Episode 123.2
అను ఆ కుర్రాడిని చూసి ఆశ్చర్యపోతూ, నువ్వా????? అని అడిగింది. .... అవును నేనే,,, ఏం ఆ రోజు వాడి అండ చూసుకుని ఎగిరెగిరి పడ్డావు కదా? అని అన్నాడు. .... ప్లీజ్,, మా అన్నయ్యను వదిలేయండి. ఎందుకు అలా కొడుతున్నారు ప్లీజ్ మమ్మల్ని వెళ్లనీయండి అని బతిమాలింది. .... అలా ఎలా వదిలేస్తాను,, ఇంకా నీతో నాకు చాలా పని ఉంది అని అన్నాడు ఆ కుర్రాడు. .... అయితే ఇందులో మా అన్నయ్య తప్పేముంది? తనని వదిలేయండి అని అంది అను. .... వాడు నీకు అన్నయ్య అవ్వడమే వాడు చేసిన పెద్ద తప్పు. .... ప్లీజ్,,, మా అన్నయ్య వదిలేయండి అని వేడుకుంది. ... ఆ కుర్రాడు గన్ బయటకు తీసి, అలా ఎలా వదిలేస్తాను? వాడు నీకు అన్నయ్య అయినందుకు వాడి వాటా వాడికి ఇచ్చేయాలి కదా? అరేయ్ వాడిని నిలబెట్టి పట్టుకోండిరా అని తన రౌడీలకు ఆర్డర్ వేశాడు.
ఆ రౌడీలు అభి ని నిలబెట్టి పట్టుకోగా ఆ కుర్రాడు గన్ షూట్ చేయడంతో బుల్లెట్ వెళ్లి అభి కడుపులో దిగింది. దాంతో అభి అక్కడే కుప్పకూలిపోయాడు. ఆ కుర్రాడు అభి దగ్గరకు వచ్చి, నిన్ను పూర్తిగా చంపకుండా ఎందుకు వదిలేస్తున్నానో తెలుసా? వెళ్లి ఆ దీపు గాడికి చెప్పు అనిల్ రాజ్ వాడి కోసం వెయిట్ చేస్తున్నాడని అని చెప్పి అను ని తీసుకొని రౌడీలతో కలిసి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఆ తర్వాత ఆ దారినే వెళుతున్న ఎవరో ఇంటి గేట్ దగ్గర వాచ్మెన్ కి సమాచారం అందించడంతో వెంటనే అభిని హాస్పిటల్ కి తీసుకొని రావడం జరిగింది. దేవి మాకు ఫోన్ చేయడంతో మేము కూడా డైరెక్ట్ గా హాస్పిటల్ కి రావడం జరిగింది అని ముగించారు అంకుల్.**
ఒరేయ్ అనిల్ ఈ రోజు నువ్వు నా చేతిలో అయిపోయావురా,,, అని మనసులో అనుకొని అక్కని ఓదారుస్తూ, మరేం భయం లేదు అక్క నేను ఉన్నాను కదా నేను చూసుకుంటాను. అభి కి, అనుకి ఏమీ కాదు. నువ్వు ఏడవడం ఆపి ధైర్యంగా ఉండు కొద్దిసేపట్లో అను ని జాగ్రత్తగా తీసుకొచ్చి నీ ముందు నిలబడతాను అని ధైర్యం చెప్పాను. అంతలో నా వెనకే అక్కడకు చేరుకున్న నా టీం సభ్యులు కూడా అంకుల్ చెప్పిందంతా విన్నారు. ఆ తర్వాత మేము నలుగురం కలిసి హాస్పిటల్ బయటికి వచ్చాము. ఇప్పుడు మనం ఏం చేద్దాం? అని అడిగాడు సోము. .... ముందుగా మనం ఆ అనిల్ గాడు ఎక్కడున్నాడో తెలుసుకోవాలి. అలాగే అను ఎక్కడ ఉందో కూడా తెలుసుకోవాలి అని అన్నాను. అంతలో నా ఫోన్ రింగ్ అవడంతో కాల్ లిఫ్ట్ చేశాను. ఆ ఫోన్ లోని అవతలి వ్యక్తి మాటలు విన్న తర్వాత నాకు మరొక గట్టి షాక్ తగిలింది.
ఫోన్ చేసింది పవిత్ర కావడంతో కాల్ లిఫ్ట్ చేసి, హలో బుజ్జమ్మ,,, అని అన్నాను. .... హలో అన్నయ్య,, పెద్దనాన్న గారిని సెక్యూరిటీ ఆఫీసర్లు అరెస్టు చేసి తీసుకెళ్లారు అని అంది. .... ఎందుకు? అని అడిగాను. .... కంపెనీలో ఏదో నకిలీ మందులు తయారు చేస్తున్నారని సెక్యూరిటీ ఆఫీసర్లు అంటుంటే విన్నాను. మిగిలిన విషయాలు నువ్వు ఒకసారి న్యూస్ ఛానల్ చూస్తే తెలుస్తుంది అని కాల్ కట్ చేసింది. నేను వెంటనే హాస్పిటల్ రిసెప్షన్ లోకి రాగా అక్కడ ఉన్న టీవీ లో న్యూస్ నడుస్తోంది.
న్యూస్: ఈరోజు నగరంలో సుప్రసిద్ధ బిజినెస్ మాన్ దినేష్ వర్మని సెక్యూరిటీ ఆఫీసర్లు అరెస్టు చేశారు. అతను తన కంపెనీలో నకిలీ మందులు తయారు చేసి అమ్ముతున్నారన్న అభియోగంపై అరెస్టు చేశారు. ఆ కంపెనీ లో తయారైన మందులు వాడి నిన్న నగరంలో కొంతమంది చనిపోవడంతో సెక్యూరిటీ ఆఫీసర్లు దినేష్ వర్మని అరెస్ట్ చేశారు. ఇంకా పూర్తి వివరాలు అందాల్సి ఉంది.
ఆ న్యూస్ చూసి, ఈరోజు ఒక దాని వెంట మరొకటి ఇలాంటి న్యూస్ వినాల్సి వచ్చిందేంటి? ఒకపక్క ఆ అనిల్ గాడు అను ని కిడ్నాప్ చేశాడు. మరోపక్క అభి బుల్లెట్ తగిలి ఆపరేషన్ థియేటర్ లో ఉన్నాడు. ఇప్పుడేమో నాన్నని జైల్లో పెట్టారు అనే న్యూస్ వినాల్సి వచ్చింది. ఇవన్నీ కాకతాళీయంగా జరిగినవా? లేదంటే వీటి వెనక మరో కారణం ఏదైనా ఉందా? అన్న సందేహం వచ్చింది. కానీ నేను ఎక్కువ ఆలోచిస్తున్నానేమో? అన్న సందేహం కూడా వచ్చింది. నేను అలా ఆలోచనలో ఉండగా సోము వచ్చి నన్ను కదిపే సరికి ఆలోచనల నుంచి బయటికి వచ్చాను. ఏమైంది దీపు? అని అడిగాడు సోము. .... నేను కొంచెం ఆలోచించి, తార ల్యాప్టాప్ తెచ్చావా? అని అడిగాను. .... యా,, కార్ లో ఉంది అని చెప్పింది. .... అయితే నేను చెప్పేది జాగ్రత్తగా వినండి, తార నువ్వు కార్లో కూర్చొని అనిల్ గాడి నెంబర్ మరియు అను నెంబర్ లను ట్రేస్ చేసి లొకేషన్ కనుక్కొని నాకు చెప్పు.
ఆ తర్వాత నేను జరిగిన విషయం సోము, జెస్సీ లకు చెప్పి, మీరిద్దరూ కంపెనీకి వెళ్లి అక్కడ ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేయండి. సెక్యూరిటీ ఆఫీసర్లు డైరెక్ట్ గా ఇంటికి వచ్చి అరెస్టు చేశారు కాబట్టి కంపెనీలో దాని గురించి చర్చ ఉంటుంది. సో,, ఆ పని చేసిన వాళ్ళు ఖచ్చితంగా కంపెనీలోనే ఉంటారు. సెక్యూరిటీ ఆఫీసర్లు పూర్తిగా రంగంలోకి దిగే లోపు మనం ఏమైనా తెలుసుకునే ప్రయత్నం చేస్తే వెంటనే ప్రాబ్లం సాల్వ్ చేయొచ్చు. నేను ఇక్కడ అను సంగతి చూసుకుంటాను అని చెప్పాను. .... కానీ నువ్వు ఒక్కడివే వెళ్లడం అంత మంచిది కాదేమో నేను కూడా నీతో వస్తాను అని అన్నాడు జెస్సీ. .... నేను చూసుకుంటాను అని చెప్తున్నాను కదా. మీరు ఇంకా లేట్ చేస్తే అక్కడ మనకు కావాల్సిన విలువైన సమాచారం మిస్ అయ్యే ఛాన్స్ ఉంది మీరు తొందరగా వెళ్ళండి అని వాళ్ళను పంపించి నేను కారు దగ్గరికి వెళ్లగా తార అప్పటికే తన పనిలో బిజీగా ఉండి ఒక రెండు నిమిషాలు తర్వాత అనిల్ మరియు అను ఇద్దరి మొబైల్స్ ఓకే లొకేషన్ చూపిస్తున్నట్టు ఆ లోకేషన్ నాకు షేర్ చేసింది.
గుడ్ తార,, నువ్వు ఇక్కడే కార్లో కూర్చొని ఎప్పటికప్పుడు వాళ్ళ కదలికలు నాకు ఇన్ఫామ్ చేస్తూ ఉండు. అలాగే అభి కేసు విషయమై సెక్యూరిటీ ఆఫీసర్లు ఎవరైనా వచ్చే అవకాశం ఉంది. నువ్వు వాళ్ళకి కనబడకుండా జాగ్రత్తగా ఉండి ఏం జరుగుతుందో అబ్జర్వ్ చెయ్. నాకు తెలియాల్సిన విషయాలు ఏమైనా ఉంటే వెంటనే నాతో చెప్పు అని నా గన్ ఒకసారి చూసుకొని ఒక స్పేర్ మేగజైన్ కూడా పెట్టుకొని నేను నా బైక్ తీసుకొని బయలుదేరాను. ఫుల్ స్పీడ్ లో బైక్ డ్రైవ్ చేస్తూ సుమారు ఒక ఇరవై నిమిషాల తర్వాత ఆ లొకేషన్ కి చేరుకున్నాను. కొద్ది దూరంలో బైక్ ఆపి తారతో మాట్లాడుతూ, నా మొబైల్ లొకేషన్ వాళ్ల మొబైల్ లొకేషన్ చూసి వాళ్లు కచ్చితంగా ఎక్కడ ఉన్నారో తెలుసుకున్నాను. ఆ తర్వాత అనిల్ గాడికి కాల్ చేసి, ఒరేయ్ అనిల్ ఇప్పుడే విషయం తెలిసింది నేను వస్తున్నాను అని చెప్పాను.
రా రా రా,,, అని వికటాట్టహాసం చేస్తూ, నేను నీ కోసమే వెయిట్ చేస్తున్నాను తొందరగా వచ్చేయ్. నిన్ను చంపాలని నా చేతులు చాలా దురదగా ఉన్నాయి తొందరగా వచ్చేయ్ లేదంటే నీకంటే ముందు ఈ పాప నా చేతిలో చచ్చినా చస్తుంది వచ్చేయ్ వచ్చేయ్,, అని ఒక సైకో విలన్ లాగా మాట్లాడాడు. .... ఈరోజు నువ్వు ఒకటి కాదు రెండు తప్పులు చేశావురా. ఈ రోజు నిన్ను వదిలి పెట్టే ప్రసక్తే లేదు నేను వస్తున్నాను చావడానికి సిద్ధంగా ఉండు అని చెప్పి కాల్ కట్ చేసి ముందుకు కదిలాను. అది ఒక కొత్తగా కట్టిన అపార్ట్మెంట్. బహుశా ఇంకా ఆక్యుపెన్సీ జరగలేదు కాబోలు అందుకే మొత్తం ఖాళీగా ఉంది. కానీ గేట్ దగ్గర ఇద్దరు మనుషులు గస్తీ కాస్తున్నారు. నేను వాళ్ల దృష్టిలో పడకుండా జాగ్రత్తగా నక్కినక్కి వెళుతూ గన్ కి సైలెన్సర్ బిగించి పహారా కాస్తున్న ఇద్దరిలో ఒకడిని షూట్ చేయగా వాడు అక్కడే నేలకూలాడు. అది చూసి రెండో వ్యక్తి తేరుకునే లోపు వాడిని కూడా షూట్ చేసి పడేసాను.
ఆ తర్వాత నేను వాళ్ళిద్దర్నీ పక్కకి లాగి పడేసి జాగ్రత్తగా వాచ్ చేస్తూ గేటు లోపలికి అడుగు పెట్టి అడుగులో అడుగు వేసుకుంటూ ముందుకు కదిలాను. కొంచెం ముందుకు వెళ్లేసరికి బేస్మెంట్లో మరో నలుగురు కనబడ్డారు. వాళ్ల చేతుల్లో హాకీ స్టిక్స్ ఉన్నాయి. ఇంకా పైన ఎంతమంది ఉన్నారో తెలియదు కాబట్టి బుల్లెట్స్ వేస్ట్ చేయడం ఎందుకని గన్ ప్యాంట్లో దోపుకుని వాళ్లకి కనపడకుండా జాగ్రత్త పడుతూ దగ్గరకు వెళ్లాను. ముందుగా ఒకడిమీద ఎటాక్ చేసి వాడి వెనుక గోడకు ఒక మేకు కనపడటంతో వాడి తలను దానికేసి గుచ్చాను. అది కొంచెం పెద్ద మేకు కావడంతో నేను కొట్టిన దెబ్బకి తలలో పూర్తిగా దిగిపోయి వాడు కిక్కురుమనకుండా చచ్చాడు. వెంటనే వాడి బొడ్లో దోపి ఉన్న చాకు అందుకుని మిగిలిన ముగ్గురు మీద మెరుపు దాడి చేసి ముగ్గురి గొంతులు కట్ చేసి అక్కడి నుంచి ముందుకు కదిలాను.
కింద ఇంకెవ్వరూ కనబడక పోవడంతో మెట్లు ఎక్కుతూ పైకి బయల్దేరాను. మొదటి ఫ్లోర్ కి వెళ్ళేటప్పటికి అక్కడ మరొక ఐదుగురు కనబడ్డారు. నేను ఏ మాత్రం ఆలస్యం చేయకుండా గన్ తీసి అందర్నీ షూట్ చేసి పడేసాను. ఆ తర్వాత నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ మూడో ఫ్లోర్ కి వెళ్లేటప్పుడికి అక్కడ మరో ఏడుగురు కనబడ్డారు. ముందుగా ముగ్గురిని షూట్ చేసి మేగజైన్ మార్చుకునే టైం లేక గన్ ప్యాంటులో దోపి ఒక మొగ్గ వేసి వాళ్ల మధ్యలోకి దూకి ఒక్కొక్కడికి పంచ్ లు ఇస్తూ ఫ్లయింగ్ కిక్ లతో అదరగొట్టి చాకుతో నలుగురి గొంతులు కట్ చేసి లేపేశాను. ఆ తర్వాత పైకి వెళ్లగా నాలుగవ ఫ్లోర్లో ఎవరూ లేరు. ఐదవ ఫ్లోర్ కి వెళ్ళేసరికి అక్కడ ఒక రూమ్ దగ్గర ఒకే ఒక్కడు కాపలాగా ఉన్నాడు. వెంటనే నేను గన్ రీలోడ్ చేసి వాడిని కూడా షూట్ చేసి లేపేసాను. ఆ తర్వాత డోర్ దగ్గరకు వెళ్లి డోర్ కొట్టాను.
లోపల్నుంచి అనిల్ గాడు మాట్లాడుతూ, ఏంట్రా?? లాక్ తీసే ఉంది లోపలికి రా. ఆ దీపు గాడు బయలుదేరాడు ఏ టైంలోనైనా ఇక్కడికి రావచ్చు మన వాళ్లందర్నీ రెడీగా ఉండమని చెప్పు. వాడు కనిపించగానే వెంటనే వేసేయండి అని అన్నాడు. నేను డోర్ ఓపెన్ చేసుకొని లోపలికి వెళ్ళేసరికి ఒకపక్కన చైర్ లో తాళ్లతో కట్టి ఉంచిన అను కనపడింది. మాట్లాడుతూ డోర్ దగ్గరికి వస్తున్న అనిల్ నన్ను చూసి బెడ్ మీద ఉన్న తన గన్ అందుకోవడానికి పరిగెత్తాడు. నేను వెంటనే వాడి గన్ వైపు గురిపెట్టి షూట్ చేసేసరికి అది అక్కడి నుంచి ఎగిరి దూరంగా పడింది. వెంటనే అనిల్ గాడి దగ్గరకు చేరి వాడి మీదకు దూకి మొహం మీద పంచ్ ల వర్షం కురిపించాను. అలా కొడుతూనే, నీ యబ్బ నా అను ని తీసుకురావడానికి నీకు ఎంత ధైర్యంరా? అది నా పిల్ల,,, నా ప్రాణం,,, నా ప్రాణం జోలికొస్తే ఊరికే వదులుతానని ఎలా అనుకున్నావురా? అంటూ వాడి ఫిల్ట్ పట్టుకొని లేపి వెనక ఓపెన్ చేసి ఉన్న డోర్ బాల్కనీలోకి తీసుకువెళ్ళాను.
కిందికి చూడగా ఆ రూమ్ వెనకాలే ఆ అపార్ట్మెంట్ బౌండరీ వాల్ కనబడింది. ఆ బౌండరీ వాల్ మీద బాణం షేపులో ఉన్న ఇనుప చువ్వలు ఏర్పాటు చేసి ఉన్నాయి. ఆరోజు నిన్ను పూర్తిగా చంపకుండా వదిలేసి తప్పు చేశాను. కానీ ఈ రోజు మాత్రం వదిలే ప్రసక్తే లేదు. నీ చావు నా చేతిలోనే రాసిపెట్టి ఉంది అంటూ వాడిని వెనక్కి వంచి ఫీల్ట్ వదిలేశాను. వాడు తిన్నగా వెళ్లి ఆ ఇనుప చువ్వల మీద పడ్డాడు. దాంతో ఆ చువ్వలు వాడి వెనక నుండి గుచ్చుకొని ముందుకు పొడుచుకు వచ్చి గిలగిల లాడుతూ నోట్లో నుంచి రక్తం కక్కుకుని చచ్చాడు. ఆ తరువాత నేను అను దగ్గరికి వెళ్లి తనకు కట్టిన కట్లు విప్పి నోట్లో కుక్కిన గుడ్డ ముక్క తీయగానే అను పైకి లేచి నన్ను గట్టిగా వాటేసుకుని భయంతో వణికిపోతూ బోరున ఏడవడం మొదలు పెట్టింది. నేను తనను సముదాయిస్తూ, ఊరుకోరా బంగారం,, నేనుండగా నీకేం కాదు. పద మనం తొందరగా ఇక్కడ నుంచి వెళ్లిపోవాలి.
అది,, అన్నయ్య?? అని ఏడుస్తుంది అను. .... అభి కి ఏం కాలేదు, ఇప్పుడు తను హాస్పిటల్లో ఉన్నాడు ముందు ఇక్కడి నుంచి పద అని తన చేయి పట్టుకొని ఇద్దరం కలిసి కిందికి నడిచాము. ఆ రూమ్ లో నుంచి బయటకు వస్తూనే గన్ పేలిన శబ్దం వినబడి నా పక్కలో నుంచి దూసుకుపోతూ చిన్నగా చీరుకుపోయింది. ఇందాక నేను షూట్ చేసినవాడు ఇంకా బతికే ఉన్నాడు ఇప్పుడు షూట్ చేసింది కూడా వాడే. వెంటనే నేను నా గన్ తీసి వాడి మీద బుల్లెట్ దింపి ఇద్దరం కలిసి గబగబా మెట్లు దిగి కిందికి చేరుకున్నాము. నేను ఒకసారి చుట్టుపక్కల అంతా పరిశీలించి గబగబా బైక్ దగ్గరకు చేరుకొని అను ని తీసుకుని అక్కడ నుంచి బయలుదేరాను.
**కానీ ఆ బుల్లెట్టు తిన్న వ్యక్తి మాత్రం ఇంకా తుదిశ్వాసతో పోరాడుతూ అనిల్ గాడి బాబుకి ఫోన్ చేసి జరిగింది చెప్పాడు. దాంతో అనిల్ గాడి బాబు గగ్గోలు పెడుతూ స్పాట్ కి బయల్దేరాడు.**
మేము హాస్పిటల్ కి చేరుకొని లోపలికి వెళ్లగానే అను ని చూసి దేవి అక్క పరుగున ఎదురొచ్చి కౌగిలించుకుని ఏడ్చింది. ఇద్దరిని తీసుకువెళ్లి కుర్చీలలో కూర్చోబెట్టగా అమ్మ ప్రీతి వాళ్ళిద్దర్నీ ఓదార్చడం మొదలు పెట్టారు. ఇక ఈ ప్రాబ్లం ఒక కొలిక్కి వచ్చింది మిగిలిన ప్రాబ్లం గురించి చూడాలని బయటికి వెళ్లడానికి అక్కడ్నుంచి వెనుదిరిగాను. అంతలోనే అను కూర్చున్నచోట నుంచి లేచి బయటకు అడుగులు వేస్తున్న నా చెయ్యి పట్టుకుని, ఎక్కడికి వెళుతున్నావు? నీ ఒంటికి బుల్లెట్ తగిలింది ముందు ట్రీట్మెంట్ చేయించుకో చూడు ఎంత రక్తం పోతుందో? అని చాలా గట్టిగా ఒక మొగుడి మీద పెళ్ళానికి ఉండే హక్కుతో చెప్పినట్టు చెప్పింది. .... ఆ మాట వినగానే అమ్మ, ప్రీతి, దేవి అక్క కంగారు పడుతూ నా దగ్గరికి వచ్చి నాకు తగిలిన గాయాన్ని చూశారు. అంకుల్ కూడా కంగారు పడినా ఆయన నుంచున్న చోట నుంచి నా వైపు చూస్తూ ఉండిపోయారు.
అమ్మ కన్నీళ్లు కారుస్తూ దుఃఖం ముంచుకొస్తున్న గొంతుతో, ఇదెలా జరిగింది నాన్న? అయ్యో ఎంత రక్తం పోతుందో,,, అని అంది. .... ఏం కాలేదమ్మా,, జస్ట్ బుల్లెట్ రాసుకుంటూ వెళ్ళింది అంతే,,, అని తేలికగా కొట్టిపారేస్తూ అమ్మని సముదాయించే ప్రయత్నం చేశాను. .... ఏంటి,, బుల్లెట్ రాసుకు వెళ్లిందని అంత తేలికగా చెబుతున్నావు,,, చూడు ఎంత రక్తం పోతుందో అంటూ దేవి అక్క నా చెయ్యి పట్టుకుని లోపలికి లాక్కెళ్తూ, ముందు నువ్వు ట్రీట్మెంట్ చేయించుకొని ఆ తర్వాత రెస్ట్ తీసుకో అని అంది. .... నాకేం కాదులే అక్క,, ఇంతకీ ముందు అభి ఎలా ఉన్నాడో చెప్పు అని అన్నాను. .... అభి కి ఇప్పుడు బాగానే ఉంది. బుల్లెట్ తీసేశారు మత్తులో ఉండడం వలన ఇంకా ఐసీయూలో ఉంచారు అని చెప్పింది అమ్మ. .... దేవి అక్క నన్ను బలవంతంగా లాక్కెళ్లడంతో నాకు తగిలిన గాయానికి ట్రీట్మెంట్ చేయించుకోవడం కోసం లోపలికి వెళ్ళాను.
లోపల డాక్టర్ నా గాయం చూసి పెద్దది కాకపోవడంతో ట్రీట్మెంట్ చేయమని అక్కడ ఉన్న హెడ్ నర్స్ కి చెప్పి వెళ్ళాడు. హెడ్ నర్స్ నాకు ట్రీట్మెంట్ చేస్తుండగా నేను పవిత్ర కి ఫోన్ చేశాను. బుజ్జమ్మ పెదనాన్నకి బెయిల్ వచ్చిందా? అని అడిగాను. .... లేదు అన్నయ్య,,, పెదనాన్నకి బెయిల్ రావడం కష్టం ఈ విషయంలో నేను ఏమి చేయలేను అని నాన్న అంటున్నారు అని ఏడుస్తూ అంది. .... సెక్యూరిటీ ఆఫీసర్లు ఇంటికి వచ్చి తీసుకు వెళ్లడమే ఎక్కువ అనుకుంటే ఇప్పుడు బెయిల్ దొరకదు అన్న విషయం నాకు మరింత ఆశ్చర్యంగా అనిపించింది. విషయం ఏమిటో తెలియకుండా ఒక నిర్ణయానికి రావడం మంచిది కాదు అని అనుకొని, సరేరా బుజ్జమ్మ ఆ విషయం నేను చూస్తానులే మీరు కంగారు పడొద్దు అని చెప్పి కాల్ కట్ చేశాను. ప్లాస్టర్ వేసి నా ట్రీట్మెంట్ పూర్తవగానే బయటకు వచ్చి, సరే నాకు ఒక అర్జెంట్ పని ఉంది నేను వెళ్ళాలి అని అన్నాను.
ప్రీతి నా దగ్గరకు వచ్చి నన్ను పట్టుకొని, నువ్వు ఎక్కడికి వెళ్ళద్దు ఇక్కడే ఉండు అన్నయ్య అని అంది. .... లేదురా బంగారం,, నేను వెళ్ళాలి. అక్కడ పవిత్ర వాళ్ల పెదనాన్నని సెక్యూరిటీ ఆఫీసర్లు అరెస్టు చేసి తీసుకువెళ్లారట నేను వెళ్లి కొంచెం హెల్ప్ చేయాలి అని అన్నాను. .... ఏంటి,,, అరెస్టు చేశారా? ఎప్పుడు జరిగింది ఇదంతా? అని అడిగింది అమ్మ. ఈ విషయం విన్న వెంటనే అంకుల్ కూడా నా వైపు కొంచెం సీరియస్ గా చూసి ఆలకిస్తున్నారు. .... అప్పుడు నేను వాళ్లకు జరిగిన విషయం అంతా చెప్పడంతో అప్పటిదాకా సీరియస్ గా వింటున్న అంకుల్, సరే దీపు వెళ్లి ముందు ఆ పని చూడు అని అన్నారు. .... బహుశా ఈ రోజు పొద్దున్న నేను కనబడిన దగ్గర్నుంచి నేను చేస్తున్న పనులు అంకుల్ ని కొంచెం ఆశ్చర్యపరిచి ఉండవచ్చు. ఎందుకంటే నేను ఒక ఐబి ఏజెంట్ అని ఇంతవరకు అంకుల్ కి తెలియదు.
బహుశా అమ్మకి కూడా ఆ విషయం అర్థమైంది కాబోలు అందుకే ఇప్పుడు ఏం చేయాలి అన్నట్టు నా వైపు నిస్తేజంగా చూసింది. అంకుల్ దగ్గర ఇంకా ఈ విషయం దాచడంలో అర్థం లేదని అనిపించి అంకుల్ తో ప్రైవేట్ గా మాట్లాడి విషయం చెప్పమని అమ్మకి కళ్ళతోనే సైగ చేసి అక్కడి నుంచి బయటికి నడిచాను. కార్ లో కూర్చున్న తార దగ్గరికి వెళ్లి, ఎనీ ఇన్ఫర్మేషన్? అని అడిగాను. ఇంకా ఏం లేదు అని చెప్పడంతో తనని కార్లోనే కూర్చోమని చెప్పి నేను కొంచెం పక్కకు వెళ్లి లాయర్ అంకుల్ కి ఫోన్ చేశాను. హలో అంకుల్,, అని పలకరించగా హలో దీపు,,, చెప్పు బాబు ఏంటి ఈ టైం లో ఫోన్ చేసావ్? అని అడిగారు. .... అంకుల్ ఈరోజు న్యూస్ చూశారా? అని అడిగాను. .... ఆ చూశాను,, దినేష్ వర్మ గారి అరెస్ట్ గురించేనా? అని అడిగారు.
అవును అంకుల్,, ఈ విషయంలో నాకు మీ హెల్ప్ కావాలి అని అన్నాను. .... చెప్పు బాబు నేనేం చేయగలను? అని అడిగారు. .... అంకుల్ ముందు నాకు ఒక విషయం చెప్పండి. కంపెనీలో నకిలీ మందులు తయారవుతున్నాయని కంపెనీ యజమానిని అరెస్టు చేయడం అది కూడా బెయిల్ రాని సెక్షన్లు పెట్టి అరెస్టు చేయడం ఇదంతా కొంచెం ఎక్కువగా అనిపించడం లేదూ? అని అడిగాను. .... ఏంటి నాన్ బెయిలబుల్ సెక్షన్ ప్రకారం అరెస్టు చేశారా? ఇటువంటి కేసుల్లో అంత సీరియస్ సెక్షన్లు పెట్టి అరెస్టు చేయవలసిన అవసరం ఉండదే? పూర్తిస్థాయి ఎంక్వయిరీ జరక్కుండా అరెస్టు చేయడం అనేది జరగదు. నిన్న జరిగిన ఇన్సిడెంట్ ఆధారంగా ఈ రోజు అరెస్టు చేశారంటే సొంత పూచీకత్తుపై బెయిల్ తప్పకుండా దొరుకుతుంది. ఆ తర్వాత ఎంక్వైరీ జరిగినప్పుడు అవసరమైతే రిమాండ్ కోసం అడగొచ్చు. బెయిల్ రాదని ఎవరు చెప్పారు? అని అడిగారు లాయర్ అంకుల్.
ఇప్పుడే చెల్లి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. బెయిల్ రాదని దినేష్ వర్మ గారి తమ్ముడు రాజేష్ వర్మ గారు చెప్పారట. నాకు తెలిసినంత వరకూ దినేష్ వర్మ గారు అటువంటి పనులు చేస్తారని నేను అనుకోను. దీని వెనకాల మరేదైనా కారణం ఉంటుందని నేను అనుకుంటున్నాను. అంకుల్ మీరేమైనా బెయిల్ రావడానికి హెల్ప్ చేయగలరా? అని అడిగాను. .... సరే బాబు నా జూనియర్లు ఇప్పుడు కోర్టు దగ్గరే ఉంటారు. వాళ్లతో చెప్పి మేజిస్ట్రేట్ దగ్గర్నుంచి బెయిల్ ఆర్డర్స్ తీసుకునే ఏర్పాటు చేయమని చెబుతాను. అంతా సవ్యంగా జరిగితే మరో గంటలో దినేష్ వర్మ గారు బయటకు వచ్చేస్తారు అని చెప్పారు లాయర్ అంకుల్. .... చాలా థాంక్స్ అంకుల్,,, అని చెప్పి నేను కాల్ కట్ చేశాను. ఆ తర్వాత నేను పవిత్రకి కాల్ చేసి, బుజ్జమ్మ ఒక గంటలో పెదనాన్న బయటికి వచ్చేస్తారని ఇంట్లో ఎవరినీ కంగారు పడొద్దని చెప్పు అని చెప్పి కాల్ కట్ చేసి వెంటనే జెస్సీకి కాల్ చేయగా, ఇక్కడ ఇద్దరు అనుమానితులు దొరికారు మేము వాళ్ళని పట్టుకున్నాము. ఇప్పుడు మేము ******** లొకేషన్ లో ఉన్నాము నువ్వు కూడా వెంటనే ఇక్కడికి వచ్చేయ్ అని చెప్పాడు జెస్సీ. .... సరే నేను వెంటనే వస్తున్నాను అని చెప్పి కాల్ కట్ చేసి జెస్సీ చెప్పిన లొకేషన్ కి బయలుదేరాను.