Episode 125.1


తార, సోము, జెస్సీ ముగ్గురూ కలిసి వర్క్ స్టేషను హాల్లో కూర్చుని దీపు కనబడకపోగా ఫోన్లు కూడా నాట్ రీచబుల్ లేదా స్విచ్ ఆఫ్ అని వస్తూ ఉండటంతో ఎక్కడికి వెళ్ళాడో అని తెలియని మిస్టరీలో బుర్రలు చించుకుంటున్నారు. ఇదివరకు కూడా ఇలా మూడు రోజులపాటు ఫోన్ కూడా చేయకుండా బయట ఉండటం తెలిసిన విషయమే అయినప్పటికీ దీపు రూమ్ తలుపులు తెరిచి ఉండడం అన్ని వెహికల్స్ ఇక్కడే ఉండటంతో కొంచెం అనుమానంగా ఉంది. కొద్దిసేపు ముగ్గురు తీవ్రంగా ఆలోచించి, ఒకసారి లాప్టాప్ లో తన లొకేషన్ చెక్ చేస్తే? అని అన్నాడు సోము. ఆ తర్వాత ముగ్గురు కలిసి ఐబి ఫోన్ నెంబరు ఆధారంగా లాప్టాప్ లో లొకేషన్ సెర్చ్ చేయగా కనబడిన ఆ లొకేషన్ చూసి ముగ్గురు ఒకరినొకరు చూసుకొని గతుక్కుమన్నారు.

ముగ్గురు ఒకేసారి, అక్కడకు ఎలా వెళ్ళాడు? అని అనుకున్నారు. ఎందుకంటే ల్యాప్టాప్ లో కనబడుతున్న లొకేషన్ ఒక లోయను సూచిస్తుంది. అప్పటికి సమయం రాత్రి 12:00 దాటడంతో ముగ్గురు వెంటనే అలర్ట్ అయ్యి గబగబా తయారయ్యి ఆ లొకేషన్ దగ్గరికి బయలుదేరారు. వెళ్తూ వెళ్తూ చీఫ్ కి కూడా కాల్ చేసి ఈ విషయాన్ని వివరించి చెప్పి ఎందుకైనా మంచిది ఒక స్పెషల్ టీం ని కూడా రెడీగా ఉంచమని చెప్పారు. జెస్సీ స్పీడ్ గా డ్రైవ్ చేస్తూ సుమారు రెండు గంటల సమయానికి ఆ లొకేషన్ దగ్గరికి చేరుకున్నారు. మధ్యలో ఉండగా చీఫ్ కాల్ చేసి స్పెషల్ టీం అక్కడకు చేరుకుంటుంది అని చెప్పారు. వీళ్ళు ముగ్గురు ఆ లొకేషన్ దగ్గరకు చేరుకొని చూడగా అక్కడ కొన్ని వాహనాల టైర్ల గుర్తులు కనబడ్డాయి. అలాగే ఒక గన్ ఇంకా అక్కడక్కడ రక్తపు మరకలు విరిగిన హాకీ స్టిక్స్ కనబడ్డాయి.

అవన్నీ చూడటంతో ముగ్గురికి గుండె దడదడ లాడింది. ఏదో జరగకూడనిది జరిగిందని ఒకరినొకరు మొహాలు చూసుకున్నారు. అలాగే మరికొంచెం చుట్టుపక్కల చూడగా రెండు శవాలు కూడా కనబడ్డాయి. అంతలోనే అక్కడికి ఒక హెలికాప్టర్ వచ్చిన శబ్దం వినబడడంతో కిందనుంచి సెల్ఫోన్ లైట్లతో సిగ్నల్ ఇచ్చారు. హెలికాప్టర్ ల్యాండ్ అయ్యి అందులో నుంచి చీఫ్ మరియు కొంతమంది రెస్క్యూ టీం దిగగా ముగ్గురు కలిసి చీఫ్ కి సెల్యూట్ చేశారు. చీఫ్ దగ్గరికి వస్తూనే, ఏమైంది? ఎనీ ఇన్ఫర్మేషన్? అని అడిగారు. .... సార్,, చూస్తుంటే ఇక్కడ చాలా పెద్ద ఫైట్ జరిగినట్టు అనిపిస్తుంది. అటు చూడండి సార్ అక్కడ కొన్ని హాకీ స్టిక్స్ విరిగిపడి ఉన్నాయి. అదిగో ఒక గన్ కూడా పడి ఉంది. దీపు ఉన్న లొకేషన్ ఆ లోయలోకి చూపిస్తుంది అని అన్నాడు జెస్సీ. వెంటనే చీఫ్ లాప్టాప్ మోనిటరింగ్ చేస్తూ రెస్క్యూ టీం ని హెలికాప్టర్ తో లోయలోకి వెళ్లి సెర్చ్ చేయమని ఆర్డర్ వేశారు.
**********​

అదే సమయంలో మరొకచోట ఇద్దరు వ్యక్తులు కూర్చుని మాట్లాడుకుంటున్నారు. అది మరెవరో కాదు అనిల్ రాజ్ గాడి బాబు మరియు రాజేష్ వర్మ. రాజేష్ ఇప్పటికి నా మనసు కుదుటపడింది అని అన్నాడు అనిల్ గాడి బాబు. .... నువ్వు సరిగ్గా వాడి ఊపిరి చెక్ చేసావా? లేదంటే వాడు మళ్ళీ తిరిగి వచ్చి మన ముందు నిల్చున్నా నిల్చుంటాడు. ఇప్పుడు మన గురించి వాడికి నిజం కూడా తెలిసిపోయింది. వాడు ఈ సారి కూడా మళ్ళీ తిరిగి వచ్చాడు అంటే ఇన్నేళ్లుగా మనం పడ్డ శ్రమ అంతా వృధా అయిపోతుంది అని అన్నాడు రాజేష్ వర్మ. .... అలా ఏం జరగదులే, ఈ పాటికి ఆ లోయలో వాడి బాడీని ఏ జంతువులో పీక్కుతింటూ ఉంటాయి అని అనిల్ గాడి బాబు అనడంతో ఇద్దరూ కలిసి హ్హహ్హహ్హ,,, అంటూ పెద్దపెట్టున నవ్వుకున్నారు.

వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకుంటూ ఉండగానే ఎవరో వెనకనుండి వచ్చి రాజేష్ వర్మ మొహాన్ని ప్లాస్టిక్ కవర్ తో మూసేసారు. వెనక నుండి ఎవరో ఆ ప్లాస్టిక్ కవర్ ని గట్టిగా చుట్టి పట్టుకోవడంతో రాజేష్ వర్మ ఊపిరాడక గిలగిలలాడుతూ గింజుకోవడం మొదలుపెట్టాడు. కాళ్లు నేలకేసి కొడుతూ చేతులతో ఆ ప్లాస్టిక్ కవర్ ని చించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ఎంత ప్రయత్నం చేసినప్పటికీ తన ప్రయత్నం వృధాగా మిగిలిపోయింది. నేల మీద కొట్టుకుంటున్న కాళ్లు ఆగిపోయాయి, కవర్ చించడానికి ప్రయత్నిస్తున్న చేతులు కిందికి వేలాడాయి. తన శరీరంలో నుంచి ఆత్మ గాలిలో కలిసి విగతజీవిగా మారాడు. అది చూసి అనిల్ గాడి బాబు తనలో తాను నవ్వుకుంటూ, వీడి బాడీని పార్సెల్ చేసేయరా భాను అని తన ప్రధాన అనుచరుడికి చెప్పి, హ్హహ్హహ్హహ్హహ్హహ్హ,,,, ఇప్పుడు మొత్తం ప్రాపర్టీ అంతటికీ నేనే యజమానిని అవుతా. నా కొడుకుని చంపుతాడా వాడు ఇప్పుడు మొత్తం కుటుంబాన్నే చంపి పడేస్తాను అని వికటాట్టహాసం చేశాడు.
**********​

ఇక్కడ రెస్క్యూ టీం హెలికాప్టర్ తో లోయలోకి దిగుతూ దీపు బాడీ ఉన్న లొకేషన్ కనుక్కోవడానికి పెద్ద సమయం పట్టలేదు. దీపు బాడీ చెట్ల కొమ్మల మధ్య ఇరుక్కుని చలనం లేకుండా వేలాడుతూ ఉండడం గమనించారు. రెస్క్యూ టీం అదే విషయాన్ని పైన ఉన్న చీఫ్ కి సమాచారం అందించారు. హ్మ్,,, ఓకే ఓకే,,, ఇట్స్ ఎ సాడ్ న్యూస్,,,, అని అన్నారు చీఫ్. ..... ఏమైంది సార్? అని అడిగాడు జెస్సి. .... దీపు డెడ్ బాడీ దొరికిందట,,, అని అన్నారు చీఫ్. ....వెంటనే సోము మాట్లాడుతూ, నో సార్,,, దీపు అంత ఈజీగా ప్రాణాలు వదిలేసే మనిషి కాదు. సార్ వెంటనే బాడీని పైకి తీసుకొని రమ్మనండి. ఇంతకుముందు కూడా ఇలాగే చావు అంచుల దాకా వెళ్లి వచ్చాడు తొందరగా పైకి తీసుకువస్తే మన ప్రయత్నలోపం లేకుండా ఏదైనా చేయొచ్చు అని అన్నాడు. .... వెంటనే చీఫ్ కూడా దీపు గతాన్ని గుర్తు తెచ్చుకొని వాకిటాకీలో మాట్లాడుతూ, గయ్స్ దీపు బాడీని తొందరగా పైకి తీసుకుని రండి మనం వెంటనే హాస్పిటల్ కి తీసుకుని వెళ్లాలి అని ఆర్డర్ వేశారు.

సరే అని చెప్పి రెస్క్యూ టీం కష్టపడి వేగంగా పని చేస్తూ ఒక ఇరవై నిమిషాలకి దీపు బాడీతో పైకి వచ్చారు. వెంటనే చీఫ్ మరియు తార హెలికాఫ్టర్ ఎక్కి తమ ఏజెన్సీకి సంబంధించిన హాస్పిటల్ కి పోనివ్వమని ఆర్డర్ వేశారు. వెంటనే హెలికాప్టర్ గాల్లోకి లేచి హుటాహుటిన హాస్పిటల్ వైపు ఎగిరింది. సోము, జెస్సీ తాము వచ్చిన కార్లో హాస్పిటల్ కి బయలుదేరారు. హెలికాప్టర్ లో తార దీపు చెంపమీద కొడుతూ, దీపు,,, ఒరేయ్ మావ,,, దీపు,,, అంటూ దీపుని స్పృహలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూనే ఉంది.
**********​

దినేష్ వర్మ ఇంటిదగ్గర.....

ఇంటి ముందు ఒక వ్యాన్ వచ్చి ఆగింది. అందులో నుంచి ఇద్దరు వ్యక్తులు ఒక బాడీని గేట్ ముందు విసిరేయగా వేగంగా వ్యాన్ ముందుకు కదిలి అక్కడినుంచి కనుమరుగయ్యింది. ఆ చప్పుడు విన్న వాచ్మెన్ వెంటనే తన కాబిన్లో నుంచి బయటికి వచ్చి గేట్ ఓపెన్ చేసి కింద పడిఉన్న ఆ బాడీ దగ్గరికి పరిగెత్తాడు. ఆ బాడీని తిరగేసి చూసి కంగారు పడుతూ, అయ్యా,, చిన్నయ్య గారు,,, అని పిలుస్తూ, ఒరేయ్ బాలు వెళ్లి పెద్దయ్య గారిని పిలుచుకొనిరా అని తనతో పాటు ఉన్న మరో గార్డుకి చెప్పి వెంటనే రాజేష్ వర్మ బాడీని భుజానికెత్తుకుని ఇంట్లోకి పరిగెత్తాడు. మరో గార్డు వెళ్లి లోపలికి విషయం చేరవేయడంతో ఇంట్లో అందరూ లేచి వచ్చి ఇల్లంతా కోలాహలంగా మారింది. దినేష్ వర్మతో సహా అందరూ హాల్ లోకి రాగా వాచ్ మెన్ రాజేష్ వర్మ బాడీని సోఫాలో పడుకోబెట్టాడు.

రాజేష్ వర్మని విగతజీవిగా పడి ఉండడం చూసి ఒక్క కార్తీక తప్ప అందరూ ఏడుస్తున్నారు. కార్తీక రాజేష్ వర్మ బాడీని చూసింది కానీ ఆ విషయంతో తనకు సంబంధం లేదు అన్నట్టు తిరిగి తన రూమ్ లోకి వెళ్ళిపోయింది. దినేష్ వర్మ మాట్లాడుతూ, ఒరేయ్ రాజేష్ ఏమైందిరా? లేవరా ఒరేయ్,,, వాచ్ మెన్ వెంటనే అంబులెన్స్ ని పిలవండి అని గట్టిగా చెప్పాడు. .... అయ్యా,, అది,, అది,, అని భయం భయంగా అన్నాడు వాచ్ మెన్. .... ఏంట్రా అది అది అని నీళ్లు నములుతున్నావు తొందరగా అంబులెన్స్ కి ఫోన్ చెయ్ అని గద్దించాడు దినేష్ వర్మ. .... అయ్యా అది,,, నేను నాడి పట్టుకుని చూశాను. ఆగిపోయి ఉందయ్యా,, గుండె కొట్టుకోవడం లేదు శ్వాస కూడా ఆగిపోయింది అని చెప్పాడు వాచ్మెన్. .... లేదు,,, అలా జరగడానికి వీల్లేదు అంటూ నాడి మరియు గుండె చెక్ చేసాడు దినేష్ వర్మ.

నో,,,,,,, రారారాజేష్,,,, ఎంత పని జరిగింది,, నన్ను వదిలేసి ఎందుకు పోయావురా??? అంటూ ఏడవడం మొదలుపెట్టాడు దినేష్ వర్మ. .... వెంటనే పవిత్ర ఏడుస్తూ రాజేష్ వర్మ బాడీని కదుపుతూ, నాన్న లెగు నాన్న,,, నాన్న ప్లీజ్ లెగు నాన్న,,, పెదనాన్న నాన్నని లేవమని చెప్పండి అంటూ బోరున ఏడవడం మొదలు పెట్టింది. మరోపక్క సుమతి రాజేష్ వర్మ కాళ్ళ దగ్గర కూర్చుని పాదాలకు తన తల ఆనించి బోరున విలపిస్తూ ఉంది. మరోపక్క కార్తీక తన రూమ్ లో, చివరికి బాబాయ్ కి తన కర్మఫలం ఇలా దక్కింది అన్నమాట. దీపుని చంపి ఆ తర్వాత మమ్మల్ని అందర్నీ కూడా చంపాలని అనుకున్నాడు. ఇదంతా కేవలం ఆస్తి కోసమా? ఇందులో బాబాయ్ కి తోడుగా ఉన్న వ్యక్తి ఎవరు? అంటే అమ్మ మరణం దగ్గర నుండి ఇంట్లో జరిగిన దారుణాలు అన్నిటికీ బాబాయి మరియు అతనికి తోడుగా ఉన్న వ్యక్తి కారణం కాదు కదా? కానీ దీపు నష్టజాతకుడు అని పండితులు చెప్పిన మాట వాస్తవం కదా? అని ఆలోచిస్తూ ఉంది.

ఇక్కడ హాల్లో పవిత్ర ఏడుస్తూ, ఉండండి నేను వెంటనే అన్నయ్యకి ఫోన్ చేసి చెప్తాను అని చెప్పి తన మొబైల్ తీసి దీపుకి కాల్ చేసింది. కానీ దీపు మొబైల్ స్విచ్ ఆఫ్ అని వస్తుండడంతో, అమ్మ అన్నయ్య ఫోన్ కూడా తగలడం లేదు అని చెప్పింది. ఆ మాట రూమ్ లో ఉన్న కార్తీకకు వినపడటంతో కార్తీక ఒళ్లు గగుర్పాటుకు గురైంది. .... కొంపతీసి బాబాయ్ అతని మిత్రుడు కలిసి దీపుని చంపేశారా? తర్వాత ఆ వ్యక్తి బాబాయ్ ని కూడా మోసం చేయలేదు కదా? నో,, అలా జరగడానికి వీల్లేదు అని అనుకుంటూ రూమ్ లో నుంచి పరిగెత్తుకొని బయటకు వచ్చి, బుజ్జి దీపు నెంబర్ నాకు ఇవ్వు నేను ట్రై చేస్తాను అని అడగగా పవిత్ర దీపు ఫోన్ నెంబర్ కార్తీకకి ఇచ్చింది. ఆ తర్వాత ఇద్దరూ చెరో వైపు నుంచి ఎంత ప్రయత్నించినా అటు నుంచి రెస్పాన్స్ లేకుండా పోయింది.

ఆ తర్వాత పవిత్ర ప్రీతికి కాల్ చేయగా కొంతసేపటి తర్వాత ప్రీతి కాల్ లిఫ్ట్ చేసింది. హలో ప్రీతి,,, అన్నయ్య నీ దగ్గర ఉన్నాడా? అని అడిగింది పవిత్ర. .... అన్నయ్య ఇంటికి రాలేదే? ఏం ఏమైంది? బహుశా అన్నయ్య అభి దగ్గర హాస్పిటల్లో ఉన్నాడేమో? అని అంది ప్రీతి. .... అన్నయ్యకి ఫోన్ చేస్తుంటే తగలడం లేదు నీ దగ్గర ఉన్నాడేమోనని చేశాను. ఏమైందో తెలియడం లేదు నాన్న కదలకుండా పడి ఉన్నారు అని ఏడ్చింది పవిత్ర. .... వెంటనే ప్రీతి కంగారుపడుతూ, సరే ఉండయితే నేను వెంటనే అను వదినకి గాని దేవి అక్కకు గాని ఫోన్ చేసి అన్నయ్య గురించి కనుక్కుంటాను అని చెప్పి పవిత్ర కాల్ కట్ చేసి అనుకి కాల్ చేసింది ప్రీతి. అటు నుంచి అను కాల్ లిఫ్ట్ చేయగానే, హలో అను,,, అన్నయ్య ఎక్కడున్నాడు? అని అడిగింది ప్రీతి.

ఏమో నాకు తెలీదు? సాయంత్రం హాస్పిటల్ నుంచి మమ్మల్ని ఇంటి దగ్గర దింపిన తర్వాత మళ్లీ నేను మాట్లాడలేదు. ఏం ఏమైంది? అని అడిగింది అను. .... అది,, పవిత్ర ఫోన్ చేసి అన్నయ్య గురించి అడిగింది. అన్నయ్యకు ఫోన్ చేస్తే కలవడం లేదని చెప్పింది అని అంది ప్రీతి. .... సరే అయితే ఉండు నేను కనుక్కుంటాను అని చెప్పి ప్రీతి కాల్ కట్ చేసి దీపు నంబర్ కి ట్రై చేసింది అను. కానీ దీపు ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తూ ఉండటంతో వెంటనే తారకి కాల్ చేసింది కానీ తార కాల్ లిఫ్ట్ చేయడం లేదు. ఎందుకంటే తార ఇప్పుడు దీపుతో కలిసి హాస్పిటల్ లో ఉంది. వెంటనే అను జెస్సీకి కాల్ చేసింది. అప్పుడే హాస్పిటల్ దగ్గరలోకి చేరుకుంటున్న జెస్సీ కారు డ్రైవింగ్ లో ఉండడం వల్ల సోము కాల్ లిఫ్ట్ చేశాడు.

హలో జెస్సీ,,, ఎక్కడున్నారు మీరంతా? అని అడిగింది అను. .... వెంటనే సోము మైక్రోఫోన్ మీద అడ్డుగా చెయ్యి పెట్టి, ఒరేయ్ జెస్సీ అను దగ్గర్నుంచి కాల్, మనమందరం ఎక్కడ ఉన్నాం అని అడుగుతుంది అని అన్నాడు సోము. .... అనుకి నిజం చెప్పకుండా ఎలా ఉండగలం? అని అన్నాడు జెస్సీ. .... అటునుంచి హలో జెస్సి,, హలో జెస్సీ,, అని రిపీట్ అవుతూ ఉండడంతో, హ హ,,, అను,,, నేను సోము మాట్లాడుతున్నాను, జెస్సీ డ్రైవింగ్ లో ఉన్నాడు అని అన్నాడు సోము. .... మీరంతా ఎక్కడున్నారు? దీపు ఎక్కడ,, తన ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది? అని అడిగింది అను. .... అను అది,,, ఏం జరిగిందంటే,,, ఎవరో దీపు మీద ఎటాక్ చేశారు. బాగా గాయపరిచి ఒక లోయలో పడేశారు. మేము అక్కడికి చేరుకొని దీపుని హాస్పిటల్ కి పంపించాము ఈ పాటికి హాస్పిటల్ కి చేరుకుని ఉంటారు. మరి కొద్ది నిమిషాలలో మేము కూడా అక్కడకి చేరుకుంటాము. నువ్వేమీ కంగారు పడొద్దు మేమున్నాముగా మేము చూసుకుంటాము అని అన్నాడు సోము.

ఏంటి???? ఏంటి నువ్వు చెప్పేది,,, నువ్వు చెప్పేది నిజమేనా?? అంటూ అను ఏడవడం మొదలు పెట్టింది. .... అను,,, చూడు అను,,, నువ్వు ఏడవద్దు. దీపుకి ఏం కాదు,,, నువ్వు కొంచెం ధైర్యంగా ఉండు అని చెప్పి సోము కాల్ కట్ చేసేసాడు. .... ఆ తర్వాత అను ప్రీతికి కాల్ చేసి మొత్తం విషయం చెప్పింది. ఆ తర్వాత ప్రీతి కూడా మొత్తం జరిగిన విషయాలు అన్నింటిని దీపక్ వర్మ మరియు కవితలతో చెప్పి తను కూడా ఏడవడం మొదలు పెట్టింది. ఇప్పుడు అందరి కుటుంబాల్లోనూ విషాద ఛాయలు అలముకున్నాయి. ఆ తర్వాత కొంత సేపటికి ప్రీతి పవిత్రకి కాల్ చేసి, పవిత్ర,,, అన్నయ్య ఇప్పుడు చావు బతుకుల మధ్య ఉన్నాడని తెలిసింది. ఎవరో అన్నయ్య మీద ఎటాక్ చేసి లోయలో పడేశారట అని ఏడుస్తూ చెప్పింది. .... అటు పవిత్ర ఫోన్ లో ఆ మాట వినగానే, ఏంటి???? అంటూ తన చేతిలో నుంచి ఫోన్ జారి పడిపోగా అలాగే మోకాళ్ళ మీద కుప్పకూలిపోయి బోరున ఏడవడం మొదలు పెట్టింది.

పక్కనే ఉన్న కార్తీక కంగారుపడుతూ, బుజ్జి,,,, ఏమైందే? అని అడిగింది. .... పవిత్ర ఏడుస్తూ, అక్కా,, అన్నయ్యని ఎవరో చంపడానికి ప్రయత్నించి బాగా కొట్టి లోయలో పడేశారట? అని చెప్పింది. .... వెంటనే కార్తీక కింద పడ్డ ఫోన్ అందుకుని లైన్లో ఉన్న ప్రీతిని అడగడంతో, ఇప్పుడు అన్నయ్య ఎక్కడ ఉన్నాడో తన ఫ్రెండ్స్ కి తప్ప ఎవరికీ తెలియదట, వాళ్లు అన్నయ్యని లోయలో నుంచి బయటకు తీశారు అని మాత్రం తెలిసింది అని చెప్పింది. .... ఆ మాట వినగానే కార్తీక కంట్లో నుంచి కూడా నీళ్లు జాలువారాయి. బహుశా చాలా సంవత్సరాల తర్వాత తన తమ్ముడు దీపు గురించి కార్తీక కంట్లో నుంచి కన్నీళ్లు రాలాయి. తన తమ్ముడు ఉన్న పరిస్థితికి దుఃఖం ముంచుకొచ్చి మౌనంగా రోదిస్తూ బోరున విలపిస్తున్న పవిత్రను దగ్గరకు తీసుకుని వాటేసుకుంది.

ఊరుకోరా బుజ్జి,,,, వాడికి ఏం కాదు,,, అంటూ కార్తీక పవిత్రను ఓదార్చే ప్రయత్నం చేస్తుంటే మరోపక్క సుమతి తీవ్రమైన మనస్థాపంతో రోదిస్తోంది. .... కొంతసేపటికి దినేష్ వర్మ మాట్లాడుతూ, నీకు రాజేష్ బాడీ ఎక్కడ దొరికింది? అని వాచ్ మెన్ ని అడిగాడు. .... అయ్యా అది,, మన గేట్ ముందరకి ఒక వ్యాన్ వచ్చి ఆగి అందులో నుంచి చిన్నయ్య గారి బాడీ విసిరేసి ఆ వ్యాన్ వేగంగా వెళ్ళిపోయింది. నేను దగ్గరికి వెళ్లి చూసిన తర్వాతే అది చిన్నయ్య గారి బాడీ అని తెలిసింది. ఆ తర్వాత జరిగింది అంతా మీకు తెలిసిందే అని అన్నాడు వాచ్మెన్. .... దినేష్ వర్మ కోపంతో రగిలిపోతూ, వెంటనే సెక్యూరిటీ ఆఫీసర్లకు ఫోన్ చేయండి. ఈ పని చేసినవాడు ఎవడో గానీ వాడిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఏమో,,, ఈ పని ఆ రాక్షసుడే చేసాడేమో? అని దీపుని ఉద్దేశించి అన్నాడు.

వెంటనే కార్తీక మాట్లాడుతూ, సారీ నాన్న,,,, మీరు తప్పుగా ఆలోచిస్తున్నారు. ఇప్పుడు దీపు కూడా చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. వాడి మీద అటాక్ చేసి చంపే ప్రయత్నంలో లోయలో పడేశారు. కానీ ఇక్కడ మీ తమ్ముడిని ఎవరో చంపి ఇంటిముందే పడేశారు. మీకు తెలియాల్సిన ఇంకో విషయం ఏమిటంటే,, దీపుని చంపాలనుకున్న వాళ్లలో మీ తమ్ముడు కూడా ఉన్నాడు అని అంది. .... ఆ మాట విని అక్కడ ఉన్న వాళ్లందరికీ షాక్ తగిలినట్టైంది. ఏంటి నువ్వు అనేది? నీకేమైనా పిచ్చి పట్టిందా పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నావ్? అని అన్నాడు దినేష్ వర్మ. .... నిన్న రాత్రి ఈయన గారు ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతూ దీపుని చంపడానికి ప్లాన్ చేయడం నేను స్వయంగా నా చెవులతో విన్నాను. రావే బుజ్జి ఇటువంటివారి కోసం మనం బాధ పడవలసిన అవసరం లేదు అంటూ పవిత్ర చెయ్యి పట్టుకొని తన రూం వైపు అడుగులు వేసింది కార్తీక.

మీ బాబాయ్ అటువంటి పని చేశాడు అనడానికి సాక్ష్యం ఏముంది? అని అడిగాడు దినేష్ వర్మ. .... కార్తీక వెనక్కి తిరిగి, ముందు మీరు రేపు మీ ప్రియమైన తమ్ముడికి అంత్యక్రియలు పూర్తి చేయండి. ఆ తర్వాత నేను సాక్ష్యాలు రుజువులు కూడా చూపిస్తాను అని చెప్పి పవిత్రని తీసుకొని తన రూమ్ లోకి వెళ్లి డోర్ క్లోజ్ చేసింది కార్తీక. ఇదంతా వింటూ మౌనంగా రోదిస్తూ కూర్చున్న సుమతి వైపు చూసి, ఏమైందో తెలియదు,, ఈ పిల్ల ఇలా ఎందుకు మాట్లాడుతుందో తెలియడం లేదు. నువ్వు దాని మాటలు ఏమి పట్టించుకోవద్దు సుమతి అని అన్నాడు దినేష్ వర్మ. .... లేదు బావగారు,,, కార్తీక నిజమే మాట్లాడుతుంది. ఆయనకు జడిసి ఇంతవరకు నేను ఈ ఇంట్లో ఏమీ మాట్లాడలేక పోయాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దీపు బాబుని చంపించడానికి ఎన్నో ప్రయత్నాలు జరిగాయి.

అవన్నీ మీ తమ్ముడు చేయించినవే. కానీ బిడ్డ అదృష్టం కొద్దీ ప్రతిసారి చావు నుంచి తప్పించుకుంటూ వచ్చాడు. ఒకసారి వాడికి తెలియకుండా నేనే కాపాడాను. ఆ విషయం ఆయనకు తెలియకుండా జాగ్రత్త పడ్డాను లేదంటే ఈ పాటికి నన్ను కూడా ఎప్పుడో చంపేసి ఉండేవాడు అని అంది సుమతి. .... ఏంటి సుమతి,,, నువ్వు కూడా ఇలా మాట్లాడుతున్నావేంటి? అని అన్నాడు దినేష్ వర్మ. .... అవును బావగారు నేను చెప్తుంది నిజం. ఆయనకు భార్యను కాబట్టి ఇప్పుడు నేను నా కర్మని తలుచుకుని ఏడవక తప్పటంలేదు. నా తలరాత అలా ఏడ్చింది అని చెప్పి పైకి లేచి సుమతి తన రూమ్ లోకి వెళ్ళిపోయి డోర్ క్లోజ్ చేసుకుని ఓ మూలన కూర్చుని బోరున ఏడవడం మొదలు పెట్టింది. ఇక ఆ హాల్లో మిగిలింది దినేష్ వర్మ మాత్రమే. రాజేష్ వర్మ బాడీని చూస్తూ, ఏంట్రా తమ్ముడు ఇదంతా? వీళ్ళు చెప్పేది నిజమా? నీకు ఆస్తులే కావాలనుకుంటే నన్ను ఒక్క మాట అడిగి ఉంటే సంతోషంగా ఇచ్చేవాణ్ణి కదరా? ఇదంతా ఎందుకు,,, ఇదంతా చేసి చివరికి నీకు మిగిలినది ఏమిటి? చచ్చావ్ కదరా? ఒరేయ్ పిచ్చోడా,,,, నీ కోసం కావాలంటే ప్రాణాలు కూడా ఇచ్చేవాడురా నీ అన్న. ఎందుకురా ఇలాంటి పని చేసి చచ్చావు అని బోరున విలపించాడు దినేష్ వర్మ. ....

కార్తీక రూమ్ లో పవిత్ర మాట్లాడుతూ, అక్క నేను వెంటనే అన్నయ్య దగ్గరికి వెళ్ళాలి అని ఏడుస్తూ అంది. .... ఉండు నేను కనుక్కుంటాను, ఇంతకీ ఎక్కడ ఉన్నాడు? తన ఫ్రెండ్స్ ఫోన్ నెంబర్స్ ఏమైనా తెలుసా నీకు? అని అడిగింది కార్తీక. .... లేదక్క,, నా దగ్గర నంబర్లు లేవు. .... సరేలే నేను ఏదో ఒక విధంగా కనుక్కుంటాను అని అంది కార్తీక. .... మరోపక్క అను తమ ఇంట్లో దేవిని వాటేసుకుని ఏడుస్తూ, ఏంటి వదిన ఇలా జరిగింది? దీపు ఎవరికి ఏ అన్యాయం చేశాడని ఇలా చేశారు. అందరికీ అన్ని మంచి చేస్తూ వస్తున్నాడు కదా అలాంటి వాడిని చంపడానికి ఎలా మనసొప్పుతుంది వాళ్ళకి అని ఏడుస్తుంది. .... ఊరుకో అను,,, ఊరుకో,, ఆ భగవంతుడు ఎలా రాసిపెట్టి ఉంటే అలాగే జరుగుతుంది. కానీ ఎన్నిసార్లు ప్రమాదంలో పడినా దానిని దాటుకొని మళ్లీ పైకి లేస్తున్నాడు దీపు. నువ్వేమీ బాధపడకు ఈసారి కూడా వాడు తప్పకుండా పైకి లేస్తాడు. వాడికి ఏమి కాదు అని తన మనసులోని బాధను నొక్కిపెట్టి అను ని ఓదార్చింది దేవి.

Next page: Episode 125.2
Previous page: Episode 124.2