Episode 115.2
నేను తీరికగా లేచి బాత్రూంలోకి వెళ్లి అన్ని పనులు ముగించుకొని స్నానం చేసి నిన్న విడిచిన బట్టలు ఆరిపోయి కొంచెం పొడిగా అనిపించడంతో మళ్లీ అవే బట్టలు వేసుకుని ఆఫీసు రూం లోకి వచ్చేసరికి టేబుల్ మీద వేడి టిఫిన్ కాఫీ మరియు వాటర్ బాటిల్ రెడీగా కనిపించింది. అప్పుడే డోర్ తెరుచుకుని ఆఫీస్ రూమ్ లోకి వచ్చిన రజిని నన్ను చూసి, ఇంకేమైనా కావాలా సార్? అని అడిగింది. .... ప్రస్తుతానికి ఇవి చాలు వెళ్లి పని చూసుకో అవసరం ఉంటే పిలుస్తాను అని చెప్పగానే రజనీ వెళ్ళిపోయింది. బాగా ఆకలిగా ఉండడంతో నేను కూడా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా సీట్లో కూర్చుని గబగబా టిఫిన్ తిని కాఫీ తాగేసరికి కొంచెం హ్యాంగోవర్ తగ్గి ఫ్రెష్ గా ఉన్నట్టు అనిపించింది. ఆ తర్వాత నేను మళ్ళీ ఫ్లాట్ లోకి వెళ్లి ఆఫీసు ముందర వైపు ఉన్న బాల్కనీలోకి వచ్చి అటు ఇటు తిరుగుతూ కాలక్షేపం చేశాను.
అలా తిరుగుతూ అనుకోకుండా ఒకసారి కింద వైపు చూస్తే అప్పుడే ఆటో దిగుతున్న పద్మిని గారు కనబడ్డారు. బహుశా నన్ను కలవడానికి వచ్చిందేమో అని అనుకొని అక్కడినుంచి ఆఫీస్ రూమ్ లోకి వచ్చి కూర్చున్నాను. కానీ చాలా సేపటి వరకూ ఎవరూ నా రూంలోకి రాకపోవడంతో బోర్ కొట్టి నా ముందున్న కంప్యూటర్ ఆన్ చేసుకుని బ్రౌజింగ్ చేయడం మొదలుపెట్టాను. అనుకోకుండా డ్రెస్సులు కనబడటంతో ఇక్కడ ఉంటే వేసుకోవడానికి డ్రస్సులు లేవు అన్న విషయం గుర్తొచ్చి ఆన్లైన్ షాపింగ్ లో నాకు కావలసిన కొన్ని బట్టలు సెలెక్ట్ చేసి బుక్ చేశాను. దాదాపు చీకటి పడే సమయానికి ఆఫీస్ రూమ్ డోర్ తెరుచుకుని రజిని పద్మిని ఇద్దరూ లోపలికి వచ్చారు. గుడ్ ఈవెనింగ్ పద్మిని గారు,, అని పలకరించగా, గుడ్ ఈవెనింగ్ దీపు,, మీరు,,, సారీ నువ్వు ఎలా ఉన్నావ్? అని నవ్వుతూ పలకరించింది. .... హహహ,,, అని నవ్వుతూ, నేను బాగానే ఉన్నాను మీరు ఎలా ఉన్నారు? అని అడిగాను.
నేను చాలా బాగున్నాను? నువ్వు ఆఫీసులో ఉన్నావని తెలిసి పలకరించి వెళదామని వచ్చాను. .... అవును మీరు వచ్చి చాలాసేపు అయింది నేను చూశాను. అదేంటి మీకు వెహికల్ లేదా? ఇందాకా ఆటో దిగుతుంటే చూశాను అని అన్నాను. .... లేదు,, అని నవ్వింది. .... అంటే మీరు రోజూ ఇలాగే ఆటోలో తిరుగుతున్నారా? మీకు వెహికల్ నడపడం రాదా లేదంటే ఇంకేమైనా కారణం??? అని ఆగాను. .... పద్మిని మళ్ళీ నవ్వుతూ, నో నో,, అలాంటిదేమీ లేదు. నేను కాలేజీకి వెళ్లేటప్పుడు బైక్ యూజ్ చేసేదాన్ని, పెళ్లయి ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు బైక్ అవసరం లేకుండా పోవడంతో మళ్లీ తీసుకునే ఆలోచన చేయలేదు. ఏదైనా అవసరమైతే మావయ్య గారు తన కారులో తీసుకెళ్లి తీసుకొస్తారు అని అంది. .... నేను సరదాగా నవ్వుతూ, మీకు ఇష్టమైన కలర్ ఏంటి పద్మిని గారు అని అడిగాను. .... పద్మిని నావైపు కొంచెం విచిత్రంగా చూస్తూ, అదేం ప్రశ్న? అని అడిగింది.
అబ్బా ఊరికినే అడిగానండి,,, అని అనడంతో, బ్లాక్,,, అని చెప్పింది. .... ఇంతకీ మీరు ఈ టైంలో ఆఫీసుకి ఎందుకు వచ్చారు? అని అడిగాను. .... ఏం లేదు,, రజిని మన కంపెనీ చారిటబుల్ ట్రస్ట్ విషయమై ఏవో కొన్ని లీగల్ టెర్మినాలజీస్ గురించి మాట్లాడదాం అంటే వచ్చాను. ఇప్పటిదాకా అదే పనిలో ఉన్నాము, పని పూర్తయింది నిన్ను కలిసి వెళదామని అంటూ చైర్ లో నుంచి లేచి, నేను వెళ్తాను మరి అని బాయ్ చెప్పి రజినీ తోడు వెళ్లగా బయటకు వెళ్లిపోయారు. వయసులో అరుణకి ఒకట్రెండు సంవత్సరాలు పెద్ద అయ్యుంటుందేమో కానీ అందంలోనూ ఫిగర్ లోను ఏ మాత్రం తక్కువ కాదు పద్మిని. ఈరోజు ఆమె బ్లాక్ కలర్ ఫ్లోరల్ డిజైన్ ఉన్న శారీ కొట్టుకోవడం తో మరింత అందంగా ఆకర్షణీయంగా కనబడుతోంది. చీరకట్టులో నుంచి ఎటువంటి ఆచ్చాదన లేని ఎడమ నడుము భాగం పట్టుకొని పిసికేయాలి అనిపిస్తుంది.
అంతలోనే నా అంతరాత్మ నన్ను తిడుతూ, నోరు ముయ్యిరా ఎదవ, కళ్ళు కామంతో మూసుకుపోయాయి నీకు. రాను రాను నీకు చిన్న పెద్ద మంచి చెడుల మధ్య తారతమ్యాలు తెలియడం లేదు. ఎవర్తి కనబడితే దానితో ఊహించుకోవడం బాగా అలవాటైపోయింది. దేనికైనా ఓ హద్దు పద్దు ఉంటుంది అని నన్ను గట్టిగా హెచ్చరించింది. నేను కూడా తల విదుల్చుచుకుని, అమ్మో,,, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. పద్మిని గారితో నేను అంత చనువుగా మాట్లాడేసానేంటి? ఆవిడ ఏమీ అనుకోలేదు కదా? ఒరే దీపు,, ఇప్పుడు నీకు ఆడవాళ్ళతో మాట్లాడటం బాగా ఈజీ అయిపోయుండొచ్చు కానీ ఎదుటి వాళ్ళు కూడా నీ గురించి ఏమనుకుంటున్నారో ఆలోచించుకొని ప్రవర్తించు. ఇలా దొంగ చూపులు చూస్తూ కూర్చుంటే ఎదుటివారి దృష్టిలో క్యారెక్టర్ పాడైపోయే అవకాశం ఉంది అని నాలో నేనే అనుకున్నాను.
అలా ఆలోచనలలో ఉండగా రజినీ కొన్ని ఫైల్స్ పట్టుకొని ఆఫీస్ రూమ్ లోకి వచ్చి నాకు వాటి గురించి వివరించి సంతకాలు తీసుకుంది. ఆ తర్వాత టైమ్ చూసి, సార్ మీరు ఇంటికి వెళ్తారా ఇక్కడే ఉంటారా? అని అడిగింది. .... ఇంతవరకు నేను కూడా ఆ విషయం ఆలోచించలేదు. అందుకే ఏం చెప్పాలో తెలియక, ఓకే,,, యు కెన్ గో,, నా సంగతి నేను చూసుకుంటాను అని చెప్పడంతో రజిని మళ్ళీ ఏమీ మాట్లాడకుండా తనలో తానే చిన్నగా నవ్వుకుంటూ వెళ్ళిపోయింది. ఆ తర్వాత నేను మరి కొంచెం సేపు కంప్యూటర్ తో కాలక్షేపం చేసి ఇంటికి వెళ్ళాలని అనిపించకపోవడంతో కింద వాచ్ మెన్ కి కాల్ చేసి, ఒక బీరు మరియు తినడానికి ఫుడ్ పట్టుకు రమ్మని చెప్పడంతో కొంతసేపటికి అన్ని అరేంజ్ చేశాడు. ఈ రోజు బీరు బిర్యానిలతో టైం పాస్ చేసి మళ్లీ బట్టలు విప్పేసి టవల్ చుట్టుకొని పడుకున్నాను.
మరుసటి రోజు మాత్రం ఆఫీస్ టైం కి నిద్ర లేచి తయారయ్యి ఆఫీస్ రూమ్ లోకి చేరుకున్నాను. రజనీ వచ్చినవెంటనే నాకు టిఫిన్ కాఫీ అరేంజ్ చేసింది. ఈరోజు కొంచెం ఆఫీస్ పనులతో బిజీగా గడిచింది. మధ్యాహ్నం కూడా రజినీ నా కోసం భోజనం ఆర్డర్ చేయగా తినేసి రజనీ మరియు అకౌంటెంట్ గంగాధర్ గారితో కలిసి చారిటబుల్ ట్రస్ట్ విషయం గురించి విస్తృతంగా చర్చించుకుని ఒక కంక్లూజన్ కి వచ్చాము. మళ్లీ ఈ రోజు కూడా నాకు ఇంటికి వెళ్లాలని అనిపించక పోవడంతో నేను ఇక్కడే ఉంటాను అని గ్రహించిన రజిని ఈ రోజు తాను ఉండగానే నాకు తెలియకుండానే కింద సర్వెంట్ కి చెప్పి రాత్రికి నాకు భోజనంతోపాటు ఒక అరడజను బీర్లు కూడా తెప్పించి లోపల ఫ్రిడ్జ్ లో పెట్టించి, సార్ నేను బయలుదేరుతున్నాను మీకు కావాల్సినవన్ని రూమ్లో పెట్టించాను అని చెప్పి వెళ్ళిపోయింది.
నాకు కావలసినవా?? అని ఆలోచించుకుంటూ రూమ్ లోకి వెళ్లి చూసేసరికి డైనింగ్ టేబుల్ మీద ఫుడ్ పార్సిల్ కనబడింది. ఆ తర్వాత నేను వాటర్ బాటిల్ కోసం ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి ఓపెన్ చేసేసరికి లోపల అరడజను బీర్లు, రెండు బట్టర్ మిల్క్ ప్యాకెట్లు, ఒక స్వీట్ బాక్స్ కనబడటంతో రజిని చేసిన పని ఏంటో తెలిసి నాలో నేనే నవ్వుకున్నాను. ఒక బీరు తీసుకొని ఫ్రిడ్జ్ క్లోజ్ చేసేసరికి అక్కడ ఎదురుగా ఉన్న సెల్ఫ్ లో చిప్స్, కురుకురే లాంటి చిల్లర తిళ్ళ ప్యాకెట్స్ కూడా కనపడటంతో ఈసారి బయటికే పెద్దగా నవ్వుకుని, నీ లైఫ్ స్టైల్ ఎంత మారిపోయిందిరా దీపు. నీ కనుసైగలతోనే అన్నీ నీ కాళ్ళ ముందుకి వచ్చి పడిపోతున్నాయి. నీ పట్ల అత్యంత విశ్వాసంగా పనిచేసే స్టాఫ్ కూడా ఉన్నారు. ఈ విశ్వాసాన్ని ఎప్పుడూ కోల్పోకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీదే అని నా అంతరాత్మ హెచ్చరిస్తుండగా హ్యాపీగా బీరు భోజనం ముగించి పడుకున్నాను.
మరుసటి రోజు పొద్దున్న టైంకి నిద్ర లేచి కొంచెం సేపు ఎక్సర్సైజులు చేసుకుని స్నానం చేసి రెడీ అయ్యాను. కానీ గత మూడు రోజులుగా వర్షంలో తడిచి ఆరిన అవే బట్టలు వేసుకుంటూ ఉండటంతో కొంచెం వాసన వస్తున్నాయి. ఆ వాసన నేను ఇంటికి వెళ్లాల్సిన అవసరం గుర్తు చేసింది. ఆ రోజు పార్కులో జరిగిన సంఘటన తర్వాత ఇంటికి వెళ్లడం ఇష్టం లేక ఇక్కడికి వచ్చేసాను కానీ గత రెండు రోజులు కూడా ఇంటికి వెళ్లాలి అనిపించకపోవడం పైగా నేను నా మొబైల్ కూడా వాడకపోవడం నాకే ఆశ్చర్యంగా అనిపించింది. రెండు రోజులుగా కాలేజీకి కూడా వెళ్లలేదు. అను కాలేజీకి వెళ్తే నేను కనబడలేదు అన్న విషయం అందరికీ తెలిసే అవకాశం ఉంటుంది. అవునూ,, ఇంతకీ నా మొబైల్ అని అనుకుంటూ వెతికే సరికి సోఫాలో ఒక పక్కగా ఇరుక్కొని ఉన్న నా మొబైల్ కనపడింది.
ఈ రెండు రోజులు ఎవరూ ఫోన్ చేయకపోవడం ఏంటి? అని అనుకుంటూనే మొబైల్ తీసి ఆన్ చేసి చూడగా స్విచాఫ్ అయిపోయి ఉంది. అందుకే నాకు ఎటువంటి కాల్స్ రాలేదు,, అనుకుంటూ స్విచాన్ చేయగా బ్యాటరీ పూర్తిగా అయిపోయినట్టు తెలిసి చార్జర్ లేకపోవడంతో మొబైల్ జేబులో పెట్టుకొని ఆఫీస్ రూమ్ లోకి వచ్చాను. నా సీట్లో కూర్చుంటుండగా ఆఫీస్ డోర్ తెరుచుకుని రజనీ లోపలికి వస్తూ, గుడ్ మార్నింగ్ సార్ అని విష్ చేసింది. .... గుడ్మార్నింగ్ రజిని,, నీతో కొంచెం మాట్లాడే పని ఉంది మన ఇద్దరికీ కాఫీ ఆర్డర్ చేసి రా అని చెప్పాను. రజనీ బయటికి వెళ్లి తిరిగి వచ్చి నా ఎదురుగా కూర్చుని, చెప్పండి సార్ అని అంది. ..... రజిని నేను ఆన్లైన్లో కొన్ని బట్టలు ఆర్డర్ పెట్టాను అవి ఏ టైంలోనైనా రావచ్చు నువ్వు వాటిని రిసీవ్ చేసుకుని లోపల నా బెడ్ రూములో పెట్టించు అని చెప్పాను.
ఆ మాట విని రజిని చిన్నగా నవ్వుతూ, ఆ విషయం మీరు చెప్పాల్సిన పని లేదు సార్, మీ పనులు అన్నీ చూసుకోవడం నా డ్యూటీ. సార్ మీరు ఏమి అనుకోకపోతే ఒక మాట అడగొచ్చా? .... మ్,,, అడుగు. .... ఆరోజు రాత్రి ఎందుకో మీరు చాలా సీరియస్ గా ఉన్నారు. కానీ తర్వాతి రెండు రోజులు ఎప్పటిలాగా బాగానే ఉన్నారు. ఎనీథింగ్ సీరియస్? అని అడిగింది. .... నేను చిన్న నవ్వు నవ్వి, నథింగ్ రజిని,, ఏదో కొంచెం అప్సెట్ లో ఉన్నాను అంతే. .... కానీ మీరు ఆ రోజు రాత్రి డ్రింక్ చేసి సాయంత్రం నాలుగు గంటల వరకు నిద్ర లేవకపోవడంతో కొంచెం టెన్షన్ గా అనిపించింది. నిజానికి మిమ్మల్ని లేపడానికి నేను మూడు సార్లు వచ్చాను కానీ లేపే ధైర్యం చేయలేకపోయాను. చివరికి తప్పదని,,, అంటూ ఆగిపోయింది రజిని. .... థాంక్ గాడ్,,, మొత్తానికి నన్ను నిద్ర లేపావు లేదంటే ఆకలితో చచ్చేవాణ్ణి అని సరదాగా జోక్ చేసి ఆ విషయాన్ని అంతటితో ముగించాను.
ఇంతలో సర్వెంట్ వచ్చి ఇద్దరికీ కాఫీ ఇచ్చి వెళ్లగా మేము ఇద్దరం కాఫీ తాగుతూ, రజిని నువ్వు ఇంకా బస్సు ఆటోలలో తిరగడం ఇబ్బందిగా అనిపించడం లేదా? ఇప్పుడు నువ్వు కేవలం నా సెక్రెటరీ మాత్రమే కాదు ఈ కంపెనీ మేనేజరువి కూడా, నీ టైం చాలా విలువైనది ఆమ్ ఐ రైట్? అని అడిగాను. .... అవును సార్,, కానీ ఇంకా జాయిన్ అయ్యి జస్ట్ రెండు నెలలు మాత్రమే అయ్యింది అందుకే,,,, అంటూ మధ్యలోనే ఆపేసింది రజిని. .... రజిని పరిస్థితి నాకు అర్థం అయింది. డోంట్ వర్రీ రజిని,, ఐ నో,,, నువ్వు ఒక పని చెయ్, ఈరోజు కొంచెం టైం తీసుకుని షో రూమ్ కి వెళ్లి కంపెనీ అకౌంట్లో 2 యాక్టివాలు బుక్ చెయ్. అందులో ఒకటి బ్లాక్ కలర్ మరొకటి నీకు నచ్చిన కలర్ సెలెక్ట్ చేసుకో. బ్లాక్ కలర్ పద్మిని గారి పేరు మీద రెండవది నీ పేరు మీద తీసుకో. ఇక మీద నా సెక్రెటరీ బస్సుల్లోనూ ఆటోల్లోనూ తిరగాల్సిన పనిలేదు అని అన్నాను.
రజిని సంతోషంగా నా వైపు చూసి, థాంక్యూ,, కానీ అప్పుడే మా కోసం వెహికల్స్ తీసుకోవడం,,,, అంటూ మొహమాటంగా చూసింది. .... కంపెనీ ఇస్తుంటే తీసుకోవడానికి నీకేం ప్రాబ్లం, అలాగే పద్మిని గారికి కూడా చిన్న సర్ప్రైజ్ ఇచ్చినట్టు ఉంటుంది. అంతా రెడీ అయిన తర్వాత ఆమెను కూడా షోరూమ్ కి తీసుకుని వెళ్లి డెలివరీ తీసుకోండి. ఆ రజిని,,, నీ దగ్గర మొబైల్ చార్జర్ ఉందా? నా మొబైల్ స్విచ్ ఆఫ్ అయిపొయింది రెండు రోజులుగా నేను చూసుకోలేదు అని అనగానే రజిని లేచి వెళ్ళి తన బ్యాగులో నుంచి చార్జర్ తీసుకొని వచ్చి ఇవ్వగా నా మొబైల్ చార్జింగ్ లో పెట్టాను. ఆ తర్వాత అకౌంటెంట్ గంగాధర్ గారు కూడా రావడంతో కంపెనీ చారిటబుల్ ట్రస్ట్ విషయాలు, కన్స్ట్రక్షన్ కంపెనీ మళ్ళీ స్టార్ట్ చేయడానికి ఏం చేస్తే బాగుంటుంది అని కొంచెం సేపు డిస్కస్ చేసుకున్నాము. అందుకు కావలసిన ప్రణాళికను వర్కౌట్ చేయమని వాళ్ళిద్దరికీ చెప్పాను.
కొంతసేపటి తర్వాత నా మొబైల్ రింగ్ అవడంతో తీసి చూడగా అమ్మ దగ్గర నుంచి కాల్ వస్తుంది. ఇంకా గత రెండు రోజులుగా చాలా మిస్డ్ కాల్స్ ఉన్నట్లు మెసేజ్ కూడా వచ్చి కనబడుతుంది. ఈ టైంలో అమ్మ కాల్ చేయడం ఏంటి? అనుకుంటూ కాల్ లిఫ్ట్ చేసి, హలో అమ్మ,, అని అన్నాను. .... నాన్న దీపు,,, ఎక్కడున్నావు నువ్వు? నిన్నటి నుంచి ఫోన్ చేస్తున్నాను అని అడిగింది. ..... అమ్మ నేను ఆఫీసులో ఉన్నాను ఏంటి విషయం? అని అడిగాను. .... నువ్వు ఒకసారి అర్జంటుగా ఇంటికి రా,, అని కాల్ కట్ చేసింది అమ్మ. .... సాధారణంగా అమ్మ ఎప్పుడు ఇలా కాల్ కట్ చేయదు. ఏదో విషయం ఉంది అని అనుకొని, సరే నేను ఇంటికి వెళ్ళాలి మీరు మీ పనులు చేసుకోండి అని చెప్పి సీట్లో నుంచి లేవడంతో గంగాధర్ గారు తన ఛాంబర్ కి వెళ్ళిపోయారు. ఈ రెండు రోజులు ఇంటికి వెళ్ళకపోవడం వల్లే నాకు ఈ కాల్ వచ్చింది అని తెలిసిన రజనీ మాత్రం చిలిపిగా నవ్వి ఊరుకుంది.
ఇప్పుడు ఇంటికి వెళ్లడానికి నా దగ్గర బండి లేదు. ఆఫీసులో నుంచి బయటికి వచ్చి ఒక ఆటో ఆపి అడ్రస్ చెప్పి అందులో కూర్చున్నాను. ఇంతలో జెస్సీ దగ్గర్నుంచి కాల్ రాగా లిఫ్ట్ చేసి, హాయ్ జెస్సి,,, అని అన్నాను. .... ఏమైపోయావు దీపు? రెండు రోజుల నుంచి కాల్ చేస్తున్నాను ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. నువ్వు ఎక్కడున్నావు ఏం చేస్తున్నావ్, కనీసం నువ్వైనా కాల్ చేసి ఉండొచ్చు కదా? అని అన్నాడు. .... సారీ సారీ,,, జెస్సీ,,, డోంట్ వర్రీ నేను ఆఫీసులో ఉన్నాను ఇప్పుడే ఇంటికి బయలుదేరాను. వీలు చూసుకుని ఈవెనింగ్ వచ్చి కలుస్తాను అని చెప్పి కాల్ కట్ చేశాను. ఇంటి దగ్గర ఆటో దిగి డబ్బులు పే చేసి లోపలికి వెళ్ళేసరికి హాల్లో సోఫాలో అమ్మతో పాటు అను జ్యోతి కూర్చుని కనబడ్డారు. ఇదేంటి ఇక్కడ,,, కొంపతీసి అమ్మ దగ్గర పంచాయతీ పెట్టడానికి వచ్చిందా ఏంటి? అని మనస్సులోనే అనుకుంటూ దగ్గరికి వెళ్లి సోఫా వెనుక నుంచి అమ్మ మెడ చుట్టూ చెయ్యి వేసి హగ్ చేసుకుని బుగ్గ మీద ముద్దు పెట్టాను.
నా స్పర్శ తెలియడంతోనే అమ్మ మొహంలో చిరునవ్వు మెరిసి, వచ్చావా,, దా ఇక్కడ కూర్చో అంటూ తన పక్కన కూర్చోబెట్టుకుని నా బుగ్గ మీద ముద్దు పెట్టింది. మరో సోఫాలో కూర్చుని ఉన్న జ్యోతి, హాయ్ అన్నయ్య,,, అని పలకరించగా తిరిగి హాయ్ చెప్పాను. ఇంతలో అమ్మకి మరో పక్క కూర్చున్న అను అమ్మ చెయ్యి పట్టుకుని ఏదో సిగ్నల్ ఇస్తుంది. వెంటనే అమ్మ మాట్లాడుతూ, ఏంటి నాన్న రెండు రోజుల నుంచి కాలేజీకి వెళ్ళలేదట? అని అడిగింది అమ్మ. .... కొంపదీసి ఇది మొన్న పార్కులో జరిగిన మ్యాటర్ గురించి అమ్మతో చెప్పేసిందా ఏంటి? అని అనుమాన పడుతూనే, ఏం లేదమ్మా కొంచెం ఆఫీస్ పని మీద బిజీగా ఉన్నాను అంతే అని అన్నాను. నా మాట విన్న జ్యోతి తనలో తాను నవ్వుకుంటుంది. మరోపక్క అను మాత్రం ఎటువంటి ఎక్స్ప్రెషన్ లేకుండా అప్పుడప్పుడు నా వైపు ఓరకంట చూస్తుంది. నేను మాత్రం అను వైపు చూసే ధైర్యం చేయలేకపోతున్నాను.
నా బట్టలు బాగా వాసన వస్తుండడంతో, మరీ బట్టలు కూడా మార్చుకోకుండా ఇలా పనిమీద తిరిగితే ఎలా చెప్పు? వెళ్ళు తొందరగా ఫ్రెష్ అయ్యి రా అని అమ్మ చెప్పడంతో పైకి లేచాను. ఆ రోజు సాయంత్రం వేసుకున్న డ్రస్సులోనే నేను ఇంకా ఉండటంతో నేను ఈ రెండు రోజులు కనబడక పోవడానికి కారణం అనుకి అర్థం అయింది. నా రూమ్ లోకి వెళ్లి ఫ్రెష్ అయ్యి బట్టలు మార్చుకుని బయటికి వచ్చేసరికి సర్ప్రైజ్,,, అంటూ పెద్ద గోల ఎదురుగా ప్రీతి, పవిత్ర గెంతుకుంటూ వచ్చి నన్ను కౌగిలించుకుని ఒకరి తర్వాత ఒకరు మూతి ముద్దు ఇచ్చి నన్ను తీసుకెళ్లి సోఫాలో కూర్చోబెట్టారు. ఈరోజు ఎవరు ఎక్కడికి వెళ్లకుండా అందరూ ఇంట్లోనే ఉన్నారేంటి? ఈరోజు ఆదివారం కూడా కాదు? అని ఆలోచిస్తూ అయోమయంగా చూశాను.
నన్ను ఆ స్థితిలో చూసిన అమ్మ నవ్వుతూ, ఈరోజు రాఖీ పండుగ నాన్న అందుకే ఈ కోతులు ఇంట్లోనే ఉన్నాయి అని అంది. .... నాకు ఈ విషయం అసలు తెలియనే తెలీదు. ఆ తర్వాత ప్రీతి, పవిత్ర, జ్యోతి నా చేతికి రాఖీ కట్టి నాకు స్వీట్ తినిపించారు. నేను కూడా వాళ్లకు స్వీట్ తినిపించి సంతోషంగా హగ్ చేసుకున్నాను. ప్రీతికి ఎప్పటినుంచో తీరని కల ఈరోజు నెరవేరింది. ప్రీతి మొహంలో ఆ ఆనందం కొట్టొచ్చినట్టు కనబడుతుంది. పవిత్ర చిన్నప్పుడు ఒకసారి నాకు రవికి కలిపి రాఖీ కట్టింది. జ్యోతి నాకు పరిచయం అయిన తర్వాత రాఖీ కట్టడం ఇదే మొదటిసారి. నిజానికి దేవి అక్కకి కూడా నాకు రాఖీ కట్టాలని చాలా కోరిక కానీ ఇప్పుడు తనతో రాఖీ కట్టించుకోవడం కరెక్ట్ అవునో కాదో నాకు కూడా తెలియలేదు అందుకే దేవి అక్క గురించి ఆలోచన పక్కన పెట్టేశాను. అలాగే హరిత అక్క గుర్తుకు వచ్చినా తను వచ్చేట్టయితే తనే ఫోన్ చేస్తుందిలే అనుకున్నాను.
నేను ప్రీతిని దగ్గరకు తీసుకుని, చెప్పరా బంగారం ఏం కావాలి నీకు? అని అడిగాను. .... ఉహుం,,, నాకు ఏమీ వద్దు,,, నువ్వు ఉన్నావు అది చాలు అంటు నా యద మీద తల వాల్చి ప్రేమగా హగ్ చేసుకుంది. .... ఆ మాటకి నా కళ్ళు చెమర్చాయి. ప్రీతి ఎప్పుడు ఇంతే తనది నిష్కల్మషమైన ప్రేమ. నాతో ఉంటే చాలు చాలా సంతోషంగా తృప్తి పడిపోతుంది. ఇంతవరకు తాను ఎప్పుడూ నాకు ఇది కావాలి అని డిమాండ్ చేయడం తెలియదు. నేను ప్రీతి నుదుటి మీద ముద్దు పెట్టి, నా బంగారంరా నువ్వు,, అని ముద్దు చేసి పవిత్ర వైపు చూసి, నీకేం కావాలే బుజ్జమ్మ? అని అడగగా అది కూడా ప్రీతి చెప్పినట్టే చెప్పి నన్ను మరో వైపు నుంచి హగ్ చేసుకుంది. దానికి కూడా నుదుటి మీద ముద్దు పెట్టి, సరే మీరు ఏమి చెప్పొద్దు కానీ నేను ఏమిస్తే అది తీసుకోవాలి పదండి బయటికి వెళ్దాం అని అన్నాను.
ఇప్పుడు ఎక్కడికి నాన్న భోజనం చేసి రెస్ట్ తీసుకొని సాయంత్రం వెళ్దురుగాని అని అంది అమ్మ. .... భోజనానికి చాలా టైం ఉందమ్మా వెళ్లి వస్తాములే పదండి పదండి,, అని అందరినీ బయలుదేరమని చెప్పాను. కానీ అను తో మాత్రం ఏమీ చెప్పలేదు. నా అదృష్టం కొద్దీ ప్రీతి అను దగ్గరికి వెళ్లి తనను కూడా రమ్మని చెయ్యి పట్టుకుని లేపింది. అను నా వైపు చూసింది కానీ నేను మొహం చాటేయడంతో, మీరు వెళ్ళి రండి నేను ఇక్కడే ఆంటీ దగ్గర ఉంటాను అని అంది. .... నువ్వు కూడా సరదాగా వెళ్ళు అను అని అమ్మ చెప్పడంతో కాదనలేక బయలుదేరింది. ప్రీతి బయటకు వెళుతూ, మమ్మీ భోజనం బయట చేసేస్తాం నువ్వు మా కోసం వెయిట్ చేయొద్దు అని చెప్పేసింది. ఇందాక నేను వచ్చేటప్పుడు బయట అను కారు ఉండడం గమనించలేదు. ఇప్పుడు మాత్రం అందరం నా కారులో కూర్చుని బయలుదేరాము.
ఇంతవరకు అమ్మ ప్రస్తావించలేదు కాబట్టి ఆరోజు పార్కులో జరిగిన సంఘటన గురించి అను అమ్మ దగ్గర చెప్పి ఉండదు అని ఒక నిర్ధారణకు వచ్చాను. దాంతో కొంచెం మనసు తేలికగా అనిపించి అను తో తప్ప అందరితో సరదాగా మాట్లాడుతూ జువెలరీ షాప్ కి తీసుకువెళ్ళాను. లోపలికి వెళ్తూనే స్టాఫ్ అందరు నన్ను చూసి అటెన్షన్ లోకి వచ్చి గుడ్ మార్నింగ్ సార్,, అని విష్ చేయడం చూసి నలుగురు నా వైపు చూశారు. నేను ఒక చిన్న స్మైల్ ఇచ్చి, ఇది మన షాప్,, అని చెప్పి, మీకు నచ్చిన ఐటమ్ సెలెక్ట్ చేసుకోండి అని చెప్పాను. .... జ్యోతి మాట్లాడుతూ, ఇప్పుడు ఎందుకు అన్నయ్య ఇవన్నీ?? అని అంది. .... ఇప్పుడు కాకపోతే ఎప్పుడు ఇవ్వాలి? నాకు రాఖీ కట్టిన చెల్లెళ్ళకి ఏమిచ్చినా తక్కువే అవుతుంది. ఇంకేమి మాట్లాడకుండా మీకు నచ్చిన వస్తువులు తీసుకోండి అని చెప్పి ఇంతలో లోపల్నుంచి వచ్చిన పార్ధు నన్ను విష్ చేయగా నేను కూడా విష్ చేసి వాళ్లకి కావలసినవి చూడు అని చెప్పాను.
ఆ తర్వాత నలుగురు కలిసి కౌంటర్లో ఉన్న నగలు చూసే పనిలో పడ్డారు. జ్యోతి కొంచెం తొందరగానే తనకు నచ్చిన ఒక చైన్ సెలెక్ట్ చేసుకోగా నేను కూడా తన కోసం మరొక నెక్లేస్ సెలెక్ట్ చేసి ఆ రెండింటినీ తీసుకోమని చెప్పాను. ఇక మా కోతులు రెండు తమకు కావలసినవి సెలెక్ట్ చేసుకోవడం కోసం షాప్ మొత్తం చుట్టేస్తున్నారు. సరే మీకు కావలసింది సెలెక్ట్ చేసుకుని రండి మేము ఆఫీస్ లో కూర్చుంటాము అని చెప్పి నేను ఆఫీస్ రూమ్ లోకి వెళ్లాను. ఈ నలుగురు మాత్రం సెలెక్ట్ చేసే పనిలో బయటే ఉండిపోయారు. పార్ధు దగ్గరుండి అన్ని ఓపికగా చూపించి కొంతసేపటికి నలుగురితో కలిసి ఆఫీస్ రూమ్ లోకి వచ్చాడు. ప్రీతి పవిత్ర నాకు చెరోవైపు చేరి తాము సెలెక్ట్ చేసుకున్న చైన్స్ నా ముందు పెట్టారు. అవి ఈమధ్య లేటెస్ట్ డిజైన్ చైన్స్ అని పార్ధు చెప్పాడు. అయితే వాటికి 'D' అనే అక్షరంతో చిన్న వజ్రాలు పొదిగిన లాకెట్స్ ఉన్నాయి. కానీ వాళ్లిద్దరికీ 'DP' అనే అక్షరాలు కలిగిన లాకెట్స్ కావాలని అడుగుతున్నారు.
అలా ఎందుకు? అని నేను అడగగా, దీపు ప్రీతి (DP), దీపు పవిత్ర (DP) అందుకే ఇద్దరికీ ఒకే రకమైన లాకెట్స్ కావాలని చెప్పారు. .... వాళ్ళిద్దరి ఐడియా బాగుంది. నేను పార్ధు వైపు చూడగా, సార్ ఈవినింగ్ కల్లా రెడీ చేయిస్తాను సార్,,, అడ్రస్ చెప్తే అక్కడికి పంపిస్తాను సార్ అని అన్నాడు. .... అంతలో ప్రీతి మాట్లాడుతూ, మనం సాయంత్రం ఇక్కడికే వచ్చి తీసుకుందాం అన్నయ్య అని అంది. .... ఎందుకురా బంగారం ఇంటికి వచ్చేస్తాయిలే అని అన్నాను. .... వద్దురా అన్నయ్య,, ప్రీతి చెప్పినట్టు ఇక్కడికి వచ్చి తీసుకుందాం. ఇప్పుడు మనం బయటికి వెళ్లి సినిమా చూసి సాయంత్రం ఇక్కడకు వచ్చి అప్పుడు ఇంటికి వెళ్దాం అని అంది పవిత్ర. ఈరోజు వాళ్ళని డిసప్పాయింట్ చేయడం ఇష్టం లేక సరే అన్నాను. కానీ అను పరిస్థితి ఏంటి? అని అను వైపు చూడలేక జ్యోతి వైపు చూశాను. బహుశా నా పరిస్థితి తనకు తెలుసనుకుంటా చిరునవ్వు నవ్వుతూ ఓకే అన్నట్టు తల ఊపింది.
ఆ తర్వాత అందరం కలిసి అక్కడినుంచి బయలుదేరి బయట రెస్టారెంట్లో టిఫిన్ చేసి ఆ తర్వాత ఒక మూవీ చూసి తిరిగి సాయంత్రం జువెలరీ షాప్ కి వెళ్లి ఐటమ్స్ కలెక్ట్ చేసుకుని బయట ఒక పార్కులో కొంచెం సేపు సరదాగా గడిపి అనుకి ఇష్టమైన స్ట్రీట్ ఫుడ్ ఎంజాయ్ చేసి తిరిగి ఇంటికి చేరుకున్నాము. పొద్దున కలిసిన దగ్గరనుంచి ఇప్పటివరకు అను నన్ను గమనిస్తూనే ఉంది నేను మాత్రం ఎక్కువగా అనుని చూసే ధైర్యం చేయలేకపోయాను. తన కళ్ళలో కళ్ళు పెట్టి చూడాలి అంటే ఏదో గిల్టీగా ఉంది. ఇంట్లోకి వెళ్ళగానే అమ్మ సోఫాలో కూర్చుని ఉండడంతో నేను వెళ్లి అమ్మ ఒడిలో వాలిపోయాను. మిగిలిన నలుగురు వేరే సోఫాలో సెటిల్ అయిపోయి పొద్దున్నుంచి ఇప్పుడు దాకా జరిగిన విషయాల గురించి అమ్మతో చెబుతున్నారు. నాకు ఎందుకో కొంచెం అలసటగా అనిపించడంతో అలాగే అమ్మ ఒడిలో కళ్ళు మూతలు పడిపోయాయి.