Episode 076.1
నా రూమ్ నుంచి బయలుదేరి పరుగు పరుగున ఇంటికి చేరుకునే సరికి బయట అంకుల్ కార్ కనబడింది. అలాగే బయట మరొక కారు కూడా ఉంది కానీ నేను దాని మీద పెద్దగా దృష్టి పెట్టలేదు. లోపలికి వెళ్ళేసరికి అమ్మ కార్ కూడా గ్యారేజ్ బయట లాన్ లో ఉంది. నేను గబగబా పరిగెత్తుకుంటూ వెళ్లేసరికి మెయిన్ డోర్ ఓపెన్ చేసి హాల్లో లైట్స్ ఆఫ్ చేసి ఉన్నాయి. నేనున్న కంగారులో అదేమీ పట్టించుకోకుండా లోపలికి వెళ్లి అమ్మ,,,, అని పిలిచాను. కానీ ఎటువంటి రెస్పాన్స్ లేకపోవడంతో ముందుగా డోర్ తెరిచి ఉన్న అమ్మ బెడ్ రూంలోకి వెళ్ళాను. బెడ్ లాంప్ వెలుగుతుంది కానీ ఆ రూమ్ లో ఎవరూ లేరు. బయటికి వచ్చి నా బెడ్రూం లోకి వెళ్లి చూడగా అక్కడ కూడా ఎవరూ కనబడలేదు. వెంటనే ప్రీతి గుర్తుకు వచ్చి గబగబ మెట్లెక్కి పైకి వెళ్లి తన బెడ్ రూములో చూడగా అక్కడ కూడా ఎవరూ లేరు. నాకు మరి కొంచెం కంగారు పెరిగి అమ్మ,,, అమ్మ,,, అంటూ గట్టిగా పిలుస్తూ మళ్లీ మెట్లు దిగి కిందికి వచ్చాను.
ఇంతలో సడన్ గా లైట్ వెలిగింది నా వెనుక నుంచి హేహేహేహేయ్,,, అని గుంపుగా నవ్వుల గోల వినపడింది. నేను ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూసేసరికి స్టేర్ కేస్ కిందనుంచి దేవి అక్క, అభి, అను, అంకుల్, అమ్మ చివరగా ప్రీతి బయటికి వచ్చి నా చుట్టూ చేరారు. అప్పటిదాకా కంగారుగా ఉన్న నేను ఏం జరుగుతుందో తెలియక కొంచెం అయోమయానికి గురయ్యాను. అమ్మ అంకుల్ ఒక పక్కన చిరునవ్వులు చిందిస్తూ నిల్చున్నారు. మరోపక్క అభి, దేవి అక్క, అను నిల్చొని నన్నే చూస్తూ నవ్వుతున్నారు. ఇంతలో ప్రీతి నా చెయ్యి పట్టుకుని, 'టైం అయిపోతుంది ఉండండి ఇప్పుడే వచ్చేస్తాం' అంటు నన్ను పైకి లాక్కుని వెళ్ళింది. నేను కూడా అడ్డు చెప్పకుండా తన వెనకాలే మెట్లెక్కి తన రూమ్ లోకి చేరుకున్నాము. ప్రీతి కబోర్డ్ ఓపెన్ చేసి అందులో నుంచి రెండు జతల బట్టలు తీసి ఒక జత నాకు అందిస్తూ, 'గబగబ బట్టలు వేసుకో అన్నయ్య' అని చెప్పి తన ఒంటి మీద ఉన్న బనీయన్ తీసేసి తన చేతిలో ఉన్న బట్టలు వేసుకోవడం మొదలుపెట్టింది.
ఏం జరుగుతుందో నాకు ఏమీ అర్థం కాక, ఇదంతా ఏంట్రా బంగారం? అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? అని అడిగాను. .... ముందు నువ్వు బట్టలు వేసుకో,, తొందరగా,,, టైం అయిపోతుంది అని తొందర పెట్టింది. .... అవి ఒక సింపుల్ నైట్ డ్రెస్. ప్యాంటు, టీ షర్ట్ ఇద్దరికీ ఒకే రకమైనవి మాకు సరిపోయే విధంగా ఉన్నాయి. నేను అలాగే అయోమయంగానే నా బట్టలు విప్పేసి ప్రీతి ఇచ్చిన బట్టలు వేసుకున్నాను. ప్రీతి నా దగ్గరికి వచ్చి తన చేతులతో నా జుట్టు సరి చేసి మ్వ్,,, అని నా పెదవుల మీద ముద్దు పెట్టి, 'పద అందరూ మన కోసం వెయిట్ చేస్తున్నారు' అంటూ మళ్లీ నన్ను కిందికి లాక్కెళ్ళింది. మేము మెట్లు దిగుతూ కిందికి వెళుతుండగా అమ్మ కిచెన్ లో నుంచి కేక్ తీసుకొనివచ్చి హాల్లో టీటేబుల్ మీద పెట్టడం చూసి బహుశా ఈ హడావుడి అంతా న్యూ ఇయర్ సెలబ్రేషన్ అయి ఉంటుంది అనుకున్నాను. కానీ ప్రీతి నన్ను తీసుకొనివెళ్లి ఆ కేక్ ముందర నిల్చో పెట్టేసరికి ఆ కేక్ మీద ఉన్న పేరు చూసి ఆశ్చర్యపోయాను.
"హ్యాపీ బర్త్ డే టు దీపు & ప్రీతి" అని రాసి ఉండడం చూసి ఆశ్చర్యంతో ముందు ప్రీతి వైపు ఆ తర్వాత ఒక్కొక్కరిగా అందరి వైపు చూశాను. అవును జనవరి 1 నా పుట్టిన రోజు. ప్రతి సంవత్సరం మొదలవుతూనే నా పుట్టిన రోజును గుర్తు చేస్తుంది. కానీ నేను నా పుట్టినరోజు జరుపుకొని చాలా కాలం అయ్యింది. నన్ను ఇంటి నుంచి బయటకు గెంటేసిన తర్వాత ఒకసారి పార్వతి అమ్మతో కలిసి నా పుట్టినరోజు జరుపుకున్నాను. ఆ తర్వాత రవి, పవిత్ర లతో కలిసి మరోసారి జరుపుకున్నాము. ఆ తర్వాత మళ్ళీ ఇంతవరకూ నా పుట్టినరోజు గురించి పెద్దగా ఆలోచించింది కూడా లేదు. కానీ మళ్లీ ఇన్నాళ్లకు అందరూ కలిసి ఇలా నాకు సర్ప్రైజ్ ఇవ్వడం కొంచెం ఆనందంగానూ అంతకంటే ఆశ్చర్యంగానూ ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా నన్ను ఆశ్చర్య పరుస్తున్న విషయం ఏమిటంటే ఆ కేక్ మీద నా పేరుతో పాటు ఉన్న ప్రీతి పేరు. అంటే ప్రీతి పుట్టిన రోజు కూడా ఈ రోజేనా? అని నమ్మశక్యం కానట్లు ప్రీతి వైపు చూశాను.
ప్రీతి అయోమయంగా చూస్తున్న నన్ను చూసి నవ్వుతూ నీ డౌట్ నిజమే అన్నట్టు తల ఊపి నన్ను గట్టిగా కౌగిలించుకుంది. దాంతో నాకు విపరీతమైన సంతోషం కలిగింది. నేను ప్రీతిని కౌగిలించుకుని పైకి లేపి దింపి, నాతో ఈ విషయం ముందే ఎందుకు చెప్పలేదు? నువ్వు ఫోన్ చేసి కట్ చేసేసరికి ఎంత కంగారుపడ్డానో తెలుసా? అవునూ,,,, ఈ రోజు నా పుట్టిన రోజు అని మీకెలా తెలుసు? అని అడిగాను. .... ప్రీతి పకపకా నవ్వుతూ, తెలుసుకోలేక పోవడానికి అదేమైనా రాకెట్ సైన్సా? మన అమ్మ నీ కాలేజ్ ప్రిన్సిపాల్ అనే విషయం మర్చిపోయినట్టు ఉన్నావ్? అని అంది ప్రీతి. .... నా తెలివి తక్కువ తనానికి నాలుక కరుచుకుని అమ్మ వైపు చూసాను. అమ్మ చాలా ఆనందంగా నా వైపే చూస్తూ మురిసిపోతుంది. ప్రీతి పుట్టిన రోజు కూడా ఈ రోజేనా అమ్మ? అని అడగగా అమ్మ అవును అని తల ఊపేసరికి, మరి నాకు ముందే ఎందుకు చెప్పలేదు అమ్మ? అని కొంచెం నొచ్చుకున్నట్టు అడిగాను. .... అదిగో నీ మీద అలిగినట్టు నాటకమాడి నీకు సర్ప్రైజ్ ఇద్దామని నా నోరు మూయించింది దొంగ ముండ అని నవ్వింది అమ్మ.
ఇంతలో దేవి అక్క, అను మాట్లాడుతూ, మీ ముగ్గురు కలిసి తర్వాత తీరిగ్గా ముచ్చట్లు పెట్టుకోండి ఇప్పుడు టైం అవుతుంది రండి అంటూ కేక్ మీద క్యాండిల్ పెట్టి వెలిగించారు. అప్పుడే సరిగ్గా టైం 12:00 దాటడంతో అందరూ చప్పట్లు కొట్టగా అభి "హ్యాపీ న్యూ ఇయర్" అని అరిచాడు. దాంతో అందరం కలిసి "హ్యాపీ న్యూ ఇయర్" అని అరిచాము. ఆ తర్వాత ప్రీతి టేబుల్ మీద ఉన్న చాకు తీసి నా చేతిలో పెట్టి తను కూడా పట్టుకుంది. చాలా కాలం తర్వాత ఆత్మీయుల మధ్య పుట్టినరోజు జరుపుకుంటున్నందుకు కొంచెం ఉద్విగ్నతకు లోనయ్యాను. ఇంతకాలం నా పుట్టినరోజును పట్టించుకున్నవారే లేరు. ఆఆ,,, ప్రతి సంవత్సరం అమ్మ మాత్రం ముందురోజు గాని ఆ తర్వాత రోజు గాని తప్పకుండా నన్ను కాలేజ్లో విష్ చేసేది. ఆ విషయం గుర్తొచ్చి నా కళ్ళు చెమ్మగిల్లాయి. వెంటనే అమ్మ వైపు చూడగా అమ్మ కూడా చెమ్మగిల్లిన కళ్లతో నా వైపే చూస్తోంది. అంకుల్ వైపు చూడగా, 'కమాన్ మై బోయ్,,, డూ ఇట్' అంటూ నవ్వుతూ చెప్పారు.
నేను అమ్మ వైపు చూసి నా దగ్గరకు రమ్మని పిలువగా అమ్మ వచ్చి నా పక్కనే నిల్చుంది. నేను అమ్మ చెయ్యి పట్టుకొని చాకు పట్టుకున్న నా చేతి మీద వేసుకున్నాను. అదే సమయంలో ప్రీతి కూడా అంకుల్ చెయ్యి పట్టుకుని తన చేతి మీద వేసుకుంది. అభి, దేవి అక్క, అను చప్పట్లు కొడుతూ ఎంకరేజ్ చేస్తుండగా నేను ప్రీతి ముందుకు వంగి ఇద్దరం ఒకేసారి నోటితో ఊదుతూ క్యాండిల్ ఆర్పేసాము. "హ్యాపీ బర్త్ డే టూ యు,, హ్యాపీ బర్త్ డే టూ యు,, హ్యాపీ బర్త్ డే డియర్ దీపు & ప్రీతి,,, హ్యాపీ బర్త్ డే టూ యు" అంటూ అందరూ కోరస్ గా పాడగా మా నలుగురి చేతులతో కేక్ కట్ చేసి ప్రీతి నేను ఒక్కొక్క ముక్క అందుకుని ముందుగా నేను అమ్మ నోటికి అందించగా అమ్మ చాలా సంతోషంగా అందుకుంది. అలాగే ప్రీతి తన చేతిలో ఉన్న కేక్ అంకుల్ నోట్లో పెట్టింది. ఆ తర్వాత అమ్మ ఒక కేకు ముక్క అందుకని ముందుగా నా నోట్లో పెట్టి ఆ తర్వాత ప్రీతి నోట్లో పెట్టింది. ఆ తర్వాత నేను ప్రీతి ఒకరికొకరు తినిపించుకున్నాము. ఆ తర్వాత ఇద్దరం కలిసి అభి, దేవి అక్క, అను లకు కేక్ తినిపించాము.
నేను అమ్మని తీసుకుని వెళ్లి అంకుల్ పక్కన నిల్చోబెట్టి ప్రీతి వైపు చూసి ఇద్దరం కలిసి వాళ్ళిద్దరి కాళ్లకు నమస్కారం పెట్టి ఆశీర్వాదం తీసుకున్నాము. అంకుల్ మా ఇద్దరిని పైకిలేపి మా ఇద్దరి నుదిటి మీద ముద్దు పెట్టి, "గాడ్ బ్లెస్స్ యు,,, మీరిద్దరూ జీవితాంతం ఇలాగే హ్యాపీగా ఉండాలి" అంటూ మా ఇద్దరి భుజాలు తట్టారు. అమ్మ ముందుగా నా పెదవుల మీద ముద్దు పెట్టి ఆ తర్వాత ప్రీతి పెదవుల మీద కూడా ముద్దు పెట్టి, "నా బంగారాలు",,, అంటూ మురిసిపోయింది. ఆ తర్వాత అభి, దేవి అక్క మా ఇద్దరికీ హగ్గులు, షేక్ హ్యాండ్ లు ఇచ్చి విష్ చేశారు. చివరిగా అను ప్రీతిని హగ్ చేసుకుని బుగ్గ మీద ముద్దు పెట్టి విష్ చేసి నా వైపు తిరిగి చిలిపిగా నవ్వుతూ, "హ్యాపీ బర్త్ డే హీరో",,, అంటూ నన్ను హాగ్ చేసుకుని విష్ చేసింది. నేను అనుకి థాంక్స్ చెప్పి తన వైపు తేరిపార చూశాను. దాదాపు ఆరు నెలల తర్వాత చూస్తున్నందుకో ఏమో అను మరింత అందంగా కనబడుతుంది. నిజం చెప్పాలంటే ఇప్పుడు ప్రీతి కూడా కొంచెం వంటి షేపులు మారి మరింత ఆకర్షణీయంగా అందంగా కనబడుతుంది.
ఆ తర్వాత అంకుల్ తన కోటు జేబులో నుంచి రిబ్బన్ తో ముడి వేసిన తాళం తీసి అమ్మ చేతికి అందిస్తూ నాకు ఇమ్మని చెప్పారు. అమ్మ నవ్వుతూ అంకుల్ వైపు చూసి, "మీరే ఇవ్వండి" అని అనడంతో అంకుల్ ఆ తాళాలు నా చేతిలో పెట్టి, ఇది నీ కోసం బర్త్ డే గిఫ్ట్ ఎంజాయ్ మై బోయ్,,, అని అన్నారు. అది కార్ తాళం అని తెలియగానే నేను నోరెళ్ళబెట్టి ఆశ్చర్యంగా గుడ్లప్పగించి చూస్తూ ఇంత ఖరీదైన గిఫ్ట్ నాకెందుకు అన్నట్టు నేను అంకుల్ మరియు అమ్మ వైపు చూసాను. అమ్మ పర్వాలేదు తీసుకో అన్నట్టు కళ్ళతోనే చెప్పడంతో అంకుల్ మాటను కాదనలేకపోయాను. .... ఆ తర్వాత అభి కూడా తన జేబులో నుంచి మరొక తాళం తీసి దేవి అక్క చేతిలో పెట్టి నాకు ఇవ్వమని చెప్పాడు. దేవి అక్క నా దగ్గరికి వచ్చి నా బుగ్గ మీద ముద్దు పెట్టి, ఇది నీ పుట్టినరోజు గిఫ్ట్,,, నీకు ఇష్టమైన బైక్ అని చెప్పి ఆ తాళం నా చేతిలో పెట్టింది. .... ఇప్పుడు ఇవన్నీ ఎందుకు అక్క? అని అన్నాను. .... ఏం పర్వాలేదు,, ఇదేమంత పెద్దది కాదు, ఇంకేం మాట్లాడకుండా తీసుకో అని నా నోరు మూయించింది. .... అక్క మాట కాదనలేక ఆ గిఫ్ట్ స్వీకరించి, థాంక్స్ అక్క,, థాంక్స్ అభి అని అన్నాను.
గిఫ్ట్స్ అన్ని నాకే ఇచ్చారు కానీ ప్రీతికి ఏమి ఇవ్వకపోవడంతో, అదేంటి గిఫ్ట్స్ అన్ని నాకేనా? నా బంగారానికి ఏమి ఇవ్వరా? అని అన్నాను. .... ప్రీతి నన్ను కౌగలించుకుని, అవును అన్నయ్య నాకు కావాల్సిన గిఫ్ట్ ఎవరు ఇవ్వలేదు అని అంది. .... అంకుల్ మాట్లాడుతూ, నువ్వు ఈరోజే మేజర్ అయ్యావు. నువ్వు ముందు డ్రైవింగ్ నేర్చుకుని లైసెన్స్ వచ్చిన తర్వాతే నీకు కావలసిన స్కూటీ నీకు దొరుకుతుంది అని అన్నారు. .... అది విని అందరూ నవ్వడంతో నేను ప్రీతిని బుజ్జగిస్తూ, డోంట్ వర్రీ బంగారం ఒక నెల రోజుల్లో నీకు డ్రైవింగ్ నేర్పించి లైసెన్స్ వచ్చేలా చేసి నీకు కావలసిన స్కూటీ నేను కొనిపెడతాను అని అన్నాను. .... థాంక్యూ అన్నయ్య,,, యు ఆర్ మై లవ్లీ బ్రదర్,,,, అంటూ నాకు ఒక మూతి ముద్దు ఇచ్చి అంకుల్ మరియు అమ్మ వైపు చూసి, మీరేమీ నాకు ఇవ్వవలసిన అవసరం లేదు నాకు మా అన్నయ్య కొనిపెడతాడు అని వెక్కిరించింది. ఓ అయిదు నిమిషాల పాటు అందరితో సరదాగా గడిచిన తర్వాత అంకుల్ మాట్లాడుతూ, సరే నాకు టైం అవుతుంది అక్కడ అందరూ నా కోసం వెయిట్ చేస్తూ ఉంటారు నేను బయలుదేరుతాను "ఎంజాయ్ యువర్ టైం" అని చెప్పి బయలుదేరారు.
అంకుల్ కార్ బయల్దేరి వెళ్లిపోగా అభి, దేవి అక్క, అను కూడా ఆఫీస్ లో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఉన్నాయి మమ్మల్ని కూడా రమ్మనగా అమ్మ వద్దనడంతో మనం మళ్ళీ మరొక రోజు కలుద్దాం అని చెప్పి బయల్దేరారు. ఇందాక నేను బయట చూసిన మరో కారు అభిదే అన్నమాట. మేమందరం వారిని సాగనంపటానికి బయటికి రాగా అమ్మ అభితో మాట్లాడుతూ, ప్రీతి దేవితో మాట్లాడుతూ ముందు నడుస్తూ ఉంటే అను నాతోపాటు నడుస్తూ, మరి పార్టీ ఎప్పుడు ఇస్తున్నావు హీరో, చిన్న కేకు ముక్కతో సరిపెట్టేద్దాం అంటే కుదరదు అని అడిగింది. .... ఇక్కడ ఇలా జరుగుతుందని నాకు కూడా తెలీదు కదా ఇంకోసారి ఎప్పుడైనా బయటికి వెళ్దాం నీ ఇష్టం అని అన్నాను. ఆ తర్వాత వాళ్లు ముగ్గురు వెళ్లిపోయిన తర్వాత అమ్మ ప్రీతి కలిసి నన్ను గ్యారేజ్ దగ్గరకు తీసుకుని వెళ్లారు. అక్కడ అంకుల్ నా కోసం తీసుకున్న రిబ్బన్ కట్టి ఉన్న లేటెస్ట్ మోడల్ టాటా సఫారీ కార్ ఉంది. దాని పక్కనే అభి, దేవి అక్క ఇచ్చిన గిఫ్ట్ స్పెండర్ ప్లస్ బైక్ ఉంది.
అది చూడగానే ఇది ఖచ్చితంగా అను ఛాయిస్ అయి ఉంటుంది అని నవ్వుకున్నాను. ఎందుకంటే ఇదివరకు అను నేను కలిసి మాట్లాడుకున్నప్పుడు నాకు స్ప్లెండర్ ప్లస్ బైక్ అంటే ఇష్టమని తనతో చెప్పిన విషయం గుర్తొచ్చింది. నేను ప్రీతి కలిసి కార్ కి ఉన్న రిబ్బన్ కట్ చేసి రిమోట్ తో లాక్ ఓపెన్ చేసి నేను డ్రైవింగ్ సీట్లో కూర్చోగా ప్రీతి అమ్మ నా పక్కన సీట్లో కూర్చున్నారు. నేను ఒకసారి కార్ స్టార్ట్ చేసి కొంచెం ముందుకు తీసుకువెళ్లి ఆపేశాను. ఆ తర్వాత ప్రీతితో మాట్లాడుతూ, బంగారం ఇది మన ఇద్దరి కారు. ఎలాగూ ఈ కారు ఇక్కడే ఉంటుంది కాబట్టి నీకు కావలసినప్పుడు నువ్వు నాకు కావాల్సినప్పుడు నేను వాడుకుందాం అని అన్నాను. .... థాంక్యూ అన్నయ్య,,, కానీ నువ్వు లేకుండా కార్ నాకెందుకు? ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్లాలంటే ఇద్దరం కలిసి వెళ్దాం అని అంది. .... ఆ తర్వాత ముగ్గురం కిందికి దిగి బైక్ దగ్గరికి వెళ్లి అది కూడా స్టార్ట్ చేసి ముగ్గురం దాని మీద కూర్చున్నాము. నేను అలా ముందుకు తీసుకు వెళ్లి గేట్ బయట రోడ్డు మీద రెండు నిమిషాలపాటు తిప్పి మళ్లీ లోపలికి తీసుకు వచ్చి పార్క్ చేసి ఇంట్లోకి వెళ్ళాము. అమ్మ కిచెన్ లోకి వెళ్లి వెనుక వైపు డోర్ దగ్గర్నుంచి పిలవడంతో హరి, రాము కిచెన్ లోకి వచ్చారు. వాళ్ళిద్దర్నీ హాల్లోకి పిలిచి మా చేతులతో కేక్ ఇప్పించింది. వాళ్లు ఇద్దరూ సంతోషంగా తీసుకుని మమ్మల్ని ఇద్దరినీ విష్ చేశారు. నేను డ్రైవర్ హరితో మాట్లాడుతూ, హరి అంకుల్ రేపటి నుంచి మన బంగారం కాలేజ్ నుంచి వచ్చిన తర్వాత డ్రైవింగ్ నేర్పించడం మీ పని అని అన్నాను. .... తప్పకుండా బాబు పదిరోజుల్లో చిన్నమ్మ గారు కార్ నడిపిస్తారు చూడండి అని అన్నాడు. ఆ తర్వాత వాళ్ళిద్దరూ వెళ్ళిపోగా మేము ముగ్గురం సోఫాలో కూర్చున్నాము.
అమ్మకి అటువైపు కూర్చున్న ప్రీతిని చెయ్యి పట్టుకుని లేపి నా ఒళ్ళో కూర్చోబెట్టుకుని, నువ్వు అలా ఫోన్ చేసి నన్ను కంగారు పెట్టి ఫోన్ కట్ చేసేస్తే ఎలారా బంగారం? ఏమైందో ఏంటో అని ఎంత టెన్షన్ పడుతూ వచ్చానో తెలుసా? అని అడిగాను. .... ప్రీతి నా మెడ చుట్టూ చేతులు వేసి నా బుగ్గ మీద ముద్దు పెట్టి, సారీ అన్నయ్య,,, కానీ అలా చేయకపోతే నువ్వు తొందరగా వచ్చే వాడివా? అప్పుడు నీకు ఇలా సర్ప్రైజ్ ఇవ్వడం కుదురుతుందా? అందుకే అలా చేశాను అని అంది. .... ఇంకెప్పుడూ మీ విషయంలో ఇలాంటి ప్రాంక్స్ చెయ్యొద్దు. మీకు ఏమైనా జరుగుతుంది అన్న ఊహకే నాకు టెన్షన్ గా ఉంటుంది. నా బంగారానికి ఏమైనా జరిగితే ఈ అన్నయ్య తట్టుకోలేడు అని అన్నాను. .... సారీ,,సారీ,, ఇంకెప్పుడు ఇలా చెయ్యను అని నా పెదవుల మీద ముద్దు పెట్టి, అయినా నేను ఇప్పుడు నీతో మాట్లాడకూడదు. ప్రతిరోజు కాల్ చేసి మాట్లాడతాను అని చెప్పి ఒక్క రోజు కూడా చేయలేదు అంటూ బుంగ మూతి పెట్టింది.