Episode 066.2
మరుసటి రోజు పొద్దున్న నేను నాలుగు గంటలకు లేచి తొందరగా ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చి చూసేసరికి బెంజి హాల్లో కూర్చుని నా కోసం వెయిట్ చేస్తున్నాడు. నన్ను చూసి, నువ్వు నీ జాగింగ్ సూట్ వేసుకునిరా మనం ఇప్పుడు జాగింగ్ కి వెళ్ళాలి అని చెప్పాడు. అతను చెప్పినట్టే నేను జాగింగ్ సూట్ వేసుకుని రెడీ అయ్యి మేమిద్దరం బయటికి వచ్చి జాగింగ్ మొదలు పెట్టాము. ఒక రెండు గంటల పాటు జాగింగ్ చేసిన తర్వాత మళ్లీ రూమ్ కి చేరుకున్నాము. అప్పుడు బెంజి ఇద్దరికీ జ్యూస్ తీసుకొని వచ్చాడు. ఇద్దరం జ్యూస్ తాగి కొంచెం రిలాక్స్ అయిన తర్వాత మళ్లీ బయటికి తీసుకు వచ్చి నిన్న చేసినట్టు మార్షల్ ఆర్ట్స్, కిక్ బాక్సింగ్ లాంటి వాటితో పాటు మరి కొన్ని రకాల ఎక్సర్సైజులు వంటివి చేయించాడు. మధ్యాహ్న భోజనం అయిన తర్వాత నిన్నటి లాగే షూటింగ్ ప్రాక్టీస్ చేయించి అందుకు కావలసిన చిట్కాలు కిటుకులు గురించి చెబుతూ సాయంత్రం వరకు రకరకాల పనులు చేయించాడు.
సాయంత్రం అన్ని రకాల ట్రైనింగ్ పూర్తయిన తర్వాత లోపలికి వెళ్లగానే ఎవరో డోర్ కొట్టిన చప్పుడు వినిపించింది. బెంజి వెళ్లి డోర్ ఓపెన్ చేసి బయట ఉన్న వ్యక్తులను పలకరించి వాళ్లను లోపలకి తీసుకుని వచ్చాడు. ఆ వచ్చిన వాళ్ళు సుమారు ఆరు గాడిదలు మీద పెద్ద పెద్ద మూటలు తీసుకుని వచ్చారు. బెంజి ఆ వ్యక్తులతో ఆ మూటలు అన్నింటినీ లోపల సర్దించి వాళ్లకు థాంక్స్ చెప్పి సాగనంపాడు. ఆ తర్వాత ఇద్దరం కలిసి ఆ మూటలను ఓపెన్ చేసి అందులో వచ్చిన సామాను అంతా లోపల సర్దాము. ఆ వచ్చిన వాటిలో మా ఇద్దరికీ రెండు నెలలపాటు తినడానికి సరిపోయే విధంగా బియ్యం, పప్పులు, గోధుమపిండి ఇంకా అవసరమైన తినుబండారాలు అన్ని ఉన్నాయి. అలాగే ఎక్సర్సైజ్ చేసుకోవడానికి కావలసిన ఎక్విప్మెంట్ మొత్తం ఉన్నాయి. వాటితో పాటు షూటింగ్ ప్రాక్టీస్ చేయడానికి కొన్ని రకాల గన్స్ కూడా వచ్చాయి. ఆ తర్వాత బెంజి ఆ ఎక్విప్మెంట్ ఉపయోగించి కొంతసేపు ఎక్సర్సైజులు చేయించిన తర్వాత ఇద్దరం కలిసి భోజనం వండుకుని తిని నేను తిన్నగా వెళ్ళి బెడ్ మీద పడేసరికి కళ్ళు మూతలు పడిపోయాయి.
ఇక అప్పటి నుంచి రెండు నెలలపాటు ప్రతి రోజు మా దినచర్య అలానే కొనసాగింది. రాను రాను ట్రైనింగ్ మరింత కఠినంగా మారుస్తూ నన్ను అన్ని విధాలుగా ఒక పూర్తి స్థాయి యోధుడిగా తీర్చిదిద్దాడు. అడవుల్లో దొరికే రకరకాల కందమూలాలు నాతో తినిపించాడు. అత్యవసర పరిస్థితుల్లో నన్ను నేను ఎలా రక్షించుకోవాలో నేర్పించాడు. తిండి దొరకని పరిస్థితుల్లో ఆకలికి వెరవకుండా ఎలా నిగ్రహించుకోవాలో లేదంటే అప్పటికి దొరికిన వస్తువులతో ఆకలిని తీర్చుకుంటూ శక్తిని ఎలా పెంచుకోవాలో వంటి కిటుకులు అన్ని నేర్పాడు. షూటింగ్ విషయంలో రకరకాలుగా నాకు తర్ఫీదు ఇచ్చి కళ్ళు మూసుకుని కూడా దూరంగా ఉన్న వస్తువులను చేదించే విధంగా నన్ను తీర్చిదిద్దాడు. ఇంతకుముందు కూడా నా బాడీ మంచి షేపులో ఫిట్ గా ఉన్నప్పటికీ ఇప్పుడు మరి కొంచెం కండలు తిరిగి మరింత దృఢంగా తయారైనట్లు స్పష్టంగా నాకే తెలుస్తుంది. అప్పుడప్పుడు అడవిలో తిరిగే పక్షులు చిన్న చిన్న జంతువులను వేటాడి నాన్ వెజ్ కూడా తినడంతో అలా తయారయ్యాను.
ఒక్క క్షణం కూడా వేస్ట్ చేయకుండా పక్కా టైం టేబుల్ తో శిక్షణ కొనసాగుతుండడంతో ఒక్క ఫోన్ కాల్ కూడా చేయడం కుదరలేదు. దానికి తోడు మేము ఉన్నచోట సిగ్నల్స్ కూడా లేకపోవడంతో ఫోన్ విషయమే మర్చిపోయాను. సరిగ్గా రెండున్నర నెలల తర్వాత బెంజి నన్ను పిలిచి మాట్లాడుతూ, దీపు ఈ రోజుతో నీ ట్రైనింగ్ పూర్తయింది. నేను చెప్పినవి అన్ని నువ్వు చాలా తొందరగానే నేర్చుకున్నావు. ఇకపోతే ఇంతకాలం నువ్వు నేర్చుకున్న దానిపై నిన్ను పరీక్షించాల్సి ఉంది. దాంతో నువ్వు ఎంత పర్ఫెక్ట్ గా ట్రైన్ అయ్యావు అన్న విషయం నాకు స్పష్టంగా తెలుస్తుంది. దాంతోపాటు నీ సహనశక్తి ఎంత మెరుగైందో కూడా నేను చెక్ చేస్తాను. సో,,, నువ్వు ఈ పరీక్షకి సిద్ధంగా ఉండాలి. ఇకపోతే నువ్వు నీ సామాను అంతా ప్యాక్ చేసుకో మనం ఈరోజే ముంబై బయలుదేరి వెళుతున్నాము అని చెప్పాడు. ఆ తర్వాత ఇద్దరం ఎవరి రూముల్లోకి వాళ్ళు వెళ్లి మా బ్యాగేజీ ప్యాక్ చేసుకుని అడవి దారిన నడుచుకుంటూ గ్రామానికి వచ్చి అక్కడినుంచి జీపులో సిటీకి చేరుకుని ముంబై ఫ్లైట్ ఎక్కాము.
ఈ రెండున్నర నెలల నా ట్రైనింగ్ లో చాలా కఠినమైన శిక్షణ ఇచ్చాడు బెంజి. నన్ను తన పంచ్ బ్యాగ్ లాగా మార్చుకుని నా ఒళ్ళు హూనం అయ్యేదాకా నా ఒంటితో ఆడుకునేవాడు. మొదట్లో ఒక గంటసేపు అలా కొట్టినా నేను అతని దెబ్బలను భరించి సహించడం అలవాటు చేసుకునేసరికి మరో గంట పొడిగించి రెండు గంటలపాటు నా ఒంటి మీద పంచులు కిక్కుల వర్షం కురిపించే వాడు. మొదట్లో కొంచెం కష్టంగా అనిపించినప్పటికీ రోజులు గడిచేకొద్దీ ఆ దెబ్బలకి అలవాటుపడి నాలో సహనశక్తి మరింత పెరిగింది. ఇప్పుడు నా బాడీ ఎంత బలంగా తయారైంది అంటే ఎవరైనా నన్ను కొట్టినా అది నాకు ఈకముక్కతో సమానం. ఈ రెండు నెలల్లో నన్ను అన్ని విధాలుగా దృఢంగా మార్చేశాడు బెంజి. ఇప్పుడు నా సిక్స్ ప్యాక్స్ కూడా స్పష్టంగా కనబడుతున్నాయి. నా చాతి కూడా మరింత పొంగింది. రాతి స్తంభాన్ని డీకొడుతూ ట్రైనింగ్ తీసుకోవడం వల్ల ఇప్పుడు నేను గోడలు కూడా చేతితో కొట్టి కూల్చేయగల శక్తిని సంపాదించాను.
తెల్లవారి 5 గంటల సమయానికి ముంబై ఎయిర్ పోర్ట్ లో ఫ్లైట్ ల్యాండ్ అయింది. ముంబై మహానగరం,,,, నేను ముంబై రావడం ఇదే మొదటిసారి. ఇక్కడ తెల్లవారుతూనే రోడ్ల మీద ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉంది. అదే నేను ఉండే సిటీలో అయితే ఇంకా జనాలు నిద్రలోనే ఉంటారు. కొద్దిసేపటికి మేము ఒక హోటల్ లోకి ఎంటర్ అయ్యాము. హోటల్ లో రూములు తీసుకుని సెటిల్ అయిన తర్వాత బెంజి వచ్చి, నువ్వు రూమ్ లో రెస్ట్ తీసుకో ఈరోజు రాత్రి నీకు టెస్ట్ ఉంటుంది. టెస్ట్ కి ముందు నీకు విశ్రాంతి చాలా అవసరం అవుతుంది అని చెప్పి తన రూమ్ లోకి వెళ్ళిపోయాడు. నేను నా రూంలోకి వచ్చి హ్యాపీగా పడుకున్నాను. లంచ్ టైంకి నిద్ర లేచి భోజనం చేసిన తర్వాత నా రూమ్లో కొంచెంసేపు ప్రాక్టీస్ చేసుకున్నాను. ఆ తర్వాత సాయంత్రం చేసి బెంజి నా రూంలోకి వచ్చాడు.
చూడు దీపు ఈరోజు నీకు జరగబోయే టెస్ట్ వలన నువ్వు ఏం చేయగలవు ఎంతవరకు చేయగలవు అన్న విషయం తెలుస్తుంది. అందువలన నిన్ను నువ్వు ఎప్పటికీ తక్కువ అంచనా వేసుకోవద్దు. ఈరోజు నిన్ను నువ్వు నిరూపించుకోవాల్సిన రోజు అందువలన ధైర్యంగా ముందడుగు వేయాల్సిన అవసరం ఉంది. నీ శక్తియుక్తులను ఉపయోగించి నీ సత్తా ఏంటో చాటాల్సిన తరుణం ఆసన్నమైంది. బి స్ట్రాంగ్,,, అర్థమైందా? అని అన్నాడు బెంజి. .... సరే సర్,,, అని నేను అనడంతో బెంజి తిరిగి తన రూమ్ లోకి వెళ్ళిపోయాడు. ఆరోజు రాత్రి టెస్ట్ కోసం నేను సన్నద్ధమై సిద్ధంగా ఉన్నాను. బెంజి నా రూంలోకి వచ్చి, ఆర్ యూ రెడీ దీపు??? అని అన్నాడు. .... ఎస్ సర్,,, ఐయామ్ రెడీ అని అన్నాను. .... సరే అయితే నువ్వు ఒక బాక్సర్ లోవర్ పట్టుకో దాంతో నీకు పని ఉంటుంది అని అన్నాడు. .... నేను సరే అని చెప్పి ఒక బాక్సర్ షార్ట్ పట్టుకొని నాకు తెలియని ఒక అజ్ఞాత ప్రదేశానికి బెంజితో కలిసి బయలుదేరాను.
మేము ఎక్కడికి వెళ్తున్నాము అన్న విషయం కేవలం బెంజికి మాత్రమే తెలుసు. నేను అతన్ని ఫాలో అవుతున్నాను అంతే. మేము ఒక టాక్సీలో కూర్చుని కొంతదూరం ప్రయాణించి ఒక ప్రదేశంలో దిగాము. అక్కడ కొంచెం దూరంలో రైల్వే ట్రాక్స్ కనబడుతున్నాయి. మేము అటువైపు నడుచుకొని వెళ్లి ఎవరూ లేని ఒక ప్రాంతానికి చేరుకొని ఆ రైల్వే ట్రాక్స్ పక్కనుంచి ఒక చిన్న సందు లాంటి ప్రదేశం గుండా నడుచుకొని వెళ్లి అక్కడ ఉన్న చిన్న ద్వారంలోకి వెళ్ళాము. లోపలికి వెళ్ళి చూసే సరికి నేను ఒక్కసారిగా ఆశ్చర్యపోయాను. లోపల అండర్ గ్రౌండ్ లో చాలా పెద్ద ఆడిటోరియం ప్లేస్లో చాలామంది జనాలతో నిండి ఉంది. బయట నుంచి ఏమీ తెలియలేదు గాని లోపలంతా జనాల అరుపులు కేకలతో హోరెత్తి పోతుంది. ఆ జనాల మధ్యలో నుంచి కొంచెం ముందుకు వెళ్లేసరికి మధ్యలో ఒక ఫైటింగ్ రింగ్ దాని చుట్టూ జాలీ సెట్ చేసి ఉంది. అందులో ఇద్దరు వ్యక్తులు ఫైట్ చేసుకుంటున్నారు. ఆ రింగ్ చుట్టూ నిలిచి ఉన్న జనాలు ఆ వ్యక్తుల పేర్లు పలుకుతూ అరుస్తున్నారు.
ఇంతలో బెంజి ఒక పక్కకు వెళ్లి అక్కడ ఎవరో వ్యక్తితో మాట్లాడి ఒక కాంట్రాక్టు పేపర్ పట్టుకొని నా దగ్గరకు వచ్చాడు. ఏంటి సర్ ఇది? అని అడిగాను. .... ఈరోజు నువ్వు ఇక్కడ ఫైట్ చేయబోతున్నావు. ఫైట్ చేసే సమయంలో నీకు ఏమైనా జరిగితే అందుకు పూర్తి బాధ్యత నీదే. అందుకోసమే ఈ కాంట్రాక్ట్ పేపర్, కమాన్,,, దీని మీద సంతకం చెయ్ అని అన్నాడు బెంజి. వెంటనే నేను మరోమాట మాట్లాడకుండా సంతకం చేశాను. బెంజి ఒక రూమ్ వైపు చూపించి, వెళ్లి బట్టలు మార్చుకో మరో పది నిమిషాల్లో నీ ఫైట్ స్టార్ట్ అవుతుంది అని చెప్పడంతో నేను అక్కడికి వెళ్లి బట్టలు మార్చుకుని రెడీ అయ్యాను. పది నిమిషాల తర్వాత నా పేరు అనౌన్స్ అయ్యింది. వెంటనే బెంజి నా భుజం తట్టడంతో నేను రింగ్ లోకి ఎంటర్ అయ్యాను. ఆ తర్వాత మరో ఫైటర్ కూడా వచ్చాడు. జనాలు అతన్ని చూడడంతో వెంటనే రాక్,,, రాక్,,, అంటూ పెద్ద ఎత్తున నినాదాలు మొదలుపెట్టారు. బహుశా అది అతని బిరుదు అయ్యుంటుంది.
చూడటానికి అతను మంచి బాడీతో చాలా బలంగా ఉన్నట్టు కనబడుతున్నాడు. ఇప్పుడు నేను ఫైట్ చేయాల్సింది అతనితోనే. ఒక వ్యక్తి వచ్చి మా ఇద్దరినీ పై నుంచి కింది వరకు తడిమి చూసిన తర్వాత బెల్ మోగడంతో మా ఇద్దరి మధ్య ఫైట్ మొదలైంది. ముందుగా ఆ ఫైటర్ నామీద ఎటాక్ చేసాడు. అతను ఏ మాత్రం తగ్గకుండా వరుసగా నా మీద పంచుల వర్షం కురిపించడం మొదలుపెట్టాడు. అతను పంచ్ మీద పంచ్ విసురుతుంటే నేను బ్లాక్ చేసుకుంటూ పోతున్నాను. ఇంతలో సడన్ గా అతను నా పొట్టలో ఒక పంచ్ గుద్ది వెంటనే నా మొహం మీద మరో పంచ్ గుద్దాడు. దాంతో నేను కొంచెం వెనక్కి తూలాను. ఈ మధ్యన తీసుకున్న ట్రైనింగ్ ప్రభావమో ఏమో గాని నాకు పౌరుషం పొడుచుకొచ్చింది వెంటనే ముందడుగు వేస్తూ, ఇప్పుడు నా వంతు రారా నా కొడకా అని మనస్సులోనే అనుకుంటూ ఇప్పుడు రివర్స్ లో నేనే అతని మీద పంచుల వర్షం కురిపించడం మొదలుపెట్టాను.
కానీ ఆ ఫైటర్ డిఫెన్స్ చాలా వీక్ కావడంతో ఐదే ఐదు నిమిషాల్లో నేను కొట్టిన దెబ్బలకి అక్కడ అక్కడ రక్తం కారుతూ నేల మీద పడ్డాడు. దాంతో అప్పటిదాకా అతని పేరుతో మారుమ్రోగుతున్న నినాదాలు కాస్త ఒక్కసారిగా ఆగిపోయాయి. ఇలా జరుగుతుందని అక్కడ ఉన్న వారు ఎవరు ఊహించి ఉండరు. ఆ తర్వాత ఇద్దరు వ్యక్తులు వచ్చి కిందపడిన ఆ ఫైటర్ ని బయటకు తీసుకొని వెళ్ళిపోయారు. అప్పుడు బెంజి నా దగ్గరకు వచ్చి, శభాష్ దీపు,,, చాలా బాగా చేసావు కానీ నీ టెస్ట్ అప్పుడే అయిపోలేదు అసలైన పరీక్ష ఇప్పుడే మొదలు కాబోతుంది దాన్ని కూడా సరిగ్గా పూర్తి చేయాలి సరేనా? ఆల్ ది బెస్ట్ అని చెప్పి కిందికి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత రింగ్ లోకి దాదాపు పదిహేను మంది ఫైటర్లు వచ్చారు. నేను వాళ్ళను లెక్కపెడుతూ ఒకేసారి ఇంతమందా అని అనుకున్నాను. కానీ ధైర్యం మాత్రం కోల్పోలేదు పైగా నా మొహంలో చిరునవ్వు మెరిసింది.
నేను రింగ్ లోకి వచ్చిన ఆ సమూహాన్ని చూసి మాట్లాడుతూ, హలో బాయ్స్ నేను మీ అందరికీ మూడు నిమిషాలు టైం ఇస్తున్నాను మీరు నన్ను ఎంత కొట్టుకుంటారో కొట్టుకోండి. ఆ తర్వాత కూడా నేను మిగిలి ఉంటే మీరందరూ ఖచ్చితంగా హాస్పిటల్ కి వెళ్లాల్సి ఉంటుంది అని అన్నాను. నా చాలెంజ్ వాళ్ళందరికీ కోపం తెప్పించింది. వెంటనే వాళ్ళందరూ నా మీద విరుచుకు పడ్డారు. నాలుగు పక్కల నుంచి నన్ను చుట్టుముట్టి కుమ్ముడం మొదలు పెట్టారు. నలువైపుల నుంచి నా మీద పంచుల వర్షం కురుస్తుంది. కోపంతో ఎక్కడపడితే అక్కడ పిడిగుద్దులు గుద్దుతున్నారు. నేను వాళ్లకు మూడు నిమిషాలు టైమ్ ఇచ్చాను కాబట్టి సరిగ్గా డిఫెన్స్ కూడా చేయడం లేదు. అంతలో అందులో ఇద్దరు వ్యక్తులు నన్ను లేపి పట్టుకుని ఆ రింగ్ చుట్టూ ఉన్న ఇనుప జాలీ మీదకి విసిరి పడేసారు. నేను ఆ జాలికి గుద్దుకొని కింద పడ్డాను.
అప్పుడు నాకు కొంచెం నీరసంగా అనిపించింది అయినా సరే వెనక్కి తగ్గకుండా లేచి నిల్చున్నాను. వెంటనే అందులో ఒకడు గాలిలో గిరికీలు కొడుతూ కాలితో ఒక కిక్ తన్నేసరికి నేను మళ్ళీ జాలీ మీద పడ్డాను. జాలీకి గుద్దుకొని వెనక్కి తిరిగేసరికి మరొకడు నా చాతిమీద ఒక పవర్ ఫుల్ కిక్ ఇచ్చాడు. దాంతో నేను మళ్ళీ జాలీకి గుద్దుకొని నేల మీద పడ్డాను. ఇంతలో మరొకడు వచ్చి నా పొట్టలో తన్నాడు. ఇప్పుడు నేను వాళ్ళకి ఇచ్చిన సమయం కూడా పూర్తయిపోయింది. ఇంతలో నా మదిలో రవి గాడి మాటలు వినబడ్డాయి. ఒరేయ్ నువ్వు వాళ్ళకి ఇచ్చిన టైం అయిపోయింది, చూపించిన హీరోయిజం చాలుగానీ ముందెళ్ళి వాళ్లందరినీ పడుకోబెట్టే పని చూడు అని చెప్పి ఆ వాయిస్ మళ్లీ వినపడలేదు. నేను నెమ్మదిగా నా మోకాళ్ళపై లేచి నిల్చున్నాను. ఇంతలో ఒకడు నా మొహం మీద కాలితో తన్నబోగా నేను చాలా చాకచక్యంగా వాడి కాలుని ఒడిసి పట్టుకున్నాను.
మై టైం స్టార్ట్స్ నౌ,,, మీరు హాస్పిటల్ కి వెళ్లడానికి రెడీ అయిపోండి అని చెప్పి వాడి కాలు అలాగే పట్టుకుని పైకి లేచి నిల్చుని వాడి చాతి మీద ఒక పవర్ ఫుల్ పంచ్ ఇచ్చాను. దెబ్బకి వాడు అలాగే వెనక్కి తూలుతూ వెళ్లి జాలీకి గుద్దుకొని నేల మీద పడి మళ్లీ లేవలేదు. ఆ తర్వాత మరో ఇద్దరు నా ముందుకు రాగా నేను గాల్లోకి ఎగురుతూ ఇద్దరు మొహాల పైన కాళ్లతో కిక్ లు ఇచ్చేసరికి ఇద్దరూ అక్కడే నేలకూలారు. ఆ తర్వాత వాళ్లలో మరో ఇద్దరు నా ముందుకు రాగా నేను నా పిడికిళ్ళు బిగించి ఇద్దరి గొంతుల మీద బలంగా గుద్దేసరికి వాళ్ళిద్దరూ కూడా నేలకూలారు. ఈసారి ఐదుగురు ఒకేసారి నా మీదకు వస్తూ ఉండటంతో నేను వాళ్లకు ఎదురు పరిగెత్తుకొని వెళ్లి ఒకరి మొహం మీద కాలితో తన్ని మరొకడి చాతిమీద పిడిగుద్దు గుద్దాను. మూడోవాడి కాలి మీద ఒక కిక్ ఇచ్చి వాడి పొట్టలో ఒక బలమైన పంచ్ గుద్దాను. నాలుగోవాడి ముక్కుమీద గుద్దు గుద్ది తర్వాత వాడి సెంటర్ పాయింట్ లో కాలితో గట్టిగా ఒక తన్ను తన్నాను. చివరిగా ఐదోవాడి పొట్టలో గుద్ది మొహం మీద పంచ్ విసిరేసరికి అందరూ మట్టికరిచారు.
ఆ తర్వాత మిగిలిన ఐదుగురు వైపు ఉరికి వారికి కూడా సేమ్ ట్రీట్మెంట్ ఇచ్చేసరికి తొందరగానే వాళ్లు కూడా నేలకూలారు. ఇప్పుడు రింగ్ మొత్తం వాళ్ల రక్తాలతో తడిసి ముద్దయింది. ఇప్పుడు అక్కడ పరిస్థితి ఏంటిరా అంటే చుట్టూ ఉన్న జనం అంతా నా పేరు పలుకుతూ నినాదాలు మొదలుపెట్టారు. ఇప్పుడు నేను అక్కడ ఫేమస్ అయిపోయాను. నేను చుట్టూ తిరిగి వాళ్ళ అందరి వైపు ఒకసారి చూసి రింగ్ లో నుంచి బయటికి దిగాను. బెంజి నా దగ్గరకు వచ్చి నన్ను హాగ్ చేసుకున్నాడు. వావ్,,, శభాష్ మై టైగర్,,, అదరగొట్టేసావు. నువ్వు అందరినీ ఇరగదీసి వదిలావు అని మెచ్చుకున్నాడు. ఆ తర్వాత నన్ను రూమ్ లోకి తీసుకుని వెళ్లి నాకు తగిలిన దెబ్బలను క్లీన్ చేసి నేను డ్రెస్ వేసుకున్న తర్వాత ఇద్దరం హోటల్ రూంకి చేరుకున్నాము. నేను హోటల్ రూమ్ కి వస్తూనే బాగా అలిసిపోవడంతో బెడ్ మీద పడి నిద్రపోయాను ఎందుకంటే మరుసటి రోజు మేము అమెరికాకి ప్రయాణం అవ్వాల్సి ఉంది.
మేము రుద్ర ఇంటి దగ్గర నుంచి బయలుదేరిన రోజే బెంజి నా దగ్గర పాస్పోర్ట్ తీసుకున్నాడు. దారిలో ఒక వ్యక్తిని కలిసి మా అమెరికా ప్రయాణానికి సంబంధించి టికెట్లు వీసాలు గురించి మాట్లాడి మా పాస్పోర్టులు అతని చేతికి ఇచ్చాడు. బహుశా ఈ పాటికి అన్ని సిద్ధమైపోయి ఉంటాయి. మరుసటి రోజు పొద్దున్నే లేచి అన్నీ సర్దుకుని మేము ముంబై ఎయిర్ పోర్ట్ కి చేరుకున్నాము. అక్కడ ఒక వ్యక్తి వచ్చి మా పాస్పోర్ట్ లు, ఫ్లైట్ టికెట్స్ ఇంకా ఇతర పేపర్లు బెంజికి అందించి వెళ్ళిపోయాడు. తర్వాత చెక్ ఇన్ ప్రాసెస్ అంతా పూర్తి చేసుకొని ఫ్లైట్ లో కూర్చున్నాము. ప్రయాణం కొంచెం ఎక్కువ సేపు ఉంటుంది కాబట్టి మేము శుభ్రంగా తిని పడుకున్నాము. మొత్తానికి ఒక రోజు తర్వాత అమెరికాలో అడుగు పెట్టాము. ఎయిర్ పోర్ట్ కి దగ్గర్లోనే ఉన్న ఒక హోటల్లో రూమ్ తీసుకుని రెస్ట్ తీసుకున్నాము.