Episode 084
ఏవండీ,,, ఏవండీ,,, అన్న వదిన పిలుపు వినబడటంతో నాకు మెలుకువ వచ్చింది. కళ్ళు తెరిచి చూస్తే వదిన వీర్రాజు అన్నను నిద్ర లేపుతుంది. టైం చూడగా 7:00 అయ్యింది. అప్పటికే వదిన చీర కట్టుకొని తయారయి ఉంది. అన్న నిద్ర లేవగానే వదిన మాట్లాడుతూ, ఎవరో మీ ఫ్రెండ్ వచ్చారు కింద వెయిట్ చేస్తున్నారు అని చెప్పింది. .... సరే నేను ఇప్పుడే వస్తాను నువ్వు వెళ్ళి టీ ఏర్పాటు చెయ్ అని చెప్పి అన్న బాత్రూం లోకి వెళ్ళాడు. .... వదిన నావైపు చూసి, నువ్వు కూడా లేచి తయారై రా టీ పెట్టేస్తాను అని చెప్పి కిందకి వెళ్ళిపోయింది. అన్న ఫ్రెష్ అయ్యి వచ్చిన తర్వాత నేను బాత్రూం లోకి వెళ్లి ఫ్రెష్ అయ్యి బట్టలు వేసుకుని కిందికి వెళ్లేసరికి వదిన అందరికీ టీ ఇచ్చింది. టీ తాగిన తర్వాత ఆంటీకి, బుడ్డోడికి, వదినకి బాయ్ చెప్పి మేము ముగ్గురం అక్కడినుంచి బయలుదేరి నా ఏరియాకి చేరుకున్నాము.
పార్వతి అమ్మ ఇంటిలోకి తీసుకుని వెళ్లి నేను అనుకున్న రెండు రూములు చూపించి నాకు కావలసిన మార్పుల గురించి అతనికి చెప్పాను. అతను అంతా చూసుకుని జిమ్ గా మార్చవలసిన రూమ్ కి కొంత సివిల్ వర్క్ కూడా అవుతుంది అందుకు అవసరమైన మార్పుల గురించి చెప్పాడు. ఇకపోతే సౌండ్ ప్రూఫ్ గా మార్చవలసిన రూమ్ చూసి ఆ పని చేయడానికి తనకు తెలిసిన ఒక ఎక్స్పర్ట్ ఉన్నాడని అతనితో మాట్లాడి పని మొదలు పెట్టిస్తాను అని చెప్పాడు. మొత్తం అంతా లెక్కలు వేసి సుమారుగా ఐదు నుంచి ఐదున్నర లక్షల వరకు ఖర్చు అవుతుందని అంచనా వేసాడు. నేను అందుకు సరే అని చెప్పి ముందుగా ఒక లక్ష రూపాయలు అడ్వాన్స్ అతనికి ఇచ్చాను. జిమ్ కి సంబంధించిన రూమ్ పనులు రేపటి నుంచి మొదలు పెట్టేస్తాను అని అతను మాటిచ్చాడు. ఇక్కడ జరిగే పని అంతా ఎటువంటి హడావుడి లేకుండా కామ్ గా జరిగిపోవాలి అని అతనికి చెప్పి అవుట్ హౌస్ లో ఉన్న మామ్మని పిలిచి రేపటి నుండి ఇక్కడ కొంచెం పనులు జరుగుతాయి వాళ్లకు కావాల్సిన టి, టిఫిన్లు సంగతి చూసుకోమని చెప్పాను. అందుకు మామ్మ సరే అని చెప్పిన తర్వాత బయటికి వచ్చి అన్నకి నా రూమ్ చూపించిన తర్వాత, ఏం పర్వాలేదు దీపు అంతా సవ్యంగానే జరిగిపోతుంది ఒక వేళ ఏదైనా అవసరమైతే నాకు ఫోన్ చెయ్ నేను వస్తాను అని చెప్పి వీర్రాజు అన్న అతనితో కలిసి వెళ్లిపోయాడు.
నేను నా రూం కి వెళ్లి తయారయ్యి ఇంటికి వెళ్ళాను. అమ్మ, ప్రీతి నా కోసమే వెయిట్ చేస్తూ కూర్చున్నారు. అంకుల్ ఏదో పని ఉండడంతో తొందరగానే టిఫిన్ చేసి వెళ్ళిపోయారు. ముగ్గురం కలిసి కూర్చుని టిఫిన్ చేసి ప్రీతి రూమ్ లో సెటిల్ అయ్యాము. ఇచ్చిన మాట ప్రకారం ఆరోజు సాయంత్రం వరకు ప్రీతితో మాత్రమే గడిపాను. కొంతసేపు కంప్యూటర్లో గేమ్స్ ఆడుకున్న తర్వాత ప్రీతి మాట్లాడుతూ, అన్నయ్య నాకు డ్రైవింగ్ పూర్తిగా వచ్చేసింది ఇప్పుడు ట్రాఫిక్ లో కూడా బాగా డ్రైవ్ చేయగలుగుతున్నాను అని సంతోషంగా చెప్పింది. .... ఓకే,,, అయితే నీకు డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలి అన్నమాట అని అన్నాను. .... పద అన్నయ్య నా డ్రైవింగ్ చూద్దువు గాని అని చెప్పి ప్రీతి బట్టలు వేసుకొని రెడీ అయింది. ఇద్దరం కిందికి దిగి డ్రైవ్ కి బయల్దేరాము. ప్రీతి చాలా చక్కగా డ్రైవ్ చేస్తుంది కొంతసేపు ఆ చుట్టుపక్కల ఏరియాలన్ని తిరిగి అలా సిటీలో కొంచెం ట్రాఫిక్ ఉన్న ఏరియాలో కూడా తిరిగి ఇంటికి చేరుకున్నాము.
భోజనాలు చేసిన తర్వాత కొంచెం సేపు పడుకొని సాయంత్రం ఇద్దరం కలిసి షటిల్ ఆడుతూ ఎంజాయ్ చేసాము. రాత్రికి అంకుల్ వచ్చిన తర్వాత అందరం సరదాగా కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ భోజనాలు ముగించి హాల్ లో కూర్చున్నాము. అంకుల్ తో ప్రీతి డ్రైవింగ్ స్కిల్స్ గురించి మాట్లాడి లైసెన్స్ తీసుకునే ఏర్పాటు చేస్తాను అని చెప్పాను. అంకుల్ ప్రీతికి కంగ్రాట్స్ చెప్పి ఓకే అని తన రూమ్ లోకి వెళ్ళిపోయారు. ఇచ్చిన మాట ప్రకారం ఈ రోజంతా ప్రీతితోనే ఉన్నందుకు పిచ్చ హ్యాపీ అయిపోయింది. అమ్మ నా రూమ్ లోకి రావడానికి ఇంకా సమయం ఉంది కాబట్టి అలా బయటికి వెళ్లి ఐస్ క్రీమ్ తినేసి వద్దాం అని ప్రీతి అడగడంతో కాదనలేక ఇద్దరం కలిసి కార్ లో బయలుదేరాము. ఐస్ క్రీమ్ పార్లర్ కు వెళ్లి ఐస్ క్రీమ్ తినేసి అమ్మ కోసం కూడా ఐస్ క్రీమ్ ప్యాక్ చేయించుకుని తిరిగి ఇంటికి చేరుకున్నాము. మేము ఇంటికి చేరుకునే సరికి అమ్మ మా కోసం బయట గార్డెన్ లో వెయిట్ చేస్తుంది.
చెప్పా చేయకుండా ఎక్కడికి వెళ్ళిపోయారు కనీసం ఫోన్ కూడా పట్టుకొని వెళ్లలేదు అని కసిరింది అమ్మ. ప్రీతి అమ్మ మీద పడి కౌగిలించుకుని ఉక్కిరిబిక్కిరి చేసేస్తూ, నీకోసమే ఐస్ క్రీమ్ తీసుకొని రావడానికి వెళ్ళాం అని చెప్పి లోపలికి నడిపించుకుంటూ వెళ్ళిపోయింది. నేను కూడా వెనకాల లోపలికి వెళ్లిన తర్వాత ప్రీతి అమ్మకి ఐస్క్రీం ఇచ్చి, ఇదిగో ఇది తింటూ ఈ నైట్ బాగా ఎంజాయ్ చెయ్ అని కొంచెం వెటకారంగా చెప్పి అమ్మకి ముద్దు పెట్టి గుడ్ నైట్ అన్నయ్య అని చెప్పి నాకు కూడా ముద్దు పెట్టి మేడమీదకి బయలుదేరింది. అమ్మ నవ్వుకుంటూ దొంగముండకి అస్సలు సిగ్గులేదు అని నా చెయ్యి పట్టుకొని రూమ్ లోకి నడిచింది. ఆ రోజు రాత్రి అమ్మతో బాగా ఎంజాయ్ చేసి హాయిగా అమ్మ కౌగిట్లో పడుకున్నాను. ఆ మరుసటి రోజు నుంచి రూముల పని మొదలవడంతో అక్కడ కావలసిన ఏర్పాట్లు చూసుకుంటూ బయట నా పనులు చక్కబెట్టుకుంటూ మరో రెండు వారాలు చాలా తొందరగా గడిచిపోయాయి. నాకు డ్రైవింగ్ నేర్పిన అన్నతో మాట్లాడి ప్రీతికి లైసెన్స్ చేయించగలిగాను. రూములు కూడా నాకు కావలసిన విధంగా సిద్ధమైపోయాయి.
ఇక నేను యాక్షన్ లోకి దిగే సమయం ఆసన్నమైంది. ఒక రోజు రాత్రి భోజనం చేసి పార్వతి అమ్మ ఇంట్లోకి వెళ్లి నాకు కావలసిన సామాన్లు, వెపన్స్ అన్ని ఒక బ్యాక్ ప్యాక్ లో సర్దుకుని నా ఫస్ట్ మిషన్ పూర్తి చేయడానికి బయల్దేరాను. రాత్రి 10 గంటలు దాటిన తర్వాత సిటీ శివార్లలో గల ఒక బిల్డింగ్ దగ్గరకు చేరుకున్నాను. రుద్ర చెప్పినట్లు అది ఒక అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్న బిల్డింగ్. కానీ అక్కడ ఎటువంటి ఆక్టివిటీ లేకుండా చాలా కాలం నుంచి దాని పనులు మధ్యలోనే ఆపేసినట్టు స్పష్టంగా తెలుస్తుంది. ఇంతకుముందు నేను రెక్కీ నిర్వహించినపుడు చూసిన విధంగానే ఆ బిల్డింగ్ రూఫ్ మీద ఒకడు పహారా కాస్తున్నాడు. నేను నా బండిని ఆ బిల్డింగ్ కి కొంచెం దూరంగా పొదలమాటున పార్క్ చేసి నా బ్యాగ్ లో నుంచి స్నైపర్ గన్ తీసి సిద్ధం చేసి పొదలమాటున పొంచి గురిచూసి ట్రిగ్గర్ నొక్కాను. దాంతో ఆ బిల్డింగ్ పైన పహారా కాస్తున్నవాడు చప్పుడు చేయకుండా కుప్పకూలాడు.
ఆ తర్వాత నేను స్నైపర్ ను ముందు ఎంట్రన్స్ దగ్గర కాపలా కాస్తున్న ఇద్దరు మనుషుల వైపు గురిపెట్టాను. ఆ ఇద్దరు వ్యక్తులు రెండు పక్కల వ్యతిరేకంగా నిల్చుని కాపలా కాస్తున్నారు. ముందుగా నేను ఒకడిని గురిచూసి ట్రిగ్గర్ నొక్కగా వాడు నేలకూలాడు నేను వెంటనే లేట్ చేయకుండా మిగిలిన వాడిని కూడా షూట్ చేసి ఎంట్రన్స్ క్లియర్ చేసుకున్నాను. ఆ తర్వాత స్నైపర్ గన్ విడదీసి బ్యాగ్లో సర్దేసి బండితో పాటు ఎవరికీ కనబడకుండా పొదలమాటున దాచి గన్ కి సైలెన్సర్ బిగించి ముందుకు అడుగులు వేశాను. ఎంట్రన్స్ లోకి వెళ్లి అక్కడ పడి ఉన్న ఇద్దరిని చెక్ చేసి పై ఫ్లోర్ లోకి వెళ్లాను. ఇంతలో పై నుంచి ఎవరో మెట్లు దిగుతున్న శబ్దం వినపడింది. వెంటనే నేను ఆ వచ్చే వారికి కనబడకుండా దాక్కున్నాను. పై నుండి ఒక వ్యక్తి మెట్లు దిగుతూ కిందికి వచ్చాడు వెంటనే నేను వాడిని గన్ తో షూట్ చేసి పడేసాను. ఆ తర్వాత ముందుకు కదిలి రెండవ ఫ్లోర్ లోకి వెళ్ళాను అక్కడ అంతా ఖాళీగా ఉంది. ఆ తర్వాత మూడో ఫ్లోర్లో కు చేరుకునే సరికి మరో ఇద్దరు కనబడ్డారు.
కానీ అక్కడ గన్ యూజ్ చేయడం సరికాదు అనిపించి గన్ నా వెనుక ప్యాంట్లో దోపుకుని వాళ్ళ వైపు ఉరికాను. ముందుగా ఒకడి నెత్తి మీద పిడిగుద్దు గుద్ది మరొకడి పీక పట్టుకుని గోడకేసి నొక్కాను. వాడి మొహం మీద ఆగకుండా పంచ్ లు గుద్దే సరికి వాడి మొహం పచ్చడై అక్కడే నెలకూలాడు. ఆ తర్వాత పిడిగుద్దుతో దిమ్మతిరిగి తల పట్టుకుని కూర్చున్నవాడి దగ్గరకు వెళ్లి వాడి తల పట్టుకుని పక్కకు తిప్పి మెడ విరిచే సరికి అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. ఆ తర్వాత నేను నాలుగవ ఫ్లోర్ కి చేరుకున్నాను. అక్కడే నాకు కావలసిన వాడు ఉన్నాడు. అక్కడ వాడి కోసం అన్ని హంగులతో ఒక రూమ్ నిర్మించబడి ఉంది నేను ఆ రూం దగ్గరికి వెళ్లి బయట నించున్నాను. లోపల్నుంచి ఒక అమ్మాయి అరుపులు వినబడుతున్నాయి. వద్దు ప్లీజ్,, నన్ను వదిలేయండి నన్ను ఇక్కడి నుంచి వెళ్ళనీయండి. .... అలా ఎలా వదిలేస్తాను? మీ బాబుని డబ్బులు అడిగితే ఇవ్వలేదు అందుకు బదులుగా ఇప్పుడు నేను నీతో మజా చేసుకుంటాను, అంతేకాదు నా మనుషుల్ని కూడా నీమీదకి వదులుతాను అప్పుడు ఈ రాణాగాడు అంటే ఏమిటో నీ బాబుకి బాగా అర్దమౌతుంది అని గట్టిగా నవ్వాడు.
ప్లీజ్,,, అలా చేయొద్దు నీకు చేతులెత్తి దండం పెడతాను నన్నేం చెయ్యొద్దు. ఎవరైనా నన్ను రక్షించండి ప్లీజ్,,, ప్లీజ్ హెల్ప్ చేయండి,,, ప్లీజ్ హెల్ప్,,, అని గట్టిగా అరుస్తుంది. ఆ మాట వినగానే నేను కాలితో డోర్స్ ని లాగిపెట్టి తన్నాను. డోర్స్ తెరుచుకోగానే లోపల రాణా మరియు వాడి ముగ్గురు మనుషులు ఒక అమ్మాయిని రేప్ చేయడానికి ప్రయత్నిస్తూ కనపడ్డారు. అందులో ఒకడు ఆ అమ్మాయి భుజాల నొక్కి పట్టుకోగా మిగిలిన ఇద్దరూ ఆ అమ్మాయికి ఇరువైపులా చెరో కాలు పట్టుకొని ఉన్నారు. రాణా ఆ అమ్మాయికి ఎదురుగా నిల్చుని ప్యాంట్ విప్పే ప్రయత్నంలో ఉన్నాడు. కానీ డోర్ విరిగిన శబ్దంతో వాడు వెనక్కి తిరిగాడు. అలా తిరిగినప్పుడు వాడు కొంచెం పక్కకు జరగడంతో నాకు ఆ అమ్మాయి మొహం కనబడింది. ఆ మొహం చూడగానే నా కళ్లు ఎర్రబడి నిప్పులు కురిశాయి. ఆ అమ్మాయి మరెవరో కాదు పవిత్ర. వెంటనే నేను చాలా వేగంగా గన్ తీసి పవిత్రని పట్టుకున్న ముగ్గురిని షూట్ చేసి పడేసాను దాంతో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు వదిలేశారు.
కానీ ఆ రాణా గాడు తక్కువోడు కాదు వాడు కూడా అంతే వేగంగా వాడి గన్ తీసి నన్ను షూట్ చేశాడు. అది గమనించి నేను తప్పుకునే సమయానికి బుల్లెట్ నా ఎడమ భుజంలోకి దిగిపోయి నా చేతిలో ఉన్న గన్ జారి కింద పడింది. రాణా మాట్లాడుతూ, ఏంట్రా నీ యబ్బ నువ్వు మళ్లీ వచ్చావా? ఆరోజంటే ఎలాగో బతికి బయటపడ్డావు కానీ ఈ రోజు మాత్రం నువ్వు తప్పించుకోలేవు అని అన్నాడు. .... నీయబ్బ,,, నువ్వు నన్నేమి పీకలేవురా. ఆరోజు ఎవరో ముక్కు మొహం తెలియని అమ్మాయి కోసం నిన్ను నీ మనుషుల్ని కుక్కని కొట్టినట్టు కొట్టాను అలాంటిది ఈ రోజు నా చెల్లెలు జోలికి వచ్చావు ఇక నీ పరిస్థితి ఏంటో నీ ఊహకే వదిలేస్తున్నాను. నీకు శాశ్వతంగా గుర్తుండిపోయేలా ఉంటుంది ట్రీట్మెంట్ అని అన్నాను. .... అయితే రారా చూసుకుందాం అంటూ రాణాగాడు తన గన్ నా వైపు ఎక్కుపెట్టి ట్రిగ్గర్ నొక్కాడు.
కానీ ఈ సారి నేను అందుకు సిద్ధంగా ఉండటంతో కిందకు వంగి బుల్లెట్ నుంచి తప్పించుకుని ముందుకు పల్టీ కొట్టి వాడి దగ్గరకు చేరుకుని గన్ ఉన్న వాడి చేతిని పట్టుకుని నా వీపు వాడి వైపు ఉండేలా తిరిగి మోచేయితో వాడి మొహం మీద ఒక్కటి గుద్దే సరికి వాడి చేతిలో ఉన్న గన్ జారిపడగా వాడు వెనక్కి పడిపోయాడు. ఆ తర్వాత వాడు వెంటనే పైకి లేచి నాకు ఒక పంచ్ ఇవ్వడంతో నేను కొంచెం వెనక్కి తూలాను. మరోపక్క ఇదంతా చూస్తున్న పవిత్ర భయంతో వణుకుతోంది. ఇక్కడ నేను రాణాగాడి మొహం మీద ఒక బలమైన పంచ్ గుద్ది వాడిని రెండు చేతులతో ఎత్తి పట్టుకుని దబ్బున నేలకేసి కొట్టాను. వాడు నేల మీద పడి విలవిలలాడుతూ కూడా మళ్లీ పైకి లేచే ప్రయత్నం చేస్తున్నాడు. నేను వాడి దగ్గరికి వెళ్లి వాడి మొహం మీద కాలితో తన్నేసరికి మరో పల్టీ కొట్టి వెల్లకిలా పడ్డాడు. నేను వెళ్లి వాడి ఛాతి మీద కూర్చుని పిడికిలి బిగించి వాడి మొహం మీద వరుసపెట్టి పిడి గుద్దులు కురిపించాను.
ఇక్కడ నేను నా పూర్తి బలాన్ని ఉపయోగించి కసితీరా వాడి మొహం మీద పిడిగుద్దులు గుద్దుతూ ఉంటే కాస్త భయం నుంచి తేరుకున్న పవిత్ర తనను తాను సంభాళించుకుని నా వైపు అడుగులు వేస్తూ వచ్చింది. నేను మాత్రం వాడిని కొట్టడం ఆపకుండా, నీ యబ్బ,,,, నా కుటుంబాన్నే బెదిరించి డబ్బులు డిమాండ్ చేసేంత పెద్ద రౌడీవారా నువ్వు. నా చెల్లెలితో అసభ్యంగా ప్రవర్తిస్తావురా నువ్వు ఈరోజు నిన్ను ప్రాణాలతో వదిలిపెట్టను అంటూ గుద్దుల వర్షం కురిపిస్తూనే ఉన్నాను. వాడిని నేను ఎంతలా కొడుతున్నాను అంటే వాడికి ఊపిరి ఆడక ఎగశ్వాస తీసుకుంటూ ఊపిరి ఆగిపోయే స్థితికి చేరుకున్నాడు. కానీ నా కోపం తగ్గడం లేదు ఇంతలో పవిత్ర నా దగ్గరకు వచ్చి నన్ను ఆపుతోంది. ఇక చాలు ఆపు అన్నయ్య,,, వాడు చచ్చిపోతాడు,,, వద్దు ఆపేయ్ అని అంది. .... లేదు బుజ్జమ్మ,,, ఈరోజు వీడు నీ ఒంటి మీద చెయ్యి వేసి చాలా పెద్ద తప్పు చేశాడు. .... వద్దు అన్నయ్య ప్లీజ్ వదిలేయ్ లేదంటే రవి అన్నయ్య మీద ఒట్టు ప్లీజ్ ఆగిపో అని పవిత్ర అనడంతో నేను వెంటనే ఆగిపోయాను.
నేను పైకి లేచి పవిత్ర వైపు చూడగా దాని కళ్ళల్లో కన్నీళ్లు మొహం మీద ఎర్రగా కందిన గాయాలు కనబడ్డాయి. అంటే ఈ రాణాగాడు దాన్ని బాగా కొట్టాడు అన్నమాట. నా బుజ్జమ్మని అలా చూడగానే తట్టుకోలేక కింద పడి ఉన్న రాణాగాడి కడుపులో బలంగా తన్నాను. వెంటనే పవిత్ర నన్ను గట్టిగా కౌగిలించుకొని కదలకుండా పట్టుకుని, ఇక చాలు అన్నయ్య ఆపు అని అంది. .... నువ్వు బాగానే ఉన్నావు కదా, నీకు ఏం కాలేదు కదరా బుజ్జమ్మ? అని అన్నాను. .... నేను బాగానే ఉన్నాను అన్నయ్య నాకేం కాలేదు. ఇక నువ్వు కొంచెం శాంతించు ఇక్కడినుంచి వెళ్ళిపోదాం అని అంది. ఇదంతా జరుగుతున్నప్పుడు నా వీపు రాాణాగాడి వైపు ఉండడంతో నా దృష్టి వాడి మీద లేదు. అంతలో వాడు నెమ్మదిగా ఓపిక తెచ్చుకొని వాడి పక్కనే అందుబాటులో ఉన్న వాడి గన్ అందుకని నా వైపు ఎక్కుపెట్టి కాల్చాడు. కానీ ఈసారి కొద్దిలో తప్పిపోయి నా నడుం పక్కనుంచి దూసుకెళ్తూ చిన్న గాటు పెట్టింది.
వెంటనే నాకు కింద పడి ఉన్న నా గన్ కనబడడంతో దానిని అందుకుని వెనక్కి తిరిగి వాడు మరొక బుల్లెట్ కాల్చేలోగా వాడి నుదిటి మీద బుల్లెట్ దింపేసాను. రాణాగాడు అక్కడికక్కడే కుప్పకూలి తుది శ్వాస విడిచాడు. ఆ తర్వాత నేను వాడి శవం పక్కనే DD అని ఒక మార్క్ రాసి పవిత్ర చేయి పట్టుకుని ఆ రూమ్ లో నుంచి బయటికి వచ్చాను. పైనుంచి కిందికి వస్తూ ఇందాక నేను మూడవ ఫ్లోర్లో కొట్టి పడేసిన ఇద్దరిలో ఒకడు ఇంకా బతికే ఉండడం చూసి ఇద్దరి ఒంట్లో చెరొక బుల్లెట్ దింపాను. ఆ తర్వాత మేము ఆ బిల్డింగ్ లో నుంచి బయటపడి నా బైక్ దగ్గరకు చేరుకున్నాము. బైక్ దగ్గర పొదల్లో దాచిన బ్యాగ్ తీసి నా చేతిలో ఉన్న గన్ అందులో పెట్టి బ్యాక్ ప్యాక్ సర్దుకుని ఒకసారి చుట్టూ బాగా పరిశీలించి చూసి బైక్ తీసి దానిని ముందు పెట్టుకుని పవిత్రను బైక్ పై ఎక్కించుకొని హాస్పిటల్ వైపు పోనిచ్చాను.
దాదాపు సంవత్సరం క్రితం నా ఒంట్లో బుల్లెట్లు దిగినపుడు ఆపరేషన్ జరిగిన అదే హాస్పిటల్ కి చేరుకొని పార్కింగ్ ఏరియాలో ఓ మూలకి కొద్దిగా చీకటిగా ఉన్న ప్రదేశంలో బైక్ ఆపి అక్కడే మొక్కల చాటున ఉన్న ఒక గట్టు మీద పవిత్రను కూర్చోబెట్టి, బుజ్జమ్మ నేను తిరిగి వచ్చే వరకు అటు ఇటు వెళ్లకుండా ఇక్కడే కూర్చో అని చెప్పి నా బ్యాగ్ కూడా తన పక్కనే పెట్టి నేను హాస్పిటల్ లోపలికి వెళ్ళాను. ఎవరినీ అడక్కుండా నేరుగా డాక్టర్ రూమ్ లోకి వెళ్ళిపోయాను. నా అదృష్టం కొద్దీ డాక్టర్ ఇంకా హాస్పిటల్ లోనే ఉన్నారు. బహుశా అప్పుడే బయలుదేరడానికి సిద్ధమై సీట్లో నుంచి పైకి లేచినట్టున్నారు ఇంతలో నేను రూమ్ లోకి ఎంటర్ అవడంతో ఓ రెండు సెకండ్లు నన్ను తేరిపార చూసి గుర్తుపట్టి, ఓయ్ హీరో,,, హ హ,,, హౌ ఆర్ యు? ఏంటి ఈ టైం లో వచ్చావు? అని అడిగారు. .... బాగుంటే మీ దగ్గరికి ఎందుకు వస్తాను? అని నవ్వుతూ పలకరించాను. .... వాట్,,, వాట్ హేపెండ్? అని అడిగారు. .... నా ఎడమ భుజం చూపించి, డాక్టర్ నా భుజంలో బుల్లెట్ దిగింది ప్లీజ్,,, దాన్ని వెంటనే తీసేయాలి అని అన్నాను.
వాట్,,,? బుల్లెట్ దిగిందా? అలా అయితే అది సెక్యూరిటీ అధికారి కేస్ కదా? సెక్యూరిటీ అధికారి పర్మిషన్ లేకుండా నేను ఏమి చేయలేను అని అన్నారు. .... వెంటనే నేను నా ఐడి కార్డు తీసి డాక్టర్ కి చూపించి, ఇప్పుడు చేయడానికి మీకు అభ్యంతరం ఉండదనుకుంటాను? అని అన్నాను. .... ఐడి కార్డు చూసి ఆ తర్వాత కొంచెం ఆశ్చర్యంగా నావైపు చూసి, ఓకే ఓకే,,, కమాన్ అంటూ నన్ను పక్కనే ఉన్న ఆపరేషన్ థియేటర్ లోకి తీసుకెళ్లి ఒక స్టూల్ మీద కూర్చోపెట్టి ఒక పది నిమిషాల్లో బుల్లెట్ బయటకు తీసి డ్రెస్సింగ్ చేశారు. అలాగే నా నడుం దగ్గర పడ్డ గాటుకు కూడా డ్రెస్సింగ్ చేసి ఇంజక్షన్ ఇచ్చి టాబ్లెట్స్ రాసి ఇచ్చారు. ఆ తర్వాత డాక్టర్ గారి రూమ్ లోకి వచ్చి నేను అతని ఫీజు చెల్లించి, ఈ విషయం ఎవరికీ తెలియకుండా మన మధ్యే ఉండాలి అని డాక్టర్ గారికి మరొకసారి గుర్తు చేసి అతనికి థాంక్స్ చెప్పి అక్కడినుంచి బయలుదేరి బయటకు వస్తూ మెడికల్ షాప్ లో టాబ్లెట్స్ తీసుకుని వచ్చాను. పవిత్ర ఆ చీకటిలో బిక్కుబిక్కుమంటూ కూర్చంది. నేను బైక్ స్టార్ట్ చేసి పవిత్రను బైక్ మీద కూర్చోపెట్టుకుని నా రూమ్ కి చేరుకున్నాను.
డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళి పవిత్రని మంచం మీద కూర్చోపెట్టి, ఇంకేం భయం లేదు కంగారు పడకు, ఏమైనా తిన్నావా? ఉండు ఏదో ఒకటి చేస్తాను. ఇప్పుడే ఒక ఐదు నిమిషాల్లో వస్తాను రూమ్ లో నుంచి బయటికి రాకు అని చెప్పి నా బ్యాగ్ పట్టుకుని రూమ్ లో నుంచి బయటికి వెళ్లి డోర్ క్లోజ్ చేసి నా వర్క్ స్టేషన్(ఇక మీదట పార్వతి అమ్మ ఇంటిని ఇలాగే పిలుస్తాను) కి చేరుకుని నా వస్తువులు వెపన్స్ జాగ్రత్తగా పెట్టి తిరిగి రూమ్ కి వచ్చాను. పవిత్ర మంచం మీద లేదు తన బట్టలు మాత్రం ఉన్నాయి. బాత్రూములో నీళ్ళ చప్పుడు వినపడటంతో పవిత్ర స్నానం చేస్తుందని ఊహించాను. మంచం మీద ఉన్న తన బట్టలు బాగా మురికి పట్టి చిరిగిపోయి ఉన్నాయి. అక్కడ ఎటాకింగ్ మోడ్ లో ఉండడంతో నేను పవిత్ర బట్టలను సరిగ్గా గమనించలేదు. బహుశా పెనుగులాటలో దుమ్ము ధూళి పట్టి చిరిగిపోయి ఉంటాయి. ఇంతలో బాత్రూం డోర్ చిన్నగా తెరుచుకుని లోపల్నుంచి పవిత్ర చాలా మొహమాటంగా బయటకు వచ్చింది. పవిత్ర ఒంటిమీద నేను పొద్దున్న విడిచేసిన దాదాపు తొడల వరకు కవర్ చేస్తున్న నా టీషర్టు వేసుకుని ఉంది.
నేను ఇంకేమీ మాట్లాడకుండా కిచెన్ ఏరియా లోకి వెళ్లి మ్యాగీ ప్యాకెట్ ఓపెన్ చేసి 5 నిమిషాల్లో రెడీ చేసి మంచం మీద కూర్చున్న పవిత్ర దగ్గరికి పట్టుకొని వచ్చాను. పాపం చాలా భయపడినట్టుంది చాలా నీరసంగా కూర్చుని ఉంది. ప్లేట్ తన పక్కనే పెట్టి, ముందు కొంచెం తిను అని అన్నాను. .... కానీ పవిత్ర కదలకుండా ఏమీ మాట్లాడకుండా అలాగే కూర్చుంది. .... నాతో మాట్లాడడం కూడా నీకు ఇష్టం లేదు కదా? అని అన్నాను. .... వెంటనే పవిత్ర మంచం మీద నుంచి లేచి నన్ను గట్టిగా వాటేసుకుని బోరున ఏడవడం మొదలు పెట్టింది. తన కన్నీళ్లతో నా షర్టు తడిసిపోతుంది. .... హేయ్,,, బుజ్జమ్మ ఏంటిది? అంతా అయిపోయింది ఇప్పుడు నువ్వు సేఫ్ గా ఉన్నావు. నో నో,,, ఏడవకు అని సముదాయించాను. కొంతసేపటికి ఏడవడం ఆగడంతో మంచం మీద కూర్చోపెట్టి ప్లేట్ లో ఉన్న మ్యాగి తినిపించాను. పవిత్ర ఇంకేమీ మాట్లాడకుండా కామ్ గా తినేసింది.
సరే పద నిన్ను ఇంటి దగ్గర దింపేసి వస్తాను అక్కడ అందరూ నీ కోసం ఎదురు చూస్తూ ఉంటారు అని అన్నాను. .... పవిత్ర తలదించుకుని కొంచెం మొహమాటంగా, ఈరోజుకి నేను,,,, ఇక్కడే ఉండొచ్చా? అని అడిగింది. .... అదేంట్రా బుజ్జమ్మ అలా అడుగుతున్నావు ఇక్కడ ఉండడానికి నీకు నా పర్మిషన్ అవసరమా? అని అన్నాను. .... ఆ తర్వాత మంచం సర్ది తనను పడుకోబెట్టి ఒంటి మీద దుప్పటి కప్పాను. సరే అయితే నేను ఒకసారి పిన్నికి ఫోన్ చేసి నువ్వు నా దగ్గర ఉన్నావు అని చెప్తాను లేదంటే పిన్ని కంగారు పడుతూ ఉంటుంది అని చెప్పి నా మొబైల్ తీసుకుని రూమ్ లో నుంచి బయటికి వచ్చి డోర్ క్లోజ్ చేసి రోడ్డు మీదకు వచ్చి పిన్నికి కాల్ చేశాను. హలో పిన్ని,,,, .... హలో దీపు,,,, ఒరేయ్ కన్నా ఇక్కడ అంతా గందరగోళంగా ఉందిరా,,,,, .... నాకు తెలుసు,,,, పవిత్ర ఇంటికి రాలేదు, తనని ఎవరో రౌడీలు కిడ్నాప్ చేసి తీసుకొని వెళ్ళిపోయారు అదే కదా? అని అడిగాను. .... అవును,,, కానీ ఆ విషయం నీకు,,,,?
పిన్ని నువ్వేమీ కంగారు పడాల్సిన అవసరం లేదు. పవిత్రకి ఏమి కాలేదు నా దగ్గరే సురక్షితంగా ఉంది. ఇకపోతే ఆ రౌడీల విషయము రేపు పొద్దున్న మీకు న్యూస్ లో తెలుస్తుంది అని అన్నాను. .... సరే కన్నా,,, అది నీ దగ్గరే ఉంటే నాకు ఇంకేమీ భయం లేదు. దాన్ని జాగ్రత్తగా చూసుకో. .... సరే పిన్ని,,, కానీ ఇదంతా ఎలా జరిగింది? .... ఏమో తెలియదురా కన్నా, ఎవరో ఒక గూండా మీ బాబాయ్ కి ఫోన్ చేసి 5 కోట్లు ఇస్తావా లేదా నువ్వు చస్తావని బెదిరించడం జరిగిందంట. కానీ మీ బాబాయి దాన్ని చాలా తేలికగా తీసుకుని సెక్యూరిటీ అధికారి కంప్లైంట్ ఇచ్చారంట ఇక ఆ తర్వాత జరిగింది నీకు తెలిసే ఉంటుంది అని అంది పిన్ని. .... సరే పిన్ని నువ్వేం కంగారు పడకు నేను ఉంటాను అని చెప్పి ఫోన్ కట్ చేసాను. ఆ తర్వాత రూమ్ లోకి వెళ్లి నా షర్టు తీసేసి బాత్రూంలోకి వెళ్లి కొంచెం ఫ్రెష్ అయి వచ్చి టాబ్లెట్స్ వేసుకుని నేల మీద దుప్పటి పరిచి లైట్ ఆఫ్ చేసి మరో దుప్పటి కప్పుకుని ఈరోజు జరిగిన దాని గురించి ఆలోచిస్తూ పడుకున్నాను.
అసలు ఈ రుద్ర నాతో ఏం చేయించాలని అనుకుంటున్నాడు? అసలు నాకు నకిలీ ఐడి కార్డు ఎందుకు ఇచ్చాడు? కీర్తి వదినకి ముందే డౌట్ వచ్చి నన్ను హెచ్చరించింది కాబట్టి సరిపోయింది. అందుకే రుద్ర ఇచ్చిన ఐడి కార్డు తనకు పంపించమని వదిన ముందే చెప్పడంతో నేను మొత్తం వివరాలతో పాటు వదినకి పంపించాను. ఆ తర్వాత వదిన ఇంటలిజెన్స్ విభాగాన్ని సంప్రదించడం నన్ను సరైన చోట చేర్చడం జరిగింది. ఏది ఏమైనా ఈ రుద్ర విషయంలో జాగ్రత్తగా ఉంటూ మొత్తం విషయాన్ని తెలుసుకోవాలి అని మనసులో అనుకున్నాను. నేను అలా ఆలోచనలలో ఉండగా దుప్పట్లో నా పక్కన అలికిడి అయింది. అది ఇంకేదో కాదు పవిత్ర నా పక్కలో దూరింది. ఏరా బుజ్జమ్మ నిద్ర పట్టడం లేదా? అని అడిగాను. .... చాలా నెమ్మదిగా అవును అన్నయ్య,,, అన్న మాట వినపడింది. .... ఏంట్రా బుజ్జమ్మ నా మీద ఇంకా కోపం పోలేదా? నాతో మాట్లాడడానికి కూడా ఇంకా ఇబ్బందిగా ఉందా?అని అడిగాను.
వెంటనే పవిత్ర నన్ను గట్టిగా వాటేసుకుని, సారీ రా అన్నయ్య,,, అప్పుడు ఏదో తెలియక పిచ్చిదానిలా ప్రవర్తించాను. నిజానికి నా సర్వస్వం రవి అన్నయ్య అని నీకు కూడా తెలుసు. అందుకే ఆ సమయంలో నేను ఇంకేమీ ఆలోచించలేక పోయాను. అప్పుడు నా వయసు కూడా అలాంటిది. అందరూ నీ గురించి చెప్పుకునేది నిజమేనని నమ్మి అలా ప్రవర్తించాను. .... హ్,,, ఆరోజు రవి స్థానంలో నేనుండి చనిపోయినా బాగుండేదేమో? అని కొంచెం నిర్లిప్తంగా అన్నాను. .... అలా అనకురా అన్నయ్య,,, అది ఆ రోజు జరిగిన ఒక దుర్ఘటన. ఆ సంఘటన తర్వాత నేను మన ఇంటికి చేరుకున్నా అక్కడ కూడా అమ్మ తప్ప అందరూ నీకు వ్యతిరేకంగానే ఉండేసరికి అదే నిజమని నమ్మి ఇంత కాలంగా నిన్ను అనరాని మాటలు అన్నాను చివరికి నీ చావు కూడా కోరుకున్నాను అని కన్నీళ్లు పెట్టుకుంది. .... ఛఛ,,, ఊరుకోరా బుజ్జమ్మ, అలా చేయకపోతే నువ్వు నా బుజ్జమ్మవి ఎలా అవుతావు? అని సరదాగా మాట్లాడి దగ్గరికి తీసుకొని నుదుటిమీద ముద్దు పెట్టాను.
ఇంత కాలం తర్వాత ఈమధ్యే మన ఇంట్లో నీ గురించిన విషయాలు నాకు తెలిసాయి. మొదట్లో ఒకసారి నేను స్టోర్ రూమ్ లో కి వెళ్ళినప్పుడు అక్కడ నీ ఫోటో ఒకటి చూశాను. ముందు అది చూడగానే నేను కొంచెం కంగారుపడ్డాను. నీ ఫోటో అక్కడ ఎందుకు ఉంది అనే సందేహం వచ్చి అమ్మని అడిగితే నువ్వు ఆ ఇంటి బిడ్డవి అని చెప్పింది. వెంటనే నేను అక్కడినుంచి వెళ్ళిపోదామని అనుకున్నాను. కానీ పెదనాన్న, అక్కకి నేనంటే చాలా ఇష్టం కావడంతో వాళ్ళ మాట విని అక్కడే ఉన్నాను. ఆ తర్వాత చాలాసార్లు అమ్మ నీ గురించి ఎంత చెప్పడానికి ప్రయత్నించినా నేనే మొండిగా వినిపించుకోలేదు. నీ గురించి మాట్లాడితే వెళ్లిపోతానని అమ్మని బెదిరించాను. ఆ తర్వాత నీకు యాక్సిడెంట్ జరగడం దాన్నుంచి బయట పడిన నువ్వు మళ్లీ మాకు తారసపడడం మళ్లీ మేము నిన్ను తిట్టుకోవడం ఇవన్నీ నీకు తెలిసిన విషయాలే.
అమ్మ ఇప్పటికీ ప్రతి వారం స్టోర్ రూమ్ లోకి వెళ్లి వస్తుంది. కానీ అలా వెళ్లి వచ్చేటప్పుడు ఏమి పట్టుకు రాకుండా ఉత్త చేతులతో రావడం చూసి అమ్మ స్టోర్ రూమ్ లోకి వెళ్లి ఏం చేస్తుందా అని డౌట్ వచ్చి ఫాలో అయ్యి వెళ్లి చూస్తే అమ్మ అక్కడ ఉన్న నీ ఫోటో ఫ్రేమ్ శుభ్రంగా తుడిచి నీ ఫోటోకి ముద్దు పెట్టుకొని మళ్ళీ జాగ్రత్తగా పెట్టి బయటికి వస్తుంది. అది చూసి నేను నిన్ను తక్కువ చేసి తప్పుగా మాట్లాడటంతో అమ్మ నా మీద కోప్పడి నువ్వు చెప్పినందు వల్లనే నన్ను దత్తత తీసుకొని ఇంటికి తీసుకు వెళ్లిందని చెప్పింది. అది విని నేను ఆశ్చర్యపోయాను. ఆ తర్వాత అమ్మ నీ చిన్నతనంలో జరిగిన విషయాలు అన్నిటి గురించి వివరంగా చెప్పడంతో నేను నీ గురించి తప్పుగా అర్థం చేసుకుని ఎంత పెద్ద తప్పు చేశానో తెలిసింది. ఆ తర్వాత నిన్ను కలుద్దాం అని అనిపించి ఇక్కడికి రావడం కూడా జరిగింది. కానీ రూమ్ తాళాలు వేసి ఉండడంతో నేను తిరిగి వెళ్ళిపోయాను.
కానీ బుజ్జమ్మ నా వల్లనే రవి చనిపోయాడు అన్న మాట వాస్తవమే కదా. వాడు అడ్డుపడకుండా ఉంటే ఆరోజు చావాల్సింది నేనే కదా? అని అన్నాను. .... లేదురా అన్నయ్య అలా అనకు. కర్మానుసారం ఎవరి తలరాత ఎలా ఉంటే అలా జరుగుతుంది. కొంతమందికి తక్కువ కాలం జీవించాలని రాసిపెట్టి ఉంటే మరికొంతమందికి ఎక్కువ కాలం జీవించే అవకాశం ఉంటుంది. బహుశా రవి అన్నయ్య చేయవలసిన పనులు ముగిసిపోయి మనల్ని విడిచి తొందరగా వెళ్ళిపోయాడు. నువ్వు చేయాల్సిన పనులు ఇంకా మిగిలి ఉంటాయి అందుకే ఆ భగవంతుడు నిన్ను బతికించాడు. .... నీకో విషయం చెప్పనా బుజ్జమ్మ,,, రవి ఇంకా నాతోనే ఉన్నాడు అని నాకు అనిపిస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు నేను వాడితో మాట్లాడుతూ ఉన్నట్టు అనిపిస్తుంది. ఇది నీకు నమ్మశక్యంగా అనిపించకపోవచ్చు కానీ ఇప్పటికీ వాడే నన్ను గైడ్ చేస్తున్నాడు అనిపిస్తుంది.
నిజంగానా,,,, నీకున్న అదృష్టం నాకు లేదు. ఇంతవరకు ఒక్కసారి కూడా రవి అన్నయ్య నాతో మాట్లాడినట్లు నాకు అనిపించలేదు. .... ఈసారి రవి నాతో మాట్లాడినప్పుడు నీతో కూడా మాట్లాడమని చెప్తానులే అని అన్నాను. .... ఐ యాం రియల్లీ సారీరా అన్నయ్య. నీ గురించి నిజం తెలుసుకోకుండా ఇన్నేళ్లుగా నిన్ను అనరాని మాటలు అంటూ చాలా బాధపెట్టి ఉంటాను. పిచ్చి ముండని నన్ను అంతలా ప్రేమించే అన్నయ్య గురించి కూడా సరిగ్గా ఆలోచించలేక పోయాను. .... పరవాలేదులేరా బుజ్జమ్మ,,,, నా బుజ్జమ్మ మొండితనం గురించి నాకు తెలీదా ఏంటి? జీవితంలో ఇలాంటి పరిస్థితులను ఎదుర్కోవడం నాకు బాగా అలవాటైపోయింది. సరేలే చాలా టైం అయిపోయింది పోయి మంచం మీద పడుకో అని అన్నాను. .... పవిత్ర మళ్లీ తన సహజ ధోరణిలోకి వచ్చేస్తూ, ఉహుం,,,, నేను నీ దగ్గరే పడుకుంటాను అని మొండికేసింది. .... నేల మీద పడుకోలేవురా వెళ్ళి మంచం మీద పడుకో అని అన్నాను. .... అయితే నువ్వు కూడా రా ఇద్దరం కలిసి మంచం మీద పడుకుందాం అని పవిత్ర అనడంతో నేను నవ్వుకొని లేచి ఇద్దరం కలిసి మంచం మీద పడుకున్నాము. మా చిన్ననాటి రోజులు గుర్తు చేస్తూ పవిత్ర నన్ను గాఢంగా అల్లుకుని పడుకుంది.