Episode 099.1


ఫైటర్ రాజు ఉన్న ఏరియాలోకి ప్రవేశించి 'ఆల్ ద బెస్ట్' చెప్పి నేను ఆ ముగ్గురి నుండి విడిపోయి తొందరగా రాజు అడ్డా దగ్గరికి చేరుకున్నాను. ముందు ఒక బిల్డింగ్ లాగా ఉండి దాని గేటు దగ్గర ఇద్దరు వ్యక్తులు గస్తీ కాస్తున్నారు. ఆ బిల్డింగ్ వెనకాల ఒక పాడుబడిన పాత సినిమా ధియేటర్(టూరింగ్ టాకీస్) లాంటిది ఉంది. అందులోనే రాజు ఫైట్స్ నిర్వహిస్తూ ఉంటాడు. బయట ఎవరికీ అందులో ఏం జరుగుతుందో తెలియనంత సాధారణంగా ఉంది. ఆ బిల్డింగ్ పక్కనుంచి ఒక చిన్న సందు లాంటి దారి ఆ టాకీస్ ఎంట్రన్స్ దగ్గరికి ఉంది. అక్కడ ఉన్న ఒకే ఒక్క పెద్ద డోర్ లో నుంచి లోపలికి వెళ్లగానే ఒకపక్క రిసెప్షనిస్ట్ ఏరియా ఉండి అందులో ఒక అమ్మాయి కూర్చుని డబ్బులు వసూలు చేసి టోకెన్లు పంచుతుంది. అక్కడ నుంచి మరికొంచెం ముందుకు వెళితే ఒక చెక్కల పార్టిషన్ ఉండి దానికి ఉన్న డోర్ లో నుంచి లోపలికి వెళితే థియేటర్ మధ్యలో ఇనుప జాలీతో నిర్మించిన ఒక వలయంలో ఫైట్ జరుగుతుంది.

ఆ ఇనుప జాలితో నిర్మించిన వలయం 'ఘరానా మొగుడు' సినిమాలో మొట్టమొదటి ఫైట్ సీన్ ని తలపించేలా ఉంది. దాని చుట్టూ జనాలు చేరి ఫైట్ ఎంజాయ్ చేస్తూ గోలగోలగా అరుస్తున్నారు. ఆ రింగులో ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని గొడ్డును బాదినట్లు బాదుతున్నాడు. ఆ వ్యక్తి మరెవరో కాదు ఈరోజు మా టార్గెట్ అయిన రాజుగాడు. నేను కూడా ఆ జనంలో కలిసిపోయి కొంతసేపు రాజుగాడు ఫైట్ చేసే తీరు గమనించాను. ఆ ఫైట్ ముగిసిపోవడంతో రాజు అక్కడినుంచి పక్కనే ఉన్న రూమ్ లోకి వెళ్ళిపోయాడు. నేను తిరిగి రిసెప్షన్ ఏరియాకి వచ్చి అక్కడ కూర్చున్న అమ్మాయితో, నేను రాజుతో ఫైట్ చేస్తాను నా పేరు రాసుకోమని చెప్పాను. .... ఆ అమ్మాయి నన్ను ఒకసారి పైనుంచి కింది వరకు ఎగాదిగా చూసి, ఏం బతకాలని లేదా? ఆడొక పశువు లాంటోడు అనవసరంగా ప్రాణాలు పోగొట్టుకుంటావు అని హెచ్చరించింది.

ఆడు ఏదైతే అదవ్వని,, ముందు నువ్వు సోము అని నా పేరు రిజిస్టర్ లో రాసుకో అని చాలా ధీమాగా చెప్పాను. .... ఆ అమ్మాయి పేరు రాసుకుని, తర్వాత ఫైట్ నీదే వెళ్లి రెడీ అవ్వు నువ్వు బతికుంటే మళ్ళీ చూస్తాను అని అంది. నేను అక్కడ నుంచి కదిలి మళ్లీ లోపలికి వెళ్ళేసరికి మరో ఇద్దరు ఫైట్ చేసుకుంటున్నారు. ఆ ఫైట్ చాలా సాధారణంగా జరుగుతుండడంతో దానిమీద పెద్ద ఇంట్రెస్ట్ చూపించలేదు. ఆ ఫైట్ కూడా తొందరగానే ముగిసిపోవడంతో తర్వాత ఫైట్ గురించి అనౌన్స్మెంట్ మొదలయింది. ముందుగా రాజు పేరు ఎనౌన్స్ చేయడంతో అక్కడున్న జనాలు రాజు,, రాజు,, అంటూ అరవడం మొదలు పెట్టారు. ఇంతలో రాజు జనాలు పక్కకు తప్పుకుంటుంటే మధ్యలో నుంచి నడుచుకుంటూ వచ్చి రింగులోకి చేరాడు. రాజు బాడీ బిల్డర్ లాగా మంచి బాడీతో శక్తివంతుడు అని తెలుస్తుంది.

ఆ తర్వాత నా పేరు అనౌన్స్ చేయడంతో అక్కడున్న జనాలు చప్పట్లు కొట్టారు. అప్పటికే నేను బట్టలు విప్పి లోపల వేసుకున్న బాక్సర్ తో రెడీగా ఉన్నాను. చెవికి ఉన్న బ్లూటూత్ లో మాట్లాడుతూ, ఇక్కడ ఫైట్ మొదలవుతుంది రెండు నిమిషాల తర్వాత మీ పని మొదలు పెట్టి తొందరగా పూర్తి చేయండి. హహ,, ఇక్కడ ఉన్న ఆ రిసెప్షనిస్ట్ అమ్మాయిని ఏమి చేయకుండా వదిలేయండి. పని పూర్తి అయిన తర్వాత కార్ తీసుకొని వచ్చి గేట్ దగ్గర డిక్కీ ఓపెన్ చేసి రెడీగా పెట్టండి. మనం తిరిగి అక్కడే కలుసుకుందాం అని చెప్పి చెవిలో నుండి బ్లూటూత్ తీసి బాక్సర్ జేబులో పెట్టుకొని రింగులోకి దూరాను. రాజు నన్ను చూస్తూనే, నాతో ఫైట్ చేసేది నువ్వా కుర్రకుంక? అని చాలా వెటకారంగా అన్నాడు. .... ముందు నువ్వు నాతో ఫైట్ చేసి చూడు అప్పుడు కుర్రకుంకనో కాదో తెలుస్తుంది. దా,, నువ్వో నేనో తేల్చుకుందాం అని రెచ్చగొట్టాను.

రాజు మాట్లాడుతూ, నువ్వు ఎవడివో గాని ఈ రోజు నా చేతిలో అయిపోయావురా. ఈ రింగులో నుంచి బతికి బయటికి వెళ్ళలేవు అని వార్నింగ్ ఇచ్చాడు. .... ఎవడు ఎవడిని వేసేస్తాడో టైం డిసైడ్ చేస్తుంది దా కుమ్మేసుకుందాం అని అన్నాను. ఇద్దరం అడుగులు వేసుకుంటూ ఎదురెదురుగా ముందుకు ఉరికి ఒకరికొకరు ఫ్లయింగ్ కిక్ ఇచ్చుకొని ఇద్దరం ఎగిరి కిందనున్న మ్యాట్ మీద పడ్డాము. తర్వాత ఇద్దరం చురుకుగా పైకి లేచి నిలబడి ఎదురు ఎదురు పరిగెత్తుకుంటూ వచ్చి ఒకరిమీద ఒకరు కలబడి వరుసగా పంచులు విసురుకున్నాము. కానీ ఇద్దరం చాకచక్యంగానే ఒక్క పంచ్ కూడా తగలకుండా తప్పించుకున్నాము. అంతలోనే నేను చురుకుగా కదిలి రాజుకి ఒక ట్విస్టింగ్ కిక్ ఇవ్వడంతో రాజు తడబడుతూ వెనక్కి అడుగులు వేసుకుంటూ వెళ్లి జాలీకి తగులుకుని ఆగాడు.
**********​

దీపు సిగ్నల్ అందడంతోనే ఇక్కడ మాస్కులు వేసుకుని రెడీగా ఉన్న సోము జెస్సీ తార తమ పని మొదలు పెట్టేసారు. ఆ బిల్డింగ్ ఎంట్రన్స్ దగ్గరకి చేరుకోగానే అక్కడ కాపలా ఉన్న ఇద్దరు వ్యక్తుల మీదకి ఉరికి జెస్సీ, సోము దాడి మొదలుపెట్టారు. వాళ్ళిద్దర్నీ పట్టుకొని పక్కకు లాక్కొచ్చి సైలెంట్ గా మెడలు విరిచి వాళ్ళిద్దర్నీ అక్కడే గోడకు చేరవేసి గేట్ దగ్గరకి వెళ్లి లోపలకి ఎంటరయ్యారు. అప్పటికే తార లోపలికి ఎంటరై మరో ఇద్దరిని ఫినిష్ చేసేసింది. ఇందాక గేట్ దగ్గర ఉన్న వ్యక్తులను జెస్సీ, సోము పక్కకి లాక్కొని వెళుతుండటం చూసిన ఇద్దరు వ్యక్తులు లోపల్నుంచి వస్తుండటంతో తార లోపలికి ఎంట్రరై వాళ్లపైకి క్లోరోఫామ్ ఉన్న నాప్కిన్స్ తో దాడి చేసి స్పృహ కోల్పోయేలా చేసి తర్వాత గన్ తీసి సైలెన్సర్ బిగించి ఇద్దరి తలలోకి రెండు బుల్లెట్లు దింపి అక్కడికక్కడే ఫినిష్ చేసేసింది. ఆ తర్వాత ఆ రెండు శవాలను పక్కకు లాగి పడేసి ముగ్గురూ కలిసి ఆ బిల్డింగ్ లోనికి ఎంటర్ అయ్యారు.

లోపలికి వెళ్తూనే ఎదురుగా నలుగురు వ్యక్తులు వస్తుండడం గమనించారు. వాళ్ళు దగ్గరకు రాగానే అందులో ఒక వ్యక్తి రాజు ముఖ్య అనుచరులలో ఒకడు అని గుర్తించి వెంటనే సోము వాడిని ఒడిసి పట్టుకున్నాడు. జెస్సీ కూడా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మరో ఇద్దరిని ఒడిసి పట్టుకున్నాడు. మిగిలిన నాలుగవ వ్యక్తిని తార దొరకబుచ్చుకుంది. ముందుగా జెస్సీ ఆ ఇద్దరు వ్యక్తుల మెడలు విరిచి పడేసాడు. తార తన చేతిలో ఉన్న వ్యక్తి గుండె మీద గన్ పెట్టి బుల్లెట్ ని డైరెక్టుగా వాడి గుండెలో దింపేసింది. ఇక మిగిలిన రాజు ముఖ్య అనుచరుడితో సోము కుస్తీ పడుతున్నాడు. తార ఆ వ్యక్తి వెనకాల మార్క్ చేయగా సోము కూడా ఆ ముఖ్య అనుచరుడి మెడ విరిచి పని పూర్తి చేశాడు. ఆ తర్వాత ముగ్గురు కలిసి ఆ నాలుగు బాడీలను పక్కకి లాగి పడేసి ముందుకు కదిలారు.

తార సోముని ఉద్దేశించి మాట్లాడుతూ, ఏరా సోముగా సరిగ్గా పనిచేయడం ఇంకెప్పుడు నేర్చుకుంటావురా? ఒక్కడిని పట్టుకుని వాడితో ఆ డాన్సింగ్ ఏంటిరా? అని అంది. ... చేస్తున్నాను కదే,,,, అయినా ఆడ్ని చూసావా నా కంటే ఎంత బలంగా ఉన్నాడో? అని అన్నాడు. .... నీయమ్మ,,, నీ వల్ల ఏది సరిగ్గా అవ్వదురా చేతకాని నాకొడక అని తిడుతూ ముగ్గురు కలిసి మరి కొంచెం ముందుకు వెళ్లి అక్కడ ఎదురుపడిన మరో నలుగురిని లేపి పడేశారు. ఆ తర్వాత జాగ్రత్తగా అడుగులు వేసుకుంటూ మరింత లోపలికి వెళ్ళేసరికి మిగిలిన రాజుగాడు ముఖ్య అనుచరులు వారికి కనపడ్డారు.
**********​

ఇక్కడ నేను రాజు ఒకరికొకరు ఎదురుగా నిల్చుని మళ్లీ పంచులు విసురుకోవడం మొదలు పెట్టాము. ఈసారి ఒకటి రెండు పంచులు నా మొహానికి తగిలాయి. నేను తల విదుల్చుకొని స్టడీ అయ్యేసరికి రాజుగాడు నన్ను పట్టుకొని పైకెత్తి జాలీ మీదకి విసిరి పడేసాడు. నేను జాలీకి తగులుకొని అక్కడే నేల మీద పడ్డాను. అది చూసి రాజు మాట్లాడుతూ, ఏరా అప్పుడే గుద్ధలో దమ్ము అయిపోయిందా? పైకి లేవరా కుర్రకుంక అని చాలా చులకనగా మాట్లాడాడు. .... నేను పైకి లేస్తూ, అప్పుడే ఎక్కడ అయిపోయింది అని అంటూ ముందుకు కదిలి రాజు మీద పంచులు వర్షం కురిపించాను. అదే వేగంతో రాజు గాడి మొహం మీద ఒక గట్టి పంచ్ గుద్ధి కాలు పైకి లేపి వాడి కడుపులో ఒక బలమైన కిక్ ఇచ్చాను. దాంతో వాడు కిందకి కూలబడి మోకాళ్ళ మీద కూర్చుండిపోయాడు.

అదే అదునుగా నేను వాడి మొహం మీద మరో కిక్ ఇవ్వడానికి కాలు లేపగా హఠాత్తుగా వాడు నా కాళ్ళు పట్టుకొని నన్ను నేలకూల్చాడు. ఆ తర్వాత వాడు నా మీదకు ఉరికి నా మొహం మీద పంచులు కొట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు.
**********​

ఇక్కడ తార జెస్సి సోము లోపల మిగిలిన ముఖ్య అనుచరులు కనబడటంతో సైలెంట్ గా తమ చాకులు తీసి పట్టుకుని శబ్దం చేయకుండా అడుగులు వేసుకుంటూ వెళ్లి వాళ్ళ వెనకాల నిల్చున్నారు. ముగ్గురు ఒకే సారి ఒక చెయ్యి ముందుకు పోనిచ్చి వాళ్ళ ముగ్గురు నోళ్ళు మూసేసారు. ఇంతలో ఊహించని విధంగా జెస్సీ కడుపులోకి ఒక చాకు దిగింది. జెస్సీ పట్టుకున్న ఆ వ్యక్తే వెనక్కి చెయ్యిపెట్టి జెస్సీ కడుపులో కత్తి దించాడు. జెస్సీ మాత్రం ఆ నొప్పిని భరిస్తూ తన నోట్లో నుంచి అరుపు బయటకు రాకుండా జాగ్రత్త పడుతూ వెంటనే రియాక్ట్ అయ్యి తన చేతిలో ఉన్న చాకు ఆ వ్యక్తి గొంతు మీద పెట్టి కోసేశాడు. మరోపక్క తార సోము కూడా తమ చేతిలో ఉన్న వ్యక్తులకు ఎటువంటి చాన్స్ ఇవ్వకుండా గొంతు కోసి పడేసారు. ఆ తర్వాత ఆ మూడు శవాలను కూడా పక్కకు లాగి పడేసిన తరువాత జెస్సీ తన కడుపు పట్టుకొని మోకాళ్లపై కూర్చుండిపోయాడు. వెంటనే తార సోము ఇద్దరూ కలిసి జెస్సీని అదుపులోకి తీసుకుని, ఏమైందిరా జెస్సీ? అని అడిగింది తార. .... జెస్సీ నొప్పి భరిస్తూ, దొంగనాకొడుకు కడుపులో కత్తితో పొడిచేశాడే, పదండి తొందరగా వెళ్లి బయట బండి రెడీ చేద్దాం. ఇక DD పని మాత్రమే మిగిలి ఉంది అని అన్నాడు. .... అవును పదండి బండిలో ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఉంది అని సోము అనగా ముగ్గురు కలిసి బయటకు నడిచారు.
**********​

ఇక్కడ నేను రాజు కొట్టుకుంటూ పంచులు తప్పించుకుంటూ కిందా మీద పడుతున్నాము. నా క్యాలిక్యులేషన్ ప్రకారం అనుకున్న టైమ్ పూర్తికావడంతో రాజు గాడిని కిందకి గిరాటేసి అవకాశం దొరకుతూనే జేబులో ఉన్న బ్లూటూత్ తీసి చెవికి తగిలించుకొని, హౌ ఈజ్ ఇట్?? అని అన్నాను. .... వెంటనే అటునుంచి సోము వాయిస్ వినపడింది. సోము అరుస్తూ, ఇక్కడ మా పని అయిపోయింది DD ఇక నీ పనే మిగిలింది. తొందరగా పూర్తి చేసుకుని వచ్చేయ్ ఇక్కడ మన మనిషి గాయపడ్డాడు అని అన్నాడు. ఆ మాట కోసమే ఎదురు చూస్తున్న నేను వెంటనే నా అసలు రూపంలోకి వచ్చేసి కింద పడ్డ రాజు మొహం మీద పిడిగుద్దుల వర్షం కురిపించాను. ఆ తర్వాత వాడి మీద నుంచి పైకి లేచి వాడి భుజం పట్టుకుని పైకి లేపి లాగిపెట్టి జాలీ మీదకి విసిరేసాను. జాలీకి బలంగా గుద్దుకుని కింద పడ్డ వాడి దగ్గరకు వెళ్లి రెజ్లింగ్ లో మాదిరి వాడిని నా చేతులతో పట్టుకుని గాలిలోకి లేపి పూర్తి బలాన్ని ఉపయోగిస్తూ నేలకేసి కొట్టాను. ఆ తర్వాత పిడికిలి బిగించి నా మోచేయి వాడి గుండె మీద తాకేలా ఎగిరి వాడి మీద పడ్డాను. దాంతో వాడు బాగా డీలా పడిపోయాడు.

వెంటనే నేను నా జేబులో ఉన్న క్లోరోఫామ్ తో తడిపిన కర్చీఫ్ బయటకు తీసి వాడి ముక్కు మీద ఆనించి పట్టుకోవడంతో వెంటనే వాడు స్పృహ కోల్పోయాడు. సృహ కోల్పోయిన రాజు గాడిని భుజానికి ఎత్తుకొని బయటకి నడుస్తుండగా పక్కనే ఉన్న రిఫరీతో సహా మరో ఇద్దరు గుండాలు అడ్డుపడ్డారు. రిఫరీ మాట్లాడుతూ, ఓయ్,, రాజు భాయ్ ని ఎక్కడికి తీసుకెళ్తున్నావు? అని అడిగాడు. కానీ నేను సమాధానం ఇవ్వకుండా ఆ జాలీలో నుంచి బయటికి నడిచాను. అంతలో ఒక గుండా నాకు ఎదురొచ్చి, ఒరేయ్ నీ యబ్బ,, ఏంట్రా హీరోలా పోజు కొడుతున్నావు? అని అనడంతో నాకు చిర్రెత్తుకొచ్చి పిడికిలి బిగించి వాడి మొహం మీద ఒకే ఒక్క పంచ్ ఇచ్చేసరికి వాడు అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. వెంటనే అక్కడ ఉన్న మరో గుండా నా మీదకి వస్తుండడంతో కాలు పైకి లేపి వాడి కడుపులో బలమైన కిక్ ఇచ్చేసరికి వాడు కూడా నేల మీద పడి చప్పుడు చేయలేదు.

వెంటనే నేను పక్కనున్న రిఫరీ మెడ పట్టుకుని పక్కనున్న గోడ మీదకి విసిరి కొట్టాను. ఆ తర్వాత నా ప్యాంటు అందుకొని జేబులో ఉన్న గన్ తీసి కిందపడ్డ ముగ్గురిని షూట్ చేసి పడేసాను. ఆ తర్వాత అక్కడ ఉన్న జనాలతో మాట్లాడుతూ, చూడండి మీరందరూ ఇక్కడి నుంచి తొందరగా దొబ్బేయండి లేదంటే ఇక్కడికి సెక్యూరిటీ ఆఫీసర్లు వస్తే మీరందరూ బుక్కైపోతారు అని అనగానే అందరూ పరుగుపరుగున బయటికి వెళ్లిపోయారు. నేను రాజు గాడిని కిందకు దించి నా బట్టలు వేసుకొని మళ్లీ రాజు గాడిని భుజానికెత్తుకుని బయటికి వస్తూ రిసెప్షన్ దగ్గర బిక్కుబిక్కుమంటూ నిలుచున్న ఆ అమ్మాయిని చూసి, అందులో ఉన్న డబ్బంతా తీసుకుని ఇక్కడి నుంచి పరారైపో లేదంటే ఇంకా ఎవరైనా మిగిలి ఉంటే వాళ్ళు నిన్ను ఇబ్బంది పెడతారు. సెక్యూరిటీ ఆఫీసర్లు వచ్చే వరకు నువ్వు ఇక్కడే ఉంటే వాళ్లు కూడా నిన్ను వదిలి పెట్టరు అందుకని నా మాట విని డబ్బు తీసుకొని పారిపోయి ఎక్కడైనా సుఖంగా బతుకు అని చెప్పి బయటకు వచ్చేసాను.

బయట నా టీమ్ సభ్యులు కార్ తీసుకొని వచ్చి డిక్కీ తెరిచి రెడీగా ఉంచారు. నేను రాజు గాడి బాడీని డిక్కీలో పడేసి కాళ్లు చేతులు కట్టేసి డిక్కీ క్లోజ్ చేసాను. వెంటనే జెస్సీ దగ్గరికి వెళ్లి భుజం మీద చెయ్యి వేసి, ఎలా ఉంది బ్రో? అని అడిగాను. .... జెస్సీ కొంచెం ఇబ్బంది పడుతున్నాడు కానీ, పర్వాలేదు,,,, అని అన్నాడు. .... పద బండ్లో కూర్చో వెంటనే నిన్ను హాస్పిటల్ తీసుకొని వెళ్ళాలి అని అనగానే ముగ్గురు కార్లో ఎక్కి కూర్చున్నారు. నేను నా బైక్ మీద కూర్చుని స్టార్ట్ చేసి, మీరు నన్ను ఫాలో అయిపోండి అని చెప్పి ముందుకు కదలగా వాళ్లు నన్ను వెనక ఫాలో అవుతూ వస్తున్నారు. నేను నేరుగా నా రెగ్యులర్ హాస్పిటల్కి పోనిచ్చి జెస్సీని పట్టుకొని డైరెక్ట్ గా డాక్టర్ ఛాంబర్ లోకి తీసుకొని వెళ్ళిపోయాను.

అదృష్టం కొద్దీ డాక్టర్ ఇంకా హాస్పిటల్లోనే ఉన్నారు. నేను జెస్సీని తీసుకొని లోపలికి రావడం చూసి, ఇంతకు ముందు నువ్వు ఒక్కడివే దెబ్బలు తగిలించుకుని వచ్చేవాడివి ఇప్పుడు నీకు తోడు ఇంకొకరిని కూడా తీసుకొచ్చావా? అని అన్నారు. .... ఏం చేయమంటారు డాక్టర్,,, మాకు ఇవన్నీ తప్పదు కదా? మీరు కూడా ఇలాంటి వాటికి అలవాటు పడిపోవాలి ఎందుకంటే ఇకమీదట మేము మీకు రెగ్యులర్ గెస్టులుగా వస్తూనే ఉంటాము అని అన్నాను. .... డాక్టర్ గారు నోరు తెరిచి ఆఆ,, అని ఆశ్చర్యపోతూ, సరిపోయింది!!! అని బుర్ర ఊపుతున్నారు. .... నేను చిన్న చిరునవ్వు నవ్వి, కొంచెం తొందరగా చూడండి డాక్టర్ అని అన్నాను. .... వెంటనే డాక్టర్ జెస్సీ గాయాన్ని చూసి, ఎక్కువ లోతు దిగలేదు కాబట్టి హీ ఈజ్ సేఫ్,,,, అని చెప్పి కట్ అయిన ప్లేస్ లో కుట్లు వేసి డ్రెస్సింగ్ చేశారు. ఆ తర్వాత మేము డాక్టర్ గారికి థాంక్స్ చెప్పి బిల్ పే చేసి అందరం కలిసి అక్కడి నుంచి బయలుదేరాము.

మేము వర్క్ స్టేషన్ దగ్గరికి చేరుకొని డిక్కీలో ఉన్న రాజు గాడి బాడీని నా భుజానికెత్తుకుని లోపలికి నడిచాను. లోపలికి వెళ్ళిన తర్వాత నేరుగా సౌండ్ ప్రూఫ్ చేయించిన టార్చర్ రూమ్ లోకి తీసుకుని వెళ్లి రాజు గాడి బాడీని కుర్చీలో కూర్చోబెట్టి తాళ్లతో కట్టి పడేసి బయటకు వచ్చాను. ముగ్గురితో కలిసి కూర్చుని, వెల్ డన్ గయ్స్,,,, మీరు మీ పని చాలా చక్కగా చేశారు. నేను అనుకున్న దానికంటే చాలా పర్ఫెక్టుగా పూర్తి చేశారు అని కాంప్లిమెంట్స్ ఇచ్చాను. .... తార మాట్లాడుతూ, DD ఈ మిషన్ నువ్వొక్కడివే చేయగలవు కదూ? మరి అలాంటప్పుడు మమ్మల్ని,,,, అంటూ తన సందేహాన్ని అడిగింది. .... అదేంటంటే నేను రిస్కు తీసుకోదల్చుకోలేదు. అంతేకాకుండా ఒక టీంతో పనిచేస్తే వచ్చే అనుభవాన్ని ఎంజాయ్ చేయాలని అనుకున్నాను అందుకే మీ సహాయం తీసుకున్నాను అని అన్నాను.

సోము మాట్లాడుతూ, మరి ఇంతకు ముందు నన్ను రింగులోకి పంపుతా అన్నావ్ కదా అప్పుడు ఎలా ఎంజాయ్ చేసేవాడివి? అని అడిగాడు. .... ఏముంది,, ఆ రాజు గాడు నిన్ను రింగులో పడేసి కుమ్ముతుంటే బయటినుంచి చూసి ఎంజాయ్ చేసేవాడిని అని సరదాగా అనడంతో జెస్సీ, తార కూడా నాతో పాటు పగలబడి నవ్వారు. ఆ తర్వాత నేను పైకి లేచి, ఓకే గయ్స్,,, చాలా టైం అయింది పొద్దున్నే నేను కాలేజీకి కూడా వెళ్లాలి మీరు ఫ్రెష్ అయ్యి రెస్ట్ తీసుకోండి. గుడ్ నైట్,,, అని చెప్పి బయటికి నడిచాను. వాళ్ళు ముగ్గురు కూడా నాకు గుడ్ నైట్ చెప్పి బాయ్ అనడంతో నేను కూడా బాయ్ చెప్పి నా రూమ్ కి వచ్చేసాను.

నా రూంలోకి వచ్చి అలాగే మంచం మీద వాలి రిలాక్స్ అయ్యాను. ఒక ఐదు నిమిషాలు గడిచిన తర్వాత పైకి లేచి మళ్ళీ డోర్ దగ్గరికి వచ్చి బయటకి తొంగి చూసాను. వర్క్ స్టేషన్ డోర్ క్లోజ్ చేసి హాల్లో లైట్ ఆగి ఉన్నట్టు కనబడదుతో వెంటనే బయటికి వచ్చి నా రూమ్ డోర్ క్లోజ్ చేసి బైక్ స్టార్ట్ చేసి బయల్దేరాను. ఇంతవరకు ముందుగా నేను వేసిన ప్లాన్ ప్రకారమే జరిగింది. ఇప్పుడు ప్లాన్ లో చివరి భాగం పూర్తి చేయడానికి హైవే రోడ్డు వైపు బయలుదేరాను. అయితే ఇప్పుడు నేను వెళ్తున్న పని గురించి సోము, జెస్సీ, తార లకు తెలీదు. రుద్ర ఇచ్చిన లిస్టులో ఇద్దరు గంజాయి స్మగ్లర్లు ఈరోజు విజయనగరం వైపు వెళ్లే హైవే రోడ్ లోని ఒక దాబా దగ్గర కలుసుకోబోతున్నారు. నేను వేసుకున్న ప్లాన్ ప్రకారం వాళ్ళిద్దర్నీ కూడా ఈ రోజే ఫినిష్ చేయాలి. ఈరోజు వాళ్లు దొరకకపోతే ఛాన్స్ మిస్ అయిపోద్ది అందుకని వేగంగా నా బైక్ ని హైవేలో పరుగులు తీయించాను.

ఆ స్మగ్లర్లు కలుసుకునే దాబా దగ్గరికి చేరుకున్నాను. జన సంచారం లేకుండా ఆ దాబా క్లోజ్ చేసి ఉన్నట్టు బయటికి కనపడుతుంది. ఆ దాబాకి ఒక 20 మీటర్ల దూరంలో రెండు వ్యాన్లు ఆగి ఉన్నాయి. నేను బైక్ మీద నెమ్మదిగా వెళుతూ బయట వాతావరణాన్ని పూర్తిగా స్కాన్ చేస్తూ కొంచెం ముందుకు వెళ్లి మళ్లీ తిరిగి ఆ దాబా దగ్గరికి వచ్చాను. ఆ వ్యాన్ల దగ్గర నలుగురు వ్యక్తులు కూర్చుని మాట్లాడుకుంటున్నారు. ఇక్కడ దాబాలో ఒక టేబుల్ మీద ఇద్దరు వ్యక్తులు కూర్చుని మాట్లాడుకుంటున్నారు. దాబా లోపల లైట్లు వెలుగుతున్నప్పటికి బయట మాత్రం ఒక డిమ్ లైట్ వెలుగుతోంది. నేను ఆ దాబా ముందు బైక్ ఆపి దాబా లోపలికి అడుగులు వేశాను. ఇంతలో ఎక్కడి నుంచి వచ్చారో తెలీదుగానీ మరో నలుగురు వ్యక్తులు నాకు అడ్డం వచ్చి, హలో,,, దాబా క్లోజ్ చేసి ఉంది కనపడటం లేదా? అని కొంచెం గీరగా అడిగారు.

Next page: Episode 099.2
Previous page: Episode 098.2