Episode 003


అమ్మవారి గుడి దగ్గర నుంచి బయలుదేరి గబగబా హాస్పిటల్ కి చేరుకున్నాను. తొందరగా హాస్పిటల్ లోకి వెళ్లి నేరుగా ప్రీతి ఉన్న రూమ్ లోకి వెళ్లాను. కవిత మేడం ఇంకా ప్రీతి బెడ్ మీద తల పెట్టుకొని కూర్చుని ఉన్నారు. నేను ముందుకు వెళ్లి పూజారి గారు ఇచ్చిన తైలాన్ని ప్రీతి కళ్లకు రాసి ప్యాకెట్ లో ఉన్న కుంకుమను ఆమె నుదిటిపై బొట్టు పెట్టాను. తర్వాత రెండు చేతులు జోడించి ప్రీతిని తొందరగా కోలుకునేట్టు చూడమని అమ్మవారిని ప్రార్ధించాను. ఆ తరువాత నేను అక్కడ నుంచి బయటకు వచ్చి అద్దంలో నుంచి లోపలి వైపు చూస్తున్నాను.

కొంతసేపటి తర్వాత ప్రీతి చేతులలో కదలిక కనపడింది. ఆ తర్వాత నెమ్మదిగా ఆమె కళ్ళు తెరుచుకున్నాయి. ఆ తర్వాత ఆమె అటూ ఇటూ చూసింది. ఒకపక్క మేడం బెడ్ మీద తల పెట్టుకుని కూర్చోవడం చూసి నెమ్మదిగా మమ్మీ అని పిలిచింది. ప్రీతి గొంతు వినపడటంతో మేడం ఒక్కసారిగా లేచి కూర్చున్నారు. ప్రీతి కళ్ళు తెరిచి మేల్కొని ఉండటం చూసి మేడం చాలా సంతోషపడ్డారు. పైకి లేచి ప్రీతి మోహాన్ని రెండు చేతులతో పట్టుకుని తడుముతూ, తల్లీ,,, ఇప్పుడు ఎలా ఉందిరా నీకు? అంటూ ఆప్యాయంగా అడిగారు. ఓకే మమ్మీ,, కాకపోతే కొంచెం తలనొప్పిగా ఉంది అని అంది ప్రీతి.

ఏమి పర్వాలేదులే తల్లి అది కూడా తొందరగానే తగ్గిపోతుంది అని మేడం అన్నారు. ఇంతలో నేను వెళ్లి డాక్టర్ని పిలుచుకొని వచ్చాను. డాక్టర్ ప్రీతిని చెకప్ చేసి, మీ అమ్మాయి ప్రమాదం నుంచి బయటపడినట్టే, ఇకమీదట కంగారు పడాల్సిన పనిలేదు అని చెప్పారు. థాంక్యూ డాక్టర్ అని కవిత మేడం అనడంతో డాక్టర్ అక్కడినుంచి వెళ్ళిపోయాడు. నేను ఇంకా బయటే ఉన్నాను. ఆ తర్వాత మేడం ప్రీతితో కొంచెం సేపు మాట్లాడిన తర్వాత నన్ను లోపలికి రమ్మని పిలిచారు. నేను లోపలికి వెళ్లి ప్రీతి పక్కన నిలుచున్నాను.

ఇప్పుడు ఎలా ఉంది బంగారం అని ప్రీతిని అడిగాను. .... ఇప్పుడు నేను బాగానే ఉన్నాను అన్నయ్య. .... సరే అయితే నువ్వు రెస్ట్ తీసుకో అని చెప్పి కొంతసేపు నేను ప్రీతి పక్కనే కూర్చున్నాను. ఆ తర్వాత నర్స్ వచ్చి ప్రీతి నిద్రపోవడానికి ఇంజక్షన్ ఇవ్వడంతో ప్రీతి నిద్రపోయింది.

కోమా గండం నుంచి తప్పించుకొని ప్రీతి స్పృహలోకి వచ్చేసింది. అందువలన మేడం నేను చాలా సంతోషంగా ఉన్నాము. ఈ విషయాన్ని దీపక్ అంకుల్ కి కూడా కబురు పంపించాము. ఇక నేను దేవుని ముందు చేసిన ప్రమాణాన్ని నిలబెట్టుకోవలసిన సమయం ఆసన్నమైంది. మేడమ్ గారి ఫ్యామిలీ నుంచి నేను దూరంగా వెళ్ళిపోతాను అని దేవుని ముందు ప్రమాణం చేశాను. అదే విషయం గురించి ఆలోచిస్తూ కూర్చున్నచోట నుంచి లేచి ఆ రూమ్ లో నుంచి బయటకు వచ్చేసాను. హాస్పిటల్ నుంచి బయటకు వచ్చి అక్కడికి దగ్గరలో ఉన్న ఒక పార్కులోకి వచ్చి కూర్చున్నాను.

అలా పార్కులో కూర్చొని నా జీవితం గురించి ఆలోచించడం మొదలు పెట్టాను. ఏం బతుకు నాది. స్వతంత్రంగా నేను ఎవరికి దగ్గర కాలేను. అలాగని ఎవరిని నా దగ్గరకు రానివ్వలేను. నేను ఏం పాపం చేశాను భగవంతుడా? ఇంతకంటే నన్ను పుట్టినివ్వకుండా చేసి ఉంటే బాగుండేది కదా? కనీసం అలా చేసి ఉంటే అయినా నా వలన ఎవరికీ కీడు జరగకుండా ఉండేది. నేను ఇదంతా ఆలోచిస్తూ ఉండగా నా భుజం మీద ఎవరిదో చేయి పడింది. నేను వెనక్కి తిరిగి చూడగా అది కవిత మేడం.

ఏమైంది? ఇక్కడికి వచ్చి ఎందుకు కూర్చున్నావ్? అని అడిగారు కవిత మేడం. .... ఏం లేదు ఊరికే,,, నేను నా రూముకి వెళ్ళవలసిన టైం అయింది. .... ఏం, నా ఇల్లు నీ ఇల్లు కాదా? మేమంతా నీ మనుషులం కాదా? .... అయ్యో! అలాంటిదేమీ లేదు మేడం. కాకపోతే,,, నాకే మీ దగ్గర ఉండే అర్హత లేదు. .... ఏం,,, మా దగ్గర ఉండే అర్హత లేదని నువ్వు ఎందుకు అనుకుంటున్నావ్? .... ఏదో కారణం ఉందిలెండి. మీరు నన్ను వెళ్ళనివ్వండి. .... ఎటువంటి కారణం లేకుండా నిన్ను ఇక్కడి నుంచి వెళ్లినిచ్చేది లేదు. .... సరే అయితే వినండి. నేను ఒక నష్టజాతకుణ్ణి. నా వల్లనే ప్రీతికి అంత పెద్ద దెబ్బ తగిలింది. నా ఈ నష్టజాతకం వల్లనే నా తల్లి నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయింది. నా ఈ నష్టజాతకం వల్లనే నా ఒక్కగానొక్క స్నేహితుడిని కోల్పోయాను. ఇక మీదట ఎవ్వరినీ కోల్పోయే శక్తి నాకు లేదు. బహుశా అందరికీ దూరంగా ఉండడమే నా తలరాత అయ్యుంటుంది. నా తలరాత ప్రకారం నా జీవితానికి ప్రేమ దొరికే అవకాశం లేదేమో? అని అంటూ ఉండగానే నా కళ్ళంట నీళ్ళు కారిపోయాయి.

నేను అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతుండగా మేడం నా చేతిని పట్టుకుని ఆపారు. ఎవరు చెప్పారు నువ్వు నష్టజాతకుడివి అని? నీ విషయంలో జరిగిన సంఘటనలన్నీ దానివల్లనే జరిగాయని నీకు ఎవరు చెప్పారు? అందుకు కారణం నువ్వు కాదు. ఎవరి తలరాత వారికి ఉంటుంది. ఒకరికి ఒకలా రాసిపెట్టి ఉంటే మరొకరి మరోలా రాసిపెట్టి ఉంటుంది. అందరి తలరాతలకు మనమే కారణం అని అనుకోకూడదు. .... మీరు నన్ను ప్రేమిస్తున్నారు కాబట్టి అలా అంటున్నారు మేడం. కానీ వీటన్నిటికీ నా తలరాతే కారణం అని నాకు తెలుసు. అయినా మీరేమీ కంగారు పడొద్దు నేను అప్పుడప్పుడు వచ్చి చెల్లిని కలిసి వెళుతుంటాను అని చెప్పి నేను అక్కడ నుంచి వెళ్ళిపోతుండగా మేడం మళ్లీ నా చేతిని పట్టుకొని ఆపారు.

మేడం ప్లీజ్,, నన్ను వెళ్ళనివ్వండి లేదంటే నా మీద ఒట్టు. నేను భగవంతుని దగ్గర చేసిన ప్రమాణం పూర్తిచేయాల్సి ఉంది. లేదంటే మన బంగారుతల్లికి మళ్లీ ఏదైనా ఆపద కలిగే అవకాశం ఉంది. .... నువ్వు వెళ్ళిపోతే అన్నయ్య ఎక్కడికి వెళ్ళాడు అని అడిగే నా బంగారుతల్లికి నేను ఏమని సమాధానం చెప్పను? .... నేను వేరే పని మీద బయటకు వెళ్లాను అని నా బంగారానికి చెప్పండి. ఎలాగూ నేను తనని కలవడానికి అప్పుడప్పుడు వస్తూనే ఉంటాను. నేను వెళ్తాను మేడం. ఒకవేళ నా వలన ఏదైనా తప్పు జరిగి ఉంటే మన్నించండి. ఆ తరువాత నేను అక్కడ నుంచి నా రూము వైపు బయలు దేరాను. మేడం కూడా అక్కడి నుంచి లేచి హాస్పిటల్ లోపలికి నడిచారు.

నేను గబగబా ఇంటికి చేరుకొని లోపలికి వెళ్లి తలుపు లాక్ చేసి మంచం మీద కూర్చుని వెక్కివెక్కి ఏడుస్తు కూర్చున్నాను. అలా కొంత సేపు ఏడ్చేసరికి మనసులోని భారం కొంత తగ్గింది. ఆ తర్వాత నేను తయారయ్యి కాఫీ షాప్ యూనిఫాం వేసుకుని నా డ్యూటీకి బయల్దేరాను. కాఫీ షాప్ కి చేరుకొని అటెండెన్స్ వేయించుకున్నాను. ఇంతలో మేనేజర్ నా దగ్గరకు వచ్చి, ఏంట్రోయ్ పని దొంగ, మూడు రోజుల నుంచి పని ఎగ్గొట్టి ఎక్కడున్నావురా? అని అడిగాడు. .... సార్ నా తలకి దెబ్బ తగిలింది. రక్తం చాలా పోవడంతో బాగా నీరసం అయిపోయాను. అందుకే పనిలోకి రాలేకపోయాను.

మరి ఈ విషయాన్ని మాకు ఎవడు చెప్తాడు? నీ బాబు వచ్చి చెప్తాడా? కనీసం కబురైనా పంపాలి కదా? చేసే పాటు ఏమీ ఉండదు గానీ మాకు జీతాలు దండగ. పని ఎగదెంగడానికి ఏదో ఒక సొల్లు చెబుతూ ఉంటారు. .... చూడండి సార్ నన్ను ఏమైనా అనండి పడతాను. కానీ మధ్యలో మా నాన్నగారిని ఏమీ అనొద్దు లేదంటే బాగోదు చెబుతున్నాను. .... ఒరేయ్ అందరూ ఇటు చూడండిరా,, ఒకపక్క పని ఎగ్గొట్టింది చాలక నాకే వార్నింగ్ ఇస్తున్నాడు. పనికిమాలిన కొడుకులు,,, నేను ఇలాగే మాట్లాడతాను ఏం పీక్కుంటావో పీక్కోరా. నీ బాబునే కాదు నీ మొత్తం ఫ్యామిలీని అంటాను. ఎవడికి పుట్టాడో తెలియని నాకొడకా.

మేనేజర్ మాటలు నాలోని కోపాన్ని రగిలించాయి. అంతే,, పిడికిలి బిగించి మేనేజర్ మొహం మీద ఒక గట్టి పంచ్ ఇచ్చాను. మేనేజర్ ఒక్క ఎగురు ఎగిరి పక్కనే ఉన్న టేబుల్ మీద పడ్డాడు. నన్ను తిట్టి రెచ్చగొట్టడం వాడికే నష్టాన్ని చేకూర్చింది. ఒరేయ్ మేనేజర్ జాగ్రత్తగా విను. ఇక మీదట ఎవరి ఫ్యామిలీ గురించి అయినా తప్పుడు మాటలు మాట్లాడావనుకో నిన్ను ఏం చేస్తానో నాకే తెలీదు. కానీ నీ జీవితంలో బాగా గుర్తుండి పోయేలా మాత్రం చేస్తాను అని చెప్పి వాడికి గట్టిగా వార్నింగ్ ఇచ్చి అక్కడినుంచి బయలుదేరి తిరిగి ఇంటికి వచ్చేసాను.

కానీ ఇప్పుడు కాఫీ షాప్ లో జరిగిన ఈ ఉదంతాన్ని అంతా ఎవరో గమనిస్తూ కన్నీళ్లు పెట్టుకున్నారు. నేను ఇంటికి చేరుకొని బట్టలు మార్చుకుని మంచం మీద కూర్చున్నాను. నా చేతిలో అమ్మ ఫోటో ఉండగా నా కళ్ళలోంచి నీళ్ళు కారుతున్నాయి. ఏం చేయమంటావు అమ్మా? నా తలరాత ఎందుకు ఇలా తగలడింది? నేను ఎవరికి ఏం పాపం చేశాను? అంటూ ఏడుస్తూ కూర్చున్నాను. ఆ తర్వాత అలా ఏడుస్తూ ఏడుస్తూ ఎప్పుడు నిద్రపోయానో నాకే తెలీదు. నేను కళ్ళు తెరచి చూసే సరికి తెల్లవారింది.

నేను లేచి తయారయ్యి జాగింగ్ చేయడానికి పార్కు దగ్గరకు చేరుకున్నాను. కొంతసేపు జాగింగ్ చేసిన తర్వాత ఎక్సర్సైజులు చేశాను. ఆ తర్వాత అక్కడ జరుగుతున్న కరాటే క్లాసును శ్రద్ధగా గమనించాను. ఆ తర్వాత ఈరోజు కూడా గేటు దగ్గర ఆ ముగ్గురు వ్యక్తులు ఎదురుపడ్డారు. ఈ రోజు కూడా వారి మాటలు నా మనసును బాధపెట్టాయి.

మొదటి అమ్మాయి మాట్లాడుతూ, ఈరోజు ఈ రాక్షసుడు మళ్లీ వచ్చాడే. రెండు రోజులు కనపడకపోయేసరికి మనసు ప్రశాంతంగా ఉంది. ఈ రోజు మళ్ళీ వాడి దరిద్రపు మొహం మనకు చూపించడానికి వచ్చేసాడు అని అంది. .... ఏమి పర్వాలేదులే అమ్మ. ఎవరినో చూసి మన మూడ్ పాడు చేసుకోకూడదు అని అన్నాడు ఆ మగ వ్యక్తి. కానీ ఈరోజు విచిత్రమేమంటే ఆ రెండో అమ్మాయి మాత్రం ఏమీ మాట్లాడకుండా శాంతంగా ఉంది. ఆ తర్వాత నేను ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చి స్నానం చేసి బట్టలు మార్చుకుని నాకోసం టీ టిఫిన్ తయారు చేసుకున్నాను. టిఫిన్ చేసిన తర్వాత ప్రీతిని కలవడానికి హాస్పిటల్ కి బయలుదేరాను.

నేను ఇంటి నుంచి బయలుదేరి కొద్ది దూరం వెళ్లానో లేదో ఒక బంతి దొర్లుకుంటూ రోడ్డు మీదకు వచ్చింది. ఒక 2-3 సంవత్సరాల వయసు ఉండే ఒక చిన్న పిల్లాడు దాని వెనకే పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. వాడు ఆ బంతిని పట్టుకుని ఆపి అక్కడే రోడ్డుమీద ఆడుకోవడం మొదలు పెట్టాడు. ఇంతలో ఒక కారు వేగంగా వస్తు అదుపు తప్పింది. ఆ కారులో ఉన్న డ్రైవర్ రోడ్డు మీద ఉన్న ఆ పిల్లాడిని తప్పుకోమని హారన్ కొడుతున్నాడు. కానీ ఆ పిల్లాడు మాత్రం అది వినిపించుకోకుండా అక్కడే ఆడుతున్నాడు.

ఇంతలో ఆ కారు హారన్ వినిపించి నా దృష్టి ఆ కారు మీద పడింది. ముందయితే నాకు ఆ కారు డ్రైవర్ ఎందుకలా హారన్ కొడుతున్నాడో అర్థం కాలేదు. ఆ తర్వాత నా చూపు రోడ్డుమీద ఆడుకుంటున్న పిల్లాడి మీద పడేసరికి నా గుండె ఝల్లుమంది. చూడబోతే ఆ కారు పిల్లాడికి దగ్గరగా వచ్చేస్తుంది. నేను ఆ పిల్లాడి దగ్గరకు పరిగెత్తాను. ఆ కారు పిల్లాడికి చాలా దగ్గరగా వచ్చేసింది. ఇక కారు ఆ పిల్లాడిని గుద్దేస్తుంది అనగా నేను ఆ పిల్లాడి దగ్గరకు చేరుకొని వాడిని పట్టుకుని పక్కకి దూకేసాను. నేను ఆ పిల్లాడిని పట్టుకొని దొర్లుతూ రోడ్డుకు మరోవైపు చేరుకున్నాను.

ఆ కారు మాత్రం అలాగే వేగంగా ముందుకు దూసుకుని వెళ్లి పోయింది. నాకు అక్కడక్కడ చర్మం చీరుకుపోయింది. కానీ ఆ పిల్లాడికి మాత్రం ఏమీ కాలేదు. కానీ హఠాత్తుగా జరిగిన ఈ పరిణామానికి ఆ పిల్లోడు ఏడుపు మొదలెట్టాడు. ఇంతలో ఆ పిల్లాడి తల్లిదండ్రులు పరిగెత్తుకుంటూ మేము ఉన్న చోటకి వస్తున్నారు. అంతలో వేగంగా వెళుతున్న ఆ కారు ఎదురుగా వస్తున్న ఒక ట్రక్కును ఢీకొనబోయింది. కానీ ఆ ట్రక్ డ్రైవరు బాగా దగ్గరికి వచ్చిన తర్వాత పక్కకి కట్ చేసాడు. అది గమనించిన కారు డ్రైవర్ కూడా మరోపక్కకి కట్ చేశాడు.

ఆ ట్రక్ ఓవర్ లోడ్ తో ఉండడంతో అదుపు తప్పింది. మరోపక్క కార్ డ్రైవర్ కూడా కంట్రోల్ తప్పడంతో కార్ వెళ్లి చెట్టుకు గుద్దుకుంది. కార్ లో ఉన్న వాళ్లకి దెబ్బలు తగిలాయి. ఇక్కడ పిల్లవాడి కోసం మా దగ్గరికి వస్తున్న ఆ పిల్లాడి తల్లిదండ్రులను అదుపుతప్పి దూసుకుపోతున్న ఆ ట్రక్కు ఢీ కొట్టింది. అంతేకాకుండా అదుపుతప్పిన ఆ ట్రక్కు అలాగే మరి కొంచెం ముందుకు వెళ్లి ఒక ట్రాన్స్ఫార్మర్ ఢీకొట్టింది. అంతే ఒక్కసారిగా పెద్ద శబ్దంతో ఒక పేలుడు సంభవించింది.

వెంటనే నేను ఆ పిల్లాడి తల్లిదండ్రులు దగ్గరకు పరిగెత్తుకొని వెళ్లాను. వాళ్లకు బాగా దెబ్బలు తగిలాయి. వెంటనే నేను అక్కడున్న కొంతమంది సహాయంతో వాళ్లను ఆటో ఎక్కించి అక్కడినుంచి హాస్పిటల్ కి బయల్దేరాను. తొందరగా హాస్పిటల్ కి చేరుకొని వాళ్లను ICU లోకి చేర్పించాను. ఆ తర్వాత నేను ఆ పిల్లాడిని తీసుకుని ప్రీతి రూమ్ వైపు వెళ్లాను. అక్కడ మేడం నాకు బయటే కనబడ్డారు. నేను ఆ పిల్లాడిని తీసుకుని మేడం దగ్గరకు వెళ్లాను.

మేడం నన్ను చూసి, ఎలా ఉన్నావు దీపు? అని అడిగారు. .... నేను బాగానే ఉన్నాను మేడం. మీరు ఎలా ఉన్నారు? ప్రీతికి ఇప్పుడు ఎలా ఉంది? .... నేను బాగానే ఉన్నాను. మన బంగారుతల్లి కూడా బాగానే ఉంది. మాటిమాటికి నిన్నే తలుచుకుంటుంది. నిన్నంతా అన్నయ్య వచ్చాడా లేదా అని నీ గురించే అడిగింది. .... సరే అయితే నేను ఇప్పుడే కలిసి వస్తాను అని చెప్పి నేను ఆ పిల్లాడిని తీసుకొని రూమ్ లోకి వెళ్లబోతుండగా మేడం ఆ పిల్లాడిని చూసి, ఈ పిల్లోడు ఎవరు నాన్న? అని అడిగారు. .... ఈ పిల్లాడు నాకు రోడ్డుమీద దొరికాడు మేడం. వీడికి పెద్ద ఆక్సిడెంట్ జరగవలసింది. అంటూ జరిగిన కథ మొత్తం చెప్పాను.

మేడం ఈ పిల్లాడిని మీరు మీ దగ్గర ఉంచండి. నా నీడ వీడి మీద పడితే వీడు కూడా నా లాగా అనాధ అయిపోయే ప్రమాదం ఉంది. ఇప్పటికే వీడి మీద నా నీడ పడి ఒక కుటుంబం మొత్తం ప్రమాదంలో ఉంది. ఇంకా అక్కడ ముగ్గురు ప్రాణాలు ఎలా ఉన్నాయో ఏంటో? ప్లీజ్ మేడం వీటిని మీ దగ్గర ఉంచండి అని చెప్పి ఆ పిల్లాడిని మేడంకు అందించి నేను ప్రీతి ఉన్న రూంలోకి వెళ్ళిపోయాను. మేడం నాతో ఏదో చెప్పాలని అనుకుంటున్నా నేను వినిపించుకోకుండా రూమ్ లోకి వెళ్ళిపోయాను.

లోపల ప్రీతీ బెడ్ మీద కూర్చుని ఉంది. ఆమె పక్కన నర్సు నిల్చొని మందులు అందిస్తోంది. అది చూస్తూ నేను ముందుకు అడుగులు వేశాను. ప్రీతి మందులు మింగి రిలాక్స్ అయిన తర్వాత లోపలికి వస్తున్న నాపై ఆమె చూపు పడింది. నన్ను చూడగానే ఆమె మొహంలో చిరునవ్వు మెరిసింది. కానీ వెంటనే ఆమె మూతి ముడుచుకుని తన మొహాన్ని పక్కకు తిప్పుకుంది. నేను తన దగ్గరకు వెళ్లి పక్కన ఉన్న కుర్చీలో కూర్చున్నాను.

ఏంటి బంగారం నామీద కోపంగా ఉన్నావా? అని అడిగాను. కానీ అందుకు ప్రీతి ఏమి సమాధానం చెప్పలేదు. హు,, అయితే నా బంగారం నిజంగానే అలిగింది అన్నమాట. నీకు చెప్పకుండా వెళ్ళిపోయినందుకు ఆమాత్రం అలగడం సమంజసమే అని చెప్పి మళ్లీ ఒకసారి ప్రీతి వైపు చూశాను. ఈసారి కూడా ప్రీతి వైపు నుంచి ఎటువంటి సమాధానం లేదు. ఏం చేయమంటావు బంగారం నాకు అలా చేయక తప్పలేదు. నేను కాలేజీ జాయిన్ అవ్వాలి కదా దాని కోసం ఏర్పాట్లు చేసుకోవాలి. నిన్ననే నేను చేస్తున్న జాబ్ కూడా వదిలేసాను. ఇప్పుడు మళ్లీ కొత్త జాబ్ కూడా వెతుక్కోవాలి. ప్లీజ్ నన్ను క్షమించరా, అందుకు బదులుగా నువ్వు ఏ శిక్ష విధించినా నేను రెడీ అని చెప్పి ప్రీతి సమాధానం కోసం మౌనంగా ఎదురు చూశాను. కానీ ఈ సారి కూడా ఎటువంటి సమాధానం రాలేదు.

సరే అయితే నువ్వు నాకు శిక్ష విధించకపోయినా నాకు నేనే శిక్ష వేసుకుంటాను. అని ఆలోచిస్తున్నట్టు నటిస్తూ, ఇప్పుడు ఏం చేయాలబ్బా?? హహ,, చెవులు పట్టుకుని గుంజిళ్లు తీస్తాను అని చెప్పి నేను కూర్చున్న చోట నుంచి పైకి లేచి పక్కకి వచ్చి నా చెవులు పట్టుకుని గుంజీళ్లు తీయడం మొదలు పెట్టి 1 2 3 4........... 20 అంటూ లెక్క పెట్టాను. అంతకంటే ఎక్కువ గుంజిళ్ళు తీయలేకపోయాను. 20 గుంజిళ్ళు తీసేసరికి నాకు నీరసం ఆవహించింది. ఎందుకంటే తలకి దెబ్బ తగిలిన కారణంగా ఒంట్లో ఇంకా నీరసంగానే ఉంది.

ప్లీజ్ రా బంగారం ఈ సారికి నన్ను క్షమించు. చూడు నీ ముందే గుంజిళ్ళు కూడా తీశాను. కానీ ప్రీతి వైపు నుంచి ఎటువంటి రియాక్షన్ రాలేదు. కనీసం నా వైపు చూడను కూడా చూడలేదు. కానీ అసలు విషయం ఏంటంటే తన మొహాన్ని అటు వైపు తిప్పుకొని ఎటువంటి శబ్దం చేయకుండా నవ్వుకుంటుంది. సరే అయితే మళ్లీ ఒకసారి నన్ను నేను శిక్షించుకుంటాను. మ్ మ్,,, ఏం చేయాలబ్బా అని అంటూ ఆలోచించి, హహ,,, నా చేతులు పైకెత్తి బెంచి మీద నిల్చుంటాను అని చెప్పి నా చేతులు పైకెత్తి అక్కడ ఉన్న బల్లపై నిల్చున్నాను. సుమారుగా 4-5 నిమిషాలపాటు అలాగే నుంచుని నా చేతులు నొప్పి పుట్టడంతో చేతులు కిందకు దించి బల్లపై నుంచి కిందికి దిగి నిల్చున్నాను.

కనీసం ఇప్పుడన్నా క్షమించురా తల్లి అని అన్నాను. కానీ అక్కడి నుంచి ఎటువంటి రియాక్షన్ లేదు. ప్లీజ్ రా బంగారం ఇప్పుడన్నా క్షమించు. అయినా అటునుంచి ఎటువంటి సమాధానం రాలేదు. ప్లీజ్ రా బంగారం నన్ను క్షమించెయ్.

సరే అయితే ఉండు నాకు నేను మరో శిక్ష వేసుకుంటాను అని చెప్పి ఏం చేయాలబ్బా,,, అని కొంతసేపు ఆలోచించాను. ఆఆ,, ఇలా చేస్తే నా బంగారానికి తప్పకుండా నచ్చుతుంది అని మనసులో అనుకుని ప్రీతితో మాట్లాడుతూ, సరే బంగారం నువ్వు నన్ను క్షమించే వరకు ఇక్కడే నీ ముందే కప్పలాగా కూర్చుంటాను అని చెప్పి నేను కింద కూర్చుని రెండు చేతులు నేల మీద ఆనించి కప్పలాగా ఫోజు పెట్టాను. చూడు బంగారం నీకోసం నేను కప్పను అయిపోయాను అని అన్నాను. ఈసారి ప్రీతి నా వైపు ఒకసారి చూసి మళ్లీ తన మొహాన్ని పక్కకు తిప్పేసుకుంది. వెంటనే నేను బెక బెక,,, మంటూ కప్పలాగా అరిచేసరికి ప్రీతి ఇక కంట్రోల్ చేసుకోలేక పకపకమని నవ్వేసింది.

అలా నవ్వుతూనే అన్నయ్య నువ్వు కప్పలాగా బలే అరుస్తున్నావు. అలాగే కప్పలాగా గెంతు అంటు నన్ను వెక్కిరిస్తూ నవ్వింది. .... అమ్మో అలా గెంతడం నావల్ల కాదు అని కొంచెం కంగారు పడుతున్నట్టు మొహం పెట్టేసరికి ప్రీతి మళ్లీ నవ్వింది. .... సర్లే గాని ఈ డ్రామాలు కట్టిపెట్టి పైకి లెగువు అన్నయ్య. .... మరి నువ్వు నన్ను క్షమించినట్టేనా? ..... అవును బాబు క్షమించేశాను. ఇక నువ్వు లేచి నిల్చో. .... నేను లేచి నుంచో గానే ప్రీతి మాట్లాడుతూ, హ్మ్,,, అది మంచి అమ్మాయి అంటే ఇలా చెప్పిన మాట వినాలి అని అంది. .... అందుకు నేను చాలా యాదృచ్చికంగా, థాంక్యూ థాంక్యూ అని అన్నాను. కానీ ఆ తర్వాత ప్రీతి అన్న మాట గుర్తుకు వచ్చి నేను చేసిన తప్పేంటో తెలిసి, బంగారం,,,,,, అని అన్నాను.

అప్పుడు ప్రీతీ మళ్ళీ ఒకసారి నవ్వుతూ క్షమించమని తన చెవులు పట్టుకుని సారీ అని అనడంతో నేను కూడా నవ్వేసాను. ఆ తర్వాత ప్రీతి నన్ను తన దగ్గరకు రమ్మని చేతితో సైగ చేసింది. నేను తన దగ్గరకు వెళ్లేసరికి తన రెండు చేతులు చాచి, నాకు నీ హగ్ కావాలి. తొందరగా ఇవ్వు అంటూ అమాయకమైన చిన్నపిల్ల అడుగుతున్నట్టు అడిగింది. .... ఓహో నా బంగారానికి హగ్ కావాలా? అని అనగానే ప్రీతి అవును అన్నట్టు తల ఊపింది. అప్పుడు నేను తనకు మరింత దగ్గరగా జరిగి హగ్ చేసుకున్నాను. ఆమె నుదుటిపై ముద్దు పెట్టి ఆమె నుంచి విడిపోయి దూరం జరిగి కూర్చుని ఇద్దరం మాట్లాడుకోవడం మొదలు పెట్టాము.

అన్నయ్య నువ్వు నాతో చెప్పకుండా ఎందుకు వెళ్లిపోయావు? .... ఇంతకు ముందే చెప్పాను కదమ్మ అలాంటి అవసరం వచ్చింది. అది సరేగాని ఇప్పుడు నీ ఆరోగ్యం ఎలా ఉంది? .... నేను బాగానే ఉన్నాను అన్నయ్య. రేపో ఎల్లుండో ఇంటికి పంపించేస్తారు కూడా. .... ఓహో అదయితే గుడ్ న్యూస్. అవును ఇంతకీ నువ్వు మెట్ల మీద నుంచి ఎలా పడ్డావు నాకు చెప్పు? . అప్పుడు ప్రీతి ఆరోజు జరిగిన విషయం అంతా చెప్పింది. ఒక వేళ ఆ రోజు నువ్వు ఇంకా నిద్ర లేవక పోయినట్లయితే నేను నీ దగ్గరికి వచ్చి సరదాగా ఆట పట్టిస్తూ నిద్ర లేపుదాం అని అనుకున్నాను. కానీ అంతలో ఇదంతా జరిగిపోయింది అని చెప్పింది.

ఓహో అదన్నమాట సంగతి. నా బంగారం అంతా ప్లాన్ చేసుకుని నా దగ్గరకు రావాలి అనుకున్నది అన్నమాట అని అనడంతో ప్రీతి అవును అన్నట్టు తల ఊపింది. సరేలే ఏం పర్వాలేదు, మళ్ళీ ఇంకెప్పుడైనా ట్రై చేద్దువుగాని అని అన్నాను. .... అప్పుడు ప్రీతి చాలా అమాయకంగా నిరుత్సాహంగా మొహం పెట్టి, మరి నీకు ఇప్పుడు అంతా తెలిసిపోయింది కదా? అని అంది. .... అయినా పర్వాలేదు నా ప్రియమైన బంగారం కోసం ఏదైనా పర్వాలేదు అని అన్నాను. ఆ తర్వాత కొంత సేపటి వరకు మేము ఇద్దరం అలాగే మాట్లాడుకుంటూ కూర్చున్నాము. అంతలో మేడం ఆ పిల్లాడిని ఎత్తుకొని రూమ్ లోకి వచ్చారు.

మమ్మీ ఈ బాబు ఎవరు? అని అడిగింది ప్రీతి. .... మేడం ఆ బాబుని బెడ్ మీద కూర్చో పెడుతూ, ఈ బాబుని నీ అన్నయ్య తీసుకువచ్చాడు. ఈ బాబు తల్లిదండ్రులకు యాక్సిడెంట్ అయ్యింది. వాళ్లకి ఇప్పుడు ఆపరేషన్ నడుస్తోంది అని చెప్పారు. ఆ తర్వాత ప్రీతి ఆ బాబుతో ఆడుకుంటుంది. ఆ బాబు కూడా ప్రీతితో చాలా తొందరగానే కలిసిపోయాడు. అప్పుడు నేను మేడంని పక్కకు రమ్మని పిలిచి ఇద్దరం కలిసి రూమ్ లో నుంచి బయటకు వచ్చాము.

మేడం ప్లీజ్ కొంచెం ఆ బాబు తల్లిదండ్రుల ఆపరేషన్ కోసం డబ్బులు చెల్లిస్తారా? .... ఎందుకు కాదు? తప్పకుండా ఇస్తాను నాన్న. .... సరే మేడం తర్వాత మీరు బిల్లు ఎంతయిందో చెప్తే ఆ డబ్బులు నేను మీకు తిరిగి ఇచ్చేస్తాను అని అన్నాను. నా మాట వినగానే వెంటనే మేడం వెనక్కి తిరిగి అక్కడి నుంచి వెళ్లి పోవడానికి సిద్ధపడ్డారు. ఆమె కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి. నేను అన్నమాటకు ఆమె బాధపడింది. ఇలా జరుగుతుందని నాకు ముందే తెలుసు. అందుకే నేను ఆమెను ఆగమని చెబుతూ, ఏమైంది మేడమ్? ప్లీజ్ నా మాట వినండి అని అన్నాను.

నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో. నేను నీతో మాట్లాడను. ఆ,, హాస్పిటల్ బిల్ కోసం నువ్వేమీ కంగారు పడవలసిన అవసరం లేదు. నేను కట్టేస్తాను అని అన్నారు మేడం. .... మేడం ప్లీజ్ ఒకసారి నా మాట వినండి అని అంటున్నా సరే మేడం నా మాట వినిపించుకోవడం లేదు. మేడం ప్లీజ్ ఒక్కసారి నా మాట వినండి లేదంటే నా మీద ఒట్టే అని అన్నాను. .... మ్,, చెప్పు, ఏం మాట్లాడాలి? .... మేడం నాకు ప్రతి నెల మా ఇంటి దగ్గర నుంచి కొంత డబ్బు వస్తుంది. అవి నాకు ఎందుకూ ఉపయోగపడవు. అందుకే అలా బ్యాంకులో పడి మూలుగుతున్నాయి. అందుకే నాకు పనికిరాని ఆ డబ్బు ఆ పిల్లాడికి ఉపయోగపడవచ్చు కదా అని అనగానే మేడం నా వైపు తిరిగారు.

అయితే నేను ఏమైనా పరాయిదాన్న? నేను కూడా నీదాన్నే. మరి అలాంటప్పుడు నన్ను పరాయి దానిని చేసి ఎందుకు అలా మాట్లాడావు? .... లేదు మేడం, అలాంటిది ఏమి లేదు. మిమ్మల్ని బాధ పెట్టడం నా ఉద్దేశం కాదు. అలాగని నేను మీకు భారం కాదలుచుకోలేదు అని అనగానే, తల్లిదండ్రులకు తమ బిడ్డలు భారం అవుతారని నీకు ఎవరు చెప్పారు అన్న మాట నా వెనుక నుంచి వినపడింది. వెంటనే నేను వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ దీపక్ అంకుల్ ఉన్నారు. .... లేదు అంకుల్,, నా ఉద్దేశం అది కాదు. .... చూడు నాన్న నువ్వు మమ్మల్ని నీ మనుషులు అని అనుకున్న అనుకోకపోయినా మేము మాత్రం నిన్ను మా అబ్బాయి అనే అనుకుంటున్నాము. అలాంటప్పుడు నువ్వు మాకు భారం అవుతావని ఎలా అనుకున్నావు? .... నేను తల దించుకుని సారీ అంకుల్, సారీ మేడం అని అన్నాను.

వారి మనసులో నా పట్ల వారికున్న ప్రేమ గురించి తెలుసుకున్న తర్వాత తట్టుకోలేక నా కళ్ళలో నీళ్ళు తిరిగాయి. అది చూసి మేడం నా దగ్గరకు వచ్చి నన్ను కౌగిలించుకున్నారు. ఊరుకో నాన్న ఊరుకో, ఏమన్నా అంటే చాలు అస్తమానం ఇలా ఆడపిల్లలా ఏడుస్తూ కూర్చుంటావు. .... ఎందుకు మేడం? ఎందుకు నన్ను ఇంతలా ప్రేమిస్తున్నారు? మిగిలిన వారంతా, ఇంకా చెప్పాలంటే నా కుటుంబ సభ్యులు కూడా నన్ను చూసి అసహ్యించుకుంటారు. నా తలరాత ఏంటో తెలీదు. నా దురదృష్టం వల్ల నాకు దగ్గర అయిన నా బంగారు చెల్లి ఈరోజు హాస్పిటల్ లో ఉంది. ఆ పిల్లాడి తల్లిదండ్రులు ఇద్దరూ ICU లో ఉన్నారు. ఆ ట్రక్ డ్రైవర్ ఇంట్లో అందరూ దుఃఖసాగరంలో మునిగి ఉంటారు. (ఆ ట్రక్ ట్రాన్స్ఫార్మర్ ఢీకొని పేలుడు సంభవించింది అని ఇదివరకే రాయటం జరిగింది. ఆ పేలుడు సంభవించిన ప్పుడు డ్రైవర్ కూడా ట్రక్కుతో పాటు కాలిపోయాడు). ఇదంతా నా నష్టజాతకం వల్లే జరిగింది అని అన్నాను.

మేడం మాట్లాడుతూ, చూడు నాన్న నేను నీకు ఇదివరకే చెప్పాను. ఇటువంటి దుర్ఘటనలు ఎవరికీ చెప్పి రావు. అలాగే ఎవరి వలనో మరొకరికి జరగవు. నువ్వు ఏమీ నష్టజాతకుడివి కాదు అని నేను ఇదివరకే చెప్పాను. వీళ్ళందరికీ జరిగిన దుర్ఘటనలకు నువ్వేమీ బాధ్యుడువి కాదు. అది వాళ్ల తలరాత. వాళ్ల దురదృష్టం కొద్దీ అలా జరిగింది. అందుకే వీటన్నిటికీ కారణం నువ్వు అనే భావం నీ మనసులో నుంచి తీసేయాలి. నా మంచి బాబువి కదూ ఇకపైన నువ్వు ధైర్యంగా వుండాలి. చాల్లే ఇక ఏడవడం ఆపి కళ్ళు తుడుచుకో అని అన్నారు.

దీపక్ అంకుల్ మాట్లాడుతూ, కవిత చెప్పింది నిజం దీపు. ఎవరి కర్మకు వారే బాధ్యులు. కొంతమంది వారి కర్మను అనుసరించి బ్రతికి ఉండగా ఇక్కడే వాటి ఫలితాన్ని అనుభవిస్తారు. మరికొంతమంది భగవంతునికి ప్రీతి పాత్రులు అయిపోతారు. అందుకే నిన్ను నువ్వు ఎప్పుడూ నిందించుకోవద్దు. .... ఏం చెయ్యమంటారు అంకుల్. కావాలనుకున్న వీటన్నిటిని నేను మర్చిపోలేక పోతున్నాను. ఇవన్నీ నా కళ్ళ ముందు జరిగిన సంఘటనలు. వాటి గురించి తలుచుకుంటేనే నా హృదయం కంపించి పోతుంది.

మేడం మాట్లాడుతూ, సరే ముందు నువ్వు ఈ విషయాలన్నింటి గురించి మాట్లాడటం ఆపి బాత్రూంలోకి వెళ్లి నీ మొహం కడుక్కొని రా అని చెప్పారు. నేను సరేనంటూ మొహం కడుక్కోవడానికి బాత్రూంకి వెళ్లాను.

Next page: Episode 004
Previous page: Episode 002