Episode 066.1
బెంజి తో కలిసి రెండు రోజుల ప్రయాణం తర్వాత ఒక ప్రదేశానికి చేరుకున్నాము. బెంజి నన్ను ఉత్తర భారతదేశంలోని హిమాలయ పర్వత శ్రేణులు దగ్గర్లోని ఒక ప్రాంతానికి తీసుకొని వెళ్ళాడు. ఆరోజు అక్కడ ఒక హోటల్లో బస చేసాము. ఈ రోజు రాత్రి ఫుల్ రెస్ట్ తీసుకో రేపు పొద్దున్నే మనం ఇక్కడి నుంచి ప్రయాణం అవ్వాల్సి ఉంటుంది అని చెప్పాడు. నేను కొంచెం ఫ్రెష్ అయ్యి ఫోన్ అందుకుని ముందుగా ప్రీతికి కాల్ చేశాను. ఒక రెండు రింగుల తర్వాత అటు నుంచి కాల్ లిఫ్ట్ చేసి హలో,,, అన్న ప్రీతి గొంతు వినబడింది. ప్రీతి గొంతు వినబడుతూనే నాకు చాలా సంతోషంగా అనిపించి 'హలో బంగారం' అని అన్నాను. .... 'పో' అన్నయ్య నేను నీతో మాట్లాడను నేను అలిగాను అని ముద్దుగా అంది ప్రీతి. .... నేను నవ్వుతూ, ఎందుకలా? అని అడిగాను. .... వెళ్లేటప్పుడు నువ్వు నాతో ఏం చెప్పావు? ప్రతిరోజు ఫోన్ చేస్తాను అని చెప్పావు కదా? ఇప్పుడేమో రెండు రోజుల తర్వాత ఫోన్ చేస్తున్నావు అని అంది.
ఓహ్,,, దాని గురించా? సారీరా బంగారం,,, ఐ యాం రియల్లీ సారీ,,, ఇక్కడ సిగ్నల్ సరిగా లేకపోవడంతో ఫోన్ చేయలేకపోయాను. సరే గానీ ఇంట్లో అంతా ఎలా ఉన్నారు? అని అడిగాను. .... అందరూ బాగున్నారు అని చెప్పి ఆ తర్వాత మరి కొంతసేపు ప్రీతి తన అల్లరి చేష్టలు ముద్దుల మాటలు వింటూ గడిచిపోయింది. ఆ తర్వాత అమ్మతో కూడా మాట్లాడాను. టైం కి భోజనం చేయమని, ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో అని అమ్మ చాలా జాగ్రత్తలు చెప్పి ఇద్దరు కలిసి ఫోన్ లో ముద్దులు పెట్టారు. ఆ తర్వాత దేవి అక్కకి కాల్ చేశాను. దేవి అక్క చాలా తొందరగానే కాల్ లిఫ్ట్ చేసింది. హలో అక్కా ఎలా ఉన్నావ్? అని అడిగాను. .... ఏం ఉండడంలేరా తమ్ముడు,, నువ్వు ఇక్కడ లేవు అన్న విషయం తల్చుకుంటేనే మనసు అదోలా ఉంటుంది అని అంది. .... మీ అందరికీ దూరంగా ఉండడంతో ఇక్కడ నా మనసు కూడా అలానే ఉంది కానీ ఏం చేస్తాం తప్పదు కదా? సరేగాని అందరూ ఎలా ఉన్నారు? అని అడిగాను.
అందరూ బానే ఉన్నారురా తమ్ముడు. అందరూ నిన్ను మిస్ అవుతున్నారు తొందరగా వచ్చేయ్ రా అని అంది అక్క. .... వీలైనంత తొందరగా వచ్చే దానికి ట్రై చేస్తాను అని చెప్పి మరికొంతసేపు అక్కతో మాట్లాడి ఆ తర్వాత అభితో కూడా మాట్లాడాను. ఆ తర్వాత అను ఫోన్ అందుకుని, హలో హీరో గారు ఎలా ఉన్నారు? అని చాలా తియ్యగా అడిగింది. .... నేను బాగానే ఉన్నాను నువ్వెలా ఉన్నావ్? అని అడిగాను. .... నేను ఎలా ఉంటే నీకు ఎందుకు? అందరితో మాట్లాడినట్టు నాతో రోజు మాట్లాడతావా ఏంటి? అని అలిగింది. .... నేను నవ్వుకుని, అయితే ఫోన్ చేసి తప్పు చేశానన్నమాట? అయితే పెట్టేస్తాను అని అన్నాను. .... ఓయ్,, ఓయ్,,, ఏదో చిన్నమాట అంటే అలా వెంటనే పెట్టేస్తాను అంటావా? నీకు అస్సలు కామన్సెన్స్ లేదు అని అంది. .... మరి అడిగిన దానికి సమాధానం చెప్పకుండా నీకెందుకు అని మాట్లాడితే నేనేం చేయాలి? అని నవ్వాను. .... మ్,,, నేను బాగానే ఉన్నాను అని చెప్పింది. మరి కొద్ది నిమిషాలు అనుతో మాట్లాడి ఫోన్ కట్ చేశాను.
ఆ తర్వాత పుష్ప వదినకి కాల్ చేశాను. హలో,, నా రంకు రాక్షసుడు ఎలా ఉన్నాడు? అని అటు నుంచి వదిన కొంటె పిలుపు వినిపించింది. .... వాడు బాగానే ఉన్నాడు. మరి నా గుద్ధలరాణి నా ముద్దుల వదిన ఎలా ఉంది? అని నవ్వుతూ అడిగాను. .... నువ్వు బాగా అలవాటు అయిపోయి పదేపదే గుర్తొస్తున్నావురా దొంగ సచ్చినోడా. ఇలా మమ్మల్ని అర్థాంతరంగా వదిలేసి వెళ్ళిపోవడం ఏమైనా బాగుందా? అని చిలిపిగా అడిగింది. .... ఏం చేయాలి చెప్పు, తప్పకుండా నేను ఇక్కడికి రావాల్సిన పరిస్థితి నీకు దూరంగా ఉండడం నాకు కూడా కష్టంగానే ఉంది అని అన్నాను. .... నా గురించి సరేగాని ఇంతకీ నువ్వు సరిగ్గా టైంకి భోజనం చేస్తున్నావా? నీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకుంటున్నావా? అని అడిగింది వదిన. .... అన్నీ బాగానే ఉన్నాయి అని చెప్పి మరి కొంచెం సేపు తనతో మాట్లాడి ఫోన్ కట్ చేసాను. ఆ తర్వాత అరుణకి, హరిత అక్కకి కూడా కాల్ చేసి కొంచెం సేపు మాట్లాడి ఫోన్ కట్ చేసి పడుకున్నాను.
మరుసటి రోజు పొద్దున్న తొందరగా లేచి తయారైన తర్వాత బెంజి పిలుపు వినపడడంతో నా రూమ్ లో నుంచి బయటకు వచ్చి అతని డోర్ దగ్గర నుంచుని టక్ టక్,, అని డోర్ కొట్టాను. .... కమిన్,,, అన్న బెంజి పిలుపు వినబడి లోపలికి వెళ్లి, సర్ మీరు పిలిచారా?? అని అన్నాను. .... అవును,,, నువ్వు ఒక పని చెయ్ తొందరగా నీ సామాను సర్దుకుని 10 నిమిషాల్లో నాకు రిపోర్ట్ చెయ్ అని అన్నాడు బెంజి. .... సరే సర్,,, అని చెప్పి నేను నా రూంలోకి వచ్చి ఇంత సడన్ గా అన్ని ప్యాక్ చేసుకుని రెడీ అవ్వమని చెప్తున్నాడు ఇంత పొద్దున్నే ఎక్కడికబ్బా అని తికమక పడుతూనే గబగబా నా బ్యాగ్ సర్దుకుని పది నిమిషాల్లో అతని రూమ్లో నిల్చున్నాను. అప్పుడు బెంజి మాట్లాడుతూ, దీపు మనం ఇప్పుడు ఈ రూమ్ లు వదిలి వెళ్ళిపోవాలి. ఇక్కడికి కొద్ది దూరంలో ఒక అడవి ఉంది అక్కడ మనం ఉండడానికి ఒక చిన్న ఇల్లు ఉంది మనం అక్కడికి వెళ్తున్నాం సో,,, తొందరగా పద అని అన్నాడు.
మేము ఒక బాడుగ జీపులో ఘాట్ రోడ్ లో కొంత సేపు ప్రయాణం చేసి దట్టమైన అడవిలో ఒక గ్రామానికి చేరుకున్నాము. అక్కడ ఉన్న ఒక చిన్న దుకాణం దగ్గరకు వెళ్లి ఒక వ్యక్తిని కలిసి అతనితో కొంచెం పక్కకు వెళ్లి ఏదో మాట్లాడాడు బెంజి. ఆ తర్వాత మరి కొంత సేపటికి ఆ వ్యక్తి మా కోసం రెండు మూటలు వెనుక తగిలించుకునే విధంగా ఉన్నవి అందించాడు. మేమిద్దరం మా లగేజీతో పాటు వాటిని కూడా మోసుకుంటూ అడవిలోకి నడక ప్రారంభించాము. సుమారు మూడు కిలోమీటర్లు నడుస్తూ పోయి చిన్న చెరువు దానికి కొంచెం దూరంలో చెక్కలతో నిర్మించిన ఒక ఇల్లు ఉన్న ప్రాంతానికి చేరుకున్నాము. ఆ ఇంట్లో రెండు రూమ్ లు, ఒక వంటగది, ఒక చిన్న హాలు, బాత్రూం ఉన్నాయి. కరెంట్ సౌకర్యం కోసం పైన సోలార్ ప్యానల్ బిగించి ఉన్నాయి. ఇంత దట్టమైన అడవిలో ఇలాంటి ఒక ఇల్లు ఉంటుందని బహుశా ఎవరికీ తెలిసి ఉండకపోవచ్చు.
అంత బరువు మోస్తూ అన్ని కిలోమీటర్లు ఒకేసారి నడవడం అలవాటు లేని కారణంగా బాగా అలసిపోయిన ఫీలింగ్ కలిగింది. కానీ నాతో పాటు నడిచిన బెంజి మాత్రం ఇదేమీ పెద్ద పని కాదు అన్నట్టు చాలా కూల్ గా ఉన్నాడు. ఇక్కడ బెంజి కోసం ఒక విషయం చెప్పాలి. అతను జన్మతః భారతీయుడు కానీ ఇప్పుడు అమెరికన్ మిలటరీలో పని చేస్తున్నాడు. మేము ఆ ఇంటి దగ్గరికి చేరుకొని బ్యాగులు, మూటలు కిందికి దించి కొంచెం రిలాక్స్ అయ్యాము. అప్పటికే సాయంత్రం అయిపోవడంతో మేము మోసుకొచ్చిన మూటలలో నుంచి సామాను బయటకు తీసి ఈ పూటకి బ్రెడ్ తో కడుపు నింపుకుని రాత్రి పడుకోవడానికి ఏర్పాట్లు చేసుకున్నాము. ఈరోజుకి హ్యాపీగా పడుకో రేపటి నుంచి నీ ట్రైనింగ్ స్టార్ట్ అవుతుంది అని చెప్పాడు బెంజి.
మరుసటి రోజు నా ట్రైనింగ్ స్టార్ట్ అయింది. నా మొదటి టాస్క్ లో భాగంగా బెంజి నా చేతికి ఒక గొడ్డలి ఇచ్చాడు. నేను ఆ గొడ్డలి అందుకుని, దీంతో నేనేం చేయాలి? అని అడిగాను. .... బెంజి ఎదురుగా ఉన్న ఒక చెట్టు వైపు చూపిస్తూ, ఆ చెట్టు కనబడుతుంది కదా 45 నిమిషాలు,, సరిగ్గా 45 నిమిషాలు గడిచేసరికి ఆ చెట్టు నేల మీద ఉండాలి. తొందరగా నరకడానికి ప్రయత్నించు ఒక్క నిమిషం లేట్ అయినా సరే నీకు పనిష్మెంట్ ఉంటుంది. అర్థమైందా? అని చాలా గంభీరంగా చెప్పాడు. .... ఎస్ సర్,,, అని చెప్పి నేను ఆ చెట్టు దగ్గరకి నడిచాను. దగ్గరికి వెళ్లి చూసేసరికి నా బుర్ర గిర్రున తిరిగినట్లయింది. ఎందుకంటే దూరంనుంచి చూడటానికి చాలా మామూలుగా ఉన్నట్లు కనిపించినా దగ్గరికి వెళ్లి చూసేసరికి అది చాలా లావుగా ఉంది. 45 నిమిషాల్లో ఆ చెట్టుని నేలకూల్చడం నాకు అసాధ్యం అనే చెప్పాలి. ఒరేయ్ దీపు,,, ఈ రోజు నీ పని అయిపోయిందిరా అని మనసులోనే అనుకుని గొడ్డలితో ఆ చెట్టును నరకడం మొదలు పెట్టాను.
నేను ఒంటిలోని శక్తినంతా కూడగట్టుకుని కొంచెం వేగంగా నరకడానికి ప్రయత్నించాను. 30 నిమిషాలు గడిచేసరికి నా వళ్ళంతా చెమటతో తడిసి ముద్దయింది. మరోవైపు ఒంటిలోని శక్తి అంతా పోయి చాలా అలసటగా అనిపిస్తోంది. ఇక మీద పనిచేయడానికి అసలు ఓపిక లేనట్టు అనిపిస్తుంది. మరో వైపు చెట్టు చూస్తే ఇప్పటిదాకా సగం వరకు మాత్రమే నరకగలిగాను. నాకు నీరసంతో పాటు నిరాశ నిస్పృహ ఆవహించింది. సరిగ్గా అదే టైంలో "దీపు" అన్న రవి గాడి స్వరం వినపడింది. ఒక్కసారిగా నేను ఉలిక్కిపడి అటు ఇటు చూశాను. .... అటు ఇటు చూడ్డం మానేయ్ ఎందుకంటే నేను నీకు కనపడను కేవలం వినిపిస్తాను. ఎందుకంటే నేను నీలోనే ఉన్నాను. సరేగాని నువ్వు ఇలా నిరాశపడి నీ శక్తి మీద నమ్మకం కోల్పోవడం మంచిది కాదు. నీ మీద నీకు నమ్మకం పెరగాలి. నీలోని శక్తిని కూడగట్టుకొని అన్ని వేళలా సిద్ధంగా ఉండాలి. ముందు ముందు నువ్వు ఎదుర్కోబోయే కఠినమైన పరిస్థితుల్లో అటువంటి శక్తి నీకు అవసరం. ఎప్పటికీ నువ్వు శక్తి హీనుడివి అని నిన్ను నువ్వు తక్కువ అంచనా వేసుకోవడానికి వీలులేదు. ఇప్పుడు సరిగ్గా నీ దృష్టి కేంద్రీకరించి ఆ చెట్టు నరకడం మొదలు పెట్టు తొందరగా ఆ చెట్టు నరికి చూపించు అని వినిపించింది.
నాకు అంతా అయోమయంగా అనిపించింది. రవి ఎక్కడ కనపడటం లేదు వాడి మాట మాత్రం వినిపిస్తున్నట్లు అనిపిస్తుంది. అదెలా సాధ్యం?? నిజంగానే నాకు వాడి మాట వినపడుతుందా? లేదంటే నేనే భ్రమలో ఊహించుకుంటున్నానా? అన్న సందేహం వచ్చింది. ఏదైతేనేం రవి గాడి మాటలు నాలో నూతన ఉత్సాహాన్ని నింపాయి. నా శక్తి మీద నమ్మకం పెరిగి ఒంట్లో ఉన్న శక్తినంతా కూడగట్టుకుని మళ్లీ చెట్టు నరకడం ప్రారంభించాను. నేను చెట్టు నరుకుతూ ఉండగా సరిగ్గా మరో పదిహేను నిమిషాల తర్వాత బెంజి నా దగ్గరికి వచ్చాడు. అప్పటికి చెట్టు ఇంకా పూర్తిగా నరకలేదు ఇంకా కొంచెం మిగిలే ఉంది. కానీ బెంజి మాట్లాడుతూ, ఇక ఆపేయ్ దీపు,,, అని అనడంతో నేను నరకడం ఆపేశాను. మ్,,, పర్వాలేదు నువ్వు పాస్ అయ్యావు. నన్ను ఇంప్రెస్ చేసావు అని అన్నాడు బెంజి.
నేను అలసటతో చిన్నగా దగ్గి, కానీ మీరు చెట్టును పూర్తిగా నరకమని చెప్పారు కదా? అని అడిగాను. .... అవును చెప్పాను,, అలా ఎందుకు చెప్పానంటే రుద్ర నీ గురించి నాతో చెప్పినట్టు నీలో అంత ధైర్యం తెగువ ఉందా లేదా అని తెలుసుకోవడానికి నీకు ఈ పరీక్ష పెట్టాను. పైగా నేను కూడా నీ శక్తి గురించి తెలుసుకోవాలి కదా? ఇప్పుడు నువ్వు ఆ రెండు విషయాల్లోనూ పాస్ అయ్యావు. మరికాసేపట్లో నీకు అసలైన ట్రైనింగ్ మొదలు పెడతాను. బై ద వే,,, నీలోని ధైర్యం నాకు నచ్చింది. ఆ ధైర్యాన్ని నీలో అలానే ఉండనివ్వు, పద వెళ్దాం అని అన్నాడు బెంజి. .... మీరు పదండి నేను ఈ పని పూర్తి చేసి వస్తాను అని చెప్పడంతో బెంజి అక్కడి నుంచి వెళ్ళగా నేను మళ్ళీ చెట్టు నరకడం మొదలు పెట్టాను. కొద్ది నిమిషాల తర్వాత ఆ చెట్టు నేలకొరిగింది. ఏదో సాధించాను అన్న మంచి ఫీలింగ్ తో రూమ్ దగ్గరకు చేరుకుని ఫ్రెష్ అయ్యాను.
ఆ తర్వాత బెంజి నన్ను పిలవడంతో హాల్ లోకి వెళ్ళాను. అక్కడ ఇద్దరం ఒకరి ఎదురుగా ఒకరు కూర్చున్నాము. బెంజి మాట్లాడుతూ, చూడు దీపు నేను నీకు ఇవ్వబోయే ట్రైనింగ్ కొంచెం కష్టంగా ఉంటుంది కానీ భవిష్యత్తులో అది నీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇందులో నీకు ఫిజికల్ ట్రైనింగ్ తో పాటు టెక్నికల్ ట్రైనింగ్ కూడా ఉంటుంది. మార్షల్ ఆర్ట్స్, కిక్ బాక్సింగ్ లాంటి కొన్ని విద్యలు కూడా నేర్చుకోవలసి ఉంటుంది అవి నీకు సింగిల్ గా ఎక్కువ మందిని ఎదుర్కోవడానికి ఉపయోగపడతాయి. నీ ధైర్యసాహసాల గురించి రుద్ర చెబుతుంటే విన్నాను. రుద్ర చెప్పిన దాన్ని బట్టి చూస్తే నిన్ను ఫిజికల్ గా పూర్తిగా సన్నద్ధం చేయడానికి రెండు నెలలు పట్టొచ్చు. ఇప్పుడు నేను పెట్టిన పరీక్ష కూడా నేను స్వయంగా నీ శక్తిని అంచనా వేయడానికే పెట్టాను. నీకు మంచి బాడి ఉంది దానిని కొంచెం సానపడితే చాలు మిగిలినవి అన్నీ నేర్చుకోవడానికి పెద్ద టైం పట్టకపోవచ్చు.
దీనికి సమాంతరంగా ఈ రెండు నెలల్లో నీకు షూటింగ్ కూడా నేర్పుతాను. ఆ తర్వాత మరో రెండు నెలలపాటు నీకు టెక్నికల్ ట్రైనింగ్ ఉంటుంది. అందులో నీకు కంప్యూటర్ ఉపయోగించి ట్రేసింగ్, హ్యాకింగ్ లాంటి కొన్ని ముఖ్యమైన చాలా అవసరమైన ప్రోగ్రామ్లు నేర్పడం జరుగుతుంది. రెండు నెలల్లో అని ఎందుకంటున్నానంటే నువ్వు చాలా తెలివైన వాడివని కూడా రుద్ర చెప్పాడు. సో,, నీ తెలివితేటల విషయం మన ట్రైనింగ్ మొదలయ్యాకే తెలుస్తుంది. ఒకవేళ నువ్వు నేర్చుకోవడం కొంచెం లేట్ అయినా నువ్వు పూర్తిగా నేర్చుకునే వరకు మరికొంత సమయం పొడిగించవలసిన అవసరం రావచ్చు. సో,, ఓవరాల్ గా నాలుగు నెలల పైన ఈ ట్రైనింగ్ కార్యక్రమం నడుస్తుంది కాబట్టి నువ్వు అందుకు మానసికంగా, శారీరకంగా సిద్ధంగా ఉండాలి సరేనా? అని అన్నాడు. .... ఎస్ సర్,,, అని అన్నాను.
ఆ తర్వాత మేమిద్దరం బయటికి వచ్చాము. మా ఇంటి ముందున్న మైదాన ప్రాంతంలో మళ్లీ నాకు ట్రైనింగ్ మొదలైంది. బెంజి మాట్లాడుతూ, నీకు మార్షల్ ఆర్ట్స్ గురించి తెలుసా? అని అడిగాడు. .... ఎస్ సర్,, నేను రోజు జాగింగ్ కి వెళ్లే పార్క్ లో ఒక మాస్టర్ అక్కడ మార్షల్ ఆర్ట్స్ క్లాసులు చెప్తూ ఉంటే చూసి నేను కూడా చేయడానికి ప్రయత్నించేవాడిని. కానీ నేను సీరియస్ గా క్లాసులు అయితే నేర్చుకోలేదు. .... ఓకే వెరీ గుడ్,,, నువ్వు అక్కడ ఏం చూసావు నువ్వు ఏం నేర్చుకున్నావో ఇప్పుడు నాకు చేసి చూపించు అని అన్నాడు బెంజి. .... నేను నాకు తెలిసిన మూవ్స్, కిక్స్, జంప్స్ చేసి చూపించాను. .... వెరీ గుడ్,,, నీ బాడీ చాలా ఫ్లెక్సిబుల్ గా ఉంది నువ్వు చాలా బాగా చేస్తున్నావు కూడా, సో,, నువ్వు మార్షల్ ఆర్ట్స్ కిక్ బాక్సింగ్ వంటివి నేర్చుకోవడానికి పెద్ద సమయం పట్టకపోవచ్చు అని చెప్పి మరికొన్ని మూవ్స్ అండ్ కిక్స్ నాకు ట్రైనింగ్ ఇచ్చి వాటిని ప్రాక్టీస్ చేయమని చెప్పాడు.
చాలా సేపటి వరకు నాకు ప్రాక్టీస్ జరిగింది. ఆ తర్వాత బెంజి లోపలికి వెళ్లి నిన్న తెచ్చిన మూటలో నుంచి ఒక గన్ తీసుకొని వచ్చి, ఇప్పుడు నీకు షూటింగ్ ప్రాక్టీస్ నేర్పిస్తాను అని చెప్పాడు. ఎదురుగా కొంచెం దూరంలో నాలుగు బాటిల్స్ పెట్టి వాటిని షూట్ చేయమని చెప్పాడు. నేను గన్ ఫైర్ చేయడం మొదలు పెట్టి ఆ బాటిల్స్ కి గురి చూసి కాల్చాను. కానీ మొదటి మూడు రౌండ్లు గురి తప్పాయి. అప్పుడు బెంజి నా దగ్గరికి వచ్చి, గన్స్ గురించి వివరంగా చెబుతూ నువ్వు వాడేది ఏ గన్ అయినా సరే నువ్వు దానిని ఉపయోగించేటప్పుడు అది నిన్ను చాలా శక్తివంతంగా వెనక్కి తోస్తుంది. నువ్వు చేయవలసిందల్లా ఏమిటంటే నువ్వు కూడా అంతే శక్తివంతంగా అవి నిన్ను వెనక్కి తొయ్యకుండా దృఢంగా నిలబడి షూట్ చేయడమే. ఇప్పుడు నువ్వు సరిగ్గా ఫోకస్ పెట్టి మళ్లీ ప్రయత్నించు అని చెప్పాడు. ఈ సారి నేను సరిగ్గా స్టాండ్ తీసుకొని బెంజి సూచనల మేరకు గన్ వ్యూపాయింట్ మీద దృష్టి కేంద్రీకరించి ఒకసారి షూట్ చేశాను కానీ అది కూడా గురితప్పింది.
మళ్లీ కొంచెం సేపు ఆగి మళ్లీ గురిచూసి ప్రయత్నించాను. ఈ సారి నా గురి తప్పలేదు ఒక బాటిల్ చెల్లాచెదురు అయింది. అప్పుడు బెంజి మళ్లీ నా దగ్గరికి వచ్చి, చూడు దీపు నువ్వు షూట్ చేయడానికి ఇంత టైం తీసుకుంటే నీ ఎదురుగా ఉన్నవాడు నిన్ను షూట్ చేసి పారిపోతాడు. నువ్వు మాత్రం చేతిలో గన్ పెట్టుకొని అలాగే పడిపోవాల్సి వస్తుంది. ఇప్పుడే నువ్వు నేర్చుకోవడం మొదలు పెట్టావు కాబట్టి పర్వాలేదు. కానీ రేపు నీ ట్రైనింగ్ పూర్తి అయిన తర్వాత ఫీల్డ్ లోకి దిగినప్పుడు చాలా చురుకుగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఈ ట్రైనింగ్ లో నువ్వు ముఖ్యంగా నేర్చుకోవాల్సింది అదే. ఏం చేసినా చురుగ్గా చేయడం ఎదుటి వాడికి అవకాశం లేకుండా చేయడం చాలా అవసరం అని చెప్పాడు. ఆ తర్వాత నేను షూటింగ్ కంటిన్యూ చేస్తూ మిగిలిన మూడు బాటిల్స్ కూడా షూట్ చేసేసాను. అలా కొంతసేపు పాటు నా షూటింగ్ ట్రైనింగ్ జరిగింది.
ఆ తర్వాత బెంజి నన్ను ఒక రాతిస్తంభం దగ్గరికి తీసుకువెళ్లి పిడికిలి బిగించి ఆ రాతి స్తంభానికి బాక్సింగ్ పంచ్ లు, కాళ్లతో కిక్స్ కొట్టమని చెప్పాడు. ఇలా చేయడం ద్వారా కొంచెం నొప్పిగా అనిపించినప్పటికీ నీ చేతులు కాళ్ళు మొద్దుబారిపోయి మరింత దృఢంగా తయారవుతాయి. అప్పుడే నువ్వు నీ శత్రువు మీద సరిగ్గా దాడి చేయగలుగుతావు. కమాన్,,, నొప్పి గురించి ఆలోచించకుండా నేను చెప్పినట్టు ప్రాక్టీస్ మొదలుపెట్టు అని అన్నాడు. ఆ తర్వాత ఒక గంట పాటు నా చేతి పిడిగుద్దులు, కాళ్ల కిక్స్ తో ఆ రాతి స్తంభం మీద నా ప్రతాపం చూపించాను. చేసినప్పుడు ఉత్సాహంగా చేశాను కానీ ఆ గంట గడిచిన తర్వాత మాత్రం నా చేతులు కాళ్లు రగిడిపోయి ఎర్రగా కందిపోయాయి. సాయంత్రం అయ్యి చీకటి పడుతూ ఉండటంతో ఈ రోజుకి ఇది చాలు వెళ్లి ఫ్రెష్ అయ్యి రెస్ట్ తీసుకో అని చెప్పాడు. ఆ రోజు రాత్రి భోజనం కూడా బెంజినే వండాడు. మేము భోజనం చేసిన తర్వాత బెంజి మళ్లీ మీటింగ్ అని పిలిచాడు. నువ్వు పొద్దున్నే నాలుగు గంటలకి నిద్రలేవాలి. ప్రతి రోజు నువ్వు అదే సమయానికి నిద్రలేచి ట్రైనింగ్ స్టార్ట్ చేయవలసి ఉంటుంది. అర్థమైందా? ఇప్పుడు నువ్వు వెళ్లి పడుకోవచ్చు అని చెప్పాడు. నేను అతనికి గుడ్ నైట్ చెప్పి నా రూంలోకి వచ్చి మంచం మీద పడగానే నిద్ర కమ్ముకు వచ్చేసింది.