Episode 092.2
ఇకపోతే ఇక్కడి గవర్నమెంట్ ఇటువంటి రిసార్ట్ నడపడానికి ఎటువంటి అభ్యంతరం చెప్పకుండా పర్మిషన్ ఇవ్వడంతో నేను కూడా ఓకే చెప్పాను. మొదట్లో చాలావరకూ ఈ ఐలాండ్ రిసార్ట్ కన్స్ట్రక్షన్, మేనేజ్మెంట్ అంతా అతనే చూసుకున్నాడు. ఒక త్రీ ఇయర్స్ లో బాగా డెవలప్ అయి మాకు చాలా ప్రాఫిట్స్ తెచ్చిపెట్టింది. కానీ ఆ తర్వాత మెక్సికోలో ఉన్న అతని సొంత హోటల్ మరియు ఇక్కడ ఈ రిసార్ట్ రెండూ చూసుకోవడం అతనికి కష్టంగా మారింది. పైగా అతని దగ్గర డబ్బులు కూడా పెరగడంతో మెక్సికోలో తన హోటల్స్ బిజినెస్ విస్తరించాలని ఇక్కడ మా పార్ట్నర్షిప్ నుంచి తనే స్వచ్చందంగా వైదొలిగి తన షేర్ తీసుకొని వెళ్ళిపోయాడు. నిజం చెప్పాలంటే మనం ఇక్కడ బిజినెస్ చేయడానికి అంత తొందరగా పర్మిషన్ దొరకదు. కానీ అతను అమెరికన్ కావడంతో అతని ద్వారా రిజిస్టర్ అయి ఇక్కడ బిజినెస్ ని తొందరగా డెవలప్ చేయగలిగాము. కానీ ఇప్పుడు అతను వైదొలగిన తర్వాత ఈ ఐలాండ్ మొత్తం మన సొంతం అయిపోయింది. ఇన్ ఫాక్ట్ నాకున్న సొంత బిజినెస్ లో ఇదే మంచి రెవెన్యూ తెచ్చిపెడుతుంది అని చెప్పారు.
మరి మీకు అక్కడ ఇక్కడ చూసుకోవడం కష్టంగా లేదా? అని అడిగాను. .... మ్,,, మొదట్లో కొంచెం ఇబ్బందిగానే ఉండేది. అప్పుడు ప్రీతీ చిన్నపిల్ల వాళ్ళని అక్కడ వదిలేసి అటు ఇటు తిరగడం కొంచెం కష్టంగానే ఉండేది. కానీ ఇండియాలో ఉన్న మన హోటల్స్ మేనేజ్మెంట్ చూసుకోవడం కొంచెం ఈజీగానే ఉండేది. ఎందుకంటే అక్కడ మొత్తం ఏడుగురు పార్ట్నర్స్ ఒక్కొక్క సిటీలో ఒక్కొక్కరు అక్కడ ఉన్న హోటల్ చూసుకుంటే సరిపోయేది. ఒకవేళ నేను అక్కడ లేకపోయినా ఎవరో ఒక పార్ట్నర్ సహాయంగా ఉండేవారు. ఆ టైంని నేను ఇక్కడ వాడుకొనే వాడిని. లక్కీగా నాకు ఇక్కడ మంచి స్టాప్ దొరికారు. మన ఇండియాలో లాగా కాకుండా ఇక్కడవారు చాలా నిజాయితీగా పని చేస్తారు. అప్పటినుంచి నేను మరింత ఫ్రీ అయిపోయాను. సంవత్సరానికి ఒకటి రెండు సార్లు ఇక్కడికి వచ్చి వెళ్లిపోతే సరిపోతుంది. మిగిలిందంతా ఇక్కడ స్టాప్ చక్కగా మేనేజ్ చేస్తారు. ఈ రిసార్ట్ బాగా నడిస్తే వాళ్లకు పని దొరుకుతుంది నేను కూడా వాళ్లకు కావలసినంత శాలరీ ఇస్తాను కాబట్టి దీన్ని తమ సొంత బిజినెస్ లా శ్రద్ధగా చూసుకుంటారు.
ఇక్కడ అన్ని కుదురుకున్న తర్వాత కరీబియన్ ఐలాండ్స్ లో హోటల్ బిజినెస్ కి డిమాండ్ పెరగడంతో అక్కడ కూడా ఒక ఐలాండ్లో ఒక బీచ్ సైడ్ రిసార్ట్ పెట్టడం జరిగింది. అక్కడ కూడా ఇలాగే లోకల్ గా ఉన్న మంచి వ్యక్తులు స్టాఫ్ గా దొరకడంతో నా పని మరింత ఈజీ అయిపోయింది. ఇక్కడ వచ్చినంత రెవెన్యూ అక్కడ రాదు కానీ అది కూడా లాభాల్లోనే నడుస్తుంది. కాకపోతే అక్కడ మన రిసార్టు ఉన్న ఏరియా మాత్రమే మన సొంతం. కానీ ఇక్కడ ఐలాండ్ మొత్తం మనదే. ఆ తర్వాత రీసెంట్ గా ఒక నాలుగు సంవత్సరాల క్రితం నాకు ఇండియాలో ఉన్న ఒక ఫ్రెండ్ ఆస్ట్రేలియాలో సెటిలై అక్కడ హోటల్ బిజినెస్ మొదలు పెడుతూ నన్ను కూడా పార్టనర్ గా చేరమన్నాడు. అప్పటికి నేను బాగా సంపాదించి ఉండడంతో అతనితో కలిసి అక్కడ ఒక సెవెన్ స్టార్ హోటల్ నిర్మించాము. ఇప్పుడు అది కూడా మంచి పేరు సంపాదించి బాగా రెవెన్యూ జనరేట్ చేస్తుంది.
నేను ఆస్ట్రేలియాకి సంవత్సరంలో ఒకసారి వెళ్తే సరిపోతుంది మిగిలిందంతా నా ఫ్రెండ్ అక్కడే ఉండి చూసుకుంటాడు. మొత్తానికి మనకంటూ సొంతంగా ఉన్నవి ఈ రెండు ఐలాండ్స్ లో ఉన్న రిసార్ట్స్. ఆస్ట్రేలియాలో ఉన్నది నా ఫ్రెండ్ తో పార్ట్నర్ షిప్. ఇకపోతే ఇండియాలో గ్రూప్ ఆఫ్ హోటల్స్ మొత్తం ఏడు ఉన్నాయి. మన వైజాగ్, చెన్నై, బెంగళూర్, ముంబై, గుజరాత్, ఢిల్లీ మరియు కోల్కతాలలో ఉన్నాయి. ఢిల్లీ తప్ప మిగిలినవి అన్ని బీచ్ సైడ్ ఉన్న హోటల్సే. ఢిల్లీ,ముంబైలో 7స్టార్ హోటల్స్ కాగా మిగిలినవి అన్నీ 5స్టార్ హోటల్స్. ఇప్పుడు అంతా ఆన్లైన్ లో చూసుకునే ఫెసిలిటీ వచ్చేసింది కాబట్టి ఎక్కడ ఉన్నా మిగిలిన బిజినెస్ తో కనెక్ట్ అవ్వగలుగుతాను. ప్రతి చోట నా సెక్రెటరీలు చాలా శ్రద్ధగా పని చేస్తారు. మనం బిజినెస్ చక్కగా ముందుకు పోవాలంటే మనకి నమ్మకమైన మనుషులను ఏర్పాటు చేసుకోవడం చాలా ముఖ్యం. వాళ్లని మనతో సమానంగా చూసుకున్నప్పుడే వాళ్లకి మన మీద గౌరవం పెరిగి మన కోసం పని చేయగలుగుతారు. నేను బిజినెస్ లో పాటించే అతి ముఖ్యమైన విషయం ఇదే అని చెప్పారు.
అంకుల్ చెప్పిందంతా చాలా జాగ్రత్తగా విన్నాను. ఆయన్నుంచి చాలా నేర్చుకోవచ్చు అనిపించింది. అన్నిటికంటే ముఖ్యంగా ఇన్ని బిజినెస్లు అవలీలగా మేనేజ్ చేస్తూ ఎక్కువ సమయం ఫ్యామిలీకి కేటాయించడం కూడా నన్ను చాలా బాగా ఆకట్టుకున్న విషయం. అదే విషయం గురించి అంకుల్ ని అడుగుతూ, మీరు ఇంత బిజీ బిజినెస్మేన్ అయ్యుండి అంత కూల్ గా ఎలా ఉండగలుగుతున్నారు? మరీ ముఖ్యంగా రోజు టైంకి వెళ్లి మళ్లీ తిరిగి టైంకి ఇంటికి వచ్చేస్తారు అదెలా సాధ్యం? అని అడిగాను. .... అంకుల్ నవ్వుతూ, నేను ఏ పని చేసినా అది నా ఫ్యామిలీని సంతోష పెట్టడానికే కదా. అలాంటప్పుడు వాళ్ల సంతోషం కంటే నాకు ముఖ్యమైనది ఇంకేముంటుంది. నేను బిజినెస్ చేయడానికి నా తల్లిదండ్రులు తమ సర్వస్వం నా కోసం వెచ్చించారు. కానీ వాళ్ళు నా ఎదుగుదలను చూడలేకపోయారు.
ఇక నాకు మిగిలింది కవిత, ప్రీతి వాళ్ళిద్దర్నీ ఎల్లప్పుడూ సంతోషంగా ఉంచడం కంటే నాకు ముఖ్యమైనది ఏముంటుంది. ఇప్పుడు వాళ్లతో పాటు నువ్వు కూడా, ఒక మంచి ఫ్యామిలీ లైఫ్ ని ఎంజాయ్ చేయడం కంటే ఇంకా ఏది ముఖ్యం కాదు. ఎంత డబ్బు సంపాదించినా భార్యాబిడ్డల ప్రేమ కంటే అది మనకి ఎక్కువసేపు సంతోషాన్ని ఇవ్వలేదు. ఇక మిగిలిన వ్యవహారాలు అంటావా ఇటువంటి బిజినెస్లు చేసేటప్పుడు కొన్నిసార్లు మన ఆలోచనలకు విరుద్ధంగా కాంప్రమైజ్ కావాల్సి ఉంటుంది. ముఖ్యంగా మన దేశంలో గవర్నమెంట్ మరియు ఇతర బిజినెస్ పీపుల్ తో సఖ్యత మెయింటెన్ చేయడం చాలా అవసరం. అందులో భాగమే కార్పొరేట్ కల్చర్ పార్టీలు, రాజకీయ నాయకులకు లంచాలు మొదలగునవి చెయ్యక తప్పదు. అందుకే నేను ఎప్పుడూ ఈ బిజినెస్ లు అన్ని పక్కన పెట్టి ఫ్యామిలీ కోసం టైం కేటాయిస్తాను.
మీ అమ్మ నా జీవితంలోకి వచ్చిన తర్వాత చాలా తొందరగా ఎదిగాను. అందులో మీ అమ్మ కృషి కూడా ఉంది. తను ఎప్పుడూ నాకు ఏ విషయంలోనూ కూడా అభ్యంతరం చెప్పలేదు. నేను తన దగ్గర ఉన్నా లేకపోయినా నన్ను ఇబ్బంది పెట్టేది కాదు. నాకు సంబంధించినంత వరకు మీ అమ్మ కంటే ముఖ్యమైనది ఇంకేమీ లేదు. నేను కన్నుమూసే వరకు మీ అమ్మను సంతోషంగా చూసుకోవాలి అనేదే నా చివరి కోరిక. ఇప్పుడు మీ ముగ్గురుతో కలిసి నా లైఫ్ ని ఇంకా హ్యాపీగా ఎంజాయ్ చేయగలుగుతున్నాను అని నవ్వుతూ అన్నారు. .... ఎందుకో తెలీదు గానీ ఆ సమయంలో అంకుల్ ని చూస్తుంటే చాలా గర్వంగా అనిపించింది. ఈ వయసులో నాకు నా కన్నతండ్రి పక్కనుండి ఇటువంటి విషయాలు అన్ని నేర్పించాలి. కానీ ఆయనేమో జాతకాలు మూఢనమ్మకాలు చెప్పుడు మాటలు నమ్మి నన్ను చిన్నతనంలోనే బయటకు గెంటేశాడు. కానీ అంకుల్ మాత్రం ఒక కొడుకుతో ఎలా ఉండాలో అలా అన్నీ విషయాలు పంచుకుంటూ చాలా బాధ్యతగా ఉన్నారు. అంకుల్ తో పర్సనల్ గా గడిపిన ఈ సమయం నాలో చాలా స్ఫూర్తిని నింపింది. అంతలో లూసీ కొన్ని ఫైల్స్ పట్టుకొని లోపలికి వచ్చి అంకుల్ ముందు పెట్టగా అంకుల్ ఒకసారి చెక్ చేసుకుని కొన్ని సంతకాలు పెట్టి టైం చూసుకుని సీట్లోంచి లేచి, మిగిలిన పని రేపు చూసుకుందాం అని లూసీతో చెప్పి, పద నాన్న మనం వెళ్దాం అన్నారు. నేను కూడా సీట్లో నుంచి లేచి ఇద్దరం కలిసి లిఫ్ట్ లో పైకి చేరుకున్నాము.
మేము హాల్ లోకి ఎంటర్ అయ్యే సరికి అమ్మ సోఫాలో కూర్చుని ఏదో మ్యాగజైన్ తిరగేస్తుంటే ప్రీతి అమ్మ ఒడిలో తల పెట్టుకొని పడుకొని ఉంది. గుడ్ ఈవెనింగ్ మేడం,,, ఏంటి నా తల్లి నిద్ర పోతుందా? అంటూ అంకుల్ సోఫాలో కూర్చున్నారు. .... నేను ఫ్రెష్ అయ్యి వస్తాను అని చెప్పి రూం లోకి వెళ్ళాను. ఫ్రెష్ అయి తిరిగి వచ్చేసరికి ప్రీతి నిద్రలేచి రూమ్ లోకి వస్తూ నాకు ఒక హాగ్ ఇచ్చి బాత్రూం లోకి వెళ్ళింది. నేను హాల్ లోకి వచ్చే సరికి ఎవరూ లేరు. బహుశా అమ్మ అంకుల్ కూడా ఫ్రెష్ అవడానికి వెళ్ళుంటారు. మరో ఐదు నిమిషాల తర్వాత అందరూ హాల్ లోకి వచ్చి బయట షికారుకి బయలుదేరాము. ముందుగా ఫస్ట్ ఫ్లోర్ లో దిగి అమ్మకి ప్రీతికి ఆఫీస్ మొత్తం చూపించాము. అంతలో లూసీ మా దగ్గరికి రాగా అంకుల్ అమ్మకి ప్రీతికి ఆమెను పరిచయం చేశారు. సర్ టీ కాఫీ ఏమైనా తీసుకుంటారా? అని లూసీ అడగగా లేదు మేము బయటికి వెళ్తున్నాం అక్కడ తీసుకుంటాములే అని చెప్పి కింద రిసెప్షన్ ఏరియాకి చేరుకున్నాము.
మేము రావడం చూసిన ఇసబెల్లా మా దగ్గరికి వచ్చి, సార్ నాతో ఏమైనా అవసరం ఉందా? అని అడిగింది. .... లేదు,,, నేను ఉన్నానుగా నేను చూసుకుంటాను నువ్వు నీ పని చూసుకో అని చెప్పి బయటికి నడిచాము. అంకుల్ ఒక బ్యాటరీ వెహికల్ స్టార్ట్ చేయగా అమ్మ అంకుల్ పక్కన కూర్చుంది. నేను ప్రీతి వెనక కూర్చున్నాము. అంకుల్ నెమ్మదిగా డ్రైవ్ చేస్తూ డాక్ ఏరియా నుంచి ఎక్కువగా బ్యాటరీ వెహికల్స్ జనాన్ని తీసుకొస్తూ ఉండడం చూపించి, ఈ టైం లో ప్యాసింజర్ బోట్స్ వస్తాయి అందువలన కొంచెం ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది. మధ్యాహ్నం రెండు బోట్లు సాయంత్రం రెండు బోట్లు వస్తాయి. సాయంత్రం వచ్చిన బోట్లు ఇక్కడే ఉండిపోయి పొద్దున్న వెకేట్ చేసి వెళ్లిపోయే వారిని తీసుకు వెళుతుంటాయి. కొంతమంది ఇండివిడ్యువల్ గా స్పీడ్ బోట్స్ బుక్ చేసుకొని వస్తుంటారు అని చెప్పారు.
అలా ముందుకు వెళుతూ ఫ్యామిలీ ఏరియాకి చేరుకొని ఒక కాఫీ షాప్ ముందు ఆపి, ఏమైనా తాగుతారా? అని అడిగారు. .... కాఫీ చెప్పండి అని అమ్మ అనడంతో మా వెహికల్ అక్కడ ఆగగానే మా దగ్గరికి వచ్చి నిల్చున్న ఒక వాలంటీర్ బ్యూటీని చూసి, నాలుగు కాఫీలు అని ఆర్డర్ వేశారు అంకుల్. ఆ వెంటనే అక్కడి నుంచి పరుగు పరుగున కాఫీ షాప్ లోకి వెళ్ళిపోయి 5 నిమిషాల్లో కాఫీ తెచ్చి మాకు అందించింది. మేము కాఫీ తాగుతూ నెమ్మదిగా ముందుకు వెళ్లి కొంచెం బిజీగా ఉన్న ఏరియాలో వెహికల్ పక్కన పార్క్ చేసి, పదండి అక్కడ కూర్చుందాం అంటూ అంకుల్ బీచ్ వైపు నడవగా మేము కూడా అనుసరించాము. ఎటు చూసినా చాలా క్యాజువల్ గా దిగంబరంగా తిరుగుతున్న మనుషులు, చిన్న పిల్లలను చంకలో పెట్టుకొని తిరుగుతున్న తల్లులు, బుడిబుడి అడుగులు వేస్తున్న పిల్లల చేయి పట్టుకొని నడిపిస్తున్న తండ్రులు. ఆడుకుంటూ సందడి చేస్తున్న పదహారేళ్ళ లోపు టీనేజ్ అబ్బాయిలు అమ్మాయిలు అందరితో వాతావరణం చాలా సరదాగా ఉంది.
కొంచెం ఖాళీగా ఉన్న ఏరియాలోకి పెళ్లి ఆగి అంకుల్ చుట్టూ చూడగా అక్కడ కనబడిన ఒక బౌన్సర్ ని దగ్గరకు పిలిచి కింద వేసుకోవడానికి ఏవైనా తీసుకొని రమ్మని ఆర్డర్ వేశారు. అతను గబగబా అక్కడ నుంచి వెళ్లి దళసరిగా ఉన్న ఒక కార్పెట్ తీసుకొని వచ్చి పరిచి పక్కకు వెళ్లి నిల్చున్నాడు. మేము నలుగురం అక్కడ కూర్చుని చుట్టూ జరుగుతున్న హంగామా అంతా పరిశీలిస్తున్నాను. కొంత మంది యువతీ యువకులు వాటర్ బైక్స్ పై తిరుగుతూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇంతలో కొంతమంది చిన్న పిల్లలు ఇసుకలో పరుగుపందెం పెట్టుకొని మా ముందు నుండి పరిగెత్తుకుంటూ వెళ్తున్నారు. వారి వెనుక ఒక బుడ్డోడు పరిగెడుతూ వాళ్లతో పోటీపడలేక ఆగిపోయి కోపంతో అరుస్తూ కింద ఉన్న ఇసుకను చేతిలో తీసుకొని వాళ్ల మీదకి విసురుతూ వచ్చీరాని మాటలతో అరుస్తున్నాడు. వాడిని చూస్తే చాలా కామెడీగా అనిపించి మేము నవ్వుకున్నాము.
కానీ పాపం వాడికి ఇంకా ఆక్రోశం తగ్గినట్టు లేదు వాళ్ళ వైపు చెయ్యి చూపిస్తూ ఏదో వార్నింగ్ ఇస్తున్నాడు. అది చూసి ప్రీతి పగలబడి నవ్వుతూ, చాలా క్యూట్ గా ఉన్నాడు కదా అని చెప్పి వాడిని మా దగ్గరికి రమ్మని పిలిచింది. వాడు అక్కడే నుంచుని మా వైపు ఒకసారి సీరియస్ గా చూసి మళ్లీ ముందుకు వెళ్లిపోయిన పిల్లల వైపు చూశాడు. ప్రీతి మళ్లీ పిలిచినా రాలేదు. ఇంతలో పరిగెత్తుకొని వెళ్లిన పిల్లలు తిరిగి పరిగెత్తుకుంటూ వస్తూ ఉండడం చూసి ఆ బుడ్డోడు వెనక్కి తిరిగి పరిగెడుతూ చేతులు పైకెత్తి గోల గోల చేస్తూ వాడే ఫస్ట్ వచ్చినట్టు ఫీల్ అయిపోతూ వాళ్ల తల్లిదండ్రుల గుంపు దగ్గరకు వెళ్లి బిల్డప్ ఇస్తున్నాడు. వాడి అతితెలివి చూసి మాకు నవ్వాగలేదు. మరి కొంతమంది పిల్లలు ఇసుకలో గుజ్జనగూళ్ళు కడుతూ ఎంజాయ్ చేస్తున్నారు. పెద్ద వాళ్ళు అయితే చేతిలో బీర్లు విస్కీ గ్లాసులతో కూర్చుని మాట్లాడుకుంటూ సరదాగా ఎంజాయ్ చేస్తున్నారు.
కొంతసేపు అంకుల్ అక్కడ విషయాల గురించి మాకు వివరంగా చెప్పారు. అమ్మ మాట్లాడుతూ, ఇంత మంది ఇలా పబ్లిక్ గా బట్టలు లేకుండా ఎలా తిరుగగలుగుతున్నారు అని కొంచెం ఆశ్చర్యంగా అడిగింది. .... ప్రీతి అమ్మకి కౌంటర్ ఇస్తూ, అందర్నీ నీలాగా చీరలు చుట్టుకొని తిరగమంటావా ఏంటి? ఈ విషయంలో నువ్వు కొంచెం ఎదగాలి మమ్మీ అని ఎగతాళి చేస్తూ నవ్వింది. .... అమ్మ చెయ్యెత్తి, దొంగముండ నేను నీ దగ్గర నేర్చుకోవాలా? అని సరదాగా అంటూ తన పిర్ర మీద కొట్టబోతే ప్రీతి తప్పించుకొని అక్కడి నుంచి లేచి నిల్చుని వెవ్వెవ్వె,,,, అని వెక్కిరించి, డాడీ మనం కూడా వాటర్ బైక్ తీసుకొని బీచ్ లోకి వెళ్దాం రండి అని అంది. .... పదండి మేడం అంటూ అంకుల్ పైకి లేచారు. .... నేను రాను మీరు వెళ్లిరండి అని అంది అమ్మ. .... పదమ్మ మనం కూడా వెళ్దాం నువ్వు నా బైక్ మీద కూర్చో అని నేను అడగడంతో అమ్మ కూడా పైకి లేచింది.
నలుగురం డాక్ దగ్గరకి చేరుకుని అంకుల్ నేను చెరో బైక్ తీసుకొని నెమ్మదిగా వాటర్ లోకి వెళ్ళాము. వాటర్ బైక్ నడపడం చాలా సరదాగా చాలా ఈజీగా కూడా ఉంది. పెద్దగా అలలు లేవు కాబట్టి ఈజీగానే బీచ్ లో చక్కర్లు కొట్టాము. కొంతసేపటి తర్వాత ప్రీతి అంకుల్ ని వెనక కూర్చోబెట్టుకొని తాను డ్రైవ్ చేస్తూ ఎంజాయ్ చేసింది. నేను కూడా అమ్మను అడగగా, వద్దు నాన్న నువ్వే డ్రైవ్ చెయ్ నేను నీ వెనకాల కూర్చుంటాను అని చెప్పి నన్ను గట్టిగా వాటేసుకొని పట్టుకుంది. దాదాపు ఒక గంట సేపు వాటర్ బైక్స్ రైడింగ్ ఎంజాయ్ చేసి మళ్ళీ వచ్చి మా ప్లేస్ లో కూర్చున్నాము. ఇదంతా చాలా కొత్తగా ఉండటంతో నాకు కూడా చాలా ఉత్సాహంగా అనిపించింది. ఇక ప్రీతి సంగతి చెప్పనవసరం లేదు. ఎగిరి గంతుతూ పిచ్చ పిచ్చగా ఎంజాయ్ చేస్తుంది.
కొంచెం చీకటి పడుతున్న సమయంలో, ఏమైనా తినడానికి తాగడానికి తీసుకుంటారా? అని అడిగారు అంకుల్. ... వెంటనే ప్రీతి, డాడీ నాకు బీరు కావాలి అని అంది. .... అంకుల్ నవ్వుతూ, ఆర్ యు ష్యూర్?? అని అడిగారు. .... వెంటనే అమ్మ అంకుల్ భుజం మీద కొట్టి, నువ్వు ఇలాగే దాన్ని ఎంకరేజ్ చెయ్ ఇప్పటికే నెత్తికెక్కి కూర్చుంది ఇలాంటివన్నీ దగ్గరుండి అలవాటు చేస్తే రేపు పొద్దున్న ఇంట్లో కూడా నీతో పాటు గ్లాసు పట్టుకుని కూర్చుంటుంది అని అంకుల్ ని దెప్పి పొడిచింది. .... అంకుల్ మాట్లాడుతూ, అది కావాలనుకుంటే మనకు చెప్పకుండా బయట తన ఫ్రెండ్స్ తో కూడా తాగి ఇంటికి రావచ్చు. కానీ నా కూతురు చూడు బుద్ధిగా నా పర్మిషన్ తీసుకుని నాతోనే మొదలు పెట్టాలని అనుకుంటుంది అని కొంచెం గర్వంగా నవ్వుతూ చెప్పారు. .... సరిపోయింది,,, అని అమ్మ తల మీద చేతులు పెట్టుకుని కూర్చుంది.
అంకుల్ అమ్మ బుజం చుట్టూ చెయ్యి వేసి దగ్గరికి తీసుకొని బుగ్గ మీద ముద్దు పెట్టి, జీవితం చాలా చిన్నది మేడం దాన్ని వీలైనంతవరకు హుందాగా ఎంజాయ్ చేయడమే బెటర్. సరేగాని నువ్వు ఏం తీసుకుంటావు చెప్పు అని అడిగారు అంకుల్. .... నాకేం వద్దు నువ్వు నీ కూతురు తాగండి అని అంది అమ్మ. .... ఇటువంటి అకేషన్ అస్తమానం రాదు మేడం, అలిగింది చాలు గాని ఏం తీసుకుంటావో చెప్పు అని అడిగారు అంకుల్. .... నాకు ఏదైనా జ్యూస్ పట్టుకురండి అని అంది అమ్మ. .... అదేంటి అలా అంటావు కనీసం వైన్ అయినా తీసుకో నీకు అలవాటే కదా అని ముద్దుగా అడిగారు అంకుల్. .... అమ్మ ఒకసారి అంకుల్ వైపు సీరియస్ గా చూసి మళ్లీ అంతలోనే చిన్న చిరునవ్వు నవ్వుతూ, సరే తీసుకురా,, అని చెప్పింది. నీకేం కావాలి అన్నట్టు అంకుల్ నావైపు చూడగా, నాకు కూడా బీరు అని అన్నాను.
అంకుల్ పైకి లేస్తుంటే నేను కూడా ఆయనతోపాటు వెళ్లడానికి లేవబోతుండగా అంకుల్ నన్ను ఆపి, నువ్వు కూర్చో నాన్న నేను ప్రీతి వెళ్లి తీసుకొస్తాం అని చెప్పి ప్రీతి చెయ్యి పట్టుకొని వెళ్లారు. అమ్మ నన్ను దగ్గరకు లాక్కుని తన ఒడిలో పడుకోబెట్టుకుని, చూసావా మీ అంకుల్ పని ఇలా ఉంటుంది. అది ఏది అడిగినా కాదనరు. నేనే అనుకుంటే నాకంటే ఎక్కువ గారాబం చేస్తారు దాన్ని అని నవ్వుతూ అంది. .... మీరు చాలా లక్కీ అమ్మ అంకుల్ చాలా కూల్ పర్సన్. సాయంత్రం ఆఫీస్ లో అంకుల్ నాతో చాలా విషయాలు మాట్లాడారు. అంకుల్ కి నువ్వు ప్రీతి అంటే ప్రాణం. ఆయన మీ కోసం ఏం చేయడానికైనా సిద్ధమే. నిజం చెప్పాలంటే అంకుల్ ని చూసి నాకు చాలా గర్వంగా అనిపించింది. .... అవును నాన్న నువ్వు చెప్పేది నిజమే. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే మా గురించే ఆలోచిస్తూ ఉంటారు అని మురిసిపోయింది అమ్మ.
ఇంతలో అంకుల్ ప్రీతి బీర్లు, విస్కీ బాటిల్, వైన్ బాటిల్, గ్లాసులు ఇంకా తినడానికి ప్రాన్స్ ఫ్రై, ఫింగర్ చిప్స్ లాంటివి పట్టుకుని వచ్చారు. కూర్చొని సెటిల్ అయ్యి అమ్మకి వైన్ గ్లాస్ అందించి తన గ్లాసులో విస్కీ పోసుకుని మా ఇద్దరికీ బీర్ బాటిల్స్ అందించారు. అందరం చీర్స్ చెప్పుకొని తాగడం మొదలు పెట్టాము. అమ్మ మాట్లాడుతూ, సిగ్గులేకుండా పబ్లిక్ లో కూర్చుని కుటుంబం అంతా కలిసి మందు కొడుతున్నాము అని అంది. .... హలో మేడం నువ్వు తాగే దాన్ని మందు అనరు అది కేవలం ద్రాక్షపళ్ళ జ్యూస్ పెద్ద మందు కొట్టేదానిలా బిల్డప్ ఇస్తుంది అని అన్నారు అంకుల్. ఆ మాటకి నేను ప్రీతి పడి పడి నవ్వాము. దాంతో అమ్మ సిగ్గుతో తల దించుకుని నవ్వుతూ అంకుల్ యద మీద వాలిపోయింది. అంకుల్ మంచి జాలి మూడ్ లో అమ్మ మీద సరదాగా జోకులు వేస్తూ మధ్యమధ్యలో ప్రీతి అమ్మని ఆటపట్టిస్తూ చాలా సరదాగా గడిపాము. ఆ తర్వాత అక్కడ నుంచి లేచి వేస్టేజ్ అంతా దగ్గర్లో ఉన్న డస్ట్ బిన్ లో వేసి విస్కీ బాటిల్ మరియు వైన్ బాటిల్ పట్టుకొని అక్కడినుంచి బయలుదేరాము. రూమ్ కి చేరుకొని ఫుడ్ ఆర్డర్ ఇచ్చి అంకుల్ మళ్ళీ తాగడం మొదలు పెట్టారు. అమ్మ చిరాకు పడుతూ, తాగింది చాల్లేదా ఇక చాల్లెండి, వదిలితే బాటిల్ బాటిల్ ఖాళీ చేసేస్తారు అంటూ బాటిల్ తీసుకుని పక్కన పెట్టేసింది. ప్రీతికి బీరు తాగడం ఇదే మొదటిసారి కావడంతో కిక్ ఎంజాయ్ చేస్తూ డ్యాన్స్ చేస్తుంది. అమ్మ ప్రీతి పిర్ర మీద సరదాగా కొట్టి, అసలే కోతి పైగా కల్లు తాగిందట అని వెనకటికి అనేవారు. ఇప్పుడు నువ్వు అలాగే కనబడుతున్నావు అని అంది. .... ప్రీతి సరదాగా అమ్మను గట్టిగా కౌగిలించుకొని మూతి ముద్దు ఇచ్చి, ఈ ఫీలింగ్ సూపర్ గా ఉంది మమ్మీ నువ్వు కూడా బీరు తాగితే బాగుండు అని అంది. ఆ తర్వాత కొంత సేపటికి భోజనం రావడంతో అందరం కలిసి భోజనం చేసి ఎవరి రూమ్ లోకి వారు వెళ్లి నిద్రపోయాము.