Update 05

చూస్తుండగానే పదినిమిషాల్లో పదిమందిని తుక్కు రేగ్గొట్టాడు ఆదిత్య, మానస ఇంకా ఆశ్చర్యంగా చూస్తూనే ఉంది. ఆదిత్య అందరిని ఫినిష్ చేసి వాళ్ళ తాళ్లతో వాళ్ళనే కట్టేసాడు, చందు మరియు భరత్ కూడా సాయం చేశారు. భరత్, చందు ఆదిత్యని చూసి కొంచెం ఆశ్చర్యపోయినా ఇది సమయం కాదని తెరుకుని పనిలోకి దిగారు.

ఆదిత్య హడావిడిగా మానస వైపు పరిగెత్తి "నీ ఫ్రెండ్ కి ఫోన్ చేసావా ఎక్కడ వాడు, అక్కడ అమ్మాయిలని కాపాడాలి, నేను బెంగుళూర్ నుంచి వచ్చాను ప్లాన్ మొత్తం నాశనం చేసాడు వాడు"

మానస : అంటే మీరు ఆ అమ్మాయిలని కాపాడ్డానికి వచ్చారా, అయితే విక్రమ్ ఆ పని మీదే వెళ్ళాడు..

ఆదిత్య : ఎక్కడో తనకి ఎలా తెలుసు.?

మానస : మాకు తెలుసు, మేము వచ్చింది అందుకే..

ఆదిత్య : ఒక్కడే ఉన్నాడు, అక్కడ ఎంత మంది ఉన్నారో ఏంటో.. పద వెళదాం అని భరత్ వాళ్ళ వైపు చూసాడు.

చందు పరిగెత్తుకుంటూ వెళ్లి డ్రైవర్ దెగ్గర బస్సు తలలు తెచ్చి బస్సు స్టార్ట్ చేసాడు, ఆదిత్యతో పాటు భరత్ మానస కూడా ఎక్కారు. చందు వేగంగా చీకట్లో పోనించాడు బ్రిడ్జి రాగానే బస్సు ఆపేసాడు, ఆదిత్య బస్సు దిగి బ్రిడ్జి మీద నుంచి కిందకి చూసాడు, కింద కాలవ పారుతుంది పక్కనే ఉన్న గడ్డిలో రెండు ట్రక్లు ఎదురెదురుగా ఆగి ఉన్నాయ్, వెంటనే నీళ్ళలోకి దూకి అటు వైపు వెళ్ళాడు. భరత్ చందు మానస పక్కనే ఉన్న దారిలో చిన్నగా దిగి నడుచుకుంటూ వెళ్లారు. ఆదిత్య వెళ్లి చూసేసరికి అక్కడ నలుగురిని తాళ్లతో కట్టేసి బెల్టుతో కొడుతున్నాడు.

రెండు ట్రుక్కులు ఎదురెదురుగా ఉండటం ఒక ట్రక్కు లైట్లు వెలిగి ఉండటం వల్ల ఆ మనుషులు కనిపిస్తున్నారు కానీ వాళ్ళని కొడుతున్న విక్రమ్ మొహం చీకటిలో ఉండిపోయింది.

ఆదిత్య : విక్రమ్ అని పిలవగానే కోపంగా తల తిప్పి చూసాడు బెల్టుతో కొడుతూనే, కానీ తనలానే ఉన్న ఇంకో మొహాన్ని చూసి ఆగిపోయి ఆశ్చర్యంగా చూస్తుంటే మానస వచ్చింది.

విక్రమ్ : ఎవరు నువ్వు?

ఆదిత్య : అదే నేను అడిగేది ఎవడ్రా నువ్వు నా లాగ ఉన్నావ్

విక్రమ్ : (ఆదిత్య పొగరు చూసి) ఎవడివి బె నువ్వు.

మానస : ఆగండి ఆగండి.. ఇద్దరు.. ముందు అమ్మాయిల గురించి ఆలోచించండి.

ఆదిత్య : ఇందులో సగం మంది బెంగళూరుకి సంబంధించిన వాళ్ళు నేను డీసీఎం తీసుకెళతాను, అక్కడ నుంచి ఎవరిని వాళ్ళకి అప్పగిస్తాను.

విక్రమ్ : నేను మిగతా వాళ్ళ సంగతి చూసుకుంటాను, డీల్ అని చెయ్యి పైకి ఎత్తాడు. ఆదిత్య విక్రమ్ ఇద్దరు చేతులు కలుపుకుని మల్లి బస్సు ఎక్కి తిరిగి వచ్చారు.

చందు మంట వేస్తే అందరూ దాని చుట్టూ కూర్చుని చలి కాచుకుంటున్నారు.

ఆదిత్య : నా బండి?

విక్రమ్ : నేను ఒక రెండు రోజులు ఆగి పంపిస్తాను, ఇంతకీ నీకు దీని గురించి ఎలా తెలిసింది?

ఆదిత్య : నాకు దీని తరువాత ఎవడికి ఎదురెళ్లలో కూడా తెలుసు, ఎవ్వరిని వదలను నా కొడుకులందరినీ నేల నాకించేస్తాను. ఈ నా కొడుకులు సంధ్య ఫౌండషన్స్ వెనెక గుట్టుగా అమ్మాయిలని స్మగ్లింగ్ చేస్తున్నారు.. అందరిని బైటికి లాగి తలలు నరుకుతాను ఒక్కొక్కడిది.

విక్రమ్ : ఇదే పని ఇక్కడ గ్రీన్ హోటల్స్ వెనుక చేస్తున్నారు.. కానీ ఇంత పెద్ద సంస్థల లాంటి వాటిల్లో ఇలాంటి పనులు జరుగుతుంటే వాళ్ళకి తెలియదా లేక వాళ్లే చేపిస్తున్నారో అర్ధం కావట్లేదు.

ఆదిత్య : నీకు ఇదంతా ఎలా తెలుసు?

విక్రమ్ : చేపించింది వీళ్ళ నాన్నే

ఆదిత్య : విక్రమ్ ని మానసని చూస్తూ.."ఇంట్రెస్టింగ్" అని నవ్వాడు.. దీని వల్ల మీకు ఎన్ని ఇబ్బందులో తెలుసా, ఇంతకీ మీ లవ్ మ్యాటర్ మీ ఇళ్లలో తెలుసా?

మానస : మా అమ్మకి తెలుసు, మా నాన్నకి తెలిస్తే అస్సలు యుద్ధం మొదలవుద్ది.

ఆదిత్య : ఆ తొక్కలే.. ఏమైనా అవసరం పడితే కాల్ చెయ్యండి హెల్ప్ చేస్తాను, నా లవ్ ఎలాగో సక్సెస్ అవ్వలేదు మిమ్మల్నయినా కలుపుతా.

మానస : ఎవరు అమ్మాయి.. ఎం చేస్తుంటుంది?

ఆదిత్య ఫోన్ తీసి చూపించాడు" అనురాధ నా మరదలు, సర్జన్ " అన్నాడు, వరసగా మూడు బీర్లు తాగి నాలుగోది లేపుతూ.

విక్రమ్ : వచ్చినప్పటి నుంచి అదే పనిలో ఉన్నావ్, పోతావ్ త్వరగా

ఆదిత్య : నాకు మత్తు ఎక్కదు బాస్, అయినా ఇదే నా లాస్ట్ రేపటి నుంచి ఇక మందు ముట్టను అని నాలుగో బీర్ కింద పెట్టి ఐదో బీరు నోటికెత్తుకున్నాడు.

మానస విక్రమ్ చెవి దెగ్గరికి వెళ్లి : విక్రమ్ ఇందాక కూడా ఇదే చెప్పాడు, పచ్చి తాగుబోతులా ఉన్నాడు ఇతన్ని నమ్మి అమ్మాయిలని పంపించడం సేఫ్ అంటావా?

ఆదిత్య అది విని పక్కకి చూసి నీ పేరేంటి అని అడిగాడు, "భరత్" హ్మ్... నీ పక్కనే ఉన్న నాలుగు రాళ్లు అందుకుని నా మీదకి ఒకేసారి గట్టిగా విసిరేయి అన్నాడు.. భరత్ విక్రమ్ ని చూడబోతే విక్రమ్ లేచి చేతికి అందిన ఏడు గులక రాళ్లు ఆదిత్య వైపు విసిరాడు.. ఆదిత్య నవ్వుతూ పట్టించుకోకుండా బీర్ తాగి కింద పెట్టి కరెక్టుగా మొహం మీదకి వచ్చిన మిల్లి సెకండ్ లో అన్ని రాళ్లు పట్టుకున్నాడు. అందరూ ఆశ్చర్యంగా చూస్తే...

ఆదిత్య : చెప్పను కదా నాకు మత్తు ఎక్కదు అని, ఇప్పటికైనా నమ్ముతారా ఇక వదిలితే నేను బైలుదేరతాను.. అని లేచాడు.. ఆదిత్యని పంపించి విక్రమ్ మానస మిగతా వాళ్ల దెగ్గరికి వెళ్లి భయపడుతున్న అమ్మాయిలకి ధైర్యం చెప్పి సలీమా, రమ్య , పూజల సాయంతో మిగిలిన వాళ్ళని ఇంటికి పంపించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.

తెల్లారి లంబసింగి కొండా ట్రేక్కింగ్ కాన్సల్ చేసుకుని టూర్ ప్రయాణం మొదలుపెట్టారు, బస్సు బైలదేరింది.. విక్రమ్ మానస బస్సు వెనకాలే ఆదిత్య బండి మీద ఇద్దరు టూర్ ఎంజాయ్ చెయ్యడానికి నిర్ణయించుకున్నారు.. బస్సు తరువాత ఆగబోయేది అరకులో..

ముందు కాలేజీ బస్సు వెళ్తుంటే వెనకాలే బండి మీద నేను మానస వస్తున్నాం, మా మేటర్ ఎలాగో అందరికి తెలిసిపోయింది ఇక భయం ఎందుకులే అనుకున్నాం కానీ రూప మేడంని చాల బతిమిలాడాల్సి వచ్చింది, తనని ఇలా బండి మీద వస్తాము అని ఒప్పించడానికి.

మానస : ఏం ఆలోచిస్తున్నావ్?

విక్రమ్ : ఏం లేదు.

మానస : బస్సుని పోనీ, మనం కొంచెం చిన్నగా వెళదాం.

విక్రమ్ : రూప మేడం కోప్పడుతుందేమో

మానస : ఏం కాదులే, కొంచెం స్లో చెయ్

విక్రమ్ : (బండి వేగం తగ్గించాను) చెప్పు,

మానస : ఆ ఆదిత్య అచ్చు నీలాగే ఉన్నాడు. ఎలాగా ?

విక్రమ్ : ఏమో నాకేం తెలుసు.

మానస : అంటే నాకొక డౌట్ కొట్టేస్తుంది అడగనా

విక్రమ్ : అడుగు

మానస : మల్లి కోప్పడకూడదు మరి

విక్రమ్ : సరే, అడుగు

మానస : అంటే మీ ఇద్దరు అన్నదమ్ములు అయ్యి చిన్నప్పుడే గొడవల్లో తప్పిపోయి ఒకరు మీ అమ్మకి ఇంకొకరు ఇంకో ఇంట్లో దొరికారేమో అనీ...

విక్రమ్ : హహ.. అలాంటిదేమి లేదు నేను మా అమ్మకి ఒక్కన్నే కొడుకుని ట్విస్టులు తర్నులు ఏం లేవు.

మానస : మరి ఎలా మీ ఇద్దరు ఒకేలా ఉన్నారు.

విక్రమ్ : నాకు మాత్రం ఏం తెలుసు.

మానస : ఇంకోటి మన గురించి అందరికి తెలిసిపోయింది ఇప్పుడు ఎలాగా, ఎంత కాపాడినా మా నాన్నకి తెలియకుండా ఆగదు.

విక్రమ్ : తెలియనీ, నాకు ఏదో ఒకటి తేల్చుకోవాలని ఉంది.. నాకూ ఆ ఆదిత్య లాగ ఇక్కడ అమ్మాయిలని స్మగ్లింగ్ చేసేవాళ్ళని ఏరిపారెయ్యాలని ఉంది.

మానస : ఇప్పుడు సహాయం చేసావుగా చాల్లే, రిస్కులు వద్దు అయినా ఆ ఆదిత్య బాడీ చూసావా ఎలా ఉన్నాడో

బండి నడుపుతూనే వెనక్కి తిరిగి మానసని చూసాను.

మానస : సారీ సారీ.. నువ్వే బాగున్నావ్.

విక్రమ్ : సంతాపాలు ఒద్దులే, నాకు కూడా సిక్స్ పాక్స్ ఉన్నాయ్ వాడికి ఉన్నాయా.. బాడీ బలిస్తే సరిపోదు బ్రెయిన్ కూడా ఉండాలి.

మానస, ఇక నన్ను మాట్లాడనివ్వకుండా వెనక నుంచి గట్టిగా వాటేసుకుంది. ఆ స్పర్శని అనుభూతి చెందుతూ ముందుకి వెళుతున్నాం, కొంత సేపటికి చీకటి పడేసరికి పురుగులు మొహం మీద తగులుతుంటే బస్సు ఆపించి మానసని ఎక్కించి నేను భరత్ సగం సగం నడుపుకుంటూ అరకు చేరాము, దిగిన వెంటనే అబ్బాయిలం అందరం కలిసి త్వర త్వరగా టెంట్లు వేసేసి అందరం పడుకున్నాం.

సడన్ గా మెలుకువ వచ్చి చూసేసరికి, మానస నా టెంటు బైటే ఉండి పిలుస్తుంది, బైటికి వచ్చాను టైం చూస్తే తెల్లారి మూడు అవుతుంది.

విక్రమ్ : ఏంటి మానస?

మానస : నిద్ర రావట్లేదు అలా నడుద్దాం వస్తావేమో అని..

విక్రమ్ : నాకు పిచ్చి పిచ్చిగా నిద్ర వస్తుంది, ఈ సారికి నువ్వెళ్ళి వచ్చేయి.

మానస : అలాగా, సరే పడుకో నిద్రబోతు మోహమోడా..

విక్రమ్ : ఏవో పచ్చి బూతులు వినిపిస్తున్నాయి..

మానస : నిన్ను కాదులే, నువ్వు పడుకో.

విక్రమ్ : అంతలోనే అలకా, చెప్పులైనా వేసుకొనీ.. ఆ.. ఇక పదా.. నీ ఇష్టం వచ్చినంత సేపు నడుద్దాం.

ఇద్దరం ఒకరి చేతిలో ఇంకొకరి చెయ్యి వేసుకుని మాట్లాడుకుంటూ వెళుతుంటే మానస కాలు గీరుకోవడానికి కిందకి వంగి గీరుకొని మళ్ళీ నడుస్తూ నా కళ్ళలోకి చూసి ఆగిపోయింది.

మానస : ఏంటి అలా చూస్తున్నావ్.

విక్రమ్ : ఏం లేదు.

మానస : చెప్పు..

విక్రమ్ : ఏమనుకోనంటే నీ బ్యాక్ ఈ చుడిధార్ లో సూపర్ ఉంది, అని ముందుకు నడిచాను.

మానస : హహ.. నువ్వు.. ఆమ్మో.. హహ.. నచ్చిందా.. అని నా భుజం మీద చెయ్యి వేసి నడుస్తుంది.

విక్రమ్ : చాలా బాగుంది, అని ఒక్క సారి చెయ్యి వేసాను.. నా వైపు నవ్వుతూ చూసి చేతి మీద కొట్టింది.. అబ్బా ప్లీస్.. అని మళ్ళీ ముట్టుకున్నాను.. మనసా.. ఎంత వెచ్చగా ఉందొ.. చలి కాల్చుకోవచ్చు అని నా బుగ్గల మీద పెట్టుకున్నాను..

మానస : నిన్నూ.. ఆగు.. ఓయి.. అని నా వెంట పరిగెత్తింది..

విక్రమ్ : మానస.. ఒకసారి అప్పుట్లో నువ్వు నడిచేదానివి కదా తిప్పుకుంటూ అలా నడవ్వా.. అని నడుము పట్టుకున్నాను..

మానస : ఎలా

విక్రమ్ : అదే పొగరుగా ముడ్డి అటు ఇటు తిప్పుతూ నడిచేదానివి కదా అలా.

మానస : బుంగమూతి పెడుతూ.. పొ విక్రమ్ నువ్వు ఎప్పుడు అది గుర్తుచేసి నన్ను ఏడిపిస్తావ్.

విక్రమ్ : ఏదో సరదాకి అన్నాలే, ఫీల్ అవ్వకు ఇంకెప్పుడు అన్నాను సరేనా

మానస : సరే నడుస్తా.. దా అని నా చెయ్యి తన వెనక మీద వేసుకుని ముందుకి క్యాట్ వాక్ చేస్తుంటే నా చెయ్యి ఊగుతూ బలే అనిపించింది.

తనని చూసి నవ్వాను, నా చెయ్యిని తన నడుముకి చుట్టుకుని నా చేతిని చుట్టేసి నవ్వుకుంటూ ముందుకు నడిచి అక్కడ పచ్చగడ్డి కనిపిస్తే కూర్చున్నాం.

మానస : విక్రమ్ నన్ను ఎప్పటికి ఎలాంటి పరిస్తుతుల్లో వదలకు.

విక్రమ్ : ఏ మానస, ఏమైంది అని కన్నీళ్లు తుడిచాను.. ఏంట్రా.. ఏమైంది?

మానస : ఏమో.. నీ ఒళ్ళో ఎప్పుడు వాలినా, ఎమోషనల్ అయిపోతాను నువ్వు నాకు దక్కవేమో అన్న భయం, నన్ను నీనుంచి అందరూ కలిసి లాగేసుకుంటారని ఒకలాంటి ఆవేదన ఎందుకో తెలీదు, అందుకే నువ్వు మళ్ళీ అమ్మాయిలని కాపాడ్డానికి వెళ్తా అన్నా నాకు నచ్చలేదు.

విక్రమ్ : నిజం చెప్పనా నాకు నీ కళ్ళలో ఈ భయం మనం మొదటి సారి నువ్వు నా కళ్ళలోకి చూసావు గుర్తుందా ఆయింట్మెంట్ ఇచ్చావ్ అప్పుడే చూసాను.. ఏదో బాధతొ ఉన్నట్టు నా కోసం ఎదురు చూపులు అన్ని గమనిస్తూనే ఉన్నాను.. అమ్మ మీద ఒట్టు బత్తుకైనా చావైనా నీతోనే.. అని నుదిటి మీద ముద్దు పెట్టుకున్నాను.

మానస నా మీద పడిపోయి గట్టిగా వాటేసుకుంది అలానే కింద పడిపోతూ ఇద్దరం కౌగిలించుకుని పడుకున్నాం.. అరగంటకో ఏమో మెలుకువ వచ్చి లేచి మానసని లేపాను, తెల్లారింది.. ఇద్దరం వెళ్లి అందరితో కలిసి మధ్యాహ్నం వరకు అక్కడ మ్యూజియం, బుర్రా కేవ్స్ అన్ని చూసుకుని సాయంత్రం వరకు వైజాగ్ చేరుకొని రూం తీసుకుని సెట్ అయ్యే వరకు రాత్రి ఎనిమిది అయ్యింది..

వైజాగ్ వెళ్ళాక నాకు మానసకి కొంచెం ఏకాంతం దొరికింది, రాత్రికి అందరూ పడుకున్నాక ఇద్దరం బీచ్ కి వెళ్లిపోయాం రాత్రి మొత్తం ఇక్కడే గడపాలని అనుకున్నాం, చాలా మాట్లాడుకున్నాం చాలా ప్రేమించుకున్నాం ఒకరి మీద ఒకరికి ఎంత ప్రేమ ఉందొ కూడా ఈ ప్రయాణం లోనే మాకు తెలిసింది.

విక్రమ్ : మానస ఇలా రా

మానస : ఏంటి?

విక్రమ్ : నీ పెదాలు భలే ఉంటాయి.. సన్నగా ఎక్కడ చేపించావ్

మానస : ఆహా.. మా అమ్మ చేసింది, కావాలా

విక్రమ్ : నువ్విస్తానంటే నేనొద్దంటానా, చూస్తుంటేనే ముద్దొస్తున్నాయి.

బీచ్ లో మానసని ఒళ్ళో కూర్చోబెట్టుకుని ముద్దు పెట్టుకుంటుంటే ఫోన్ మోగింది, చూస్తే ఆదిత్య. అది చూసి మానస కూడా నా ఒళ్ళో నుంచి లేచింది. ఫోన్ స్పీకర్ లో పెట్టాను.

విక్రమ్ : హలో

ఆదిత్య : నాకొక హెల్ప్ కావాలి.

విక్రమ్ : నువ్వు వెళ్లి ఒక్క రోజు కూడా అవ్వట్లేదు.

ఆదిత్య : లేదు నేనింకా దారిలోనే ఉన్నాను, ఇంకో గంట పడుతుంది.

విక్రమ్ : చెప్పు..

ఆదిత్య : నన్ను చంపడానికి కొరియా నుంచి ఒక బ్యాచ్ దిగుతుంది ఇరవై మంది పైనే వస్తున్నారు, అందరూ ట్రైనడ్ కిల్లర్స్. అలాగే రేపు నా మరదలకి ఇక్కడ ఎంగేజ్మెంట్ చేస్తున్నారు నేను ఏదో ఒకటి తెల్చుకోవాలి, నువ్వు నా స్థానంలో వెళ్లి అనురాధని తీసుకొచ్చేయి నేను ఇక్కడ వీళ్ళ పని పడతాను.. ఏమంటావ్, వస్తావా?

విక్రమ్ : మానసని చూసాను..

మానస : వస్తాడు ఆదిత్య, నీ లవ్ కచ్చితంగా సక్సెస్ అవుతుంది కానీ ఆ కొరియన్ వాళ్ళు ఎవరు, నాకు భయంగా ఉంది.

ఆదిత్య : అదే చెప్తున్నాను, చాలా రిస్క్ ప్రాణాలు పోయే అవకాశం కూడా లేకపోలేదు అందుకే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఆలోచించుకొని నాకు ఏ విషయం చెప్పండి.. గుర్తుపెట్టుకో ప్రాణాలకే ప్రమాదం.. కానీ నువ్వు నాకు చాలా అవసరం విక్రమ్.. నీకు లొకేషన్ పంపిస్తున్నా ఏ విషయం ఆలోచించుకుని ఫ్లైట్ ఎక్కు, నాకు మళ్ళీ ఫోన్ చెయ్.

ఫోన్ పెట్టేసి మానసని చూసాను.. మానస అయోమయంగా చూసింది..

విక్రమ్ : ఎం చెయ్యను.?

మానస : నాకు భయంగా ఉంది, తను అంత గట్టిగా చెప్తున్నాడు. నాకు వెళ్లాలని ఉంది.

విక్రమ్ : ఎలాగో ఇద్దరం ఉన్నాం, మేనేజ్ చెయ్యొచ్చు తన లవ్ కి హెల్ప్ చేస్తే అప్పుడైనా మందు మానేస్తాడేమో.. ఎవరో కూడా తెలియని అమ్మాయిల కోసం ఇంత రిస్క్ తీసుకుంటున్నాడు, అడగక పోతే అది వేరు కానీ ఇప్పుడు తను ప్రమాదంలో ఉన్నాడని తెలిసి కూడా ఇలా కూర్చోలేను.

మానస : జాగ్రత్త.. అంటూనే నా పెదాలు అందుకుంది.

విక్రమ్ : పదా వెళదాం.. అని లేచి హోటల్ దెగ్గరికి వచ్చేసాం

చందు భరత్ లని లేపి విషయం వివరించాను కానీ వాళ్ళకి ఇవేమి చెప్పలేదు. భరత్ ని తీసుకుని ఎయిర్పోర్ట్ కి బైలుదేరాను. మానస వైపు చూసాను, బాయ్ అని చెయ్యి ఊపింది. తల ఊపి బైటికి వచ్చేసి భరత్ బండి నడుపుతుంటే వెనక కూర్చున్నాను.

భరత్ : విక్రమ్ ఈ బండి ?

విక్రమ్ : పొద్దున్నే ఏ ట్రైన్ కి కుదిరితే ఆ ట్రైన్ కి బండి పార్సెల్ వేసి పంపించు అలాగే ఎందుకైనా మంచిది ఊర్లో మన వాళ్ళు ఎవరైనా ఉంటె నా బండి కూడా బెంగుళూర్ పార్సెల్ చెయ్యమను అవసరం పడొచ్చు నాకొక ప్లాన్ ఉంది.

భరత్ : అలాగే

బండి ఎయిర్పోర్ట్ ముందు ఆగింది దిగి లోపలి వెళుతూ వెనక్కి తిరిగి భరత్ ని పిలిచాను.

భరత్ : ఏంట్రా

విక్రమ్ : ఎక్కడో తేడా కొడుతుంది రా, ఆ మనుషులని అక్కడే వదిలేశాం మేము ఇద్దరం ఒకేలా ఉంటామని మానస వాళ్ళ నాన్నకి తెలుస్తుందేమో.... ఇంకోటి మా ఇద్దరి గురించి అందరికి తెలిసిపోయింది ఎప్పుడైనా ఏ ప్రాబ్లెమ్ అయినా రావొచ్చు ఒక వేళ వస్తే మాత్రం అమ్మా నాన్న సలీమాని నా దెగ్గరికి పంపించేయి మానస సంగతి తరవాత చూసుకోవచ్చు.. కొంచెం జాగ్రత్తగా ఉండండి.. పని అయిపోగానే వచ్చేస్తాను జాగ్రత్త.. హ్మ్మ్.. బై

లోపలికి వెళ్లి ఫ్లైట్ చూసుకుని ఎక్కి కూర్చున్నాను, మానసని వదిలి వెళ్లాలంటే ఎలాగో ఉంది కానీ అక్కడ వాడి పరిస్థితి కూడా అంతే కదా పాపం చిన్నప్పటి నుండి కలిసి పెరిగిన మరదలు.. వస్తున్నా ఆదిత్య.

గంటలో బెంగుళూర్ రీచ్ అయ్యాను బైటికి వచ్చేసరికి ఎవరో ఒక పిల్లాడు నా దెగ్గరికి వచ్చి విక్రమ్ అన్నాడు, అవును అన్నాను.

"నా పేరు రాము, అన్న చెప్పినట్టు మీరు సేమ్ ఆదిత్య అన్న లెక్కనే ఉన్నారు"

విక్రమ్ : ఎక్కడున్నాడు.

రాము : పద అన్నా, అక్కడికే వెళుతున్నాం. అన్నా వదిన కలిసిపోయారు.. అమ్మాయిలు ఆకలి వేస్తుందనేసరికి అన్న డైరెక్టుగా వదినకె ఫోన్ చేసాడు.. వదిన అక్కడ అందరికి కిచిడీ వండుతుంది.

విక్రమ్ : అయితే కలిసిపోయారన్నమాట

రాము : అవునన్నా.. కానీ అన్న ఇంకా రాలే

విక్రమ్ : అదేంటి నాకు ఫోన్ చేసినప్పుడు ఇంకోగంటలో వెళ్ళిపోతా అన్నాడు.

రాము : నాతోని కూడా అదే అన్నాడు కానీ మధ్యలో సెక్యూరిటీ అధికారి చెకింగ్ ఉందట హైవే దిగి ఊర్లల్లో నుంచి వస్తున్నాడు... ఇదే అన్నా క్యాంపు.. అదిగో అక్కడ కట్టెలు పెట్టి మంట వెలిగిస్తుందే తనే అనురాధ.

బండి దిగి తన ముందుకి వెళ్ళాను నన్ను చూడగానే ఏడుస్తూ నా వైపు పరిగెడుతుంటే చెయ్యి ఎత్తి "నేను ఆదిత్యని కాను" అన్నాను. నన్ను చూసి ఆగిపోయి రాము వంక చూసింది.

రాము : అవును వదినా ఈ అన్న పేరు విక్రమ్ ఆచం అన్న లెక్కనే ఉన్నడు, తన ఫ్రెండ్ అట.

అనురాధ : కానీ...

విక్రమ్ : ముందు వంట సంగతి చూద్దాం.

అనురాధ : కట్టెలు మండడం లేదు..

విక్రమ్ : తప్పుకోండి నేను చూస్తాను అని పొయ్యి వెలిగించి డెక్షా పెట్టి అనురాదని చూసాను ఒక్కొక్కటి నాకు అందిస్తుంటే అన్ని వేసి ప్లేట్ పెట్టి కింద కర్రలు మధ్యలోకి పెట్టి మంట పెంచాను.

రాము : అన్నా వంట బాగా చేస్తున్నావ్

విక్రమ్ : మేముండేది పల్లెటూళ్ళో కదా అందరం కలిసి వండుకోవడం అలవాటు.

అనురాధ : మా బావ ఉన్నాడు, ఎంత తినమన్నా తింటాడు కానీ కాఫీ పెట్టడం కూడా రాదు.

అలా అన్ని మాట్లడుకుంటూ కూర్చున్నాం కిచిడి కూడా అయిపోయింది, టేస్ట్ చూస్తే బ్రహ్మాండంగా ఉంది. ఇంతలో ట్రక్ లోపలి వస్తున్న శబ్దం విని అటు వైపు చూసాము.

ట్రక్ ఆపి డోర్ తీసుకుని కిందకి దిగాడు ఆదిత్య, రాము పరిగెత్తి వెనకాల డోర్ తీసి అమ్మాయిలని కిందకి దించుతుంటే, అనురాధ వెళ్లి ఆదిత్యని కరుచుకుపోయింది.. వాళ్లు ఇద్దరు మాట్లాడుకుంటుంటే మనసుకి హాయిగా ఉంది, నేను మానసని బుజ్జగించినదానికంటే ఎక్కువ ప్రేమ చూపిస్తున్నాడు.. ఆ బాండింగ్ నాకు నచ్చింది.

నేనూక్కణ్ణే వాళ్లందరికీ భోజనాలు వడ్డించడం చూసి అను ఆదిత్య కూడా జాయిన్ అయ్యి వడ్డించారు, ఆ తరువాత అందరి గురించి తెలుసుకుని ఇంటికి పంపించేసరికి మధ్యాహ్నం రెండు అయ్యింది. కొంతమంది వెళ్లిపోయారు మరికొంతమందిని వదిలి పెట్టి రావాల్సి వచ్చింది.

నా ఫోన్ లో ఛార్జింగ్ అయిపోతే పెట్టి పనిలో ఉండగా రింగ్ అయితే ఆదిత్య ఎత్తి స్పీకర్ లో పెట్టాడు..

మానస : విక్రమ్ ??

విక్రమ్ : ఆ వాయిస్ లో భయం వినిపించగానే ఫోన్ అందుకున్నాను... మానస చెప్పు

మానస : మా నాన్నకి మన విషయం తెలిసిపోయింది అమ్మ నా కార్ పంపించింది వాళ్లు రాకముందే ఇంట్లో ఉండమని డ్రైవర్ వచ్చాడు... అంతే కాదు తన ప్లాన్ చెడగొట్టింది కూడా నువ్వేనని ఆయనకి తెలిసిందట నిన్ను చంపించమని కాంట్రాక్టు కూడా ఇచ్చాడట.. నన్ను ఇంటికి లాక్కెళ్ళడానికి కూడా మనుషులు వచ్చారు ఇప్పుడు ఎలా?

విక్రమ్ : ఇప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావ్?

మానస : బెంగుళూర్ హైవే మీద, నీ దెగ్గరికి వస్తున్నాను..

విక్రమ్ : ఇంటికి రమ్మని మీ అమ్మ చెప్పింది కదా

మానస : ఏమో నాకు భయం వేసింది, మళ్ళీ నన్ను ఎక్కడైనా దాచిపెడితే.. నీకు దూరంగా అస్సలు ఉండలేను..

విక్రమ్ : ఒక్కదానివేనా కార్ లోనా

మానస : లేదు ఒక అబ్బాయి హెల్ప్ చేస్తున్నాడు.. తనే నడుపుతున్నాడు డ్రైవర్ అని చెప్పాడు.

విక్రమ్ : మరి భరత్ వాళ్ళు?

మానస : భరత్ మీ అమ్మ వాళ్ళని ఊర్లో వాళ్లతొ మాట్లాడి అలాగే ఇక్కడ సలీమాని బెంగుళూరు ఫ్లైట్ ఎక్కిస్తున్నాడు, చందు మిగతా పూజ వాళ్ళని తీసుకుని ఊరికి వెళ్ళిపోయాడు.

విక్రమ్ : సరే నేను మళ్ళీ చేస్తాను.. అని భరత్ కి ఫోన్ చేసి మాట్లాడి ఆ వెంటనే చందుకి కూడా ఫోన్ చేసాను.. నాన్న కూడా నన్ను ఏమనలేదు వచ్చాక మాట్లాడదాం అన్నాడు అంతే.. ఫోన్ పెట్టేసి తల పట్టుకుని కూర్చున్నాను. భుజం మీద చెయ్యి పడేసరికి తల తిప్పి చూసాను ఆదిత్య.

ఆదిత్య : ఏం కాదు చూసుకుందాం.

విక్రమ్ : నా విషయం పక్కన పెట్టు అస్సలు ఈ కొరియన్ వాళ్లు ఎవరు, నీ వెనక ఎందుకు పడ్డారు..?

అనురాధ : బావ, ఏం జరిగింది.. అస్సలు ఇన్ని రోజులు ఏమైపోయావు నన్ను ఎందుకు దూరం పెట్టావు.. చదువు మధ్యలో ఆపేసావని తెలుసు కానీ రాము వాళ్ల అన్నయకి ట్రీట్మెంట్ చేసింది నువ్వే.. నువ్వేసిన కుట్ల పద్ధతి కొరియ వాళ్ళది, వాళ్లు ఇప్పుడు నిన్ను చంపడానికి వస్తున్నారంటున్నావ్.. ఏంటిదంతా?

అందరూ ఆదిత్య వైపు చూసారు...

విక్రమ్ ఒక సాదా సీదా కుర్రోడు, ప్రాణంగా చూసుకునే అమ్మ బెస్ట్ ఫ్రెండ్ లాంటి నాన్న పెంపకంలో చాలా ఆనందంగా ఉండే జీవితం తనది, వాళ్ళ నాన్న జనరల్ ట్రాన్స్ఫర్స్ మీద ఊర్లు తిరుగుతూ తిరుగుతూ పల్లెటూరు చేరాడు, అక్కడే తనకి పరిచయం అయిన తన స్నేహితులు అక్కడి వాతావరణం, అక్కడి బంధాలకి అలవాటు పడి ఊర్లోనే స్థిర పడిపోయారు.

భరత్, చందు, పూజ, సంధ్య, రమ్య ఐదుగురు స్నేహితులతో పాటు సలీమా అనే చెల్లిని కూడా సంపాదించుకున్నాడు. విక్రమ్ మహిమో ఏమో పొగరుగా ఎవ్వరిని లెక్క చెయ్యకుండా ఉండే మానస ఒక్క చూపులోనే తన చిన్నప్పటి స్థితికి వెళ్ళిపోయింది అలానే తన అమ్మకి మళ్ళీ దెగ్గరయ్యింది.

ఈ జంటకి పెద్దగా ప్రేమించుకోడానికి సమయం దొరక్కపోయినా ఉన్న సమయాన్ని చాలా బాగా వాడుకున్నారు, ఈ ప్రయాణంలోనే మానస తన తండ్రి ఎటువంటివాడో తెలుసుకుని ఆయనకి విరుద్ధంగా విక్రమ్ తో పాటు కిడ్నాప్ అయిన ఆడపిల్లలని కాపాడింది, అప్పుడే అచ్చు విక్రమ్ లానే ఉండే ఆదిత్యని కలిసి తన మరదలు గురించి తెలుసుకుంది.

ఆదిత్య అడిగిన సాయానికి విక్రమ్ బెంగుళూరు వెళ్లగా, మానస నాన్న జరిగింది మొత్తం తెలుసుకుని మనుషుల్ని పంపించడంతో మానస అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యి బెంగళూరులో ఉన్న విక్రమ్ దెగ్గరికి వెళ్ళడానికి నిర్ణయించుకుంది.. ఈ ఒక్క రోజులోనే సుభాష్ అనే ఒక ఎక్సట్రార్డినరీ డ్రైవర్ ని కలిసి తన కధ విని దెగ్గరికి చేర్చుకుంది.

ఆదిత్య కధ విన్నాక విక్రమ్ తనకి సహాయం చెయ్యడానికి మనస్ఫూర్తిగా ఒప్పుకున్నాడు, మానస విక్రమ్ చెంతకీ చేరింది కానీ ఆ తరువాత తన మూలంగా సుబ్బు వాళ్ళ నాన్నకి చిక్కడంతో ఆదిత్య విడిపించడానికి బైలుదేరగా, ఆదిత్య మరదలు అయిన అనురాధ పెళ్లి పనులు మొదలు పెట్టింది.. అదే రోజు సాయంత్రానికి విక్రమ్ అమ్మా నాన్నా.. మానస వాళ్ళ అమ్మ, ఇంట్లో పని చేసే అక్క తన కొడుకుతో వచ్చి అందరూ కలిసి పెళ్లి ఏర్పాట్లు చేశారు.

తెల్లారే లోగా విక్రమ్ ఫ్రెండ్స్ రావడం, ఆ వెంటనే పెళ్లి టైంకి ఆదిత్య సుబ్బుని హాస్పిటల్లో జాయిన్ చేసి మానస నాన్నతో పెళ్లి మండపంలో అడుగుపెట్టాడు. మానస బెదిరినా తన నాన్న నవ్వుతూ నాకు ఇష్టమే అని చెపుతూనే భయపడుతూ పక్కనే నిల్చున్న ఆదిత్యని చూసి ఒక అడుగు వెనక్కి వేసాడు.. విక్రమ్ తాళి కట్టడం అందరూ అక్షింతలు వెయ్యడం అయిపోయింది..

పెళ్లి అవ్వగానే మానస లేచి విక్రమ్ తో పాటు హాస్పిటల్ కి వెళ్ళింది, సుబ్బు లేచే ఉన్నాడు. మానస సుబ్బుని చూడగానే ఏడ్చేసింది..

మానస : సుబ్బు క్షమించరా, నా వల్లే...

సుబ్బు : ఏం అవ్వలేదులే.. ఏడవకు.. పెళ్లి బాగా జరిగిందా.. హ్యాపీ మారీడ్ లైఫ్..

మానస : థాంక్స్..

విక్రమ్ : థాంక్స్ సుబ్బు..

సుబ్బు : మీ నాన్నని మర్చిపో, వాడిని వదలను

మానస : ఇప్పుడు కూడా జోకులే.. పోరా..

అనురాధ : వాడికి తోడుగా నేనుంటాలే మీరు వెళ్ళండి.. బావా తీసుకెళ్లి మిగతా ఏర్పాట్లు చూడు.. నేను సుబ్బు గురించి కనుక్కుని వీలైతే డిశ్చార్జ్ చేపించుకుని వచ్చేస్తా.. అని ఆదిత్య వాళ్ళని పంపించడానికి బైటికి వెళ్ళింది.

బెడ్ మీద పడుకుని ఉన్న సుబ్బు జోక్ చేసేటప్పుడు తన ఎడమ కంట్లో నుంచి కారిన నీరు చూసి ఉంటే అది జోక్ లా తీసుకునే వారు కాదేమో. సుబ్బు ఎంతగా నవ్విస్తాడో నవ్వుతాడో తెలిసిన మానసకి సుబ్బు బాధ పడితే వాడు కోప్పడితే ఎంత భయంకరంగా ఉంటుందో చూడబోతుందని తెలీదు. సుబ్బుని ఆపడానికి విక్రమ్ ఆదిత్య ఇద్దరు ఎన్ని చెరువుల నీళ్లు తాగాలో ముందు ముందు తెలుసుకుందాం.

ఇంతటితో ఈ కధ సమాప్తం, విక్రమ్ మానస, విక్రమ్ అమ్మ కావ్య మిగిలిన వాళ్ళు సందర్బానుసారం మిగతా కధల్లో విక్రమ్ రిచి రిచ్ కధలో వచ్చిపోతుంటారు. ఈ కధని ఆదరించినందుకు పాఠకులందరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు.
సమాప్తం
❤️❤️❤️
❤️
Previous page: Update 04