Episode 107.1


సోమవారం పొద్దున్నే తొందరగా నిద్రలేచాను. నా పక్కన అమ్మ గాఢ నిద్రలో ఉంది. నేను లేచి బాత్రూంలోకి వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చి బట్టలు వేసుకుంటూ ఉండగా ప్రీతి నిద్ర లేచింది. అమ్మని డిస్టర్బ్ చేయొద్దు నేను బయలుదేరుతాను అని సైగ చేసి నా రూమ్ లో నుంచి బయటకు వచ్చాను. ప్రీతి కూడా నా వెనకే డోర్ దాకా వచ్చి నన్ను కౌగిలించుకుని, అరుణ మంచి ఛాయిస్ కత్తిలాగా ఉంది కదా అంటూ సరదాగా నన్ను ఆటపట్టించి ముద్దు పెట్టి బాయ్ చెప్పింది. .... నేను కూడా ప్రీతిని గట్టిగా కౌగిలించుకుని నా బంగారం,, అని ముద్దు చేస్తూ నుదుటి మీద ముద్దు పెట్టి వీలు చూసుకుని వస్తాను అని చెప్పి బైక్ మీద నా రూమ్ కి బయలుదేరాను. రూమ్ కి చేరుకొని జాగింగ్ సూట్ వేసుకుని వర్క్ స్టేషనుకు వెళ్లాను. ఇంకా ఎవరూ నిద్ర లేచినట్టు లేదు అందుకని ఫోన్ తీసి తారకి కాల్ చేయగా బద్దకంగా ఒళ్ళు విరుచుకుంటూ హాల్ లోకి వచ్చింది.

హాయ్ మావ గుడ్ మార్నింగ్,, అంటూ వచ్చి సోఫాలో నాపక్కన కూర్చుంది. ఏంటి నిన్న రాత్రి నువ్వు రూమ్ లో లేవు? అని అడిగింది. .... కొంచెం పని మీద బయటకి వెళ్ళాను వచ్చేటప్పటికి లేట్ అయింది. అది సరేగాని మీరేంటి ఇంకా ధీమాగా పడుకున్నారు ఈరోజు నుంచి నా స్టైల్ ఆఫ్ ట్రైనింగ్ ఉంటుంది అని చెప్పాను కదా అని అన్నాను. .... అవును కదా,,, మర్చేపోయాను. ఇంతకీ ఈ ఎదవలు లేచారో లేదో ఉండు పిలుచుకొని వస్తాను అంటూ మేడ మీదకు వెళ్లి వాళ్లను లేపి కిందికి వచ్చి ఫ్రెష్ అవడానికి తన రూమ్ లోకి వెళ్ళింది. మరో ఐదు నిమిషాలకి జెస్సీ, సోము హడావిడిగా మెట్లు దిగుతూ కిందికి వచ్చి హాయ్ DD గుడ్ మార్నింగ్,, సారీ కొంచెం లేట్ అయిపోయింది అని అన్నారు. తార కూడా వచ్చిన తర్వాత అందరం కలిసి జాగింగ్ చేయడానికి పార్కుకి వెళ్ళాము. ఎప్పటిలాగే నా తరహాలో పార్కు చుట్టూ రౌండ్లు వేయించి కొన్ని ఎక్సర్సైజులు చేసి బెంచ్ మీద కూర్చున్నాము.

ఇంతలో అను మా దగ్గరికి వచ్చి, అబ్బో,,, అయ్యగారికి చాలారోజులకి తీరిక దొరికినట్టుంది? అని వెటకారంగా అంటూ తార పక్కన కూర్చుంది. .... నేను నవ్వుతూ, నువ్వేంటి ఇంత తొందరగా వచ్చావు? అని అడిగాను. .... ఇప్పుడు మనం కాలేజీకి వెళ్తున్నాము ఆ విషయం గుర్తుందా? అయినా అయ్యగారికి ఎలా గుర్తుంటాయిలే ఈ మధ్య రోజుల తరబడి కాలేజీ ఎగ్గొడుతున్నారు కదా? అని నిష్టూరమాడింది. .... మధ్యలో తార కల్పించుకొని, కొంచెం పనిలో బిజీగా ఉండి రాలేకపోయాడులే ఇంకేంటి సంగతులు అంటూ అనుని మాటల్లోకి దింపి ఇద్దరూ మాటల్లో మునిగిపోయారు. మరోపక్క మేము ముగ్గురం లేచి మళ్లీ ఎక్సర్సైజులు కంటిన్యూ చేసాము. మా ఎక్సర్సైజులు పూర్తి అయిన తర్వాత, ఓయ్ తార ఇక్కడే మాట్లాడుకుంటూ కూర్చుంటావా? పద పద టైం అవుతుంది అంటూ బయల్దేరదీశాను. .... వెళ్లేముందు అను నన్ను పక్కకు తీసుకువెళ్లి, ఏంటి కాలేజీకి రాకుండా ఎక్కడ తిరుగుతున్నావు? అని అడిగింది. .... నేను ఒక చిన్న నవ్వు నవ్వి, ఈరోజు కాలేజీకి వస్తున్నానులే అక్కడ మాట్లాడుకుందాం బాయ్,, అని చెప్పి మేము నలుగురం తిరిగి వర్క్ స్టేషనుకి చేరుకున్నాము.

మళ్లీ జిమ్ లో బాగా అలసిపోయేదాకా రొటీన్ ఎక్సర్సైజులు చేయించి హాల్ లోకి వచ్చి కూర్చున్నాము. గయ్స్,,, ఇక మీదట రోజు మన మార్నింగ్ షెడ్యూల్ ఇలాగే ఉంటుంది సో స్ట్రిక్ట్ గా టైం ఫాలో అయిపోండి. ఇకపోతే మన నెక్స్ట్ ఆపరేషన్ రేపు ఉంటుంది రేపు మనం ఆ కిషోరీ లాల్ గాడిని లేపుకొచ్చెయ్యాలి అని చెప్పాను. .... సోము మాట్లాడుతూ, ఇంత జరిగిన తర్వాత వాడు తన అడ్డాలోనే ఉంటాడని గ్యారెంటీ ఏంటి? వాడు తన మకాం మార్చేసి ఉండొచ్చుగా అని అడిగాడు. .... గుడ్ పాయింట్,,, కానీ వాడు అలా చేయడు అని నాకు ఒక గట్టి నమ్మకం. ఎందుకంటే వాడు కూడా ఈ విషయం గురించి బాగా ఆలోచించి ఉంటాడు. రాజా గాడిని ఎత్తుకెళ్లిన వాళ్లు తన కోసం కూడా వెతుకుతారని వాడికి బాగా తెలుసు. ఇంత జరిగిన తర్వాత వాడు అక్కడ ఉండడు అని మనం అనుకుంటామని వాడు అక్కడే సేఫ్ గా ఉండే ఏర్పాట్లు చేసుకుంటాడు. కానీ వాడికి మన చేతిలో మూడింది అని వాడికి తెలీదు.

జెస్సి నేను చెప్పిన పని ఫాలో అయ్యావా? అని అడిగాను. ... యస్ DD,,, న్యూస్ జాగ్రత్తగా ఫాలో అయ్యాను. సెక్యూరిటీ ఆఫీసర్లు ముమ్మరంగా వెతికినా కిషోరీ లాల్ జాడ ఇంతవరకు తెలియలేదని ఇప్పటిదాకా ఉన్న న్యూస్. నువ్వు అన్నట్టు వాడు సెక్యూరిటీ ఆఫీసర్లను మేనేజ్ చేసి ఉండొచ్చు. మే బి,, నీ అంచనా కూడా కరెక్ట్ కావచ్చు అని అన్నాడు. .... అయినా సరే మనం అన్ని విషయాలు పక్కాగా కన్ఫామ్ చేసుకోవాలి. సో,,, జెస్సీ, సోము మీరిద్దరూ ఈ రోజు రాజాగాడు చెప్పిన అడ్రస్ దగ్గర కొంచెం దూరంలో కన్స్ట్రక్షన్ ఆగిపోయిన ఒక బిల్డింగ్ ఉంటుంది అక్కడ నుంచి మీరు నిఘా వేసి కిషోరీ లాల్ గాడి అడ్డా దగ్గర యాక్టివిటీస్ గమనించాలి. ఇదివరకు నేను రెక్కీ నిర్వహించినపుడు అక్కడ నుంచే వాడి అనుచరుల కదలికలు తెలుసుకోగలిగాను. నా అంచనా నిజమైతే ఇప్పుడు మీకు కూడా వాడి అనుచరుల కదలికలు తెలుస్తాయి. దాన్నిబట్టి వాడు అక్కడే ఉన్నాడో లేదో మనకు తెలిసిపోతుంది. తార నువ్వు రేపటి మన ఆపరేషన్ కోసం కావలసిన వెపన్స్ ఇంకా మొన్నటి లాగే క్లోరోఫామ్ అన్ని రెడీ చేసి పెట్టు. సో,,, మనం తిరిగి సాయంత్రం కలిసి రేపటి ప్లాన్ గురించి డిస్కస్ చేద్దాం టేక్ కేర్,,, అని చెప్పగా వాళ్ళు ముగ్గురు ఓకే అన్నారు.

నేను నా రూమ్ కి వచ్చి స్నానం చేసి రెడీ అయి కాలేజీకి బయల్దేరాను. కాలేజీ దగ్గర అను, జ్యోతిలను కలిసి పలకరించి క్లాసులోకి వెళ్ళాము. కొన్ని క్లాసుల తర్వాత బ్రేక్ టైంలో ఏంటో చెప్తాను అన్నావు? అంటూ అను అడిగింది. .... నేను మళ్ళీ చిన్న నవ్వు నవ్వి, ఈ రోజు మధ్యాహ్నం లంచ్ కి తీసుకువెళతాను అక్కడ చెప్తానులే అని అన్నాను. ... ఒకవైపు నేను లంచ్ కి తీసుకువెళతాను అన్నందుకు సంతోష పడుతూనే మరోపక్క నేను విషయం దాటేసాను అని నా వైపు చురచుర చూసింది. మొత్తానికి క్లాసులు పూర్తయిన తర్వాత లంచ్ కోసం క్యాంటీన్ వైపు అడుగులు వేశారు. నేను వాళ్లను ఆపి, ఊహుం,,, ఇక్కడ కాదు బయటికి వెళ్దాం పదండి అని అన్నాను. .... ఇద్దరూ ఒకసారి నా వైపు ఆశ్చర్యంగా చూశారు కానీ అంతలోనే సంతోషంగా ఎక్కడికి? అని అడిగారు. .... విషయం తెలుసుకోవాలంటే చుప్ చాప్ గా నా బైక్ ఫాలో అయిపోండి అని కొంచెం ఫోజు కొట్టాను. అను మూతి మూడు వంకర్లు తిప్పుతూ, ఈరోజు మీ అన్నయ్య చాలా ఎగస్ట్రాలు చేస్తున్నాడు అని జ్యోతితో అంటూ తన కారు వైపు నడిచింది.

నేను బైక్ మీద ముందర వెళ్తుండగా వాళ్లు నన్ను ఫాలో అవుతూ వచ్చారు. నేను ఒక ఫైవ్ స్టార్ హోటల్ దగ్గరకి తీసుకువెళ్లి బైక్ పార్క్ చేసి దిగాను. అను కూడా ఆశ్చర్యంగా కార్ పార్క్ చేసి జ్యోతితో కలిసి నా దగ్గరకు వచ్చి, ఏంటి ఈరోజు సార్ రేంజ్ మార్చారు? అని అంది. .... అబ్బా నువ్వు ఉండవే అను. ఈరోజు అన్నయ్య మూడ్ బాగున్నట్టుంది వచ్చింది ఫైవ్ స్టార్ హోటల్ కే కదా అనవసరమైన క్వశ్చన్లు ఆపి లోపలకు వెళ్లి తిందాం పద అసలే నాకు చాలా ఆకలిగా ఉంది అని అంది జ్యోతి. ముగ్గురం కలిసి లోపలికి వెళ్లి బీచ్ వ్యూలో ఉన్న ఒక కార్నర్ సీట్లో సెటిల్ అయ్యాము. .... మ్,,, ఇప్పటికైనా విషయం ఏంటో చెప్తారా సార్? అని వెటకారంగా అంది అను. .... ఇంతలో వెయిటర్ రావడంతో మెనూ చూసి మాకు కావాల్సిన ఫుడ్ ఆర్డర్ చేసి వెయిటర్ వెళ్లిపోయిన తర్వాత నేను మాట్లాడుతూ, మీకు ఒక గుడ్ న్యూస్ చెప్పాలి అని అన్నాను.

ఆ మాట విని ఇద్దరి మొహాలు వెలిగిపోతూ నా వైపు ఆసక్తిగా చూశారు. నాలుగు రోజుల క్రితం నేను పార్వతి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ కి ఎం.డి గా చార్జ్ తీసుకున్నాను. ఆ పనులతో బిజీగా ఉండి లాస్ట్ వీక్ రెండు రోజులు కాలేజీకి రాలేకపోయాను అని చెప్పాను. ....ఆ మాటకి ఇద్దరూ అవాక్కయి నోరెళ్ళబెట్టుకుని నన్నే చూస్తూ ఉండిపోయారు. ఆ తర్వాత ముందుగా అను తేరుకొని, ఇంత పెద్ద న్యూస్ మా దగ్గర దాచిపెట్టి ఇన్ని రోజులు తిరుగుతున్నావా? కనీసం ఫోన్లో అన్నా చెప్పుండొచ్చుగా? ఓహో అందుకేనా ఇప్పుడు ఇక్కడికి తీసుకొచ్చావు? అని ఈ విషయం తనకు ముందుగా చెప్పలేదని బుంగ మూతి పెట్టి అలిగింది. .... సారీ,,, ఈ విషయం మిమ్మల్ని కలిసి డైరెక్ట్ గా చెప్తేనే బావుంటుంది అని ఆగాను ప్లీజ్,, ఈ సారికి క్షమించెయ్ అని అన్నాను. .... నేను ప్లీజ్ అనడంతో అను వెంటనే కరిగిపోయింది. ఏదో ఒకటి చెప్పి మాయ చేసేస్తావు. సింపుల్ గా ఇలా లంచ్ పెట్టి చెప్పేస్తే సరిపోతుందా? అని కావాలనే ఆట పట్టించింది.

మరింకేం చేయమంటావు? అని కొంచెం అయోమయంగా అడిగాను. .... నా ఎక్స్ప్రెషన్ చూసి ఇద్దరూ నవ్వుకుని, కంగ్రాట్యులేషన్స్,,, అని ఒకేసారి చెప్పారు. ఆ తర్వాత వారిద్దరితో మాట్లాడుతూ ఒక్క అరుణ విషయం మరియు ఐటీ రైడ్స్ డ్రామా తప్ప గత మూడు రోజులుగా జరిగిన విషయాల గురించి చెప్పాను. .... అయితే సార్ ఇప్పుడు ఇంకా బాగా బిజీ అయిపోతారు అన్నమాట అని అంది అను. .... అఫ్ కోర్స్ తప్పదు కదా!! అందుకే నేను రేపు కూడా కాలేజీకి రావడం లేదు అని అన్నాను. .... నువ్వు ఇలా రోజు కాలేజీ ఎగ్గొడితే నీ స్టడీస్ ఏంకావాలి? అని అడిగింది అను. .... అందుకు మీరు ఉన్నారు కదా, నా నోట్సులు రాసిపెట్టి వీలైనప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయండి అని నవ్వుతూ అన్నాను. .... వెంటనే అను మూతి బిగించి నా వైపు సీరియస్ గా చూసి అంతలోనే ముసిముసిగా నవ్వుకుంటూ, అందుకేనా ఇప్పుడు లంచ్ లంచంగా ఇస్తున్నావు అంటూ నా జబ్బ మీద చిలిపిగా ఒక దెబ్బ వేసింది.

ఇంతలో ఆర్డర్ రావడంతో ముగ్గురం భోజనం చేస్తూ కబుర్లలో మునిగిపోయాము. చివరిగా అనుకి ఇష్టమైన ఐస్ క్రీమ్ ఫ్లేవర్ తెప్పించుకొని తింటూ, అన్నయ్య అంత పెద్ద కంపెనీకి ఓనర్ అయి ఉండి ఇలా సింపుల్ లంచ్ పార్టీతో సరి పెట్టడం ఏం బాగోలేదు అని అంది జ్యోతి. .... కొద్ది రోజులు ఆగండి ఈ హడావుడి అంతా తగ్గిన తర్వాత మీకు ఇష్టమైనట్టు పార్టీ ఏర్పాటు చేసుకుందాం. మరి కొద్ది రోజులు నేను కొంచెం బిజీగా ఉంటాను అని అన్నాను. .... అది సరేగాని మాకు మీ కంపెనీ చూపించవా? అని అడిగింది అను. .... ఎందుకు చూపించను తప్పకుండా చూపిస్తాను. ఒక రెండు మూడు రోజుల్లో కొన్ని ముఖ్యమైన పనులు పూర్తిచేయాల్సి ఉంది. అవి పూర్తయిన తర్వాత మే బి,,, ఈ వీకెండ్ లేదంటే నెక్స్ట్ వీక్ మిమ్మల్ని అందరిని తీసుకొని వెళ్లి చూపిస్తాను అని అన్నాను. .... ఆ మాటకి ఇద్దరూ సంతోషించగా నేను బిల్ పే చేసిన తర్వాత బయటికి వచ్చాము. ఆ తర్వాత బాయ్ చెప్పుకొని వాళ్ళిద్దరూ కార్లో వెళ్లగా నేను బైక్ మీద నా రూమ్ కి బయలుదేరాను.

నేను రూమ్ కి చేరుకోగానే ఆడిటింగ్ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది. నేను కాల్ లిఫ్ట్ చేయగా మొన్న తీసుకువెళ్లిన రికార్డ్స్ అన్ని తిరిగి ఆఫీసుకి పంపిస్తున్నామని దగ్గరుండి అన్ని సరిగ్గా చూసుకోమని చెప్పారు. నేను సరే అని చెప్పి కాల్ కట్ చేసి మేనేజర్ కనకరాజుకి కాల్ చేశాను. అవతల నుండి హలో చెప్పండి సార్,,, అని అన్నాడు కనకరాజు. .... ఆ,, కనకరాజు గారు మన కంపెనీ రికార్డ్స్ తిరిగి వస్తున్నాయి మీరు దగ్గరుండి అన్ని చెక్ చేసుకోండి కొద్దిసేపటిలో నేను ఆఫీసుకి వస్తాను అని చెప్పి కాల్ కట్ చేశాను. ఆ తర్వాత ప్రెష్ అయి ఆఫీసుకి వెళ్లే గెటప్లో తయారయి బయల్దేరి ఆఫీసుకు చేరుకున్నాను. అప్పటికే వచ్చిన రికార్డ్స్ సరిచూసుకునే పనిలో ఎంప్లాయిస్ అందరూ నిమగ్నమై ఉన్నారు. అంతా పూర్తయిన తర్వాత నా ఆఫీస్ రూమ్ కి రమ్మని కనకరాజుతో చెప్పి నా ఆఫీస్ లోకి వెళ్లి కూర్చున్నాను.

కొంతసేపటికి కనకరాజు రాగా, రికార్డ్స్ అన్ని తిరిగి వచ్చినట్టేనా? అని అడిగాను. .... అన్ని వచ్చేసాయి సార్,, ఇంతకీ ఎలా మేనేజ్ చేశారు సార్? అని అడిగాడు కనకరాజు. .... నాకు తెలిసిన కొన్ని పరిచయాలతో ఐటీ డిపార్ట్మెంట్ లోని కొంతమంది వ్యక్తులను మేనేజ్ చేసి విషయం పెద్దది కాకుండా అనవసరంగా మీడియా దాక వెళ్లకుండా కొంచెం లంచం ఇచ్చి మేనేజ్ చేయవలసి వచ్చింది అని చెప్పాను. .... మంచి పని చేశారు సార్ లేదంటే అనవసరంగా కంపెనీ రెప్యుటేషన్ పాడయ్యేది. అఫ్ కోర్స్ మన వైపు నుంచి ఎటువంటి లొసుగులు లేవు కానీ మనకి ఈ రచ్చ కూడా అవసరం లేదు కదా అని అన్నాడు. .... అవును కనకరాజు గారు మనకి అనవసరమైన తలనొప్పులు అవసరం లేదు. ఇక మీరు ఎప్పటిలాగే మీ పనులు చేసుకోండి నేను బయలుదేరుతున్నాను ఏదైనా అవసరం అయితే ఫోన్ చెయ్యండి అని చెప్పి అక్కడ నుంచి బయలుదేరాను.

అక్కడ నుంచి నేరుగా ఆడిటింగ్ ఆఫీసుకి చేరుకొని ఆడిటింగ్ చీఫ్ ని కలుసుకున్నాను. అతను నన్ను తన చాంబర్లోకి ఆహ్వానించి, మిస్టర్ దీపు,,, ఇప్పటిదాకా జరిగిన తనిఖీలతో ఫ్రాడ్ జరిగిందని ఒక ప్రాథమిక అంచనాకి వచ్చాము. మీ రికార్డ్స్ అన్ని మన దగ్గర ఒక కాపీ తీసి పెట్టుకున్నాము. వాళ్లు చాలా తెలివిగా ప్రొడక్షన్ గాని దాని క్వాలిటీ గాని అలాగే సప్లై గాని ఎందులోనూ తేడాలు రాకుండా జాగ్రత్త పడి తమకు అనుకూలంగా ఉండే కస్టమర్లకు మాత్రమే సప్లై పెంచుతూ పోయి మీకు రెగ్యులర్ కస్టమర్లుగా ఉన్న వాళ్లను సైడ్ చేసినట్టు తెలుస్తుంది. అలాగే ప్రైస్ పరంగా డిమాండ్ తగ్గుతుందని చూపించి రేటు తగ్గించుకుంటూ వచ్చి కంపెనీకి రావాల్సిన లాభాలు తగ్గినట్టు చూపించారు. మనం మొన్న చేసినట్టే ఒక చిన్న డ్రామా ప్లే చేసి అవతలి కన్సైన్మెంట్ జరిగిన వాళ్ళ దగ్గరనుంచి సేల్స్ కు సంబంధించి ఇన్ఫర్మేషన్ రాబడితే కరెక్ట్ గా కాకపోయినా వాళ్లు ఎంత దోచుకున్నారు అన్నది ఒక అంచనాకు రావచ్చు అని చెప్పారు.

మరి అవతల కన్సైన్మెంట్ కుదుర్చుకున్న వాళ్ళు మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తారంటారా? .... అందుకే కదా చిన్న డ్రామా ప్లే చేయాలని చెప్పింది. ఆ సంగతి మాకు వదిలేయండి మేం చూసుకుంటాం. కాకపోతే ఈ తతంగం అంతా ముగియడానికి మరో రెండు మూడు రోజులు పట్టొచ్చు. .... ఓకే,, ఇంత తొందరగా ఈ కార్యక్రమాన్ని టేకప్ చేసి ముగిస్తున్నందుకు మీకు చాలా థాంక్స్ అని అన్నాను. .... భలేవాడివే,, దీపక్ వర్మ గారు పని అప్పజెప్పడం దానిని మేము చేయకపోవడమా,,, నెవర్ హ్యాపెండ్ లైక్ దట్. ఆయనతో మాకు చాలా అనుబంధం ఉంది అని అన్నారు. .... సరే మీ ఫీజు గురించి చెబితే నేను అరెంజ్ చేస్తాను. .... దానికి తొందరేముంది తర్వాత చూసుకుందాం అని అన్నారు. .... లేదు సార్,,, అంటే,, మీ ఫీజు నేను కంపెనీ అకౌంట్ నుంచి ట్రాన్స్ఫర్ చేయలేను. అలా చేస్తే మా మేనేజరుకి అకౌంటెంటుకి అనుమానం వచ్చే అవకాశం ఉంటుంది. అందుకని మీకు క్యాష్ రూపంలో పే చేద్దామని అనుకుంటున్నాను.

హ్హ హ్హ హ్హ,,,, అప్పుడే బిజినెస్ తెలివితేటలు బాగా ఆకళింపు చేసుకుంటున్నారు. మీ ఆలోచన మంచిదే, సరే అలాగే క్యాష్ రూపంలో పే చేద్దురుగాని. మేము చార్టెడ్ అకౌంటెంట్లము బ్లాక్ మనీని వైట్ చేసుకోవడం మాకు పెద్ద కష్టమేమీ కాదు పని పూర్తయిన తర్వాత చూసుకుందాం లెండి అని అన్నారు. ... నేను వెంటనే అంకుల్ కి కాల్ చేసి ముగ్గురం కాన్ఫరెన్స్ లో మాట్లాడుకుని ఫీజు విషయంలో ఒక కొలిక్కి వచ్చాము. ఆయన అంకుల్ మాట కాదనలేక మొత్తం పది లక్షల రూపాయలు తమ ఫీజు అవుతుందని చెప్పారు. ఫైనల్ రిపోర్ట్ వచ్చే సమయానికి నేను డబ్బులు ఏర్పాటు చేస్తానని అతనితో చెప్పాను. ఆ తర్వాత మరి కొంతసేపు జరిగిన అవకతవకల గురించి అతను కొంచెం డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే జాగ్రత్తగా ఆలకించి తెలుసుకుని అక్కడి నుండి బయటకు వచ్చాను. రూమ్ కి బయలుదేరి దారిలో వెళ్తుండగా అంకుల్ మళ్లీ ఫోన్ చేసి కావాలంటే క్యాష్ తాను అరెంజ్ చేస్తానని చెప్పారు. కానీ నా దగ్గర క్యాష్ ఉంది అని చెప్పి అంకుల్ ని ఒప్పించి కాల్ కట్ చేసి రూమ్ కి చేరుకున్నాను.

బైక్ పార్క్ చేసి రేపటి మిషన్ గురించి మాట్లాడటానికి వర్క్ స్టేషన్ కు వెళ్లాను. అంతకు కొద్ది సమయం ముందే జెస్సీ, సోము కూడా తమ ఇన్వెస్టిగేషన్ పూర్తిచేసుకుని చేరుకోవడంతో ముగ్గురు హాల్లోనే కూర్చుని ఉన్నారు. నేను లోపలికి వెళ్తూనే, హాయ్ గయ్స్,,, కొత్తగా ఏమైనా విషయాలు తెలిశాయా? అని అడిగాను. .... జెస్సీ మాట్లాడుతూ, నువ్వు ఊహించినది కరెక్టే DD. అక్కడ యధావిధిగా తన అనుచరుల హడావిడి కనపడింది. వాడు అక్కడే ఉన్నాడని కన్ఫామ్ చేసుకోవచ్చు అని అన్నాడు. .... ఓకే అయితే మనం రేపు మధ్యాహ్నం టైంలో వాడి మీద అటాక్ చేద్దాం. ఆ సమయంలో నగరం కొంచెం ఖాళీగా ఉంటుంది సాయంత్రం రద్దీ పెరిగే లోపు మనం వాడిని లేపుకొచ్చేయాలి అని అన్నాను. .... అయితే రేపు మన ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి? అని ముగ్గురు ఒకేసారి అడిగారు.

ఈరోజు మీరు ఆ ఏరియాని చూశారు కదా సో అక్కడ యాక్టివిటీస్ ఎలా ఉంటాయో మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది. వాడి కాంపౌండ్ లోకి ఎంటర్ అయ్యే ముందు బయట కొంతమంది వారి అనుచరులు గస్తీ కాస్తూ ఉంటారు. నేను తార మామూలు వ్యక్తుల లాగా వాళ్లకు ఎదురుగా వెళ్లి అటాక్ చేస్తాము. అదే సమయంలో మీరు వెనుక నుంచి వచ్చి అటాక్ చెయ్యండి. ఆ తర్వాత ముందుగా జెస్సి, సోము మీరిద్దరూ ఆ బిల్డింగ్ లోకి ఎంటర్ అవుతారు. ఆ తర్వాత అక్కడ పరిస్థితులను బట్టి ఒకరినొకరు కవర్ చేసుకుంటూ మనం ముందుకు వెళ్లాల్సి ఉంటుంది అని అన్నాను. .... మరి వాడి మనుషులను గుర్తుపట్టడం ఎలా? అని అడిగింది తార. .... ఇలాంటి ఎదవలు చేసే కొన్ని తింగరి పనులు మనకి బాగా పనికొస్తాయి. వాడి అనుచరులు అందరూ పసుపు కలర్ షూస్ వేసుకుంటారు అని అన్నాను. .... అదేంటి పసుపు కలర్ షూస్ ఎవరైనా వేసుకోవచ్చు కదా? అని అడిగింది. .... ఆ ఏరియాలో వాడి హుకుం నడుస్తుంది. వాడి అనుచరులు తప్ప సామాన్యులు ఎవరు వారికి భయపడి పసుపు కలర్ షూస్ వేసుకోరు. నాకు తెలిసినంతవరకు ఒక 25-30 మంది వరకు వాడి అనుచరులు ఎప్పుడూ కాపలా కాస్తూ ఉంటారు. కానీ జరిగిన సంఘటనలతో వాడు మరింత జాగ్రత్త పడతాడు కాబట్టి ఆ సంఖ్య కూడా మరింత పెరిగే అవకాశం ఉంటుంది. ఆ విషయంలో మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇకపోతే మొన్న రాజుగాడి ఆపరేషన్ లాగే ఇప్పుడు కూడా ముందుగా క్లోరోఫామ్ యూజ్ చేసి మన ఆపరేషన్ సైలెంట్ గా ప్రారంభించాలి. ఆ తర్వాత అక్కడ సిట్యువేషన్ బట్టి వాళ్లను స్పృహ తప్పించి వదిలేయాలా లేదా డైరెక్ట్ గా పైకి పంపేయాలా అనేది మీ ఛాయిస్. అన్నీ రెడీ చేశావు కదా తార? అని అడిగాను. .... ఓ,,యా,, అన్ని రెడీగా ఉన్నాయి. మొన్నటి లాగే అందర్నీ లేపేయడమే అని కూల్ గా అంది తార. ఆ మాటకి అందరం నవ్వుకున్నాము.

సో,,, రేపటి ఆపరేషన్ గురించి ఇంకేమీ డౌట్స్ లేవు కదా? అని అడిగాను. .... నో DD,, మేము రెడీ అని జెస్సి సోము అన్నారు. .... ఏంటి మేడం నీ సంగతి ఏంటి? అని సరదాగా అడిగాను. .... ఇప్పుడే వెళ్లి లేపేస్తే నీకేమైనా అభ్యంతరమా? అని అంది. .... అమ్మా తల్లి నువ్వు ఎవరిని లేపేసినా పర్లేదు గాని ఆ కిషోరీ లాల్ గాడిని మాత్రం మనం ప్రాణాలతో పట్టుకోవాలి వాడి దగ్గర నుంచి మనం కొంత సమాచారం తెలుసుకోవాల్సి ఉంది అని నవ్వుతూ అన్నాను. దానికి అందరూ ఓకే అని అన్నారు. గయ్స్ నేను మీతో కొన్ని విషయాలు షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. మీరు ఈ లైన్లోకి ఎలా వచ్చారో కొంతవరకు నాకు తార ద్వారా తెలిసింది. కానీ నేను ఈ లైన్ లో ఎందుకున్నానో మీకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ విషయం గురించి తార ఇంతకుముందే నన్ను అడిగింది మీ ముగ్గురికి కలిపి ఒకేసారి చెబుతానని ఇంతవరకు ఆగాను.

Next page: Episode 107.2
Previous page: Episode 106.2