Episode 082.2


ఆరోజు మధ్యాహ్నం కీర్తి వదిన ఇచ్చిన అడ్రస్ కి బయలుదేరాను. అది సిటీలో బిజీగా ఉండే బిజినెస్ ఏరియా. అడ్రస్ ప్రకారం చూస్తే అది ఒక బట్టల షోరూమ్. చాలా కాస్ట్లీ బట్టలు అమ్మే షోరూమ్ కావడంతో ఎప్పుడూ ఖాళీగానే ఉన్నట్టు కనబడుతుంది. మధ్యాహ్నం టైం కావడంతో రోడ్లు చాలా ఖాళీగా ఉన్నాయి జనసంచారం కూడా చాలా తక్కువగానే ఉంది. నేను ఆ షోరూమ్ లోకి వెళ్లి రిసెప్షనిస్ట్ ని కలిశాను. నా వివరాలు చెప్పగానే ఆ అమ్మాయి కొంచెం లోపలికి ఉన్న చేంజ్ రూమ్ దగ్గరకు తీసుకుని వెళ్ళింది. ఆ అమ్మాయి చాలా అందంగా నాజూగ్గా ఒక మోడల్ లాగా ఉంది. మోకాళ్ళ వరకు ఉండే ఒక ఆఫీసు సూట్ లో నడుము అటూ ఇటూ ఊపుతూ చాలా వయ్యారంగా నడుస్తుంది. చేంజ్ రూమ్ లోపలికి తీసుకొని వెళ్లి అక్కడ సీక్రెట్ గా ఉన్న ఒక బటన్ నొక్కింది. దాంతో అక్కడ ఉన్న మిర్రర్ డోర్ పక్కకు జరిగి లోపలికి దారి కనపడింది. ఆ అమ్మాయి మాట్లాడుతూ, లోపలికి వెళితే రైట్ సైడ్ లిఫ్టు ఉంటుంది. G2 బటన్ నొక్కితే మీరు చేరవలసిన చోటికి చేరుకుంటారు అని చెప్పింది.

ఇదంతా పాతకాలం గూడచారి సినిమాలలో చూపించినట్టు చాలా గమ్మత్తుగా అనిపిస్తుంది. ఆ అమ్మాయి చెప్పినట్టే నేను లోపలికి వెళ్ళగానే ఆ మిర్రర్ డోర్ క్లోజ్ అయిపోయింది. లోపలికి అడుగులు వేస్తూ వెళ్లి రైట్ సైడ్ కనబడిన లిఫ్ట్ ముందర ఆగి బటన్ నొక్కాను. లిఫ్ట్ వచ్చి డోర్ తెరుచుకోగానే లోపలికి వెళ్లి G2 బటన్ నొక్కాను. అది ఒక ఫ్లోర్ కి తీసుకొని వెళ్ళి ఆగింది. నేను బయటికి వచ్చి చూడగా అక్కడ మరో రిసెప్షన్ ఉంది. నేను అక్కడికి వెళ్ళగానే అక్కడ ఉన్న అమ్మాయి నన్ను చూసి, వెల్కమ్ దీపు,,, నాతో రండి అని చెప్పి నిశ్శబ్దంగా ఉన్న ఒక కారిడార్లో నుంచి నడుచుకుంటూ ముందుకు తీసుకువెళ్లి ఒక ఆఫీసు రూము ముందు ఆగి బయట ఉన్న ఇంటర్కంలో నుంచి మాట్లాడి డోర్ ఓపెన్ చేసి, చీఫ్ మీ కోసం వెయిట్ చేస్తున్నారు లోపలకి వెళ్ళండి అని చెప్పింది. ఆమె చెప్పినట్టే నేను లోపలికి వెళ్ళగా ఆమె బయటే ఉండిపోయింది.

ఆ రూమ్ లో ఒక యాభై ఏళ్ల దృఢంగా ఉన్న వ్యక్తి సీట్లో కూర్చుని కంప్యూటర్లో ఏదో చూస్తున్నాడు. నేను లోపలికి ఎంటర్ అవడం చూసి, కమాన్ మిస్టర్ దీపు అంటూ లేచి నాకు షేక్ హాండ్ ఇచ్చి కూర్చోమని అతనికి ఎదురుగా ఉన్న చైర్ చూపించాడు. .... హలో సర్,,, అని పలకరించి ఆయన ఎదురుగా ఉన్న చైర్ లో కూర్చున్నాను. .... సో ఫైనల్లీ యు ఆర్ హియర్,,,, ఆ రోజు ఫోన్ లో నీతో మాట్లాడింది నేనే. కీర్తి నీ గురించి అన్ని విషయాలు చెప్పింది. నువ్వు పంపించిన ఐడి నాకు చేరింది. మా ఇన్వెస్టిగేషన్లో అది ఫేక్ ఐడి అని తేలింది. సో నిన్ను ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ లోకి తీసుకోవాలని డిసైడ్ అయ్యాం. కానీ ఇక్కడ విధుల్లోకి చేరడానికి మినిమమ్ డిగ్రీ క్వాలిఫికేషన్ అవసరం. కానీ నీకు అది లేకపోవడంతో డైరెక్ట్ గా రిక్రూట్ చేసుకునే అవకాశం లేదు. కాకపోతే మేము నిన్ను ప్రైవేట్ గా హయర్ చేసుకునే ఫెసిలిటీ మాకు ఉంది. నువ్వు ఇక్కడ పర్మినెంట్ ఎంప్లాయి కాకపోయినా మాకు ఇన్ఫార్మర్ గా పని చేయొచ్చు.

అంటే అనఫిషియల్ గా మేము నిన్ను వాడుకోవచ్చు. సాధారణంగా ఇక్కడ రిక్రూట్ అయిన వాళ్ళకి మేమే మిషన్ ఇచ్చి రంగంలోకి పంపిస్తూ ఉంటాము. కానీ నీది ఒక స్పెషల్ కేస్. నువ్వే మా దగ్గరికి వస్తూ వస్తూ ఒక మిషన్ తెచ్చుకున్నావు. ఎలాగూ నువ్వు ఇక్కడ అనఫిషియల్ కాబట్టి నువ్వు అదే కేస్ డీల్ చేసేలా నీకు అవకాశం ఇస్తున్నాను. నువ్వు రుద్ర కోసం పని చేస్తున్నట్టే కంటిన్యూ అవ్వు. అలా చేస్తేనే రుద్ర ఇదంతా నీతో ఎందుకు చేయిస్తున్నాడో తెలుసుకోగలుగుతాం. ఎందుకంటే మా ఇన్వెస్టిగేషన్ ప్రకారం ఇంతవరకు రుద్ర మీద ఎటువంటి నెగిటివ్ రిమార్క్స్ లేవు. అతను కూడా కొత్త ఐపీఎస్ ఆఫీసర్. కొత్తగా జాయిన్ అయిన ఆఫీసర్ కావడంతో అతని ట్రాక్ రికార్డు బాగానే ఉంది. కానీ ఇంత తొందరగా ఒక అండర్ కవర్ ని ఏర్పాటు చేసుకుని సీక్రెట్ మిషన్ నడపాల్సిన అవసరం ఏంటో తెలియడం లేదు. అంతేకాకుండా నీకు సీక్రెట్ గా ట్రైనింగ్ ఇప్పించడం కూడా జరిగింది. ఇది కొద్దిగా అనుమానం కలిగించే విషయం.

నీ అదృష్టం బాగుండి నువ్వు కీర్తిని కలవడం జరిగింది. ఒకప్పుడు ఆమె ఇక్కడ టాప్ మోస్ట్ ఏజెంట్. ఆమెపై ఉన్న నమ్మకంతో ఆమె రికమండ్ చేయడం వల్లనే నిన్ను హయర్ చేసుకోవడానికి ఒప్పుకున్నాను. లేదంటే సీక్రెట్ గా నిన్ను అబ్జర్వ్ చేసి ఆ తర్వాత మా దగ్గర ట్రైనింగ్ ఇప్పించి నీకు మిషన్ ఎలాట్ చేసేవాళ్ళం. కానీ నువ్వు ఆల్రెడీ బ్లాక్ కమెండో లెవెల్ ట్రైనింగ్ తీసుకున్నావని తెలియడంతో నిన్ను నా ఏజెంట్ గా గుర్తిస్తున్నాను. సో,, నువ్వు రుద్ర చెప్పినట్టే ఫాలో అవుతూ అతని కోసమే పని చేస్తున్నట్టు కలరింగ్ ఇస్తూ ఇక్కడ మన డిపార్ట్మెంట్ కోసం పని చేయాలి. ఈ మిషన్లో నీకు కావలసిన పూర్తి సహకారం మన డిపార్ట్మెంట్ నుంచి ఉంటుంది. ఇదిగో ఇది నీ అఫీషియల్ ఐడి అంటూ నాకు ఒక ఐడి కార్డ్ ఇచ్చారు. .... నేను ఆ ఐడి కార్డు అందుకుని, థాంక్యు వెరీ మచ్ సార్,,,, ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. మీ నమ్మకాన్ని వమ్ము చేయను. ఎప్పటికప్పుడు జరిగేది అంతా మీకు ఇన్ఫామ్ చేస్తాను. థాంక్స్ ఫర్ బిలీవింగ్ మీ అని అన్నాను.

కంగ్రాచ్యులేషన్స్ యంగ్ మేన్,,,, మాకున్న అలవాటు ప్రకారం నీ గురించి ఎంక్వయిరీ కూడా జరిగింది. నీ కాండక్ట్ కూడా చాలా బాగుంది. ఇదివరకు జరిగిన నీ సాహసాల గురించి కూడా తెలుసుకున్నాను. ఐ యాం వెరీ ఇంప్రెసివ్. ఇకనుంచి నువ్వు నా ఏజెంటువి. ఎప్పుడు నీకు ఏది కావలసిన అది వెపన్స్ కానీ, మేన్ పవర్ గాని ఏదైనా సరే నాకు కాల్ చేస్తే నేను ఏర్పాటు చేస్తాను. మన డిపార్ట్మెంట్ నుంచి నీకు తగినంత ఆర్థిక సహాయం కూడా ఎప్పటికప్పుడు అందుతుంది. ఇకపోతే నీ అవసరానికి ఉపయోగించుకోవడానికి ఈ ల్యాప్టాప్ మరియు ఫోన్ నీకు ఇస్తున్నాను. ఈ ఫోన్ పూర్తిగా ఎన్క్రిప్ట్ చేయబడింది. ఇది మన డిపార్ట్మెంట్ తో మాట్లాడటానికి మాత్రమే ఉపయోగపడుతుంది. దీనిని కాల్ ట్రాప్ చేయడం ఎవరి వల్ల కాదు. అంతేకాకుండా నువ్వు ఏదైనా సమస్యలో చిక్కుకుంటే మేము నిన్ను ట్రేస్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. చివరిగా ఇది నీ కిట్ అంటూ ఒక సూట్కేస్ అందించారు.

నేను పైకి లేచి వాటిని అందుకున్నాను. చీఫ్ కూడా నాతోపాటు లేచి నా దగ్గరకు వచ్చి భుజం తట్టి షేక్ హ్యాండ్ ఇస్తూ, ఆల్ ద బెస్ట్,,,, ధైర్యంగా పని చెయ్. నీలాంటి సాహసవంతులు, సమాజం కోసం తపన పడే వ్యక్తులు మన దేశానికి చాలా అవసరం. ఈరోజు ఇక్కడ మొదలైన నీ ప్రయాణం నిన్ను ఉన్నత స్థితికి చేరేలా చేయాలని కోరుకుంటున్నాను. సమయం వచ్చినప్పుడు భవిష్యత్తులో నువ్వు ఈ డిపార్ట్మెంట్లో అఫీషియల్ ఏజెంట్ గా చూడాలని కోరుకుంటున్నాను అని ప్రోత్సహించారు. .... థాంక్యూ వెరీమచ్ సర్,,,, వీలైనంత తొందరగా ఈ మిషన్ మొదలు పెడతాను. నావల్ల డిపార్ట్మెంట్ కి ఎటువంటి చెడ్డపేరు రాకుండా చూసుకోవడానికి ప్రయత్నిస్తాను అని చెప్పి చీఫ్ కి ఒక సెల్యూట్ కొట్టి అక్కడి నుంచి బయటకు వచ్చాను. వెళ్లిన మార్గంలోనే మళ్లీ వెనక్కి వస్తూ ఆ బట్టల షోరూమ్ లో నుంచి బయటికి వచ్చాను. నేరుగా నా రూమ్ కి చేరుకొని ఆ సూట్ కేస్ ఓపెన్ చేసి చూడగా ఒక లేటెస్ట్ టెక్నాలజీ గన్, నైఫ్, ఒక ఫోల్డింగ్ నైఫ్, మాస్క్, వాచ్, ఒక చిన్న తాడు ఇంకా కావలసిన చిన్న చిన్న ఐటమ్స్ ఉన్నాయి.

సూట్ కేస్ క్లోజ్ చేసి జాగ్రత్తగా పెట్టాను. సాయంత్రం భోజనానికి వంట చేసుకుంటూ ఉండగా రుద్ర దగ్గర్నుంచి ఫోన్ వచ్చింది. కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడగా స్నైపర్ గన్ రెడీగా ఉంది వచ్చి పట్టుకుని వెళ్ళమని చెప్పాడు. నేను వంట పని పూర్తి చేసి వెంటనే రుద్ర ఇంటికి బయలుదేరాను. రుద్ర నా కోసమే వెయిట్ చేస్తూ హాల్ లో కూర్చున్నాడు. నేను లోపలికి వెళ్ళగానే లేచి విష్ చేసి ఒక సూట్ కేస్ అందించాడు.నేను అది ఓపెన్ చేసి చూడగా నాలుగు భాగాలుగా విడదీసి ఉన్న స్నైపర్ గన్ కనపడింది. రుద్ర వాటిని తీసి జోడించి పూర్తి గన్ సిద్ధం చేసి చూపించాడు. నేను దానిని అందుకుని ఒకసారి చెక్ చేసుకుని మళ్లీ దాన్ని విడదీసి సూట్ కేస్ లో సర్దాను. రుద్ర మరో ప్యాకెట్ నా చేతికి అందించాడు. ఆ ప్యాకెట్ ఏంటని అడగగా అందులో 20 లక్షలు డబ్బు ఉందని ప్రతి చిన్న విషయానికి నా కోసం చూడకుండా నీ అవసరం మేరకు వాడుకోమని చెప్పాడు. ఆ తర్వాత నేను రుద్రకి బాయ్ చెప్పి అక్కడినుంచి బయలుదేరి రూముకి వచ్చేసాను.

భోజనం చేసి బెడ్ మీద పడుకుని తర్వాత చేయవలసిన కార్యక్రమాలు గురించి ప్లాన్ చేసుకుని నిద్రపోయాను. మరుసటి రోజు పొద్దున్న 10 గంటల సమయానికి పార్వతి అమ్మ ఇంటికి వెళ్లాను. ఇంటి వెనుక అవుట్ హౌస్ లో ఉన్న పని మనిషి ముత్యాలమ్మ మామ్మని కలిసి తాళాలు తీసుకుని నా రూమ్ లో ఉన్న రుద్ర మరియు ఏజెన్సీ ఇచ్చిన మొత్తం వెపన్స్ తీసుకొచ్చి పార్వతి అమ్మ బెడ్రూం లోకి తీసుకుని వెళ్లి లాకర్ ఓపెన్ చేసి అందులో సర్ది పెట్టాను. ఆ సామానంతా నా రూమ్ లో ఉండడం సేఫ్ కాదు అనిపించి ఇలా సెట్ చేశాను. తర్వాత కింద ఫ్లోర్ లో ఉన్న రూములు అన్ని చెక్ చేసి ఎలా వాడుకోవాలో ప్లాన్ చేసుకుని బయటికి వచ్చి లాక్ చేసి ఒక తాళం చెవి నా దగ్గర పెట్టుకొని మరొకటి మామ్మకి ఇచ్చేసి తిరిగి నా రూమ్ కి వచ్చాను. ముందుగా పార్వతి అమ్మ ఇంట్లోని రెండు రూములను నాకు కావలసిన విధంగా తయారు చేయించాలి. అందుకు ఎవరిని సంప్రదిస్తే బాగుంటుంది అని ఆలోచించగా నాకు వీర్రాజు అన్న గుర్తొచ్చాడు.

Next page: Episode 082.3
Previous page: Episode 082.1