Episode 124.2


ఏంటే అక్క,, అదే మనిషి కాలేజీలో నీ ప్రాణాలు కాపాడాడన్న విషయం కూడా మర్చిపోయావా? నన్ను ఎవడో కిడ్నాప్ చేస్తే నా మాన ప్రాణాలను కాపాడి జాగ్రత్తగా ఇంటికి చేర్చాడన్న విషయం మీరందరూ మర్చిపోయారా? ఈరోజు మీరు చాలా పెద్ద తప్పు చేశారు. అదృష్టం కొద్దీ మీ అందరి కంటే ముందే నా తప్పు తెలుసుకున్నాను. మీరు తప్పు చేస్తున్నారన్న విషయం మీకు తెలిసి చేస్తున్నారో లేక తెలియనట్టు నటిస్తున్నారో ఆలస్యం కాకముందే తెలుసుకోండి. అయినా నా పిచ్చి కాకపోతే మనసులు లేని మనుషులతో ఈ మాటలు చెబుతున్నాను చూడు నా చెప్పు తీసి నేను కొట్టుకోవాలి. ఇందాక ఏంటే అన్నావు, మీరు విసిరి పడేసిన డబ్బులతో బతికాడా? హలో,,, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ నేను చెప్పేది జాగ్రత్తగా విను.

ఈరోజు వరకు మీరు ఇచ్చిన ఒక్క పైసా కూడా ముట్టుకోలేదు. పార్వతి ఆంటీ వాడి కోసం కోట్ల రూపాయల ఆస్తులను వదిలిపెట్టి పోయింది. మీరు పడేసిన చిల్లర పైసల కోసం కక్కుర్తి పడాల్సిన అవసరం అన్నయ్యకు లేదు అని ఆవేశంగా అంది పవిత్ర. .... రాజేష్ వర్మ కోపంగా మాట్లాడుతూ, చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు నీ హద్దులో నువ్వుండు పవిత్ర అని అన్నాడు. .... ఏం ఎందుకుండాలి? నేనేదో నాలుగు మాటలు మాట్లాడి మీ నిజస్వరూపాలని అద్దంలో మీకే చూపిస్తుంటే చూడలేక పోతున్నారే? అలాంటిది మీరు చిన్నతనం నుంచి వాడిని అనరాని మాటలు అని దూషిస్తుంటే వాడికి ఎలా ఉంటుందో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? వాడు గుక్కపెట్టి ఏడుస్తూ గడిపిన రోజులు చూశాను నేను. పెద్దమ్మ విషయంలో జరిగిన దుర్ఘటన ఎవరికైనా జరిగి ఉండొచ్చు. నా రవి అన్నయ్యకి కూడా అలాగే జరిగింది.

కానీ మీలాగే చెప్పుడు మాటలు విని ఆ దుర్ఘటన జరగడానికి కారణం వాడే అని వాడిని రాక్షసుడుగా భావించి వాడికి దూరమయ్యాను. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను కూడా మీ అందరి మాటలు నమ్మి ముందు అలానే అనుకునేదాన్ని. కానీ మనం మన తప్పులు సరిదిద్దుకోవడానికి కాలం అందరికీ ఛాన్స్ ఇస్తుంది. నాకు వచ్చిన అవకాశాన్ని నేను సరిగ్గా వినియోగించుకొని నా తప్పు నేను తెలుసుకొని వాడి మీద ఉన్న అపోహలను దూరం చేసుకున్నాను. అలాగే మీకు కూడా చాలా అవకాశాలు వచ్చాయి అంతెందుకు ఈరోజు కూడా అటువంటి అవకాశమే వచ్చింది కానీ మీరు దాన్ని కాలదన్నుకున్నారు. ఇక మీదట మీకు మీ తప్పు తెలుసుకోవడానికి మరో అవకాశం దొరుకుతుందని కూడా నాకు అనిపించడం లేదు. ఈ మాట అనొచ్చో లేదో తెలియదు గాని నాకు చెప్పాలని అనిపిస్తుంది. మీ అందరి కంటే వయసులో చిన్నదాన్ని అయినా నేను చేసినది తప్పో ఒప్పో తెలుసుకుని సరిదిద్దుకో గలిగినంత జ్ఞానం నాకు ఉందని అనిపిస్తుంది. అంతెందుకు మీ అందరిలాగా వాడిని రాక్షసుడు అని అమ్మ ఎప్పుడూ అనుకోలేదే? మిమ్మల్ని అందర్నీ చూస్తుంటే నాకు జాలేస్తుంది అని పవిత్ర అనగానే రాజేష్ వర్మ లేచి పవిత్రని గట్టిగా ఒక చెంపదెబ్బ కొట్టి, చాలా ఎక్కువ అయింది ఇక ఆపు అని గట్టిగా అరిచాడు.

హ్హ హ్హ హ్హ హ్హ,,,, ఏం నిజాలు మాట్లాడుతుంటే మీకు చేదుగా అనిపిస్తుంది కదూ? ఇదిగో ఇప్పుడే అది రుజువైంది కూడా. ఇప్పుడు మీ మీద నాకు ఇంకాస్త జాలి పెరిగింది. మీరు మీ తప్పు తెలుసుకొనే రోజు ఒకటి వస్తుంది ఆ రోజు కోసం నేను వేచి చేస్తూ ఉంటాను అని అంది పవిత్ర. .... రాజేష్ వర్మ కోపంతో ఊగిపోతూ, సుమతి,,, దాన్ని వెంటనే లోపలికి తీసుకొని వెళ్ళు లేదంటే దాన్ని చంపేస్తాను అని గట్టిగా అరిచాడు. .... సుమతి భయపడి, అఅఅఅలాగేనండి,,,,,, పవిత్ర నువ్వు నీ రూమ్ లోకి పద,, అని అంది. .... ఇంతకంటే మీరు ఏం చేయగలరు నాన్న? అక్కేమో ఆ అనిల్ రాజ్ గాడితో అన్నయ్యను చంపించాలని చూసింది. మీరేమో ఇక్కడ నన్ను చంపేయండి. కానీ నిజం మాట్లాడడానికి నేను ఎప్పుడూ వెనకడుగు వేయను అని అంది పవిత్ర. .... పవిత్ర మాట విన్న వెంటనే అందరూ కలిసి కార్తీక వైపు చూశారు. నిజం బయట పడినందుకు బిత్తరపోయి కార్తీక పవిత్ర వైపు చూస్తూ ఉండిపోయింది.

ఏంటక్క అలా చూస్తున్నావు? మీరిద్దరూ మాట్లాడుకున్న మాటలు నాకు తెలుసు. ఆరోజు నువ్వు ఫోన్ లో ఎవరితోనో అన్నయ్య మీదకి ఎగదోస్తూ మాట్లాడటం నేను విన్నాను. నీకు ఇంకో విషయం తెలుసా? ఈరోజు అన్నయ్యతో పాటు వచ్చిన అమ్మాయి ఉంది చూడు ఆ అమ్మాయి ఆ రోజు కాలేజీలో గొడవ జరిగినప్పుడే నీకు సరిగ్గా బుద్ధి చెప్పి ఉండేది. కానీ కేవలం అన్నయ్య వల్లనే ఏమి చేయకుండా వెనక్కి తగ్గింది. ఈరోజు కూడా అన్నయ్య ఊం,, అంటే నీ చేతులు విరిచి పడేసేది. ఈరోజు అన్నయ్యతో పాటు ఉన్న ముగ్గురు అన్నయ్య కోసం ప్రాణం ఇస్తారు. అలాగే అన్నయ్య ఒక్క సైగ చేస్తే చాలు ఎవరి ప్రాణాలు అయినా సరే లెక్కచేయరు. వాళ్లు మీలాగా కాదు వాళ్లకి బంధాల విలువ తెలుసు. వాళ్ల స్నేహబంధం అంత గొప్పది అని అంది పవిత్ర. .... ఇక చాలు ఆపు పవిత్ర, నువ్వు నీ రూమ్ లోకి వెళ్ళు అని అంది సుమతి.

సరే అమ్మ,,, అంటూ పవిత్ర తన రూమ్ లోకి వెళ్ళిపోయింది. పవిత్ర రూమ్ లోకి వెళుతూనే ఇక్కడ అంతా నిశ్శబ్ధం ఆవరించింది అందరూ ఆలోచనలో పడ్డారు. తర్వాత కొంతసేపటికి కార్తీక కూడా లేచి తన రూమ్ లోకి వెళ్ళిపోయింది. తన రూమ్ లోకి వెళ్లి బెడ్ మీద కూర్చుని కార్తీక కూడా ఆలోచనలో పడింది. ఒక విధంగా పవిత్ర మాట్లాడిన మాటలు నిజమే అనిపించాయి కార్తీకకి. ఇక్కడ హాల్లో కూర్చున్న దినేష్ వర్మకి కూడా అలాగే అనిపిస్తుంది. కానీ వీళ్ళందరికీ తమ తప్పులు తెలుసుకుని సరిదిద్దుకునే అవకాశం ఉందో లేదో కాలమే నిర్ణయించాలి.
**********​

మేమంతా హాస్పిటల్ కి చేరుకొని అభి దగ్గరకు వెళ్లి కలిసాను. ఆ సమయానికి అమ్మ అంకుల్ కూడా తిరిగి హాస్పిటల్ కి వచ్చారు. ఇప్పుడు ఎలా ఉంది అభి? అని అడిగాను. .... అను నాకు కనిపించగానే నా మనసు కుదుట పడింది. ఇప్పుడు నా ఆరోగ్యానికి వచ్చిన ఢోకా ఏమీ లేదు అని అన్నాడు అభి. .... వెరీ గుడ్,,, అయితే తొందరగా కోలుకొని ఇక్కడ నుండి బయటపడి తొందరగా ఇంటికి వెళ్ళిపో అని నవ్వుతూ చెప్పి అభి ని హాగ్ చేసుకుని బయటికి వచ్చి అలా నడుచుకుంటూ వెళ్లి హాస్పిటల్ బయట ఉన్న గార్డెన్ లో కూర్చున్నాను. నా టీం ముగ్గురు తిరిగి వర్క్ స్టేషనుకి వెళ్ళిపోయారు. కొంతసేపటి తర్వాత నా భుజం మీద చేయి పడటంతో వెనక్కి తిరిగి చూసేసరికి అమ్మ కనబడింది. అమ్మ నా పక్కకి వచ్చి కూర్చోగా అమ్మ ఒడిలో తల వాల్చి పడుకున్నాను.

అమ్మ నా తల నిమురుతూ, ఏమైంది నాన్న,,, ఎవరైనా ఏమైనా అన్నారా? అని అడిగింది. .... ఏం లేదమ్మా,,, ఈ రోజు ఎందుకో మనసు బాగోలేదు అని చాలా క్యాజువల్ గా చెప్పాను. .... అసలు ఏం జరిగిందో ముందు నాతో నిజం చెప్పు అని అడిగింది అమ్మ. ఇక అమ్మ దగ్గర దాచేదేముంది అని అక్కడ ఇంట్లో జరిగిన విషయం అంతా చెప్పాను. అమ్మ నా పరిస్థితిని అర్థం చేసుకుని, అలా జరిగి ఉండాల్సింది కాదు అని అంది. .... ఆ ఇంట్లోకి తిరిగి వెళ్లడానికి నేను ఇంత నీచమైన డ్రామాలు ఆడే వాడిలాగా కనబడుతున్నానా? ఒకవేళ అలాగే చెయ్యాలనుకుంటే ఆ పని ఎప్పుడో చేసేవాణ్ని కదా? .... అమ్మ నన్ను సముదాయిస్తూ, అంతా కాలానికి విడిచిపెట్టు నాన్న. వాళ్లకు వాళ్ల తప్పు తెలుసుకునే రోజు వస్తుంది. పద సాయంత్రం అయిపోయింది నువ్వు పొద్దున్నుంచి ఏమీ తినలేదు. పద ఏదైనా తిందువుగాని అని అంది అమ్మ. మేము క్యాంటీన్ లోకి వెళ్లి నాకు భోజనం వచ్చిన తర్వాత నన్ను తినమని చెప్పి అమ్మ మళ్ళీ లోపలికి వెళ్ళింది. నేను భోజనం తినడం పూర్తిచేసి మళ్లీ వచ్చి పార్క్ లో కూర్చున్నాను.
**********​

దినేష్ వర్మ ఇంట్లో..........

కార్తీక తన రూమ్ లో కూర్చుని తనలో తాను మదన పడుతుంది. ఇందాక పవిత్ర చెప్పిన మాటలన్నీ నిజమా లేదా అబద్దమా? ఇంతకాలం మేము వాడి పట్ల వ్యవహరించిన తీరు సరైనదేనా? పవిత్ర మాటలను బట్టి చూస్తే వాడి దగ్గర అన్ని ఆస్తులు అంత డబ్బు ఉన్నప్పుడు ఇక్కడ నుంచి వచ్చే ఫ్యామిలీ ప్రాపర్టీతో వాడికి అవసరం ఉండదు. అయినా ఇప్పుడు నేను ఇదంతా ఎందుకు ఆలోచిస్తున్నాను? ఇలాంటి ఆలోచన రావడానికి కారణం ఏమిటి? ఏది నిజమో ఏది అబద్దమో అర్థం కావడం లేదు. చిన్నప్పటినుంచి ఏమి చూశానో ఏమి విన్నానో వాటినే నమ్ముతూ వచ్చాను. ఎందుకంటే ఇంట్లో వాళ్ళు అంత నమ్మకంగా చెబుతున్నారు అంటే అది నిజమే అయి ఉంటుంది కదా? అని ఆలోచిస్తోంది.

దినేష్ వర్మ తన రూమ్లో కూర్చొని, ఏంటి అంతా ఇలా జరుగుతుంది? నేనేమైనా తప్పు చేశానా? మేమంతా అప్పుడు కొంచెం ఆలోచించి ఉంటే బాగుండేదా? వాడు మాట్లాడిన మాటలను బట్టి చూస్తుంటే వాడికి ఉన్న జ్ఞానం మాకు లేకుండా పోయిందా అనిపిస్తుంది. కానీ ఆరోజు పండితులు చెప్పిన విషయం అబద్ధం ఎలా అవుతుంది? అసలు ఏం జరుగుతుందో ఇక ముందు ఏం జరగబోతుందో అంతా ఆ భగవంతుడికే తెలియాలి అని తనలో తాను అనుకున్నాడు.

రాజేష్ వర్మ తన రూమ్ లో కూర్చొని, బయటికి పోయాడు అనుకున్న శని గాడు తిరిగి వచ్చి ఎన్నెన్ని మాటలు మాట్లాడుతున్నాడు? కొంపతీసి మళ్లీ ఈ రాక్షసుడు తిరిగి ఇంట్లోకి గానీ రాడు కదా? కొంపతీసి వీడి వలన అన్నయ్య మళ్ళీ జరిగిన విషయం గురించి ఆలోచించి మనసు మార్చుకోడు కదా? లేదు లేదు,,, అలా జరగడానికి వీల్లేదు. అంతకంటే ముందే ఏదో ఒకటి చేసి వాడి అడ్డు తొలగించుకోవాలి. అసలు ఇన్ని సంవత్సరాలుగా వీడిని లేపేయకుండా వాడు ఏం చేస్తున్నాడో అర్థం కావడం లేదు. ఎప్పుడు చూసినా అలా తప్పించుకున్నాడు ఇలా తప్పించుకున్నాడు అని ఎదవ కబుర్లు చెబుతూ వస్తున్నాడు. ఈ రోజు పొద్దున్న నుంచి ఫోన్ కూడా చేయలేదు అనుకుంటూ తన ఫోన్ తీసి ఎవరికో కాల్ చేశాడు.

రాజేష్ వర్మ: హలో,,,,
అవతల వ్యక్తి: ??????????
రాజేష్ వర్మ: ఏమైంది?? ఎందుకలా ఏడుస్తున్నావు?
అవతల వ్యక్తి: ??????????
రాజేశ్ వర్మ: ఏంటి???? ఎప్పుడు?
అవతల వ్యక్తి: ??????????
రాజేష్ వర్మ: కానీ వాడు పొద్దున నుంచి వాళ్ళ నాన్నకి బెయిల్ రప్పించే పనిలో బిజీగా తిరుగుతున్నాడు. అంతేకాకుండా నా బావమరుదులను వెతికే పనిలో కూడా ఉన్నాడే?
అవతలి వ్యక్తి: ?????????
రాజేష్ వర్మ: హా,,, సరే సరే,,,, నువ్వు నీ మనుషులను పురమాయించావు కదా? ఇక లాభం లేదు మనం డైరెక్టుగా రంగంలోకి దిగాల్సిందే. ఇంత వరకు సాగిన దాగుడుమూతలు ఇక చాలు. ముందు వాడి పని ఖతం చేసి ఆ తర్వాత మొత్తం అందరిని లేపేద్దాం. వంశము లేదు మట్టిగడ్డ లేదు హహహహహహహహ,,, అని నవ్వి, నేను ఇప్పుడే బయలుదేరి అక్కడికి వస్తున్నాను అని చెప్పి కాల్ కట్ చేసి తయారయ్యి బయటకు వెళ్ళిపోయాడు.
కానీ ఇంతవరకు రాజేష్ వర్మ ఫోన్లో మాట్లాడిన మాటలు అన్నీ ఆ రూం బయట నుంచి ఎవరో విన్నారు.
**********​

హాస్పిటల్ బయట పార్క్ లో కూర్చున్న నేను జరిగిన విషయాల గురించి ఆలోచిస్తూ చీఫ్ కి కాల్ చేశాను. యస్ దీపు,,, ఏంటి విషయం? అని అటు నుంచి చీఫ్ పలకరించారు. .... నథింగ్ సార్,, మీకు థాంక్స్ చెబుదామని కాల్ చేసాను. పొద్దున్న మీరు చేసిన హెల్ప్ కి థాంక్యు వెరీ మచ్ సార్,,, అని అన్నాను. .... ఇందులో పెద్ద విషయం ఏముంది? నిజానికి ఇటువంటి కేసులు చాలా జరుగుతూ ఉంటాయి అని అన్నారు. .... అంటే అది నా పర్సనల్ మేటర్ కదా అందుకని,,, .... యస్,, ఐ నో,,, ఐ కెన్ అండర్స్టాండ్,,,. డోంట్ వర్రీ మై బోయ్. ఇప్పుడు అంతా ఓకే కదా? అని అడిగారు. .... యస్ సార్,,, మేము వాళ్ళని అక్కడ వదిలేసి వచ్చేసాము మేము ఉండగానే కమిషనర్ గారు కూడా వచ్చారు. ఐ థింక్ ఎవ్రీథింగ్ విల్ బి ఓకే నౌ. .... ఓకే దీపు నువ్వు నీ టీం కొంచెం రిలాక్స్ అవ్వండి. టేక్ కేర్,,, అని కాల్ కట్ చేసారు చీఫ్.

అసలు ఏం జరిగిందంటే పొద్దున నేను అనిల్ రాజ్ గాడిని లేపేసిన విషయం తార ద్వారా తెలుసుకున్న చీఫ్ మేము కంపెనీ కేసు విషయమై బిజీగా ఉండడంతో అక్కడకు మరో బ్యాకప్ టీం ని పంపించి కవర్ చేయించారు. అలాగే మేము మార్గమధ్యలో ఆరుగురిని లేపేసిన విషయం కూడా ఐబి నుంచి జరిగిందని కమిషనర్ గారితో మాట్లాడటం ద్వారా సెక్యూరిటీ ఆఫీసర్లు మా వెంట పడకుండా ఆ డెడ్ బాడీలను రికవర్ చేయించి మాకు ఈ కేసులో ఇన్వాల్వ్మెంట్ లేకుండా చేశారు. హై లెవెల్ లో సంప్రదింపులు జరిగాయి కాబట్టి సెక్యూరిటీ ఆఫీసర్లు ఈ ఆరుగురు హత్యలను ఇన్వెస్టిగేషన్ లో జరిగిన ఎన్కౌంటర్ గా లైట్ తీసుకుంటారు. ఆ తర్వాత నేను లాయర్ అంకుల్ కి కూడా ఫోన్ చేసి ఆయన చేసిన సహాయానికి కృతజ్ఞతలు చెప్పి వీలు చూసుకుని ప్రత్యేకంగా వచ్చి కలుస్తానని చెప్పి కాల్ కట్ చేశాను.

చీకటి పడిన తర్వాత కొంత సేపటికి అమ్మ అను కలిసి పార్కులో కూర్చున్న నా దగ్గరికి వచ్చారు. అంకుల్, అమ్మ, ప్రీతి ఇంటికి బయలుదేరుతూ ఉండటంతో నన్ను కూడా రమ్మని పిలవడానికి వచ్చారు. లేదమ్మా,, రాత్రికి నేను ఇక్కడే తోడుగా ఉంటాలే మీరు వెళ్ళండి అని అమ్మతో చెప్పాను. ఆ తర్వాత వాళ్ళతో పాటు కార్ దగ్గరికి నడుస్తూ, అమ్మ అంకుల్ తో మాట్లాడావా? అని అడిగాను. .... అమ్మ నా వైపు చూసి చిన్నగా నవ్వి, మ్,,, అంతా చెప్పాను. అదిగో అక్కడే ఉన్నారుగా నువ్వు వెళ్లి ఒకసారి పలకరించు అని అంది. .... నేను కార్ దగ్గరికి వెళ్లిన తర్వాత అంకుల్ ని పక్కకు తీసుకువెళ్లి, సారీ అంకుల్,,, ఈ విషయం మీతో చెప్పకుండా దాచాల్సి వచ్చింది అని అన్నాను. .... డోంట్ వర్రీ మై బోయ్,, ఐ కెన్ అండర్స్టాండ్. నువ్వు తెలివైనవాడివి చురుకైన వాడివి అని భుజం తట్టి, కానీ ఇప్పుడు నువ్వు ఒక బిజినెస్ మాన్ ఇక ముందు ఏదో ఒక మార్గమే ఎంచుకోవాల్సిన అవసరం ఏర్పడవచ్చు బాగా ఆలోచించుకో అని చెప్పి హగ్ చేసుకుని అమ్మని ప్రీతిని తీసుకొని కార్లో బయలుదేరి వెళ్లిపోయారు.

ఆరోజు రాత్రి అను మరియు దేవి అక్కలకు తోడుగా హాస్పిటల్ లోనే ఉన్నాను. అభికి తగిలిన గాయం పెద్దది కాకపోవడంతో తన ఆరోగ్యానికి వచ్చిన ఢోకా ఏమీ లేదు. కాకపోతే భారీకాయం కావడం వలన బుల్లెట్ తగలగానే వెంటనే స్పృహ తప్పాడు. అలాగే మరుసటి రోజు సాయంత్రానికి డిశ్చార్జ్ కూడా ఇచ్చేయడంతో వాళ్లకి తోడుగా వెళ్లి అందర్నీ ఇంటి దగ్గర క్షేమంగా దించి అనుకి జాగ్రత్తగా ఉండమని అవసరం అనుకుంటే ఫోన్ చేయమని చెప్పి తిరిగి నా రూమ్ కి బయల్దేరాను. టైం దాదాపు 8:00 కావస్తుండడంతో రూమ్ కి వెళ్లి వండుకోవడానికి బద్ధకంగా అనిపించి దారిలో ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్ దగ్గర ఆగి నాకోసం ఆర్డర్ చెప్పాను. ఇంతలో కొద్దిదూరంలో మెడికల్ షాప్ కనబడటంతో రూమ్లోకి కావలసిన మెడిసిన్ తీసుకుందామని చెప్పి నా పార్సిల్ బైక్ మీద పెట్టి వెళ్లాను. నేను తిరిగి వచ్చి నేరుగా నా రూమ్ కి వెళ్లి ఫ్రెష్ అయ్యి తెచ్చుకున్న పార్సిల్ తినేసరికి అలసటతో బాగా నిద్ర ఆవహిస్తున్నట్టు అనిపించడంతో తిన్న ప్లేట్లు కూడా క్లీన్ చేయకుండా అలాగే బెడ్ మీద చేరి నిద్రపోయాను.
***********​

తార రాత్రి 10:30 సమయానికి సోము మరియు జెస్సీలను పిలిచి, ఒరేయ్ ఈ దీపు ఎక్కడికి పోయాడో కనబడటం లేదు. ఫోన్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ వస్తుంది. తన రూమ్ డోర్స్ కూడా తెరిచి ఉన్నాయి. బైక్, కారు అన్నీ ఇక్కడే ఉన్నాయి అని అంది. .... సోము యధాలాపంగా, హాస్పిటల్ దగ్గర ఉన్నాడేమో? అని అన్నాడు. .... ఒరేయ్ ఎదవ డిశ్చార్జ్ అయిపోయింది రూమ్ కి వచ్చేస్తున్నాను అని సాయంత్రమే ఫోన్ చేసి చెప్పాడు కదా? అని అంది తార. .... అవును కదా!! మరి దీపు ఏమైనట్టు? అని ముగ్గురు అనుమానంగా ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు.

Next page: Episode 125.1
Previous page: Episode 124.1