Episode 004
మేడమ్ చెప్పినట్టే నేను బాత్రూమ్ కి వెళ్లి మొహం కడుక్కొని తిరిగి మేడం వాళ్ళ దగ్గరకు వచ్చాను. ఇంతలో మా దగ్గరకు ఒక ఇన్స్పెక్టర్ మరియు అతనితో పాటు ఒక కానిస్టేబుల్ వచ్చారు. ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ, మీలో ఎవరు ఆ యాక్సిడెంట్ అయిన భార్య భర్తలు ఇద్దరిని ఇక్కడికి తీసుకొని వచ్చారు? అని అడిగారు. .... సార్ నేనే తీసుకుని వచ్చాను, చెప్పండి ఏంటి విషయం? .... నాకు మీ వాంగ్మూలం కావాలి. .... మీరు ఏం కావాలని అనుకుంటే అది నన్ను అడగొచ్చు. .... అయితే ఇదంతా ఎలా జరిగిందో చెప్పండి అని అడిగాడు ఇన్స్పెక్టర్. అప్పుడు నేను అక్కడ జరిగిన సంఘటన చూసింది చూసినట్టుగా చెప్పాను. అక్కడే ఉన్న కానిస్టేబుల్ నేను చెప్పింది మొత్తం రాసుకుంటున్నాడు. అతను మొత్తం రాసిన తర్వాత దాని మీద నా సంతకం కూడా తీసుకున్నాడు.
ఇప్పుడు నడుస్తున్న కాలంలో ఎవరికో సంబంధించిన పిల్లాడి కోసం నీ ప్రాణాన్ని పణంగా పెట్టి రక్షించావు అంటే నమ్మడానికి చాలా ఆశ్చర్యంగా ఉంది, లేదంటే ఈ రోజుల్లో సొంతవారిని సొంతవారు అని చెప్పుకోవడానికి చాలామంది నిరాకరిస్తున్నారు. నువ్వు సరైన సమయానికి వాళ్లను హాస్పిటల్ కి తీసుకుని వచ్చావు లేదంటే అక్కడ చుట్టూ జనం చేరి తమాషా చూసేవారు. వాళ్లు కూడా కొనప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ అక్కడే తుదిశ్వాస విడిచేవారు. నాకైతే నీకు సెల్యూట్ చేయాలని ఉంది అని చెప్పి నాకు సెల్యూట్ చేసి అక్కడి నుంచి వెళుతూ, ఇక ముందు ఈ కేసు విషయమై ఏదైనా అవసరం పడితే నేను మిమ్మల్ని పిలుస్తాను అని చెప్పి వెళ్లిపోయారు.
ఆ తర్వాత మేడం నా చేతిని పట్టుకుని పక్కనే ఉన్న బెంచి మీద కూర్చోబెట్టి ఆమె కూడా నా పక్కన కూర్చుని నన్ను పడుకోబెట్టి నా తలను ఆమె ఒడిలో పెట్టుకుంది. నేను మా అమ్మ ఒడిలో తల పెట్టుకున్నట్టు చాలా హాయిగా ప్రశాంతంగా అనిపించింది. నిజంగానే నేను నా తల్లి ఒడిలో సేదతీరుతున్నట్టు అనిపించింది. మేడం మాట్లాడుతూ, చూడు నాన్న ఇదంతా ఎవరి కర్మానుసారం వాళ్ళ అదృష్టం మీద ఆధారపడి జరిగే ఆట అని నేను చెప్పాను కదా. ఆ పిల్లాడి తల్లిదండ్రులు ఏదో పుణ్యం చేసుకుంటే ఈరోజు నీ చేత రక్షింపబడ్డారు. ఆ ట్రక్కు డ్రైవరు ఎప్పుడో ఏదో పాపం చేసుకుని ఉంటాడు. అందుకే అతనికి మరణం సంభవించి ఉంటుంది. ఇకపోతే ఆ కార్లో వాళ్లు కూడా ఎప్పుడో ఎవరో ఒకరికి కీడు తలపెట్టి ఉంటారు. అందుకే నువ్వు అవన్నీ మనసులో పెట్టుకోకుండా హాయిగా రెస్ట్ తీసుకో అని చెప్పి మేడం తన చేతి వేళ్ళను నా జుట్టులోకి పోనిచ్చి ప్రేమగా నిమురుతూ ఉండడంతో నాకే తెలియకుండా నిద్రలోకి జారుకున్నాను.
అలా ఎంతసేపు మేడం ఒడిలో పడుకున్నానో నాకే తెలియదు. నేను కళ్ళు తెరచి చూసేసరికి సాయంత్రం అయిపోయింది. నా తల ఇంకా మేడం ఒడిలోనే ఉంది. నేను వెంటనే లేచి కూర్చున్నాను. మేడం నా వైపు చూసి చిరునవ్వు నవ్వుతూ, లేచావా నాన్న అని అన్నారు. .... హ,, మేడం. కానీ ఇంత సమయం గడిచినా మీరు నన్ను ఎందుకు లేపలేదు. .... నా బిడ్డ హాయిగా మత్తుగా నిద్రపోతూ ఉంటే వాడి మొహంలో చిరునవ్వు చెదిరిపోకుండా కనబడుతూ ఉంటే నేను నా బిడ్డ నిద్రను ఎలా పాడుచేస్తాను? అని అన్నారు. నేను ఆ మాట విని మేడం వైపు చూసి ఒక నవ్వు నవ్వాను. మేడం కొంచెం ముందుకు వచ్చి నన్ను దగ్గరకు తీసుకొని కౌగిలించుకొని నా తల మీద చేయి వేసి ప్రేమగా నిమిరారు.
నా బంగారం అంటూ మేడం తన కౌగిలిని విడిచి, వెళ్ళు నాన్న, వెళ్ళి ఫ్రెష్ అయ్యి రా అని అన్నారు మేడం. నేను వెళ్లి ఫ్రెష్ అయి తిరిగి వచ్చాను. మేడం ఆ పిల్లాడి తల్లిదండ్రులు ఇప్పుడు ఎలా ఉన్నారు? .... ఆపరేషన్ విజయవంతంగా జరిగింది. వాళ్ళిద్దరినీ రూమ్లోకి కూడా షిఫ్ట్ చేసారు. వాళ్లకు సంబంధించిన ఎవరో బంధువులు కూడా వచ్చారు అని అన్నారు మేడం. .... సరే అయితే నేను వెళ్లి వారిని కలిసి వస్తాను అని అన్నాను. ఆ తర్వాత మేడంతో కలిసి వారు ఉండే రూం దగ్గరకు వెళ్లాను. ఆ రూమ్ బయట వాళ్లకు సంబంధించిన బంధువులు కూర్చుని ఉన్నారు. నేను ఆ రూంలోకి వెళ్లి చూడగా వాళ్ళిద్దరూ స్పృహలోనే ఉన్నారు. వారి దగ్గర ఒక నర్సు నిల్చుని వుండగా మరోపక్క ఒక ఆడమనిషి ఆ పిల్లాడిని ఎత్తుకుని కూర్చుని ఉంది.
నన్ను చూసి ఆ పిల్లాడు ఆమె దగ్గర నుంచి నా దగ్గరకు వచ్చేసాడు. నేను ఆ పిల్లాడిని ఎత్తుకున్నాను. ఆ తర్వాత నేను వాళ్లతో మాట్లాడుతూ, ఇప్పుడు మీ ఆరోగ్యం ఎలా ఉంది అని అడిగాను. అందుకు ఆ మగవ్యక్తి మాట్లాడుతూ, ఇప్పుడు మేము బాగానే ఉన్నాము తమ్ముడు. నువ్వు మమ్మల్ని రక్షించినందుకు నీకు చాలా చాలా ధన్యవాదాలు. .... అయ్యో ఇందులో ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం ఏముంది. అది నా బాధ్యత. .... అప్పుడు ఆ ఆడవ్యక్తి నాతో మాట్లాడుతూ, ముందుగా మీరు మీ ప్రాణాలను అడ్డంగా పెట్టి మా బాబుని రక్షించారు. ఆ తర్వాత మమ్మల్ని కూడా రక్షించారు. మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేము అని అంది.
అయ్యయ్యో ఇందులో రుణం అది అని అంత పెద్ద మాటలు ఎందుకండీ. నేను ఇదంతా మానవత్వంతో చేశాను అంతే. .... అప్పుడు అక్కడ కూర్చున్న మరో ఆడవ్యక్తి మాట్లాడుతూ, లేదు బాబు మా కోడలు సరిగానే చెప్పింది. నువ్వు మా పాలిట దేవుడిలా వచ్చావు. లేదంటే మా కుటుంబం మొత్తం ఈరోజు నాశనమైపోయేది. నా కోడలు చెప్పినట్టు ఎన్నటికీ నీ రుణం తీర్చుకోలేము. మీరు చేసిన మేలు ఎప్పటికీ మర్చిపోలేము అని అంది. .... చూడండమ్మా మీరేమీ నాకు రుణపడిపోయారు అని భావించవద్దు. అలాగే నేను కూడా మీ పట్ల ఏదో గొప్ప ఘనకార్యం చేశానని అనుకోవద్దు. సంతోషంగా ఉండండి అని చెప్పి నేను అక్కడ నుంచి బయటికి వచ్చేసాను.
ఆ తర్వాత నేను మరి కొంచెంసేపు ప్రీతి తో సరదాగా గడిపి అక్కడి నుంచి ఇంటికి బయలుదేరాను. ఇంటికి చేరుకుని అలా మంచం మీద చేరబడ్డాను. ఉండుండి పొద్దున్నుంచి జరిగిన సంఘటనలు అన్నీ ఒక్కొక్కటిగా నా కళ్ళముందు కదలాడుతున్నాయి. మేడం అంత సముదాయించి నాకు చెప్పినప్పటికీ జరిగిన సంఘటనలను మర్చిపోలేక పోతున్నాను. కొంతసేపటి తర్వాత పైకి లేచి బాత్రూం లోకి వెళ్ళీ ఫ్రెష్ అయి వచ్చి నా కోసం వంట చేసుకోవడం మొదలు పెట్టాను. నిజానికి నాకు పెద్దగా వంట కూడా చేయడం రాదు. ఏదో అన్నం, పప్పు మరియు రోటీలు చేసుకోవడం లాంటి చిన్న చిన్నవి మాత్రమే చేసుకోగలను. అది కూడా నాకు అమ్మే నేర్పింది. ఈరోజు అదే నాకు పనికొస్తుంది. ఆ తర్వాత నేను భోజనం చేసి పడుకున్నాను.
మరుసటి రోజు పొద్దున నిద్రలేచి యధావిధిగా నా జాగింగ్, ఎక్సర్సైజులు పూర్తిచేసుకుని, ఎప్పటిలాగే నాకు ఎదురయ్యే పరాభవాన్ని అనుభవించి తిరిగి ఇంటికి చేరుకుని తయారయ్యి టిఫిన్ చేసి హాస్పిటల్ కి బయల్దేరాను. హాస్పిటల్ కి చేరుకొని ఈరోజు డిశ్చార్జ్ కాబోతున్న నా బంగారం ప్రీతితో కొంతసేపు గడిపి, ఆ తర్వాత నేను రక్షించిన ఆ పిల్లాడి తల్లిదండ్రుల దగ్గరికి వెళ్లి వాళ్లతో కూడా కొంచెంసేపు గడిపిన తర్వాత నా కోసం మరో కొత్త ఉద్యోగం వెతుక్కోవడానికి బయల్దేరాను. అక్కడినుంచి కొంతదూరం వచ్చేసరికి ఒక కారు వచ్చి నా ముందు ఆగింది. అందులో ఒక వ్యక్తి కూర్చుని ఉన్నాడు.
అతను విండో గ్లాస్ కిందికి దించి, బ్రదర్ కొంచెం మీరు నాకు ఈ అడ్రస్ ఎక్కడ ఉందో చెప్పగలరా? అని అడిగాడు. నేను అతనికి అడ్రస్ చెప్పగా అతను ముందుకు కదిలాడు. అతను కొంచెం ముందుకు వెళ్ళాడో లేదో రౌడీల లాగా ఉన్న ఒక ఐదుగురు కుర్రాళ్ళు అతని కారుకి అడ్డంగా వచ్చి నిల్చున్నారు. అందులో ఒక వ్యక్తి చాకు బయటకు తీసి ఆ కార్లో ఉన్న వ్యక్తి మెడ మీద పెట్టాడు. రౌడీ నెంబర్ 1 మాట్లాడుతూ, ఒరేయ్ నా మాట విని నీ దగ్గర ఉన్న బ్యాగ్ నాకిచ్చెయ్ అని అన్నాడు. .... నేను నిన్ను ఆ బ్యాగ్ తీసుకోనివ్వను అని అన్నాడు ఆ కారులో ఉన్న వ్యక్తి. .... రౌడీ నెంబర్ 2 మాట్లాడుతూ, ఎక్కువ నాటకాలు దెంగకుండా ఆ బ్యాగ్ మాకు ఇచ్చేయ్. లేదంటే ఆ బ్యాగ్ తో పాటు నీ ప్రాణాలు కూడా తీసుకోగలం అని అన్నాడు.
మీరు నన్ను ఎంత బెదిరించినా భయపడే రకాన్ని కాను. .... రౌడీ నెంబర్ 1 మాట్లాడుతూ, ఒరేయ్ ఫకీరు ముందు వాడి దగ్గర నుంచి బ్యాగ్ లాక్కోరా అని అన్నాడు. ఆ తర్వాత వాళ్ళ మధ్య బ్యాగ్ కోసం పెనుగులాట మొదలైంది. ఇంతలో రౌడీ నెంబర్ 2 మొహం మీద బలంగా ఒక పంచ్ పడి వాడి దంతాలు కదిలిపోయాయి. దాంతో వాడు వెనక్కి పడిపోయాడు. అప్పుడు రౌడీ నెంబర్ 1 మాట్లాడుతూ, ఎవడుబే నువ్వు. ఎటువంటి సంబంధం లేకుండా మధ్యలో ఎందుకు దూరుతున్నావు అని అడిగాడు. .... నోరు మూసుకుని ఇక్కడ నుంచి దొబ్బెయ్యండి. లేదంటే,,,, అని అన్నాను.
అప్పుడు రౌడీ నెంబర్ 3 మాట్లాడుతూ, లేదంటే ఏం చేస్తావురా? ఆ,, చెప్పు లేదంటే?? అని గర్జిస్తూ అడిగాడు. .... లేదంటే మీరు మీ కాళ్లతో ఇక్కడినుంచి వెళ్ళలేరు అని అన్నాను. .... రౌడీ నెంబర్ 1 నన్ను ఎద్దేవా చేస్తూ మాట్లాడుతూ, ఒరేయ్ పిల్లనాయాల పోరా, పోయి ఇంటికి వెళ్లి నీ అమ్మ పాలు తాగి రా పో అంటూ వెకిలిగా నవ్వాడు. కింద పడ్డ ఆ రెండో రౌడీ తప్ప మిగిలిన రౌడీలు అందరూ వాడితోపాటే వెకిలిగా నవ్వారు. .... మా అమ్మను మధ్యలో తీసుకువచ్చి మీరు చాలా పెద్ద తప్పు చేశారురా అని చెప్పి వెంటనే ముందుకు కదిలి ఆ రౌడీ నెంబర్ 1 పీక పట్టుకున్నాను. ఇంతలో రౌడీ నెంబర్ 3 పక్కనుంచి చాకుతో నా మీద దాడి చేశాడు. దాంతో నా పక్కవైపు కొంచెం కట్ అయ్యింది. దాంతో నేను మొదటి రౌడీ పీకను వదిలేశాను.
అప్పుడు రౌడీ నెంబర్ 3 మాట్లాడుతూ, నీ యబ్బ ఎంత ధైర్యంరా నీకు మా అన్న పీక పట్టుకుంటావురా నువ్వు, లంజాకొడకా ఇప్పుడే నీ పని చెప్తాను ఉండు అని వాడు అన్న వెంటనే వాడి కాళ్ళ మధ్య సెంటర్ పాయింట్ మీద ఒక్క తాపు తన్నాను. దాంతో వాడు గట్టిగా అరుస్తూ వాడి పిచ్చలను చేత్తో పట్టుకుని అలాగే కిందికి కూర్చుండిపోయాడు. అప్పుడు ఆ రౌడీఅన్న మిగిలిన రౌడీల వైపు చూసి, నీయబ్బ అలా చూస్తూ నిల్చున్నారు ఏంట్రా? అని అనడంతో మిగిలిన ఇద్దరు రౌడీలు నన్ను కొట్టడానికి కదిలారు. నేను పరిగెత్తుకుంటూ వారికి ఎదురుగా వెళ్లి వాళ్ళిద్దరి మీద దూకాను. దాంతో నాతో పాటు వాళ్ళిద్దరూ కూడా కింద కూలిపడ్డారు.
వెంటనే నేను పైకి లేచి వాళ్ళిద్దరి కడుపులో ఒక్కొక్క తాపు తన్నాను. దాంతో పైకి లేవబోతున్న వాళ్ళిద్దరూ తమ కడుపు పట్టుకొని అరుస్తూ అలాగే కిందపడిపోయారు. వెంటనే నేను అందులో ఒకడి మొహం మీద కాలితో గట్టిగా తన్ని, రెండవ వాడి వీపు మీద గట్టిగా పిడిగుద్దులు కురిపించాసు. అంతటితో ఆగకుండా వాడి పెడ రెక్క పైకి లేపి పట్టుకుని వాడి భుజాన్ని మెలి తిప్పుతూ గట్టిగా లాగేసరికి వాడి చేతి ఎముక విరిగింది. దాంతో వాడు నొప్పి భరించలేక అరుస్తూ కిందపడి గిలగిల కొట్టుకుంటున్నాడు. ఆ తర్వాత నేను రౌడీఅన్న వైపు వెళుతుండగా వాడు గన్ బయటకు తీసాడు.
గన్ బయటకు తీస్తూనే వాడు ఫైరింగ్ మొదలు పెట్టాడు. మొదటిసారి నేను తప్పించుకున్నాను. కానీ వాడు రెండవసారి ఫైరింగ్ చేసేటప్పటికి నేను వాడి దగ్గరకు చేరుకున్నాను. నా కాలితో వాడి చేతి మీద ఒక్క కిక్ ఇవ్వడంతో వాడి చేతిలో ఉన్న గన్ ఎగిరిపడింది. నేను మరికొంచెం ముందుకు వెళ్లి వాడి కాలర్ పట్టుకుని వాడి మొహం మీద పిడి గుద్దుల వర్షం కురిపించాను. వాడు స్పృహతప్పి కింద పడేవరకు వాడి మొహం మీద దెబ్బలు ఆగలేదు. ఇంతలో అక్కడికి సెక్యూరిటీ ఆఫీసర్లు చేరుకున్నారు. నిన్న నన్ను హాస్పిటల్లో కలిసిన ఇన్స్పెక్టరే ఇక్కడికి కూడా వచ్చారు. సెక్యూరిటీ ఆఫీసర్లు రౌడీలు అందరిని పట్టుకున్నారు. ఆ తర్వాత ఇన్స్పెక్టర్ నా దగ్గరికి వచ్చారు.
శబ్బాష్ మై టైగర్. నువ్వు మళ్ళీ అద్భుతం చేసావు. నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. ప్రతిసారి నువ్వు ఎవరో ఒకరి ప్రాణాలు కాపాడుతూనే ఉన్నావు. నేను నీకు పెద్ద ఫ్యాన్ అయిపోయాను అని నన్ను మెచ్చుకుని, సరే ఇక నేను వెళ్తాను. ఆఆ,,, నువ్వు ఒక పని చెయ్. రేపు ఒకసారి నన్ను ఇంటికి వచ్చి కలువు అని చెప్పి తన అడ్రస్ నాకు ఇచ్చి ఇన్స్పెక్టర్ వెళ్ళిపోయారు. ఆ తరువాత నేను అక్కడ నుంచి బయలుదేరి వెళుతుంటే ఆ కారులో ఉన్న వ్యక్తి నన్ను పిలవడంతో ఆగాను.
ఆ కార్లో ఉన్న వ్యక్తి బ్రదర్ కొంచెం ఆగు అని పిలవడంతో నేను ఆగి వెనక్కి తిరిగి చూశాను. అతను నా దగ్గరికి వచ్చి, బ్రదర్ మీకు చాలా చాలా థాంక్స్. ఈరోజు మీ వల్ల నేను ప్రాణంతో ఉన్నాను. మీరు నా ప్రాణాలను కాపాడారు చాలా థాంక్స్. .... ఇట్స్ ఓకే. .... మీరు ఎక్కడికైనా వెళ్లాలంటే నేను డ్రాప్ చేస్తాను. .... వద్దు బ్రదర్ ఏమీ అవసరం లేదు నేను వెళ్తాను. ఆతర్వాత అతని చూపు నాకు తగిలిన కత్తిగాటుపై పడింది. గాయం అయిన చోట నుంచి చాలా రక్తం కారుతోంది. అది చూసి అతను మాట్లాడుతూ, మీకు చాలా పెద్ద గాయం అయింది. నాతోపాటు హాస్పిటల్ కి పదండి అని అన్నాడు.
ఆ తర్వాత మేమిద్దరం కారులో కూర్చుని ప్రీతి అడ్మిట్ అయిన అదే హాస్పిటల్ కి వచ్చాము. మేము లోపలికి వెళ్లి నాకు దెబ్బ తగిలిన చోట డ్రెస్సింగ్ చేయించుకుని తిరిగి హాస్పిటల్ బయటకి వచ్చాము. బ్రదర్ మీ పేరేమిటి? అని అడిగాడు. .... నా పేరు దీపక్ వర్మ. మరి మీ పేరు? .... నాపేరు అభినవ్. నన్ను అభి అని పిలవచ్చు. ఇంతకీ మీరు ఏం పని చేస్తుంటారు? .... నేను ఏమి చేయడం లేదు. ఈమధ్య 12th పాసయ్యాను. కాలేజీలో అడ్మిషన్ తీసుకోవాల్సి ఉంది. ఇంకా ఒక జాబ్ కూడా వెతుక్కుంటున్నాను. మీరు చెప్పండి, మీరు ఏం చేస్తుంటారు? ఇంతకీ ఆ రౌడీలు ఆ బ్యాగ్ వెనుక ఎందుకు పడ్డారు?
ఆ బ్యాగ్ లో కొన్ని ముఖ్యమైన డాక్యుమెంట్స్ మరియు కొంత డబ్బు ఉంది. అందుకే ఆ బ్యాగ్ వెనక పడ్డారు అని చెప్పి అభి తన జేబులో నుంచి తన కంపెనీ పేరు ఉన్న విజిటింగ్ కార్డ్ మరియు తన ఇంటి అడ్రస్ ఉన్న మరో కాగితం స్లిప్ తీసి నాకు ఇచ్చాడు. నువ్వు ఒక పని చెయ్. రేపు ఈ అడ్రస్ కి వచ్చి నన్ను కలువు. తప్పకుండా రావాలి నేను నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అని అన్నాడు. నేను సరే అని చెప్పిన తర్వాత అభి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. నేను పని వెతుక్కోవడానికి బయలుదేరాను. కానీ ఎటువంటి ఫలితం లేకుండా పోయింది. ఈరోజు కూడా ఎక్కడా పని దొరకలేదు. తిరిగి తిరిగి సాయంత్రం అయిపోవడంతో నేను తిరిగి ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చిన తర్వాత ఫ్రెష్ అయ్యి వంట చేసుకుని తిని పడుకున్నాను.
పరిచి ఉన్న తెల్లటి దుప్పటి మీద ఒక ఆడవ్యక్తి పాడె మీద పడుకొని ఉండగా ఆమె చుట్టూ చాలా మంది కూర్చుని ఉన్నారు. ఒక వ్యక్తి ఇద్దరు పిల్లలతో కలిసి ఆమె దగ్గర కూర్చుని ఏడుస్తున్నారు. అందులో ఒక పిల్లాడు అమ్మ,, అమ్మ,, అంటూ ఏడుస్తూ పిలుస్తున్నాడు. అమ్మ నన్ను విడిచి వెళ్లిపోవద్దు అమ్మ. అమ్మ లెవ్వమ్మ,, అమ్మ ప్లీజ్ లెవ్వమ్మ. ఇప్పుడు పొద్దు పొద్దున్నే ప్రేమగా నన్ను ఎవరు నిదుర లేపుతారు అమ్మ? ఎవరు నాకు మంచి మంచి మాటలు నేర్పిస్తారు? ఎవరు తన చేతులతో నాకు అన్నం తినిపిస్తారు? నాకు నిద్ర రాకపోతే నన్ను తన గుండెలపై ఎవరు పడుకో పెట్టుకుని నిద్రపుచ్చుతారు? అమ్మ ప్లీజ్ లెవ్వమ్మ,,, అమ్మ ప్లీజ్.
అంతలో నలుగురు మనుషులు ఆమెను తమ భుజాలమీద ఎత్తుకున్నారు. ఆ పిల్లాడు వాళ్ళను ఆపుతున్నాడు. మా అమ్మను ఎక్కడికి తీసుకుని వెళ్ళిపోతున్నారు? మా అమ్మను కిందికి దించండి. మా అమ్మ లెగుస్తుంది. అమ్మ ప్లీజ్ లెవ్వమ్మ అని ఏడుస్తున్నాడు. ఇంతలో ఇద్దరు మనుషులు వచ్చి ఆ పిల్లాడిని పట్టుకొని పక్కకు లాగేస్తున్నారు. ఆ పిల్లాడు వాళ్ళ నుండి తప్పించుకోవడానికి గింజుకుంటూ, నన్ను వదలండి అమ్మ,, అమ్మ,, అమ్మ,, మా అమ్మని ఎక్కడికి తీసుకుని వెళ్ళిపోతున్నారు అమ్మ,, అమ్మ అమ్మ,,, అంటూ పెనుగులాడుతూ ఉన్నాడు. ఇంతలో ఆ నలుగురు వ్యక్తులు వాడి అమ్మను అక్కడి నుంచి తీసుకుని వెళ్లిపోయారు. చివరికి ఆ పిల్లాడు గట్టిగా ఏడుస్తూ అమ్మ అమ్మ అంటూ అరుస్తూ స్పృహ తప్పి పడిపోయాడు.
అమ్మా,,,,,,, అని గట్టిగా అరుస్తూ నేను నిద్ర లేచాను. అవును ఆ పిల్లాడిని నేనే. ఇదంతా నా కలలో జరిగింది. కలలో నా తల్లిని స్మశానానికి తీసుకుని వెళుతున్నారు. నేను ఆవేశ పడుతూ మంచం మీద లేచి కూర్చున్నాను. నా చుట్టూ ఒకసారి చూసుకున్నాను. నేను నా రూమ్ లోనే ఉన్నాను. అంతా నిశ్శబ్దంగా ఉంది. నేను అమ్మ ఫోటో అందుకని ఆమెతో మాట్లాడటం మొదలుపెట్టాను.
నన్ను ఎందుకు వదిలిపెట్టి వెళ్ళిపోయావు అమ్మ? ఈ ప్రపంచం చాలా ద్వేషంతో కూడుకున్నది అమ్మ. ఇక్కడ ప్రతి ఒక్కరూ తమ అవసరాల కోసం ఒకరికొకరు ప్రాణాలను తీసుకుంటున్నారు. నా కోసం తిరిగిరా అమ్మ. లేదంటే నన్ను నీ దగ్గరికి తీసుకొని వెళ్ళిపో. అలాగే నేను ఏడ్చుకుంటూ అమ్మతో మాట్లాడుతూ ఎప్పుడు నిద్రలోకి జారుకున్నానో నాకే తెలీదు.
మరుసటి రోజు పొద్దున్న 5:00 కు నిద్రలేచి జాగింగ్ కి వెళ్లి ఎక్సర్సైజులు చేసుకుని కొంతసేపు కరాటే క్లాస్ శ్రద్ధగా గమనించి తిరిగి అక్కడి నుంచి బయలుదేరి పార్క్ బయటకు వచ్చేసరికి మళ్లీ ఈ రోజు కూడా ఆ ముగ్గురు వ్యక్తులు ఎదురుపడ్డారు. ఆ మగ వ్యక్తి మాట్లాడుతూ, మన దరిద్రానికి వీడు మళ్లీ మనకు ఎదురుపడ్డాడు అని అన్నాడు. మొదటి అమ్మాయి మాట్లాడుతూ, డాడ్ వీడు మనలో ఒకరిని చంపేదాకా వదలడు కాబోలు. మనల్ని నాశనం చేసేదాకా వదలడు ఈ రాక్షసుడు, హు,,, అని ఆ రెండో అమ్మాయి వైపు చూసి, నీకు ఏమైందే అలా మౌనంగా ఉన్నావు? అని అంది. అందుకు ఆ రెండో అమ్మాయి మాట్లాడుతూ, మనం వాడిని ఎంత తిట్టుకున్నా, వాడి గురించి మనం ఎంత ఎక్కువ మాట్లాడితే వాడికి మన మీద అంత అధికారం పెరిగిపోతుంది. అందుకే వాడి గురించి మాట్లాడకూడదు అని నిర్ణయించుకున్నాను. అందుకే మౌనంగా ఉన్నాను. మనం వాడి గురించి ఎక్కువగా మాట్లాడుకుంటే మన జీవితాల్లో వాడికి ఏదో ప్రత్యేకమైన స్థానం ఉందని అనుకుంటాడు. మనం ఇంట్లో పెంచుకునే కుక్కకు నాలుగు రొట్టెముక్కల పెడితే అది మన నెత్తి మీదకి ఎక్కి ఆడుకున్నట్టు ఇప్పుడు వీడి గురించి మాట్లాడుకుంటే ఏదో ఒక రోజు వీడు కూడా అలాగే చేస్తాడు అని అంది. .... బాగా చెప్పావు తల్లి. ఈ రాక్షసుడు అలా చేసినా చేస్తాడు. ప్రతిరోజు మనం ఈ రాక్షసుడు గురించి మాట్లాడుకుని మన నోళ్లు ఎందుకు పాడుచేసుకోవడం అని అన్నాడు అతను.
ఆ తర్వాత వాళ్ళు వాళ్ళ పని చేసుకోవడం కోసం ముందుకు కదిలిపోయారు. కానీ వాళ్లు మాట్లాడిన మాటలు నాకు గుండెకోతను మిగిల్చాయి. ఎవరో నా గుండెను రంపంతో కోస్తున్నట్లు అనిపించింది. నా కళ్ళమ్మట నీళ్ళు రాలాయి. అక్కడే వెక్కి వెక్కి ఏడవాలని అనిపించింది. కానీ అలా చేయలేను. కానీ వాళ్లు నా గురించి మాట్లాడారన్నది నిజం. నా స్థాయి అర్హత ఏంటో చెప్పారు. నిజమే నేను కుక్కనే అనుకుంటూ కన్నీళ్లు కారుస్తూ ఇంటికి చేరుకున్నాను. కానీ ఇప్పుడు వారు అన్న మాటలను నాతోపాటు ఆ పార్క్ లో ఉన్న మరో వ్యక్తి కూడా విన్నారు. ఆ మాటలు విని వారి కళ్లలో నుంచి కూడా నీళ్లు కారాయి.
ఆ మాటలు విన్న వ్యక్తి మనసులో అనుకున్న మాట, భగవంతుడా ఎంత నిర్దయ గల మనుషులను సృష్టించావయ్యా? ఆ అమాయకుడు ఏం పాపం చేసాడు? వాళ్లను ఏమి చేయలేదు, కనీసం ఒక్క మాట కూడా అనలేదు. అయినా సరే వాళ్లంతా సూటిపోటి మాటలతో ఆ అమాయకుడి గుండెను ముక్కల ముక్కలుగా నరికి గాయపరిచారు. అసలు ఎందుకిలా జరుగుతోంది భగవంతుడా. ఆ అమాయకుడు లాంటి మంచి వాడితో ఆ మనుషులు ఎందుకిలా ప్రవర్తిస్తున్నారు? అని అనుకుంటూ ఆ వ్యక్తి కూడా కన్నీళ్లు కారుస్తూ ఆ పార్కు నుంచి వెళ్ళిపోయారు.
నేను కూడా నెమ్మదిగా నడుచుకుంటూ ఇంటికి చేరుకున్నాను. ఇంట్లోకి వెళ్లి తలుపులు వేసుకుని బోరున ఏడుస్తూ కుప్పకూలిపోయాను. అలా కొంతసేపు వెక్కివెక్కి ఏడ్చేసరికి మనసు కొంచెం తేలిక అయ్యింది. ఆ తర్వాత లేచి ఫ్రెష్ అయ్యాను. పొద్దున్నే ఆ ముగ్గురు వ్యక్తుల నుంచి మనసు నొప్పించే మాటలు వినడంతో ఆకలి చచ్చిపోయి టిఫిన్ చేయాలని అనిపించలేదు. అలాగే ఖాళీ కడుపుతో ఇంట్లో నుంచి బయటకు వచ్చి కవిత మేడం ఇంటికి బయలుదేరాను.