Episode 090.1
మేము టూర్ కి వెళ్లేందుకు ఇంకా వారం రోజులు టైమ్ ఉండడంతో ఈ లోపు మరొక కేసు ముగించేందుకు నిర్ణయించుకొని ఆ పని మీద సీరియస్ గా దృష్టి పెట్టాను. ఎందుకంటే ఆ కేసు ఒక ఎంపీ కి సంబంధించినది. ఇప్పుడు నేను అటాక్ చేయబోయే వ్యక్తి సదరు ఎంపీ కి రైట్ హ్యాండ్. అతను ఒక మత్స్యకార సంఘానికి చెందిన వ్యక్తి. అటువంటి వ్యక్తిని లేపేసిన తర్వాత ఇంట్లో స్తబ్దుగా కూర్చోవడం కంటే బయటికి వెళ్ళిపోయి ఫ్యామిలీ టూర్ ఎంజాయ్ చేయడం మంచిది అనిపించింది. ఇక అప్పట్నుంచి ఎంపీ అనుచరుడి కోసం రెక్కీ నిర్వహిస్తూ వివరాలు సేకరించడం మొదలు పెట్టాను. అతను ఎంపీ కి సంబంధించిన బ్లాక్ మార్కెట్, స్మగ్లింగ్ లాంటి పనులను ఎంపీ కి సంబంధం లేనట్టు నడిపిస్తూ ఆయనకు అండదండగా ఉంటాడు. అతను గంగవరం పోర్టు దగ్గర మత్స్యకార గ్రామంలో తన సొంత నివాసంలో ఉంటాడు.
ఆ ప్రాంతంలో అతను చాలా ఫేమస్. అతని చుట్టూ ఎప్పుడూ మంది మార్బలం అతని ఆజ్ఞానుసారం పని చేస్తూ ఉంటారు. పోర్టుకు సంబంధించిన కాంట్రాక్టర్లు, ఆఫీసర్లు అతని చెప్పుచేతల్లో పని చేయాల్సిందే. వారిని ఉపయోగించుకొని స్మగ్లింగ్ యదేచ్ఛగా చేస్తుంటాడు. ఆ ప్రాంతంలో సామాన్యులు కూడా అతనికి భయపడి ఎదురు చెప్పకుండా బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. ఆ ప్రాంతంలో అతని మాట శాసనం అటువంటి వ్యక్తిని లేపేయడం అంత ఆషామాషీ కాదు. కానీ అటువంటి వ్యక్తిని లేపేయడం ద్వారా రుద్రకి నా మీద అనుమానం రాకుండా గట్టి నమ్మకం ఏర్పడేలా చేసుకోవచ్చు. దాని తర్వాత నేను కొద్దిరోజులపాటు ఎటువంటి పని చేయకపోయినా రుద్రకి నా మీద అనుమానం రాదు. రుద్రకి చెప్పవలసిన అవసరం లేకుండా ఆ సమయాన్ని నేను టూర్ కోసం ఉపయోగించుకోవచ్చు.
ఒక ఐదు రోజుల పాటు రెక్కీ నిర్వహించి ఒక ప్లాన్ రెడీ చేసుకున్నాను. మధ్య మధ్యలో ఇంటికి వెళ్లి అమ్మ, ప్రీతిలను కలుస్తూ టూర్ తాలూక ఏర్పాట్లు కూడా తెలుసుకున్నాను. సరిగ్గా టూర్ కి బయలుదేరే ముందు రోజు రాత్రి వర్క్ స్టేషన్ లో ఉన్న నా గన్ మరియు అవసరమైన సామాన్లు బ్యాక్ ప్యాక్ లో పెట్టుకొని జంక్షన్ వరకు నడుచుకొని వెళ్లి సిటీబస్సులో నేను చేరాల్సిన చోటికి బయల్దేరాను. అక్కడికి కొద్దిపాటి దూరంలో ఉన్న ఒక పాత సినిమా హాల్లో టికెట్ తీసుకుని సినిమా చూసి బయటికి వచ్చి ఎవరూ గమనించకుండా జాగ్రత్తపడుతూ ఎంపీ అనుచరుడి ఇంటికి చేరుకున్నాను. ఆ ఇంటికి ముందువైపు సెక్యూరిటీ కెమెరాలు ఉన్నాయని ముందే తెలుసుకోవడంతో వెనుక వైపు వీధిలో నుంచి వెళ్లి అతని ఇంటి వెనుక అతను కబ్జా చేసిన స్థలంలో కన్స్ట్రక్షన్ లో ఉన్న ఒక బిల్డింగ్ దగ్గరికి చేరుకున్నాను.
అర్ధరాత్రి దాటడంతో ఎటువంటి అలికిడి లేకుండా నిశ్శబ్దంగా ఉంది. ఆ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ దగ్గర ఒక వాచ్ మెన్ కుర్చీలో కూర్చొని నిద్రపోతున్నాడు. నేను చప్పుడు చేయకుండా లోపలికి ప్రవేశించి నెమ్మదిగా మెట్లెక్కుతూ రెండో ఫ్లోర్ కి చేరుకున్నాను. ఆ ఫ్లోర్ కి సమాంతరంగా ఎంపీ అనుచరుడి పెంట్ హౌస్ ఉంటుంది. పెంట్ హౌస్ ముందర ఖాళీ స్థలంలో ప్రతిరోజు అతను యోగా చేయడానికి వస్తాడు. ఆ సమయంలో అతను ఒంటరిగా ఉంటాడు కాబట్టి అదే సమయాన్ని అతనిని లేపేయడానికి ఎంచుకున్నాను. కన్స్ట్రక్షన్ బిల్డింగ్ లో ఉన్న ఒక పొడవాటి చెక్క బల్లను శబ్దం చేయకుండా తీసుకొని వెళ్లి రెండు బిల్డింగ్ ల మధ్య వారధిలాగా సెట్ చేశాను. దానిమీద జాగ్రత్తగా అడుగులు వేసుకుంటూ అనుచరుడి ఇంటికి చేరుకుని పైన వాటర్ ట్యాంక్ దగ్గర నక్కి కూర్చున్నాను.
సమయం దాదాపు 1:30 కావడంతో అతను బయటికి రావడానికి ఇంకా నాలుగు గంటల సమయం ఉండటంతో వాచ్ లో ఒక అరగంట ముందుకు అలారం సెట్ చేసుకుని పడుకున్నాను. తెల్లవారి 5 గంటలకు అలారం వైబ్రేషన్ తో నిద్రలేచి అలర్ట్ అయ్యాను. ఇంకా సూర్యోదయం కాకపోవడంతో చిన్న వెలుతురు సంతరించుకుంటున్న సమయంలో సరిగ్గా 5:30 గంటలకు డోర్ తెరుచుకున్న చప్పుడు వినపడింది. నేను నా గన్ సైలెన్సర్ బిగించుకుని రెడీగా ఉన్నాను. పైనుంచి చూడగా అతను పెంట్ హౌస్ ముందర ఖాళీ భాగంలో మ్యాట్ పరుచుకొని యోగాసనాలు మొదలుపెట్టాడు. నేను పైన ఉండడంతో అతను గమనించే అవకాశం లేదు. అతని సెక్యూరిటీ మొత్తం గ్రౌండ్ ఫ్లోర్ మరియు ఇంటి ముందర గేటు దగ్గర ఉంటారు కాబట్టి నన్ను ఎవరూ చూసే అవకాశం కూడా లేదు.
అతను ఆసనం వేసుకుని కదలకుండా కూర్చున్న సమయంలో సరిగ్గా అతని తలకి గురిపెట్టి ఒక బుల్లెట్ దించాను. దాంతో అతను కిక్కురుమనకుండా పక్కకి ఒరిగిపోయాడు. ఎందుకైనా మంచిదని మరో బుల్లెట్ అతని కణతకు తగిలే విధంగా షూట్ చేసి అతను పూర్తిగా చనిపోయాడు అని నిర్ధారించుకుని గబగబా అన్ని సర్దుకుని వచ్చిన దారినే చెక్కబల్ల మీద నుంచి కన్స్ట్రక్షన్ బిల్డింగ్ లోకి చేరుకొని మళ్లీ ఆ చెక్క బల్లను యధావిధిగా దాని స్థానంలో పెట్టి చప్పుడు చేయకుండా మెట్లు దిగి అప్పటికే లేచి ఒక రేకుల షెడ్డులో ఉన్న వాచ్మెన్ కళ్లుగప్పి అక్కడి నుంచి తప్పించుకొని మెయిన్ రోడ్డు మీదకి చేరుకున్నాను. సరిగ్గా అదే సమయానికి ఒక సిటీబస్సు బస్టాప్ లో ఆగి ఉండడంతో వెళ్లి అందులో కూర్చుని టికెట్ తీసుకుని ఎటువంటి క్లూస్ మిగలకూడదు అని మరో ప్రాంతంలో దిగిపోయాను.
ఆ తర్వాత అక్కడి నుంచి మరో బస్సు పట్టుకొని నేను ఉండే ప్రాంతానికి చేరుకొని జంక్షన్ నుంచి నడుచుకుంటూ నేరుగా వర్క్ స్టేషన్ కు వెళ్లి నా గన్ మరియు ఇతర సామాగ్రి భద్రపరిచాను అప్పటికి సరిగ్గా సమయ 8:00 కావచ్చింది. రుద్రకి కాల్ చేసి ఆపరేషన్ సక్సెస్ అని వివరాలు చెప్పాను. .... గుడ్ జాబ్ దీపు,,, యు ఆర్ మై హీరో,, మిగిలిన విషయాలు నేను చూసుకుంటాను కానీ కొద్దిరోజులపాటు నువ్వు బయటికి రాకు నాకు కాల్ చెయ్యొద్దు. ఎందుకంటే ఇది ఒక ఎంపీ కి సంబంధించిన విషయం కాబట్టి కొద్దిరోజులు రచ్చ నడుస్తుంది. మీడియా ఫోకస్ మొత్తం అదే విషయం మీద ఉంటుంది అందువలన మన జాగ్రత్తలో మనం ఉండాలి. కొద్ది రోజులు నువ్వెవరో నేనెవరో అన్నట్టే ఉండాలి. సో,,, నీకేమైనా డబ్బు అవసరం ఉందా? అని అడిగాడు. .... నో,, నాకేమీ అవసరం లేదు. నేను మళ్లీ మరొక ఆపరేషన్ మొదలు పెట్టేటప్పుడు నీకు కాల్ చేస్తాను, బాయ్,,, అని చెప్పి కాల్ కట్ చేశాను.
ఆ తర్వాత మరో ఫోన్ నుంచి చీఫ్ కి కాల్ చేసి నేను చేసింది మొత్తం వివరంగా చెప్పాను. .... వెరీ గుడ్ దీపు,,,, యు ఆర్ బ్రిలియంట్. మిగిలిన విషయాలు మేము బ్యాకప్ చేస్తాం ఏమైనా కారణాలు తెలుస్తాయేమో చూద్దాం. నువ్వు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. .... యస్ సర్,,,, ఐ యాం అవేర్ ఆఫ్ దట్. కొద్ది రోజులు ఎటువంటి ఆపరేషన్స్ పెట్టుకోకుండా ఎస్కేప్ మోడ్ లో ఉంటాను. మళ్లీ ఆక్టివిటీస్ మొదలుపెట్టినప్పుడు మీకు ఇన్ఫామ్ చేస్తాను. .... ఓకే టేక్ కేర్,,, అంటూ చీఫ్ కాల్ కట్ చేశారు. ఆ తర్వాత ఆ మొబైల్ స్విచాఫ్ చేసి సేఫ్ లో జాగ్రత్తగా పెట్టి వర్క్ స్టేషన్ లాక్ చేసుకుని నా రూమ్ కి చేరుకున్నాను. ఆ రోజు మధ్యాహ్నం రెండు గంటలకి బాంబే ఫ్లైట్ కి వెళ్లాల్సి ఉండడంతో తొందరగా స్నానం ముగించి ఇంటికి వెళ్ళాలి అనుకొంటుండగా అమ్మ దగ్గర నుంచి కాల్ వచ్చింది.
నాన్న దీపు,, ఇంకా పడుకున్నావా? అని అడిగింది అమ్మ. .... లేదమ్మా ఇప్పుడే జాగింగ్ నుంచి వచ్చి స్నానానికి వెళుతున్నాను ఒక అరగంటలో ఇంటి దగ్గర ఉంటాను అని చెప్పి కాల్ కట్ చేశాను. .... బాత్రూం లోకి వెళ్తుండగా మళ్లీ ఒక కాల్ వచ్చింది. చూడగా అది అను దగ్గర నుంచి వస్తున్న కాల్. కాల్ లిఫ్ట్ చేసి, హాయ్ అను,, ఏంటి ఈ టైంలో కాల్ చేశావ్? అని అడిగాను. .... అట్నుంచి అను తియ్యగా మాట్లాడుతూ, ఏంటి హీరోగారు జాగింగ్ కి రాలేదు,, అంత బిజీగా ఉన్నారా? అని అడిగింది. .... నేను నవ్వుతూ, ఏం లేదు కొద్దిగా పని ఉండి రాలేకపోయాను. .... అంత గొప్ప రాచకార్యాలు ఏమున్నాయో? అంటూ దీర్ఘం తీస్తూ అడిగింది. .... ఏం లేదు అను ఈరోజు మేము టూర్ కి బయలుదేరుతున్నాము కదా ఆ హడావిడిలో ఉన్నాను.
టూర్ కా,,, ఎక్కడికి? ఇంతకుముందు ఎప్పుడూ చెప్పలేదు! ఎవరితో వెళ్తున్నావు? అని అడిగింది. .... ఇంకెవరితో అమ్మ అంకుల్ ప్రీతి లతో పనామా ఐలాండ్స్ కి వెళ్తున్నాము. .... నాకు ముందే చెప్పొచ్చు కదా నేను కూడా మీతో పాటు వచ్చేదాన్ని ఇక్కడ నాకు బోర్ కొడుతుంది అని కోపంగా అంది. .... సారీ అను,,, నేను అలా ఆలోచించలేక పోయాను. నిజానికి ఈ ప్రోగ్రాం ఇంత తొందరగా ఫిక్స్ అవుతుందని నాక్కూడా తెలీదు అని అన్నాను. .... నీకు తెలియక పోతేనేం ఆ ప్రీతి ఉందిగా దానికి కూడా తెలియదా? ఉండు దాని పని చెప్తాను అంటూ కాల్ కట్ చేసింది. నేను ఇంటికి వెళ్లేసరికి మిగిలిన విషయాలు తెలుస్తాయిలే అని నవ్వుకుని బాత్రూంలోకి వెళ్లి స్నానం చేసి వచ్చి తయారయ్యి కావలసిన సామాన్లు సర్దుకొని ఇంటికి బయలుదేరాను.
ఇంటికి చేరుకునే సరికి టిఫిన్ చేయడం కోసం అందరూ నా కోసం వెయిట్ చేస్తున్నారు. నేను కూడా వాళ్లతో పాటు కూర్చుని తొందరగా టిఫిన్ కార్యక్రమం ముగించాము. అంకుల్ బయలుదేరుతూ, మీరు లగేజ్ తీసుకుని 1:00 సమయానికి ఎయిర్ పోర్ట్ కి వచ్చేయండి నేను అటునుంచి అటే వచ్చేస్తాను అని చెప్పి వెళ్లిపోయారు. ఆ తర్వాత మేము ముగ్గురం మా లగేజ్ సర్దుకోవడంలో మునిగిపోయాము. మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత అమ్మ రాము, హరి లను పిలిచి ఒక నెల రోజుల పాటు సెలవు తీసుకొని మీ ఊరికి వెళ్లిరండి అని చెప్పింది. దాంతో వాళ్ళ ఇద్దరి మొహాలు ఆనందంతో వెలిగిపోయాయి. వాళ్ళిద్దరూ మా లగేజ్ కార్లో సర్దిన తర్వాత నేను కార్ డ్రైవింగ్ సీట్లో కూర్చోగా ప్రీతి నా పక్క సీట్ లో కూర్చుంది. అమ్మ వెనకాల కూర్చోగా నేను ముందుకు కదిలించాను.
ఎయిర్ పోర్ట్ కి వెళుతూ, బంగారం అను కాల్ చేసిందా? అని అడిగాను. .... ఊం,, చేసింది. మన టూర్ విషయం తనకు ముందే ఎందుకు చెప్పలేదు అని నాతో గొడవ పెట్టుకుంది. పాపం అనుకి ముందే చెప్పి ఉంటే బాగుండేది కదా? నాకు ఆ ఆలోచన రాలేదు అని అంది ప్రీతి. .... ఏమైంది నాన్న? అని వెనక నుండి అడిగింది అమ్మ. .... ఈరోజు పొద్దున్న నేను తనని కలవకపోయేసరికి తను కాల్ చేసింది. అప్పుడే నీతో కాల్ మాట్లాడి తొందరగా తయారవడానికి వెళుతూ నేను బిజీగా ఉన్నాను అని చెప్పే సరికి బిజీ దేనికోసం అని అడిగింది. అప్పుడు నేను మన టూర్ గురించి చెప్పగా నువ్వు చెప్పలేదు సరే కనీసం ప్రీతి అయినా చెప్పి ఉండొచ్చు కదా? అని కోపంగా కాల్ కట్ చేసింది. .... సరేలే మనం తిరిగి వచ్చిన తర్వాత అను తో కలిసి ఎక్కడికైనా వెళ్లి వద్దాం. ఈ ట్రిప్ కి అను రాకపోవడం కూడా మంచిదే. అక్కడ పరిస్థితులు అనుకి నచ్చకపోవచ్చు అని అంది అమ్మ.
మేము ఎయిర్ పోర్ట్ కి చేరుకొని లగేజ్ దించుకొని నేను కార్ పార్కింగ్ లో పెట్టి వచ్చేసరికి అంకుల్ కూడా ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. ఆయనతోపాటు ఒక మేనేజర్ కూడా వచ్చి మా బోర్డింగ్ పాసుల కార్యక్రమం తనే స్వయంగా చేయించి ఫ్లైట్ టైంకి మాతో పాటు వచ్చి ప్లేన్ లో కూర్చున్నాడు. అమ్మ నేను ప్రీతి ఒక వరుసలో కూర్చోగా అంకుల్ తన మేనేజర్ తో మరో వరుసలో కూర్చొని ఏవో ఫైల్స్ తిరగేస్తూ సీరియస్ గా మాట్లాడుకుంటున్నారు. మరో రెండు గంటల తర్వాత ఫ్లైట్ ముంబైలో ల్యాండ్ అయింది. ఇదివరకు నేను బెంజి అన్నతో కలిసి ఇదే ఎయిర్పోర్టుకి వచ్చిన విషయాన్ని గుర్తు చేసుకున్నాను. లగేజ్ కలెక్ట్ చేసుకుని బయటికి వచ్చేసరికి మా కోసం లగ్జరీ కార్ రెడీగా ఉంది. డ్రైవర్ మేనేజర్ తో కలిసి నేను కూడా లగేజ్ మొత్తం డిక్కీలో సర్దిన తర్వాత ప్రీతి వెళ్లి డ్రైవర్ పక్కన ముందు సీట్లో కూర్చోగా నేను అమ్మ అంకుల్ తో పాటు వెనక కూర్చున్నాను. మేనేజర్ మాకు బాయ్ చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
అక్కడి నుంచి కారు కొంతసేపు ప్రయాణించి బీచ్ పక్కనే ఒక ఎకరం విస్తీర్ణంలో ఉన్న ఒక పెద్ద మూడంతస్తుల ప్రైవేట్ బిల్డింగ్ ముందు ఆగింది. వెంటనే అక్కడ ఉన్న వాచ్మెన్ సెల్యూట్ చేసి గేట్లు ఓపెన్ చేయగా కార్ లోపలికి వెళ్లి పోర్టికోలో ఆగింది. అక్కడ మా కోసమే వెయిట్ చేస్తున్న ఒక మగ, ఒక ఆడ వ్యక్తి వచ్చి కారు దిగిన మాకు నమస్కారం పెట్టారు. అంకుల్ అమ్మ వాళ్లని నవ్వుతూ పలకరించి, ఎలా ఉన్నారు? అని అడిగారు. .... బాగున్నాం అన్నట్టు నవ్వుతూ తలాడించి కార్ లో ఉన్న లగేజ్ మొత్తం దింపి లోపలికి తీసుకొని వెళ్లారు. గేట్ నుంచి పోర్టికో వరకు విశాలమైన గార్డెన్ వాటర్ ఫౌంటెన్ లతో సహా చాలా అందంగా తీర్చిదిద్దబడి ఉంది. నాకైతే ఇదంతా ఏదో కొత్త లోకంలో ఉన్నట్టు ఉంది. ప్రీతి పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్లగా అంకుల్ కూడా లోపలికి నడిచారు.
ఆశ్చర్యంతో నిలబడి చుట్టూ చూస్తున్న నన్ను చూసి అమ్మ నా చేతిని పట్టుకుని, ఏంటి నాన్న అలా చూస్తున్నావు బాంబేలో మనకి ఇల్లు ఉంది అని చెప్పాను కదా అది ఇదే అని నవ్వుతూ చెప్పింది. .... నేను ఆశ్చర్యంగా అమ్మ వైపు చూస్తూ, ఇంత పెద్ద ఇల్లు పెట్టుకుని అక్కడ ఎందుకు ఉంటున్నారు అమ్మ? అని అడిగాను. .... అవన్నీ మాట్లాడుకోవడానికి ఇది సమయం కాదు గాని పద లోపలికి వెళ్దాం అని నా చెయ్యి పట్టుకొని తీసుకుని వెళ్ళింది. గ్రౌండ్ ఫ్లోర్ లో ఒక పెద్ద హాల్, కిచెన్ మరియు పెద్ద డైనింగ్ హాల్ ఉన్నాయి. వెనకవైపు మొత్తం గ్లాస్ వాల్ ఉండి ఎదురుగా సముద్రం అక్కడికి వెళ్ళడానికి పచ్చని గార్డెన్ లో నుంచి పాత్ వే ఉన్నాయి.అంకుల్ సోఫాలో కూర్చుని, కమాన్ మై బాయ్, ఎలా ఉంది మన ఇల్లు? అంటూ తన పక్కన కూర్చోమని సోఫా చూపించారు.
నేనైతే ఇంకా ఆశ్చర్యం నుంచి తేరుకోలేక పోతున్నాను. కానీ అలాగే వెళ్లి అంకుల్ పక్కన కూర్చున్నాను. ఇంతలో ప్రీతి ఇల్లంతా పరిగెత్తి చెక్ చేసి ఆయాసపడుతూ వచ్చి అంకుల్ కి మరోపక్క కూర్చుంది. అమ్మ కూడా మరో సోఫాలో కూర్చోగా ఆ ఆడ వ్యక్తి మా అందరికీ కూల్ డ్రింక్స్ పట్టుకొని వచ్చింది. మేము వాటిని అందుకొని తాగుతూ ఉండగా అంకుల్ మాట్లాడుతూ, మేడం డోంట్ వేస్ట్ టైం, ఇక్కడ మనం ఒక పార్టీకి అటెండ్ అయ్యి రాత్రి 1:00 కు ఫ్లైట్ కి చేరుకోవాలి. సో,, మీరు ఎంత తొందరగా తయారైతే అంత మంచిది అని అన్నారు. ....దీపక్,,, ఇప్పుడు మేము పార్టీకి రావడం అంత అవసరమా అని కొంచెం దీనంగా అడిగింది అమ్మ. .... తప్పకుండా రావాల్సిందే,, ఈరోజు మీ అందరిని తీసుకొస్తున్నాను అని అక్కడ మాట ఇచ్చేసాను అన్నారు అంకుల్.
నాకు ఇదేమీ అర్థం కాక దిక్కులు చూస్తుంటే అంకుల్ నాతో మాట్లాడుతూ, ఏం లేదు నాన్న ఈరోజు మా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ తో ఒక చిన్న గెట్ టుగెదర్ ఉంది. దానికి ఫ్యామిలీతో అటెండ్ అవుతున్నాను అని ప్రామిస్ చేశాను. మీ అమ్మకి ఇలాంటి బిజినెస్ పార్టీలంటే కొంచెం చిరాకు ఎక్కువ అని నవ్వారు. .... నీకు నీ కూతురికి చాలా సంబరంగా ఉంటుంది కదా,, అని వెటకారం చేసింది అమ్మ. .... ఇది పేజ్ త్రీ పార్టీ కాదు మేడం మీరు నిరభ్యంతరంగా రావచ్చు అని అంకుల్ కూడా నవ్వుతూ వెటకారం చేశారు. వాళ్ళిద్దరి మధ్య సరదా సంభాషణ వింటూ ప్రీతి నేను నవ్వుకున్నాము. డ్రింక్స్ తాగడం పూర్తిచేసి అమ్మ పైకి లేచి, దా నాన్న పైకి వెళ్లి తయారయ్యి వద్దాం అంటూ ఒక చేతితో నన్ను మరో చేత్తో ప్రీతిని పట్టుకొని పైకి నడిచింది. అంకుల్ కూడా నవ్వుతూ మమ్మల్ని అనుసరించారు.
అంకుల్ అమ్మ ఒక రూమ్ లోకి వెళ్ళగా నేను ప్రీతి మరో రూమ్ లోకి వెళ్లి ఫ్రెష్ అయ్యాము. ప్రీతి తన లగేజ్ లోనుంచి ఒక సింగిల్ పీస్ బ్లాక్ మినీ డ్రెస్ తీసి వేసుకుంది. నేను మాత్రం జీన్స్ మరియు ఫుల్ హ్యాండ్ షర్ట్ వేసుకొని టక్ చేసి చాలా నార్మల్ గా రెడీ అయ్యాను. ఇంతలో అమ్మ మా గదిలోకి వచ్చి, ఏంటి నాన్న ఇలా తయారయ్యావు సూట్ వేసుకోవాల్సింది అని అంది. .... మనకి ఇలాంటి సూట్లు బూట్లు కొద్దిగా అలవాటు లేని కారణంగా అవి వేసుకోవాలంటే కొంచెం ఎబ్బెట్టుగా ఉంటుంది. అదే విషయాన్ని అమ్మకు చెబుతూ, పర్వాలేదులే అమ్మ నాకు ఇలాగే కంఫర్ట్ గా ఉంటుంది అని అన్నాను. .... ఇంతలో అంకుల్ మా రూంలోకి వచ్చి, ఏంటి డిస్కషన్ నడుస్తుంది అని అడిగారు. .... అమ్మ మాట్లాడుతూ ఏం లేదు దీపక్ సూటు వేసుకోమని చెప్తున్నాను కానీ వీడికి ఇలాగే కంఫర్ట్ గా ఉంటుంది అంటున్నాడు.