Episode 113.1
మరుసటి రోజు యధావిధిగా కార్యక్రమాలతో మామూలుగానే గడిచిపోయింది. ఆ రోజు సాయంత్రం వర్క్ స్టేషన్ లో కూర్చుని సోము, జెస్సీ,తారలతో మాట్లాడుతూ, గయ్స్ నాకు కొంచెం మీ హెల్ప్ కావాలి. నాకు అందిన సమాచారం ప్రకారం శుక్రవారం రోజు రాత్రి నా ట్రాన్స్పోర్ట్ కంపెనీలో ఏదో ఒక ఇల్లీగల్ యాక్టివిటీ జరగబోతుంది. నేను ఆరోజు రాత్రి అక్కడికి వెళ్లి ఏం జరగబోతుందో తెలుసుకుని దాన్ని అక్కడే క్లోజ్ చేసే ఆలోచనలో ఉన్నాను. అక్కడ ఏం జరగబోతుందో తెలియదు కాబట్టి ముందుగా ప్లాన్ చేసుకుని వెళ్ళడం కష్టం. అందుకోసం మీరు ఆ రోజు కొంచెం అలర్ట్ గా ఉంటే నాకు అవసరం అయితే మీరు వెంటనే రంగంలోకి దిగాలి అని అన్నాను. .... అదేంటి DD అలా అంటావు, నీ ప్రాబ్లం మా ప్రాబ్లం కాదా? నువ్వు జస్ట్ ఆర్డర్ వెయ్ చాలు తక్షణం నీ ముందు ఉంటాము అని అన్నాడు సోము.
నా ఉద్దేశం అది కాదు సోము అక్కడ జరిగే యాక్టివిటీ ఏదైనా సీరియస్ మేటర్ అయితే కంపెనీకి చెడ్డపేరు వచ్చే అవకాశం ఉంటుంది. కంపెనీ పేరు బయటకు రాకుండా ఆ యాక్టివిటీని ఎలా ఫేస్ చేయాలి అనేది ఆలోచిస్తున్నాను. ఒకవేళ కంపెనీ పేరు బయటకు వస్తే అది సెక్యూరిటీ అధికారి కేస్ అయ్యి రుద్రకి నా గురించి అంతా తెలిసిపోయే అవకాశం ఉంది. అలా జరగకుండా ఏదైనా మార్గం వెతకాలి అని అన్నాను. .... అవునవును అసలే పోలీసోడు ఈ పాటికే వాడికి అనుమానం ఉండి ఉంటుంది కొంచెం జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది అని అంది తార. .... ఇంతకీ ఏం జరగబోతోందని నువ్వు అనుకుంటున్నావు? అని అడిగాడు జెస్సీ. .... మే బీ,, అది డ్రగ్స్ లేదా స్మగ్లింగ్ యాక్టివిటీ అయ్యుండొచ్చు అని నాకు అనిపిస్తుంది. ... అయితే నువ్వు ఒక్కడివే వెళ్లడం ఎందుకు మనం అందరం కలిసి వెళ్తే పని సులువుగా ముగించవచ్చు అని అన్నాడు జెస్సీ.
డ్రగ్స్ మరియు స్మగ్లింగ్ అనేది నిజమైతే అవతల నుంచి అటాక్ జరిగే అవకాశం ఉంటుంది కదా అప్పుడు ఆటోమేటిక్ గా అక్కడ జరిగేదంతా బయటికి తెలిసిపోతుంది. అక్కడ మనం వాళ్ళను ఎదుర్కోవడం మనకి పెద్ద కష్టం కాకపోవచ్చు కానీ ప్లానింగ్ లేని పని కాబట్టి సెక్యూరిటీ ఆఫీసర్లకు ఇమీడియట్ గా సమాచారం వెళ్ళిపోతుంది. చిక్కంతా అక్కడే ఉంది అని అన్నాను. .... అయితే సెక్యూరిటీ ఆఫీసర్లను డైవర్ట్ చేసే పని ఏదైనా ఆలోచిస్తే బాగుంటుందేమో? అని అన్నాడు సోము. .... నువ్వు చెప్పేది కొంతవరకు కరెక్టే కానీ అక్కడ ఏం జరగబోతుందో మనకు ఇంకా తెలియదు కదా? ఇంకా రెండు రోజులు టైం ఉంది కాబట్టి ఏం చేస్తే బాగుంటుందో మీరు కూడా ఆలోచించండి అని అన్నాను. .... సోము మాట్లాడుతూ, ఆ రోజు ఏం జరిగితే అది ఫేస్ చేద్దాం అవసరమైతే మన చీఫ్ హెల్ప్ తీసుకొని డ్యామేజ్ కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేయవచ్చు కదా అని అన్నాడు.
ఇది నా పర్సనల్ వర్క్ కాబట్టి మన డిపార్ట్మెంటుని ఇన్వాల్వ్ చేయడం మంచిది కాదని నా అభిప్రాయం. .... అది ఎలా అవుద్ది,,, ఒకవేళ డ్రగ్స్ అండ్ స్మగ్లింగ్ మేటర్ అయితే మన డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్ కావడంలో తప్పేముంది? అని అన్నాడు సోము. .... అఫ్ కోర్స్ నువ్వు చెప్పిన పాయింట్ కరెక్టే కానీ అది మన లాస్ట్ ఆప్షన్ కింద పెట్టుకుని అంతవరకు వెళ్లకుండానే పని ముగించాలి. సరేలే ఈ రెండు రోజుల్లో ఏదో ఒక మార్గం దొరకకపోదు. ఇంతకీ ఆ మేనేజర్ మరియు అకౌంటెంటుల కదలికలు ఎలా ఉన్నాయి ఏమైనా ఇన్ఫర్మేషన్ వచ్చిందా? అని అడిగాను. .... నిన్నటి నుంచి వాళ్ళు చాలా హడావిడిగా తిరుగుతున్నారని తెలిసింది. కారణం పూర్తిగా తెలియదు కానీ పొలిటిషియన్స్ ఇంకా పేరుమోసిన పెద్దమనుషులను కలుస్తున్నట్లు సమాచారం అని అన్నాడు సోము.
మ్,, నేను ఊహించినదే జరుగుతుందన్న మాట. నిన్ననే వాళ్ల స్విస్ బ్యాంక్ అకౌంట్లలో నుంచి మొత్తం డబ్బు ఖాళీ చేయించేశాను అందుకే వాళ్ళు అంత హడావుడి పడుతున్నారు అని అన్నాను. .... వావ్,,, అంత ఈజీగా ఎలా చేశావురా బాబు? అయితే వాళ్ళకి కచ్చితంగా నీ మీద అనుమానం ఉంటుంది నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది అని అంది తార. .... డోంట్ వర్రీ,, నా దాకా వచ్చేంత కెపాసిటీ వాళ్లకు ఉంటే నా దగ్గరికి వచ్చిన మరుక్షణం వాళ్లు భూమ్మీద లేకుండా పోతారు అది మాత్రం ఫిక్స్. సరేగాని నేను చెప్పిన పని ఎంతవరకు వచ్చింది? .... ఆల్మోస్ట్ చాలా ఇన్ఫర్మేషన్ తీశాను. దాదాపు 250 అనాధ ఆశ్రమాలు, వృద్ధాశ్రమాలు వాటి పూర్తి వివరాలతో సహా దొరికాయి. అందులో కొంచెం రిచ్ గా ఉన్న వాటిని తప్పించే పనిలో ఉన్నాను. రేపటి కల్లా నీకు ఫుల్ రిపోర్ట్ ఇచ్చేస్తాను అని అంది తార.
ఓహో,, చాలా స్పీడ్ మీద ఉన్నావు? నిన్ను నా కంపెనీ మేనేజరుగా చేసేయొచ్చు, ఏంటి ఈ పని వదిలేసి జాయిన్ అయిపోతావా? అని సరదాగా అన్నాను. .... వద్దులే మావ మనకి అలాంటి పనులు చేయాలంటే మహా చిరాకుగా ఉంటుంది. నాకు ఇదే బెటర్ ఇక్కడైతే ఫుల్ యాక్షన్ ఎవరినైనా లేపేయవచ్చు అని అంది తార. .... ఓసి నీయమ్మ,,, శుభ్రంగా కూర్చుని పని చేసుకోవే అంటే ఆడిని చంపుతాను ఈడిని చంపుతాను అని అంటావేంటే తింగరిదానా? అని అన్నాడు సోము. .... ఇంతకుముందు అయితే ఈ మాట అన్నందుకు తార ఈపాటికి సోముని బండ బూతులు తిట్టి అవసరమైతే నాలుగు తన్ని కూర్చోబెట్టేది. కానీ ఇప్పుడు తారకి సోము మీద ఉన్న దృక్పథం మారిపోయింది. అందువలన సోముని ఏమీ అనకుండా, ఒకవేళ ఈ పని వదిలేయాలి అని ఎప్పుడైనా అనిపిస్తే అప్పుడు ఆలోచిస్తానులే మావ అని నాతో అంది. తారలో వచ్చిన మార్పు చూసి జెస్సీ కళ్ళు ఎగరేసి తల ఊపుతూ నవ్వుకున్నాడు.
ఆ,,, తార ఎందుకైనా మంచిది నువ్వు ఇంకో పని చెయ్ అని చెప్పి కంపెనీ నుంచి సేకరించిన కనకరాజు, భరద్వాజ్ మరియు జువెలరీ షాప్ మేనేజర్ ఫోన్ నెంబర్లను తారకి ఇచ్చి, ఈ నంబర్లను కంటిన్యూగా ట్రాక్ చేస్తూ ఉండు. వాళ్ళు ఏదైనా వెధవ వేషాలు వేస్తే మనము ముందుగా కొంచెం అలర్ట్ అవ్వడానికి ఉపయోగపడుతుంది అని చెప్పాను. .... గుడ్ ఐడియా దీపు,,, అప్పుడు మనము ఇమీడియట్ గా యాక్షన్ లోకి దిగొచ్చు అని అన్నాడు జెస్సీ. .... ఓకే గయ్స్ లెట్స్ రెడీ ఫర్ ఫ్రైడే,, ఏం జరుగుతుందో చూద్దాం అని లేచి వాళ్లకు బాయ్ చెప్పి నా రూమ్ కి వచ్చేసాను. ఆ రోజు రాత్రంతా ఆలోచించగా నా మైండ్ లో ఒక ఐడియా రూపుదిద్దుకుంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈ విషయంలో రుద్ర గాడిని ఇన్వాల్వ్ చేసి తప్పించుకోవచ్చు. అదే సమయంలో రుద్ర గాడి పనుల గురించి ఏమైనా క్లూ దొరికే అవకాశం కూడా దొరుకుతుంది అని అనిపించింది.
ఆ తర్వాత రెండు రోజులు కూడా అడపదడప వీర్రాజు అన్న దగ్గర్నుంచి ఎప్పటికప్పుడు అప్డేట్స్ తెలుసుకుంటూనే ఉన్నాను. అలాగే సోము ఇచ్చిన ఒక ఇన్ఫర్మేషన్ ప్రకారం కనకరాజు చాలా బిజీగా తిరుగుతున్నట్టు కొంతమంది సెక్యూరిటీ ఆఫీసర్లను కూడా కలిసినట్లు తెలిసింది. అలాగే జువెలరీ షాప్ మేనేజర్ కూడా వాళ్లతో కలిసి తిరుగుతున్నట్టు మొబైల్ ట్రాకింగ్ ద్వారా తార తెలుసుకున్న సమాచారం అందించింది. అన్ని విషయాల సమాహారంతో శుక్రవారం జరగబోయే కార్యక్రమంతో వీళ్ళందరికీ సంబంధం ఉంది అని ఒక అంచనాకి వచ్చాను. శుక్రవారం రానే వచ్చింది ఆ రోజు నేను కాలేజీకి మాత్రమే వెళ్లి ఆఫీసుకు వెళ్లకుండా వర్క్ స్టేషన్ లో నలుగురు కూర్చుని వాళ్లకి నా ప్లాన్ ఆఫ్ యాక్షన్ వివరంగా చెప్పాను. వీర్రాజు అన్న చెప్పిన దాని ప్రకారం మిడ్ నైట్ తర్వాత తెల్లవారే లోపు ఆ పని జరగబోతుంది. కానీ మేము నలుగురం కలిసి రాత్రి భోజనాలు చేసిన వెంటనే కార్ లో బయలుదేరి ట్రాన్స్ పోర్ట్ కంపెనీ ఏరియాకి చేరుకున్నాము.
మా కారుని కంపెనీకి కొంచెం దూరంలో పార్క్ చేసి వాళ్ళ ముగ్గురిని కార్ లోనే ఉంచి మా బ్లూటూత్ కనెక్షన్లు సమన్వయం చేసుకుని నేను మాత్రమే వెళ్లి గేటు దగ్గర వాచ్మెన్ ఉండడంతో కంపెనీ ప్రహరీకి మరో వైపు నుంచి గోడదూకి జాగ్రత్తగా లోపలికి ఎంటర్ అయ్యాను. కార్యక్రమం జరగడానికి ఇంకా చాలా టైం ఉంది కాబట్టి అంతా నిశ్శబ్దంగా ఉంది. నేను జాగ్రత్తగా ఎటువంటి శబ్దం రాకుండా గోడౌన్ దాటుకుని ఆఫీసు వైపు కదిలాను. కొంచెం దూరంలో ఉన్న గ్యారేజ్ మొత్తం ఖాళీగా ఉంది. ఆఫీసులో లైట్ వెలుగుతూనే ఉండటం చూసి అటు వైపు నడిచి కిటికీ దగ్గరకు చేరుకొని లోపలికి తొంగి చూసేసరికి మేనేజరు రిలాక్స్ గా కూర్చొని ఫోన్లో ఏవో వీడియోలు చూస్తున్నాడు. లోపల వాడు తప్ప ఇంకెవరు లేరని నిర్ధారించుకున్న తర్వాత వెనుక ప్యాంట్లో దోపుకున్న గన్ తీసి చేతబట్టుకుని దర్జాగా నడుచుకుంటూ ఆఫీసులోకి వెళ్లాను.
సడన్ గా నేను ఎదురుగా నిల్చుని కనబడేసరికి మేనేజరు ఉలిక్కిపడి లేచి, సార్,,, సార్,,, మీరేంటి??? ఈ టైంలో?? ఇక్కడ?? అని చాలా కంగారుగా మాట తడబడుతూ అడిగాడు. .... ఈ ప్రశ్న నేను నిన్ను అడగాలి? ఈ టైంలో నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావ్? అని అడిగాను. .... ఏం లేదు సార్,, ఏమీ లేదు,,, ఊరికినే,, అంటూ తన చేతిలో ఉన్న మొబైల్ లో ఏదో చేయబోతుంటే నేను వాడికి గన్ చూపించి, మర్యాదగా ఫోన్ పక్కన పెట్టు లేదంటే నీ పుచ్చ పేలిపోతుంది అని వార్నింగ్ ఇచ్చాను. నా చేతిలో గన్ చూడడంతో వాడు మరింత భయపడిపోయి తన చేతిలో ఉన్న మొబైల్ టేబుల్ మీద పెట్టి చేతులు రెండూ పైకి ఎత్తాడు. గుడ్,, నీ ప్రాణాల మీద నీకు ఆశ ఎక్కువే ఉందన్నమాట. ఇప్పుడు నేను అడిగే ప్రశ్నలకు సరిగ్గా సమాధానం చెబితే నువ్వు రేపు సూర్యోదయం చూస్తావు లేదంటే,,, ఇవే నీకు చివరి క్షణాలు అని అన్నాను.
మేనేజర్ మరింత వణికిపోతూ, సార్,, చెప్పేస్తాను సార్,, నన్ను ఏం చేయకండి,,, అని భయంగా అన్నాడు. .... సరే అయితే మనం కొంచెం కూర్చుని మాట్లాడుకుందాం అలా కూర్చో అంటూ నేను టేబుల్ కి ఇటు వైపు ఉన్న చైర్ లో కూర్చుని వాడి మొబైల్ నా దగ్గరకు లాక్కున్నాను. వాడు కూడా కూర్చున్న తర్వాత, ఈ రోజు రాత్రి ఇక్కడ ఏం జరగబోతుంది? అని అడిగాను. .... అంటే సార్ అది,,, ఒక లోడ్ వస్తుంది అది రిసీవ్ చేసుకోవడానికి ఇక్కడ ఉన్నాను సార్,, అని అన్నాడు. .... లోడ్ ఇక్కడికి ఎందుకు వస్తుంది? ఆ వచ్చే లోడు ఏంటి? ....అంటే సార్ అది,,, అది,, అని నసుగుతుంటే నేను మళ్ళీ ఒకసారి గన్ చూపించడంతో, అది కనకరాజు గారు బిజినెస్ డీల్ లో భాగంగా వస్తుంది సార్. .... ఇంతకీ ఆ వచ్చేది ఏంటి? అని గట్టిగా అడిగాను. .... సార్ అది,,, డ్రగ్స్,, కొకైన్ అని చెప్పేసాడు.
ఈ వ్యవహారాలు ఎప్పటి నుంచి జరుగుతున్నాయి? .... సార్ చాలాకాలం నుంచి జరుగుతున్నాయి కానీ నాకు ఇందులో ఎటువంటి సంబంధం లేదు సార్. కనకరాజు గారు చెప్పింది చేయడం మాత్రమే తెలుసు అంతకు మించి నాకు ఏమీ తెలీదు అని అన్నాడు. .... ఇంకా ఇందులో ఎంతమంది ఇన్వాల్వ్మెంట్ ఉంది? .... కనకరాజు భరద్వాజ్ ఇంకా వాళ్ళకి ఏదో గ్రూప్ ఉంది సార్ వాళ్ల గురించి నాకు ఏమీ తెలియదు. .... ఇప్పుడు వచ్చే లోడు ఎన్ని గంటలకు వస్తుంది? .... సార్ అది సుమారు 2:00 - 3:00 మధ్య రావచ్చు సార్. .... ఎక్కడి నుండి వస్తుంది ఇప్పుడు వెహికల్ ఎక్కడ ఉంది? .... సార్ అది ఒరిస్సాలో నుంచి ఆంధ్రాలోకి ఎంటర్ అయ్యి సాలూరు రోడ్ లో వస్తుంది. ఇప్పుడు లొకేషన్ చూడాలి అంటే నా మొబైల్ చూడాలి. .... నేను వెంటనే పైకి లేచి వాడి పక్కనే నిల్చుని మొబైల్ వాడి చేతికిచ్చి చూడమని చెప్పగా వాడు వణుకుతున్న చేతులతో వెహికల్ ట్రాకింగ్ మ్యాప్ చూసి, సార్ ఇంకా ఒరిస్సాలో ఉంది ఇంకొక 2గంటల్లో సుంకి బోర్డర్ దాటి ఆంధ్ర లోకి ఎంటర్ అవుతుంది అని చెప్పాడు.
ఆ మాట విన్న వెంటనే నా బుర్ర కొంచెం చురుగ్గా ఆలోచించడం మొదలుపెట్టి ఒకసారి టైం చూసుకుని అప్పటికప్పుడు ఒక ప్లాన్ తట్టింది. వెంటనే వాడి దగ్గర నుంచి మొబైల్ తీసుకుని, నీకు ఏదైనా వెహికల్ ఉందా? అని అడిగాను. .... సార్ బయట నా బైక్ ఉంది అని అన్నాడు. .... కామ్ గా లేచి ఎటువంటి హడావిడి చేయకుండా జాగ్రత్తగా నడుచుకుంటూ బయటికి వెళ్లి నీ వెహికల్ తీసుకుని మన కంపెనీకి రైట్ సైడ్ ఉన్న రోడ్లో ఒక కిలోమీటర్ దాకా వెళ్లి వెయిట్ చెయ్. ఈ మధ్యలో పిచ్చి పిచ్చి వేషాలు వేసావు అనుకో బయట నా మనుషులు ఉన్నారు నిన్ను ఇక్కడే లేపి పాడదొబ్బుతారు అని సీరియస్ గా వార్నింగ్ ఇచ్చి వాడిని బయటకి పంపించాను. వాడు బైక్ తీసుకొని బయటకు వెళ్లే వరకు చాటుగా ఉండి జాగ్రత్తగా పరిశీలించి ఆ తర్వాత నేను వచ్చిన దారిన వెనక్కి వెళ్ళి గోడ దూకి బయటపడ్డాను. మేము బ్లూటూత్ లో కనెక్ట్ అయి ఉండడం వల్ల ఈ పాటికి నా ఆలోచన ఏంటో బయట నా టీంకి అర్థమయ్యే ఉంటుంది.
నేను అక్కడి నుంచి గబగబా పరిగెత్తుకుంటూ మేనేజర్ని ఉండమన్న చోటికి చేరుకునేసరికి వాడు బైక్ స్టాండ్ వేసి పక్కన నిల్చోగా అక్కడే మా కార్ మరియు టీం కూడా ఉన్నారు. తార వీడిని కార్లో కూర్చోబెట్టు, జెస్సి బైక్ తీసుకొని కార్ ఫాలో అవ్వు, సోము కమాన్ క్విక్ డ్రైవ్ చెయ్ అని చెప్పి నేను పక్క సీట్లో కూర్చున్నాను. .... మేము హైవే మీదకు చేరి ఫుల్ స్పీడ్ అందుకున్న తర్వాత నేను సీట్లో పక్కకు తిరిగి కూర్చుని వాడి మొబైల్ చేతికి అందించి, ఏదో ప్రాబ్లం ఉంది అని చెప్పి వెహికల్ ఆంధ్ర లోకి ఎంటర్ అయిన వెంటనే సుంకి ఘాట్ రోడ్డులో నిర్మానుష్యమైన ప్రాంతంలో ఆగమని మళ్లీ నువ్వు చెప్పిన తర్వాతే అక్కడ్నుంచి బయలుదేరమని చెప్పు అని గన్ చూపించాను. .... మేనేజరు వెంటనే కాల్ చేసి నేను చెప్పమన్నట్టు డ్రైవర్ కి చెప్పాడు. .... మళ్ళీ వాడి చేతిలో నుంచి మొబైల్ తీసుకుని వెహికల్ ట్రాకింగ్ అబ్జర్వ్ చేయమని తార చేతికిచ్చాను.
వెహికల్ తో పాటు ఇంకా ఎవరైనా ఎస్కార్ట్ ఉంటారా? అని వాడిని అడిగాను. .... అంటే కనకరాజు గారి మనుషులు ఉంటారు కానీ ఎంతమంది అనేది నాకు తెలియదు సార్ అని అన్నాడు. .... నేను కొంచెం ఆలోచించి, జెస్సి ఎక్కడైనా పార్కింగ్ ప్లేస్ లో బైక్ పార్క్ చేసి నువ్వు కూడా కార్ లోకి వచ్చేయ్ అని చెప్పగా దగ్గరలో ఒక పెట్రోల్ బంకుకి కొంచెం దూరంలో బైక్ పార్క్ చేసి జెస్సి కారులోకి వచ్చేసాడు. ఇక అక్కడి నుంచి ఆగకుండా దాదాపు ఒక రెండు గంటలు జర్నీ తర్వాత సాలూరు దగ్గరకు చేరుకున్నాము. తార వెహికల్ ట్రాకింగ్ చూసి ఆంధ్ర లోకి ఎంటర్ అయినట్టు చెప్పింది. గయ్స్,,, బి అలర్ట్,, అని చెప్పి ఇటు వైపు నుంచి చెక్ పోస్ట్ దగ్గర సోము ఐడి చూపించడంతో మమ్మల్ని ఫ్రీగా వదిలేయగా ఘాట్ రోడ్డు పైకి వెళ్ళడం మొదలు పెట్టాము.
తార లొకేషన్ ట్రాక్ చేస్తూ చెబుతుంటే దాదాపు ఒక పావు కిలోమీటర్ దూరంలో ఒక మలుపులో మా కారు ఆపి మా వెపన్స్ రెడీ చేసుకుని మేనేజరుని పిచ్చి వేషాలు వెయ్యొద్దని మరోసారి హెచ్చరించి వాడిని పట్టుకుని జాగ్రత్తగా కొండమీద చెట్ల మాటున నడుచుకుంటూ కంటైనర్ వెహికల్ ఉన్న దగ్గరికి చేరుకున్నాం. వెహికల్ ముందు డ్రైవర్ మరియు క్లీనర్ సీట్లు పరుచుకొని పడుకున్నారు. వెహికల్ వెనకవైపు మాత్రం ఒక ఐదుగురు గుంపుగా కొంచెం దగ్గర్లో కూర్చుంటే మరొక ఐదుగురు కొంచెం దూరంగా వెళ్లి కూర్చుని ఉన్నారు. వాళ్ళను చూస్తుంటే వాళ్ళ దగ్గర వెపన్స్ ఉండే అవకాశం ఉందని అనిపించింది. వెంటనే నేను మేనేజర్ గాడితో మాట్లాడుతూ, నువ్వు ప్రాణాలతో ఉండాలంటే చప్పుడు చేయకుండా ముందున్న డ్రైవర్ క్లీనర్ దగ్గరికి వెళ్లి వాళ్లతో పాటు అక్కడే ఉండు అని వార్నింగ్ ఇచ్చి పంపించాను.
ఆ తర్వాత సోము, జెస్సి మీరు కొంచెం పైనుంచి వెళ్లి ఆ వెనక ఉన్న గ్రూప్ ని ఎటాక్ చేయండి తార నువ్వు నాతో ముందున్న గ్రూప్ అని అనగానే అందరం మాస్కులు తీసి వేసుకుని సోము జెస్సి కలిసి గబగబా కొండకు కొంచెం పైభాగాన ఉన్న చెట్ల వెనకనుంచి దాక్కుని జాగ్రత్తగా స్పాట్ కి చేరుకున్నారు. DD మేము రెడీ అని అటు నుంచి జెస్సి చెప్పగానే ఇక్కడ మేము కూడా అలర్ట్ అయ్యి, ఓకే లెట్స్ గో,,, అంటూ అందరం ఒకేసారి ఆ రెండు గ్రూపుల దగ్గరికి చేరుకున్నాము. మేము వచ్చిన చప్పుడుకి వాళ్లు కూడా వెంటనే రియాక్ట్ అయ్యి మేము ఎవరో తెలియకపోవడంతో ఎవర్రా మీరు,, ఈ టైంలో ఇక్కడ ఏం చేస్తున్నారు? అంటూ బెదిరింపు ధోరణిలో వాళ్ల వెపన్స్ తీస్తుండగా మేము ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఫైరింగ్ ఓపెన్ చేసి ఇటొక ముగ్గురిని ఆటొక నలుగురిని లేపేసాము. ఇంతలో మిగిలిన ముగ్గురు అటునుంచి ఫైరింగ్ చేయడంతో ఒక పది రౌండ్లు వరకు బుల్లెట్ పేలిన శబ్దాలతో నిండిపోయింది. వెంటనే వాళ్ళ ముగ్గురిని కూడా లేపేయడంతో మళ్లీ పూర్తిగా నిశ్శబ్దంగా మారిపోయింది.
అది నక్సల్స్ తిరిగే ప్రాంతం కావడంతో బుల్లెట్ల శబ్దానికి నిద్రలేచిన డ్రైవర్ క్లీనర్ కంగారు పడుతూ గబగబా అక్కడ నుంచి పరిగెత్తడం మొదలు పెట్టారు. వెంటనే జెస్సీ సోము వాళ్ల వెంటపడి పట్టుకొని తీసుకొచ్చారు. ఇంతలో నేను మేనేజరుతో మాట్లాడుతూ, ఇక్కడ నుంచి మనం వెళ్లేవరకు నీ నోట్లో నుంచి ఒక్క మాట రావడానికి వీలు లేదు అని వార్నింగ్ ఇవ్వడంతో వాడు సరే అన్నట్టు తల ఆడించాడు. ఇంతలో అక్కడికి వచ్చిన డ్రైవర్ క్లీనర్ తో మాట్లాడుతూ, మీ దగ్గర కన్సైన్మెంట్ పేపర్స్ ఏమైనా ఉన్నాయా? అని అడిగాను. .... ఆ ఉన్నాయి సార్ అంటూ డ్రైవర్ వెహికల్ క్యాబిన్ లోకి వెళ్లి ఓ రెండు పేపర్లు పట్టుకుని వచ్చాడు. జెస్సి మొబైల్ వెలుతురులో ఆ పేపర్లు అందుకుని చూసి, లైమ్ స్టోన్ పౌడర్ అని ఉంది అన్నాడు. .... చూడండి మీ బండ్లో మీరు తీసుకెళ్తుంది డ్రగ్స్ అని మీకు తెలుసా? అని అడిగాను.
అందుకు డ్రైవర్ క్లీనర్ కంగారు పడిపోతూ, సార్ మాకు అదేమీ తెలియదు సార్. అక్కడ లోడ్ చేస్తారు ఎక్కడికి వెళ్లాలో అడ్రస్ ఇచ్చి పేపర్లు ఇస్తారు. ఇదిగో ఇతనే మా కంపెనీ మేనేజర్ ఈయన చెప్పినట్టు మేము ట్రిప్పుకి వెళ్లి రావడమే మా పని అని చాలా భయంగా చెప్పారు. .... సరే మీ మీద ఎటువంటి కేసులు రాకుండా ఉండాలంటే తొందరగా బండిలో ఉన్న సరుకంతా ఇక్కడే అన్లోడ్ చేయండి అని చెప్పగానే డ్రైవర్ సరే అంటూ తల ఊపి క్లీనర్ ని కూడా తొందర పెడుతూ వెనక్కి వెళ్లి కంటైనర్ డోర్లు ఓపెన్ చేయించి ఇద్దరు కలిసి అన్లోడ్ చేయడం మొదలుపెట్టారు. లోపల చూస్తే 25 కేజీల ప్యాకెట్స్ రూపంలో దాదాపు ఒక 100 ప్యాకెట్లు వరకు కనిపించాయి. మేనేజరుని తారకి అప్పగించి నేను జెస్సి సోము కూడా వాళ్లకు సాయం చేసి తొందరగా పూర్తిగా అన్లోడ్ చేసాము.