Episode 012


నా ముందు ఒక అమ్మాయి నడుచుకుంటూ వెళ్తుంటే ఆమెకు కొద్ది దూరంలోనే వెనకాల నేను నడుచుకుంటూ వెళుతున్నాను. అంతలో అకస్మాత్తుగా వెనుక నుండి ఒక వ్యాన్ వచ్చి నాకు అతి దగ్గరగా ముందుకు దూసుకుని వెళ్ళింది. దాంతో నేను అదిరిపడి కొంచెం పక్కకి జరిగాను. అకస్మాత్తుగా జరిగిన ఆ పరిణామం నుండి షాక్ అయ్యి మళ్లీ తేరుకుని ముందుకు వెళ్తున్న ఆ వ్యాన్ వైపు చూశాను. వేగంగా వెళ్తున్న ఆ వ్యాన్ నా ముందు వెళ్తున్న అమ్మాయి పక్కన సడన్ బ్రేక్ వేయడంతో ఆగింది. దాంతో ఆ అమ్మాయి కూడా భయపడి పక్కకి తుళ్ళి కింద పడింది. ఆ తర్వాత ఆ వ్యాన్ డోర్ తెరుచుకుని అందులో నుంచి ముగ్గురు వ్యక్తులు కిందకి దిగి కింద పడ్డ ఆ అమ్మాయిని వ్యాన్లోకి ఎక్కించే ప్రయత్నం చేస్తున్నారు.

ఇదంతా చూసిన నేను వెంటనే వాళ్ళ దగ్గరకు పరిగెత్తడం మొదలు పెట్టి గట్టిగా అరిచాను. ఏయ్,,, ఆగండి,, ఏం చేస్తున్నారు మీరు? ఆగండి,, అని అరుస్తూ ఉండడంతో వాళ్లు నా వైపు చూశారు. అందులో ఒక ఆగంతకుడు మాట్లాడుతూ, ఒరేయ్ ఏం చూస్తున్నారురా ముందు దీన్ని తొందరగా లోపల పడేయండి అని అన్నాడు. నేను వాళ్ళ వైపు పరుగెడుతూ ఉన్నాను. ఆ అమ్మాయి కూడా "కాపాడండి" "కాపాడండి" అంటూ అరుస్తూ ఉంది. చాలా వేగంగా వాళ్లంతా కలిసి ఆ అమ్మాయిని వ్యాన్ లో పడేసి వాళ్లు కూడా లోపలికి ఎక్కారు. ఆ అమ్మాయి వాన్ లో నుంచి బయటికి దూకడానికి ప్రయత్నం చేయగా వాళ్లు ఆ అమ్మాయిని పట్టుకొని లోపలికి లాగి వ్యాన్ డోర్ క్లోజ్ చేశారు.

ఆ అమ్మాయి ఇంకా అరుస్తూనే ఉంది. నేను కూడా ఇంచుమించుగా ఆ వ్యాన్ దగ్గరికి చేరుకున్నాను. కానీ ఆ వ్యాన్ చాలా వేగంగా ముందుకు కదిలింది. నా చేతులు కూడా ఆ వ్యాన్ అద్దాలను తాకుతున్నాయి. నేను కూడా ఆగకుండానే ఆ వ్యాన్ వెనకాల పరిగెడుతున్నాను. ఆ వ్యాన్ వేగం పెరగడంతో నాకంటే కొంచెం ముందుకు వెళ్లిపోయింది. అయినా సరే నేను ఆగకుండా దాని వెనకాల పరిగెడుతూనే ఉన్నాను. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఆ వ్యాన్ ఒక టర్న్ తీసుకుంది. అది టర్న్ తీసుకోవడం చూసి నేను కూడా పక్కన ఉన్న ఒక సందు లోకి పరిగెత్తాను. ఆ వ్యాన్ వెళ్లే రోడ్డు చేరుకోవడానికి ఈ సందు చాలా షార్ట్ కట్. నేను ఉండే ప్రాంతానికి ఈ ఏరియా దగ్గర కావడంతో నాకు ఈ ఏరియా గురించి బాగా తెలుసు.

అక్కడ వ్యాన్ లో ఉన్న ముగ్గురు వ్యక్తులు ఆ అమ్మాయిని బలాత్కారం చేయడానికి చాలా ప్రయత్నిస్తున్నారు. ఆ అమ్మాయి కూడా అరుస్తూ వాళ్ల నుంచి తప్పించుకుంటూ తన ప్రయత్నం తాను చేస్తోంది. ఆ వ్యాన్ లో ఆ ముగ్గురు ఆగంతకులు మరియు అమ్మాయి కాకుండా మరో ఇద్దరు వ్యక్తులు కూడా ఉన్నారు. అందులో ఒకరు డ్రైవ్ చేస్తుంటే మరొకడు కూర్చుని ఈ నలుగురు వైపు చూస్తున్నాడు. వద్దు,, ప్లీజ్ నన్ను వదిలేయండి అంటూ ఆ అమ్మాయి ప్రాధేయ పడుతోంది. అందులో ఒక ఆగంతకుడు మాట్లాడుతూ, ఎంతో కష్టపడితే మా చేతికి చిక్కావు. అంత ఈజీగా ఎలా వదిలేస్తామే అని అన్నాడు. మరో ఆగంతకుడు మాట్లాడుతూ, సరైన సరుకు దొరికింది ఈరోజు మనకి ఫుల్ మజాయే అని అన్నాడు.

వద్దు ప్లీజ్,, నన్ను వదిలేయండి. నన్నేం చెయ్యొద్దు. తర్వాత నేను తలెత్తుకుని తిరగలేను అంటూ ప్రాధేయ పడుతోంది. ఆ మూడో ఆగంతకుడు మాట్లాడుతూ, అరెరే అలా ఎలా వదిలేస్తాం, ఈరోజు మేము నీతో శోభనం చేసుకోవాలి. అబ్బబ్బబ్బా ఏం రంగురా దీనిది. ఆ షేపులు చూడు బలే మస్తుగా ఉన్నాయి. ఈరోజు మనకి ఫుల్ మజాయే అని వెకిలి నవ్వు నవ్వుతూ అన్నాడు. ఇంతలో ఆ నాలుగో ఆగంతుకుడు మాట్లాడుతూ, అరే భాయ్ ఆ కుర్రాడు ఎవడో గాని ఇంకా మన వెంటపడుతున్నాడు అని అనడంతో అందరూ బయటికి చూశారు. మళ్లీ మొదటి ఆగంతకుడు మాట్లాడుతూ, ఒరేయ్ బండి కొంచెం వేగంగా పోనివ్వరా అని అన్నాడు. అప్పుడు అయిదవ ఆగంతకుడు(డ్రైవర్) సరే భాయ్ అలాగే ఇప్పుడు చూడండి అని అన్నాడు.

ఇక్కడ నేను కూడా ఆ వ్యాన్ కంటే ముందుగా రోడ్డు మీదకు చేరుకొని చుట్టుపక్కల వెతికి ఒక రాయి అందుకున్నాను. లోపల ఉన్న ఆగంతకులు ఆ అమ్మాయిని బలవంతం చేస్తున్నారు. చాలా చోట్ల ఆ అమ్మాయి డ్రెస్ కూడా చిరిగి పోయింది. చాలా వేగంగా ఆ వ్యాన్ నా వైపు దూసుకుని వస్తుంది. నేను రోడ్డు మధ్యలో నిల్చున్నాను. అప్పుడు లోపల ఉన్న ఐదవ ఆగంతుకుడు(డ్రైవర్) మాట్లాడుతూ, భాయ్ అలా చూడండి ఆ నాకొడుకు రోడ్డుకి మధ్యలో అడ్డంగా నిల్చున్నాడు అని అన్నాడు. అప్పుడు మొదటి ఆగంతకుడు మాట్లాడుతూ, వాడు అంత తొందరగా ఇక్కడికి ఎలా చేరుకున్నాడురా అని అన్నాడు. అప్పుడు రెండో ఆగంతకుడు మాట్లాడుతూ, ఇప్పుడు వస్తే ఏంటి? లేపెయ్యండి నాకొడుకుని. ఆడెమ్మ హీరో అయిపోదామని అనుకుంటున్నాడు లాగుంది అని అన్నాడు. అప్పుడు డ్రైవర్ మాట్లాడుతూ, సరే భాయ్ అంటూ మరింత వేగం పెంచాడు.

నేను ఇంకా అలానే రోడ్డు మధ్యలో నిల్చుని వ్యాన్ నాకు మరికొంచెం దగ్గరకు వచ్చే దాక వెయిట్ చేసి రాయి పట్టుకున్న చేతిని పైకి లేపి గురిచూసి రెడీగా ఉన్నాను. ఆ వ్యాన్ నాకు మరి కొంచెం దగ్గరగా రానిచ్చి కళ్ళు మూసుకుని గురిపెట్టిన చోటుకి రాయిని విసిరేసాను. ఆ రాయి వేగంగా దూసుకొని వెళ్లి డ్రైవర్ ముందున్న అద్దానికి తగిలి అది పగిలి ముక్కలు ముక్కలై పోయింది. దాంతో డ్రైవర్ వెంటనే సడన్ బ్రేక్ వేశాడు. దాంతో వ్యాన్ కొంచెం స్లిప్ అవుతూ ముందుకు వచ్చి చివరికి ఆగిపోయింది.

వెంటనే నేను పరిగెత్తుకుంటూ ఆ వ్యాన్ దగ్గరికి వెళ్లి డోర్ ఓపెన్ చేసి ఆ అమ్మాయిని బయటకి లాగేసాను. ఇదంతా చాలా వేగంగా జరిగిపోవడంతో వాళ్లకు జరుగుతుంది అర్థం చేసుకోవడానికి కొంత టైం పట్టింది. నేను చూసేసరికి ఆ అమ్మాయి బట్టలు చిరిగిపోయి ఉన్నాయి. వెంటనే నేను నా కోట్ విప్పి ఆమెకు ఇచ్చి, వెంటనే ఇక్కడినుంచి పారిపో అని ఆ అమ్మాయికి చెప్పగా ఆమె అక్కడి నుంచి పరిగెత్తి వెళ్లిపోతుంది. ఇంతలో బండిలో ఉన్న ఆగంతకులు అందరూ కిందికి దిగారు.

A1 గాడి చేతిలో చాకు ఉంది. A2 గాడి చేతిలో బేస్బాల్ బ్యాట్ ఉంది. A3 గాడి చేతిలో హాకీ స్టిక్ ఉంది. A4 గాడి చేతిలో మోటార్ సైకిల్ చైన్ ఉంది. A5 గాడి చేతిలో మన సినిమాల్లో విలన్ల దగ్గర ఉండే వంకరలు తిరిగిన మొండి కత్తి లాంటిది ఉంది. నేను కూడా వాళ్ళతో పోరాడడానికి సిద్ధం అయిపోయాను. A1 మాట్లాడుతూ, ఎంతో కష్టపడితే ఆ పిట్ట చేతికి చిక్కింది. సాలా నీవల్ల అది చేజారిపోయింది. నిన్ను ప్రాణాలతో వదిలేది లేదు. ఒరేయ్ కొట్టండిరా వాణ్ని అని అన్నాడు. వెంటనే A2 A3 ఇద్దరూ కలిసి ఒకేసారి నన్ను కొట్టడానికి వచ్చారు. A3 తన చేతిలో ఉన్న హాకీ స్టిక్ పైకెత్తి నా తలమీద కొట్టడానికి గురిపెట్టాడు. అంతలో నేను ముందుకు కదిలి నా మీదకు వస్తున్న హాకీ స్టిక్ ని ఒక చేత్తో పట్టుకున్నాను. ఇంతలో A2 తన చేతిలో ఉన్న బేస్బాల్ బ్యాట్ తో నా తలమీద కొట్టడానికి ప్రయత్నించాడు. వెంటనే నేను నా చేతితో పట్టుకున్న హాకీ స్టిక్ ను రెండు చేతులతో పట్టుకుని ఆ బేస్బాల్ బ్యాట్ ని అడ్డుకున్నాను.

ఆ తర్వాత నేను నా కాలు లేపి A2 గాడి పొట్టలో గట్టిగా ఒక కిక్ ఇచ్చాను. దాంతో వాడు వెనక్కి వెళ్లి కిందపడ్డాడు. తర్వాత నేను A3 గాడి మొహం మీద ఒక పంచ్ గుద్ది వాడి చేతిలో ఉన్న హాకీ స్టిక్ ని నా చేతుల్లోకి లాక్కున్నాను. ఆ తర్వాత నేను అదే హాకీ స్టిక్ తో వాడి కడుపులో ఒక్క షాట్ కొట్టేసరికి వాడు తన కడుపు పట్టుకొని కింద కూర్చుండిపోయాడు. వాడు కింద కూర్చోగానే నేను మళ్ళీ హాకీ స్టిక్ తో వాడి మొహం మీద గట్టిగా ఒక షాట్ కొట్టేసరికి నేల మీద పడ్డాడు. ఇంతలో A2 మళ్లీ పైకి లేచి నా దగ్గరికి వస్తున్నాడు. వాడు పరిగెత్తుకుంటూ నా దగ్గరకు వస్తుంటే నేను హాకీ స్టిక్ తో వాడి కాళ్లను గురిచూసి కొట్టాను. అది తగిలి ముందుకు తుళ్ళి పడుతూ వాడి చేతిలో ఉన్న బేస్బాల్ బ్యాట్ ని వదిలేశాడు. అది దొర్లుకుంటూ వచ్చి నా కాళ్లదగ్గర పడింది.

నేను ఆ బేస్బాల్ బ్యాట్ తీసుకుని A2 గాడి దగ్గరకు వెళ్లి పైకి లేవడానికి ప్రయత్నిస్తున్న వాడి వీపు మీద ఆ బేస్బాల్ బ్యాట్ తో ఒక్క షాట్ కొట్టాను. దాంతో వాడు మళ్ళీ కింద పడ్డాడు. వెంటనే నేను బేస్బాల్ బ్యాట్ తో వాడి తల మీద ఒక గట్టి షాట్ ఇచ్చాను. అంతే వాడి తల నుంచి రక్తం కారడం మొదలైంది. ఆ తర్వాత నేను అక్కడి నుంచి ముందుకు కదలగా, అటునుంచి A4 A5 కూడా నా వైపు కదిలి వస్తున్నారు. A5 ముందు వస్తూ వాడి చేతిలో ఉన్న మొండి కత్తితో నా మీదకు విరుచుకుపడ్డాడు. అది చూసి నేను పక్కకి తప్పుకున్నాను. అయినా సరే ఆ కత్తి నా భుజానికి తాకడంతో తగిలిన చోట నుంచి రక్తం కారడం మొదలైంది. అది చూసి A5 గాడి మొహంలో నవ్వు మెరిసింది.

దాంతో నాకు పిచ్చ కోపం లేసింది. వెంటనే తిరుగుతూ నా చేతిలో ఉన్న బేస్బాల్ బ్యాట్ తో వాడి చేతులు మీద గట్టిగా కొట్టాను. దాంతో వాడి చేతిలో ఉన్న మొండి కత్తి కింద పడిపోయింది. అంతటితో నేను ఆగకుండా వాడి భుజం మీద గట్టిగా ఒకటి కొట్టాను. దాంతో వాడు వాడి భుజాన్ని పట్టుకుని అరవడం మొదలు పెట్టాడు. ఇంతలో A4 గాడు తన చేతిలో ఉన్న మోటార్ సైకిల్ చైన్ తో నా మొహం మీద దాడి చేసాడు. అందుకు నేను సిద్ధంగా లేకపోవడంతో ఆ చైన్ వచ్చి నా మొహానికి తగిలేసరికి నేను పల్టీ కొడుతూ కింద పడిపోయాను. ఆ చైన్ తగిలిన చోట మొహం మీద చాలా మంటగా అనిపించింది. చేతితో తడుముకుని చూడగా అక్కడ రక్తం కారుతోంది.

అది చూసి నా కోపం మరింత పెరిగింది. వెంటనే వేగంగా పైకి లేచాను. కానీ అంతలోనే A4 గాడు మళ్ళీ నా మీద దాడి చేశాడు. ఈసారి ఆ చైన్ నా భుజం మీద కత్తి గాటు పడిన చోట తగిలింది. ఆ తర్వాత వాడు మళ్ళీ దాడి చేస్తుంటే ఈ సారి నేను నా ఎడమ చేతితో ఆ చైన్ ని ఒడిసి పట్టుకున్నాను. వెంటనే నా కుడి చేతిలో ఉన్న బేస్బాల్ బ్యాట్ తో వాడి చేతి మీద గట్టిగా కొట్టడంతో వాడి చేతిలో నుంచి చైన్ జారిపోయింది. ఆ తర్వాత నేను బేస్బాల్ బ్యాట్ కింద పడేసి ఆ చైన్ ని కొంచెం చేతికి చుట్టుకుని దాంతో వాడి మీద విరుచుకుపడి దాడి మొదలు పెట్టాను. దాంతో వాడికి చాలా చోట్ల దెబ్బలు తగిలాయి. దెబ్బలు తగిలిన చోట వాడి బట్టలు చిరిగిిపోయి రక్తం కారుతోంది.

ఆ తర్వాత నేను A1 గాడి వైపు తిరిగాను. అంతలో గన్ పేలిన శబ్దం వినపడింది. డిష్ష్యూం,,,, అంతే, ఆ బుల్లెట్ నేరుగా వచ్చి నా ఛాతీకి తగిలింది. వెంటనే నేను నా చాతిని పట్టుకొని మోకాళ్ళపై కింద పడ్డాను. ఆ బుల్లెట్ కాల్చింది A1. ఆ తర్వాత మళ్ళీ ఒకసారి గన్ పేలిన శబ్దం. డిష్ష్యూం,,,, అది వచ్చి నేరుగా నా కడుపులోకి దిగింది. అంతే నేను నేల కూలాను. ఆ తర్వాత A1 నా దగ్గరకు వచ్చి తన చేతిలో ఉన్న చాకుతో నా పొట్టలో పొడిచాడు. ఇదంతా జరిగిన తర్వాత వాడి మొహంలో ఒక పైశాచికంతో కూడిన నవ్వు వచ్చింది. వాడు చాలా గట్టిగా కిరాతకంగా నవ్వుతున్నాడు.

హ హ హ హ హ హ,,,,, సాలా,, నువ్వు ఎవడితో గొడవ పెట్టుకున్నావో తెలుసారా నీకు. నిన్ను ప్రాణాలతో వదిలేది లేదని ముందే చెప్పాను కదరా అని చెప్పి వాడు నా కాళ్ళ మీద గట్టిగా తన్నాడు. నేను నేల మీద పడి గిలగిలలాడుతున్నాను. అయినా సరే నేను పైకి లేచి నిల్చున్నాను. నేను వాడిని కొట్టబోయేంతలో వాడు మళ్ళీ నా పొట్టలో పొడిచాడు. దాంతో నేను మళ్ళీ కింద పడ్డాను. ఈ సీన్ అంతా జరిగి గన్ పేలిన శబ్దం వినిపించడంతో కొంచెం దూరంగా చుట్టుపక్కల ఉన్న ఇళ్లలో వారు బయటకు వచ్చారు. అలా బయటకి వచ్చిన వాళ్ళలో నేను ట్రక్ యాక్సిడెంట్ నుంచి కాపాడిన వారు కూడా ఉన్నారు. అంటే ఆ పిల్లాడి కుటుంబంలోని వారు అన్నమాట. వాళ్లు నన్ను గుర్తుపట్టారు.

ఇంతలో ఇక్కడ ఈ ఐదుగురు పైకి లేచి నన్ను కాళ్లతో తన్నడం మొదలు పెట్టారు. వాళ్లు ఆగకుండా నన్ను తంతూ ఉంటే నేను అచేతనంగా కింద ఉండి దెబ్బలు కాస్తున్నాను. అంతలో ఆ పిల్లవాడి తండ్రి తన చుట్టుపక్కల ఉన్న వాళ్ళను గట్టిగా కేకలు వేసి పిలిచి, అన్నలారా మంచి వ్యక్తిని కాపాడండి. లేదంటే వాళ్ళు అతన్ని చంపేసేలా ఉన్నారు అని అన్నాడు. అక్కడ ఉన్న జనంలో నుంచి ఒకతను మాట్లాడుతూ, అయితే ఏమైంది? జనాభా లెక్కల్లో ఒకడు తగ్గుతాడు అంతేగా అని అన్నాడు. అంతలో మరొకతను మాట్లాడుతూ, ఏం మాట్లాడుతున్నావ్ రా నువ్వు, పదండి ముందు అతన్ని రక్షిద్దాం అని అన్నాడు.

ఆ పిల్లవాడి తండ్రి మాట్లాడుతూ, పదండి అతన్ని రక్షిద్దాం. అతనే నా కుటుంబం మొత్తాన్ని ప్రాణాలకు తెగించి ప్రమాదం నుంచి కాపాడాడు అని అన్నాడు. అప్పుడు ఆ మొదటి వ్యక్తి మళ్లీ మాట్లాడుతూ, అలాగా? అయితే తొందరగా పదండి అని అన్నాడు. ఆ తర్వాత అందరూ గుమిగూడి మా దగ్గరకు పరిగెత్తడం మొదలు పెట్టారు. వాళ్లంతా మా వైపు పరిగెత్తుకుంటూ రావడం A5 గాడు చూశాడు. భాయ్ తొందరగా ఇక్కడినుంచి పారిపోదాం పదండి. అదిగో చూడండి జనమంతా గుమిగూడి మన వైపే వస్తున్నారు అని అన్నాడు. A1 మాట్లాడుతూ, పదండి అందరూ వెళ్లి ముందు బండిలో కూర్చోండి అని అన్నాడు. అతని మాట విని అందరూ బండిలోకి వెళ్ళి కూర్చున్నారు. A1 మాత్రం వెళ్తూ వెళ్తూ మరో రెండు బుల్లెట్లు నాలో దింపి గబగబా వెళ్లి బండిలో కూర్చుని అక్కడి నుంచి పారిపోయారు.

ఆ పిల్లవాడి తండ్రి మరియు ఆ చుట్టుపక్కల వాళ్ళు నా దగ్గరకు వచ్చేసరికి నేను స్పృహ కోల్పోయాను. ఆ తర్వాత వాళ్ళు అంతా నన్ను ఎత్తుకుని హాస్పిటల్ వైపు బయలుదేరారు. నాకు నాలుగు బుల్లెట్లు తగలడంతో, మరియు చాకుతో రెండు సార్లు పొడవడంతో బాగా రక్తం పోయి స్పృహ కోల్పోయాను.

మరోవైపు ఇక్కడ జరిగిన సంఘటన గురించి ఇన్స్పెక్టర్ రుద్ర కి సమాచారం అందడంతో అతను కూడా హాస్పిటల్ కి బయల్దేరాడు. కానీ అతనికి ఎవరి మీదో దాడి జరిగింది గాయపడిన వ్యక్తిని హాస్పిటల్లో చేర్చారు అని మాత్రమే సమాచారం అందడంతో తన టీం ని సంఘటన జరిగిన ప్రదేశానికి పంపి తను మాత్రం ఒక సహచరుడిని వెంటబెట్టుకుని హాస్పిటల్ కి బయల్దేరాడు. అంతేకాకుండా ఈ సంఘటన గురించిన వార్త టీవీలో కూడా రావడం మొదలైంది. ఫలానా రోడ్డుమీద ఒక వ్యక్తిపై గుర్తు తెలియని ఆగంతకులు దాడి చేశారు. ఎవరు చేశారన్నది ఇంకా ఆచూకి తెలియలేదు. కానీ దాడి జరిగిన అబ్బాయి శరీరంలోకి నాలుగు బుల్లెట్లు దూసుకు పోయినట్లు ఇంకా కత్తిపోట్లు తగిలినట్లు తెలుస్తోంది అని ప్రసారం అవుతుంది.

ఈ వార్తను అటు అభి ఇంట్లో వాళ్ళు, ఇటు కవిత మేడం వాళ్ళు కూడా చూశారు. ఈ సంఘటన జరిగిన ప్రదేశం నేను ఉండే ఇంటికి దగ్గర్లో జరగడంతో వాళ్లు ఆందోళన చెందారు. ఒక అబ్బాయికి జరిగింది అని టీవీలో చెప్పడంతో వాళ్ళంతా కలతచెంది అనుమానం వచ్చి నేను ఉండే ఇంటికి బయలుదేరారు. ఇక్కడ వీళ్లంతా నన్ను హాస్పిటల్ కి తీసుకుని వచ్చారు. ఇంతకుముందు నాకు తలకు దెబ్బ తగిలినప్పుడు, ప్రీతికి గాయమైనప్పుడు, ఆ పిల్లాడి తల్లిదండ్రులకు యాక్సిడెంట్ అయినప్పుడు వచ్చిన అదే హాస్పిటల్ కి నన్ను తీసుకుని వచ్చారు. ఆ పిల్లాడి తండ్రి హాస్పిటల్ లోకి వస్తూనే డాక్టర్,, డాక్టర్,, డాక్టర్,, అని గట్టిగా కేకలు పెట్టడంతో డాక్టర్ కూడా వెంటనే వచ్చారు.

నన్ను చూసి డాక్టర్ వెంటనే గుర్తుపట్టి, ఓ మై గాడ్,,, నర్స్ తొందరగా,, కేస్ చాలా క్రిటికల్ కండిషన్ లో ఉంది. ఎక్కువ సమయము ఉన్నట్లు అనిపించడం లేదు అని అనడంతో వెంటనే నన్ను ఆపరేషన్ థియేటర్ లోకి తీసుకొని వెళ్లారు. ఆపరేషన్ టేబుల్ మీద లైట్లు వెలిగాయి. నా మొహానికి ఆక్సిజన్ మాస్క్ తరలించారు. ఒక చేతికి సెలైన్ బాటిల్ ఎక్కించటం మొదలుపెట్టారు. మరోవైపు బ్లడ్ శాంపిల్స్ తీసుకొని అవసరమైన గ్రూప్ బ్లడ్ తీసుకొనివచ్చి మరో చేతికి ఎక్కించటం మొదలుపెట్టారు. అంతా రెడీ చేసుకొని ఆపరేషన్ చేయడం మొదలుపెట్టారు.

బయట ఇన్స్పెక్టర్ రుద్ర హాస్పిటల్ కి చేరుకొని నన్ను హాస్పిటల్ కి తీసుకు వచ్చిన ఆ పిల్లాడి తండ్రి మరియు అతని ఇరుగుపొరుగు వారిని ఎంక్వయిరీ చేయడం మొదలుపెట్టారు. మీ పేరేంటి? అని ఆ పిల్లవాడి తండ్రిని అడగగా, నాపేరు వీర్రాజు సార్ అనే సమాధానం చెప్పాడు. .... అయితే వీర్రాజు గారు అసలు ఇదంతా ఎలా జరిగిందో మీరు ఏమైనా చెప్పగలరా?.... ఎస్ సార్, మేమందరం మా ఇళ్ళల్లో ఉన్నాము సార్. అంతలో సడన్ గా గన్ పేలిన శబ్దం వినపడింది. అది విన్న వెంటనే మేమంతా మా ఇళ్ళల్లో నుంచి బయటకు వచ్చాము. .... మ్,, ఆ తర్వాత? .... మేము చూసేసరికి ఒక ఐదుగురు వ్యక్తులు ఒక అబ్బాయిని పట్టుకుని కొడుతున్నారు. మేము ఇంట్లో నుంచి బయటకు వచ్చేసరికే అతని శరీరం లోకి రెండు బుల్లెట్లు దింపి అతన్ని పట్టుకొని కొడుతున్నారు. ఆ తర్వాత మేము అంతా కలిసి అతన్ని రక్షించడానికి ముందుకు కదలడంతో ఆ అయిదుగురు మమ్మల్ని చూసి అక్కడి నుంచి పారిపోవడానికి సిద్ధమయ్యారు. కానీ వెళ్తూ వెళ్తూ ఆ అబ్బాయి శరీరంలోకి మరో రెండు బుల్లెట్లు దింపి పారిపోయారు అని చెప్పాడు.

మీరు ఆ వ్యక్తులను గుర్తుపట్టగలరా? అని అడిగాడు రుద్ర. .... లేదు సార్. .... మరి గాయాలైన ఆ అబ్బాయి గురించి మీకేమైనా తెలుసా? .... తెలుసు సార్. ఆ అబ్బాయి పేరు దీపు. కొద్ది రోజుల క్రితం యాక్సిడెంట్ అయినప్పుడు మమ్మల్ని ప్రాణాలకు తెగించి కాపాడింది ఆ అబ్బాయే. .... ఏం పేరు చెప్పారు మీరు?.... దీపు సార్. .... దీపక్ వర్మ,,,,, అతనేనా? .... అవును సార్. .... ఓహో అలాగా,, సరే ఇక మీరు వెళ్ళండి నేను ఇక్కడ సంగతి చూసుకుంటాను. నేనే స్వయంగా ఈ కేసును చూసుకుంటాను. .... సరే సార్,,, అంత మంచి వ్యక్తికి ఈ గతి పట్టించిన వారిని ఊరికే వదలొద్దు సార్, వారికి కఠినమైన శిక్షలు పడేలా చూడండి సార్. .... మీరేమీ బాధపడొద్దు అని ఇన్స్పెక్టర్ రుద్ర చెప్పడంతో ఆ పిల్లాడి తండ్రి వీర్రాజు మినహ మిగిలిన అందరూ అక్కడి నుంచి వెళ్లిపోయారు.

మరోవైపు కవిత మేడం వాళ్ల ఫ్యామిలీ, అభి వాళ్ల ఫ్యామిలీ నేను ఉండే ఇంటికి చేరుకున్నారు. ముందుగా కవిత మేడం, అంకుల్ మరియు ప్రీతి వాళ్లు కార్ లో అక్కడికి చేరుకొని నా ఇంటికి తాళం వేసి ఉండడం చూడడంతో చాలా ఆందోళనకు గురై టెన్షన్ పడుతున్నారు. ఇంతలో అభి, దేవి మరియు అను కార్లో అక్కడికి చేరుకున్నారు. దేవి వాళ్ళ ఫ్యామిలీ అక్కడికి రావడం చూసి కవిత మేడం ఆశ్చర్యపోయారు. అదే సమయంలో కవిత మేడం దీపక్ అంకుల్ తో కలిసి అక్కడ ఉండటం చూసి దేవి కూడా ఆశ్చర్యపోయింది.

(వాళ్లు ఇద్దరూ అలా ఒకరినొకరు చూసుకొని ఆశ్చర్య పోవడానికి కారణం ఏంటో మీకు తొందర్లోనే తెలుస్తుంది).

నేను ఉండే ఇంటికి కొద్ది దూరంలో కొంత మంది జనం గుమిగూడి ఉన్నారు. వాళ్లంతా ఇప్పుడు నన్ను హాస్పిటల్లో చేర్చి తిరిగి వచ్చిన జనం. అభి దృష్టి వాళ్ల మీద పడింది. అక్కడ చూడండి,,, అక్కడేదో జనం గుమిగూడి ఉన్నారు. అంకుల్ పదండి మనం వెళ్లి చూసొద్దాం అని అన్నాడు అభి. వెంటనే అంకుల్ మరియు అభి ఆ జనం దగ్గరకు వెళ్లారు. అభి వాళ్లతో మాట్లాడుతూ, ఇక్కడ ఇంత జనం ఉన్నారేంటి? అని అడిగాడు. .... అందులో ఒక వ్యక్తి మాట్లాడుతూ, ఇక్కడ దీపు అనే కుర్రాడిని ఎవరో చంపడానికి ప్రయత్నం చేశారు. అంత మంచి అబ్బాయి మీద ఎవరికి అంతటి శత్రుత్వం ఉందో అర్థం కావడం లేదు? పాపం చావు బతుకుల్తో కొట్టుమిట్టాడుతున్న ఆ అబ్బాయిని ఇప్పుడే హాస్పిటల్ లో చేర్చి తిరిగి వస్తున్నాం అని చెప్పాడు.

ఆ మాట వినగానే అభి మరియు అంకుల్ ఇద్దరికీ కాళ్లు చేతులు చల్లబడి పోయాయి. కానీ అభి కొంచెం మనసు దిటవు చేసుకుని, ఇప్పుడు ఆ అబ్బాయిని ఏ హాస్పిటల్లో చేర్చారండి అని అడగగా ఆ వ్యక్తి హాస్పిటల్ పేరు చెప్పడంతో, చాలా థ్యాంక్స్ అండీ అని చెప్పి అభి మరియు అంకుల్ తిరిగి మా ఇంటి దగ్గర ఉన్న కవిత మేడం, దేవి, అను మరియు ప్రీతిల దగ్గరికి వచ్చారు. కవిత మేడం మాట్లాడుతూ, ఏమైంది? అని అడగగా, ముందు తొందరగా కార్లో కూర్చోండి అని అంకుల్ చెప్పారు. .... ఇంతకీ ఏం జరిగింది? దీపు గురించి ఏమైనా తెలిసిందా? అని దేవి అడిగింది. .... ఇప్పుడు నేను నీకు ఏమీ చెప్పలేను కానీ ముందు మీరంతా తొందరగా కార్లో కూర్చోండి అని చెప్పాడు అభి.

అందరూ తొందరగా కారులో కూర్చోగా అభి మరియు అంకుల్ తమ కార్లను తొందరగా హాస్పిటల్ వైపు పోనిచ్చారు. కొంతసేపటికి అందరూ కలిసి హాస్పిటల్ కి చేరుకున్నారు. హాస్పిటల్ చూడగానే కవిత మేడం, ప్రీతి, అను మరియు దేవిలకు గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది. మీరు మమ్మల్ని ఇక్కడికి ఎందుకు తీసుకువచ్చారు? అని అడిగింది దేవి. అదే ప్రశ్న కవిత మేడం కూడా అంకుల్ ని అడిగారు. .... ఎందుకంటే దీపు ఇక్కడే ఉన్నాడు అని అంకుల్ మరియు అభి ఓకేసారి చెప్పారు. .... అందరూ కలిసి ఒకేసారి, ఏంటి మీరు చెప్పేది? అని అన్నారు. .... ఆ దాడి జరిగింది మరెవరికో కాదు, మన దీపుకే అని ఒకేసారి చెప్పారు అంకుల్ మరియు అభి.

ఆ మాట విన్న నలుగురికి తమ కాళ్ల కింద భూమి బద్దలైనట్లు అనిపించింది. ఒకేసారి అందరి కళ్ళలో నుంచి కన్నీళ్లు ప్రారంభమయ్యాయి. కారులోంచి దిగిన ఆ నలుగురు వెంటనే హాస్పిటల్ లోకి పరిగెత్తారు. వాళ్ళ వెనకే అంకుల్ మరియు అభి కూడా పరిగెత్తారు. కవిత మేడం ఏడుస్తూ రిసెప్షన్ లో మాట్లాడుతూ, మేడం,,, ఇప్పుడిప్పుడే దాడి జరిగిన ఒక అబ్బాయిని తీసుకొచ్చారు కదా? ఇప్పుడు అతను ఎక్కడ ఉన్నాడు? అని అడిగారు. .... ఇప్పుడు అతనికి ఆపరేషన్ జరుగుతుంది మేడం. కానీ ఇంతకీ మీరు అతనికి ఏమవుతారు? అని అడిగింది రిసెప్షనిస్ట్. .... మేము అతని బంధువులం అని చెప్పారు అంకుల్. .... అయితే ప్లీజ్ మీరు ఈ ఫారం నింపండి అని ఒక ఫారం ఇచ్చింది రిసెప్షనిస్ట్. .... సరే నేను ఫారం ఫిల్ చేసి వస్తాను మీరు లోపలికి వెళ్ళండి అని అంకుల్ చెప్పడంతో మిగిలిన వారంతా ఆపరేషన్ థియేటర్ వైపు వెళ్లారు.
Next page: Episode 013
Previous page: Episode 011