Episode 087.2
రోడ్డు మీద అటు ఇటు వచ్చే వాహనాలలో ఉన్నవారికి డివైడర్ మధ్యలో మేము ఉన్నామని ఎవరికీ కనిపించే అవకాశం లేదు. దాంతో వాడు కొంచెం రిలాక్స్ అయ్యి మళ్ళీ బతిమాలడం మొదలు పెట్టాడు. నాకు ఒక పక్క చాలా టెన్షన్ గా ఉంది. మామూలుగా గన్ తో షూట్ చేయడమో లేదంటే మెడ విరిచి చంపడమో లేదంటే కత్తులతో పొడిచి చంపడం ఇలాంటివి అయితే ఈజీగా గుట్టుచప్పుడు కాకుండా చేసేసేవాడిని. కానీ ఒక యాక్సిడెంట్ లాగా చిత్రీకరించడం కోసం ఇలా రోడ్డు మీదకు తీసుకువచ్చి చంపడం టెన్షన్ గా ఉంది. ఆ భారీ వాహనం వేగంగా దూసుకు వస్తుంది సరిగ్గా మా దగ్గరికి వచ్చే సమయానికి నేను రెండడుగులు వెనక్కి వేసి ఆ నైజీరియన్ ని వెనుక నుండి ఒక్క తన్ను తన్నాను. నా టైమింగ్ తప్పలేదు, అనుకోకుండా జరిగిన ఈ సంఘటన నుంచి వాడు తప్పించుకోలేక పోయాడు. వేగంగా వస్తున్న ఆ భారీ వాహనం వాడిని ఢీకొట్టి ముందుకు వెళ్లిపోయింది.
ఆ భారీ వాహనం గుద్దిన తాకిడికి ఆ నైజీరియన్ ఎగిరి ఒక 20 అడుగుల దూరంలో పడ్డాడు. ఆ భారీ వాహనం మాత్రం ఆగకుండా చాలా దూరం వెళ్లిపోయింది. అదృష్టం కొద్దీ ఆ వెనుక ఎటువంటి వాహనాలు రాకపోవడంతో నేను డివైడర్ మధ్యలో నుంచి బయటికి వచ్చి గబగబా ఆ నైజీరియన్ దగ్గరకి పరిగెత్తి వెళ్లాను. వాడి బాడీ మొత్తం రక్తంతో తడిచి చచ్చిపడి ఉన్నాడు. వాడి మెడ దగ్గర చేయి పెట్టి వాడు చచ్చాడు అని మరోసారి నిర్ధారించుకుని చాలా దూరం ముందుకు వెళ్లిపోయి ఆగిన ఆ వాహనాన్ని చూసి నేను గబగబా అక్కడి నుంచి ఆ కాలనీలోకి పారిపోయాను. నేను బండి పార్క్ చేసిన ప్రాంతానికి వెళుతూ రుద్రకి కాల్ చేసి హైవే మీద వాడి బాడీ ఉందని ఆ ఇంట్లో మరొకడు స్పృహతప్పి ఉన్నాడని ఇన్ఫామ్ చేసాను. ఆ తర్వాత జేబులో ఉన్న మరొక ఫోన్ తీసి అదే విషయాన్ని గురించి చీఫ్ కి సమాచారం అందించి నా బైక్ స్టార్ట్ చేసి అక్కడ నుంచి హైవే మీదకి వచ్చేసాను. అప్పుడే ఆ రోడ్డుమీదికి వచ్చినట్టు ఆ నైజీరియన్ శవాన్ని చూస్తూ ముందుకు దాటిపోయాను. ఆ భారీ వాహనం కూడా అక్కడ లేదు.
నేను తొందరగా అక్కడ నుంచి తప్పించుకోవాలని ఆలోచిస్తూ కొంత దూరం ముందుకు వెళ్లేసరికి అది అరుణ ఉండే గేటెడ్ కమ్యూనిటీ ఏరియా అని గుర్తొచ్చి ఈ నైట్ కి అరుణ దగ్గర ఉండిపోతే బెటర్ అని అనిపించింది. వెంటనే బైక్ అటువైపు పోనిచ్చి అరుణ అపార్ట్మెంట్స్ కి చేరుకున్నాను. లిఫ్ట్ లో పైకి చేరుకుని డోర్ బెల్ కొట్టాను. అప్పటికి సమయం 12:30 అయ్యింది మరో రెండు నిమిషాలకి అరుణ లోపల డోర్ దగ్గరికి వచ్చి వ్యూ ఫైండర్ లో నుంచి చూస్తూ, ఎవరు? అని నిద్రమత్తులో అడిగింది. .... ఈ సమయంలో తనను భయపెట్టడం ఇష్టంలేక తనకు కనబడేలాగా నిల్చుని, నేను దీపు,,,, అని అన్నాను. .... కొద్ది సెకన్లకి డోర్ తెరుచుకుని నిద్రమత్తులో ఉన్న ఆరుణ మొహం కనపడింది. అరుణ చిన్న చెడ్డి, బొడ్డు వరకు ఉండే పలుచని టాప్ వేసుకుని ఉంది. .... నేను లోపలికి అడుగుపెట్టి, నిన్ను డిస్టర్బ్ చేసినందుకు సారీ,,, అని నవ్వుతూ పలకరించాను. .... అరుణ కళ్ళు నులుముకుంటూ ఒక ఆవులింత తీసి నన్ను హాగ్ చేసుకుని, ఏంటి ఈ టైం లో,,, లేటుగా వచ్చావు? అని అడిగింది.
ఏం లేదు,,, చిన్న పని మీద బయటకి వెళ్ళాను తిరిగి వచ్చేటప్పటికి లేట్ అయిపోయింది దారిలోనే నీ ఫ్లాట్ ఉంది కదా ఈ నైట్ కి ఇక్కడే ఉండిపోదామని ఆలోచన వచ్చి ఇలా వచ్చాను అని అన్నాను. .... సరే ఏమైనా తిన్నావా? అని అడిగింది. .... డోంట్ వర్రీ నా భోజనం అయిపోయింది. అనవసరంగా నీ నిద్ర పాడుచేసినట్టు ఉన్నాను పద పడుకుందువు గాని అంటూ డోర్ లాక్ చేసి తన భుజం మీద చేయి వేసి బెడ్రూంలోకి నడిచాను. నువ్వు పడుకో నేను కొంచెం ఫ్రెష్ అయ్యి వచ్చి జాయిన్ అవుతాను అని అన్నాను. .... పక్కకు వెళ్లి షర్ట్ బటన్స్ ఓపెన్ చేస్తూ నా ప్యాంటు వెనకాల గన్ దోపి ఉందన్న విషయం గుర్తొచ్చి, అబ్బా పొరపాటు చేశాను గన్ కింద బండిలో పెట్టి ఉండుంటే బాగుండేది అని మనసులో అనుకున్నాను. .... ఇంతలో బెడ్ మీద కూర్చుని వెనుకనుంచి నన్ను చూస్తున్న అరుణ, అదేంటి షర్ట్ చిరిగిపోయింది అంటూ పైకి లేచి నా దగ్గరికి వచ్చి చిరిగిన షర్ట్ చూస్తూ నా నడుం దగ్గర చెయ్యి పెట్టడంతో వెనుక ఉన్న గన్ అరుణ చేతికి తగిలింది.
షర్ట్ చిరిగిపోయిందా? అంటూ వెనక్కు తిరిగి ఆలోచనలో పడ్డాను. బహుశా హైవేలో డివైడర్ మీద చెట్ల మధ్యలో నిల్చొని టెన్షన్ గా యాక్షన్ సీన్ లో ఉన్నప్పుడు దేనికైనా తగులుకొని చిరిగి ఉండొచ్చు అని అనిపించింది. కానీ ఇప్పుడు నాకున్న టెన్షన్ అది కాదు. అరుణ తన చేతికి తగిలిన గన్ గురించి అడుగుతుంది అని టెన్షన్ పడుతున్నాను. సరిగ్గా నేను అనుకున్నట్టే, ఇదేంటి?? అని అరుణ నా షర్ట్ పైనుంచి లోపల ఉన్న గన్ మరొక్కసారి తడుముతూ అడిగింది. రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాను ఇక నా గురించి చెప్పక తప్పేలా లేదు అని మనసులో అనుకున్నాను. సరే ఎంతకాలమని ఈ విషయాన్ని దాచిపెట్టగలను పైగా అరుణ చాలా నమ్మదగిన వ్యక్తి నాకు ఆత్మీయురాలు తనకు చెప్పడం వలన పెద్ద ఇబ్బంది ఏమీ ఉండదు అని అనుకొని అరుణ కళ్ళలోకి కళ్ళు పెట్టి చూసాను. నీకు నా మీద నమ్మకం ఉందా? అని అడిగాను. .... అదేం క్వశ్చన్?? ఎప్పుడూ లేనిది ఇలా మాట్లాడుతున్నావు? అని సీరియస్ గా నా కళ్ళలోకి చూసింది.
అయితే నేను ఫ్రెష్ అయ్యి వచ్చిన తర్వాత మాట్లాడుకుందామా? అని అడిగాను. అరుణ ఏమీ మాట్లాడకుండా మౌనంగా నా కళ్ళలోకి చూస్తూ సరే అన్నట్టు తలాడించింది. నేను నా గన్ తీసి లాక్ చేసి డ్రెస్సింగ్ టేబుల్ మీద పెట్టాను. అరుణ ఆశ్చర్యంగా చూస్తూ నిల్చుంది. నేను షర్ట్, ప్యాంటు విప్పి టవల్ కోసం అటూ ఇటూ చూసాను. .... నేను తెస్తానులే నువ్వు పద అని అరుణ అనడంతో నేను బాత్రూంలోకి వెళ్లి అండర్వేర్ తీసేసి షవర్ ఆన్ చేసుకుని దానికింద నిలబడ్డాను. దాదాపు రెండు గంటల క్రితం నుంచి జరిగిన సన్నివేశాలు నా కళ్ళముందు గిర్రున తిరిగాయి. ఇటువంటి ఆపరేషన్ చేయడం ఇదే మొదటిసారి కావడంతో ఎక్కడైనా తప్పు చేశానా? ఏదైనా ప్రూఫ్స్ వదిలేసానా? అని ఆలోచించుకున్నాను. ఎక్కడా ఎటువంటి లోపం జరిగినట్టు నాకు అనిపించలేదు. ఇంతలో టవల్ పట్టుకొని బాత్రూంలోకి వచ్చిన అరుణ నా వీపు మీద గీసుకొని ఉన్న చారను చూసి, అయ్యో,,, అంతలా గీసుకు పోయిందేంటి? అని టవల్ పక్కన పెట్టి నా వీపు మీద చెయ్యి పెట్టి తడిమింది.
నేను షవర్ ఆఫ్ చేసి, గీసుకుందా? అని వెనక్కి చేయిపెట్టి తడుముకున్నాను. నిజమే,,, పనిలో ఉండగా తెలియలేదుగానీ బాగానే గీసుకుంది. రక్తం వస్తుందా? అని అరుణని అడిగాను. .... ఒంటికి ఏమైందో కూడా తెలియడం లేదా? అని చిరుకోపం ప్రదర్శించి, రక్తం రావడం లేదు కానీ బాగా వాచిపోయినట్టు ఎర్రగా కనబడుతుంది అని అంది. .... ఓస్ అంతేనా?? ఏం కాదులే అని చెప్పి మళ్ళీ షవర్ ఆన్ చేసి సబ్బు అందుకుని ఒళ్ళు రుద్దుకున్నాను. అరుణ కొంచెం పక్కకి జరిగి గోడకు ఆనుకొని నన్నే చూస్తూ నిల్చుంది. నేను గబగబా స్నానం పూర్తి చేసిన తర్వాత అరుణ టవల్ తీసుకొచ్చి నా మెడ కిందికి వంచి తల పొడిగా తుడిచింది. ఆ తర్వాత నా వీపు తుడిచి నా చేతికి టవల్ అందించగా నేను నా నడుముకు చుట్టుకున్నాను. నా అండర్వేర్ తడిపి ఆడబెడదామని దానిని అందుకోగా అరుణ నా చేతిలో నుంచి తీసుకుని, నేను చేస్తాలే,, వెళ్ళి బెడ్ మీద డ్రెస్ ఉంది వేసుకో అని అంది. నేను కామ్ గా బయటకు వెళ్ళి డ్రెస్ వేసుకుని రెడీ అయ్యే టైంకి అరుణ తన పని పూర్తి చేసి నా దగ్గరికి వచ్చింది.
నేను కేవలం షార్ట్ వేసుకుని బెడ్ మీద వెనక్కి జారబడి కూర్చున్నాను. అరుణని చూసి, కొంచెం వాటర్ తీసుకొస్తావా? అని అడిగాను. ఇంతలో నా ఫోన్ మోగడంతో అరుణ వెళ్లి నా ప్యాంటులో నుంచి మోగుతున్న ఫోన్ పట్టుకొని వచ్చి నా చేతికి అందించి వాటర్ బాటిల్ తీసుకురావడానికి రూమ్ లో నుంచి బయటికి వెళ్ళింది. రుద్ర దగ్గర్నుంచి కాల్,,, హ,, దీపు,,,, బాడీ రికవరీ చేసుకున్నాను. ఆ ఇంట్లో స్పృహ తప్పి పడి ఉన్న వాడు కూడా దొరికాడు. గుడ్ జాబ్ మ్యాన్,,, డోంట్ వర్రీ,,, ఎప్పటిలాగే కొద్ది రోజులు ఎటువంటి ఆక్టివిటీ లేకుండా కామ్ అయిపో, మళ్లీ మనం తర్వాత మాట్లాడుకుందాం అని చెప్పి కాల్ కట్ చేశాడు. ఇంతలో అరుణ ఫ్రిడ్జ్ లో నుంచి చల్లని ఐస్ వాటర్ బాటిల్ పట్టుకొని వచ్చింది. అది అందుకుని గడగడ తాగుతూ సగం బాటిల్ ఖాళీ చేశాను. అరుణ మాత్రం సైలెంట్ గా నా వైపు చూస్తూ ఉంది. మరి కొంచెం వాటర్ తాగి బాటిల్ తన చేతికి అందించి నా పక్కన కూర్చో అన్నట్టు చేతితో పరుపు మీద చెయ్యి వేసి చెప్పాను. అరుణ బాటిల్ పక్కనపెట్టి మంచం మీదకు చేరి నన్ను ఆనుకొని కూర్చుంది.
నేను అరుణ చేతిని అందుకని వేళ్ళు బిగించి పట్టుకుని,, నా మీద నమ్మకం ఉంచినందుకు థాంక్స్. ఇప్పుడు చెప్పు నీకున్న డౌట్స్ ఏంటి? అని అడిగాను. .... నీ మీద నమ్మకం లేదని కాదు కానీ వేళకాని వేళలో నిన్ను ఇలా చూస్తుంటే నాకు తెలియనిది ఏదో జరుగుతుంది అని అర్థమవుతుంది. నువ్వు తప్పుడు పనులు చేయవు అని నాకు తెలుసు కానీ,,,,, అంటూ అరుణ డ్రెస్సింగ్ టేబుల్ మీద ఉన్న గన్ వైపు చూసి ఆగిపోయింది. .... అవును,,, నువ్వే కాదు నీ స్థానంలో ఎవరున్నా ఇలాగే సందేహపడతారు. ఇదివరకు నేను నా గురించి అన్ని విషయాలు నీకు చెప్పడం లేదు అని నీకు తెలుసు అందుకు నా కారణాలు నాకున్నాయి. చూడు అరుణ నా జీవితంలో చిన్నతనం నుండి ఎన్నో ఎత్తుపల్లాలు చూశాను అలాగే నా జీవితం మొత్తం అనేక విచిత్రమైన పరిస్థితులను ఎదుర్కొన్నాను. ఒకానొక సమయంలో నేను ఎందుకు బ్రతికి ఉన్నానో కూడా అర్ధమయ్యేది కాదు.
ఒంటరి జీవితం, నాకు ఎదురైన కొన్ని పరిస్థితులు నన్ను మరింత దృడంగా తయారు చేసి అన్యాయాన్ని ధైర్యంగా ఎదుర్కొనేంత సాహసాన్ని నాలో నింపాయి. అందులో భాగమే ఇదివరకు నేను నీతో చెప్పిన కొన్ని సంఘటనలు. మరీ ముఖ్యంగా నేను చావు అంచుల దాకా వెళ్లి వచ్చిన ఆ ఘటన నన్ను మరొక సాహసోపేతమైన నిర్ణయం తీసుకోవడానికి పురిగొల్పింది. నేను ఆరు నెలల పాటు బయటికి వెళ్లి ట్రైనింగ్ తీసుకొని రావడానికి కారణం కూడా అదే. ఇప్పుడు నేను ఒక సెక్యూరిటీ అధికారి ఆఫీసర్ దగ్గర అండర్ కవర్ గా పని చేస్తున్నాను. నీకు అర్థమయ్యేలా చెప్పాలంటే సినిమాల్లో చూపించే విధంగా ఒక సీక్రెట్ ఏజెంట్ అనుకోవచ్చు. కాకపోతే నేను చేసేది ఆఫీషియల్ కాదు కాబట్టి కొంచెం సీక్రెసీ మెయింటైన్ చేయాలి అందువల్ల ఇంతకాలం ఇటువంటి విషయాల గురించి చెప్పకుండా దాచాల్సి వచ్చింది. ఇప్పుడు కూడా నా గన్ కింద బండిలో పెట్టి వచ్చి ఉంటే ఇదంతా ఇప్పుడు నీకు చెప్పవలసి వచ్చేది కాదు కానీ చిన్న పొరపాటు అయిపోయింది అని తన వైపు చూసి నవ్వాను.
అరుణ నోరెళ్ళబెట్టి ఆశ్చర్యంగా నా వైపు చూస్తూ, నువ్వు బయటకు కనబడవు కానీ నీలో చాలా యాంగిల్స్ ఉన్నాయి. అయినా ప్రాణాల మీదకు తెచ్చుకునే ఇలాంటి పనిని ఎందుకు ఎంచుకున్నావు? అని అడిగింది. .... నేను కాకపోతే మరొకరు ఇలా చాలామంది పని చేస్తూ ఉంటారు. అయినా ఒంటరి వాడిని నా ప్రాణాలు పోతే మాత్రం ఎవరికి ఇబ్బంది? నేను బతికుండగా ఎంతోకొంత సమాజానికి ఉపయోగపడితే చాలదా? అని అన్నాను. .... నువ్వు ఒంటరి వాడివి అని ఎందుకు అనుకుంటున్నావు? మేమంతా లేమా? మీ అమ్మగారు, చెల్లి వీళ్లంతా నీ వాళ్లు కాదా? అని అడిగింది అరుణ. .... నువ్వు చెప్పేది నిజమే కానీ మీరంతా నాకు దగ్గర అవ్వకముందే ఈ నిర్ణయం తీసుకున్నాను అందువలన నేను ఇచ్చిన మాటకు కట్టుబడి ఇప్పుడు పని చేస్తున్నాను అని అన్నాను. .... నీ ప్రాణాల మీదకు తెచ్చుకునే ఇలాంటి పనులు చేయడం నాకు నచ్చలేదు అని అంది అరుణ.
మరి ఇలాగే ప్రాణాలకు తెగించి వివిధ వ్యవస్థలలో పనిచేస్తున్న మిగిలిన వారి సంగతేంటి? వాళ్లంతా మనుషులు కాదా? అని అడిగాను. .... దానికి ఆరుణ దగ్గర సమాధానం లేక కొద్ది సెకన్లు మౌనంగా ఉండిపోయి, వాళ్ళందరూ చేస్తున్నారంటే అది వాళ్ళకి ఉద్యోగం. కానీ నువ్వు ఎవరికీ తెలియకుండా సీక్రెట్ గా చేస్తున్నావు అంటే అది నీకు ఎంత మాత్రం ఉపయోగం కాదు కదా? అయినా నీకు పని చేయవలసిన కర్మ ఏంటి? నువ్వు నన్ను ఉంచుకోరా రంకుమొగుడా నిన్ను జీవితాంతం నేనే చూసుకుంటాను అని ఎన్ని సార్లు చెప్పాను నీకు? అని అంది అరుణ. .... అంత కోపంగా మాట్లాడుతూ కూడా అరుణ ఆ మాట అనేసరికి నాకు నవ్వొచ్చి గట్టిగా నవ్వేసాను. నేను నవ్వడం చూసి అరుణ కూడా నవ్వేసింది. .... అరుణ కొంచెం జోవియల్ మూడ్ లోకి వచ్చేసి, ఈ విషయం పుష్పకి తెలుసా? అని అడిగింది. .... లేదు,, ఇంకా తెలీదు. ఇప్పుడు నీకు తెలిసినట్టే ఏదో ఒకరోజు పుష్ప వదినకి కూడా తెలుస్తుంది.
అలా తెలిసిన రోజు ఖచ్చితంగా నీ లెంపలు వాయించేస్తుంది చూడు. నువ్వంటే తనకి చాలా ప్రేమ ఎప్పుడూ నీ గురించి చాలా గొప్పగా మాట్లాడుతుంది. .... మీ ఇద్దరికీ పరిచయం చేసి చాలా పెద్ద తప్పు చేశాను. నా సీక్రెట్స్ ఏవీ దాగేలా కనపడటం లేదు అని నవ్వుతూ అన్నాను. .... అరుణ నా భుజం మీద చిన్నగా కొట్టి, అవునవును నువ్వు నా దగ్గర చాలా సీక్రెట్స్ దాచిపెట్టావు ఇప్పుడిప్పుడే నీ గురించి అంతా తెలుస్తుంది అని అంది. .... సరేగాని నీకు తెలిసిన విషయాలు నీ దగ్గరే ఉండడం మంచిది. ముఖ్యంగా ఇప్పుడు నేను చేసే పని గురించి ఎవరికీ తెలియకూడదు. నేను చెప్పేది నీకు అర్థం అయింది అనుకుంటాను అని అన్నాను. .... ఓకే ఓకే,,, ఐ నో,,,, ఐ విల్ ప్రామిస్,,,, నీ గురించి నా దగ్గర నుంచి ఎవ్వరికీ ఏమీ తెలీదు అని ప్రామిస్ చేస్తున్నాను అని నా చేతిని కొంచం గట్టిగా పట్టుకొని భరోసా ఇచ్చింది. ఆ తర్వాత కొద్ది సెకన్ల పాటు నన్ను చూస్తూ కూర్చుని, నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. కానీ నీఅంత మంచితనం నాకు లేనందుకు ఈర్ష్యగా కూడా ఉంది అని అంది.
అలా ఏం కాదులే, నువ్వు ఎంత మంచిదానివి కాకపోతే నా గురించి ఏమీ తెలియకుండానే ఇంత దగ్గరకి ఎలా రానిస్తావు? ఈ ఇల్లు కూడా రాసిస్తాను అన్నావు కదా? అని నవ్వుతూ అన్నాను. .... అదంతా రోకు,,, ఇప్పటికీ కూడా నేను అదే మాట మీద ఉన్నాను నువ్వు ఊ,, అంటే చాలు వెంటనే నీ పేరు మీద రాసేస్తాను అని చిలిపిగా నవ్వింది. .... చూడు అరుణ నేను ఇదంతా చేస్తున్నది డబ్బు కోసం కాదు. నీకు తెలియని మరో విషయం ఏంటంటే నేను కోట్లాది రూపాయల బిజినెస్ మరియు ఆస్తులకు వారసుడిని నా దగ్గర డబ్బుకు కొదవలేదు. కానీ నా చిన్నతనం నుండి నాలోని ఉన్న కోపం, నాకు ఎదురైన సంఘటనల పట్ల అవగాహన నేను ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి కారణం. సరేలే చాలా టైమ్ అయింది,, ఈ టైంలో వచ్చి నీ నిద్ర కూడా పాడుచేశాను పడుకో అని చెప్పి నేను కూడా మంచం మీద వాలాను. .... ఇది నీ ఇల్లు,, ఇప్పుడే కాదు ఎప్పుడు ఏ సమయంలోనైనా నీ ఇష్టం వచ్చినప్పుడు రావచ్చు వెళ్లొచ్చు అని అంది అరుణ. .... ఇంతలో నా వీపు వెనక గీసుకున్న ప్రాంతంలో చిన్న మంటగా అనిపించడంతో స్ స్ స్,,హహహహ,, అని అన్నాను. .... వెంటనే అరుణ పైకి లేచి నన్ను బోర్లా తిప్పి, నొప్పిగా ఉందా?? ఉండు అని చెప్పి పక్కనే ఉన్న డస్క్ లో నుంచి ఓలినీ ఆయింట్మెంట్ తీసి గీసుకున్న చోట రాసి సున్నితమైన చేతులతో మర్ధనా చేసింది. మెత్తని చేతులు ఆప్యాయంగా నిమురుతుంటే హాయిగా అనిపించింది. అరుణ అలాగే నా పక్కన పడుకుని నా వీపు తడుముతూ హాయిగా నిద్రలోకి జారుకున్నాము. బాగా అలసిపోయి లేటుగా నిద్రపోవడంతో పొద్దున చాలాసేపటి వరకు అలాగే పడుకుండిపోయాము. టింగ్ టింగ్,, అన్న డోర్ బెల్ శబ్దంతో మెలుకువ వచ్చింది. ఆ బెల్ ఆగకుండా మళ్లీ మళ్లీ మోగుతూ ఉండడంతో అరుణ పైకిలేచి ఆఆ,,, వస్తున్నాను,,, అని అనుకుంటూ రూమ్ లో నుంచి బయటికి నడిచింది. ఇంత పొద్దున ఎవరు వచ్చి ఉంటారు? అన్న సందేహంతో నేను కూడా లేచి టీ షర్ట్ వేసుకుని బయటకు నడిచాను.