Episode 085.2


అప్పటి దాకా నేను గుమ్మం బయటే నుంచుని ఉన్నాను. పవిత్ర నా గురించి చెప్పడంతో అందరి చూపు నా మీద పడి పిన్ని తప్ప మిగిలిన ముగ్గురు కళ్ళు కోపంతో ఎర్రబడ్డాయి. అరె,,, అక్కడ ఏం చేస్తున్నావ్ అన్నయ్య లోపలికి రా అని అంది పవిత్ర. .... అరె,,, దీపు నువ్వా?? అని అన్నాడు రుద్ర. .... నేను అడుగు లోపలకి పెట్టబోతుండగా, అక్కడే ఆగు,,, ఒక్క అడుగు కూడా ముందుకు పడటానికి వీల్లేదు. ఇక్కడ నుంచి వెళ్ళిపో అని అంది కార్తీక అక్క. .... అక్కా,,,,,,, అని అంది పవిత్ర. .... నువ్వు నోర్ముయ్ అంటూ అక్క నా వైపు అడుగులు వేసుకుంటూ వచ్చి లాగిపెట్టి నా చెంప మీద ఒకటి కొట్టింది. ఇక్కడి నుంచి వెళ్ళమని చెప్తుంటే వినపడడం లేదా?? అని కోపంతో ఊగిపోతూ, అమ్మని ప్రాణాలతో లేకుండా చేశావు ఇప్పుడు మిగిలిన మా ప్రాణాలు కూడా తీసుకోవడానికి వచ్చావా? అని కోపంతో గట్టిగా అరిచింది. .... ఏరా చెప్తుంటే నీకు వినపడడం లేదా? అని అరిచాడు బాబాయ్. అక్క నోటి వెంట అటువంటి సూటిపోటి మాటలు వినలేక అక్కడి నుంచి వెనుదిరిగి వెళ్తుండగా ఇన్స్పెక్టర్ రుద్ర నన్ను పిలిచి ఆపాడు.

దీపు ఆగు,,, అని అన్నాడు రుద్ర. .... వాడిని ఎందుకు ఆపుతున్నారు ఇన్స్పెక్టర్ అని అన్నారు నాన్న. .... దినేష్ గారు నేను మీ అమ్మాయి మరియు అతని వాంగ్మూలం తీసుకోవాల్సి ఉంది. ఎందుకంటే రాణా మరియు అతని గ్యాంగ్ హత్య చేయబడ్డారు. హత్య జరిగిన సమయంలో మీ అమ్మాయి అక్కడే ఉంది ఆ తర్వాత దీపు అదే ప్రాంతంలో ఉన్నాడు. వీళ్లిద్దరు మాత్రమే ఆ వ్యక్తిని చూసిన వారు కాబట్టి నేను కొన్ని వివరాలు తీసుకోవాలి అని చెప్పి మా ఇద్దరి దగ్గర వాంగ్మూలం తీసుకున్నాడు. స్కెచ్ తయారుచేయడానికి మీరిద్దరూ అతని రూపురేఖలు ఎలా ఉంటాయో చెప్పగలరా? అని అడిగాడు రుద్ర. .... లేదు ఇన్స్పెక్టర్ ఆ సమయంలో చీకటిగా ఉంది పైగా అతను మొహానికి మాస్క్ వేసుకొని ఉన్నట్టున్నాడు అని అన్నాను. .... ఓకే,,, అయితే ఇక నేను వెళ్తాను. ఒకవేళ అవసరం అనుకుంటే మళ్ళీ మీ ఇద్దరిని ఎంక్వైరీ చేయాల్సి ఉంటుంది మీ ఇద్దరూ కోపరేట్ చేయాలి, నేను వస్తాను వర్మ గారు అని చెప్పి రుద్ర బయటికి నడిచాడు.

నేను కూడా రుద్రతో పాటు బయటికి నడుస్తుండగా, ఓయ్ నిన్నే,,, చెప్పేది జాగ్రత్తగా విను. మళ్లీ నువ్వు ఈ ఇంట్లో అడుగు పెట్టడానికి ప్రయత్నిస్తే నీ రెండు కాళ్ళు విరిగిపోతాయి అని గంభీరమైన గొంతుతో వార్నింగ్ ఇచ్చారు నాన్న. నేను పిన్ని వైపు చూడగా కన్నీళ్లు కారుస్తూ మౌనంగా రోదిస్తుంది. రెండు చేతులు జోడించి ఇదంతా తన తప్పే అన్నట్టు నన్ను క్షమించమని కోరుతోంది. నేను కళ్ళతోనే పిన్నిని బాధపడొద్దు అని సంకేతం ఇచ్చి బయటికి వచ్చేసాను. రుద్ర తనదారిన తాను వెళ్ళిపోగా నేను నా దారిలో వెళ్ళిపోయాను. బైక్ మీద వెళుతున్నాను గాని నా బుర్ర అంతా పాడైపోయింది నా కళ్ళలో నుంచి నీళ్లు వస్తున్నాయి. ఈరోజు అక్క నా మీద చేయి చేసుకుంది దాంతో నా మనసు ముక్కలు అయిపోయింది. అదే విషయం గురించి ఆలోచిస్తూ దారి కూడా సరిగా గమనించకుండా ముందుకు వెళ్ళిపోతున్నాను. అదే సమయంలో ఒక ట్రక్కు ఎదురుగా వచ్చి దాదాపుగా నన్ను రాసుకుంటూ వెళ్ళిపోతున్న సమయంలో, ఒరేయ్ దీపు జాగ్రత్త,,,, అన్న రవి పిలుపు గట్టిగా వినపడటంతో వెంటనే బైక్ ని రోడ్డు దించి పక్కకి ఒరిగిపోయి ఆ ట్రక్కు బారి నుంచి తప్పించుకున్నాను.

ఏం చేస్తున్నావురా దీపు, కళ్ళు నెత్తి మీద ఉన్నాయా? అని అడిగాడు రవి. .... ఏం చేయమంటావురా? ఈరోజు అక్క నా మీద చేయి చేసుకుంది. చిన్నప్పుడు నన్ను ఎంత ప్రేమగా చూసుకునేది కానీ ఇప్పుడు అంతకు పదింతలు నా మీద ద్వేషం పెంచుకుంది. .... అయితే!! అందుకోసం అని ప్రాణాలు తీసుకుంటావా? ఈ జీవితం ఎంతో విలువైనది దాని విలువ ఏంటో అర్థంతరంగా పోయిన నాకు తెలుసు. నిన్ను అమితంగా ప్రేమించే కవిత అమ్మ, ప్రీతి బంగారం, మన బుజ్జమ్మ ఇంకా నిన్ను ప్రేమగా చూసుకుంటున్న మిగిలిన వారి గురించి ఏమి ఆలోచించవా? వాళ్ళందరి కోసం నువ్వు ఇంకా చాలా చేయాల్సి ఉంది. ఇంకా నిన్ను నమ్ముకున్న ఆ అమ్మాయి? ఆ అమ్మాయి గురించి ఏమీ ఆలోచించవా? అని అన్నాడు రవి. .... నువ్వు ఉండరా బాబు ఎప్పుడూ ఏదో ఒకటి చెప్పి నా బుర్ర దెంగుతూ ఉంటావు. నువ్వు ఏ అమ్మాయి గురించి మాట్లాడుతున్నావు? అని చిరాగ్గా అన్నాను. .... నీయబ్బ,,, ఒక్కటి పీకానంటే అంతా సెట్ అయిపోద్ది అని రవి నా మీద చెయ్యి ఎత్తగానే నేను ఉలిక్కిపడి కళ్ళు తెరిచాను. బైక్ తో పాటు నేను రోడ్డు పక్కన పడి ఉన్నాను.

ఇప్పటిదాకా రవితో మాట్లాడింది అంతా??? అని బుర్ర గోక్కుంటూ పైకి లేచి బైక్ స్టార్ట్ చేసి ముందుకు పోనిచ్చాను. నేరుగా రూమ్ కి చేరుకొని మంచం మీద వాలిపోయాను. పొద్దున్నంతా నా బుజ్జమ్మతో చాలా సరదాగా గడిచిపోయింది అన్న సంతోషం ఎంతోసేపు నిలవలేదు. ఇంట్లో వాళ్ళందరూ నా మీద ఇంకా ఎందుకు అంత కసితో రగిలి పోతున్నారో అర్థం కావడం లేదు. ఎన్నడూ లేనిది అక్క ఈ రోజు ఏకంగా నా మీద చేయి చేసుకుంది. నేను ఏమంత పాపం చేశాను? ఇదివరకు ప్రతిరోజు పార్కులో పొద్దున్న పూట జాగింగ్ కి వెళ్లి వచ్చేటప్పుడు నాన్న అక్క బుజ్జమ్మ నన్ను చూసి తిట్టుకుంటూ ఉంటే బాధగా అనిపించినా సర్దుకుపోయేవాడిని. కానీ ఎన్నో ఏళ్ళ తర్వాత ఆ ఇంటికి వెళితే నాకు జరిగిన సత్కారం ఇది. కనీసం నన్ను పలకరించడానికి కూడా ఇష్టపడకుండా మళ్లీ ఆ ఇంట్లో అడుగు పెడితే కాళ్లు విరగ్గొడతాను అన్న నాన్న మాటలు మరింత బాధించాయి.

ఇక ఆరోజు మధ్యాహ్నం భోజనం చేయాలని అనిపించలేదు. పోనీ అమ్మ దగ్గరికి వెళ్దామా? అని అనుకుంటూ ఉండగా నాకు రుద్ర గుర్తుకొచ్చాడు. నిన్న రాత్రి జరిగిన సంఘటన ఇప్పుడు నేను బుజ్జమ్మని తీసుకొని ఇంటికి వెళ్లడం చూసి రుద్రకి నా మీద అనుమానం కలిగే అవకాశం ఉంది అనిపించింది. దాన్ని కవర్ చేసుకోవడానికి నాకు ఒక ఆలోచన వచ్చింది. అది అమలులో పెట్టేముందు చీఫ్ కి కాల్ చేశాను. గుడ్ ఈవెనింగ్ సర్,,, దీపు రిపోర్టింగ్ అని అన్నాను. .... హలో మై బాయ్,,, హౌ ఆర్ యు? అని పలకరించారు. ..... సర్,,, అది,,,నిన్న నైట్,,,,,, అని అంటూ ఉండగా అటునుండి చీఫ్ మాట్లాడుతూ, ఐ నో దీపు,,,, వెల్డన్ మై బాయ్,,,, చాలా కామ్ గా డీసెంట్ గా పని పూర్తి చేసావు. .... థాంక్యూ సర్,,,, ఆ విషయం గురించే మీకు ఇన్ఫామ్ చేద్దామని కాల్ చేశాను. .... పొద్దున్నుంచి ఇదే వార్తతో టీవీ ఛానళ్ళు మార్మోగిపోతున్నాయి. అవునూ ఇంతకీ ఆ DD మార్క్ సంగతేంటి? .... అదేదో ఊరికే డైవర్షన్ కోసం అలా చేశాను సర్ నా మీద ఎవరి దృష్టి పడకుండా ఉండేందుకు ముఖ్యంగా రుద్రకి నా మీద డౌట్ రాకుండా ఉండేందుకు అలా చేశాను సర్. .... వెరీ గుడ్,,, మేము ట్రైనింగ్ ఇచ్చిన వాళ్లు కూడా ఇంత షార్ప్ గా ఆలోచించరు. గుడ్ జాబ్,,, ఇంకా నువ్వు ఏదైనా చెప్పాలా? అని అడిగారు. .... నథింగ్ సర్,,, .... ఓకే దెన్,,, నీకు ఏదైనా అవసరమైతే ఏ టైం లో నైనా నాకు కాల్ చేయొచ్చు టేక్ కేర్,,, అని చెప్పి చీఫ్ కాల్ కట్ చేశారు.

ఇక ఆ తర్వాత చేయాల్సిన పని కోసం బయల్దేరాను. ముందుగా వర్క్ స్టేషన్ లోకి వెళ్లి మాస్క్, గ్లవ్స్ మరియు గన్ తీసుకుని బైక్ మీద బయల్దేరాను. ఇంతకుముందు రెక్కీ చేసిన ఒక ప్రాంతానికి వెళ్లి చీకటి పడేవరకు మెయిన్ రోడ్డు మీద అటు ఇటు తిరుగుతూ కాలక్షేపం చేసి బండిని ఒక మూసివున్న షాపు ముందు పార్కింగ్ చేసి నడుచుకుంటూ ఆ కాలనీలోకి బయలుదేరాను. కొంత దూరం వెళ్లి ఒక స్లమ్ ఏరియాలోని చీకటిగా ఉన్న వీధిలోకి దూరాను. చీకటిగా ఉండి నన్ను ఎవరూ గుర్తుపట్టకుండా ఉన్నందుకు కొంచెం రిలీఫ్ గా ఫీల్ అయ్యాను. ఎవరూ చూడకుండా జేబులోనుంచి మాస్క్ తీసి మొహానికి తగిలించుకుని చేతికి గ్లవ్స్ వేసుకుని అక్కడ ఉన్న ఒక పాత పాడుపడిన బిల్డింగ్ లోకి దూరాను. ఆ బిల్డింగ్ వరండాలో ఒక వ్యక్తి కాపలా కాస్తున్నాడు. నేను లోపలికి రావడం చూసి, రేయ్ ఎవడుబే నువ్వు? అని అడిగాడు. .... నేను మాస్క్ వేసుకుని ఉండటంతో ధైర్యంగా వాడి దగ్గరికి వెళ్లి, అన్న కలవమన్నాడు అని అన్నాను.

మొహానికి ఆ మాస్క్ ఏంటి? అని అడిగాడు. .... ఏం లేదన్నా నాకు కొంచెం ఎలర్జీ ఉంది నాతో మాట్లాడేటప్పుడు ఎవరికీ ఇబ్బంది ఉండకూడదని అని అన్నాను. .... అన్నని దేనికోసం కలవాలి? అని అడిగాడు. .... ఒక చిన్న సెటిల్మెంట్ ఉందన్న దాని గురించి అన్నకి ఫోన్ చేస్తే సాయంత్రం వచ్చి కలవమన్నాడు అని అన్నాను. .... కానీ అన్న లోపల బిజీగా ఉన్నాడు ఈ టైంలో నిన్ను లోపలికి పంపితే తిడతాడు కొంచెం సేపు వెయిట్ చెయ్ అని అన్నాడు. .... చాలా అర్జెంట్ అన్నా ఇప్పుడు నాతో మాట్లాడకపోతే మళ్లీ రేపు చాలా ఇబ్బంది అయిపోతుంది అని రిక్వెస్ట్ చేసినట్టు అడిగేసరికి వాడు కొంచెం ఆలోచనలో పడ్డాడు. .... సరే అర్జంట్ అంటున్నావ్ కదా అలా లోపలికి వెళ్లి కుడిచేతి వైపు ఉన్న చివరి రూమ్లో అన్న ఉంటాడు బయట నుంచి అడిగి లోపలికి వెళ్ళు అని అన్నాడు. .... థాంక్స్ అన్న,,, అని చెప్పి వాడు చెప్పినట్లు లోపలికి వెళ్ళాను.

అది ఒక రౌడీషీటర్ అడ్డా. రుద్ర ఇచ్చిన లిస్టులో వాడి పేరు కూడా ఉంది. నేను ఇదివరకే వీడి గురించి రెక్కీ నిర్వహించి వాడు ఏ టైంలో ఎక్కడ ఉంటాడో తెలుసుకున్నాను. పగలంతా వాడు మరొక డెన్ లో ఉండి సెటిల్మెంట్ దందాలు చేస్తూ ఉంటాడు. సాయంత్రం అయితే ఇక్కడ లపాకీలతో గడపడానికి వస్తాడు. ఎంతో ముఖ్యమైన విషయాలు అయితే తప్ప ఈ అడ్డాలోకి ఎవరినీ రానివ్వడు. అందుకే ఇక్కడ తన బలగం ఎవరు కనబడరు. బయట కాపలా కాస్తున్న వాడికి తప్ప వాడు ఏ రూమ్ లో ఉన్నాడో ఎవ్వరికీ తెలీదు. ఈ విషయాలు అన్నీ ముందే తెలుసుకోవడంతో ఇప్పటిదాకా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆ రూమ్ దగ్గరికి చేరుకున్నాను. టక్ టక్,, అని తలుపు కొట్టాను. ..... ఎవరు? అని లోపలి నుంచి తాగిన మత్తులో ఒక వాయిస్ వినపడింది. .... నేను కొంచెం గొంతు సవరించుకుని, నేనన్నా,,,, అని అన్నాను. .... బండ,,,, నువ్వేనా?? అని అన్నాడు. .... ఊ,,, అని అన్నాను. .... ఒక రెండు నిమిషాల తర్వాత డోర్ తెరుచుకుంది.

కొంచెం బొద్దుగా ఒక 35 ఏళ్ళు ఉండి సళ్ళ పైవరకు లంగా కట్టుకున్న ఆడది తలుపు తెరిచింది. నేను లోపలికి అడుగుపెట్టగానే డోర్ క్లోజ్ చేసి గడియ పెట్టాను. అక్కడ కింద పరుపు మీద కేవలం లుంగీ కట్టుకుని మందు తాగుతూ కూర్చున్న రౌడీషీటర్ నన్ను చూసి, ఎవడ్రా నువ్వు? అని అడిగి అలర్ట్ అయ్యాడు. ఆ మాట విన్న ఆ ఆడమనిషి కొంచెం కంగారు పడింది. నేను వెంటనే నా ప్యాంటు వెనుక భాగంలో దాచిన గన్ తీసి ఆమె వైపు చూపించి, సౌండ్ చేయకుండా కామ్ గా కూర్చో నేను నిన్నేం చేయను అని అనడంతో ఆమె అలాగే అని తలాడిస్తూ ఒక మూలన కూర్చుంది. ఇంతలో పైకి లేవబోతున్న రౌడీ షీటర్ వైపు తిరగగా వాడు నా కాళ్ళు పట్టుకొని లాగేసరికి నేను కిందపడి నా గన్ చేతిలోంచి పడిపోయింది. వెంటనే నేను పక్కనే ఉన్న మందు బాటిల్ అందుకని ఆ రౌడీషీటర్ బుర్ర మీద పగలగొట్టాను. వాడు గట్టిగా అరవబోతుండగా పక్కనే ఉన్న వాడి షర్ట్ అందుకొని వాడి నోట్లో కుక్కాను.

ఇద్దరి మధ్య కొంచెంసేపు పెనుగులాట జరగడంతో నా చెయ్యి మీద ఒత్తిడి పెరిగి నొప్పిగా అనిపించింది. అంతలోనే నా చేతికి గన్ దొరకడంతో అది తీసుకొని వాడికి గురిపెట్టాను. వెంటనే వాడు రెండు చేతులు జోడించి తనను ఏమీ చెయ్యొద్దు అన్నట్టు తల అడ్డంగా ఊపుతున్నాడు. నేను ట్రిగ్గర్ నొక్కబోయి గన్ కి సైలెన్సర్ లేదని గుర్తుకు వచ్చి వెంటనే వాడి మొహం మీద నాలుగు బలమైన పంచ్ లు ఇచ్చాను. అప్పటికే మందు తాగి ఉన్నందున వాడు స్పృహతప్పి పరుపు మీద పడ్డాడు. నేను నా గన్ ప్యాంటు వెనుక దోపుకుని ఆమె వంక చూసి సైలెంట్ గా ఉండమని ముక్కు మీద వేలు వేసుకుని సిగ్నల్ ఇచ్చాను. ఆ తర్వాత వాడి మెడ పట్టుకుని ఒక్కసారిగా పక్కకు తిప్పేసరికి ఫటక్ మని సౌండ్ వచ్చి విరిగిపోయింది. కొద్ది సెకన్ల పాటు వాడి శరీరం గిలగిలా కొట్టుకుని ఆగిపోయింది. అది చూసి ఆ ఆడమనిషి తన నోరు నొక్కుకుని చాలా భయపడుతూ ఏడుస్తోంది. వాడు చనిపోయాడని పూర్తిగా నిర్ధారించుకున్న తర్వాత ఆమె వైపు చూసి బట్టలు వేసుకోమని చెప్పాను.

నా మీద భయంతో ఆమె గబగబా మరో ఆలోచన లేకుండా తన లంగా సరిచేసుకుని జాకెట్ వేసుకుని చీర కట్టుకుంది. ఇంతలో నేను రూమ్ అంతా పరిశీలనగా చూసి ఒక కబోర్డ్ కనపడటంతో దాన్ని ఓపెన్ చేసి చూసేసరికి ఒక 10 లక్షల వరకు డబ్బు కనబడింది అవి తీసి ఆ ఆడ మనిషికి తీసుకోమని ఇచ్చాను. ఆమె భయంతో వణుకుతూ వద్దని తల అడ్డంగా ఊపింది. చూడు ఇప్పుడు నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతే ఆ తర్వాత నువ్వే వాడిని చంపావని అనుకుంటారు. నా మాట విని ఈ డబ్బులు తీసుకుని ఇప్పుడు నాతో పాటు నా వెనకాలే వచ్చేస్తే నువ్వు క్షేమంగా బయటపడతావు అని చెప్పడంతో ఆమె కొంచెం ఆలోచించి డబ్బు తీసుకొని తన బ్యాగ్లో పెట్టుకొని సరే అని తలాడించింది. తర్వాత ఇద్దరం కలిసి రూమ్ లో నుంచి బయటకు వచ్చి డోర్ దగ్గరకు వేసి నాకంటే ముందు ఆమెను వెళ్లమని చెప్పాను. ఆ తర్వాత నేను కూడా ఆమె వెనుక వెళుతూ బయట కాపలా కాస్తున్న వాడి దగ్గరకు చేరుకుని ఆమె వాడిని దాటుకుని బయటకు వెళ్లిపోయిన తర్వాత నేను వాడితో మాట్లాడుతూ, చాలా థాంక్స్ అన్న పని పూర్తి అయిపోయింది. అన్న నిన్ను పిలుస్తున్నాడు అని చెప్పి ఇది ఉంచన్న అని 2000 రూపాయల నోటు తీసి వాడి చేతిలో పెట్టేసరికి వాడు ఖుష్ అయిపోయాడు.

ఆ తర్వాత నేను బయటికి వచ్చి ఆ వీధిలో గబగబా నడుస్తూ ముందుకు వెళ్తున్న ఆడమనిషి దగ్గరకు చేరుకుని మళ్లీ ఇంకెప్పుడు ఈ ఏరియాలో కనబడకు నీకే డేంజర్, ఆ డబ్బుతో మరొక దగ్గరికి వెళ్లిపోయి హాయిగా బతుకు అని చెప్పి నేను గబగబ నడుచుకుంటూ మెయిన్ రోడ్ కి చేరుకొని బైక్ మీద అక్కడినుంచి బయలుదేరి వచ్చేసాను. ఇందాక జరిగిన పెనుగులాటలో నా చేతికి కట్టిన కట్టు నుండి చిన్నగా రక్తం కారుతూ ఉండడంతో నేరుగా హాస్పిటల్ కి వెళ్ళి డాక్టర్ తో డ్రెస్సింగ్ చేయించుకుని ఇంజక్షన్ తీసుకుని రూమ్ కి వెళ్లాను. వెంటనే రుద్రకి కాల్ చేసి ఆ రౌడీషీటర్ ని వేసేసానని చెప్పడంతో రుద్ర హ్యాపీ అయిపోయాడు. .... అది సరేగాని నిన్నటి సంఘటనలో నీ ప్రమేయం ఏమీ లేదు కదా? అని అడిగాడు. .... లేదు రుద్ర అది నేను చేయలేదు అని అన్నాను. .... మరి ఆ టైంలో నువ్వు అక్కడ ఎందుకు ఉన్నావ్? అని అడిగాడు. .... నేను రెక్కీ చేయడానికి వెళ్లాను కానీ అనుకోకుండా అప్పటికే అది జరిగిపోయింది. ఆ రాణాగాడు నా చేతిలో చావు తప్పించుకున్నాడు. నేనే వాడిని చంపుదామని అనుకున్నాను కానీ ఇప్పుడు ఆ ఛాన్స్ లేకుండా పోయింది అని అన్నాను.

సరే సరే,,, ఇప్పుడు జరిగిన దాని గురించి నేను చూసుకుంటాను నువ్వు కొద్ది రోజులు ఎటువంటి యాక్టివిటీ చేయకుండా సైలెంట్ అయిపో అని అన్నాడు రుద్ర. .... ఓకే రుద్ర,,,, నువ్వు చెప్పినట్టే కొద్దిరోజులు సైలెంట్ అయిపోయి మళ్లీ నెక్స్ట్ టార్గెట్ పూర్తి అయిన తర్వాత నీకు కాల్ చేసి చెప్తాను అని చెప్పి ఫోన్ కట్ చేసాను. ఇంకొద్ది రోజులు ఎటువంటి పని ఉండదు కాబట్టి అమ్మ దగ్గరికి వెళ్దాం అని అనుకొని టాబ్లెట్స్ అవి జేబులో పెట్టుకొని రూమ్ డోర్ లాక్ చేసి వర్క్ స్టేషన్ కి వెళ్లి నా గన్ మిగిలిన వస్తువులు భద్రంగా పెట్టి అక్కడ నుంచి బయలుదేరి ఇంటికి చేరుకున్నాను. అప్పుడే అంకుల్ కూడా ఇంటికి చేరుకోవడంతో ఇద్దరం పలకరించుకుని ఎవరి రూముల్లోకి వాళ్ళు వెళ్ళిపోయాము. అంకుల్ వచ్చారు కాబట్టి ఇప్పుడు అమ్మ నా దగ్గరికి వచ్చే ఛాన్స్ లేదు అని బట్టలు విప్పి బాత్రూం లోకి వెళ్లి స్నానం పూర్తి చేసి బయటకు వచ్చేసరికి అమ్మ నా కోసం షార్ట్ తీసి పెడుతూ కనపడింది. అమ్మ నా వైపు చూసి నా చేతికి ఉన్న కట్టు చూసి కొంచెం కంగారు పడుతూ నా దగ్గరికి వచ్చి, ఏమైంది నాన్న,,, చేతికి ఆ కట్టేంటి? అని అడిగింది.
Next page: Episode 086.1
Previous page: Episode 085.1