Episode 114.1


నేను కొంచెం టైం తీసుకోవడానికి కారు నెమ్మదిగా నడుపుతూ వెనక వచ్చే వారిని గమనిస్తూ బ్లూటూత్ లో మా టీంతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ ఒక నిర్మానుష్య ప్రదేశం కోసం చూస్తూ వెళుతున్నాను. ఒక ఏరియాకి వచ్చిన తర్వాత అక్కడి నుంచి ఒక కిలోమీటరు లోపల రైల్వే ట్రాక్ ఉండే ప్లేస్ ఉండడంతో నేను కారును అటువైపు తిప్పి రైల్వే ట్రాక్ దగ్గరకి వెళ్ళిన తర్వాత ట్రాక్ వెంట కొంత దూరం ఎవరూ గమనించకుండా ఉండే ప్రదేశానికి వెళ్లి కారు ఆపి నేను ఎవరిని గమనించ లేనట్టు నటిస్తూ పాస్ పోసుకోవడానికి వెళ్లినట్లు వెళ్లి పాస్ పోసుకున్నాను. ఈడు సరైన ప్లేస్ లో దొరికాడు అని అనుకున్నారో ఏమో రెండు కార్లు వేగంగా దూసుకు వచ్చి నా కారుకి కొంచెం ముందుకు దూసుకువచ్చి ఆపి అందులో నుంచి మనుషులు గబగబా దిగి నన్ను రౌండప్ చేశారు. అప్పటికి పాస్ పోసుకోవడం పూర్తిచేసి వెనక్కి తిరిగి రెండు అడుగులు వేసిన నేను అందర్నీ చూసి ఆశ్చర్యపోతున్నట్టు నటిస్తూ నిల్చున్నాను.

మొత్తం 10 మంది ఉన్నారు అందులో ముగ్గురు కనకరాజు, భరద్వాజ్, జ్యువెలరీ మేనేజర్ కూడా ఉన్నారు. సరిగ్గా అదే సమయానికి తార, వాళ్ళు ముగ్గురు నీ దగ్గరే ఉన్నారు చూస్తున్నావా? అని ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. ఆ వెంటనే జెస్సీ కూడా మాట్లాడుతూ, జస్ట్ నీకు ఒక హాఫ్ కిలోమీటర్ దూరంలో ఉన్నాము ఒక ఫైవ్ మినిట్స్ మ్యానేజ్ చెయ్ అని నాతో అన్నాడు. వాళ్ల దగ్గర గన్స్ ఉన్నట్టు నాకు అనిపించలేదు. ఒకవేళ ఉన్నా ఇది సిటీ పరిధిలో జరుగుతుంది కాబట్టి జాగ్రత్త కోసం బయటకు తీయకుండా ఉన్నట్టున్నారు. నేను కనకరాజు వైపు చూసి మాట్లాడుతూ, ఏంటి కనకరాజు గారు ఈ టైంలో ఇక్కడ? అని కొంచెం ఎటకారంగా అడిగాను. .... ఏంట్రా మమ్మల్ని చూస్తుంటే నీకు ఎగతాళిగా ఉందా? మేము ఎలా కనబడుతున్నామురా నీకు? నువ్వు ఏదేదో చేసేస్తుంటే అన్నీ మూసుకుని కూర్చునేంత ఎదవల్లాగా కనపడుతున్నామా? అని అన్నాడు.

నేనేం చేశాను కనకరాజు గారు చేసుకుందంతా మీరే కదా? అని అన్నాను. .... జ్యువెలరీ మేనేజర్ మాట్లాడుతూ, ఇంకా వీడితో మాటలు ఏంటన్నా? కాళ్లు చేతులు విరగ్గొడితే ఆడే అన్ని కక్కుతాడు అని అన్నాడు. .... అవును మరి మీతో ఇరగ్గొట్టించుకోవడానికే ఇక్కడకు వచ్చాను. ఏరా మీకు బ్రెయిన్లు పని చేయవారా? అసలు నాకు ఇక్కడ దాక రావాల్సిన అవసరం ఏముంది అని కూడా ఆలోచించరా? నేను తీసుకువస్తేనే మీరు ఇక్కడికి వచ్చారు. ఇప్పుడు చెప్పండి మ్యాటర్ ఏంటి? అని అడిగాను. .... అంత తెలివి ఉన్నవాడివి మ్యాటర్ ఏంటో నీకు తెలియదా? అని అడిగాడు భరద్వాజ్. .... హలో ఎకౌంటెంట్ గారు మీరు కూడా మాట్లాడుతున్నారే? అని కొంచెం ఎగతాళి చేశాను. .... కనకరాజుకి కోపం పెరిగి, నేను లెక్చర్ వినడానికి ఇక్కడికి రాలేదు. మర్యాదగా ఖాళీ చేసిన మా స్విస్ అకౌంట్స్ లోని సొమ్ము తిరిగి వెనక్కి డిపాజిట్ చేయించు లేదంటే ఈరోజే ఇక్కడే కుక్కచావు చేస్తావు అని బెదిరించాడు.

ఈమాట అడగటానికి ఇప్పుడు దాకా ఎందుకు వెయిట్ చేశారురా? సొమ్మంతా నిన్నే గల్లంతై పోయింది కదా? ఓహో,, రాజకీయ పలుకుబడిని ఉపయోగిద్దాం అనుకున్నారా అందుకేనా నిన్నంతా పొలిటీషియన్స్, సెక్యూరిటీ ఆఫీసర్ల చుట్టూ తిరిగారు? అయినా నా కంపెనీలను ఆసరాగా చేసుకుని నా ప్రాపర్టీస్ వాడుకొని మీరు వందల కోట్లు దొబ్బేస్తే నేను కామ్ గా ఎందుకు ఉంటాను అనుకున్నారురా? ఆరోజు సంతకం పెట్టమనగానే భయపడినట్టు నటించి మీరు సంతకం చేసి కామ్ గా వెళ్లిపోయారు అంటేనే ఇలాంటి సందర్భం ఏదో ఒకటి ఫేస్ చేయాల్సి వస్తుందని నాకు ఆ రోజే తెలుసు అని అన్నాను. .... నాకు మొత్తం విషయాలు తెలుసు అని అర్థం అవ్వడంతో కనకరాజు కోపం కట్టలు తెంచుకొని, అలా చూస్తూ నిల్చున్నారు ఏంట్రా ముందు వాడి కాళ్ళు చేయి విరగ్గొట్టండి చచ్చినట్టు వాడే దారిలోకి వస్తాడు అని హూంకరించాడు. వెంటనే నన్ను చుట్టుముట్టిన వారి మనుషులు నా మీదకు దూకారు.

నేను వెంటనే అలర్ట్ అయ్యి వారికి ఎదురెళ్ళి ఒకడి మొహం మీద గట్టి పిడుగుద్దు గుద్ధి మరో పక్క నుంచి వచ్చిన వాడి చెయ్యి పట్టుకొని వెనక్కి తిరిగి నా భుజం మీద నుంచి కిందికి లాగేసరికి ఫట్,, అన్న సౌండ్ తో వాడి చెయ్యి విరిగిపోయింది. దాంతో వాడి వెనక ఉన్న వాడు ఒక అడుగు వెనక్కి వేశాడు. నాకు మరో వైపు నుంచి వచ్చిన వాడు నా మొహం మీద పంచ్ విసరడంతో నేను కింద కూర్చుంటూ వాడి డొక్కలో ఒక పంచ్ ఇచ్చేసరికి గట్టిగా కేకలు వేసుకుంటూ కింద పడ్డాడు. అప్పటికి ముగ్గురు నేలకూలారు కానీ నా వెనక నుంచి ఒకడు వచ్చి నా పీక చుట్టూ చెయ్యి వేసి గట్టిగా పట్టుకుని పక్కలో గుద్దడం మొదలుపెట్టాడు. నేను అటు ఇటు ఊగుతూ వాడి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తూ లెఫ్ట్ ఎల్బో వెనక్కి విసిరి వాడి చెవికి పైన నెత్తి మీద ఒక గట్టి షాట్ ఇవ్వడంతో వాడు వెనక్కి తూలిపడ్డాడు. సరిగ్గా అదే సమయానికి కారు ఆపి మా వైపు పరిగెత్తుకుంటూ వచ్చిన జెస్సీ సోము కూడా అటాక్ చేయడంతో మొత్తం ఏడుగురు నేల మీద కుప్పకూలారు.

సరిగ్గా పది నిమిషాల్లో తాము అనుకున్న దానికి విరుద్ధంగా తమ మనుషులు మొత్తం దాదాపు చావుబతుకుల్లో స్పృహ లేకుండా పడి ఉండటం చూసి ఈ ముగ్గురు మొహాల్లో భయం స్పష్టంగా కనబడుతుంది. అసలు నేను ఇలా చేస్తానని వాళ్ల ఊహకు కూడా అంది ఉండదు. దాంతో వెంటనే ముగ్గురు అక్కడినుంచి పారిపోవడానికి తమ కారు వైపు పరిగెత్తారు. కానీ అంతలోనే జెస్సి సోములకు దొరికిపోయారు. నేను వాళ్ళ వైపు చూసి మాట్లాడుతూ, ఏంటి కనకరాజు గారు ఇంతేనా ఇంకా ఎవరైనా ఉన్నారా? అని చేతులు దులుపుకుంటూ అడిగాను. .... కనకరాజు భయపడుతున్నాడు కానీ కొంచెం గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ, చూడు మాకు ఏమైనా జరిగిందంటే మా గ్రూప్ మరియు మా చేతిలో ఉన్న సెక్యూరిటీ అధికారి పవర్ నిన్ను ఊరికే వదిలిపెట్టదు మర్యాదగా మమ్మల్ని వదిలేయ్ అని అన్నాడు.

అవును నిజమే కదా,, మీకు ఏమైనా అయితే ఆ విషయం వాళ్ళకి తెలిస్తే అప్పుడు కదా నా దగ్గరికి వస్తారు? సో,,, మీకు ఏం జరిగిందో ఎవరికీ తెలియకుండా ఉంటే నా దగ్గరికి ఎవరూ వచ్చే అవకాశం లేదు కదా? అయితే ఆ పనే చేద్దాం అని చెప్పి వాళ్ళ ముగ్గురు కళ్ళముందే కిందపడ్డ ఏడుగురి మెడలు విరిచి పడేసి శాశ్వతంగా లేపేసాను. అది చూసి వాళ్ళు భయంతో అరవడం మొదలు పెట్టారు. వెంటనే జెస్సి వాళ్లను బెదిరించి నోరు మూయించి కార్ లో ఉన్న గుడ్డలు తీసుకొచ్చి వాళ్ల నోట్లో కుక్కాడు. సోము,, వీళ్ల ముగ్గురిని మన కారు డిక్కీలో తోసేయండి అని నేను అనగానే సోము భరద్వాజ్ మరియు జువెలరీ షాప్ మేనేజరు లను తీసుకొని వెళ్లి కారు డిక్కీలో ఇరికించి లోపల సర్దుకునేటట్టు నాలుగు తన్ని డిక్కీ క్లోజ్ చేసాడు. ఇక మిగిలిన కనకరాజుని కాళ్లు చేతులు కట్టి వెనక సీట్ ముందు భాగంలో ఎవరికీ కనబడకుండా కింద పడేశారు.

ఆ తర్వాత ముగ్గురం కలిసి ఈ శవాలను ఇక్కడ నుంచి మాయం చేయాలి ఏం చేస్తే బాగుంటుంది అని ఆలోచించాము. ఇంతలో అక్కడికి కొంచెం దూరంలో ఒక చెరువు లాంటిది కనపడింది. వెంటనే సోము మాట్లాడుతూ, వాళ్లను కారులో పడేసి ఆ చెరువులోకి దింపేస్తే అని అడిగాడు. .... ఐడియా బాగుంది కానీ రెండు కార్లు ఉన్నాయి కదా అని అన్నాను. .... వెంటనే జెస్సి, మాట్లాడుతూ, ఒక పని చేద్దాం ఒక కారులో కొంతమందిని పడేసి చెరువులోకి దింపేద్దాం మరో కారులో కొంతమందిని రైల్వే ట్రాక్ మీద వదిలేసి ట్రైన్ ఆక్సిడెంట్ గా మార్చితే సరిపోతుంది అని అన్నాడు. .... రెండు ఒకే లొకేషన్లో ఉన్నప్పుడు కొంతమందిని చెరువులో మరి కొంతమందిని ట్రాక్ మీద పెడితే ఇది ఖచ్చితంగా ఎవరో చేశారని తెలుస్తుంది. అలా కాకుండా రెండు కార్లను ట్రాక్ మీద పెడితే ట్రాక్ దాటుతుండగా జరిగిన యాక్సిడెంట్ అయిపోతుంది కదా అని అన్నాను.

వెంటనే ఇద్దరూ కూడా నా ప్లాన్ కి ఓకే చెప్పారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ ఏడుగురు వ్యక్తుల్ని రెండు కార్లలో సర్దేసి కార్లను ట్రాక్ మీద ఒకే వరుసలో ట్రాక్ దాటుతున్నట్టు పెట్టేసి మా కార్లు తీసుకుని అక్కడ నుంచి దూరంగా వెళ్లి ఆ లైన్ లో వచ్చే ట్రైన్ కోసం వెయిట్ చేస్తూ కూర్చున్నాము. ఒక గంట తర్వాత ట్రైన్ వస్తూ కార్లను గమనించి హారన్ మోగడం మొదలైంది కానీ ఆ వచ్చేది సూపర్ ఫాస్ట్ ట్రైన్ లాగా ఉంది కొద్ది క్షణాల వ్యవధిలోనే కార్లను డీ కొట్టుకుంటూ ముందుకు దూసుకు వెళ్ళిపోయింది. రెండు కార్లు చెల్లాచెదురుగా ఎగిరి పడ్డాయి. అదృష్టవశాత్తు అది ఎవరూ నివసించే ప్రాంతం కాకపోవడంతో ఎవరూ గమనించినట్లు అనిపించదు. ఆ తర్వాత మేము ఆలస్యం చేయకుండా వాళ్ళ ముగ్గురు దగ్గర ఉన్న సెల్ ఫోన్ లు స్విచ్ ఆఫ్ చేసి సిమ్ లు తీసి చివరిసారిగా వాళ్లు ఆ లొకేషన్లోనే మాయమైనట్టు జాగ్రత్తలు తీసుకుని నేరుగా వర్క్ స్టేషనుకి చేరుకుని వాళ్ళ ముగ్గురుని టార్చర్ రూమ్ లో కట్టిపడేసి, గయ్స్ వీళ్ళ సంగతి రేపు చూసుకుందాం అని చెప్పి నలుగురం కలిసి భోజనం చేసి నేను నా రూముకి వెళ్లిపోయాను.

మరుసటి రోజు తెల్లవారి నిద్ర లేస్తూనే జాగింగ్ సూట్ వేసుకుని వర్క్ స్టేషనులో ముగ్గురుని కలిసి యధావిధిగా మా జాగింగ్ మరియు జిమ్ ముగించి హాల్ లో కూర్చున్నాము. తార మాట్లాడుతూ, వీళ్ళ సంగతి ఏంటి? అని అడిగింది. .... మనం కొంచెం ఫ్రెష్ అయి ఏదైనా తిని వాళ్ల దగ్గర నుంచి ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరుకుతుందేమో చూద్దాం లేదంటే వీళ్ళను కూడా జనాభా లెక్కల్లో లేకుండా ఇంకేదైనా ప్లాన్ చేయాలి అని అన్నాను. .... అసలు నిన్న రాత్రే వీళ్ళను కూడా లేపేసి ఉంటే బాగుండేది కదా? మళ్లీ వీళ్ళ కోసం ఇప్పుడు ప్రత్యేకంగా ప్లాన్ చేయాలంటే కష్టమైపోతుంది. నిన్న రాత్రి జరిగిన యాక్సిడెంట్ విషయంలో ఈపాటికి సెక్యూరిటీ ఆఫీసర్లు క్లూస్ వెతుకుతుంటారు. అందులో వీళ్ళు ముగ్గురు మిస్సింగ్ అని తెలుసుకోవడం వాళ్లకి పెద్ద కష్టం కాకపోవచ్చు అని అన్నాడు సోము.

మనకి వీళ్ల దగ్గర నుంచి ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరికే అవకాశం కూడా ఉంది కదా అందుకే రాత్రి వాళ్ళను ఇక్కడికి తీసుకొచ్చాము. ఇన్ఫర్మేషన్ దొరికితే సరి లేదంటే ఏం చేయాలన్నది ఆలోచిద్దాం తొందరగా తయారయ్యి రెడీ అయిపోండి ఈరోజు వీళ్ళ పని ఫినిష్ చేద్దాం అని చెప్పి నేను రూముకి బయలుదేరుతుండగా అమ్మ దగ్గర నుంచి కాల్ వచ్చింది. నేను లిఫ్ట్ చేయగా అమ్మ మాట్లాడుతూ, నాన్న ఈరోజు ఇంటికి వస్తున్నావా? అని అడిగింది. .... లేదమ్మా కొంచెం పనిలో ఉన్నాను రావడం కుదరకపోవచ్చు నాకోసం చూడొద్దు అని చెప్పి కాల్ కట్ చేశాను. ఆ తర్వాత రూముకి వెళ్ళి తయారయ్యి తిరిగి వర్క్ స్టేషనుకి వచ్చి అందరం కలిసి టిఫిన్ చేసి టార్చర్ రూమ్లోకి ఎంటర్ అయ్యాము. చేతులు కాళ్లు కట్టేసి నోట్లో గుడ్డలు కుక్కి ఉంచడంతో మెడలు పక్కకి వాల్చి నిద్రలో ఉన్న ముగ్గురు మేము లోపలికి వచ్చిన చప్పుడికి మెలుకువ వచ్చి మా వైపు భయంభయంగా చూస్తున్నారు.

తార ఎందుకైనా మంచిది ఒక్కసారి వీళ్ళ సిమ్ నంబర్ల లాస్ట్ లొకేషన్ ఏంటో ఎంక్వైరీ చెయ్ అని చెప్పగా తార బయటికి వెళ్ళింది. మేము ముగ్గురం వాళ్లకు ఎదురుగా నిల్చుని సోము ఒక స్టీల్ పైప్ తీసి చేత్తో పట్టుకున్నాడు. మ్,,, ఇప్పుడు చెప్పండి కనకరాజు గారు అసలు మీరు చేసే వ్యాపారాలు ఏంటి, అంత డబ్బును దేశం దాటించి దాచుకోవలసిన అవసరం ఏం వచ్చింది? అని అడిగాను. .... చూడు దీపు నువ్వు నిప్పుతో చెలగాటం ఆడుతున్నావు. నిన్న రాత్రి ఈ విషయం జరిగినా ఇంకా నీ దగ్గరకు ఎవరూ రాలేదని అనుకుంటున్నావేమో? కొంచెం లేట్ అయినా నిన్ను వెతుక్కుంటూ మా మనుషులు వస్తారు. అనవసరంగా ప్రాణాల మీదకు తెచ్చుకోకుండా డబ్బును తిరిగి ట్రాన్స్ఫర్ చేసి మమ్మల్ని వదిలేయ్ అని కొంచెం నీరసంగానే వార్నింగ్ ఇచ్చాడు. .... అంటే నిన్న మీరు నా వెంట పడింది కేవలం డబ్బుల కోసమేనా? అని అడిగాను.

అది కాకుండా ఇంకా దేని కోసం నీ వెనకాల తిరుగుతాము? అని అన్నాడు కనకరాజు. .... వెంటనే మేము ముగ్గురం ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నాము. అంటే మొన్న రాత్రి డ్రగ్స్ ఆపరేషన్ లో ఉన్నది మేమే అని వాళ్లకు తెలీదు అని అర్థం అయింది. నేను మళ్ళీ మాట్లాడుతూ, అదేంటి కనకరాజు గారు మిస్ అయిపోయిన మీ సరుకు గురించి కూడా అడుగుతారు అనుకున్నానే? అని అన్నాను. .... నా నుంచి అటువంటి మాటను ఎక్స్పెక్ట్ చేయని కనకరాజు కొంచెం ఆశ్చర్యంగా నావైపు చూస్తూ, అసలు ఎవరు నువ్వు? ఆ విషయం నీకెలా తెలుసు? ఒకవైపు మా డబ్బులు లేపేసావు మరోపక్క మా సరుకు మాకు అందకుండా పోయింది, ఇప్పుడేమో నువ్వు మా సరుకు గురించి కూడా మాట్లాడుతున్నావు. అసలు ఎవరు నువ్వు? అని మళ్ళీ అడిగాడు.

నేను ఎవరైతే నీకెందుకు గాని అసలు అంత పెద్ద ఎత్తున డ్రగ్స్ ఏ దైర్యంతో ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు? సాధారణంగా కేజీలలో దొరికే డ్రగ్స్ టన్నుల టన్నులు ఎలా నడిపిస్తున్నారు? మీ వెనుక ఇంకా ఎంత మంది పెద్దలు ఉన్నారు? పూర్తి డీటెయిల్స్ చెప్పకపోతే మీరు కూడా ఇకమీదట జనాభా లెక్కల్లో ఉండరు. ఇవే మీ చివరి ఘడియలు అవుతాయి అని అన్నాను. .... కానీ ముగ్గురు ఏమీ మాట్లాడకుండా మౌనంగానే ఉండిపోయారు. .... చూడండి అన్ని వివరాలు సరిగ్గా చెబితే మీరు కనీసం బతికి ఉండి జైలు జీవితాన్ని గడుపుతారు. అనవసరంగా మీ ప్రాణాలు పోగొట్టుకోవద్దు అని అన్నాను. .... ఇంతలో తార వచ్చి, మన డిపార్ట్మెంట్ ఎంక్వైరీ ప్రకారం నిన్న రాత్రి ఆక్సిడెంట్ జరిగిన చోటే వీళ్ల లాస్ట్ లొకేషన్ అని కన్ఫర్మ్ అయింది. ఇకపోతే ఆ రెండు కార్లను వీళ్లే యాక్సిడెంట్ కి గురి చేసి అక్కడ నుంచి పరారై ఉండొచ్చు? అని న్యూస్ నడుస్తుంది అని ఇన్ఫర్మేషన్ ఇచ్చింది.

అదండీ కనకరాజు గారు అసలు సంగతి. అంటే ఇప్పుడు మీరు లోకం దృష్టిలో ఎక్కడ ఉన్నారో ఎవరికీ తెలియదు. కనీసం మీ ప్రాణాలు కాపాడుకోవడానికైనా నిజాలు చెప్తే బాగుంటుంది అని అన్నాను. .... జువెలరీ షాప్ మేనేజర్ కనకరాజు వైపు భయంగా చూస్తూ, అన్నా,,, అని అన్నాడు. భరద్వాజ్ మాత్రం ఏమీ మాట్లాడకుండా అలాగే కూర్చున్నాడు. .... ఇలా మామూలుగా అడిగితే ఎందుకు చెబుతారు ఓ రౌండ్ పడితే అప్పుడు నోరు విప్పుతారు అంటూ సోము ముగ్గురికి కలిపి ఒక రేవు పెట్టాడు. స్టీల్ పైపుతో తగిలిన దెబ్బలకు ఓ రెండు నిమిషాల పాటు రూమ్ మొత్తం గోలగోలగా మారింది. నేను సోముని ఆపమని చెప్పి మళ్లీ అదే ప్రశ్న అడిగాను. ఈసారి కనకరాజు నెమ్మదిగా మాట్లాడుతూ, ఈ బిజినెస్ మేము చాలా కాలంగా చేస్తున్నాము. కంపెనీ వాహనాలు పత్రాలు వాడుకొని ఇంతవరకు ఎవరికీ దొరక్కుండా తీసుకు రాగలిగాము అని అన్నాడు.

అంత డబ్బు వీటిమీద వచ్చిందేనా? అని అడిగాను. .... దాదాపు ఎక్కువ శాతం దీని మీదే వచ్చింది. ఇంకా డైమండ్ ఫ్యాక్టరీ వేస్ట్ మెటీరియల్, కాటన్ ఫ్యాక్టరీ కాంట్రాక్ట్స్ మీద కూడా బాగానే సంపాదించాము. జువెలరీ షాప్ మేకింగ్ ఆర్డర్స్ మీద వచ్చింది చాలా తక్కువ. అన్నిటికంటే డ్రగ్స్ ట్రాన్స్పోర్ట్ మీదనే ఎక్కువ సంపాదించాము. ఇప్పుడు నీకు అన్ని విషయాలు చెప్పాను మాకు మా డబ్బులు కూడా తిరిగి ట్రాన్స్ఫర్ చేయవలసిన అవసరం లేదు మమ్మల్ని వదిలేస్తే చాలు అని నా వైపు కాస్త దీనంగా చూశాడు. .... అంత ఈజీగా ఎలా కుదురుతుందండి రాజు గారు? ఇంకా మీతో ఉన్న పార్ట్నర్స్, మీకు సపోర్ట్ గా నిలిచిన పొలిటిషియన్స్ మరియు సెక్యూరిటీ ఆఫీసర్ల లిస్టు గురించి చెప్పలేదు అని అన్నాను. .... మాకు ఎవరూ పార్ట్నర్స్ లేరు, సెక్యూరిటీ ఆఫీసర్లంటే మా దగ్గర లంచాలు తీసుకుని బోర్డర్స్ క్రాసింగ్ విషయంలో హెల్ప్ చేస్తూ ఉంటారు. అది ఒకరని కాదు ఎక్కడికక్కడ అవసరం బట్టి డీల్స్ జరుగుతూ ఉంటాయి అని అన్నాడు.

మీకు సరుకు ఎక్కడ్నుంచి వస్తుంది? ఎప్పుడూ ఇదే రూటా? అని అడిగాను. .... లేదు,, కర్ణాటక, కేరళ, తమిళనాడు ఇంకా ఒరిస్సాలోని పారాదీప్ పోర్టుల నుంచి బయటకు వచ్చిన తర్వాత మేము రిసీవ్ చేసుకుని ట్రాన్స్పోర్ట్ చేసి ఎక్కడికి చేరాల్సిన సరుకు అక్కడికి చేరుస్తాము. అంతటితో మా పని ముగిసి మా కమిషన్లు మాకు వచ్చేస్తాయి. అంతకు మించి మా ప్రమేయం ఇంకేమీ ఉండదు అని అన్నాడు. .... అంటే మీతో ఈ పని చేయించే వాళ్ళు ఇంకా ఉన్నారన్నమాట మరి వాళ్ళ వివరాలు ఏంటి? అని అడిగాను. .... వాళ్ల గురించి మాకు ఏమీ తెలీదు. అవసరమైనప్పుడు ఒక వ్యక్తిని పంపించి వివరాలు చెప్పి డీల్ మాట్లాడుకుని వెళ్ళిపోతారు. మళ్లీ మేము పని పూర్తి చేయగానే మా వాట మాకు పంపించేస్తారు. ఆ వచ్చే వ్యక్తులు కూడా ఎవరో మాకు తెలీదు అని చెప్పాడు. ఆ విషయం వినగానే కిషోరీ లాల్ ఇచ్చిన స్టేట్మెంట్ కూడా సరిగ్గా అలాగే ఉండడం మాకు కొంచెం విస్మయం కలిగించింది.

అంటే ఈ రాకెట్ వెనకాల చాలా పెద్ద మనుషుల హస్తం ఉండి ఉంటుంది. మే బీ,, అది రాజకీయ నాయకులు కావచ్చు లేదంటే పెద్ద బిజినెస్ మ్యాన్లు అయినా అయి ఉండొచ్చు. ఇలాంటి వాళ్ళకి కాంట్రాక్టులు ఇస్తూ వాళ్ల హస్తం లేకుండా జాగ్రత్తలు పడుతున్నారు అన్నమాట. మరి నిన్న సరుకులు మాయం చేసిన రుద్ర హస్తం ఇందులో ఏ స్థాయిలో ఉంది? అని ఆలోచన రావడంతో, మీకు ఇన్స్పెక్టర్ రుద్రకి ఉన్న సంబంధం ఏంటి? అని అడిగాను. .... ఇన్స్పెక్టర్ రుద్రతో మాకు ఎటువంటి సంబంధం లేదు. అసలు మేము ఎప్పుడూ అతన్ని కలవలేదు అని అన్నాడు. .... కిషోరీ లాల్ కూడా దాదాపు ఇటువంటి సమాధానమే చెప్పాడు. మరి రుద్ర దాచేసిన ఆ డ్రగ్స్ ఎవరికోసం? ఇప్పుడు అవి ఎక్కడికి చేరుకొని ఉంటాయి? అన్న ఆలోచనలు బుర్రలో స్పీడ్ గా పరిగెడుతున్నాయి. అంటే రుద్రకి ముఖ్యమైన వ్యక్తులతో డీలింగ్ ఉందా? అన్న అనుమానం వచ్చింది.

చూడండి కనకరాజు గారు మీకు తెలుసో లేదో నిన్న డ్రగ్స్ ట్రాన్స్పోర్ట్ కానీయకుండా మధ్యలోనే ఆపేసింది మేమే. మీకు అత్యంత నమ్మినబంటు అయిన మన ట్రాన్స్పోర్ట్ మేనేజర్ దురదృష్టవశాత్తూ అక్కడే మిగిలిన మనుషులతో పాటు చచ్చాడు. ఇక మీరు కూడా బ్రతికి ఏం ప్రయోజనం లేదు అంటూ సోము చేతిలోని స్టీల్ పైప్ అందుకుని, మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఆ డ్రగ్స్ లో రెండు టన్నుల సరుకుని ఇన్స్పెక్టర్ రుద్ర మాయం చేశాడు. బహుశా ఈ న్యూస్ మీకు కొత్తది కావచ్చు లేదూ మీకు ఇదివరకే తెలిసుంటే మర్యాదగా చెప్పి బతికిపోండి అని వార్నింగ్ ఇచ్చాను. .... ముగ్గురు గజగజా వణుకుతూ, మాకు తెలిసింది ఇంతే, ఇన్స్పెక్టర్ రుద్ర ఆ సరుకు ఎందుకు తీసుకు వెళ్ళాడో మాకు తెలీదు. అసలు అతనితో మాకు ఎటువంటి సంబంధం లేదు అని అన్నారు.

ఇక వీళ్ల దగ్గర నుంచి ఎటువంటి సమాచారం రాదని తెలిసి ఇంతవరకు వాళ్ళు చేసిన పనులకు జరిగిన నష్టాన్ని గుర్తుచేసుకుంటూ నా కోపం తారాస్థాయికి చేరి కనకరాజు మరియు భరద్వాజ్ లను దాదాపు చచ్చేంత వరకు కొట్టాను. డ్రగ్స్ సరఫరా చేస్తూ ఈ రాష్ట్రంలోని మరియు దేశంలోని యువత భవిష్యత్తుతో ఆడుకుంటారా? మిమ్మల్ని నమ్మి కోర్టు నా కంపెనీలను సజావుగా నడపమని మీ చేతుల్లో పెడితే మీరు చేసే పనులు ఇవా? కేవలం డబ్బు మాత్రమే దోచేస్తే మీ గురించి మరొకసారి ఆలోచించేవాడిని కానీ మీరు ఈ దేశ భవిష్యత్తుతో ఆడుకున్నారు. సమాజాన్ని చెడు వ్యసనాలకు బానిస చేసి మీ పబ్బం గడుపుకున్నారు. మీకు బతకడానికి అర్హత లేదు అని అన్నాను. .... జువెలరీ షాప్ మేనేజర్ నీరసంగా మాట్లాడుతూ, మా డబ్బు మొత్తం తీసుకున్నావు కదా? ఇంకా మమ్మల్ని ఇలా చావకొట్టడం వలన నీకు ఉపయోగం ఏంటి? అని అన్నాడు.

నా కొడకా,,, అసలు నీ గురించి నువ్వు ఏమనుకుంటున్నావురా? ఆడపిల్లలు నీ కాళ్ళ దగ్గర బానిసలు అనుకుంటున్నావా? నువ్వు అంత మగాడివేంట్రా? కూటికి గతి లేక ఎన్నో సమస్యలు ఎదుర్కొని పేదరికాన్ని అనుభవిస్తూ కుటుంబ అవసరాల కోసమో పొట్ట నింపుకోవడం కోసమో అమ్మాయిలు చాలీచాలని జీతాలకి నీలాంటి నీచులు దగ్గర పనిలోకి చేరితే అదేదో వాళ్లంతా నీ ఆస్తి అన్నట్టు పదిమందిలో వాళ్లతో వెకిలి చేష్టలు చేస్తూ హింసించే నిన్ను ఊరికే వదిలేయాలా? అని పిచ్చ కోపంతో రగిలిపోయి వాడికి మరో రౌండ్ ఎగస్ట్రా కోటింగ్ ఇచ్చాను. .... ఇంతలో తార, మావ వీడిని నాకు వదిలేయ్ అని చెప్పి నా చేతిలో ఉన్న పైప్ లాక్కుని వాడిని కుక్కను కొట్టినట్టు కొట్టి కాలితో వాడి పిచ్చల మీద కెబుక్కున తన్నడంతో వాడు ఆ బాధను తట్టుకోలేక గిలగిల లాడాడు. కానీ తార మాత్రం ఏ మాత్రం కనికరించకుండా వాడి కొనఊపిరి పోయేవరకు పిచ్చికొట్టుడు కొట్టి పైప్ విసిరేసింది.

నేను సోము మరియు జెస్సీల వైపు చూసి, వీళ్లని కూడా ఫినిష్ చేసేసి పని పూర్తి చేయండి అని చెప్పి బయటికి వచ్చేశాను. నాతో పాటు తార కూడా బయటికి వచ్చి సోఫాలో కూర్చుంది. మరో ఐదు నిమిషాల తర్వాత సోము జెస్సీ కూడా బయటికి వచ్చి మాతో పాటు కూర్చుని, వాళ్లు కూడా ఫినిష్ ఇప్పుడేం చేద్దాం? అని అడిగారు. .... ముందు మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మొత్తం చీఫ్ కి వివరించాలి అని లేచి లాప్టాప్ తీసుకుని వచ్చి సెక్యూర్ వీడియో కాల్ చేశాను. చీఫ్ లైన్ లోకి రాగానే నిన్న రాత్రి నుండి జరిగిన మొత్తం విషయం వివరంగా చెప్పి, రుద్రకి ముఖ్యమైన వ్యక్తుల తోనే సంబంధం ఉండి ఉంటుంది అన్న నా సందేహాన్ని వెలిబుచ్చాను. .... చీఫ్ కూడా మొత్తం వ్యవహారాన్ని బేరీజు వేస్తూ నా సందేహాన్ని కన్ఫామ్ చేశారు.

Next page: Episode 114.2
Previous page: Episode 113.2