Episode 087.1


అప్పటి నుంచి ఒక వారం రోజుల గ్యాప్ లో వేరు వేరు చోట్ల మరో ఇద్దరు రౌడీ షీటర్లను లేపేసాను. కానీ రుద్ర ఇటువంటి చోటామోటా రౌడీ షీటర్లను ఆ లిస్టులో ఎందుకు చేర్చాడో నాకు అర్థం కాలేదు. కావాలంటే రుద్ర తనకున్న హోదాతో అటువంటివారిని ఎన్కౌంటర్ చేసి లేపేయొచ్చు. నాకు వచ్చిన అదే సందేహాన్ని చీఫ్ తో కూడా చర్చించాను. ఆ లిస్టులో ఉన్న పెద్ద చేపలను మాత్రమే టార్గెట్ గా పెడితే నీకు రుద్ర మీద అనుమానం రావచ్చు అందుకని మరికొన్ని జెన్యూన్ కేసులు కూడా కలిపి నీకు ఇచ్చి ఉంటాడు. ఏది ఏమైనా నీ చేతిలో చస్తున్నవారు అసాంఘిక శక్తులే కాబట్టి వారి గురించి నువ్వేమీ అనవసరంగా ఆలోచించొద్దు. రుద్రకి అనుమానం రాకుండా నీ పని నువ్వు చేసుకుపో అని సలహా ఇచ్చారు చీఫ్. చీఫ్ ఇచ్చిన సలహా మేరకు నా పని చేస్తూ ఎప్పటికప్పుడు రుద్రకి అనుమానం రాకుండా నా పని గురించిన అప్డేట్స్ ఇస్తూ జాగ్రత్త పడుతున్నాను.

ఒకరోజు పని మీద బయట తిరుగుతూ దారిలోనే ఉన్న కేఫ్ కి వెళ్లి పుష్ప వదినతో కొంచెం సేపు సరదాగా కబుర్లు చెబుతూ గడిపాను. ఆ తర్వాత అక్కడ్నుంచి బయలుదేరుతూ, ఎలాగూ టైం అవుతుంది కదా నువ్వు కూడా నాతో వచ్చేయ్ నిన్ను ఇంటి దగ్గర దింపేస్తాను అని వదినతో అన్నాను. .... లేదు దీపు ఇంకా గంట టైం ఉంది ఇంత తొందరగా వెళ్లిపోతే బాగోదు అని అంది వదిన. .... నీ పని అయిపోయింది కదా నువ్వు ఇక్కడ ఉండడం వల్ల ప్రయోజనం ఏంటి? ఎలాగూ షాప్ క్లోజ్ చేసే బాధ్యత సూపర్వైజరుదే కదా? అని అన్నాను. .... నా పని లేకపోయినా ఇక్కడ మనతో పాటు పని చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఒక మేనేజరుగా మనం మరికొంచెం ఎక్కువ సేపు ఇక్కడే ఉంటే వాళ్లకి కూడా మన మీద గౌరవం పెరుగుతుంది. నేను తర్వాత ఆటోలో వెళ్తానులే నువ్వు వెళ్ళిపో అని అంది వదిన. .... పని పట్ల వదినకు ఉన్న నిబద్ధతను చూసి నాకు చాలా సంతోషంగా అనిపించింది.

నువ్వు ఒక వెహికల్ ఎందుకు తీసుకోకూడదు? అప్పుడు ఎంచక్కా ఈ ఆటోల గోల లేకుండా సమయం కలిసి వస్తుంది కదా? అని అన్నాను. .... ఇంతకుముందు ఉండేది దీపు కానీ చెప్పాను కదా అప్పుడు ఉన్న ఆర్థిక పరిస్థితులకి అది అమ్మేయాల్సివచ్చింది. ఇదిగో ఇప్పుడిప్పుడే అన్ని కుదుట పడుతున్నాయిగా వీలు చూసుకుని ఫైనాన్స్ మీద తీసుకునే ఆలోచన ఉంది. అలా అయితే నెమ్మదిగా నెలనెలా EMI లు కట్టడానికి వీలుగా ఉంటుంది అని అంది వదిన. వదిన మాటలకు నాకు కొంచెం బాధగా అనిపించింది. మధ్యతరగతి కుటుంబంలో ఉండే ఆర్థిక ఇబ్బందులను అనుభవిస్తూ కూడా ఎంతో సరదాగా అందరినీ నవ్విస్తూ చురుకుగా పని చేసుకుంటూ కుటుంబాన్ని నెట్టుకొస్తోంది. ఆ వెంటనే వదినకు ఒక బండి కొనిస్తే ఎలా ఉంటుంది? అన్న ఆలోచన వచ్చింది. అదే సమయంలో ప్రీతికి నేను బండి కొంటాను అని మాట ఇచ్చిన సంగతి కూడా గుర్తొచ్చింది.

వెంటనే నా మదిలో ఇద్దరికీ కలిపి ఒకేసారి బండ్లు తీసుకోవాలని డిసైడ్ అయిపోయాను. ఆ తర్వాత మరో గంటపాటు అక్కడే వదినతో కాలక్షేపం చేసి వదినని తీసుకొని బయలుదేరి తనను ఇంటి దగ్గర దించి నేను నా రూంకి వెళ్లిపోయాను. ఆ తర్వాత శనివారం రోజు మధ్యాహ్నం సమయంలో ఇంటికి వచ్చి అమ్మతో కలిసి భోజనం చేసి సాయంత్రం ప్రీతికి, వదినకి బండ్లు తీసుకోవడానికి వెళ్దామని చెప్పాను. అమ్మ నా మాట విని సంతోషించి వదినకి కూడా బండి కొనాలన్న నా ఆలోచనని మెచ్చుకుంది. నేను వెంటనే వదినకి ఫోన్ చేసి వదినకి బండి తీసుకుంటాను అన్న విషయాన్ని చెప్పకుండా దాచిపెట్టి సాయంత్రం ప్రీతి కోసం బండి తీసుకుంటున్నాను దాని సెలక్షన్ కోసం నువ్వు కూడా రావాలి అని అడిగాను. అందుకు వదిన కూడా సరేనని ఒప్పుకోవడంతో ప్రీతి కాలేజ్ నుంచి వచ్చిన తర్వాత అమ్మని, ప్రీతిని తీసుకొని కారులో బయలుదేరి కేఫ్ కి చేరుకొని వదినను కూడా పిక్ చేసుకుని షోరూమ్ కి బయలుదేరాము.

హోండా షోరూం లోపలికి వెళ్ళి అమ్మ వదినతో మాట్లాడుతూ బండి సెలక్ట్ చేసే పనిలో పడింది. నేను ప్రీతితో కలిసి తనకు నచ్చిన కలర్ సెలెక్ట్ చేసుకోమని మరోవైపు ఉన్న బండ్లు చూడటం మొదలుపెట్టాను. ప్రీతి తనకు నచ్చిన రెడ్ కలర్ హోండా యాక్టివా సెలెక్ట్ చేసుకోగా, వదినకి మెరూన్ కలర్ హోండా యాక్టివా నచ్చిందని అమ్మ నా దగ్గరకు వచ్చి సీక్రెట్ గా చెప్పింది. షోరూమ్ వాడిచ్చిన డ్రింక్ తాగుతూ ఉండమని చెప్పి డబ్బు చెల్లించడానికి నేను కౌంటర్ దగ్గరికి వెళ్లాను. అమ్మ నా వెనకాలే వచ్చి తను డబ్బులు పే చేస్తానని చెప్పింది. కానీ నేను అందుకు ఒప్పుకోకుండా అమ్మను తిరిగి పంపించి నేను డబ్బులు చెల్లించి బళ్ళు రెడీ చేయమని చెప్పాను. పేపర్ వర్క్ కోసం ఐడెంటిటీలు అడగటంతో నేను వదిన దగ్గరికి వెళ్లి చనువుగా తన హ్యాండ్ బ్యాగ్ తీసి అడ్రస్ ప్రూఫ్ ఐడి తీసుకుని వెళ్లి పని పూర్తి చేసుకుని అక్కడే కొంచెం పక్కకు వెళ్లి వీర్రాజు అన్నకి ఫోన్ చేశాను.

నేను వదిన కోసం బండి తీసుకున్నాను కానీ ఇప్పటి దాకా విషయం వదినకి చెప్పలేదు నువ్వు కూడా షోరూమ్ కి వస్తే బాగుంటుంది అని అన్నతో చెప్పాను. .... ఇప్పుడు ఇదంతా ఎందుకు దీపు నేను తర్వాత తీసుకునే వాడిని కదా? అని అన్నాడు అన్న. .... నేను వదిన కోసం బండి తీసుకోకూడదా? అని అన్నని ఇరకాటంలో పెట్టి, ఇది నాకు పెద్ద ఖర్చేమి కాదన్నా నువ్వు వెంటనే బయలుదేరి వస్తే వదినకి సర్ప్రైజ్ ఇద్దాము అని అన్నని ఒప్పించాను. వీర్రాజు అన్న నా మాట కాదనలేక సరే అని చెప్పి ఒక అరగంటలో షోరూమ్ దగ్గరికి వచ్చాడు. అంతలో బళ్ళు కూడా సిద్ధం చేసి పేపర్ వర్క్ కూడా పూర్తి చేసి షోరూమ్ వాడు రెండు బళ్ళ తాళాలు తీసుకొచ్చి నా చేతిలో పెట్టాడు. ప్రీతికి తన బండి తాళాలు స్వయంగా నా చేతితో అందించి వదిన బండికి సంబంధించిన తాళాలు అమ్మ చేతికి ఇచ్చి వదినకి ఇవ్వమని చెప్పాను. అమ్మ ఆ తాళాలు వదినకు అందించగా వదిన ఆశ్చర్యపోతూ మా అందరి మొహాల వంక చూసింది.

అప్పుడు అమ్మ మొత్తం విషయం చెప్పి నిన్ను సర్ప్రైజ్ చేద్దామని ఇప్పటివరకు నీతో ఈ విషయం చెప్పలేదు అని అనేసరికి వదిన కళ్ళల్లో నీళ్ళు చేరిపోయాయి. .... తన మీద అంత ప్రేమ చూపించినందుకు నా వైపు కృతజ్ఞతాభావంతో చూసి అందులో భాగస్వామి అయినందుకు వీర్రాజు అన్న వైపు సరదాగా కొంచెం కోపం నటిస్తూ చూసింది. .... ఇందులో నా తప్పేమీ లేదు అంతా దీపునే చేశాడు అని వీర్రాజు అన్న సంజాయిషీ ఇచ్చుకున్నాడు. .... అమ్మ వదినను కౌగిలించుకొని ప్రేమగా నుదుటిమీద ముద్దు పెట్టి, పిచ్చిపిల్ల,,, దీనికి కూడా ఎవరైనా కన్నీళ్లు పెట్టుకుంటారా? నువ్వు వాడి మీద చూపించే ప్రేమకి నీకోసం ఏం చేసినా తక్కువే. కమాన్,, పదండి గుడికి వెళ్లి పూజ చేసుకుని వెళ్దాం అని అమ్మ అందర్నీ బయల్దేరదీసింది. ప్రీతి, వదిన తమ తమ బళ్ళు తీయగా వీర్రాజు అన్న తన బైక్ స్టార్ట్ చేసాడు. నేను అమ్మని కార్ డ్రైవ్ చేయమని చెప్పి ప్రీతి బండిమీద వెనక కూర్చున్నాను. అందరం కలిసి వినాయకుని గుడికి వెళ్లి బండ్లకు పూజ చేయించుకుని అక్కడి నుంచి ఎవరి దారిన వాళ్ళు మా ఇళ్ళకు చేరుకున్నాము.

తన కోసం బండి తీసుకోవడంతో ప్రీతి ఆనందానికి అవధులు లేవు. రాత్రి అంకుల్ ఇంటికి వచ్చే సమయానికి బయట వెయిట్ చేస్తూ ఆయన వచ్చిన తర్వాత నేను తనకోసం బండి తీసుకున్నాను అన్న విషయం చెప్పి అంకుల్ ని యాక్టివా మీద కూర్చోబెట్టుకొని తనే డ్రైవ్ చేస్తూ కొద్దిసేపు బయట తిప్పి ఎంజాయ్ చేసింది. తన ఆనందం చూసి అంకుల్ కూడా సరదాగా ఎంజాయ్ చేశారు. ఇద్దరు ఇంటికి చేరుకున్న తర్వాత అందరం కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ డిన్నర్ ఎంజాయ్ చేసాము. ఆ తర్వాత సోఫాలో కూర్చుని మాట్లాడుకుంటూ ప్రీతి ఐలాండ్ ట్రిప్ గురించి లేవనెత్తింది. అంకుల్ కూడా కొంచెం ఆలోచించి, సరే నీ పరీక్షలు అయిపోయిన తర్వాత వెళ్దాము. నేను కొంచెం డేట్స్ చూసుకొని చెప్తాను మీరందరూ రెడీ అయిపోండి అని అనౌన్స్ చేశారు. దాంతో ప్రీతి ఆనందం రెట్టింపు అయిపోయి లేచి గంతులేస్తూ పిచ్చి పిచ్చిగా డాన్స్ చేయడం మొదలు పెట్టింది. అది చూసి మేము ముగ్గురం నవ్వుకున్నాము.

ప్రీతికి పరీక్షలు కావడంతో ఆ వీకెండ్ మొత్తం మా జోలికి రాకపోవడంతో అమ్మ నేను బాగా ఎంజాయ్ చేసాము. ఆ తర్వాత నేను తిరిగి నా రూమ్ కి చేరుకొని మరొక మిషన్ కోసం ఆ లిస్ట్ లో ఉన్న కిషోరీ లాల్ అనే బంగారు వ్యాపారి గురించి ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టాను. అందులో భాగంగా రుద్రకి ఫోన్ చేసి, ఈ కిషోరీ లాల్ విషయం కొద్దిగా పెద్దది లాగా అనిపిస్తుంది అతని గురించి డీటెయిల్స్ చెప్పమని అడిగాను. .... రుద్ర మాట్లాడుతూ, అవును దీపు నువ్వు చెప్పింది కరెక్టే. కిషోరీ లాల్ ని డైరెక్ట్ గా ఎదురుకోవడం కొంచెం కష్టం. వాడి చుట్టూ ఎప్పుడూ ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది. వాడికి రాజు అని ఒక గ్యాంగ్స్టర్ అండదండలు ఉన్నాయి. వాడి దగ్గరికి వెళ్లాలంటే ఈ రాజు అనే వాడిని దాటుకుని వెళ్లాలి. అందువల్ల ఈ కేసు విషయంలో కొంచెం జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేయాల్సి ఉంటుంది. ఈ కేసు తర్వాత చూసుకుందాం అంత వరకు దీని సంగతి పక్కన పెట్టి ఆ లిస్టులో ఒక నైజీరియన్ డ్రగ్స్ పెడలర్ గురించి ఉంది చూడు.

మరో రెండు రోజుల్లో వాడు సిటీలో ఒక రేవ్ పార్టీకి అటెండ్ అవుతున్నాడు. అయితే ఈ కేసు విషయంలో సెక్యూరిటీ ఆఫీసర్లు దగ్గర పూర్తి సమాచారం ఉండడంతో ఆ రేవ్ పార్టీ మీద దాడి జరిపే ప్లాన్ లో ఉన్నాము. కానీ డిపార్ట్మెంట్లో వాడికి చాలా సంబంధాలు ఉన్నాయి అందువలన వాడు అక్కడ నుంచి తప్పించుకునే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. లేదా సెక్యూరిటీ ఆఫీసర్లకు చిక్కినా ఏదో ఒక రూపంలో వాడు బయట పడతాడు. అందువలన ఆరోజే వాడిని ఎలాగైనా లేపెయ్యాలి, అయితే నువ్వు చేయవలసిన పని ఏంటంటే? ఆరోజు నువ్వు ఆ పార్టీ జరిగే ఏరియాలో బయట వెయిట్ చేస్తూ ఉండు. వాడు అక్కడినుంచి తప్పించుకుంటే ఆ సమాచారాన్ని నేను నీకు అందిస్తాను. అప్పుడు నువ్వు వాడిని బయట ఎక్కడైనా ఎవరికి తెలియకుండా లేపెయ్యొచ్చు ఆ తర్వాత సంగతి నేను చూసుకుంటాను అని అన్నాడు. .... నేను కూడా అందుకు సరేనని ఫోన్ కట్ చేశాను. కానీ రుద్ర చెప్పిన విషయాలు నాకు సందేహం కలిగించాయి. సెక్యూరిటీ ఆఫీసర్లు నేరుగా దాడి చేసేటప్పుడు నేను వాడిని చంపాల్సిన అవసరం ఏముంది? అని అనుకున్నాను. కానీ రుద్రకి అనుమానం రాకుండా ఉండడం కోసం ఆ పని చేయాలని నిర్ణయించుకున్నాను.

రెండు రోజుల తర్వాత రుద్ర దగ్గర నుంచి కాల్ వచ్చింది. ఆ రేవ్ పార్టీ జరుగుతున్న లొకేషన్ చెప్పి ప్లాన్ లో చిన్న మార్పు అని అన్నాడు. .... ఏంటది? అని అడిగాను. .... మేము రాత్రి 11:00 గంటల సమయానికి రైడ్ చేద్దామని అనుకుంటున్నాము. అయితే అక్కడికి దగ్గర్లోనే ఉన్న ఒక ఇండిపెండెంట్ హౌస్ లో ఆ నైజీరియన్ బస ఏర్పాటు అయినట్టు నా ఇన్ఫార్మర్ ద్వారా నాకు తెలిసింది. అందువలన మేము పార్టీ మీద రైడ్ చేసే సమయంలో నువ్వు ఆ ఇంటికి వెళ్లి నైజీరియన్ ని లేపెయ్. అయితే నువ్వు వాడిని చంపడానికి గన్ ఎట్టిపరిస్థితుల్లోనూ వాడొద్దు. వాడి చావు యాక్సిడెంట్ లాగా ఉండేటట్టు చూసుకోవాలి లేదంటే వాడు ఆత్మహత్య చేసుకున్నట్టు ఉన్నా పర్వాలేదు అని అన్నాడు. .... అలా ఎందుకు?? మీరు రైడ్ చేసినప్పుడు కాల్పుల్లో చనిపోయాడు అని చెప్పొచ్చుగా అని అడిగాను. .... అది కాదు దీపు ఇటువంటి పార్టీల మీద రైడ్ చేసినప్పుడు కాల్పులు జరపాల్సినంత అవసరం ఉండదు. అందువలన వాడు బుల్లెట్ గాయానికి చచ్చినట్లు ఉంటే అది పెద్ద ఇష్యూ అయి కూర్చుంటుంది. ఈసారి తప్పించుకుంటే వాడు మళ్ళీ మనకు దొరకడం చాలా కష్టం అయిపోతుంది. అందువలన నేను చెప్పింది చెప్పినట్టు చెయ్ కానీ నీ ఆనవాళ్లు ఎక్కడా కనబడకుండా జాగ్రత్తపడు. పని పూర్తి అయిపోగానే సెక్యూరిటీ ఆఫీసర్లు అక్కడికి వచ్చేలోపు నువ్వు అక్కడ నుంచి వెళ్లిపోవాలి అది మాత్రం బాగా గుర్తు పెట్టుకో అని చెప్పి కాల్ కట్ చేశాడు.

ఆ తర్వాత నేను ఆ విషయం గురించి బాగా ఆలోచించాను. అక్కడ ఏదో తెలియని మిస్టరీ దాగి ఉంది అని అనిపించింది. కానీ ఎంత ఆలోచించినా రుద్ర ఇలా ఎందుకు చేయిస్తున్నాడో అర్థం కాలేదు. సరే ఏదైతే అదే అయింది నేను నా పని చూసుకుని వీలైనంత తొందరగా అక్కడ నుంచి తప్పించుకుంటే చాలు అని నిర్ణయించుకున్నాను. ఆ రోజు రాత్రి భోజనం చేసి వర్క్ స్టేషన్ లోకి వెళ్లి గ్లవ్స్, మాస్క్ మరియు గన్ తీసుకుని బయలుదేరాను. గన్ తో షూట్ చేయకూడదు అని రుద్ర చెప్పినప్పటికీ కనీసం బెదిరించడానికి ఉపయోగపడుతుంది మరియు నా సేఫ్టీకి కూడా పనికొస్తుంది అని పట్టుకున్నాను. సరిగ్గా పావుగంట ముందు ఆ ఇంటి దగ్గరకు చేరుకున్నాను. నా బైక్ ని పక్క లైన్లో కొంచెం చీకటిగా ఉన్న ప్రదేశంలో పార్క్ చేసి నెమ్మదిగా నడుచుకుంటూ ఆ ఇంటి దగ్గరకు చేరుకున్నాను. బ్లూటూత్ ఆన్ చేసి చెవికి తగిలించుకుని రుద్ర కాల్ కోసం వెయిట్ చేశాను.

ఇదివరకు రుద్ర చెప్పినట్టు సరిగ్గా 11:00 గంటల సమయానికి అక్కడ రైడ్ ప్రారంభం కాగానే రుద్ర నాకు మిస్సిడ్ కాల్ తో అలర్ట్ సిగ్నల్ పంపాడు. వెంటనే నేను రంగంలోకి దిగి ఆ ఇంటి బౌండరీ వాల్ దగ్గరికి వెళ్లి జాగ్రత్తగా లోపలికి తొంగిచూసి ఎవరూ లేరని నిర్ధారించుకుని గోడదూకి లోపలికి వెళ్ళాను. ఫ్రంట్ డోర్ క్లోజ్ చేసి ఉంచడంతో నెమ్మదిగా శబ్దం రాకుండా అడుగులు వేసుకుంటూ ఇంటి చుట్టూ తిరిగి వెనుక వైపు వెళ్ళాను. అన్ని రూమ్ లు చీకటిగా ఉన్నట్టు కనబడుతున్నాయి. కొంప తీసి లోపల ఎవరూ లేరా అన్న సందేహం కూడా కలిగింది. కానీ ఇంటి చుట్టూ చూద్దామని మరో కార్నర్ కి వెళ్ళేసరికి బాత్రూం లోపల లైట్ వెళుతున్నట్టు వెంటిలేటర్ ద్వారా తెలుస్తుంది. ఇంతలో ముందు వైపు ఉన్న డోర్ ఎవరో కొడుతూ లోపల ఉన్న నైజీరియన్ ని పిలుస్తున్నాడు. బాత్రూంలో ఉన్న నైజీరియన్ ఆ మాట విని, కమింగ్ డ్యూడ్,,,, అని అరిచాడు.

వెంటనే నేను అలర్ట్ అయ్యి ముందు వైపు కదిలాను. గోడ చాటున నిల్చొని ఆ ముందువైపు తలుపు కొడుతున్న వ్యక్తిని చూశాను. లోపలి నుంచి ఆ నైజీరియన్ బాత్రూంలో నుంచి బయటకి వచ్చినట్టు సౌండ్ విన పడింది. మరి కొద్ది క్షణాల్లో అతను వచ్చి డోర్ ఓపెన్ చేస్తాడు అనిపించి వెంటనే ముందుకు ఉరికి నా గన్ తీసుకొని వెనుక నుంచి ఆ డోర్ కొడుతున్న వ్యక్తి నోరు నొక్కి గన్ తో నెత్తి మీద ఒక్కటి ఇచ్చేసరికి కింద కూలబడ్డాడు వెంటనే అతన్ని పక్కకు లాగేసి డోర్ ఎదుట నిల్చుున్నాను. సరిగ్గా అదే సమయానికి ఆ నైజీరియన్ డోర్ తెరవగా లైట్ వెలుగులో అతని మొహం స్పష్టంగా కనబడింది. నేను ఫోటోలో చూసిన మొహం అదేనని నిర్ధారించుకుని అతని వైపు గన్ చూపించి చేతులు పైకెత్తమన్నాను. అతను నన్ను సెక్యూరిటీ అధికారి గా భావించి చేతులు పైకెత్తి, ఏంటిది,, ఎందుకు నా దగ్గరికి వచ్చారు? అని ఇంగ్లీషులో అడుగుతున్నాడు. .... అప్పటికి నేను మొహానికి మాస్క్ వేసుకుని ఉండడంతో అతను గుర్తుపట్టే అవకాశం లేదు.

నేను కొంచెం గట్టిగా మాట్లాడుతూ లోపలికి వెళ్లి, చేతులు నెత్తి వెనుక పెట్టుకొని మోకాళ్లపై కూర్చోమని చెప్పాను. అతను కొంచెం భయపడుతూ నేను చెప్పినట్టే నేల మీద మోకాళ్ళపై కూర్చున్నాడు. నేను వాడి వెనకాల నిల్చొని గన్ వాడి మీద గురిపెట్టి ఉంచి చుట్టూ చూసాను. అతను ఉంటున్న రూమ్ తలుపులు మాత్రమే తెరిచి ఉన్నాయి రెండడుగులు వెనక్కి వేసి ఆ రూమ్ లోకి చూడటానికి ప్రయత్నించాను. కానీ ఏమీ కనబడకపోవడంతో ఇంకా ఆలస్యం చేయడం మంచిది కాదు అని భావించి వాడిని పైకి లేవమని చెప్పి బయటికి నడవమన్నాను. వాడు నెమ్మదిగా మాట్లాడుతూ, తనను వదిలేయమని ఎంత డబ్బు కావాలన్నా ఇస్తానని ప్రాధేయ పడుతున్నాడు. నేను అదేమీ పట్టించుకోనట్టు వాడిని ముందుకు నడవమని అదిలిస్తూ ఆక్సిడెంట్ గా కనపడేలాగా వీడిని ఎలా చంపాలి అని ఆలోచించసాగాను. ఆ కాలనీ అంతా చాలా ఖాళీగా నిశ్శబ్దంగా ఉంది. పక్కనే హైవే మీద అప్పుడప్పుడు వెళ్తున్న వాహనాల సౌండ్ వినపడుతుంది.

వెంటనే ఒక ఐడియా వచ్చి వాడిని రోడ్డుమీదికి నడవమని గన్ పట్టుకొని వార్నింగ్ ఇస్తూ వాడి వెనకాల నడిచాను. అదృష్టం కొద్దీ ఆ కాలనీ చాలా ఖాళీగా ఉండటంతో గబగబా నడుచుకుంటూ వాడిని హైవే రోడ్డు మీదకు తీసుకువచ్చాను. వాహనాలు ఏవి కనబడకపోవడంతో వాడు ఒక వైపు నన్ను డబ్బు ఆశ చూపించి తప్పించుకోవాలని ప్రాధేయ పడుతూనే మరోపక్క పారిపోవడానికి ఏదైనా అవకాశం దొరుకుతుందేమోనని అటు ఇటూ చూస్తున్నాడు. వాడి ఉద్దేశ్యం అర్థమైన నేను వెంటనే అలర్ట్ అయ్యి చేతిని చాకులా చాపి మెడ మీద గట్టిగా కొట్టి, పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ఇక్కడే లేపేస్తాను అని వార్నింగ్ ఇచ్చాను. వాడు నొప్పితో బాధపడుతూ ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాను తనను విడిచి పెట్టమని పదే పదే అడుగుతున్నాడు. ఇంతలో ఒక వైపు నుంచి ఒక భారీ వాహనం వస్తున్నట్టు అనిపించడంతో రోడ్డు మధ్యలో డివైడర్ మీద ఉన్న చెట్ల మధ్యలోకి తీసుకుని వెళ్లి ఎవరికీ కనబడకుండా నిలబెట్టాను.
Next page: Episode 087.2
Previous page: Episode 086.2