Episode 078.2


వాళ్ళిద్దరితో మాట్లాడినందుకు నాకు సంతోషంగా అనిపించింది. పప్పీ అల్లరి మాటలకు నాలో నేనే నవ్వుకున్నాను. ఇంతలో హరిత అక్క గుర్తొచ్చింది. నేను తిరిగి వచ్చిన తర్వాత ఇప్పటివరకు అక్కకి కాల్ చేసి నేను వచ్చాను అన్న విషయం చెప్పలేదు అందుకే వెంటనే అక్కకి కాల్ చేశాను. ఒక నాలుగైదు రింగులు అయిన తర్వాత కాల్ లిఫ్ట్ చేసి, హలో తమ్ముడు,,, ఎలా ఉన్నావురా? ఇన్ని రోజులకి గుర్తొచ్చిందా అక్క? నేను చాలాసార్లు నీ ఫోన్ ట్రై చేశాను కానీ ఎప్పుడూ అందుబాటులో లేదు అని వస్తుంది. ఇంతకీ నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావు? నీ ఆరోగ్యం ఎలా ఉంది? అంటూ ఆపకుండా వరుసగా ప్రశ్నల మీద ప్రశ్నలు కురిపిస్తోంది. .... అక్క,,,అక్క,,, ఆగు ఆగు,, నేను తిరిగి వచ్చేసాను. నేను వచ్చి నాలుగు రోజులు అవుతుంది కానీ పనుల్లో పడి నీకు కాల్ చేయడం లేట్ అయింది అంతే. ఎలా ఉన్నావు? ఊర్లోనే ఉన్నావా బయటికి ఎక్కడికైనా వెళ్లావా? అని అడిగాను. .... న్యూ ఇయర్ కదా నాలుగు రోజుల నుంచి అవుట్ డోర్ బుకింగ్స్ తో బిజీగా ఉన్నాను. ఈరోజు పొద్దున్నే వచ్చి తినేసి పడుకున్నాను. .... అయితే సరే నువ్వు పడుకొని రెస్ట్ తీసుకో నేను తర్వాత మాట్లాడుతాలే అని అన్నాను. .... అయితే ఒక పని చేస్తాను నాకు ఎలాగూ రేపు ఇంకేమీ పనులు లేవు సాయంత్రం నేను నీ దగ్గరికి వచ్చేస్తాను సరేనా? అని అంది అక్క. .... సరే అక్క సాయంత్రం నా రూమ్ కి వచ్చేయ్ అప్పుడు మాట్లాడుకుందాం అని బాయ్ చెప్పి ఫోన్ కట్ చేశాను.

అప్పటికి టైం దాదాపు 11:30 అవుతుండడంతో అమ్మ, చిట్టి బంగారం ఇద్దరు వచ్చిన తర్వాత కలిసి వెళ్దాములే అని కొంచెం బద్ధకంగా ఉండడంతో అలాగే సోఫాలో వాలి పడుకున్నాను. ఎప్పుడు నిద్ర పట్టిందో తెలియదుగానీ అమ్మ చేతి స్పర్స నా నుదిటి మీద తగలగానే మత్తుగా కళ్ళు తెరిచి చూశాను. ఏంటి నాన్న ఇది,,, భోజనం చేయకుండా పడుకున్నావేంటి? తినేసి పడుకోవచ్చుగా అని అమ్మ ప్రేమగా నా తల నిమురుతూ అడుగుతోంది. .... అమ్మని చూడగానే మత్తు వదిలేసింది. చిన్నగా నవ్వుతూ, నీతో కలిసి తిందామని అలా నడుము వాల్చాను కానీ బాగా నిద్ర పట్టేసింది అని చెప్పాను. .... సరే లేచి మొహం కడుక్కునిరా భోజనం చేద్దాం అని చెప్పింది అమ్మ. .... నేను లేచి నా రూమ్ బాత్రూం లోకి వెళ్లి మొహం కడుక్కుని ఫ్రెష్ అయి బయటికి వచ్చాను. ఇంతలో అమ్మ డైనింగ్ టేబుల్ దగ్గర భోజనం వడ్డించి రెడీగా ఉంది. ఇద్దరం కూర్చుని మాట్లాడుకుంటూ భోజనం చేసాము.

ఆ తర్వాత సోఫాలో అమ్మ ఒడిలో తల పెట్టుకొని పడుకోగా, నిన్న బాగా ఎంజాయ్ చేసావా? అని నవ్వుతూ అడిగింది అమ్మ. .... మ్,,, బాగానే ఎంజాయ్ చేశాను. అరుణ కూడా సర్ప్రైజ్ అయింది. కానీ నిన్న నేను నీ దగ్గర ఉండకుండా వెళ్లిపోయినందుకు సారీ అమ్మ అని అన్నాను. .... చుప్,,, నువ్వు నాకు సారీ చెప్పడం ఏంటి? నీ సంతోషమే నా సంతోషం. నీకు ఎప్పుడు కావాలన్నా ఈ అమ్మ నీకోసమే ఉంది. కానీ మిగిలిన వారితో అలా కుదరదు కదా? కాలం ఎప్పుడూ ఒకేలా ఉండకపోవచ్చు కానీ నిన్ను ప్రేమించే వాళ్ళని వీలైనంతవరకూ సంతోషంగా చూసుకోవడం నీ బాధ్యత. ఇంతకీ నీ పుష్ప వదిన దగ్గరికి ఎప్పుడు వెళ్తున్నావు? అని నవ్వుతూ ఆటపట్టించింది అమ్మ. .... ఈరోజు పొద్దున అరుణతో కలిసి కేఫ్ కి వెళ్లి పుష్ప వదినను కలిశాను అంటూ నిన్న నేను వెళ్లిన దగ్గర్నుంచి తిరిగి ఇంటికి వచ్చే వరకు జరిగిన విషయాన్ని అమ్మతో చెప్పాను. .... అమ్మ నవ్వుతూ, అయితే నీ అకౌంట్లోని అమ్మాయిలు అందరిని కలిపే పనిలో పడ్డావన్నమాట అని సరదాగా అంది అమ్మ.

అలా ఏమీ అనుకోలేదు ఏదో అరుణ అడిగింది కదా అని వాళ్ళిద్దర్నీ కలిపాను. అరుణ నిన్ను కూడా కలుస్తానని అంటుంది నువ్వేమంటావు? అని అడిగాను. .... నీ ఇష్టం నాన్న నాకేమీ అభ్యంతరం లేదు అని అంది. .... సరేలే ఇంకెప్పుడైనా వీలు చూసుకుని కలుద్దాంలే, అవును చెప్పడం మర్చిపోయాను ఈరోజు రాత్రికి హరిత అక్క రూమ్ కీ వస్తానంది అని అమ్మతో చెప్పాను. .... సరే అయితే తను వచ్చిన తర్వాత నాకు ఒకసారి ఫోన్ చెయ్ తనతో మాట్లాడి చాలా రోజులు అయింది అని అంది అమ్మ. .... కాసేపు అలా మాట్లాడుకుంటూ కూర్చునేసరికి ప్రీతి కాలేజ్ నుంచి వచ్చేసింది. హాయ్ అన్నయ్య,,, అంటూ వచ్చి నాకు, అమ్మకి ఒక మూతి ముద్దు ఇచ్చి అమ్మ పక్కన కూర్చుని వాటేసుకుంది. .... ఈరోజు నుంచి నీ డ్రైవింగ్ క్లాసులు మొదలు పెట్టమని హరి అంకుల్ తో చెప్పాను కదా వెళ్లి రెడీ అయ్యి రా అని అన్నాను. .... అవును నాకు గుర్తుంది ఇప్పుడే ఫ్రెష్ అయ్యి వచ్చేస్తాను అని తన బ్యాగ్ పట్టుకొని మెట్ల వైపు నడిచింది ప్రీతి.

అమ్మ సరదాగా వెక్కిరిస్తూ, కొంపతీసి ఇది రోజూ వేసుకునే ఆ జారిపోయే బనియన్, ఎందుకూ పనికిరాని ప్యాంటి వేసుకుని వచ్చేస్తుందేమో సరిగ్గా డ్రస్ చేసుకోమని చెప్పు నీ చెల్లికి అని నవ్వుతూ వెటకారంగా అంది. .... ప్రీతి వెంటనే వెనక్కి తిరిగి, నువ్వేమీ నా డ్రెస్ ని వెక్కిరించవలసిన పని లేదు. ఎప్పుడు ఎలా డ్రెస్ చేసుకోవాలో నాకు తెలుసు. అట్టే మాట్లాడితే అసలు డ్రెస్ వేసుకోకుండా న్యూడ్ గా వెళ్లి నేర్చుకుంటాను అని స్వీట్ వార్నింగ్ ఇచ్చి నాలుక బయట పెట్టి అమ్మను వెక్కిరిస్తూ మెట్లెక్కి పైకి వెళ్ళిపోయింది. ప్రీతి మాటలు విని అమ్మ నేను నవ్వుకున్నాము. ఆ తర్వాత కొంత సేపటికి ప్రీతి లెగ్గిన్స్, టీ షర్ట్ వేసుకుని చాలా నీట్ గా తయారై వచ్చింది. అది చూసి అమ్మ మాట్లాడుతూ, హమ్మయ్య బతికించిందిరా బాబు అని నవ్వడంతో ప్రీతి పరిగెత్తుకుంటూ వచ్చి అమ్మ మెడ పట్టుకుని మీద పడి కలబడింది. ఇద్దరి మధ్య కొద్ది నిమిషాల పాటు సరదాగా నడిచిన క్యాట్ ఫైట్ చూసి ఎంజాయ్ చేశాను.

ఆ తర్వాత అమ్మ లేచి కిచెన్ లోకి వెళ్లి స్నాక్స్,టి పట్టుకొని రాగా ముగ్గురం కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ తాగేసాము. ఆ తర్వాత నేను లేచి డ్రైవర్ హరి అంకుల్ ని పిలిచి ప్రీతికి డ్రైవింగ్ క్లాస్ మొదలు పెట్టమని నా కారు తాళం అందించాను. .... అది చూసి అమ్మ మాట్లాడుతూ, అది కొత్త కారు కదా నాన్నా ఇది ఎక్కడైనా గుద్దేసింది అంటే అనవసరంగా చెడిపోతుంది నా కార్ తీసుకొని వెళ్ళి నేర్పించమని చెప్పు అని అంది. .... ఏం పర్వాలేదు అమ్మ హరి అంకుల్ పక్కనే ఉంటారు కదా,, మీరు బయలుదేరండి అని వాళ్ళిద్దర్నీ పంపించాను. వాళ్ళు కార్ తీసుకొని రోడ్డు మీదకు వెళ్లే వరకు చూసి తిరిగి లోపలికి వచ్చి కూర్చున్నాము. ఒక గంటన్నర సమయం గడిచాక వాళ్ళిద్దరు తిరిగి వచ్చి ప్రీతి తన ఎక్స్పీరియన్స్ చెబుతుంటే విని ఆనందించి, ఇక నేను వెళ్తాను అమ్మ మళ్లీ శనివారం రాత్రికి వస్తాను అని అమ్మతో చెప్పి ఇద్దరికీ ముద్దులు పెట్టి బైక్ మీద నా రూమ్ కి బయలుదేరి వెళ్లాను.

నా రూమ్ కి చేరుకుని రూమ్ అంతా క్లీన్ చేసుకుని స్నానం చేసి రాత్రికి అక్క వస్తుంది కాబట్టి ఇద్దరికీ భోజనం ప్రిపేర్ చేసే పని మొదలు పెట్టాను. అన్నం కుక్కర్ పెట్టి మరోపక్క పప్పు పొయ్యి మీద పెట్టి పప్పు లోకి టమాటాలు కట్ చేసి పెట్టి బంగాళదుంపలు ఫ్రై చేద్దామని కట్ చేస్తూ ఉండగా రూమ్ డోర్ తెరిచి ఉంచడంతో హరిత అక్క సైలెంట్ గా లోపలికి వచ్చి నన్ను వెనక నుంచి కౌగలించుకుని వీపు మీద ముద్దు పెట్టి, "హ్యాపీ న్యూ ఇయర్ రా తమ్ముడు" అని అంది. .... సీరియస్ గా పని చేసుకుంటున్న నేను ఒక్కసారిగా అక్క పిలుపు వినబడడంతో ఉలిక్కిపడి వెనక్కి తిరిగాను. అక్క చక్కగా ఒక సిల్క్ చీర కట్టుకొని జబ్బలు లేని జాకెట్ వేసుకుని చాలా బాగా ముస్తాబై వచ్చింది. హాయ్ అక్క,,, హ్యాపీ న్యూ ఇయర్ అని నుదిటి మీద ముద్దు పెట్టి కౌగిలించుకున్నాను. .... అక్క నాకు దూరంగా జరిగి కేవలం ఒంటి మీద షార్ట్ వేసుకుని ఉన్న నన్ను పై నుంచి కింది వరకు చూసి, బలే బాగున్నావ్ రా తమ్ముడు. అచ్చం ఇంగ్లీష్ సినిమా హీరోలాగా బాడీ పెంచావు అని అంది.

నేను అక్క వైపు చూసి నవ్వి మళ్లీ వెనక్కి తిరిగి నా పనిలో పడ్డాను. .... అక్క తన హ్యాండ్ బ్యాగ్ టేబుల్ మీద పెట్టి, ఏం చేస్తున్నావురా అంటూ నా దగ్గరికి వచ్చి నువ్వు తప్పుకో నేను చేస్తాను అని అంది. .... అంతా అయిపోయిందిలే అక్క జస్ట్ ఈ బంగాళ దుంపలు వేపేస్తే మొత్తం పని అయిపోతుంది. నువ్వు అలా కూర్చుని కబుర్లు చెప్పు చాలు అని అన్నాను. .... అక్క నా నడుం చుట్టు చెయ్యి వేసి నా పక్కన నిల్చుని, ఎన్ని రోజులు అయిందిరా నిన్ను చూసి, పొద్దున నువ్వు ఫోన్ చేయగానే వచ్చేద్దాం అనిపించింది కానీ పొద్దున్నే వచ్చి పడుకున్నాను మళ్లీ తయారై రావడానికి చాలా టైం పడుతుంది అని ఇప్పుడు వచ్చాను. ఇప్పుడు నీ ఆరోగ్యం ఎలా ఉందిరా? అప్పుడు అయిన గాయాలు ఏమి మళ్లీ నిన్ను ఇబ్బంది పెట్టలేదు కదా? అని అడిగి నా ఒంటి మీద దాదాపు మటుమాయమైపోతున్న పాత గాయాల గుర్తులను తడిమింది. .... అవన్నీ ఎప్పుడో తగ్గిపోయాయి అక్క. ఇప్పుడు నీ తమ్ముడు ఫుల్ ఫిట్ గా ఉన్నాడు చూస్తే కనబడడం లేదా? అని నవ్వుతూ అన్నాను.

చూడటానికి బాగానే ఉన్నావురా కానీ నిన్ను తలుచుకుంటే నాకు నీ ఒంటి మీద గాయాలే గుర్తొస్తున్నాయి. నిజంగా నువ్వు గాయాలతో ఉన్నప్పుడు నీ దగ్గరికి వచ్చి చూడలేకపోయాను కానీ నీ గురించి అనుకుంటే మాత్రం నా కళ్ళకి నువ్వు గాయాలతో ఉన్న దృశ్యమే కనిపిస్తుంది. సరేలే ఇంకేంటి సంగతులు? ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్లావు? నిన్ను చూస్తుంటే ఎక్కడో బాగా కసరత్తులు చేసి బాడీ పెంచుకుని రావడానికి వెళ్ళినట్లు తెలుస్తుంది. నేను చెప్పింది నిజమేనా? అని అడిగింది. .... అబ్బో,,, మా అక్క చాలా తెలివైంది, నన్ను చూడగానే ఇట్టే కనిపెట్టేసింది అని నవ్వాను. .... అన్ని తెలివితేటలే ఉంటే నా బతుకు ఇలా ఎందుకు ఏడుస్తుంది? ఏదో నువ్వు నన్ను సంతోషపెట్టడానికి అంటున్నావులే అని అంది అక్క. .... లేదక్క నువ్వు చెప్పింది నిజమే. ఒక చిన్న ట్రైనింగ్ పనిమీద వెళ్ళొచ్చాను. నా సంగతి సరే నీ సంగతి ఏంటి? అంతా బాగుందా? ఏమి ప్రాబ్లం లేదు కదా? అని అడిగాను.

అందం, ఒంట్లో శక్తి ఉండాలే గాని నాలాంటి లంజలకి దేనికీ డోకా ఉండదు అని నవ్వేసి, అంతా బాగానే ఉంది కార్తీక మాసం పిక్నిక్ సీజన్ మొదలైన దగ్గర్నుంచి అవుట్ డోర్ బుకింగ్స్ ఎక్కువగా ఉన్నాయి. ఇదిగో ఈ న్యూ ఇయర్ హంగామా ముగిసింది కదా ఈ రోజు కొంచెం ఖాళీ దొరికింది. మళ్లీ రేపటి నుంచి పండగ సీజన్ ముగిసే వరకు ఫుల్ బుకింగ్స్ ఉన్నాయి. డబ్బుకి లోటు లేదు ఈమధ్య బాగానే వెనకేసాను కూడా పర్వాలేదు అంతా బాగానే జరిగిపోతుంది అని చెప్పింది. సమాజం చిన్నచూపు చూసే వృత్తిలో ఉండి కూడా అక్క తన జీవితం కోసం తన శరీరాన్ని పెట్టుబడిగా పెట్టి కష్టపడి జీవిస్తూ ఉన్నంతలో సంతోషంగా బతకడానికి తాను చేసే ప్రయత్నం చాలా అభినందనీయం. ఎవరి మీదా ఆధారపడకుండా, తన జీవితం ఇలా ఉన్నందుకు ఎవరిని నిందించకుండా తనకు చేతనైన, తనకు నచ్చిన వృత్తిలో ధైర్యంగా ముందుకు వెళ్తున్న అక్క నుంచి చాలా నేర్చుకోవచ్చు.

Next page: Episode 078.3
Previous page: Episode 078.1