిత : ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువట ఎంత నవ్వుకుంటావో ఇప్పుడే నవ్వుకో తరవాత నీకు ఏడిచే టైం కూడా ఉండదు.
శశి కోపంగా కొరడా అందుకుని కొడుతూ.. చెప్పు ఎక్కడ దాచి పెట్టావ్ దాన్ని, చెప్పు.. ఆ సుభాష్ అలియాస్ సుబ్బు నా నుంచి తప్పించుని బతికి బట్టగలను అనుకుంటున్నాడా
అక్షిత : హహ వాడికి ఇవేమి తెలియదు, నువ్వు ఎవడివో కూడా వాడికి అనవసరం. అయినా వాడిని పట్టుకోవడం నీ వల్ల కాదు
శశి : అదీ చూద్దాం
అక్షిత : నీ దెగ్గర తెలివికల వారు, బలవంతులు ఉన్నారు కానీ అవసరానికి పనికి వచ్చే డ్రైవర్ మాత్రం నా దెగ్గర ఉన్నాడు వాడు నాలుగు చక్రాల మీద ఉండగా పట్టుకోవడం అసాధ్యం
శశి : అలాగా డీజిల్ కి ఆగుతాడు కదా, ఆకలేస్తే ఆగుతాడు కదా, ఉచ్చ వస్తే ఆగుతాడు కదా. రాత్రి లోగా వాడిని పట్టుకుని నీ ముందే వాడి తల నరక్కపోతే..
అక్షిత : పేరు తిప్పి పెట్టుకుంటావా (అని నవ్వుతూ పెదాల మీద ఉన్న రక్తం తుడుచుకుంటూ) ఉన్నవే రెండు అక్షరాలు, శిశ అస్సలు బాలేదు అని నవ్వుతూ, నువ్వు మగాడి వైతే ముందు నన్ను చంపు అనగానే శశి అక్షిత దెగ్గరికి వెళ్లి కత్తి తీసుకుని కట్లు కోసి మెడ పట్టుకుని కిందకి విసిరి కడుపులో ఒక్కటి తన్నాడు అక్షిత గాల్లోకి ఎగిరింది, కింద పడేలోపే అక్కడే ఉన్న విక్రమ్ ఒక్క అడుగులో పట్టుకున్నాడు. అక్షిత విక్రమ్ ని అక్కడే కోపంగా శశిని చూస్తున్న ఆదిత్యని చూసి ఆశ్చర్య పోయింది. శశి బైటికి వెళ్ళిపోతుంటే తిరిగి రెట్టించింది.
అక్షిత : ఏంటి నన్ను చంపడానికి కూడా ఆ ముసలిదాని పెర్మిషన్ కావాలా, నీ చేతుల్లో ఏమి లేదా, కావాలంటే వెనక్కి తిరుగుతా మీకెలాగో వెన్నుపోటు పొడవడం అలవాటే కదా అని రెచ్చగొడుతుంటే శశి కోపంగా అక్కడనుంచి వెళ్ళిపోయాడు.
శశి బైటికి వెళ్ళిపోగానే అక్షిత విక్రమ్ ఒళ్లోనే కళ్ళు తిరిగి పడిపోయింది, వెంటనే ఆదిత్య లేచి జోబులోనుంచి ఆకులు తీసాడు.
మానస : ఏంటవి ?
ఆదిత్య : మద్ది చెట్టు ఆకులు, ఇందాక వస్తున్నప్పుడు చెట్లు కనిపించాయి ఎవ్వరు చూడకుండా దొరికినన్ని తెంపి జేబులో వేసుకున్నాను.
అను : బావా నువ్వు చాలా గ్రేట్ రా, అలంటి ఓ సిట్యుయేషన్లో కూడా నీ బుర్ర భలే పని చేసింది.
మానస : ఈ ఆకులు ఏం చేస్తాయి
ఆదిత్య : ఈ ఆకుల పసరు ఇంజ్యూరిస్ చాలా వేగంగా నయం అవడానికి పని చేస్తాయి.
విక్రమ్ : (అంటే నేను ఎస్కేప్ ప్లాన్స్ కోసం వెతుకుతుంటే, ఆదిత్య ఇంకో దారిలో ఆలోచించాడు. ఆవేశపరుడేమో అనుకున్నాను చాలా బాగా ఆలోచించాడు) ఆదిత్య.. (అనగానే ఆదిత్య తల ఎత్తి విక్రమ్ ని చూసాడు) నిజంగా నువ్వు చాలా గొప్ప డాక్టర్ వి.
ఆదిత్య : అంతొద్దులే.. దా పసరు పిండాలి అని ఆకులు నలుపుతూ వేళ్లతోనే ఆకులు చించి నెమ్ము వచ్చేలా నలిపి.. అటు ఇటు చూసి ఇక్కడ ఎవరిదేగ్గర ఐన కర్చీఫ్ ఉందా అని అడిగాడు, సలీమా తన కర్చీఫ్ ఇచ్చింది.. అను తనని బోళ్లా పడుకోబెట్టి టీ షర్ట్ తీసెయ్యి అని చెపుతూనే నలిపిన ఆకులలో తన ఉమ్ము కలిపి కర్చీఫ్ లో వేసి ముడి తిప్పుతూ విక్రమ్ ని చూసి ఆ చివర పట్టుకో అనగానే విక్రమ్ ఆ చివర పట్టుకున్నాడు. అక్షిత వీపు మధ్యలోకి వచ్చేలా విక్రమ్ అటు వైపు ఆదిత్య ఇటువైపు పట్టుకుని తిప్పుతూ గట్టిగా లాగుతుంటే ఒక్కో చుక్కా అక్షిత వీపు మీద పడుతుంది. అను వాటిని అక్షిత దెబ్బల మీద పులుముతుంది.. ఇద్దరు వీలైనంత పిండి కర్చీఫ్ ని అనుకి ఇస్తే వరస దెబ్బలు తగిలిన చోట పెట్టి మల్లి టీ షర్ట్ వేసింది.. ఆదిత్య లేచి అక్కడ రక్తపు మడుగులో ఉన్న చిన్న పిల్లాడి మెడలో ఉన్న వాటర్ బాటిల్ తీసుకొచ్చి అనుకి ఇచ్చాడు.. స్పూన్ మాత్రమే ప్రతీ రెండు నిమిషాలకి ఓసారి తాపు.
విక్రమ్ : మీరెవరు
పద్మ : అన్నయ్య నేను పద్మని, మా అయన పేరు వాసు మీరు నన్ను కాపాడారు, మీరే నాకు ఆపరేషన్ చేసిందని మా బావ చెప్పాడు. అని ఆదిత్యని చూసింది.
అను : పద్మా నువ్వెంటి ఇక్కడా
పద్మ : ఆ రోజు మిమ్మల్ని ఎత్తుకొచ్చింది, నా బావ చంపింది వీళ్ళ మనుషులనే
ఆదిత్య : అవును వాడెక్కడా
పద్మ : ఏమో
విక్రమ్ : ఇక్కడికి వస్తాడా ఏంటి ?
ఆదిత్య : దణ్ణంరా బాబు వాడికి, వాడు వచ్చాడంటే ఇక్కడ అస్సలు ఎవరిని ఎవరు చంపుకుంటారో, వాడు వీళ్ళని వదిలేసి మన మీద పడితే మన గతేమి కాను.. అబ్బబ్బ ఆ రోజు చుక్కలు చూపించాడు.
విక్రమ్ : తప్పదురా, భరించాలి
ఆదిత్య : మీ బావ ఇంట్లో కూడా ఇంతేనా
పద్మ : లేదు మంచి కామెడీ పీస్, మా బావ ఎక్కడుంటే అక్కడ అన్ని నవ్వులే, భరించలేని కోపం వస్తేనే కంట్రోల్ తప్పుతాడు.
మానస : అంటే సుబ్బు లాగా
ఆదిత్య : ఏంటి సుబ్బు గాడికి అంత కోపమా
మానస : మొన్న చూసాంగా, అవును ఈ అమ్మాయి సుభాష్ అని సుబ్బు అని మాట్లాడింది, వీడు వాడు ఒక్కడేనా
విక్రమ్ : డ్రైవర్ అందిగా వాడేనేమో.. పద్మ తన పేరేంటి ?
పద్మ : అక్షిత
మానస : అరవింద్ చెప్పింది కూడా తన పేరే. ఇప్పుడు వీళ్లంతా కలిసి సుబ్బు గాడి కోసం వెతుకుతున్నారన్నమాట. బాగుంది కారులో ఉంటె వాడెప్పుడు దొరకాలి, ఇప్పుడు మన పరిస్థితి ఏంటి, భయంగా ఉంది చంపేస్తారా?
ఆదిత్య : చూద్దాం, పోతే ఇంకా హ్యాపీ.. మీ గోల తప్పుద్ది
అను : పోరా
ఆదిత్య : అస్సలు సుబ్బు గాడు హైలైట్ ఇక్కడ, ఏ స్కోప్ లేకుండా కధతో సంబంధం లేకుండా, వాడికి ఏమి తెలియకపోయినా హీరో అయిపోతున్నాడు. అందరూ కలిసి వాడి మీద పడితే ఎలా ఉంటుందో ఆలోచించు. మొన్న వాడి మొహం మీద నుంచి గొడ్డలి వెళుతుంటే వాడి ఎక్సప్రెషన్ చూడాలి.
ఇంతలో విక్రమ్ తన అమ్మ కావ్యతో సైగలతో మాట్లాడుతుంటే చూసారు అందరూ.
విక్రమ్ : అమ్మా ఏమైనా చెపుతావా లేదా
కావ్య : కళ్ళ నిండా నీళ్లతో, చెపుతాను అని పక్కనే ఉన్న అను అమ్మ సరితని ప్రేమగా చూసి తన బుగ్గ నిమురుతూ ఇంకో చెయ్యి ఆదిత్య తండ్రి రాజు భుజం మీద వేసి విక్రమ్ తో మాట్లాడుతుంది.
సరిత : ఏమంటుంది?
మానస : మీరు తన చెల్లెలు, తమ్ముడు అని చెపుతుంది. ఇన్నేళ్లు మీరు ఎవరో తెలిసినా ఇలాంటి ఒక రోజు రాకూడదనే మిమ్మల్ని కలవకుండా దూరం నుంచి చూసుకునేదట. ఇప్పుడు ఏం జరుగుతుందో అని భయంగా ఉందంటుంది.
విక్రమ్ : ఎందుకు మ్మా
కావ్య : ........................
మానస : మా నాన్న చెప్పాడు
విక్రమ్ : ఎవరు
కావ్య : ..........................
మానస : విక్రమాదిత్య. మా నాన్న, నేను వీళ్ళని కలిసే రోజు వస్తే అది ప్రమాదమే అని చెప్పాడట.
విక్రమ్ : ఏం జరిగిందో చెప్పమ్మా
గతం నెమరు వేసుకుంటూ విక్రమ్ తో చెపుతుంటే మానస అందరికి అర్ధం అయ్యేలా చెపుతుంది.
కావ్య : నేను తెగ ప్రజల దెగ్గర ఉన్న ఆఖరి రోజు అది, ఆరోజు అమ్మా నాన్న వస్తారని ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నాను. రాజు సరితల పిండాలు సరిగ్గా ఎదగక పోయేసరికి వాళ్ళకి ఎదుగుదల చాలా మెల్లగా ఉండేది. ఇద్దరు ఆడుకోడం తినడం తప్పితే వేరే ఆలోచన ఉండేది కాదు. ఆ రోజు మా నాన్న వచ్చాడు. చెట్టు ఎక్కి కొమ్మ మీద కూర్చుని ఆలోచిస్తుంటే ఎప్పుడొచ్చాడో నా పక్కనే కూర్చున్నాడు.
విక్రమాదిత్య : తల్లీ..
కావ్య : డాడీ.. వచ్చేసావా (అని గట్టిగా ఒళ్ళోకి వాలిపోయి వాటేసుకుంది)
విక్రమాదిత్య : అమ్మ కూడా వచ్చింది, అదిగో కింద.
అనురాధ : హాయి.. నాన్నా
కావ్య : డాడీ దించు. అని చెట్టు దిగి వెళ్లి అమ్మని వాటేసుకున్నాను. అమ్మా పొద్దుననుంచి చూస్తున్నాను ఇప్పుడా రావడం. ఎంత బాధేసిందో తెలుసా
అనురాధ : చూడు విక్రమ్, ఎందుకిలా చేస్తున్నావ్. మనతో తీసుకెళ్ళిపోదాం ప్లీజ్.
విక్రమాదిత్య : నువ్వెళ్ళి నీ కొడుకు ఎక్కడున్నాడో చూసుకోపో
కావ్య : శశి అన్నయ్య ఎప్పుడు వేట అంటాడు, అందరితో కొట్లాటలే. మొన్న పెద్దయ్య తిట్టాడు కూడా
విక్రమాదిత్య : కావ్య.. మనం అలా వెళదామా. నీతో మాట్లాడాలి.
కావ్య : పద డాడీ అని సైగ చేస్తూ ఆయన చెయ్యి పట్టుకుని ముందుకు నడిచాను.
విక్రమాదిత్య : ఇక నుంచి నిన్ను చూడటానికి నేను రాను తల్లి.
కావ్య : (కళ్ళు తడి అయిపోయాయి) ఎందుకు నేను ఏమైనా తప్పు చేసానా, ప్లీజ్ డాడీ అలా మాట్లాడకు. అని అనగానే నన్ను ఎత్తుకున్నాడు.
విక్రమాదిత్య : లేదు తల్లి, నేను ఏం చేసినా మీకోసమే కదా నా మాట వినవా
కావ్య : కానీ డాడీ
విక్రమాదిత్య : తమ్ముడిని చెల్లిని వేరే వాళ్ళకి అప్పగిస్తున్నాను, నువ్వు మాత్రం ఒక్క దానివే ఉండాలి. హాస్టల్లో వేస్తాను. ఇక నిన్ను కలవడానికి ఎవ్వరు రారు.
కావ్య : అలా మాట్లాడకు, మిమ్మల్ని చూడకుండా నేను ఉండలేను.
విక్రమాదిత్య : నా బుజ్జి తల్లి కదా, అవసరం వచ్చిందిరా నా మాటలు జ్ఞాపకం పెట్టుకో నన్ను కానీ నాకు సంబంధించిన వాళ్ళు ఈ తెగ వాళ్ళు కావచ్చు అమ్మ కావచ్చు నానమ్మ కావచ్చు ఆఖరికి నీ తమ్ముళ్లని కూడా కలవడానికి వీలు లేదు. తమ్ముడు చెల్లి ఎక్కడున్నారో నీకు తెలుస్తుంది. కానీ కలవద్దు. నువ్వు ఎవరిని కలిసినా ప్రమాదమే జరుగుతుంది అది గుర్తు పెట్టుకో.
కావ్య : నేను కలిస్తే వాళ్ళకి ఎందుకు ప్రమాదం.
విక్రమాదిత్య : వాళ్ళకి కాదు నీకు నీ తమ్ముడు చెల్లెలికి. నువ్వు ఎవరిని కలిసినా నాకు కూడా ప్రమాదమే. నువ్వు దూరంగా వెళ్ళిపోతే నేను అమ్మా కనీసం బతికి ఉంటాం తల్లి.
కావ్య : లేదు వెళ్ళిపోతాను. అని మౌనంగానే ఏడ్చేసాను.
విక్రమాదిత్య : గుర్తుంచుకో వీళ్ళ నుంచి దూరంగా తీసుకెళ్లి వదిలేస్తున్నాను. నీగురించి ఎవ్వరికి తెలియనివ్వకు ఎవ్వరికి చెప్పొద్దు సరేనా. నా మీద ఒట్టు వేయి.
కావ్య : ఒట్టు
ఆ రోజంతా అమ్మా నాన్నా నాతోనే ఉన్నారు రాజుని సరితని ఎవరికో అప్పగించారు. నన్ను అమ్మా నాన్న ఇద్దరు దూరంగా తీసుకొచ్చి అనాధ ఆశ్రమంలో చేర్చారు. అమ్మ భుజం మీద చెయ్యి వేసి నాన్న మాట్లాడుతుంటే విన్నాను.
అనురాధ : మనకే ఎందుకు ఇలా జరుగుతుంది.
విక్రమాదిత్య : లేదు ఇదంతా నా వల్ల జరుగుతుంది. ఒక్క సారి గుర్తుతెచ్చుకో నేను నీ లైఫ్ లోకి రాకముందు నీకు అవమానాలు మాత్రమే ఉండేవి కానీ నువ్వు చాలా సంతోషంగానే ఉండేదానివి నేను వచ్చాకే మీ అమ్మా నాన్న నుంచి నీ కుటుంబం నుంచి దూరం అయిపోయావు. నా చేతులతోనే మీ వాళ్ళని చంపేసాను. నాతో పాటు ముడిపడి ఉన్న ఎవరి జీవితాలు అయినా సరే, అయితే చచ్చిపోయారు మిగిలిన వాళ్ళకి బాధలు తప్పించి ఏమి మిగలలేదు. అమ్మ, నువ్వు, మానస, రాజు, రవి, పూజ, సునిల్ గారు, మీ వాళ్ళు నా వాళ్ళు నా చేతులతో ఎంత మందిని పొట్టనబెట్టుకున్నానో నాకే తెలుసు. వీళ్ళనైనా ప్రశాంతంగా వీటన్నిటికీ దూరంగా బతకనీ
అనురాధ : రాజు సరిత సరే కానీ కావ్య ఎలా, తనకి మాటలు కూడా రావు. ఒక్కటే ఎలా చిన్న పిల్ల
విక్రమాదిత్య : అది నా కూతురు, కొన్ని కష్టాలు తప్పవు కానీ మనతో ఉండి వచ్చే బాధల కంటే అవే నయం. కొత్త జీవితంలో ఎన్నో ఆనందాలు చూస్తుంది. భయపడకు నాకు నమ్మకముంది.
అనురాధ : ఇప్పుడు ఏమయిందని ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నావు.
విక్రమాదిత్య : ఎప్పుడో తీసుకున్నాను, కానీ ఇంత త్వరగా ఆ పరిస్థితి వస్తుందని ఊహించలేదు, ఎక్కడో తేడా కొడుతుంది అను.. కొడుకులు మానస్, శశి ఇద్దరి ప్రవర్తనలో మార్పులు. నాకు తెలీకుండా ఏదో జరుగుతుంది. అందుకే ఇదంతా.. నాకు పని ఉంది నువ్వు కావ్యని వదిలేసి ఇంటికి వెళ్ళిపో నేను మళ్ళీ కలుస్తాను.
ఆ తరువాత అమ్మ నేను ఇద్దరం కలిసి ఫ్లైట్ లో హైదరాబాద్ తీసుకొచ్చింది, ఎవరితోనో మాట్లాడి నన్ను చూసి గట్టిగా హత్తుకుని ఏడ్చేసింది.
కావ్య : మమ్మీ
అనురాధ : హ్మ్..
కావ్య : ఏడవకు, నువ్వేడుస్తుంటే నాకు కూడా ఏడుపు వస్తుంది.
అనురాధ : ఏడవట్లేదు తల్లి, నేను బానే ఉన్నాను. నువ్వు మాత్రం జాగ్రత్త. బాగా చదువుకోవాలి, బాగా సంపాదించాలి మంచి ఫ్రెండ్స్ ని సంపాదించుకోవాలి.
కావ్య : నన్ను మర్చిపోవుగా
అనురాధ : లేదు తల్లి.. డాడీ చెప్పినట్టు ప్రొబ్లెమ్స్ అన్ని తీరిపోగానే నేనే వచ్చి నా దెగ్గరికి తీసుకెళతాను. సరేనా
కావ్య : వెళ్ళిపోతున్నావా
అనురాధ : ఏడవద్దు నాన్నా
కావ్య : నువ్వే ఏడుస్తున్నావ్ అని కళ్ళు తుడిచాను. ఒక్కసారి డాడీతో మాట్లాడించు.
అనురాధ వెంటనే ఫోన్ చేసింది.
అనురాధ : నువ్వు ఇందుకే రాలేదు కదా
విక్రమాదిత్య : దాని ముందుకు ఏడవకు, ప్లీజ్..
అనురాధ : ఇదిగో మాట్లాడు.
కావ్య : డాడీ అమ్మ ఏడుస్తుంది, నేను హ్యాపీగానే ఉంటాను. ప్రాబ్లెమ్స్ తీరాక వస్తావు కదా.. చెప్పు డాడీ వస్తావు కదా
అనురాధ : నేను చెప్తున్నా కద బంగారం.. కచ్చితంగా నీకోసం వస్తాను. నీకింకో సీక్రెట్ చెప్పనా.. ఒక వేళ నీకోసం నేను రాలేదనుకో.. నీ కోసం ఒక స్పెషల్ పర్సన్ వస్తుంది.
కావ్య : ఎవరు?
అనురాధ : చెప్పుకో చూద్దాం
కావ్య : అబ్బా చెప్పు మమ్మీ
అనురాధ : నీ దెగ్గరికి మీ అక్క వస్తుంది.
కావ్య : అక్కా ఎవరు?
అనురాధ : ఇదిగో తనే అని ఫోన్ తీసి ఫోటో చూపించింది.
కావ్య : ఓ.. ఎవరు తను
అనురాధ : తను పుట్టిన తరువాతే నువ్వు పుట్టావు. నీ సొంత అక్క
కావ్య : పేరేంటి
అనురాధ : రక్ష
కావ్య : నిజంగా నాకోసం వస్తుందా
అనురాధ : కచ్చితంగా, నువ్వు ఎక్కడున్నా ఏ ప్రాబ్లెమ్ లో ఉన్నా వచ్చి నిన్ను తనతో పాటు తీసుకెళుతుంది. ఆపద వచ్చిందంటే చాలు మీ ముందు ఉంటుంది. నిన్నే కాదు తమ్ముడిని చెల్లిని కూడా కాపాడుతుంది.
కావ్య : అవునా
అనురాధ : అవును తల్లి.. ఎంత మందిని అయినా కొట్టగలదు.. ఎలాంటి ప్రాబ్లెమ్ అయినా సాల్వ్ చేస్తుంది.
కావ్య : మరీ ఇప్పుడు డాడీకి వచ్చిన ప్రాబ్లమ్ సాల్వ్ చెయ్యమని చెప్పలేదా
అనురాధ : అంటే ఇప్పుడు చిన్నా పిల్ల కదా.. కానీ రేపు పెద్దయ్యాక చూడు నేను చెప్పింది నువ్వే నమ్ముతావు
కావ్య : నా దెగ్గరికి ఎప్పుడు వస్తుంది.
అనురాధ : అవసరం వచ్చినప్పుడు కచ్చితంగా నీ ముందుకు వస్తుంది. నీ ముందు నిలబడుతుంది. టైం అవుతుంది బంగారం లోపలికి వెళతావా
కావ్య : ఎందుకో ఏడుపు వస్తుంది మమ్మీ అనగానే అనురాధ గట్టిగా వాటేసుకుని ఏడ్చేసింది.
అనురాధ : ఇదిగో ఈ మేడం ఉంది కదా నీకు మా గురించి చెప్తుంది అలానే తమ్ముడు చెల్లి ఎలా ఉన్నారు ఎక్కడ ఉన్నారు ఏం చేస్తున్నారు అన్ని చెప్తుంది సరేనా
సంధ్య : సరే బై మమ్మీ, ఫోన్ తీసుకుని బై డాడీ ఐ లవ్ యు అని ఫోన్ అనురాధకి ఇచ్చేసి మేడం చెయ్యి పట్టుకుని లోపలికి నడిచాను అదే నేను అమ్మని చివరిగా చూసింది. నాకోసం ఎవ్వరు రాలేదు నేను ఎవ్వరి కోసం వెతకలేదు. ఆ తరువాత నా చదువులో పడిపోయాను మూగదాన్ని అవడం వల్ల అందరికంటే కొంచెం ఎక్కువ కష్టపడాల్సి వచ్చింది. మీ నాన్న పరిచయం అవడం కొత్త ఆనందాలు, నువ్వు పుట్టాక ఇక అస్సలు గతం గురించి ఆలోచన కూడా చెయ్యలేదు. ఎప్పుడైనా రాజుని సరితని చూడాలనిపిస్తే నువ్వు లేనప్పుడు అలా వెళ్లి చూసి వచ్చేదాన్ని.
మెలుకువ వచ్చిన అక్షిత ఇదంతా మౌనంగా వింటూ కళ్ళు తుడుచుకుంది.
________________________________________________________
అంబులెన్సుని బెంగుళూరు నుంచి కేరళ హైవే మీదకి ఎక్కించాడు సుబ్బు. ఆవేరేజ్ స్పీడ్ లో బాగానే వెళుతున్నాడు.
సుబ్బు : పోయి పోయి బెంగుళూరే రావాలా నేను, శత్రువులంతా ఇక్కడే ఉన్నారట. అయినా ఇంత అందంగా సుకుమారంగా ఉంది. ఈ అమ్మాయికి ఇంత మంది శత్రువులున్నారా.. తనని చూసాను.. రక్ష గారు కేరళ ఎలా ఉంటుందో చూద్దామా, ఆటే వెళుతున్నాం. ఎలాగో తిరగడమే పని కాబట్టి నేను టూర్ ప్లాన్ చేస్తా.. నేను చెప్తూ ఉంటాను మీరు వినండి. వినపడుతుందా వినపడుతుందిలే.. మా అమ్మ చనిపోయాక కూడా నేను తనతో మాట్లాడాను తెలుసా.. మనిషి పోయాక ఆత్మ అప్పుడే పోదట అందుకే మా అమ్మతో మాట్లాడాను.. మీరు కోమాలోనే కదా ఉంది.. మీ ఆత్మ మీ బాడీలో ఉందా లేక ఇక్కడే పక్క సీట్లో కూర్చున్నారా లేదా బాడీలోనే ఉన్నారా.. సరే ఏదైతే ఏంటి.
ఇవ్వాళ మీకు నాకు, flames రాసాను.. L వచ్చింది అంటే అర్ధం తెలుసా.. మీరు నేను లవర్స్ అని.. అయినా మీరు అక్షిత తాలుక చాలా జాగ్రత్తగా ఉండాలి. నన్ను ఎంత ఏడిపించిందో తెలుసా.. ఆమ్మో ఆమ్మో కంత్రి మీ అక్షిత. నన్ను లవర్ అని మూడేళ్లు బానిసలాగా వాడుకుంది.. ముందే చెప్పింది లెండి లవ్ కాదు.. ఫ్రెండ్ అయితే ఓకే అని కానీ నేనే మూడేళ్ళ టైం ఉంది కదా అని ఓకే చెప్పా.. అయినా పడలేదు ఆ మహాతల్లి. కొంచెం మీరైనా పడండి నా లైఫ్ సెట్ అయిపోతుంది. ముందు ఆకలేస్తుంది ఏమైనా తిందాం అని రక్ష తో మాట్లాడుతూనే దోస బండి దెగ్గర ఆపి తినేసాను.
ఫోన్ మోగింది.. చూస్తే ఏదో అన్నోన్ నెంబర్
సుబ్బు : హలో
చిన్నా : రేయి ఎవడ్రా నువ్వు నా కార్డు ఇష్టం వచ్చినట్టు గీకుతున్నావ్, నా పేరు మీద కార్ కూడా కొన్నారు. ఇది అక్షితకి ఇచ్చిన కార్డు.. నీ నెంబర్ ఇచ్చింది.. ట్రాక్ చేస్తే.. ఇండియా మొత్తం తిరుగుతూనే ఉన్నావ్. హైదరాబాద్ నుంచి బెంగుళూరు పోయావ్ మళ్ళీ నేరుగా పోకుండా తిరుపతి పొయ్యవ్ అక్కడనుంచి శివామోగ్గ అక్కడ నుంచి మంగళూరు పొయ్యి బెంగుళూరు సెంటర్ పొయ్యవ్ మళ్ళీ వెనక్కి వచ్చి మైసూరు పోయావ్ ఇప్పుడు కోయంబత్తురు వెళ్లి రోడ్ మీద దోస తింటూ కుర్చున్నావ్.
సుబ్బు : ఇంత కరెక్టుగా చెపుతున్నావ్ ఎవరు భయ్యా నువ్వు
చిన్నా : చిరంజీవి
సుబ్బు : భయ్యా నువ్వా, అక్షిత హస్బెండ్ మీరే కదా
చిన్నా : హస్బెండా.. ఆ.. నేనే
సుబ్బు : తనే ఇచ్చింది ఆ బ్లాక్ కలర్ కారు సంగతి నాకు తెలీదు భయ్యో.. దాని ఫ్రంట్ సస్పెన్షన్ పోడానికి నాకు అస్సలు సంబంధం లేదు.
చిన్నా : అక్షిత ఎక్కడుంది
సుబ్బు : ఏమో నాకు తెలీదు, తన ఫ్రెండ్ ని సేఫ్ గా ఉంచమంది ఎవరో ఫాలో అవుతారు ఆగకుండా తిరుగుతూ ఉండమని చెప్పింది. నాకు తెలియక నేను బెంగుళూరుకే తీసుకొచ్చా ఇక్కడుంటే ప్రమాదమని వెళ్లిపొమ్మంది అందుకే అక్కడ నుంచి తిరుగుతూ కేరళ వచ్చాను.
చిన్నా : నువ్వు మళ్ళీ తప్పు చేసావు, నీకా విషయం తెలుసా
సుబ్బు : ఏమైంది?
చిన్నా : అక్షిత కేరళ లోనే ఉంది, చివరిసారిగా నాకు ఇక్కడి నుంచే ఫోన్ వచ్చింది.
సుబ్బు : (హాహా) అలాగ, సరే భయ్యా ఇందాకటి నుంచి ఒకటే సౌండ్, గోల గోలగా ఏదో ఫ్యాక్టరీలో ఉన్నట్టు ఏంటది?
చిన్నా : ఫోన్ తీసి ఒకసారి పైకి చూడు.
సుబ్బు తల ఎత్తి చూసాడు గాల్లో హెలికాప్టర్ ఒకటి సుబ్బు చూస్తుండగానే రోడ్ మీదే ల్యాండ్ అయ్యింది, చిన్నా అందులోనుంచి దిగి నడుచుకుంటూ వచ్చాడు. హెలికాప్టర్ మళ్ళీ వెళ్ళిపోయింది. చిన్నా టీ షర్ట్ లో నడిచి వస్తుంటే ఆ హైట్ ఆ కండలు ఆ పర్సనాలిటీ చూసేసరికి వార్ సినిమాలో హృతిక్ రోషన్ గుర్తు వచ్చాడు కానీ ఈయన మరీ అంత లేడులే కానీ బాగున్నాడు.
చిన్నా : ఏంటి అలా చూస్తున్నావ్
సుబ్బు : నువ్వు ఏజెంటా భయ్యా
చిన్నా : ఎందుకలా అడిగావు
సుబ్బు : ఏం లేదు అలా అనిపించింది అంతే.
చిన్నా : వెళదామా
సుబ్బు : దోస బాగుంది ఇంకోటి తిని వెళదాం. నీక్కూడా చెప్పనా మొహమాట పడకు భయ్యా డబ్బులు నీవేగా
చిన్నా నవ్వుతూ సుబ్బుని చూసాడు.