Episode 118.1
మేము కాలేజీకి చేరుకునేసరికి ఇంతకుముందు లాగా కాకుండా కొంచెం కోలాహలంగా కనబడింది. చాలా రోజుల తర్వాత ఈ రోజు మళ్ళీ కొత్తగా ర్యాగింగ్ వాతావరణం కనబడింది. కాలేజీ స్టార్ట్ అయిన మొదట్లో కంటే ఇప్పుడు ఇంకా ఎక్కువగా జరుగుతున్నట్టు కనబడుతుంది. స్టూడెంట్స్ అందరూ లైన్ కట్టి నిల్చోగా ఒక కుర్రాడు మరి కొంతమంది స్టూడెంట్స్ ని వెనకేసుకుని ర్యాగింగ్ చేస్తున్నాడు. బహుశా వాడు ఆ గ్యాంగ్ కి లీడర్ అయి ఉంటాడు. వాడికి కొంచెం దగ్గరగానే కార్తీక అక్క ఆమె ఫ్రెండ్ కూడా ఉన్నారు. నేను, అను, జ్యోతి అక్కడున్న వాళ్లందరినీ పట్టించుకోకుండా క్లాస్ రూమ్ వైపు వెళ్లిపోతున్నాము. అప్పుడే కార్తీక వెళ్ళిపోతున్న ముగ్గురిని చూసి పక్కనే ఉన్న తన ఫ్రెండ్ భుజాన్ని తన భుజంతో కొట్టి సిగ్నల్ ఇస్తూ మా వైపు చూపించింది. ఆ తర్వాత కార్తీక ఫ్రెండ్ ఆ ర్యాగింగ్ చేస్తున్న కుర్రాడి చెవిలో ఏదో చెప్పింది.
అప్పుడు ఆ కుర్రాడు మా వైపు చూసి మమ్మల్ని పిలిచాడు కానీ మేము అది పట్టించుకోకుండా ముందుకు వెళ్లిపోతున్నాము. అప్పుడు ఆ కుర్రాడితో సహా అక్కడ ఉన్న గ్యాంగ్ మొత్తం పరిగెత్తుకుంటూ వచ్చి మా ముందు అడ్డంగా నిల్చున్నారు. ఏం పిలుస్తుంటే మీకు వినపడటం లేదా మీ చెవులు ఏమైనా దొబ్బాయా? అని అడిగాడు ఆ కుర్రాడు. .... మాకు వినపడింది కానీ మా క్లాస్ కి టైం అవుతుంది అని సమాధానం ఇచ్చింది అను. .... సీనియర్లకి రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడాలని తెలీదా? అని అన్నాడు ఆ కుర్రాడు. .....మేము కేవలం మంచిగా వ్యవహరించే సీనియర్లకు మాత్రమే రెస్పెక్ట్ ఇస్తాము. మీలాంటి పోరంబోకులకి కాదు అని విసురుగా సమాధానం ఇచ్చింది జ్యోతి. .... నీయమ్మ ఏంటే నీ ధైర్యం,,, అంటూ ఆ కుర్రాడు జ్యోతిని కొట్టడానికి చెయ్యి పైకి ఎత్తాడు. వెంటనే ఒక చెయ్యి వచ్చి ఆ కుర్రాడి చేతిని పట్టుకుంది. అది మరెవరిదో కాదు జ్యోతి అన్నయ్య మోహిత్ చెయ్యి.
తనని వదిలేయ్ అనిల్ అని అన్నాడు మోహిత్. .... ఆఫ్ట్రాల్ నువ్వు నా చెంచా గాడివి నువ్వు నాకు చెప్పేదేట్రా? అని అనిల్ మోహిత్ ని వెనక్కి తోశాడు. ఇంతలో ఫాట్,,,మని సౌండ్ వినపడింది. ఎందుకంటే జ్యోతి ఆ అనిల్ గాడి చెంప చెళ్ళుమనిపించింది. .... ఇంకొక్కసారి మా అన్నయ్యని చెంచా అన్నావంటే మర్యాదగా ఉండదు. మరొకసారి ఆ మాట అనేముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలని వార్నింగ్ ఇచ్చింది జ్యోతి. దాంతో ఆ అనిల్ గాడికి మరింత కోపం పెరిగి మళ్లీ జ్యోతిని కొట్టడానికి చెయ్యి పైకి లేపాడు. కానీ ఈ సారి ఆ చెయ్యిని నేను పట్టుకున్నాను. చాలు,, ఇప్పటికే చాలా ఎక్కువ అయింది. నీ సీనియారిటీని మడిచి బ్యాక్ లో పెట్టుకొని అన్నీ మూసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపో అని వాడి చెయ్యిని విదిల్చి కొట్టాను.
కాలేజీలో అంతమంది ముందు వాడికి జరిగింది అవమానంగా భావించి మరింత కోపం ప్రదర్శిస్తూ పిడికిలి బిగించి నామీద అటాక్ చేశాడు. అంతలోనే నా వెనుక నుంచి ఒక చెయ్యి వచ్చి వాడి చేతిని పట్టుకుంది. వెంటనే వాడు మరో చేయి పిడికిలి బిగించి నా మీద విసిరాడు. నా వెనక నుంచి మరో చేయి వచ్చి వాడి రెండో చేతిని కూడా పట్టుకుంది. ఆ తర్వాత నా వెనక నుండి వాడి చేతులు పట్టుకున్న ఇద్దరు వ్యక్తులు నా ముందుకు వచ్చారు వారు మరెవరో కాదు సోము, జెస్సి. వాళ్ళిద్దరు ముందుకు వచ్చి అనిల్ గాడిని ఒక్క తాపు తన్నడంతో వాడు కొంచెం వెనక్కి వెళ్ళి పడ్డాడు. అక్కడున్న సీనియర్లు కొంతమంది సోము, జెస్సీలను చూడగానే భయపడ్డారు కానీ అక్కడ ఉన్న మిగిలిన సీనియర్ల మొహాల్లో చిరునవ్వు మెరిసింది. .... సోము, జెస్సీలను చూసి, మీరిద్దరూ,,,,, అని అన్నాడు అనిల్. .... అవును మేమే,,, అని ఇద్దరూ ఒకేసారి అన్నారు.
కానీ మీరు ఎలా?? .... ఏంటి,, వీళ్లు చనిపోయి ఉంటారు కదా మళ్లీ ఇక్కడ ఉన్నారేంటి అని ఆలోచిస్తున్నావా? మేము బ్రతికే ఉన్నాము. నువ్వు మమ్మల్ని చంపడానికి చాలా ప్రయత్నించావు కానీ నీ బ్యాడ్ లక్ మేము ఇంకా బతికే ఉన్నాము. కానీ నువ్వు నీ వేషాలు ఏమాత్రం మారలేదురా. ఇప్పుడు మేము మళ్లీ ఈ కాలేజీలోకి వచ్చాము నువ్వు నీ వెధవ వేషాలు అన్ని కట్టిపెట్టి ఇక్కడి నుంచి దొబ్బెయ్ అర్థమైందా? అని అన్నాడు జెస్సీ. .... లేదంటే నువ్వే కాదు నీ బాబు వచ్చినా మా నుంచి నిన్ను ఎవడు రక్షించలేడు అని అన్నాడు సోము. .... ఓహో,,, అంటే ఆ రోజు మీరు బతికిపోయారన్నమాట. సరే ఏం పర్లేదు ఇప్పుడు మీ అందరినీ కలిపి ఒకేసారి చూసుకుంటాను అని అనిల్ అనడంతో వాడి బ్యాచ్ మొత్తం అక్కడున్న స్టూడెంట్స్ ని ఎవర్ని అక్కడ ఉండకుండా బెదిరించి పంపేశారు.
ఆ తర్వాత అనిల్ గాడు మాట్లాడుతూ, వేసేయండ్రా కొడుకుల్ని,,, అని తన బ్యాచ్ కి ఆర్డర్ వేసాడు. వాళ్లంతా దాదాపు 10 మంది ఉన్నారు. వాళ్లు మా మీదకు ఉరికి రాగా సోము, జెస్సీ, మోహిత్ చెరొక ఇద్దర్ని హ్యాండిల్ చేశారు. అలాగే మోహిత్ ఫ్రెండ్స్ ఇద్దరు చిరొకరిని అడ్డుకున్నారు. ఇక మిగిలింది అనిల్ వాడితో పాటు మరొకడు. వాళ్ళిద్దరూ కలిసి నా వైపు రాగా అప్పుడే నా వెనుక నుంచి తార ముందుకు వచ్చి అనిల్ గాడి పక్కన ఉన్న వాడికి ఫ్లయింగ్ కేక్ ఇచ్చింది. ఆ తర్వాత వాడి మీదకు దూకి వాడితో ఫైటింగ్ మొదలు పెట్టింది. ఇక్కడ అనిల్ గాడు పిడికిలి బిగించి నా మీదకు పంచ్ విసిరాడు కానీ నేను కొంచెం పక్కకి జరిగి తప్పించుకున్నాను. కానీ వాడు వెంటనే మరో పంచ్ విసిరగా అది నా మొహం మీద తగిలి నా మొహం కార్తీక అక్క ఉన్న వైపు తిరిగింది. అప్పుడు నేను అక్క మొహం వైపు చూడగా తన మొహంలో చిన్న చిరునవ్వు మెరిసింది.
ఆ నవ్వు చూడగానే నా మనసు చివుక్కుమంది. నా గుండెను ఎవరో కోసేస్తున్నట్టు అనిపించింది. నన్ను ఎవరో కొడుతుంటే చూసి ఆనందించేంత ద్వేషం నింపుకున్నావా నీ మనసులో? సరే అయితే ఎంతసేపు ఆనందిస్తావో ఆనందించు అని మనసులో అనుకున్నాను. అనుకోవడమే కాదు అదే ఆచరణలో పెట్టి అనిల్ గాడు నన్ను కొడుతుంటే కావాలనే నేను వాడితో దెబ్బలు తినడం మొదలు పెట్టాను. అది చూస్తున్న కార్తీక మొహంలో నవ్వు మరింత పెరిగింది. ఇదంతా చూస్తున్న అను మా వైపు పరిగెత్తుకొని వచ్చి నేను దెబ్బలు తినకుండా నన్ను గట్టిగా వాటేసుకొని పట్టుకుంది. నీకేమైనా మతి పోయిందా? నువ్వు తిరిగి వాడిని ఎందుకు కొట్టడం లేదు? అని అడిగింది. .... ఒక కారణం ఉందిలే,,,, నాకేం కాలేదు నువ్వేమీ కంగారు పడకు అని అన్నాను. అంతలో ఎవరో వచ్చి అను జుట్టు పట్టుకొని వెనక్కి లాగారు.
అది అనిల్ గాడి గర్ల్ ఫ్రెండ్ వీణ. అది అను పెడరెక్క విరిచి పట్టుకొని దూరంగా లాక్కెళ్ళింది. దాంతో అను నొప్పితో గట్టిగా అరిచింది. నేను వెంటనే మాట్లాడుతూ, తార అనుకి హెల్ప్ చెయ్. ఇక వీడి సంగతి నేను చూసుకుంటాను అని అన్నాను. అప్పటికే తార కొడుతున్నవాడు నీరసం అయిపోవడంతో వాడిని వదిలేసి అను ఉన్న దగ్గరికి వెళ్లి ఆ వాణి మొహం మీద ఒక గట్టి పంచ్ ఇచ్చింది. వెంటనే వాణి అనుని వదిలేసి తన మొహం పట్టుకుంది. ఆ తర్వాత తార ఆమె పొట్ట మీద ఒక కిక్ ఇచ్చేసరికి విలవిలలాడుతూ కింద పడింది. ఇక్కడ అనిల్ గాడు నన్ను కొట్టడానికి రాగా నేను వాడి చెయ్యి పట్టుకొని మెలి తిప్పి మరో చేత్తో వాడి పీక పట్టుకుని వాడిని గాలిలో పైకి లేపాను. వాడు నా పట్టు నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ తన కాళ్లు ఆడిస్తూ నా పొట్ట మీద కాళ్ల మీద తంతున్నాడు. దాంతో నేను వాడి పీకను మరింత గట్టిగా నొక్కి పట్టుకునేసరికి వాడు గింజుకోవడం మొదలు పెట్టాడు.
అంతలో నా ఫ్రెండ్స్ అందరూ వాళ్ల చేతిలో పడిన వారి పని ముగించి మా దగ్గరకి వచ్చారు. ఇక్కడ నా పట్టునుండి తప్పించుకోలేక అనిల్ గాడు కళ్ళు తేలేస్తున్నాడు. దీపు వాడిని వదిలేయ్ లేదంటే చస్తాడు అని అన్నాడు సోము. .... అవును దీపు వాడిని వదిలేయ్ అని జెస్సీ కూడా అన్నాడు. .... లేదు వీడి వలన ఈ రోజు నా అను నొప్పితో ఇబ్బంది పడింది అని చాలా కోపంగా అన్నాను. .... ఇక లాభం లేదు అని అనుకుందో ఏమో, అను,, దీపుని ఆపు అని అరిచింది తార. .... దీపు వాడిని వదిలేయ్ లేదంటే చస్తాడు అని వెంటనే అంది అను. .... వదిలిపెట్టే ప్రసక్తే లేదు ఈరోజు వీడు చావాల్సిందే అని అదే కోపంతో అన్నాను. .... నువ్వు వాడిని వదలకపోతే నా మీద ఒట్టే అని కంగారుగా అంది అను. అను నోటినుంచి ఒట్టు అని మాట రాగానే అనిల్ గాడిని పక్కకి విసిరి పడేసాను.
ఆ వెంటనే నాకు ఏమైందో తెలియదు గానీ అను ఉన్న వైపు తిరిగి, ఐ లవ్ యు,,,, అను అని అన్నాను. చెప్పిన సమయం కరెక్టో కాదో తెలియదు కానీ అనుకి మాత్రం తన కోరిక నెరవేరింది. ఇంతకాలం ఈ విషయం నీతో చెప్పక పోవడానికి నాకుండే కారణాలు నాకున్నాయి. కానీ ఈరోజు చెప్తున్నాను ఐ లవ్ యు,,, నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను. నా జీవితాంతం నాకు తోడుగా ఉంటావా? అని అడిగాను. నా మాట విని మరో ఆలోచన లేకుండా అను పరిగెత్తుకుంటూ వచ్చి నన్ను గట్టిగా కౌగిలించుకుంది. .... ఈ జీవితం నీతోనే, ఐ లవ్ యు,,, దీపు. ఈ మాట చెప్పడానికి నన్ను ఎంత ఏడిపించావు,, ఐ లవ్ యు సో మచ్,,, అని అంది అను. .... నేను అక్కడ ఉన్న వారిని అందరిని ఉద్దేశించి మాట్లాడుతూ, ఒళ్ళు దగ్గర పెట్టుకుని నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఇది నా పిల్ల,, నా ప్రాణం,,, దీనివంక ఎవరైనా కన్నెత్తి చూసినా మరుక్షణం వాడి ప్రాణాలు తీసేస్తాను అర్థమైందా? అని వార్నింగ్ ఇస్తున్నట్టు చెప్పాను.
అనిల్ గాడు ఇంకా నేను విసిరిన చోటే కూర్చుని తన గొంతు పట్టుకుని దగ్గుతున్నాడు. నేను వాడి దగ్గరకు వెళ్లి వాడి మెడ పట్టుకొని పైకి లేపాను. వాడి చెంప మీద లాగిపెట్టి ఒకటి పీకి ఆ తర్వాత ఇంకా కోపం చల్లారక మరో నాలుగు పీకాను. చివరిగా వాడి మొహం మీద ఒక గట్టి పంచ్ ఇవ్వడంతో వాడు మళ్ళీ కిందపడిపోయాడు. ఆ తర్వాత నేను కార్తీక అక్క ఉన్న వైపు నడిచాను. తనకు దగ్గరగా వెళ్లేసరికి నా కళ్ళమ్మట నీళ్ళు వచ్చేసాయి. అక్క ఎదురుగా నిల్చుని తన కళ్ళలోకి చూస్తూ, అసలు నీకు ఏం కావాలి అక్క? నా మీద ఇంత ద్వేషమా? అసలు ఎందుకు ఇదంతా? నా తోడబుట్టిన అక్కవి నా మీద ఇంత ద్వేషం ఎందుకు పెంచుకున్నావు? చిన్నప్పుడు అమ్మ మనిద్దరికీ కథలు చెప్పేటప్పుడు ఒక విషయం చెప్పేది గుర్తుందా? నేను పుట్టి ఇంటికి వచ్చిన తర్వాత నువ్వు నా దగ్గర ఉంటేనే నవ్వేవాడిని అని చెప్పేది. నేను నవ్వడానికి కారణమైన మొదటి వ్యక్తి నువ్వే అని చెప్పేది. ఆ దేవుడి దయ వల్ల మీ అక్క తమ్ముడు ఇద్దరు జీవితాంతం ఇంతే ప్రేమగా ఉండాలి అనేది. కానీ ఈ రోజు నా కంట్లో నీళ్ళు రావడానికి కారణం నువ్వు.
అసలు నీకు ఏం కావాలి? అమ్మ నీకు మాత్రమే అమ్మ అని ఎలా అనుకున్నావు? అని నా గుండె మీద బాదుకుంటూ రోదిస్తూ మోకాళ్ళపై కూర్చున్నాను. అమ్మ నీకు మాత్రమే అమ్మ కాదు నాకు కూడా అమ్మే అక్క, ఈ విషయం నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా? అయినా నేను ఏం తప్పు చేశానని నువ్వు నాకు ఈ శిక్ష విధిస్తున్నావు? నన్ను ఇంట్లో నుంచి తగిలేసి మీ నుంచి దూరం చేసి నాకు ఎప్పుడో శిక్ష విధించారు. కానీ నీ దగ్గర మొత్తం కుటుంబం ఉంది కదా? అమ్మ లేని లోటు తీర్చడానికి నీ దగ్గర పిన్ని ఉంది. కానీ నాకు ఎవరు ఉన్నారు? ఎవ్వరూ లేరు,,, ఒక్కడినే బిక్కుబిక్కుమంటూ జీవితం గడిపాను. అయినా సరే మీరు నేను కనపడిన ప్రతిసారి తిట్లు శాపనార్ధాలతో చీత్కరిస్తూనే ఉన్నారు. అదృష్టమో దురదృష్టమో గాని నన్ను చూసుకోవడానికి ఒక అమ్మ దొరికింది. కానీ ఎవడో దుర్మార్గుడు ఆ తోడు కూడా లేకుండా ఆమెను నా నుంచి దూరం చేశాడు. అసలు నీకు ఏం కావాలి? అప్పుడంటే చిన్నతనం అందరూ చెప్పిన మాటలు విని నన్ను దూరం పెట్టావు అంటే అర్థం చేసుకోగలను. కానీ ఇప్పుడు ఎదిగావు,, వయసొచ్చింది,, చదువుకున్నావు,, ఇప్పటికీ కూడా నువ్వు చేస్తున్నది కరెక్టే అని నీకు అనిపిస్తుందా?
అసలు నానుంచి నీకు ఏం కావాలి? ఇంకా నా దగ్గర నా ప్రాణాలు మాత్రమే ఉన్నాయి అవి తీసుకుంటావా? అంటూ నేను పైకి లేచి జెస్సీ దగ్గరికి వెళ్లాను. జెస్సీ గన్ ఇవ్వు,,, అని అడిగాను. .... జెస్సి సంశయిస్తూ,, కానీ దీపు??? అని అన్నాడు. .... నేను మధ్యలోనే అడ్డుపడుతూ, చెప్పింది వినపడలేదా నేను గన్ ఇవ్వమని అడుగుతున్నాను అని కొంచెం సీరియస్ గా అనడంతో వెంటనే జెస్సీ తన గన్ తీసి నా చేతిలో పెట్టాడు ఎందుకంటే నా కోపం గురించి జెస్సీకి బాగా తెలుసు. నేను గన్ తీసుకొని కార్తీక అక్క దగ్గరికి వెళ్లి తన చెయ్యి పట్టుకుని నా చేతిలో ఉన్న గన్ తన చేతిలో పెట్టి పట్టుకున్నట్టు చేసి గన్ పాయింటర్ ని నా నుదిటి మీద పెట్టుకొని, ఇదిగో నా ప్రాణాలే కదా కావాలి నీ చేతులతో నువ్వే తీసేసుకో అప్పుడైనా నీ మనసు శాంతిస్తుందేమో? నామీద నీకున్న కోపం కసి అంతా చల్లారిపోతుంది. కమాన్ షూట్ మి ప్లీజ్,,, అని అన్నాను.
నా మాటలు విన్న అక్కడి నా వారందరి కంటి నుంచి నీళ్లు జాలువారాయి. కార్తీక అక్క కంటి నుంచి కూడా నీళ్లు వస్తున్నాయి. వెంటనే అక్క తన చేతిని విసురుగా వెనక్కి లాక్కుని చేతిలో ఉన్న గన్ పక్కకి విసిరేసింది. ఇప్పుడు నీ చేతిలో అవకాశం ఉంది ఎందుకు ఈ అవకాశాన్ని వదులుకుంటున్నావు? నీ దృష్టిలో నేను ఒక నష్టజాతకుడిని. నాలో నీకు కనిపించే రాక్షసుడిని నామరూపాలు లేకుండా నాశనం చేసేయ్. అప్పుడైనా ఏదైనా మంచి జరుగుతుందేమో? అని అన్నాను. అంతవరకు ఏడుస్తూ నా మాటలు విన్న కార్తీక అక్క ఇక ఏమాత్రం అక్కడ ఉండలేకపోయింది. వెంటనే అక్కడి నుంచి పార్కింగ్ వైపు పరిగెడుతూ వెళ్లి తన కారులో కూర్చుని కాలేజ్ నుంచి బయటికి వెళ్లిపోయింది. నేను మాత్రం అక్కడే నా మోకాళ్ళపై కుప్పకూలి ఏడుస్తూ ఉండిపోయాను.
వెంటనే అను, జ్యోతి, తార, జెస్సీ, సోము నన్ను నలువైపులా చుట్టేసి హగ్ చేసుకున్నారు. నేను మాత్రం బరువెక్కిన మనసుతో దుఃఖం భరించలేక ఏడుస్తూనే ఉన్నాను. ఎందుకంటే ఎన్నో సంవత్సరాలుగా నా మనసులో ఉన్న జ్వాలాముఖి ఎగసిపడి ఈరోజు మొత్తం బయటికి వచ్చేసింది. అలా నేను చాలాసేపు ఏడుస్తూ కూర్చునేసరికి, ఇలా ఎంతసేపని ఏడుస్తూ కూర్చుంటావు దీపు, ఇక చాలు ఆపు,,, అంటూ అను పూడుకుపోయిన గొంతుతో అంది. .... అవును అన్నయ్య అందరూ చూస్తున్నారు అని అంది జ్యోతి. నేను కూడా నన్ను సంభాళించుకుంటూ కొంతసేపటికి కామ్ అయ్యాను. కానీ అంతలోనే అనిల్ గాడు గన్ పట్టుకొని మా వైపు ఎయిమ్ చేయడం చూసి నా చుట్టూ ఉన్న వారందరినీ దూరంగా తోసేసాను. ముఖ్యంగా జెస్సీని తప్పించడానికి ప్రయత్నించాను. ఎందుకంటే వాడు షూట్ చేస్తే బుల్లెట్ వచ్చి తగిలేది జెస్సీకే.
అంతలోనే డిష్యూం,,, అంటూ గన్ పేలిన శబ్దం. జెస్సీని అయితే తప్పించాను కానీ ఆ బుల్లెట్ నా వైపు దూసుకు వచ్చేసరికి అందరూ కంగారుపడుతూ దీపుపుపుపు,,,, అని అరిచారు కానీ నేను త్రుటిలో తప్పించుకున్నాను. ఐ యాం ఆల్ రైట్,,, అని అనగానే మా మీదకు బుల్లెట్ షూట్ చేసినందుకు సోము, జెస్సీ కోపంతో రగిలిపోతూ లేచి వాడి దగ్గరకు పరిగెత్తారు. అనిల్ గాడు మళ్లీ ఫైర్ చేయడంతో ఈసారి జెస్సి బుల్లెట్ నుంచి చాకచక్యంగా తప్పించుకున్నాడు. ఆ తర్వాత అనిల్ సోము వైపు గురిచూసి ఫైర్ చేశాడు కానీ సోము కూడా తప్పించుకున్నాడు. ఆపాటికి సోము, జెస్సీ ఇద్దరు వాడి దగ్గరగా చేరుకొని సోము వాడి చేతి మీద ఫ్లయింగ్ కిక్ ఇవ్వడంతో వాడి చేతిలో నుంచి గన్ దూరంగా ఎగిరి పడింది.
ఆ తర్వాత జెస్సీ వాడిని లేపి పట్టుకుని పంచ్ మీద పంచ్ ఇవ్వడంతో ఎగిరి పడ్డాడు. ఆ తర్వాత సోము వాడి చేతిని పట్టుకుని మోచేయి మీద గట్టిగా ఒక పంచ్ ఇచ్చేసరికి ఫట్ మని శబ్దంతో వాడి చెయ్యి విరిగింది దాంతో వాడి ఆర్తనాదాలు మొదలయ్యాయి. జెస్సీ మళ్లీ ఒకసారి వాడిని పీక పట్టుకుని పైకి లేపి పక్కనే ఉన్న ఐరన్ పోల్ కి లాగిపెట్టి మూడు నాలుగు సార్లు కొట్టాడు. దాంతో వాడికి బుర్ర పగిలి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. సోము మరొకసారి వాడి ఫిల్ట్ పట్టుకొని పైకి లేపి, మళ్లీ మేము ఈ కాలేజీలో అడుగుపెట్టాము నీ వెధవ వేషాలు అన్నీ కట్టిపెట్టి ఇక్కడి నుంచి పారిపొమ్మని ముందే చెప్పాం కదరా? కానీ నీ యబ్బ నువ్వు చేసిన పని ఏంట్రా? అంటూ వాడి కడుపులో ఒక గట్టి పంచ్ ఇచ్చాడు. .... జెస్సి మాట్లాడుతూ, నువ్వు ఎవరితో గొడవ పెట్టుకున్నావో తెలుసా? వాడు మా బ్రదర్,,, అర్థమైందా? అని అన్నాడు.
ఆతర్వాత జెస్సి వాడిని పట్టుకుని కోపంగా లాక్కెళ్తూ మరొక్కసారి ఐరన్ పోల్ కేసి గట్టిగా కొట్టాడు. అంతటితో ఆగకుండా మళ్లీ మళ్లీ పోల్ కేసి కొట్టడంతో అనిల్ గాడు పూర్తిగా చలనం లేకుండా పడిపోయాడు. ఆ తర్వాత సోము, జెస్సీ ఇద్దరు మా దగ్గరికి వచ్చారు. అప్పటికే లేచి నిల్చున్న నా చేతి దగ్గర మొన్న తగిలిన గాయం నుంచి రక్తం కారుతూ ఉండడంతో అది చూసిన జెస్సి మాట్లాడుతూ, సోము తొందరగా వెళ్లి కార్ లో ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఉంది పట్టుకురా అని చెప్పడంతో సోము వెళ్లి పట్టుకొచ్చాడు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి నా చేతికి ఉన్న కట్టు తీసేసి మళ్లీ కొత్తది వేశారు. జెస్సి మాట్లాడుతూ, నీకేమైనా పిచ్చి పట్టిందా దీపు? ఆ బుల్లెట్ వచ్చి నీకు తగిలి ఉంటే? మాటిమాటికి బుల్లెట్లు తినడం బాగా అలవాటయింది అని కోపంగా అన్నాడు. .... నేను కాకపోతే ఆ బుల్లెట్ నువ్వు తినేవాడివి అని అన్నాను.
ఆ,, తింటే తింటాను,, ఏం నీకేనా,,, నాకు కూడా ఆకలిగానే ఉంది అని అన్నాడు. .... వెంటనే సోము జెస్సీ నెత్తిమీద కొట్టి, చాల్లేరా తిండిపోతు,,, అని సరదాగా అనడంతో మేమంతా నవ్వుకున్నాము. .... తార అక్కడే బిక్కుబిక్కుమంటూ నిలుచున్న వాణి వైపు చూసి, తొందరగా అంబులెన్స్ పిలిపించి వాడిని తీసుకెళ్ళు లేదంటే చస్తాడు అని చెప్పింది. ఆ తర్వాత మేము అంతా అక్కడినుంచి బయలుదేరాము. నేను అను తన కారులో బయలుదేరగా, మోహిత్ జ్యోతిని తీసుకొని వెళ్ళిపోయాడు. జెస్సీ నా బైక్ మీద బయలుదేరగా సోము, తార కలిసి వాళ్ళు వచ్చిన కారులో బయలుదేరారు. ఇంతవరకు జరిగిన సీన్ మొత్తం కాలేజ్ గ్రౌండ్ దగ్గర జరగడం అంతకంటే ముందే వాడి మనుషులు స్టూడెంట్స్ అందర్నీ అక్కడి నుంచి తరిమేయడం వలన అక్కడ ఏం జరిగిందో వాడి మనుషులకు తప్ప ఇంకెవరికీ సరిగ్గా తెలిసే అవకాశం లేదు. దూరంగా ఉన్న కాలేజీ బిల్డింగ్ నుంచి కొంతమంది స్టూడెంట్స్ చూసినప్పటికీ వాళ్లు ఈ విషయం గురించి మాట్లాడే ధైర్యం చేయకపోవచ్చు. అలాగే అనిల్ గాడి మీద ఉన్న భయంతో ఇంతవరకు కాలేజీ మేనేజ్మెంట్ కూడా బయటకు రాలేదు.
**********
కాలేజీ నుండి బయల్దేరిన కార్తీక కారు స్పీడ్ గా నడుపుతూ తొందరగా ఇంటికి చేరుకొని గబగబా తన రూమ్ లోకి వెళ్లి డోర్ క్లోజ్ చేసుకుని మంచం మీద పడి ఏడవడం మొదలు పెట్టింది. అలా వెక్కి వెక్కి ఏడ్చి కొంతసేపటికి తన తల్లి ఫోటో తీసుకుని తన గుండెలకేసి హత్తుకొని ఏడుస్తూ, ఏంటమ్మా ఈరోజు ఇలా జరిగింది? ఈరోజు నాతో నేనే విభేదిస్తున్నట్లు నాకు అనిపిస్తోంది. వాడు చెప్పే మాటలు నిజమేనా? వాడి విషయంలో మేము తప్పు చేశామా? నాకేమీ అర్థం కాకుండా ఉందమ్మా. వాడి వల్లనే నువ్వు మమ్మల్ని వదిలి వెళ్ళిపోయావని నా చిన్నప్పటి నుంచి అందరూ చెబుతూ వచ్చారు. ఇందులో ఏది నిజమో ఏది అబద్ధమో తేల్చుకోలేక పోతున్నాను. (ఇంకా అలా ఏడుస్తూనే) ఇప్పుడు నేను ఏం చేయాలమ్మ? ఈ రోజు వాడు కేవలం నా సంతోషం కోసం దెబ్బలు తినడం చూశాను.