Episode 127.1


దినేష్ వర్మ ఇంటిదగ్గర...........

దీపు చెప్పినట్టే అంతిమ సంస్కారాలు ముగించి విషాద వదనాలతో నటిస్తూ సుమతి, కార్తీక, పవిత్ర, దీప్తి మరియు హర్షవర్మ ఇంట్లోకి ఎంటర్ అయ్యారు. వాళ్లు లోపలికి రాగానే రాధిక మాట్లాడటం మొదలు పెట్టింది. అయ్యగారి అంతిమ సంస్కారాలు పూర్తి చేసి వచ్చారా? ఆ రాక్షసుడి మీద తెగ ప్రేమ పొంగుకొచ్చింది అని నిష్టూరంగా మాట్లాడింది. .... ఇక చాలు ఆపు ఇంకొక్క మాట మాట్లాడావంటే మర్యాదగా ఉండదు. బుజ్జి, దీప్తి, పిన్ని మీరు లోపలికి పదండి అని అంది కార్తిక. .... ఆ ఆ,,, వెళ్లండి వెళ్లండి ఆ నష్టజాతకుడు పోయినందుకు అందరూ కలిసి కట్టకట్టుకుని ఏడవండి. కానీ నా కూతుర్ని మాత్రం వదిలేయండి దాన్ని మీలాగా తయారు చేయకండి అర్థమైందా? దీప్తి నువ్వు ఇటు రా అని అంది రాధిక. .... వెంటనే హర్షవర్మ మాట్లాడుతూ, ఏం అవసరం లేదు దీప్తి తల్లి నువ్వు అక్క వాళ్ళతో కలిసి లోపలికి వెళ్ళు దీని మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఒసేయ్ కర్కశురాల నీకు ఇదే చెబుతున్నాను నా కూతుర్ని నీలాగా తయారుచేయడానికి ప్రయత్నించవద్దు అర్థమైందా? అని గట్టిగా మందలించాడు. .... బాబు కూతుర్లు ఇద్దరూ కలిసి ఎలాగో తగలడండి అని చిర్రుబుర్రులాడుతూ లోపలికి వెళ్ళిపోయింది రాధిక.
**********​

కార్లో వెళుతున్న నేను, గయ్స్ ఒకసారి కార్ ఆపండి అనగానే జెస్సీ కారు ఆపాడు. సోము తార మీరు క్యాజువల్ గా బండి దిగి మనల్ని ఎవరైనా ఫాలో అవుతున్నారేమో ఓ లుక్కేసి రండి అని చెప్పగానే ముందుగా సోము దిగి పాస్ పోసుకున్నట్టు నటిస్తూ నిలుచున్నాడు. ఆ తర్వాత తార కూడా దిగి ఒళ్ళు విరుస్తూ ఒకసారి చుట్టూ లుక్కేసి ఓ రెండు నిమిషాలు తర్వాత ఇద్దరు మళ్లీ కార్లోకి ఎక్కి, నథింగ్ ఎవరూ లేరు అని చెప్పారు. .... జెస్సి మన రెగ్యులర్ రూట్ కాకుండా వేరే రూట్ తీసుకొని ఎక్కడైనా ఒక మెడికల్ షాప్ కి పోనివ్వు అని చెప్పి రిలాక్స్ అయ్యాను. నేను చెప్పినట్టే జెస్సీ రూట్ మార్చి సిటీలో వేరు వేరు రోడ్లు మారుస్తూ ఒక కాలనీలో ఉన్న మెడికల్ షాప్ దగ్గర ఆపాడు. తార వెళ్లి నా గాయాలకు డ్రెస్సింగ్ కోసం అవసరమైనవన్నీ తీసుకో అలాగే మంచి పెయిన్ కిల్లర్స్ ఇంకా ఆంటీబయాటిక్ టాబ్లెట్స్ కూడా తీసుకో అని చెప్పాను.

తార వెళ్లి ఒక అరగంటసేపు షాపింగ్ చేసి బ్యాగులు పట్టుకొని వచ్చి కారులో కూర్చుంది. గయ్స్ మనము ఇప్పుడు ఎక్కడైనా స్టే చేసి రేపు తెల్లవారి తిరిగి మనం వర్క్ స్టేషనుకి వెళ్దాం అని అన్నాను. .... ఏం ఎందుకలా? అని అన్నాడు సోము. .... ఏం లేదు కొంచెం సేఫ్టీ కోసం. నేను చనిపోయానని అనుకుంటున్న వాళ్లకి ఏమాత్రం డౌట్ రాకూడదు. మనము రేపే ఒక చిన్న మిషన్ పూర్తి చేయాలి అది కూడా ఎవరికీ తెలియకుండా చేయాలి. మనం ఎక్కడికి వెళితే బాగుంటుందో ఆలోచించండి అని అంటున్న సమయంలో నా ఫోన్ రింగ్ అయ్యింది. వెంటనే తార తన దగ్గర ఉన్న నా ఫోన్ తీసి నాకు అందించింది. అది నా బంగారం ప్రీతి దగ్గర నుంచి వస్తున్న కాల్ కావడంతో వెంటనే లిఫ్ట్ చేసి, ఏరా బంగారం ఏమైంది? అని అడిగాను.

సారీ అన్నయ్య,,, అని అంది. .... దేనికిరా,,,? అని అడిగాను. .... ఈ రోజు పొద్దున్న పుష్ప వదిన కాల్ చేసింది. ఫోన్ చేస్తే నువ్వు లిఫ్ట్ చేయడం లేదని నాకు చేసింది అప్పుడు నేను,,,, నువ్వు చనిపోయావు అని తెలిసిందని ఇంకా బాడీ రాలేదు వచ్చిన తర్వాత చెబుతాను అని వదినతో చెప్పేసాను. ఆ తర్వాత నేను నా మొబైల్ సైలెంట్ లో పెట్టేసి ఉంచడంతో వచ్చిన కాల్స్ సంగతి పట్టించుకోలేదు. ఇప్పుడు చూస్తే వదిన కాల్ మీద కాల్ చేస్తుంది. మరి నువ్వేమో ఎవరికీ చెప్పొద్దు అన్నావు ఇప్పుడు వదినకి ఏం చెప్పాలో అర్థం కావడం లేదు అని అమాయకంగా అడిగింది. .... వెంటనే నాకు కొంచెం టెన్షన్ పట్టుకుంది. ఎందుకంటే వదినకి తెలిస్తే వీర్రాజు అన్నకి చెబుతుంది. వీర్రాజు అన్నకు తెలిస్తే నా కంపెనీలో అందరికీ తెలిసిపోతుంది. అంటే ఈ పాటికి చాలామందికి నా మరణవార్త చేరిపోయి ఉంటుంది అని అనుకుని, డోంట్ వర్రీ బంగారం ఆ విషయం నేను చూసుకుంటాను నువ్వు వదిన కాల్ లిఫ్ట్ చెయ్యొద్దు. నువ్వు టెన్షన్ పడకుండా హ్యాపీగా రెస్ట్ తీసుకో, బాయ్ మ్వ,,, అని ఓ ముద్దు ఇచ్చి కాల్ కట్ చేశాను.

ఉఫ్,,, పెద్ద చిక్కు వచ్చిపడింది అని మనసులో అనుకుంటూ ఉండగా మళ్లీ నా ఫోన్ మోగింది. ఈసారి కాల్ నా సెక్రెటరీ రజిని దగ్గర నుంచి వస్తుంది. కొంచెం ఆలోచించగా ఈ విషయం ఆఫీస్ వరకు చేరలేదు అని అనిపించడంతో వెంటనే కాల్ లిఫ్ట్ చేసి, హాయ్ రజిని,,,, ఏంటి విషయం అని అడిగాను. .... గుడ్ ఈవెనింగ్ సార్,,, సార్ అది మీరు సంతకాలు పెట్టాల్సిన కొన్ని ఫైల్స్ ఉన్నాయి. మీరు ఒకసారి వస్తే,,, అని అంది. ..... అంటే ఇంకా నా మరణవార్త వైరల్ అవ్వలేదు అని కన్ఫామ్ కావడంతో, నేను వీలు చూసుకుని మూడు నాలుగు రోజుల్లో వస్తానులే అని అన్నాను. .... సార్ అవి కొంచెం అర్జెంట్ ఫైల్స్ ఇప్పటికే మీరు రాక పెండింగ్లో ఉండిపోయాయి. మీ సంతకాలు అయిపోతే ఇంకా రిజిస్ట్రేషన్ పనులు అవి స్పీడ్ అప్ అవుతాయి అని అంది.

నేను కొంచెం ఆలోచించి, సరే సరే,, అయితే నువ్వు ఒక పని చెయ్ నేను రావడానికి కొంచెం లేట్ అవుతుంది ఆ ఫైల్స్ నా బెడ్రూమ్ లో పెట్టేసి నువ్వు వెళ్ళిపో. నేను ఏదో ఒక టైంలో వచ్చి అవి పూర్తి చేస్తాను. .... ఓకే సార్,, మొత్తం నాలుగు ఫైల్స్ పదమూడు సంతకాలు మార్క్ చేసి పెట్టాను మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఎనీ టైం నాకు కాల్ చేయండి అని అంది రజిని. .... ఓకే ఓకే,, నేను చూసుకుంటాను బాయ్,,, అని చెప్పి కాల్ కట్ చేశాను. గయ్స్,,, మనం ఈ నైట్ నా ఆఫీసులో స్పెండ్ చేద్దాము జెస్సీ ముందు మనకి కావలసిన ఫుడ్ అంతా ప్యాక్ చేయించుకొని వెళ్దాం ఏదైనా మంచి రెస్టారెంట్ దగ్గరకు పోనీ అని చెప్పడంతో జెస్సీ కారు ముందుకు పోనిచ్చాడు. అన్ని పనులు పూర్తి చేసుకొని నా ఆఫీసు దగ్గరికి చేరుకునే సరికి రాత్రి 9:00 అయింది.

కార్ పార్క్ చేసి అందరం లిఫ్ట్ లో పైకి చేరిన తర్వాత ఫ్లాట్ లోకి ఎంటర్ అయ్యాము. వాళ్లని హాల్లో కూర్చోమని చెప్పి నేను నా బెడ్రూంలోకి వెళ్లి ముందుగా పుష్ప వదినకి ఫోన్ చేశాను. నా నంబర్ నుండి కాల్ రావడంతో కాల్ లిఫ్ట్ చేసిన పుష్ప వదిన వణుకుతున్న గొంతుతో హహహహలో,,, అని అంది. .... వదిన,,, అన్న నా పిలుపు వినగానే, దీదీదీపు,,,,, అని గట్టిగా అరుస్తూ, నువ్వు బతికే ఉన్నావా? మరి ప్రీతి,,, అని అంటూ ఉండగానే నేను మధ్యలో కల్పించుకుని, నో నో నో,,, తనకి తప్పుడు ఇన్ఫర్మేషన్ రావడంతో భయపడింది ఆ సమయంలోనే నువ్వు కాల్ చేయడంతో నీతో అలా చెప్పింది నువ్వేమీ కంగారు పడొద్దు అని అన్నాను. .... అయినా సరే వదిన ఏడుస్తూ కోపంగా మాట్లాడుతూ, అయినా నీకు కుదురుగా ఉండకుండా ఈ పనులు ఏంటి? నువ్వు ఏదో దాస్తున్నావు నాతో అబద్ధం చెపుతున్నావు అని అంది.

నేను కొంచెం బుజ్జగించే పనిలో పడి, లేదు వదిన,,, నాకు దెబ్బలు తగిలిన మాట వాస్తవమే కానీ నేను చనిపోలేదుగా ఇదిగో నీతో మాట్లాడుతున్నాను కదా? ప్లీజ్ ఏడవకు. అది సరే గానీ ఈ విషయం ఇంకా ఎవరికైనా చెప్పావా? అని అడిగాను. .... అత్తయ్యకి ఇంకా చెప్పలేదు కానీ మీ అన్నతో ఇంకా అరుణతో చెప్పాను. ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలుస్తుందేమో అని పొద్దున్న నుంచి వెయిట్ చేస్తున్నాను అని మళ్ళీ ఏడుస్తుంది. .... సరే సరే,,, ముందు ఆ ఏడుపు ఆపు. అన్న నీ దగ్గర ఉన్నాడా? ఉంటే ఒకసారి ఫోన్ ఇవ్వు అని అన్నాను. .... అటు నుంచి వెంటనే హలో తమ్ముడు?? అని అన్న పిలుపు వినపడింది. .... హలో అన్నా,,, నాకు ఏం కాలేదు నేను బాగానే ఉన్నాను. ఈ విషయం నువ్వు మన కంపెనీలో ఎవరికీ చెప్పలేదు కదా? అని అడిగాను.

లేదు తమ్ముడు,, పొద్దున్న ఇది నాకు విషయం చెప్పినప్పుడు నమ్మలేకపోయాను. అందుకని పూర్తి విషయం తెలిసేవరకు నేను డ్యూటీకి కూడా వెళ్లకుండా ఇక్కడే ఉండిపోయాను. అసలు ఏమైంది? అని అడిగాడు. .... ఏమీ లేదన్న డోంట్ వర్రీ. నేను కొంచెం బిజీగా ఉన్నాను ఓ నాలుగైదు రోజుల్లో వచ్చి కలుస్తాను వదినకి కొంచెం ధైర్యం చెప్పు. ఒకసారి వదినకి ఫోన్ ఇవ్వు అని అనగానే అటు నుంచి వదిన ఏడుస్తూ, ఆ చెప్పు,, అని అంది. అరుణకి నేను ఫోన్ చేసి మాట్లాడుతాలే ఒక వారం రోజుల్లో నేనే నీ దగ్గరికి వచ్చి అన్ని విషయాలు వివరంగా చెప్తాను సరేనా. నువ్వు ఏడవడం ఆపి ధైర్యంగా ఉండు అని అన్నాను. .... లేదు నేను వెంటనే నిన్ను చూడాలి నువ్వు ఇక్కడికి రా లేదంటే ఎక్కడున్నావో చెప్పు నేను వస్తాను అని అంది. .... నేను ఇక్కడ లేను వదిన కొంచెం పనిలో బిజీగా ఉన్నాను. నేను తప్పకుండా వస్తానుగా మ్వ,,, బాయ్ అని చెప్పి కాల్ కట్ చేశాను.

ఆ తర్వాత వెంటనే అరుణకి కాల్ చేయగా అక్కడినుంచి కూడా సేమ్ రెస్పాన్స్ కావడంతో ఒక ఐదు నిమిషాలు సేపు మాట్లాడి బుజ్జగించాల్సి వచ్చింది. ఆ తర్వాత లేచి బట్టలు విప్పి బాత్రూం లోకి వెళ్లి జాగ్రత్తగా స్నానం చేసి టవల్ చుట్టుకుని హాల్ లోకి వచ్చి కూర్చున్నాను. వెంటనే తార లేచి మెడికల్ షాప్ నుంచి తెచ్చిన బ్యాగ్ లో నుంచి సామాను తీసి డ్రెస్సింగ్ చేయడం మొదలు పెట్టింది. ఈ లోపు మీరిద్దరూ వెళ్లి స్నానం చేయండి అని చెప్పడంతో సోము, జెస్సి వెళ్లి స్నానాలు ముగించి వచ్చారు. నాకు డ్రెస్సింగ్ పూర్తిచేసి తార కూడా వెళ్లి స్నానం చేసి వచ్చింది. ఈ లోపు నేను నా బెడ్రూం లో రజనీ పెట్టిన ఫైల్స్ చెక్ చేసి తను చెప్పిన చోట సంతకాలు పెట్టి మళ్లీ అక్కడే పెట్టేసాను. మేము ముగ్గురం నడుముకు టవల్ చుట్టుకుని ఉండగా తార ఒంటికి టవల్ చుట్టుకుని ఉంది. తార అందరికీ డైనింగ్ టేబుల్ మీద భోజనం ఏర్పాటు చేయగా నేను లేచి ఫ్రిడ్జ్ లో నుంచి బీర్ బాటిల్స్ తీసి అందరికీ అందించి తాగుతూ భోజనం ముగించాము. ఆ తర్వాత నేను టాబ్లెట్స్ కూడా వేసుకుని, గయ్స్,,, మనం రేపు ఎర్లీ మార్నింగ్ ఇక్కడినుంచి వెళ్ళిపోదాం. మనం వర్క్ స్టేషనుకి వెళ్ళిన తర్వాత ప్లాన్ ఏంటన్నది మాట్లాడుకుందాం. తార,, అలారం పెట్టుకొని తొందరగా లేవండి. ఒకవేళ నేను లేవకపోయినా లేపి కార్లో పడేసి తీసుకెళ్లిపొండి గుడ్ నైట్,,, అని చెప్పి జెస్సీ నేను కలిసి వెళ్ళి నా బెడ్రూంలో పడుకోగా సోము, తార కలిసి మరో బెడ్ రూంలోకి వెళ్లి పడుకున్నారు.

మరుసటి రోజు తెల్లవారి ఇంకా కొంచెం చీకటి ఉండగానే జెస్సి నన్ను కదుపుతూ నిద్ర లేపుతున్నాడు. కానీ రాత్రి తాగిన బీరు ఆ తర్వాత టాబ్లెట్లు ప్రభావం వల్ల నా కళ్ళు తెరుచుకోడానికి చాలా కష్టపడ్డాయి. కానీ కొంచెం బలవంతంగా లేచి కూర్చున్నాను. నిన్న తెలియలేదుగానీ ఒళ్లంతా గట్టిగా అయిపోయి కొంచెం నొప్పిగా అనిపిస్తుంది. మొత్తం మీద లేచి ఫ్రెష్ అయ్యి కబోర్డ్ లో నుంచి వేరే డ్రెస్ తీసి వేసుకున్నాను. నిన్న విడిచిన డ్రస్ తార కవర్లో వేసి పట్టుకుంది. రూమంతా చిందరవందరగా ఉంది డైనింగ్ టేబుల్ కూడా సరిగ్గా క్లియర్ చేయలేదు. అందరం కలిసి కిందికి వచ్చి నేను, తార వెనుక కూర్చోగా సోము, జెస్సి ముందు కూర్చుని కారుని నా రూం వైపు పోనిచ్చారు. నేను మొబైల్ తీసి సంతకాలు అయిపోయాయని, రూమ్ కొంచెం క్లీన్ చేయించమని రజినీకి మెసేజ్ పెట్టి కళ్ళు మూసుకొని వెనక్కి చేరబడ్డాను.

కొంతసేపటికి తార తట్టి లేపడంతో బద్ధకంగా కార్లో నుంచి దిగాను. ఇప్పుడున్న అవస్థలో ఈరోజు ఆపరేషన్ లోకి దిగడం కష్టం అనిపించింది. ముందుగా నా రూం దగ్గరికి వెళ్లి లాక్ చేయకుండా దగ్గరకు వేసిఉన్న డోర్ తీసి లోపలికి వెళ్ళాము. ఆరోజు నేను టిఫిన్ చేసిన తర్వాత వదిలేసిన ప్లేట్ అందులో కొద్దిగా ఉన్న టిఫిన్ బూజు పట్టి కనపడింది. నేను దాన్ని చూపిస్తూ, తార ఆ ప్లేట్ లో ఉన్న దాన్ని ల్యాబ్ కి పంపించి అందులో ఉన్న మత్తుపదార్థం ఏంటో కనుక్కో అని అన్నాను. .... అది విని జెస్సి, సోము ఒకేసారి మాట్లాడుతూ, ఏంటి నువ్వు అనేది? అంటే నీకు మత్తుమందు ఇచ్చి ఇక్కడి నుంచే లేపుకెళ్ళారా? మరి మాకు ఎటువంటి హడావుడి గాని శబ్దంగాని వినపడలేదు? అని అడిగారు. .... ఆ రోజు నా వలన చిన్న మిస్టేక్ జరిగింది. టిఫిన్ పార్సిల్ చేయించుకుని బైక్ మీద పెట్టి మెడికల్ షాప్ కి వెళ్ళాను.

బహుశా అక్కడే ఆ పార్సెల్ లోకి మత్తుమందు ఇంజెక్ట్ చేసి ఉంటారు. ఆ తర్వాత నన్ను ఫాలో అయ్యి నేను టిఫిన్ చేసిన తర్వాత నన్ను తీసుకొని వెళ్ళిపోయి ఉంటారు. ఆరోజు బాగా ఆకలిగా ఉండడంతో రూమ్ కి రాగానే టిఫిన్ తిన్నాను. సగం టిఫిన్ చేసేసరికి బాగా నిద్ర ముంచుకు వస్తున్నట్టు అనిపించడంతో ఎలాగో ఓపిక చేసుకొని మరికొంచెం టిఫిన్ చేసి తరువాత తినలేక ప్లేట్ కూడా అలాగే వదిలేసి నీళ్లు తాగి బెడ్ మీద పడుకున్నాను. బహుశా అప్పుడు డోర్ కూడా క్లోజ్ చెయ్యడం మర్చిపోయి ఉంటాను అందుకే వాళ్లకి నన్ను ఇక్కడి నుంచి లేపుకెళ్లడం బాగా ఈజీ అయిపోయి ఉంటుంది. అదిగో టేబుల్ మీద పెట్టిన టాబ్లెట్లు కూడా అలాగే ఉన్నాయి అని ఆరోజు కొన్న టాబ్లెట్లు చూపించాను. గయ్స్,,, నాకు కొంచెం నీరసంగా ఉంది. కొంచెం రెస్ట్ తీసుకుంటే బాగుంటుందేమో? మనం ఈ ఆపరేషన్ ని రేపటికి వాయిదా వేద్దాం.

కానీ నేను బతికే ఉన్నాను అన్న విషయం ఎవరికీ తెలియడానికి వీల్లేదు. మన చీఫ్ కి కూడా ఏమీ చెప్పొద్దు. ఈ ఆపరేషన్ పూర్తయిన తర్వాత నేనే చీఫ్ ని కలిసి అన్ని విషయాలు మాట్లాడతాను అని అన్నాను. .... మరి ఒక వేళ చీఫ్ కాల్ చేస్తే? అని అడిగాడు సోము. .... ఒక పని చేయండి ఈరోజు మన అందరి ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి పెట్టండి. నేను ఇదే రూమ్ లో రెస్ట్ తీసుకుంటాను మీరు బయట తాళం వేసుకొని వెళ్లి వర్క్ స్టేషనులో రెస్ట్ తీసుకోండి. కానీ అప్పుడప్పుడు బయట ఏమన్నా యాక్టివిటీస్ జరుగుతున్నాయో లేదో వాచ్ చేస్తూ ఉండాలి అని చెప్పాను. .... సరే అయితే నేను టైం కి టిఫిన్ భోజనం పట్టుకుని వస్తాను మిగిలిన విషయాలు మేము చూసుకుంటాము నువ్వు హాయిగా రెస్ట్ తీసుకో అని అంది తార. ఆ తర్వాత నేను బెడ్ మీద చేరి పడుకోగా వాళ్ళు ముగ్గురు ఆ టిఫిన్ ప్లేట్ తీసుకొని బయటికి వెళ్లి డోర్ లాక్ చేసుకుని వెళ్ళిపోయారు.

ఆ తర్వాత టైంకి తార టిఫిన్ మరియు భోజనం పట్టుకొని రాగా తిని టాబ్లెట్ లు వేసుకొని మళ్ళీ పడుకున్నాను. ఆ రోజు సాయంత్రం 7:00 సమయానికి పూర్తిగా మత్తు వదిలి కొంచెం ఫ్రెష్ గా అనిపించింది. లేచి స్నానం చేసి బట్టలు వేసుకుని అందరం కలిసి వర్క్ స్టేషన్ లో హాల్లో మీట్ అయ్యాము. గయ్స్,, మళ్లీ మరికొందరిని లేపేసే టైం వచ్చింది. రేపు పొద్దున్నే మనం ఆపరేషన్ మొదలుపెట్టాలి అని అన్నాను. .... ఇంతకీ టార్గెట్ ఎవరు? అని అడిగాడు జెస్సి. .... టార్గెట్ భాను,,, కానీ జెస్సీ నువ్వు మాతో పాటు రాకుండా ఇక్కడే ఉండాలి. మేము పని పూర్తి చేసుకొని వచ్చేలోపు మనం నిన్న వెళ్లిన స్మశానంలో ఒక చితిని రెడీ చేసి పెట్టాలి. ఆ భాను గాడిని అదే స్మశానంలో సజీవ దహనం చేయాలి అని అన్నాను. వెంటనే ముగ్గురు షాక్ అయ్యి ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు కానీ ఎందుకు ఏమిటి అని నన్ను అడగకుండా ఓకే,, అన్నారు.

Next page: Episode 127.2
Previous page: Episode 126