Episode 109.2


నువ్వు చెప్పేది నిజమే అయి ఉండొచ్చురా జెస్సి, కానీ అది నాకు దక్కకుండా పోతుందేమోనని బాధగా ఉంది. అవును,, ఇంతవరకు నేను దానికి ప్రపోజ్ చేయకపోవడం నా తప్పే. ఏం చేయమంటావు ఎప్పుడు చూడు నన్ను ఏదో ఒకటి తిడుతూనే ఉంటుంది. నేను ప్రపోజ్ చేసి దానికి నచ్చకపోతే ఎక్కడ గన్ తీసి షూట్ చేసేస్తుందో అని భయంగా ఉంటుంది. ఇక లాభం లేదు నువ్వు చెప్పినట్టే దానికి తొందరగా ప్రపోజ్ చేసేయాలి అని అన్నాడు సోము. .... ఇంకెప్పుడు దీపు గురించి తప్పుగా ఆలోచించకు. దీపు చాలా మంచివాడు తెలిసి తెలిసి ఏ తప్పు చేయడు. మరీ ముఖ్యంగా మనకు ద్రోహం చేయాలనే తలంపుతో అటువంటి పనులు చేస్తాడని నేను అనుకోను. అసలు మన బంగారం గురించి తెలిసి కూడా మనం ఇలా మాట్లాడుకోవడం హాస్యాస్పదం అని ముగించాడు జెస్సి.
**********​

నేను తార షాప్ లోకి ఎంటర్ అయి అక్కడ కౌంటర్ దగ్గర సూటు బూటు వేసుకుని నిలుచున్న ఒక వ్యక్తి దగ్గరకు వెళ్ళాము. వెల్కమ్ సార్,, మీకు ఏ విధంగా సహాయ పడగలను? అని చాలా మర్యాదగా అడిగాడు ఆ వ్యక్తి. ....బ్రదర్,, నాకు నా ఫ్రెండ్ కి ఇక్కడ జాబ్ ఏమైనా దొరుకుతుందేమో అని వచ్చాము అని అన్నాను. .... ఆ విషయం గురించి అయితే మీరు మా రజిని మేడంతో మాట్లాడాలి అని అన్నాడు. .... ఆమె ఎక్కడున్నారు? నేను అడుగుతుండగా సరిగ్గా అప్పుడే, ఏమైంది పార్ధు? అంటూ ఒక అమ్మాయి గొంతు వినపడి ఆ అమ్మాయి మా దగ్గరికి వచ్చింది. .... మేడం వీళ్ళిద్దరూ ఇక్కడ జాబ్స్ కోసం వచ్చారంట అని అన్నాడు పార్ధు. .... సరే నేను ఆ విషయం చూసుకుంటాను వెళ్లి కష్టమర్స్ సంగతి చూడు అని చెప్పి పార్ధు అక్కడ నుంచి వెళ్ళిపోగా మా వైపు తిరిగింది ఆ అమ్మాయి.

ఆ అమ్మాయి చూడటానికి హీరోయిన్ ఇషారెబ్బా లాగా ఉంది. చక్కగా పద్ధతిగా చీర కట్టుకుని ఎక్కడ ఏమి చూపించాలో చూపిస్తూ ఎక్కడ ఏది దాచాలో దాస్తూ చూసేవారి మతులు పోగొట్టేలాగా ఉంది. ఓకే చెప్పండి,, మీరు ఇక్కడ ఎందుకు పని చేయాలని అనుకుంటున్నారు? అని అడిగింది. .... ఆమె అడిగిన ప్రశ్న నా చెవులకు వినపడింది కానీ నా కళ్ళు మాత్రం ఆమె అందాన్ని చూడటంలో బిజీ అయిపోయి ఏమీ మాట్లాడకుండా ఆమె వైపే అలా చూస్తూ నిల్చున్నాను. అది గమనించిన తార చిన్నగా నా డొక్కలో పొడిచేసరికి తేరుకుని గొంతుకు ఏదో అడ్డం పడి స్వరం సర్దుకున్నట్టు చిన్న బిల్డప్ ఇచ్చి, ఇప్పుడు మా ఇద్దరికీ ఉద్యోగాలు చాలా అవసరం మేడం అని అన్నాను. .... చూడండి నా మాట విని ఇక్కడ కాకుండా మీరు మరో దగ్గర ఎక్కడైనా ఉద్యోగాలు చూసుకోవడం మంచిది అని అంది రజిని.

ఏం ఇక్కడ ఎందుకు వద్దు, అందుకు ఏదైనా కారణం ఉంటే మేము తెలుసుకోవచ్చా? అని అడిగింది తార. .... చూడండి ఇక్కడ మేనేజర్ పెద్ద కంత్రీగాడు. అతని వల్ల ఇక్కడ జాయిన్ అయిన చాలామంది అమ్మాయిలు ఉద్యోగాలు మానేసి వెళ్ళిపోయారు. అమ్మాయిలతో ఎలా మెలగాలి ఎలా మాట్లాడాలి అన్న సభ్యత కూడా తెలీదు వాడికి. అమ్మాయిలను తన రూముకి పిలిపించుకుని ఒంటి మీద చేతులు వేసి అసభ్యంగా ప్రవర్తిస్తూ చాలా ఇబ్బందులు పెడుతూ ఉంటాడు. ఎప్పుడైనా షాప్ ఖాళీగా ఉంటే బయటకు వచ్చి కౌంటర్ల ముందు నిల్చొని బాహాటంగానే అందరి ముందు సేల్స్ గర్ల్స్ తో వెకిలి చేష్టలు చేస్తుంటాడు. అలా అని అబ్బాయిలతో కూడా అతని ప్రవర్తన ఏమంత బాగోదు. ఇప్పుడు ఇక్కడనుంచి వెళ్ళాడు కదా ఆ అబ్బాయి పార్ధు. అతనికి ఏదో వ్యక్తిగత కారణాల వల్ల కొంత డబ్బు అవసరమై అడ్వాన్స్ రూపంలో గాని అప్పుగా అయినా ఇవ్వమని మేనేజరుని అడిగితే అప్పుడు మేనేజరు మాట్లాడిన మాటలకు ఆ కుర్రాడు అందరి ముందు సిగ్గుతో కుమిలిపోయాడు.

అందుకే అతను నిన్నటి నుండి వేరే దగ్గర పని వెతుక్కునే పనిలో పడ్డాడు. అతనికి ఎప్పుడు పని దొరికితే అప్పుడు వెంటనే ఇక్కడ పని మానేస్తాడు. ఈ మేనేజర్ అప్పుడప్పుడు కస్టమర్లతో కూడా తప్పుగా ప్రవర్తిస్తూ ఉంటాడు. వాళ్లతో చాలా చిల్లర భాష మాట్లాడుతూ ఇబ్బంది పెడుతూ ఉంటాడు అని అంది రజని. .... అలా అయితే మీరు ఎందుకు ఇంకా ఇక్కడ పని చేస్తున్నారు? అని అడిగాను. .... నేను ఉన్న పరిస్థితులకు ఇప్పుడు నేను ఉద్యోగం చేయడం చాలా అవసరం అందుకే తప్పక ఇంకా ఇక్కడ పని చేయవలసి వస్తుంది. నిజం చెప్పాలంటే నేను కూడా ఆల్రెడీ వేరే ఉద్యోగం వెతుక్కునే ప్రయత్నంలో ఉన్నాను. .... ఇంతకీ మీరు మాకు ఈ విషయాలన్నీ ఎందుకు చెబుతున్నారు? అని అడిగింది తార. .... ఎందుకంటే మీరు కూడా అతని తప్పుడు ప్రవర్తనతో ఎదురయ్యే పరిస్థితులకి బలి కాకూడదని చెబుతున్నాను.

మీరు ఎంతవరకు చదువుకున్నారు? అని అడిగాను నేను. .... MBA చేశాను. మాది ఒక లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కానీ ఎలాగోలా కష్టపడి MBA పూర్తి చేయగలిగాను. ఈ ఊర్లోనే ఉండి పని చేయవలసిన అవసరం ఉండటంతో చాలా చోట్ల ప్రయత్నించాను కానీ చివరికి ఇక్కడ పని చేయాల్సిన అగత్యం ఏర్పడింది. .... నేను మాట్లాడుతూ, సరే అయితే మీకు కొత్త జాబ్ దొరికేసినట్టే!! పార్వతి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఎం.డి కి మీరు పర్సనల్ సెక్రటరీగా నియమింపబడ్డారు అని చెప్పి తార వైపు చూసి, ఇప్పుడు నువ్వు ఏం చేయాలో నేను నీకు చెప్పవలసిన అవసరం లేదనుకుంటాను అని చిన్న స్మైల్ ఇచ్చాను. .... తార సరేనన్నట్టు తల ఊపి అక్కడి నుంచి కదిలి నేరుగా మేనేజరు రూమ్ లోకి దూసుకెళ్లింది. నేను వెంటనే మొబైల్ తీసి జెస్సీని ఈ షాప్ దగ్గరికి వచ్చి తను చేయాల్సిన పని గురించి చెప్పి కాల్ కట్ చేసి ఇంతకు ముందు మా దగ్గర నుంచి వెళ్లిన ఆ కుర్రాడు పార్ధుని నా దగ్గరికి రమ్మని పిలిచాను.

పార్ధు మా దగ్గరికి రాగా, పార్ధు నువ్వు ఏం చదువుకున్నావ్? అని అడిగాను. .... కామర్స్ లో పీజీ చేశాను అని చెప్పాడు. .... అయితే పార్ధు ఇప్పటినుంచి నువ్వే ఈ షాపుకి మేనేజరువి అని అన్నాను. నా మాటలు విని రజిని, పార్ధు వెర్రిమొహాలు వేసుకుని నా వైపు గుడ్లప్పగించి అయోమయంగా చూస్తున్నారు. నేను చిన్న చిరునవ్వు నవ్వి, నన్ను మీరు మరీ అంత వింతగా చూడకండి నేను ఈ షాపు ఓనర్ అని అనడంతో అప్పటిదాకా జరిగిన తమాషా చూస్తూ కౌంటర్లలో నిల్చున్న స్టాఫ్ మొత్తం బయటకు వచ్చి చుట్టూ చేరి చప్పట్లతో రజనీ, పార్ధులను కంగ్రాట్స్ అంటూ అభినందించారు. ఇంతలో అక్కడ పోగయిన గుంపును చీల్చుకుంటూ తార ఒక మనిషిని ఈడ్చుకుంటూ వచ్చి నా కాళ్ల మీద పడేసి, ఇదిగో ఆ మేనేజర్ చెత్త నాకొడుకు వీడే అని అంది. నేను ఆ మేనేజర్ చొక్కా పట్టుకొని లేపి నిలబెట్టాను.

అప్పుడు ఆ మేనేజర్ మాట్లాడుతూ, ఎవరు మీరు? నా షాప్ కి వచ్చి నా మీదే చేయి చేసుకునేంత ధైర్యమా? ఉండండి ఇప్పుడే సెక్యూరిటీ ఆఫీసర్లకు ఫోన్ చేస్తాను అని కొంచెం గాంభీర్యం ప్రదర్శించాడు. .... అప్పుడు నేను వాడి ఫిల్ట్ పట్టుకొని, నేను నీ బాసుని, ఈ పార్వతి జ్యువెలర్స్ షాపుకి యజమానిని. నా మాట విని నువ్వు నోరు మూసుకొని ఉండడం మంచిది. ఏం పార్ధు,,, వీడేనా ఆ దరిద్రుడు? ఇంతకీ వీడు నీతో ఏమన్నాడు ఎలా మిస్ బిహేవ్ చేసాడో కాస్త నాతో చెప్పు. మరేం పర్వాలేదు నువ్వు వీడికి భయపడాల్సిన అవసరం లేదు అని అన్నాను. .... అర్జెంటుగా నా చెల్లెలు కాలేజీ ఫీజు చెల్లించాల్సిన అవసరం ఏర్పడి అప్పుగానైనా కొంత డబ్బు ఇమ్మని అడగటానికి మేనేజరు దగ్గరికి వెళ్లాను. అప్పుడు,,, ఇతను,, నా చెల్లెల్ని,,, అతని దగ్గరకు పంపించమని,,, అని చెబుతూ పార్ధు కన్నీళ్లు పెట్టుకున్నాడు.

పార్ధు మాటలు విన్న వెంటనే నేను పిడికిలి బిగించి మేనేజర్ మొహం మీద ఒక పంచ్ ఇచ్చేసరికి వాడు దభేలుమని కింద పడ్డాడు. పార్ధు వైపు చూసి, వెళ్లి నీకు వాడి మీద ఉన్న కసి అంతా తీర్చుకో అని అన్నాను. వెంటనే పార్ధు కోపంతో ఊగిపోతూ ఆ మేనేజరుని తన ఇష్టం వచ్చినట్టు కాళ్లతో తంతూ రెచ్చిపోయాడు. కొంతసేపటి తర్వాత నేను పార్ధుని సైడ్ చేశాను. ఇంతలో జెస్సీ కూడా అక్కడికి వచ్చాడు. నేను జెస్సీతో మాట్లాడుతూ, కమాన్ ఇన్స్పెక్టర్,, వీడిని తీసుకెళ్లి జాగ్రత్తగా మీ సెక్యూరిటీ ఆఫీసర్ మర్యాదలు అన్నీ చేసి మీకు కావలసిన సమాచారాన్ని తెలుసుకోండి అని అన్నాను. వెంటనే జెస్సీ ఆ మేనేజరుని తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఆ తర్వాత నేను స్టాఫ్ అందరినీ పరిచయం చేసుకుని రజనీ, పార్ధులను రమ్మని చెప్పి ఆఫీస్ లోకి నడిచాను. నా జేబులో ఉన్న కొంత డబ్బు తీసి పార్ధుకి ఇచ్చి, వెళ్లి తొందరగా నీ చెల్లెలు కాలేజీ ఫీజు కట్టు. ఇకపై మేనేజరుగా ఈ షాపును జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత నీదే అని అన్నాను. .... పార్ధు ఆనందంతో కళ్ళు తుడుచుకుని, తప్పకుండా సార్,, అని అన్నాడు. ... నేను రజిని వైపు చూసి, రజిని మీరు ఇప్పుడు నాతో పాటు హెడ్ ఆఫీసుకి రాగలరా? అని అడిగాను. .... ష్యూర్ సర్,,, అని రజిని అనడంతో తార నేను రజిని కలిసి అక్కడి నుంచి హెడ్ ఆఫీసుకి బయల్దేరాము.

మేము ఆఫీసుకు చేరుకుని లిఫ్ట్ లో నేరుగా నా ఆఫీస్ రూమ్ కి చేరుకున్నాము. నేను నా సీట్లో కూర్చుని ఎదురుగా ఉన్న సీట్లలో తార మరియు రజిని లను కూర్చోమన్నాను. ఇంటర్ కం లో రిసెప్షనిస్టు పూజని పైకి రమ్మని పిలిచాను. పూజ వచ్చిన తర్వాత రజిని మరియు పార్ధుల అపాయింట్మెంట్ ఆర్డర్స్ రెడీ చేసి పట్టుకుని రమ్మని చెప్పాను. పూజ వెళ్ళిన తర్వాత తారను పక్కనే ఉన్న రూమ్లో కూర్చుని జెస్సీ పని అయిపోతే సోముతో కలిసి ఇద్దరినీ ఇక్కడికి రమ్మని చెప్పు అని లోపలికి పంపించాను. మ్,, ఇప్పుడు చెప్పండి రజిని మీరు ఎంత కాలం నుండి ఇక్కడ పనిచేస్తున్నారు? ఇంత ఇబ్బందులు మధ్య అక్కడ పని చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇందాక మీరు చెప్పినప్పుడు ఈ ఊర్లోనే ఉండవలసిన అవసరం వచ్చిందని చెప్పారు దానికి కారణం తెలుసుకోవచ్చా? అని అడిగాను.

మాది ఒక లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. మా నాన్నగారు ఒక కార్ డ్రైవర్. ఆయన కెరీర్ మొత్తంలో ఒక నలుగురు దగ్గర పర్సనల్ డ్రైవర్ గా పని చేశారు. మా అమ్మగారు హౌస్ వైఫ్ మేము ముగ్గురు అక్క చెల్లెళ్ళం. చాలీచాలని జీతాలతో గుట్టుగా సంసారం నెట్టుకొస్తూ మమ్మల్ని బాగా చదివిస్తే మంచి ఉద్యోగాలు చేసుకుని స్థిరపడొచ్చు అని మా నాన్నగారు నన్ను MBA చదివించారు. వెంటనే నాకు హైదరాబాద్లో ఉద్యోగం కూడా వచ్చింది. ఒక కంపెనీ మేనేజరుకి PA గా పని చేశాను. కానీ ఆరునెలలు తిరిగేసరికి ఇక్కడ మా నాన్నగారు అస్వస్థతకు గురై చనిపోయారు. నేను కొత్తగా ఉద్యోగంలో చేరడంతో ఆ వచ్చిన శాలరీతో మేము నలుగురం హైదరాబాదులో బతకడం చాలా కష్టం. ఇక్కడ అయితే చిన్నదే అయినా సొంతిల్లు ఉండడంతో దానికి తోడు అమ్మ కూడా అనారోగ్యం పాలు కావడంతో ఇక్కడే ఏదో ఒక ఉద్యోగం చూసుకొని ఫ్యామిలీని చూసుకోవాలని నిర్ణయించుకున్నాను. కానీ నాకు ఇక్కడ చదువుకు తగ్గ ఉద్యోగం దొరకలేదు. మంచి ఉద్యోగం దొరికే వరకూ ఏదో ఒకటి చేయవలసి రావడంతో పార్వతి జ్యువెలర్స్ లో జాయిన్ కావాల్సి వచ్చింది. కానీ నేను జాయిన్ అయిన దగ్గర్నుంచి మేనేజర్ వల్ల ఇబ్బందులు పడుతున్న అమ్మాయిల సంఖ్య పెరుగుతూనే వచ్చింది. అందుకే ఈ మధ్య షాపులో పని చేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. నాకు పార్ధు లాంటి వాళ్లకి తప్పనిసరి పరిస్థితుల్లో అక్కడే పని చేయవలసి వచ్చింది అని చెప్పింది.

ఓకే,, అయితే మీరు ఇదివరకు కూడా PA గా పనిచేసిన అనుభవం ఉందన్నమాట. అయితే నా పని ఇంకా తేలికైనట్టే అని చిన్నగా నవ్వుతూ అన్నాను. .... అది జస్ట్ ఒక ఆరు నెలలు మాత్రమే చేశాను సార్ అని అంది రజని. .... మీరు ఇది వరకు శాలరీ ఎంత తీసుకునేవారు? అని అడిగాను. .... షాపులో నాకు ఫ్లోర్ మేనేజర్ గా నియమించి నెలకు 25000 శాలరీ ఫిక్స్ చేశారు. కానీ ఆ మేనేజర్ ఏదో ఒక వంక పెట్టి శాలరీ కట్ చేసి 20000 మాత్రమే ఇచ్చేవాడు అని చెప్పింది. .... చూడండి రజిని నేను ఈ మధ్యే కంపెనీ బాధ్యతలు తీసుకున్నాను. అందువల్ల ఇటువంటి దుర్మార్గులు కంపెనీని తమ ఇష్టం వచ్చినట్టు వాడుకున్నారు. అటువంటి వారిని ఏరి పారేసే పనిలో భాగంగానే ఈరోజు నేను షాప్ కి రావడం జరిగింది. ఇప్పటినుంచి మీరు నా పర్సనల్ సెక్రెటరీ కాబట్టి కొన్ని విషయాలు మీరు తెలుసుకోవాలి లేదంటే నేను చేసే పని మీకు అర్థం కాక కొంచెం తికమక పడే అవకాశం ఉంది.

బహుశా మరో రెండు రోజుల్లో ఇక్కడ చీఫ్ మేనేజర్ మరియు చీఫ్ అకౌంటెంట్ లను కూడా తీసేసే పని నడుస్తుంది. ఇంతవరకు ఈ విషయం ఎవరికీ తెలీదు కానీ మీరు నా పర్సనల్ సెక్రటరీ కాబట్టి ఇలాంటి విషయాలు మీకు ముందుగానే తెలియాలని చెబుతున్నాను. ఇకపోతే నేను ఆఫీసుకు చాలా తక్కువ సార్లు వస్తాను. అందువలన కంపెనీకి సంబంధించినంతవరకు నా పనులన్నీ మీరే చూసుకోవాల్సి ఉంటుంది. అవసరమైన మేరకు నాతో ఫోన్లో మాట్లాడి నిర్ణయాలు తీసుకోవచ్చు. నేను ఆఫీసుకి వచ్చినప్పుడు ఫైళ్ళు సంతకాల వ్యవహారాలు చూసుకోవచ్చు. ఆఫీసులో చుట్టూ చూపిస్తూ, మీకు ఎక్కడ వీలుగా ఉంటే అక్కడ డెస్క్ ఏర్పాటు చేసుకోండి లేదంటే బయట ఆల్రెడీ ఒక చాంబర్ ఉంది అక్కడే మీరు పని చేసుకుంటానన్నా నో ప్రాబ్లం,, చాయిస్ ఈజ్ యువర్స్ అని అన్నాను.

బయట ఛాంబర్ నాకు ఓకే సార్. మీరు ఎలాగూ ఎక్కువ ఉండను అంటున్నారు కాబట్టి నేను అక్కడే పని చేసుకుంటాను. మీరు వచ్చినప్పుడు ఎలాగూ మీతో పాటు ఇక్కడే ఉంటాను కదా అని అంది. .... ఇంతలో పూజ వచ్చి అపాయింట్మెంట్ ఆర్డర్స్ నా ముందు పెట్టింది. నేను రెండింటినీ ఒకసారి పరిశీలించి సంతకాలు పెట్టి స్టాంప్ వేసి రజినీకి తన అపాయింట్మెంట్ ఆర్డర్ అందించి కంగ్రాచ్యులేషన్స్,, అని చెప్పాను. .... థాంక్యూ సార్,,, మీరు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా జాగ్రత్తగా పనిచేస్తానని ప్రామిస్ చేస్తున్నాను అని అంది. .... అంత వరకు అక్కడే నిల్చున్న పూజ వైపు చూసి, పూజ,, ఆమె పేరు రజిని ఈ క్షణం నుంచి ఇక్కడ ఆఫీసులో నా పర్సనల్ సెక్రెటరీ. ఇకమీదట నా తర్వాత ఆమె మీ అందరికీ బాస్. ఈ విషయాన్ని స్టాఫ్ అందరికీ చెప్పండి. అలాగే మీరు కిందకి వెళ్లి శాలరీ సెక్షన్ లో ఈమెకి 800000 ప్యాకేజ్ శాలరీ ఫిక్స్ చేయమని చెప్పండి అని చెప్పి పూజని పంపించాను.

సంవత్సరానికి ఎనిమిది లక్షలు శాలరీ అని వినేసరికి రజిని మొహంలో ఆనందం రెట్టింపయింది. పూజ వెళ్లగానే, థాంక్యూ వెరీ మచ్ సార్,, నేను ఇంత శాలరీ ఎక్స్పెక్ట్ చేయలేదు అని అంది. .... ఇట్స్ ఓకే రజిని,, మీరు ఇప్పుడు కేవలం జువెలరీ షాప్ ఫ్లోర్ మేనేజర్ కాదు కదా. పార్వతి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఎం.డి కి పర్సనల్ సెక్రెటరీ అంటే నా తరఫున నా బాధ్యతలు చూసుకోవాల్సింది మీరే కదా ఆ మాత్రం శాలరీ ఉండాల్సిందే. మీ ఫ్యామిలీ హ్యాపీగా ఉంటేనే మీరు ఇక్కడ హ్యాపీగా పని చేయగలుగుతారు. ఇంత పెద్ద కంపెనీ బాధ్యతలు మీ చేతిలో పెడుతున్నప్పుడు మీరు సంతోషంగా ఉండేటట్టు చూసుకోవాల్సిన బాధ్యత నాదే కదా. మీ ఫోన్ నెంబర్ నాకు ఇస్తారా,, అంటే ఇకమీదట మిమ్మల్ని నేను కాంటాక్ట్ చేయాలంటే అవసరం కదా అని అన్నాను. .... ఓ ష్యూర్ సర్,,, అంటూ తన నంబర్ చెప్పింది రజిని. .... వెంటనే నేను ఒక 10000 ఆ నంబర్ కి మొబైల్ పే చేసి, ఈ శుభసందర్భంలో ఇంటికి స్వీట్స్ తీసుకుని వెళ్ళండి. ఆ,, వెళ్ళేటప్పుడు దారిలో పార్ధుకి ఈ అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చి వెళ్లండి అని చెప్పాను.

ఇంతలో తార రూమ్ లో నుంచి నా దగ్గరికి వచ్చి మన వాళ్ళు ఆన్ ది వే,, అని చెప్పింది. నేను ఇంటర్ కం లో మేనేజర్ కనకరాజు మరియు అకౌంటెంట్ భరద్వాజ్ లను పైకి రమ్మని పిలిచి వారు వచ్చిన తర్వాత రజిని అపాయింట్మెంట్ గురించి చెప్పి ముగ్గురికీ పరిచయం చేశాను. ఇకమీదట నాకు చేరవలసిన విషయాలన్నీ ఆమెతోనే డిస్కస్ చేయాలి. ఆమె ఆర్డర్ ని నా ఆర్డర్ లాగా పరిగణించాలి అని సూటిగా చెప్పాను. కానీ నా మాటలు వాళ్లకు కొంచెం చేదుగా అనిపించడంతో ఇద్దరి మొహాలలో కళ తప్పింది. ఈ మాటలు అంటున్నంతసేపు నేను వాళ్లకు తెలియకుండా వాళ్ళ ఇద్దరి ఫోటోలు తీశాను. ఇంతలో పూజ డోర్ తెరుచుకుని వచ్చి, సార్ మీకోసం ఎవరో ఇద్దరు వ్యక్తులు వచ్చారు అని చెప్పగా లోపలికి పంపించమని చెప్పాను. సోము, జెస్సి లోపలికి రాగానే మేనేజర్ మరియు అకౌంటెంట్ లను చూడమని కళ్ళతోనే సైగచేసి మరో నిమిషం తర్వాత మేనేజర్ మరియు అకౌంటెంట్ లను కిందికి పంపించేశాను.

ఇక రేపటి నుంచి మీరు ఇక్కడ చార్జ్ తీసుకోవచ్చు. ఇప్పుడు అన్నీ మీ చేతిలోనే ఉన్నాయి కాబట్టి మీకు ఎలా కన్వీనియంట్ గా ఉంటే అలా కంఫర్టబుల్ గా సెటిల్ అవ్వండి. ఆల్ ది బెస్ట్,, అని రజినీకి బాయ్ చెప్పి పంపించేశాను. ఆ తర్వాత సోము జెస్సీ లకు వెల్కమ్ టు మై ఆఫీస్,, అని చెప్పి కూర్చోవడానికి కుర్చీలు చూపించాను. .... నీ ఆఫీసు ఇంత పెద్దగా ఉంది. ఇంకా కంపెనీలు అవి అని తలచుకుంటేనే వెంట్రుకలు నిక్కబొడుచుకున్నాయి అని అన్నాడు సోము. ఇప్పుడు తార సోముని చూసే విధానం మారిపోవడం నేను గమనించాను. .... వీలు చూసుకొని మీకు అవి కూడా చూపిస్తాను. ఓకే,, ఇంతకీ మిమ్మల్ని ఇద్దరిని ఇక్కడికి ఎందుకు పిలిపించాను అంటే ఇప్పుడు మీరు చూసిన ఆ ఇద్దరు వ్యక్తుల గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ నాకు కావాలి. మీకు ఫోటోలు షేర్ చేస్తున్నాను, వాళ్ల పర్సనల్ డీటెయిల్స్ తో సహా అన్నీ నా ముందు ఉండాలి. అఫ్ కోర్స్ ఇది నా సొంత పని కానీ మీ హెల్ప్ కావాలి అని అన్నాను.

ఇంతకీ విషయం ఏంటి? అని అడిగాడు జెస్సీ. .... వాళ్ళిద్దరూ గత కొన్ని సంవత్సరాలుగా ఈ కంపెనీ లాభాలను మళ్లించి చాలా ఫ్రాడ్ చేశారు అందుకు తగిన ఆధారాలు సేకరించే పని ఆల్రెడీ జరుగుతుంది. కాకపోతే ఆ సొమ్మంతా వీళ్ళు ఎటు మళ్ళించారో తెలుసుకోవాలంటే వాళ్లకు సంబంధించిన పర్సనల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం చాలా అవసరం. ఈ పని చేయడానికి ఎంత టైం పడుతుంది? అని అడిగాను. .... దీనికి పెద్ద సమయం అవసరం లేదు రేపు ఈ టైంకి మొత్తం సమాచారం మన చేతిలో ఉంటుంది. మన ఏజెన్సీకి సంబంధించిన కొంతమంది ప్రైవేట్ డిటెక్టివ్ లు మాకు పర్సనల్ గా తెలుసు. వాళ్లలో ఎవరో ఒకరికి పని అప్పగిస్తే మొత్తం ఇన్ఫర్మేషన్ మన చేతిలో పెడతారు. డోంట్ వర్రీ దీపు ఈ పని అయిపోయిందనుకో అని ఇద్దరూ ఒకేసారి అన్నారు. సరే అయితే ఆ పని వెంటనే మొదలు పెట్టండి, ఏంటి మేడం మనం పార్టీకి ఇట్నుంచి ఇటే వెళ్దామా? అని అడిగాను.

పార్టీకి వెళ్తూ నన్ను ఇలాగే రమ్మంటావా? అదేం కుదరదు ముందు వర్క్ స్టేషనుకి వెళ్లి నేను తయారైన తర్వాత పార్టీకి వెళ్దాం అని అంది తార. నేను తార మాట్లాడుతున్నంతసేపు సోము మా ఇద్దరినీ గమనిస్తూనే ఉండడం నేను గమనించాను. ఆ తర్వాత నలుగురం ఆఫీసు నుంచి బయలుదేరి వర్క్ స్టేషనుకి చేరుకొని తార రెడీ అయిన తర్వాత పార్టీకి బయలుదేరాము. ఇప్పుడు తార ఒక మోడరన్ డ్రెస్ లో చాలా సెక్సీగా తయారై మేకప్ వేసుకుని రెడీ అయి వచ్చింది. సోము అయితే మాటిమాటికీ తార వైపు చూస్తూనే ఉన్నాడు. ఒక ఫైవ్ స్టార్ హోటల్ కి తీసుకువెళ్లి ముందుగా అందరి ఛాయిస్ కి అనుగుణంగా డ్రింక్స్ ఆర్డర్ చేసుకుని సరదాగా మాట్లాడుకుంటూ డ్రింక్స్ ఎంజాయ్ చేసాము. ఆ తర్వాత ఎవరికి ఇష్టం వచ్చిన ఫుడ్ వారి కోసం ఆర్డర్ చేసుకుని చాలా హ్యాపీగా భోజనం కూడా ఎంజాయ్ చేసి దాదాపు రాత్రి 12 గంటల సమయానికి తిరిగి వర్క్ స్టేషనుకి చేరుకుని అందరం బాయ్ చెప్పుకొని ఎవరి రూముల్లోకి వారు వెళ్లి పడుకున్నాము.

Next page: Episode 110.1
Previous page: Episode 109.1