Episode 098.2


అదేంటి బాబు అలా అంటావు? ఇవన్నీ ఇంతకు ముందు నేను చేసే పనులే కదా? ఏమి చేయాలో నాకు చెప్పు నేను అన్నీ చేసి పెడతాను నీ స్నేహితులకు ఎటువంటి లోటు రాకుండా చూసుకుంటాను అని అంది. .... మంచిది మామ్మ,,, వాళ్ళు ముగ్గురు లోపల ఉంటారు కానీ నువ్వు ఇక్కడే వంట చేసి వెనుక డోర్ నుంచి డైనింగ్ హాల్ వరకు వెళ్లి వాళ్లకి కావాల్సిన భోజనం అందిస్తే సరిపోతుంది. వాళ్లకు ఏమైనా కావాల్సి వస్తే నీతో చెప్తారు అవి నువ్వు వాళ్లకు చేసిపెడితే సరిపోతుంది. ఇల్లు ఏమైనా క్లీన్ చేయవలసి వస్తే వాళ్ళు రమ్మంటేనే లోపలికి వెళ్లి వాళ్ళు ఎక్కడ చెప్తే అక్కడ క్లీన్ చేసి వచ్చేయాలి. వాళ్లు లేని సమయంలో గాని వాళ్ళ అనుమతి లేకుండా గాని ఇంట్లోకి వెళ్ళొద్దు అని అన్నాను. .... నువ్వు ఎలా చెప్తే అలాగే చేస్తాను బాబు. .... నేను కొంచెం డబ్బు తీసి మామ్మ చేతిలో పెట్టి, ఖర్చులకి డబ్బులు తీసుకో నీ అకౌంట్ కి ఇంకొంచెం డబ్బులు పంపిస్తాను. వాళ్లు లోపల ఫ్రెష్ అవుతున్నారు నీకు వాళ్ళని తర్వాత పరిచయం చేస్తాను. ఈ రోజు రాత్రికి వాళ్ళకి భోజనం ఏర్పాటు చెయ్యి,, నువ్వు జాగ్రత్త,,, ఏదైనా అవసరం ఉంటే నాతో చెప్పు అని చెప్పి అక్కడ నుంచి బయలుదేరి నా రూమ్ కి వెళ్లిపోయాను.

నేను స్నానం చేసి ఫ్రెష్ అయ్యి రాత్రి తినడానికి నాకోసం భోజనం వండుకుంటూ ఉండగా నా రూమ్ డోర్ చప్పుడైంది. నేను డోర్ తెరవగా సోము, జెస్సీ, తార ముగ్గురు బయట గేటు దగ్గర నిల్చుని ఉన్నారు. హాయ్,,, ఏంటి ఇక్కడికి వచ్చారు ఏమైనా అవసరం ఉందా? అని అడిగాను. .... ఏం ఇక్కడికి రాకూడదా? అని అడిగాడు సోము. .... అబ్బే అలా ఏం లేదు మీరు ఇక్కడికి రావచ్చు అని అన్నాను. .... మమ్మల్ని ఇలాగే ఇక్కడ నిల్చోబెట్టి మాట్లాడతావా నీ రూమ్ లోకి రమ్మని పిలువవా? అని అడిగింది తార. .... ఓహ్,,,, సారీ,,, రండి రండి లోపలికి రండి అంటూ పిలుచుకుని వెళ్లి ముగ్గురుని మంచం మీద కూర్చోపెట్టాను. నేను ఒక చైర్ తీసుకొని వాళ్లకు ఎదురుగా వేసుకుని కూర్చున్నాను. ఇప్పుడు చెప్పండి ఏంటి విషయం? అక్కడ మీకు అంతా సదుపాయంగా ఉందా? అని అడిగాను.

జెస్సి మాట్లాడుతూ, పర్ఫెక్ట్,,, మాకు అక్కడ అన్నీ బాగానే ఉన్నాయి. ఫ్రెష్ అయిన తర్వాత ఖాళీగా ఉన్నాం కదా అని ఇలా వచ్చాము అని అన్నాడు. .... ఇంతకీ మన ఆపరేషన్ ఎప్పుడు మొదలవుతుంది? అని అడిగాడు సోము. ... అంత తొందర ఏం వచ్చిందిరా నీకు? అని అడిగింది తార. .... అదేంటి మనం వచ్చింది ఆపరేషన్ పని మీదే కదా? అని కొంచెం నొచ్చుకున్నట్టు నసిగాడు సోము. .... అది చూసి నేను మాట్లాడుతూ, ఒక రెండు రోజుల్లో వెళ్దాం. రేపు ఈ ఆపరేషన్ కి సంబంధించి కొంచెం ప్రిపరేషన్ చేసుకొని ఎల్లుండి రాత్రికి మన మిషన్ మొదలుపెడదాం. ఇకపోతే ప్లాన్ ఆఫ్ యాక్షన్ గురించి మనం రేపు ఎల్లుండి డిస్కస్ చేసుకుందాం. నాతో పని చేయడానికి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు కదా? అని అడిగాను. .... ఇందులో ఇబ్బంది పడ్డానికి ఏముంది? అని అడిగింది తార. .... అంటే మీరు అందరూ సీనియర్స్ మీకంటే చిన్నవాడిని నా ఆర్డర్స్ తో పని చేయడానికి ఈగో ప్రాబ్లమ్స్ లాంటివి,,,, అని ఆగిపోయాను.

జెస్సి నవ్వుతూ, మేము కూడా అంత గొప్ప సీనియర్స్ అయితే కాదులే. ట్రైనింగ్ పూర్తి అయిన తర్వాత ఆరు నెలలు ఖాళీగా ఉంచారు ఆ తర్వాత ఈమధ్యే ఒక రెండు ఆపరేషన్స్ కి బ్యాక్అప్ టీం కింద తీసుకొని వెళ్లారు. మళ్ళీ ఖాళీగా ఉండగా ఇదిగో ఇప్పుడు నీ దగ్గరికి పంపించారు అని అన్నాడు. .... ఓకే,,, అయినా వయస్సులో నాకంటే పెద్దవాళ్ల్ళు మనం పని చేసేటప్పుడు మీకు ఏదైనా ఇబ్బంది అనిపిస్తే నాకు ముందే చెప్పండి అని అన్నాను. .... హలో,,, ఏంటి నేనేమైనా నీకు ముసలి దానిలాగా కనబడుతున్నానా? జస్ట్ 25 ఇక్కడ, వాళ్లిద్దరూ 26 అని అంది తార. .... అబ్బే నా ఉద్దేశం అది కాదు, నేను ఈ మధ్యే డిపార్ట్మెంట్ లో చేరాను అదికూడా చీఫ్ నన్ను హైర్ మాత్రమే చేసుకున్నారు నేనేమీ మీలాగా పర్మినెంట్ కాను అందుకని ముందే మనమధ్య ఎటువంటి భిన్నాభిప్రాయాలు ఉండకుండా ఉండాలనేదే నా ప్రయత్నం.

జెస్సీ మాట్లాడుతూ, అలాంటిదేమీ ఉండదు నీతో కలిసి ఆపరేషన్ కి వెళ్ళమని మాకు ఆర్డర్. నువ్వు సీనియరువి అయినా జూనియరువి అయినా నీ అండర్ లో పని చేయడమే మా పని. నీ మీద ఎంత నమ్మకం లేకపోతే మాకు ఎటువంటి సూచనలు చేయకుండా నీతో కలిసి పని చేయమని చీఫ్ ఇక్కడికి పంపిస్తారు? డోంట్ వర్రీ,,, నీ ప్లాన్ ప్రకారం మనం కోఆర్డినేట్ చేసుకొని పని చేద్దాం అని అన్నాడు. .... థాంక్యూ జెస్సి,,, సో,, ఇకమీదట మనం ఫార్మాలిటీ పక్కనపెట్టి ఫ్రెండ్స్ లాగా ఉందాం అని అన్నాను. .... హూం,, ఇంకేంటి మావ సంగతులు అంటూ తార లేచి వచ్చి నా భుజం చుట్టూ చేతులు వేసింది. సడన్ గా తార అలా బిహేవ్ చేసేసరికి నాకు ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అయిపోయింది. అది చూసి జెస్సి నవ్వుతుంటే సోము మాత్రం ఎటువంటి ఎక్స్ప్రెషన్ లేకుండా చూస్తున్నాడు. ఏం జరుగుతుందో నాకు అర్థం కాకపోయేసరికి ఏంటిది? అన్నట్టు తార వైపు చూసాను. తార నా మొహంలోని ఎక్స్ప్రెషన్స్ చూసి నవ్వుతూ, ఫ్రెండ్స్ అన్నావ్ కదా? అని అంది.

ఇది చాలా ముదురు అని నాకు అప్పుడు అర్థమైంది. తార నన్ను టచ్ చేసిన తీరు చూస్తుంటే దీనికి స్పీడ్ ఎక్కువ దేనికి వెనకడుగు వేయదు అని అనిపించింది. నేను కూడా నవ్వేసి, ఓకే ఓకే,,, అని అన్నాను. .... నువ్వు ఇంకా మర్యాద తొక్క తోటకూర కట్ట అని నియమాలు పెట్టుకుని కూర్చుంటే కుదరదు మావ. నువ్వు వాడుకోవడానికే మమ్మల్ని ఇక్కడకు పంపించింది. వాడుకో మావ,, వాళ్లిద్దరి సంగతి నాకు తెలీదు కానీ నన్ను నీ ఇష్టం వచ్చినట్టు వాడుకో, నా ఫుల్ కోపరేషన్ నీకు ఉంటది అని డబల్ మీనింగ్ డైలాగ్ కొట్టింది. .... సోము మాట్లాడుతూ, సరిసర్లే మేము ఇక్కడికి ఆడుకోవడానికి వచ్చామా? మేము కూడా పని చేయడానికే వచ్చాము ఆ విషయాన్ని మరీ అంత నొక్కి చెప్పనవసరం లేదు అని అన్నాడు. .... నేను సిట్యువేషన్ కూల్ చేస్తూ, మీరు ముగ్గురు ఎంతకాలం నుండి కలిసి పని చేస్తున్నారు? అని అడిగాను.

మా ముగ్గురి రిక్రూట్మెంట్ ఒకసారే జరిగింది. ట్రైనింగ్ కూడా ఇంచుమించుగా ఓకే దగ్గర జరిగింది. ఆ తర్వాత ఎవరి దారిన వారు వెళ్ళిపోయి మళ్లీ ఇదిగో ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ లో ఏజెంట్లుగా కలిసాము. ఇంచుమించుగా మా ముగ్గురి అనుభవం ఒకటే అని అన్నాడు జెస్సీ. ..... ఓకే,,, సరే అయితే భోజనం టైం అయ్యింది అక్కడ వెనుకవైపు అవుట్ హౌస్ లో ముత్యాలమ్మ మామ్మ మీకోసం భోజనం రెడీ చేసి ఉంటుంది మీరు తినేసి రెస్ట్ తీసుకోండి మనం రేపు పొద్దున కలుద్దాం అని అన్నాను. .... అదేంటి నువ్వు మాతో కలిసి భోజనం చేయవా? అని అడిగింది తార. .... నేను వండుకున్న భోజనం వైపు చూపిస్తూ, అదిగో నా భోజనం రెడీగా ఉంది మీకు అక్కడ ఏర్పాటు చేశాను. ఈ పూటకి ఆమె చేసిన దానితో అడ్జస్ట్ అయిపోండి. రేపటికి మీకు ఏం కావాలో ఆమెతో ముందుగా చెబితే ఆమె అన్ని రెడీ చేసి పెడుతుంది అని అన్నాను. .... నీ దగ్గర చాలా కళలున్నాయి మావోయ్,,, నిన్ను స్టడీ చేయాలి అని సరదాగా అంది తార. ఆ తర్వాత ముగ్గురూ నా రూం మొత్తం పరికించి చూస్తూ బయటికి నడిచారు. అందరం నవ్వుకుని నేను కూడా వాళ్లతో పాటు వెళ్లి మామ్మని వాళ్లకు పరిచయం చేసి గుడ్ నైట్ చెప్పి తిరిగి నా రూమ్ కి వచ్చి భోజనం చేసి పడుకున్నాను.

మరుసటి రోజు పొద్దున్నే లేచి వర్క్ స్టేషన్ కి వెళ్లి సోఫాలో కూర్చుని వాళ్ళ కోసం వెయిట్ చేశాను. ముందుగా కింద రూమ్ లో నుంచి తార ఒళ్ళు విరుచుకుంటూ బయటకు వచ్చి నన్ను చూసి, హలో,,, గుడ్మార్నింగ్ దీపు,,, ఇంత పంక్చువాలిటి ఏంట్రా బాబు అని సరదాగా జోక్ చేసింది. .... నేను కూడా గుడ్ మార్నింగ్ చెప్పి సరదాగా నవ్వి, ఇక్కడే జిమ్ ఉంది అందరం కలిసి ప్రాక్టీస్ చేద్దామని మీ కోసం వెయిట్ చేస్తున్నాను అని అన్నాను. .... అవునవును ఇంత పర్ఫెక్ట్ కాబట్టే అంత పాపులర్ అయ్యావు, ఐ లైక్ ఇట్,,, పద మనమిద్దరం మొదలుపెడదాం వాళ్లు తర్వాత జాయిన్ అవుతారులే అని అంది. ఆ తర్వాత ఇద్దరం కలిసి జిమ్ లోకి వెళ్లి ఎక్సర్సైజులు మొదలు పెట్టాము. తార కూడా సీరియస్ గానే వర్కౌట్ చేస్తోంది. తార మాటలు కొంచెం మొరటుగా ఉన్నప్పటికీ ఫిగర్ మాత్రం కత్తిలాగా ఉంటుంది. ఫుల్ స్కిన్ టైట్ అవుట్ ఫిట్ లో ఖచ్చితమైన కొలతలతో సినిమాల్లో జేమ్స్ బాండ్ పక్కన ఉండే కత్తిలాంటి ఐటెంలాగా ఉంది.

ఆ తర్వాత కొంత సేపటికి సోము మరియు జెస్సి కూడా మాతో జాయిన్ అయ్యి వర్కవుట్లు చేశారు. ఆ తర్వాత నేను వారితో మాట్లాడుతూ, గయ్స్,,, ప్లాన్ ప్రకారం రేపు మన మిషన్ కోసం ఒక వెహికల్ ఇంకా కొన్ని సామాన్లు కావాలి అని అన్నాను. .... అయితే చీఫ్ తో మాట్లాడి వెహికల్ అరెంజ్ చేసుకుందామా? అని అన్నాడు సోము. .... ఎందుకు నా వెహికల్ ఉందిగా? అని అన్నాడు జెస్సి. .... నీ సొంత వెహికల్ ఎందుకులే మనం ఒక సెకండ్ హ్యాండ్ వెహికల్ ఏదైనా ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది అని నా ఉద్దేశం. సో,,, నేను మీకు డబ్బు ఇస్తాను మీరు వెళ్లి సాయంత్రం లోపు ఒక వెహికల్ అరేంజ్ చేసుకుని రండి. నేను కాలేజీకి వెళ్లి మిగిలిన సామాన్లు షాపింగ్ చేసుకుని మళ్లీ మనం సాయంత్రం కలుద్దాం అని చెప్పాను. .... ఓకే డన్ దీపు,,, అని ముగ్గురు ఒకేసారి అన్నారు. నేను పార్వతి అమ్మ రూమ్ లోకి వెళ్లి లాకర్ లో నుంచి ఒక ఐదు లక్షలు తీసి జెస్సీకి ఇచ్చి, ఆ వెహికల్ కి రెండు మూడు రకాల డూప్లికేట్ నెంబర్ ప్లేట్లు కూడా తీసుకోండి అని చెప్పి నేను నా రూమ్ కి వచ్చి తయారై కాలేజీకి వెళ్ళిపోయాను.

కాలేజీ అయిన తర్వాత షాపింగ్ కి వెళ్లి మా మిషన్ కోసం అవసరమైన క్లోరోఫామ్, గ్లౌజెస్, మాస్కులు, ఇంకా మా గెటప్పులు చేంజ్ చేసుకోవడం కోసం అవసరమైన మేకప్ సామాన్లు అన్ని తీసుకొని సాయంత్రానికి రూమ్ కి చేరుకున్నాను. వాళ్లు కూడా సాయంత్రానికి ఒక మంచి కారు అరేంజ్ చేసుకుని వచ్చారు. సాయంత్రం కూడా మేమంతా మాట్లాడుకుంటూ వర్కౌట్లు చేసి ఒకరి గురించి మరొకరు తెలుసుకుంటూ మరింత దగ్గరయ్యాము. మరుసటి రోజు కూడా పొద్దున్నే వర్కౌట్లతో మొదలుపెట్టి ఆ తర్వాత వాళ్ళను రెస్ట్ తీసుకోమని చెప్పి నేను కాలేజీకి వెళ్లి సాయంత్రం రూమ్ కి చేరుకున్నాను. నేను చెప్పినట్టే కార్ కి నకిలీ నంబర్ ప్లేట్లు పెట్టి సిద్ధంగా ఉంచారు. సాయంత్రం నలుగురు కూర్చుని ప్లాన్ గురించి డిస్కస్ మొదలుపెట్టాము. మ్,, మన ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి DD? అని మొదలు పెట్టింది తార.

నేను రాజు ఫొటో చూపించి మనం రాజు అనే ఈ వ్యక్తిని కిడ్నాప్ చేసి తీసుకురావాలి అందుకు నా దగ్గర ఒక ప్లాన్ సిద్ధంగా ఉంది. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మనం కిడ్నాప్ చేయబోయే రాజు ఒక ఫైటర్. వాడి చుట్టూ ఎప్పుడూ రక్షణగా వాడి మనుషులు ఉంటారు. వాడు ఉండే ఏరియాలో వాడొక కింగ్ లాంటోడు. వాడి ముఖ్యమైన అనుచరులు నలుగురు ఫోటోలు ఈ ఫైల్ లో ఉన్నాయి. నేను, జెస్సీ, తార ఈ అనుచరులతో పాటు అక్కడ మనకు ఎదురైన మిగిలిన గ్యాంగ్ ని చూసుకుంటాము. ఈరోజు ఫైట్ జరిగే రోజు కాబట్టి సోము నువ్వు ఆ రాజు గాడితో ఫైట్ చేయాలి అని అన్నాను. ... సోము మాట్లాడుతూ, వెయిట్ వెయిట్,, ఏమన్నావు? నేను ఆ రాజు గాడితో ఫైట్ చేయాలా? నీకేమైనా పిచ్చి గాని పట్టిందా,, వాడి గురించి నేను ఇంతకుముందే విన్నాను ఎద్దు లాగా ఉంటాడు వాడితో నేను ఫైట్ చేయటం ఏంటి? అని అన్నాడు. .... వెంటనే తార అందుకుని, పిరికి సన్నాసి,,, అని సోముని ఎగతాళి చేస్తూ, ఒకపని చేద్దాం దీపు వాడితో ఫైట్ చేయడానికి నేను రింగ్ లోకి వెళ్తానులే అని అంది.

నేను నవ్వి, తార,, సోము చెప్పింది కరెక్టే వాడు నిజంగా ఎద్దు లాంటోడు. సరే ప్లాన్ లో చిన్న మార్పు చేద్దాం. ఆ రాజు గాడితో ఫైట్ కి నేను వెళ్తాను. మీరు ముగ్గురు కలిసి వాడి మనుషులను ఎదుర్కోవాలి. కానీ మీరు కొంచెం జాగ్రత్తగా ఈ పని చేయాలి ఎందుకంటే అక్కడ మనకు ఎంతమంది ఎదురౌతారో ఖచ్చితంగా తెలీదు అని అన్నాను. .... అందుకు ముగ్గురు ఒకేసారి ఓకే,, అని చెప్పారు. .... నేను షాపింగ్ చేసిన బ్యాగ్ తీసి చూపిస్తూ, ఇందులో క్లోరోఫామ్ ఉంది సో,, మీరు అక్కడ వాళ్లను ఎలా ఎదుర్కొంటారు అనేది పూర్తిగా మీ ఛాయిస్. క్లోరోఫామ్ వాడి వాళ్లను స్పృహలో లేకుండా చేస్తారో లేకపోతే డైరెక్ట్ గా పైకి పంపించేస్తారో మీ ఇష్టం అని అన్నాను. .... వాళ్లకి మత్తిచ్చి పడేయడం ఎందుకు ఏకంగా లేపేస్తే పోలా? నేనైతే దొరికినోడిని దొరికినట్టు లేపేస్తాను అని అంది తార. .... అవును అదే బెస్ట్ మేము కూడా అంతే అన్నారు సోము జెస్సీ.

సరే అయితే ఈ విషయంలో మనం పక్కగా ఉన్నట్టే కదా ఇక మిగిలిన విషయం చెప్తాను వినండి. నేను సాధారణమైన వ్యక్తి లాగా లోపలికి వెళ్లి రాజుతో ఫైట్ చేయడానికి రిజిస్టర్ చేసుకొని ఫైట్ చేయడం మొదలు పెడతాను. నేను ఫైట్ మొదలుపెట్టిన రెండు నిమిషాల తర్వాత మీరు మీ పని మొదలు పెట్టాలి. హ,,, మరో ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోండి, మన మొహాలు ఎవరికి తెలియకుండా గెటప్ కొంచెం చేంజ్ చేసుకొని వెళ్ళాలి అంటూ బ్యాగ్ లో ఉన్న సామాను చూపించి అవసరమైన మాస్కులు ఇతర మేకప్ సామాను ఇందులో ఉన్నాయి అని చెప్పాను. ముగ్గురు అందుకు ఓకే చెప్పడంతో నేను చెయ్యి ముందుకు చాచగా వాళ్లు కూడా నా చేతి మీద చేతులు పెట్టి, లెట్స్ డూ ఇట్,,, దుమ్ము దులిపేద్దాం అని ఒకేసారి చెప్పి నలుగురం పిడికిళ్ళు బిగించాము.

సరే మీరు భోజనం చేసి గెటప్స్ చేంజ్ చేసుకుని రాత్రి 9 గంటలకు సిద్ధంగా ఉండండి నేను కూడా రెడీ అయ్యి వచ్చేస్తాను అని చెప్పి నా రూమ్ కి వెళ్లి కొంచెం తక్కువ ఫుడ్ తిని నకిలీ మీసకట్టు తగిలించుకొని ఆ ఏరియాలో తిరిగే ఒక సామాన్యమైన వ్యక్తి లాగా గెటప్ చేంజ్ చేసుకుని రెడీ అయ్యాను. సరిగ్గా చెప్పిన టైంకి వాళ్ళు ముగ్గురు కూడా గెటప్స్ చేంజ్ చేసుకుని సిద్ధమయ్యారు. మేము ముగ్గురం కలిసిన తర్వాత వాళ్ళ ముగ్గురిని కార్లో రమ్మని చెప్పి నేను బైక్ మీద ముందు బయలుదేరాను. నలుగురం బ్లూటూత్ లో కనెక్ట్ అయి వాళ్లు నా బైక్ ఫాలో అవుతూ ఆ రాజు గాడు ఉండే ఏరియాకి చేరుకున్నాము. అది సిటీకి కొంచెం దూరంగా ఉండే ఒక రూరల్ ఏరియా ఒక చిన్న బస్తి లాగా ఉంది. ఎవరికీ అనుమానం రాకుండా కారు మరియు బైక్ కొంత దూరంలోనే పార్క్ చేసి ఆ ఏరియా బయట నిర్మించిన సిమెంట్ ద్వారం గుండా సాధారణమైన వ్యక్తులు లాగా లోపలకి ఎంటరయ్యాము.

Next page: Episode 099.1
Previous page: Episode 098.1