Episode 126


నన్ను చంపిన శత్రువుకి తప్ప నేను హాస్పిటల్లో ఉన్నాను అన్న సంగతి దాదాపు అందరికీ తెలిసిపోయింది. కానీ సోము, జెస్సీ, తారలకు తప్ప నేను ఏ హాస్పిటల్లో ఉన్నానో ఎవరికీ తెలియదు. మా ఐబి ఏజెన్సీలో చాలా మంది ఏజెంట్లు నా మీద జరిగిన దాడి గురించి వాకబు చేసే పనిలో నిమగ్నమై ఉన్నారు. కానీ ఇంతవరకు ఎటువంటి ఆచూకీ కూడా దొరకలేదు. నా శ్రేయోభిలాషులు అందరూ నేను తిరిగి లేవాలని దేవుడిని ప్రార్థిస్తున్నారు. కానీ నేను మాత్రం దాదాపు రెండు రోజులుగా హాస్పిటల్ బెడ్ మీద శవమై పడి ఉన్నాను. బాడీ డీకంపోజ్ అయిపోయే ప్రమాదం ఉందని బాడీని తీసుకుని వెళ్లిపోవడమే బెటర్ అని డాక్టర్ కూడా చెప్పేశాడు. కానీ సోము, జెస్సీ, తారలు పట్టుబట్టడంతో ఇంతవరకు నా బాడీని అక్కడే ఉంచారు.
**********​

ఇక్కడ రాజేష్ వర్మ అంత్యక్రియలు జరిగిపోయాయి. ఆ కార్యక్రమానికి దీపు మేనత్త మామయ్య మరియు మేనమామ అత్తయ్య ఇంకా మరి కొంతమంది దగ్గర కుటుంబసభ్యులు హాజరయ్యారు. ఇప్పుడు కొంచెం వాళ్ళల్లో ముఖ్యమైన వారిని పరిచయం చేసుకుందాం. దీపు మేనత్త రాధిక వర్మ. స్వతహాగా ఈమె చాలా మంచి వ్యక్తి కాకపోతే కుటుంబసభ్యులు అందరిలాగానే దీపుని ద్వేషిస్తుంది. ఎందుకంటే ఆమెకు తన అన్న భార్య(వదిన) అంటే చాలా ఇష్టం. ఆమె భర్త హర్షవర్మ. అతనికి సొంతంగా ఒక బిజినెస్ ఉంది. వీరిద్దరికీ పద్దెనిమిదేళ్ల ఒక కుమార్తె ఉంది ఆమె పేరు దీప్తి వర్మ. చాలా చురుకుగా సరదాగా ఉండే అమ్మాయి. ఇకపోతే దీపు మేనమామ ఇతని పేరు జగదీష్ వర్మ. ఇతను కొంచెం గంభీరంగా ఉండే మనిషి అందరితో కలవడం చాలా తక్కువ. అతని భార్య గాయత్రి వర్మ. ఈమె చాలా సాత్వికురాలు ఎప్పుడు పూజలు వ్రతాలు చేసుకునే భక్తురాలు.

ఇప్పుడు దినేష్ వర్మ ఇంట్లో ఏం జరుగుతుందో చూద్దాం రండి.

దినేష్ వర్మ తన తమ్ముణ్ణి చంపినవారి గురించి తెలుసుకునే ప్రయత్నాలు ఒకపక్క జరుగుతూ ఉన్నాయి. అంత్యక్రియలు పూర్తయ్యి హాల్లో సోఫాలో కూర్చుని ఉన్నాడు. అతని పక్కనే అతని చెల్లి రాధిక వర్మ కూర్చొని, ఏంటన్నయ్య ఎంతసేపని ఇలా కూర్చొని ఉంటావు? అని అంది. .... ఏం చేయమంటావే రాధి? తమ్ముడు మనల్ని వదిలి వెళ్ళిపోయాడు. పోయినవాడు పోతూ పోతూ ఈ కుటుంబాన్ని నాశనం చేయడానికి పూనుకున్నది వాడే అన్న రహస్యం వదిలి వెళ్లిపోయాడు. అసలు వాడికి ఈ కుటుంబాన్ని నాశనం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? అసలు ఇదంతా ఎందుకు చేశాడు దేనికోసం చేశాడు? వాడు కూడా ఈ కుటుంబంలోని వ్యక్తే కదా? అని బాధపడుతూ అన్నాడు దినేష్ వర్మ.

ఏంటన్నయ్య నువ్వు కూడా,, తమ్ముడు గురించి తొందర పాటుగా మాట్లాడుతున్నావు. ఆ రాక్షసుడి(దీపు) నీడ కూడా ఈ కుటుంబం మీద పడకూడదు అని తమ్ముడు అనుకుని ఉండొచ్చు కదా? అని అంది రాధిక. .... వెంటనే కార్తీక మాట్లాడుతూ, ఇక ఈ అసందర్భ ప్రేలాపన ఆపు అత్త అని అంది. .... ఏంటే నోరు లేస్తుంది నీకంటే పెద్దదాన్ని నాతో మాట్లాడే పద్ధతి ఇదేనా? అని అంది రాధిక. .... నువ్వు ఎలా తీసుకున్నా నాకు అభ్యంతరం లేదు కానీ నేను మాత్రం సరిగ్గానే మాట్లాడుతున్నాను. నువ్వు ఎలాగైతే నా తమ్ముడు గురించి మాట్లాడుతున్నావో నేను కూడా నీ తమ్ముడు గురించి మాట్లాడతాను. .... అబ్బో తమ్ముడంట తమ్ముడు, నిన్నటిదాకా వాడి మీద పీకలదాకా విషం నింపుకుని ద్వేషించిన నీకు ఈ రోజు ఆ రాక్షసుడు మీద అంత ప్రేమ ఎక్కడ నుంచి పొంగుకొచ్చింది? అని అంది రాధిక.

ఎక్కడి నుంచి వచ్చిందా? నిన్నటిదాకా నీ తమ్ముడు మీరు అందరూ కలిసి నా కళ్ళకు గంతలు కట్టి నా బుర్రలోకి ఎక్కించినది విషం అని నిన్ననే తెలిసింది. ఇకపోతే బాబాయి చేసిన ఎదవ పనులు గురించి అంటావా,,, నా తమ్ముడు ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాడట వాడికి ఈపాటికి అన్నీ తెలిసే ఉంటాయి ఒక్కసారి వాడు లేచి బయటకు వస్తే అందరి బండారాలు బయటపడతాయి అని అంది కార్తీక. కార్తీక అన్న ఆ మాటలు విని ఆ ఇంటి ద్వారం దగ్గర నిల్చున్న ఒక వ్యక్తి కొంచెం కంగారు పడ్డాడు. సరిగ్గా అప్పుడే తార ఆ ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ సమయానికి అందరు కుటుంబ సభ్యులు అంటే కవిత, ప్రీతి, దీపక్ వర్మ, జగదీష్ వర్మ, గాయత్రి వర్మ( దీపు మేనమామ అత్తయ్య అంటే దేవి తల్లి తండ్రులు, కవిత అన్నయ్య వదినలు), రాధిక వర్మ, హర్ష వర్మ(దీపు మేనత్త, మావయ్య) సుమతి, పవిత్ర, కార్తీక, దేవి, అభి, అను, దీప్తి ఇంకా మరి కొంతమంది దూరపు బంధువులు కూడా అక్కడే ఉన్నారు.

కార్తీకగారు బహుశా ఇకమీదట దీపు ఎప్పటికీ తిరిగి రాకపోవచ్చు అని అంది తార. తార మాట విన్న అక్కడున్న అందరూ హఠాత్తుగా ఉలిక్కిపడి బిత్తరపోయారు. వెంటనే ప్రీతి, ఏంటి మీరు అనేది? అని అంది. .... అంటే దీపుని కొట్టి ఆ లోయలో పడేసినప్పుడే చనిపోయి ఉంటాడని తెలిసింది అని అంది తార. ఆ మాట వింటూనే అను కుప్పకూలిపోయింది. మరో పక్క కవిత కూడా బోరున విలపిస్తూ కింద పడిపోయింది. ప్రీతి పవిత్ర కూడా ఏడవడం మొదలు పెట్టారు. సుమతి కూడా దుఃఖంతో మౌనంగా రోదిస్తుంది. దీపు మేనత్త కూతురు దీప్తి కూడా ఏడుస్తుంది. కానీ అక్కడున్న వారందరిలో ఇద్దరి మొహంలో మాత్రం కొంచెం సంతోషం కనబడింది. ఒకరు ఇంతకు ముందు ద్వారం దగ్గర నుంచుని కంగారుపడిన వ్యక్తి కాగా మరొకరు దీపుని ఇంకా అంతే ద్వేషంతో చూస్తున్న మేనత్త రాధిక.

ఈ వార్త విని దుఃఖంలో ఉన్న అభి, దేవి తమను తాము సంభాళించుకుంటూ కుప్పకూలిపోయిన అను మొహం మీద నీళ్లు జల్లగ అను తెలివి తెచ్చుకుని లేచి వెళ్లి తార ఎదురుగా నిల్చుని ఏడుస్తూ, అయితే ఆ రోజు దీపు బతికే ఉన్నాడని నాకు అబద్ధం ఎందుకు చెప్పావు? మా అందరినీ ఎందుకు మోసపుచ్చావు? అని అడిగింది. .... ఎందుకంటే ఇంతకు ముందు లాగే దీపు మళ్లీ మృత్యువును జయించి తిరిగి లేస్తాడని మేము నమ్మకంగా ఉన్నాము. కానీ ఇప్పుడు సమయం మించిపోయింది బాడీ డీకంపోజ్ అయిపోతుందని డాక్టర్ తేల్చి చెప్పేశారు. దీపు బాడీ రేపు మీ దగ్గరకు చేరుతుంది అని చెప్పింది తార. ఈ వార్త విన్న తర్వాత అక్కడున్న ఇద్దరు ముగ్గురు తప్పితే అందరూ దుఃఖసాగరంలో మునిగిపోయారు.

నా దీపు ఇప్పుడు ఎక్కడున్నాడు? నేను వెంటనే నా దీపు దగ్గరికి వెళ్ళాలి అని అంది అను. ప్రీతి, పవిత్ర, కార్తీక కూడా మేము వెంటనే దీపుని చూడాలి అని అన్నారు. .... సారీ,,, మేము మిమ్మల్ని అక్కడికి తీసుకొని వెళ్ళకూడదు. రేపు పొద్దున్న దీపు బాడీని అప్పగిస్తారు అంతవరకు మీరు వెయిట్ చేయక తప్పదు అని చెప్పి తార అక్కడ్నుంచి వెళ్ళిపోయింది. అప్పుడు రాధిక మాట్లాడుతూ, ఏంటి అందరూ ఆ రాక్షసుడి కోసం తెగ బాధపడిపోతున్నారు, పోయింది ఆ నష్టజాతకుడే కదా పోతే పోనీయండి ఈ ఇంటికి పట్టిన దరిద్రం ఒదిలిపొయింది అని అంది. .... వెంటనే కవిత ఓపిక తెచ్చుకొని పైకి లేచి రౌద్రరూపం దాల్చి రాధిక దగ్గరకు వెళ్లి లాగిపెట్టి చెంప చెళ్ళుమనిపించింది. అంతలో కార్తీక కూడా వారి దగ్గరకు చేరుకుని, ఈపైన తమ్ముడు గురించి అనవసరంగా ఒక్క ముక్క మాట్లాడిన చిన్న పెద్ద అనే అంతరం మర్చిపోతాను జాగ్రత్త అత్త అని రాధికకి గట్టిగా వార్నింగ్ ఇచ్చింది కార్తీక. దాంతో రాధిక అక్కడి నుంచి లేచి కాళ్లు నేలకేసి కొట్టి రుసరుసలాడుతూ రూమ్ లోకి వెళ్ళిపోయింది. ఆ తర్వాత అక్కడ ఉన్న వారందరూ ఒకరినొకరు ఓదార్చుకుంటున్నారు.

అక్కడున్న దీపు శ్రేయోభిలాషులు అందరికీ చనిపోయి అంత్యక్రియలు జరిగిన రాజేష్ వర్మ మరణం కంటే దీపు మరణవార్త ఎక్కువగా బాధించింది. ఆ రోజు రాత్రంతా ఎవరూ భోజనాలు చెయ్యకుండా ఏడుస్తూ గడిపారు. మరుసటి రోజు మధ్యాన్నానికి దీపు బాడీని తన రూమ్ దగ్గరికి తీసుకు వచ్చామని కాల్ చేసి అందరికీ సమాచారం అందించింది తార. దీపు పూర్తి స్థాయి సభ్యత్వం ఉన్న ఏజెంట్ కాకపోవడంతో డిపార్ట్మెంట్ నుంచి ఎవరూ హాజరు కాకూడదని, అధికార లాంఛనాలు ప్రకారం ఏమి చేయకూడదని అందువలన అంతా మీరే దగ్గరుండి చూసుకోండి అని చీఫ్ చెప్పగా అందుకు సోము, జెస్సీ, తార సరేనని చెప్పి దీపు బాడీని తీసుకొని వచ్చారు. వచ్చిన వెంటనే దహనసంస్కారాలు కోసం ఏర్పాట్లు మొదలుపెట్టి దీపు బాడీకి స్నానం చేయించి కొత్తబట్టలు చుట్టారు.

అంతలో కుటుంబ సభ్యులైన దీపు శ్రేయోభిలాషులు అందరూ వర్క్ స్టేషనులో ఉంచిన దీపు బాడీ దగ్గరకు చేరుకున్నారు. దీపక్ వర్మ, కవిత, ప్రీతి, పవిత్ర, సుమతి, దేవి, అభి, హర్ష వర్మ(రాధిక భర్త), దీప్తి, కార్తీక కూడా అందరితో పాటు వచ్చింది. కార్తీక దీపు బాడీని చూస్తూనే గోడకి ఆనుకుని నేల మీద కూర్చుండిపోయి దుఃఖంతో రోదిస్తూ ఉంది. దీప్తి కార్తీకని పట్టుకొని పక్కనే కూర్చుని ఏడుస్తుంది. ప్రీతి, పవిత్ర, అను, దేవి బాడీ దగ్గరకు వెళ్లబోతుంటే వద్దని వారించి పక్కన కూర్చోబెట్టాడు జెస్సీ. కానీ కవితను మాత్రం ఆపలేకపోయారు. కవిత దీపు మొహం దగ్గర కూర్చుని నెత్తి కొట్టుకుంటూ హృదయవిదారకంగా ఏడుస్తుంటే దీపక్ వర్మ ఆమెను సముదాయిస్తూ పక్కనే కూర్చున్నాడు. సుమతి కూడ మరోవైపు కూర్చొని ఏడుస్తూ ఉంది. కొంత సమయం గడిచేసరికి ఏర్పాట్లన్నీ పూర్తి చేసి దీపు బాడీని పాడె ఎక్కించి జెస్సీ, సోము మరియు దీపక్ వర్మ, హర్ష వర్మ నలుగురు మోస్తూ స్మశానానికి బయలుదేరారు.

దాదాపు ఒక ఇరవై నిమిషాల తర్వాత స్మశానానికి చేరుకొని దీపు బాడీని అక్కడ ఆల్రెడీ సిద్ధం చేసి ఉంచిన చితి మీదకు చేర్చారు. ఆ తర్వాత అందరూ చివరిసారిగా ఒకసారి చూసి జరగవలసిన కార్యక్రమాలు అన్నీ జరిపించి చివరిగా జెస్సీ మరియు సోముల కోరిక మేరకు దీపక్ వర్మ తో పాటు తాము మరియు అభి, హర్ష వర్మ అందరూ కలిసి చితికి నిప్పంటించారు. నెమ్మదిగా నిప్పు రాజుకుని చుట్టూ ఉన్న కర్రలకు మంట అంటుకోవడం మొదలైంది.

***యమలోకపు సింహద్వారాన్ని ముందుగా దాటిన నాకు పెద్ద వెలుగు కనిపించి ఆ తర్వాత అంతా చీకటిగా మారి ఏమీ కనబడటం లేదు. నాతో పాటు వస్తున్న రవి కూడా కనబడలేదు. కానీ నా ఒంటికి బాగా వేడిగా అనిపిస్తుంది. రానురాను ఆ వేడి పెరుగుతోంది. ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. రవి కనబడటం లేదన్న కంగారుతో, రవి,,, ఒరేయ్ రవి,, ఎక్కడున్నావురా? నాకు ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు? నా ఒళ్ళంతా వేడిగా అయిపోతుంది. ఒరేయ్ రవి,,, ఎక్కడున్నావురా? అని అరుస్తున్నాను. అంతలో హ్హహ్హహ్హహ్హహ్హహ్హ,,, అని పెద్దపెట్టున రవి నవ్వు వినపడటంతో, ఏంట్రా అలా నవ్వుతున్నావు? అసలు నువ్వు ఎక్కడున్నావు, నాకు ఏమీ కనపడటం లేదు? అని కంగారుగా అడిగాను. .... ఓరి నీ అయ్యా,,, ఇంకెక్కడ రవి రా? నేను ఇక్కడే ఉండిపోయాను. కానీ నువ్వు మాత్రం తొందరగా లేచి పరిగెత్తకపోతే నీకు నీ బాడీ దక్కదు. ఆ తర్వాత నువ్వు కూడా శాశ్వతంగా తిరిగి మళ్ళీ నా దగ్గరకు రావాల్సిందే అని వెటకారంగా ఆకాశవాణి వినబడింది. .... అంటే ఇప్పుడు నేను,,,,,, అని ఆగిపోయి వెంటనే కళ్ళు తెరిచేసరికి దాదాపు చీకటి పడే సమయం ముందు సాయంత్రపు నీలి ఆకాశం కనబడుతోంది.***

అప్పటికే నేను నా శరీరంలోకి చేరిపోయి తగలపడటానికి సిద్ధంగా ఉన్నాను అన్న ఆలోచన రావడంతోనే ఒక్క ఉదుటున లేచి కూర్చున్నాను. అది చూసిన అక్కడివారంతా ఆశ్చర్యపోయి విస్మయానికి గురయ్యారు బహుశా భయపడి ఉండొచ్చు. నేను ఏ మాత్రం లేట్ చేయకుండా చితి మీద నుంచి కిందకి దూకి కొద్ది దూరంలో ఉన్న నీళ్లకుంట వైపు పరుగు తీసి అందులో దూకాను. జరిగిన హఠాత్పరిణామానికి షాక్ అయ్యి కొంచెం భయపడినా నేను లేచానన్న విషయం గ్రహించి కొంత కుదుటపడ్డారు కానీ ఇంకా ఆశ్చర్యంతో అలాగే చూస్తూ ఉండిపోయారు. నీట్లో మూడు మునకలు వేసిన నేను అంతా చల్లబడటంతో పైకి లేచి చూస్తూ, హమ్మయ్య బతికిపోయాను అని మనసులో అనుకొని, ఒరేయ్ ఏంట్రా ఇది,,, నేను బతికుండగానే కాల్చేద్దామని అనుకుంటున్నారా? అని అన్నాను.

ఆ తర్వాత ఆ నీటి కుంటలో నుంచి పైకి రావడానికి ప్రయత్నిస్తుంటే రెండు చేతులు నా ముందుకు వచ్చాయి. నేను తల పైకెత్తి చూడగా జెస్సీ మరియు సోము కనబడ్డారు. అందరికంటే ముందు ఆశ్చర్యం నుంచి తేరుకున్న జెస్సీ మరియు సోము ముందుకు వచ్చి నాకు చేతులు అందించి నా చేతులను పట్టుకుని పైకి లాగారు. నేను పైకి చేరుకున్న వెంటనే ఇద్దరూ కలిసి నన్ను గట్టిగా హగ్ చేసుకున్నారు. ముందుగా జెస్సీ కన్నీళ్లు కారుస్తూనే, అయితే ఈసారి కూడా మా ఫ్రెండ్ మృత్యువును జయించేశాడన్నమాట అని అన్నాడు. .... నిజంరా బాబు,, నువ్వు చచ్చి మమ్మల్నందరినీ చంపేసావు కదరా?? అని అన్నాడు సోము. .... మీరు మాత్రం నన్ను చితి మీదకు ఎక్కించి చంపేసినంత పని చేశారు కదరా బాబు అని అన్నాను.

నువ్వు దొరికిన రోజునే చచ్చిపోయావు అని డాక్టర్ చెప్పేశాడు. దాదాపు రెండు రోజులు బెడ్ మీద శవంలాగా పడి ఉండేసరికి ఇక నువ్వు లేచి రావేమో అని అనుకున్నాము. నీ బాడీ డీకంపోజ్ అయిపోతుంది తీసుకెళ్లి మిగిలిన కార్యక్రమాలు చూసుకోండి అని డాక్టర్ చెబితే ఇక మేం చేయగలిగేది ఏముంది? అని అన్నాడు జెస్సీ. .... అయినా ఏమాటకామాటే చెప్పుకోవాలి, బుల్లెట్లు తగిలించుకొని లోయలో పడి అన్ని దెబ్బలు తగిలించుకున్న తర్వాత కూడా బలే లేచి పరిగెత్తావురా నువ్వు అని అన్నాడు సోము. .... అప్పటికిగాని నాకు కూడా ఆ విషయాలు గుర్తుకు రావడంతో ఒకసారి నా ఒంటి మీద ఉన్న ప్లాస్టర్లు చూసుకోగా కొంచెం నొప్పిగా చురుక్కు చురుక్కుమన్నాయి. వెంటనే నాకు ఇంతకు ముందు యమలోకపు సీన్ గుర్తుకు వచ్చింది. కానీ అది నిజంగా జరిగిందా లేదా అని అయోమయంలో పడి, అవును,,,, నానానాక్కూడా,, అఅఅదే,,, ఆశ్చర్యంగా ఉంది,,, అని మాట దాటవేశాను.

ఆ తరువాత నేను అక్కడ నుంచి ఒక అడుగు ముందుకు వేయగా జెస్సీ, సోముల తర్వాత అందరికంటే ముందు తేరుకున్న అమ్మ నా వైపు పరిగెత్తుకుంటూ రావడం చూసి జెస్సీ, సోము పక్కకు వెళ్ళిపోయారు. అమ్మ పరిగెత్తుకుంటూ వచ్చి గొంతు పెగలక ఏడుస్తూ నన్ను గట్టిగా వాటేసుకుంది. అమ్మను ఆ స్థితిలో చూడగానే నామీద నాకే కోపం వచ్చి అమ్మ నన్ను గట్టిగా హత్తుకొని ఏడుస్తూ ఉంటే నుదుటి మీద ముద్దు పెట్టాను. ఆ తర్వాత నన్ను నేను సంభాళించుకుని, సారీ పిన్ని,,,, అని అన్నాను. .... వెంటనే అమ్మ నా నుంచి కొంచెం దూరం జరిగి ఆశ్చర్యంగా నా వైపు చూస్తూ, ఏమన్నావు ఇప్పుడు నువ్వు? నన్ను పిన్ని అని పిలిచావు కదా? అంటే నీకు???? అంటూ ఆగిపోయింది. .... అవును నాకు నిజం తెలిసింది. అలాగే మరొక నిజం మీ అందరికీ తెలియాల్సి ఉంది. తొందర్లోనే ఆ విషయాన్ని మీ అందరి ముందుకు తీసుకు వస్తాను.

ఆమాట అంటూనే మళ్లీ కళ్ళమ్మట నీళ్ళు జారగా, నువ్వు నా పిన్నివి అన్న నిజం దాచి ఇంత కాలం ఎందుకు అంత కష్టపడ్డావు అమ్మ? అని అడిగాను. .... కానీ అమ్మ నా నుంచి అటువంటి ప్రశ్న కాకుండా మరింకేదో ఎక్స్పెక్ట్ చేసినట్టు ఒక ఎక్స్ప్రెషన్ పెట్టి అంతలోనే మళ్ళీ మామూలు అయిపోతూ, కొన్ని విషయాలు ఏ సమయంలో తెలియాలో ఆ సమయంలోనే తెలిస్తే మంచిది నాన్న. ఆ విషయం నేను నీకు ముందే చెప్పి ఉంటే ఆ కుటుంబం ఈపాటికి నీకు ఏ గతి పట్టించి ఉండేదో నేను నీకు చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను? అని అంది అమ్మ. .... నేను అవునన్నట్టు తల ఊపుతూ, మ్,,,నాకు తెలుసు,,,, కానీ నువ్వు ఎప్పటికీ అమ్మవే అని అనగానే అమ్మ నన్ను గట్టిగా కౌగలించుకొని ఏడుస్తూ చుట్టూ అందరూ ఉన్నారన్న విషయాన్ని పట్టించుకకుండా ఒక మూతిముద్దు పెట్టుకొని వదిలింది. బహుశా అప్పుడున్న పరిస్థితికి ఆ విషయాన్ని ఎవరూ పెద్ద సీరియస్ గా చూసి ఉండరు.

అమ్మను వదిలి నా వైపు ఆశ్చర్యంగా చూస్తూ నిల్చున్న నా బంగారం మరియు బుజ్జమ్మలను చూసి చేతులు రెండూ చాచి నిల్చున్నాను. వెంటనే ప్రీతి, పవిత్ర పరిగెత్తుకుంటూ వచ్చి నన్ను గట్టిగా వాటేసుకొని ఏడుస్తున్నారు. నో నో నో,, ఎందుకు ఏడుస్తున్నార్రా? నో ఏడవకండి ఇప్పుడు నేను బాగానే ఉన్నాను కదా? అని అన్నాను. .... పో అన్నయ్య,, ఇలా ఎవరైనా చేస్తారా? అని అంది ప్రీతి. .... నువ్వు లేకపోతే మా పరిస్థితి ఏంటో ఒక్కసారైనా ఆలోచించావారా నువ్వు అని అంది పవిత్ర. .... మిమ్మల్ని వదిలేసి ఎక్కడికి పోతానురా బంగారం సరే ఇక ఏడవడం ఆపండి అని వాళ్ళిద్దర్నీ ఊరడించాను. అక్కడి నుంచి ముందుకు వెళ్ళి ముందుగా దీపక్ అంకుల్ ని కలిసాను. మొట్టమొదటిసారి అంకుల్ కళ్ళు నీళ్ళు తిరగడం చూశాను. అంకుల్ ని అలా చూడగానే నా కళ్ళమ్మట కూడా నీళ్లు తిరిగాయి.

ఇద్దరం ఒకేసారి ముందుకు కదిలి హగ్ చేసుకున్నాము. ఇద్దరం ఏమీ మాట్లాడుకోలేదు కానీ ఒకరి వీపు ఒకరు తట్టుకుంటూ ఓదార్చుకున్నాము. ఆ తర్వాత నేను అభి, దేవి అక్క దగ్గరకు వెళ్లగా ఇద్దరూ ఒకేసారి నన్ను కౌగిలించుకుని ఏడ్చారు. మా ప్రాణాన్ని ఆ దేవుడు మా నుంచి దూరంగా తీసుకెళ్ళిపోయాడు అనుకున్నామురా తమ్ముడు అని అంది దేవి అక్క. .... ఇప్పుడు మళ్లీ పంపించేశాడుగా ఊరుకో అక్క, అభి నువ్వు కూడానా,, యు ఆర్ ఎ స్ట్రాంగ్ మాన్,, అని ఇద్దర్ని సముదాయించాను. ఆ తర్వాత పక్కనే ఉన్న అను దగ్గరికి వెళ్లాను. హాయ్ మై లవ్లీ ఏంజెల్,,, అని అన్నాను. .... వెంటనే నా చెంప మీద ఫట్,, అని సౌండ్. అవును అను నా చెంపమీద కొట్టి, పో,, ఐ హేట్ యు,,, ఎవరైనా ఇలా చేస్తారా? నా ప్రాణాలు పోయినంత పని చేశావు. అదే జరిగుంటే ఇప్పుడు నువ్వు లేచి వచ్చినా నేను ఉండేదాన్ని కాను అని ఏడుస్తూ నన్ను గట్టిగా కౌగిలించుకొని కొట్టిన చెంప మీద ముద్దు పెట్టింది.

సారీ మై డార్లింగ్,,, ఇది కావాలని ప్లాన్ చేసిన పని కాదు. కొన్ని కొన్ని అలా జరిగిపోతూవుంటాయి అంతే, ఈసారికి నన్ను క్షమించెయ్ అని సరదాగా అన్నాను. అంతలో దేవి అక్క, ప్రీతి మరియు పవిత్ర వచ్చి మా ఇద్దరితో పాటు గ్రూప్ హగ్ చేసుకున్నారు. వారందరి మధ్య నలిగిపోతున్న నేను, సరే సరే ఇక చాలు, అవునూ కార్తీక అక్క పక్కన నిల్చున్న ఆ అమ్మాయి ఎవరు? నాకు బాగా తెలిసిన అమ్మాయి లాగా ఉందే? అని అన్నాను. .... వెంటనే అను ఎవరికీ తెలియకుండా నా నడుము గిల్లింది. అది దీప్తి అక్క, అత్తయ్య వాళ్ళ కూతురు అని చెప్పింది పవిత్ర. .... అక్క నా పర్మిషన్ కోసం వెయిట్ చేస్తున్నట్టు చూస్తుంటే కొంచెం జాలిగా అనిపించింది. వెంటనే రెండు చేతులు చాచి రమ్మన్నట్టు సైగ చేయగా వెంటనే కార్తీక అక్క, దీప్తి ఇద్దరు వచ్చి నన్ను కౌగిలించుకున్నారు.

నన్ను క్షమించరా తమ్ముడు. అందరి చెప్పుడు మాటలు విని నా తమ్ముడిని ఒక శత్రువు లాగా చూశాను. నిన్ను ఎన్నోసార్లు ఘోరంగా అవమానించాను. నిన్ను ఎంత నీచంగా అవమానించానో తలుచుకుంటుంటే నామీద నాకే అసహ్యం వేస్తుంది. ప్లీజ్,, నన్ను క్షమించరా దీపు అని ఏడ్చింది అక్క. .... ఊరుకో అక్క,, జరిగిందేదో జరిగిపోయింది ఇంక ఏడవకు. దీపు నువ్వు కూడా ఏడవకు అని దీప్తితో అన్నాను. .... దీప్తి నావైపు చూసి, ఎలా ఏడవకుండా ఉండాలి? ఎప్పుడో చిన్నప్పుడు నీతో ఆడుకున్నాను. ఇప్పుడు మళ్లీ నీ గురించి ఇలాంటి వార్త వినాల్సి వచ్చింది. ఏడుపు రాక ఇంకేం వస్తుంది అని అంది. .... ఒసేయ్ పిచ్చి,, నేను ఎక్కడికి వెళ్ళాను ఇదిగో ఇక్కడే మీ ముందు బతికే ఉన్నాను కదా అని వాళ్ళిద్దరినీ సముదాయించి ఇదంతా చూస్తూ నిల్చున్న తార దగ్గరకు వెళ్లాను.

నేను దగ్గరకు వెళ్ళేసరికి తార కంట్లో నుంచి నీళ్లు కారిపోతున్నాయి. హహహ,, ఏంటి మా ఆడపులి కంట్లో నుంచి నీళ్లా? అవునే నువ్వేంటి వాళ్ళిద్దరితో పాటు అక్కడికి పరిగెత్తుకుని రాకుండా ఇక్కడే ఉండిపొయావు, దెయ్యం అయిపొయానని భయపడ్డావా? అని సరదాగా అన్నాను. .... నీయబ్బ,, నీకు ఆటలుగా ఉందారా? అంటూ నా భుజం మీద ఒక పిడుగుద్దు గుద్ది వెంటనే నన్ను గట్టిగా చుట్టేసి, భయపెట్టేసావు కదరా అని అంది. .... ఎప్పుడూ తార కళ్ళల్లో నీళ్ళు చూడని నాకు తారను అలా చూసేసరికి కొంచెం బాధగా అనిపించింది. తనను కూడా సముదాయించి ఇంకా మిగిలిన మామయ్య హర్షవర్మ గారిని కలిసి చివరిగా సుమతి పిన్ని దగ్గరకు వెళ్లాను. పిన్ని నుదుట బొట్టు లేకపోవడంతో బాబాయ్ చనిపోయాడు అన్న విషయం నాకు అర్ధమైపోయింది. కన్నా,,,,, అంటూ పిన్ని అమాంతం నన్ను కౌగిలించుకుని వెక్కి వెక్కి ఏడుస్తుంది. .... సారీ పిన్ని,,, జరిగిందేమిటో నేను ఊహించగలను అని చెప్పి తనను కూడా ఓదార్చాను.

ఆ తర్వాత నేను అందరినీ ఉద్దేశించి మాట్లాడుతూ, ఇప్పుడు నేను చెప్పే విషయం కొంచెం జాగ్రత్తగా ఆలకించండి. ఇప్పుడు నేను బతికి ఉన్నాను అన్న విషయం కేవలం ఇక్కడ ఉన్న మీకు మాత్రమే తెలుసు. మీరందరూ ఈ విషయాన్ని రహస్యంగా ఉంచాలి. మీకు తప్ప నేను బ్రతికి ఉన్నాను అన్న విషయం ఇంకెవరికీ తెలియకూడదు. ఎందుకంటే రానున్న కొద్ది రోజుల్లో నేను చేయవలసిన కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు ఉన్నాయి. ఆ పనులు పూర్తయిన వెంటనే నేను బ్రతికే ఉన్నాను అన్న సంగతి అందరికీ నేనే తెలియపరుస్తాను అని అన్నాను. .... వెంటనే అమ్మ కంగారు పడుతూ నా దగ్గరికి వచ్చి, ఏంటి నాన్న ఇది,, ఈ విషయాన్ని ఎందుకు రహస్యంగా ఉంచాలి? అని అడిగింది. .... ఈ విషయం కొంచెం గంభీరమైనది ఆ విషయం మీరు గుర్తుపెట్టుకుని సమయం వచ్చే వరకు కొంచెం వేచిచూడాల్సిందే. ఇంతకుముందు నేను లేవనంతవరకు మీరందరూ ఎలా ఉన్నారో మళ్లీ నేను మీకు కనబడేవరకు అలాగే వ్యవహరించండి.

ఇప్పుడు మీరు ఎవరు ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్లిపోండి. నేను చనిపోయినట్టుగానే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి వచ్చినట్టుగానే వ్యవహరించండి. వీడేంటి ఇలా మాట్లాడుతున్నాడు అని మీరు అనవసరంగా ఆలోచించి బుర్రలు పాడు చేసుకోవద్దు. దయచేసి మీరు అందరూ ఈ మాట విని ఆచరిస్తారని ఆశిస్తున్నాను అని అన్నాను. వెంటనే అందరూ సరే అని హామీ ఇచ్చారు. అక్కడ ఉన్న వాళ్ళలో కొత్త వ్యక్తులు అయిన మామయ్య హర్షవర్మ నా దగ్గరికి వచ్చి, నిన్ను చూస్తే గర్వంగా ఉందిరా దీపు బాబు. నా ఫుల్ సపోర్ట్ నీకు ఉంటుంది. నువ్వు చెప్పే ఆ సమయం కోసం మేమందరం ఎదురు చూస్తాము నువ్వు నిర్భయంగా ఉండు అని చేతిలో చెయ్యి పెట్టి హామీ ఇచ్చాడు. .... థాంక్స్ మావయ్య గారు అని అతనిని హగ్ చేసుకున్నాను.

ఆ తర్వాత నా టీం సభ్యులు వైపు చూసి, గయ్స్ పదండి మనం వెళ్ళాలి అని చెప్పి అక్కడి నుంచి ముందుకు కదిలాను. నన్ను స్మశానానికి తీసుకు వచ్చేటప్పుడు తార, కార్తీక అక్క, ప్రీతి కార్లు తీసుకొని వచ్చారు. మేము మా కార్ దగ్గరికి వెళ్లగా నా వెనుక అను అమ్మ చేయి పట్టుకుని తీసుకుని వచ్చి కార్లో ఎక్కుతున్న నన్ను ఆపి, నువ్వు ఇలా వెళ్లడానికి నేను ఒప్పుకోను నన్ను కూడా తీసుకొని వెళ్ళు, ఆంటీ నన్ను తనతో పాటు తీసుకు వెళ్ళమని మీరైనా చెప్పండి అని అమ్మతో అంది. .... ఏం చెప్పాలో తెలీక అమ్మ నా వైపు చూసింది. .... నేను ఒక చిన్న నవ్వు నవ్వి అను ని దగ్గరకు తీసుకుని నుదుటి మీద ముద్దు పెట్టి, నువ్వు కూడా నాతో పాటు వస్తే అక్కడ అభి, అక్క దగ్గర ఎవరుంటారు? ప్లీజ్,, పరిస్థితిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. ఈసారి తప్పకుండా తిరిగి వస్తాను జీవితాంతం నీతోనే ఉంటాను. అంతవరకు కొంచెం జాగ్రత్తగా ఉండండి అవసరం అనుకుంటే నాకు కాల్ చేయండి అని చెప్పి అమ్మకి నుదుటి మీద ముద్దు పెట్టి అనుకి బుగ్గ మీద ముద్దు పెట్టి కార్ లో కూర్చున్నాను. అప్పటికే అక్కడ ఉన్న కాటికాపరితో ఈ విషయాన్ని ఎవరికీ తెలియకుండా ఉండాలి అని కొంత డబ్బు ఇచ్చి డీల్ సెట్ చేసుకుని వచ్చిన జెస్సి కారుని ముందుకు ఉరికించాడు.

Next page: Episode 127.1
Previous page: Episode 125.2