Episode 128.1
సోముని కవిత అమ్మ ఇంటికి కారుని పోనివ్వమనడంతో కొంతసేపటికి ఇంటి ముందు కారు ఆపాడు. వాళ్ళిద్దర్నీ అక్కడే ఉండమని చెప్పి నేను అమ్మను(సుప్రియ వర్మ) తీసుకొని గేటు లోపలికి నడిచి డోర్ బెల్ కొట్టాను. అమ్మ వచ్చి డోర్ ఓపెన్ చేసి నాతో పాటు ఉన్న తన అక్క సుప్రియ వర్మను చూసి ఆశ్చర్యంతో షాక్ అయింది. కొద్ది క్షణాలు మా ఇద్దరి వైపు అయోమయంగా చూసి అంతలోనే తేరుకుని అక్క,,, అంటూ కౌగిలించుకుంది. సుప్రియ అమ్మ కూడా తన చెల్లెలు అయినటువంటి కవిత అమ్మను కౌగలించుకుని ఏడుస్తోంది. ఇంతకాలం మమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళిపోయావు అక్క? అని అంది కవిత అమ్మ. .... సుప్రియ అమ్మ తన చెల్లెలను గుర్తుపట్టి, నాకు కూడా తెలియదే కవిత. నేను ఎక్కడున్నానో ఎందుకున్నానో ఎవరి దగ్గర ఉన్నానో తెలీదు కానీ నేను బతికున్నాను అన్న విషయం మాత్రమే తెలుసు. పాపం ఈ అబ్బాయి ఎవరో గాని నన్ను మళ్ళీ నీ దగ్గరికి తీసుకువచ్చాడు అని అంది సుప్రియ అమ్మ.
నేను కవిత అమ్మ వైపు చూసి, అమ్మ,, అమ్మని(సుప్రియ) లోపలికి తీసుకునివెళ్ళు అని అన్నాను. కానీ కవిత అమ్మ నా వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఉండటంతో నేను కళ్ళతో సైగ చేశాను. .... పదక్క నిన్ను రూం లోకి తీసుకుని వెళ్తాను. నువ్వు కొంచెంసేపు రెస్ట్ తీసుకున్నాక మనం తీరిగ్గా కూర్చుని మాట్లాడుకుందాం అంటూ సుప్రియ అమ్మను లోపలికి తీసుకొని వెళ్ళింది. ఆ తర్వాత అమ్మను రూమ్ లో పడుకుండబెట్టి బయటికి వచ్చిన కవిత అమ్మ, ఇదంతా ఏంట్రా నాన్న? అసలు నమ్మలేకుండా ఉన్నాను, అసలు ఏం జరిగింది? అని అడిగింది కవిత అమ్మ. .... అదంతా ఒక పెద్ద కథ అమ్మ. కాకపోతే అమ్మకు(సుప్రియ) నేను ఏమాత్రం గుర్తు లేను అని మాత్రమే ఇప్పటికి నేను నీకు చెప్పగలను. మిగిలిన వారి గురించి కూడా గుర్తుందో లేదో తెలియదు. నువ్వు కూడా తనకు పాత జ్ఞాపకాలు గుర్తు చేసే పని చెయ్యకు అలా చేస్తే తన ప్రాణానికే ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందని డాక్టర్ గారు చెప్పారు.
ఆమాట అంటూనే నా కళ్ళమ్మట నీళ్ళు జాలువారాయి. అది చూసి తట్టుకోలేక కవిత అమ్మ నన్ను కౌగిలించుకుని వెన్ను నిమురుతూ ఊరడించే ప్రయత్నం చేసింది. నేను కొంతసేపు అలాగే అమ్మను కౌగిలించుకొని ఏడుస్తూ ఉండిపోయాను. ఆ తర్వాత తేరుకుని కళ్ళు తుడుచుకుంటూ, అమ్మ నేను మళ్ళీ వచ్చి అమ్మను(సుప్రియ) తీసుకొని వెళ్తాను అంతవరకు అమ్మ(సుప్రియ) ఇక్కడే ఉంటుంది. కానీ అమ్మ(సుప్రియ) ఇక్కడ ఉందన్న విషయం ఎవ్వరికీ తెలియకూడదు. ఈ విషయాన్ని అంకుల్ కి, ప్రీతికి అర్థమయ్యేటట్టు చెప్పు అని అన్నాను. .... సరే నాన్న,,, కానీ నువ్వు మళ్లీ ఎక్కడికి వెళుతున్నావు? అని అడిగింది అమ్మ. .... తిరిగి వచ్చిన తర్వాత అన్ని వివరంగా చెప్తాను అమ్మ. ఇంకా నేను చేయవలసిన అతి ముఖ్యమైన పని ఒకటి మిగిలిపోయింది. .... సరే నాన్న,,, జాగ్రత్తగా వెళ్ళిరా అని మరోసారి నన్ను అక్కున చేర్చుకొని నుదుటిన ముద్దు పెట్టి వదిలింది.
నేను ఇంట్లో నుంచి బయటకు వచ్చి కారులో కూర్చుని వర్క్ స్టేషనుకి పోనివ్వమని సోముతో చెప్పాను. కానీ సోము బండి కదిలించకుండా అలాగే నా వంక చూస్తూ కూర్చున్నాడు. ఏమైంది? అని అడిగాను. .... ఏం లేదు,,, అంటూ నా వైపు కొంచెం జాలిగా చూశాడు. .... మరయితే బండి పోనివ్వు,,, అని కొంచెం గట్టిగా చెప్పాను. .... సోము కారును ముందుకు కదిలించి వెళుతూ, ఇదంతా ఎలా తట్టుకోగలుగుతున్నావురా బాబు? నిన్ను చూస్తున్న మాకే ఏదోలా ఉంది అని తన సానుభూతి వ్యక్తం చేశాడు. కానీ నేను అందుకు ఏమి సమాధానం చెప్పకుండా కూర్చోవడంతో సోము ఇంకేమీ మాట్లాడకుండా డ్రైవ్ చేస్తూ కొద్దిసేపటికి వర్క్ స్టేషన్ ముందు కారు ఆపాడు. అక్కడ మా కోసమే వేచి చూస్తున్న జస్సీ దగ్గరికి వచ్చి, అంతా రెడీగా ఉంది,, అని చెప్పాడు.
నేను కారు దిగి డిక్కీ ఓపెన్ చేసి లోపల ఉన్న భాను గాడిని బయటికి లాగి ఇంటి గేటు ముందు పడేసాను. కాళ్లు చేతులు విరిగిపడి ఉండటంతో వాడు నొప్పి తాళలేక అరిచాడు. వాడి జుట్టు పట్టుకుని ఇంటి వైపు చూపిస్తూ, ఈ ఇల్లు నీకు గుర్తుందారా? నా దేవత పార్వతి అమ్మను ఈ ఇంట్లోనే చంపావు. ఏం పాపం చేసిందని అంత క్రూరంగా కుటుంబం మొత్తాన్ని చంపావు? అని మళ్ళీ ఒకసారి వాడి డొక్కలో తన్నాను. .... వాడు విలవిలలాడుతూ, ఆరోజు నేను వచ్చింది వాళ్లను చంపడానికి కాదు నిన్ను చంపడానికని వచ్చాను. నువ్వు ఆవిడతోనే కలిసి ఉంటున్నావని తెలిసి ఆవిడను ఫాలో అవుతూ వచ్చాను. కానీ లోపలికి వెళ్ళిన తర్వాత నువ్వు ఎక్కడా కనబడక అడ్డు వచ్చిన వారిని కొట్టాము. దాంతో అతను తిరగబడ్డాడు అందుకే వాళ్లందర్నీ చంపాల్సి వచ్చింది అని అన్నాడు భాను.
నన్ను చంపాలని వచ్చిన వాడివి నన్ను చంపాలి గాని ఆ కుటుంబాన్ని చంపడమేమిటిరా చెత్త నా కొడకా అంటూ మరోసారి తన్ని వాడిని మళ్లీ డిక్కీలో పడేయమని సిగ్నల్ ఇవ్వడంతో జెస్సీ, సోము కలిసి వాడిని డిక్కీలో పడేసారు. ఆ తర్వాత నేను లోపలికి వెళ్లి పార్వతి అమ్మ రూమ్లో లాకర్ లో నుంచి ఒక లక్ష రూపాయలు తీసుకొని బయటికి వచ్చి జెస్సీ చేతికి అందించి అక్కడ వీటితో పని ఉంటుంది నీ దగ్గర పెట్టుకో అని అందించాను. మనం అందరం మాస్కులు తొడుక్కోవాలి అని చెప్పగా తార అందరికీ మాస్కులు అందించింది. ఆ తర్వాత ఒక గుడ్డ ముక్క తీసుకుని దానిమీద DD అనే మార్క్ రాసి తార చేతికి అందించాను. ఏం చేయాలో అర్ధం అయ్యింది అన్నట్టు తార దానిని అందుకొని జేబులో పెట్టుకుంది. ఆ తర్వాత అందరం కలిసి కారులో స్మశానానికి బయలుదేరాము.
స్మశానానికి చేరుకొని కార్లో నుంచి దిగి నేను సోము కలిసి భానుని బయటకు దించి ఈడ్చుకుంటూ తీసుకువెళ్లి అప్పటికే సిద్ధంగా ఉన్న చితి మీద పడేసాము. నేను భాను చెంప మీద ఒకటి గట్టిగా పీకి, నీకు మరొక ఛాన్స్ ఇస్తున్నాను ఇందాక నువ్వు చెప్పిన విషయాలు అన్ని నిజమేనా? లేదంటే ఇక్కడే సజీవదహనం అయిపోతావు అని అన్నాను. .... నేను ఏం చెప్పినా నువ్వు నన్ను చంపేస్తావు కదా అని అన్నాడు భాను. .... నువ్వు చెప్పేవి అన్నీ నిజాలే అని నాకు అనిపిస్తే నిన్ను వదిలేస్తాను అని అన్నాను. .... బాస్ ఇప్పుడు ఒరిస్సా ఛత్తీస్ఘడ్ ఆంధ్ర మూడు బోర్డర్ లు కలిసేచోట పనసపుత్తు అనే దట్టమైన అడవిలో ఒకప్పుడు మైనింగ్ చేసి వదిలేసిన ప్రాంతంలో అండర్ గ్రౌండ్ లో ఉన్న డెన్ లో ఉన్నాడు అని చెప్పాడు భాను. .... అక్కడ ఎంత మంది సెక్యూరిటీ ఉంటారు? అని అడిగాను.
రేపు అక్కడ ఒక పెద్ద మీటింగ్ జరగబోతుంది. చాలామంది స్మగ్లర్లు అక్కడికి వస్తారు. లోపలికి వెళ్ళడానికి ఉండే గేట్లు వేలిముద్ర పాస్వర్డ్ తో తెరుచుకుంటాయి. అక్కడ గోడలలో గన్స్ అమర్చబడి ఉంటాయి. అంతేకాదు లోపల ఒక 30 మంది దాకా సెక్యూరిటీ ఉంటారు. అలాగే బయట కూడా ఒక 20 మంది వరకు సెక్యూరిటీ ఉంటారు. అందులో కొంతమంది చెట్లపై కూడా గస్తీ కాస్తూ ఉంటారు. ఆ గోడలలో ఉన్న ఆటోమేటెడ్ గన్స్ మరియు కెమెరాలు ఆపరేట్ చేయడానికి కంట్రోల్స్ అన్నీ ఒక సెక్యూరిటీ రూమ్ లో ఉంటాయి. అవసరమైనప్పుడు ఆపరేట్ చేయడానికి అక్కడ ఇద్దరు సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు. కావాలంటే నా ఫోన్లో ఉన్న లొకేషన్ చెక్ చేసుకోవచ్చు అని చెప్పాడు భాను. .... వెంటనే నేను వాడి జేబులో ఉన్న ఫోన్ తీసి వాడు చెప్పిన లొకేషన్ ఓపెన్ చేసి దానిని నా ఫోన్ కి ఫార్వర్డ్ చేసుకొని తిరిగి వాడి ఫోన్ వాడి జేబులో పెట్టాను.
మాకు ఈ సమాచారం సరిపోతుందిలే ఇక నువ్వు హాయిగా ఊపిరి వదిలెయ్ అని అన్నాను. .... అంటే? అని అన్నాడు భాను. .... నిన్ను పైన యమధర్మరాజు దగ్గరికి వెళ్లిపొమ్మని చెబుతున్నాను. .... లేదు లేదు అలా చేయకు నువ్వు నన్ను వదిలేస్తానని మాట ఇచ్చావు అని అన్నాడు బాను. .... నిన్ను అలా ఎలా వదిలేస్తాను? మా అమ్మను చంపినందుకు లెక్క సరిచేయాలి కదా? జెస్సీ,,,, అని అనగానే వెలిగించి రెడీగా ఉంచిన కాగడ నా చేతికి అందించాడు జెస్సి. రండి మీరు కూడా తలా ఒక చెయ్యి వేయండి అని అనగానే సోము, జెస్సీ, తార కూడా పట్టుకున్నారు. .... లేదు నన్ను చంపొద్దు,,, ప్లీజ్,,, నేను అంతా నిజమే చెప్పాను నన్ను చంపకండి దయచేసి వదిలేయండి అని వేడుకున్నాడు భాను. .... వదిలిపెట్టే సమస్యే లేదు,,, అని చెప్పి నలుగురం కలిసి వాడి చితికి నిప్పంటించాము.
వాడు మమ్మల్ని వేడుకుంటూనే పైకి ఎగబాకిన మంటల్లో చిక్కుకొని ఆర్తనాదాలు పెడుతూ అగ్నికి ఆహుతి అయ్యాడు. నేను గుండె మీద చెయ్యి వేసుకుని ఆకాశంలోకి చూస్తూ, అమ్మ నిన్ను నీ కుటుంబాన్ని చంపిన వాడిని ఈరోజు చంపేసాను. నా చేతులతో నీ శరీరాన్ని దహనం చేసిన ఇదే స్మశానంలో వాడిని సజీవదహనం చేశాను అని కళ్ళు మూసుకున్నాను. జెస్సీ, తార, సోము ముగ్గురు కలిసి నా భుజం మీద చెయ్యి వేసి పక్కకు తీసుకొని వెళ్లారు. ఆ తర్వాత ఇదంతా దూరంగా నిల్చుని చూస్తున్న కాటికాపరిని పిలిచి జెస్సీ దగ్గర ఉన్న డబ్బును అతని చేతికి అందించి, ఇప్పుడు ఇక్కడ జరిగినదాన్ని నువ్వు శాశ్వతంగా మర్చిపోవాలి. మేము వెళ్ళిన కొంతసేపటి తర్వాత సెక్యూరిటీ ఆఫీసర్లకు ఫోన్ చేసి ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి నిన్ను చంపుతామని బెదిరించి తాళ్లతో కట్టేసి ఒక వ్యక్తిని సజీవ దహనం చేసి వెళ్ళిపోయారు అని చెప్పాలి అని చెప్పాను. అందుకు అతను సరే అని చెప్పిన తర్వాత తార వైపు చూడగా జేబులో ఉన్న DD మార్కు గుడ్డను అక్కడ ఉన్న చిన్న కర్రకు తగిలించి అందరం కలిసి కారులో కూర్చుని అక్కడినుంచి బయలుదేరాము.
గయ్స్,,, మనం ఈ రోజు రాత్రికే ఆ లొకేషన్ దగ్గరికి వెళ్ళాలి. రేపు ఎట్టి పరిస్థితుల్లోనూ అక్కడ జరిగే విషయాలను బట్టబయలు చేసి ఇంతవరకు మనకు కనబడకుండా వెనక నుండి కథ నడిపిస్తున్న వాడిని అంతం చేయాలి. వెంటనే రూమ్ కి వెళ్ళి తొందరగా తయారయ్యి బయల్దేరుదాం అని అన్నాను. .... సోము మాట్లాడుతూ, మళ్లీ మనం DD పేరు ఎందుకు వాడాల్సి వచ్చింది? అని అడిగాడు. .... మనం ఇంతవరకు అనుమానిస్తూ వస్తున్న రుద్ర గాడికి ఇప్పుడు మనం చేసిన పని తెలియాలి. కానీ వాడికి నేను బతికి ఉన్నట్లు తెలియదు. కాటికాపరి చెప్పినదాని ప్రకారం ఇద్దరు వ్యక్తులు మాత్రమే స్మశానానికి వచ్చినట్టు తెలుస్తుంది కాబట్టి అది మీరిద్దరే అని వాడు అనుకొని మీ కోసం గాలిస్తూ తిరగాలి. అప్పుడే మనం ఈ ఆపరేషన్ కి వెళ్తున్నట్టు ఎవరికి అనుమానం రాదు. ఇది వాడిని తప్పుదోవ పట్టించడానికి వేసిన ప్లాన్ అని అన్నాను.
కారు వర్క్ స్టేషనుకి చేరుకుని అందరం దిగి తొందరగా తయారవడానికి ఎవరి రూముల్లోకి వాళ్ళు వెళ్లాము. నేను నా రూమ్లో తయారయ్యి డోర్ లాక్ చేసి వర్క్ స్టేషనులోకి వెళ్లాను. టీం అందరం కూడా రెడీ అయ్యి మా వెపన్స్ ఇంకా అవసరమైన మిగిలిన సామాగ్రి కారులో లోడ్ చేసుకుని చివరిగా నేను వెనక ఉన్న ముత్యాలమ్మ మామ్మ దగ్గరకు వెళ్లి, చూడు మామ్మ నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఒకవేళ మమ్మల్ని వెతుక్కుంటూ సెక్యూరిటీ ఆఫీసర్లు ఎవరైనా ఇక్కడికి వచ్చినట్లయితే, నేను చనిపోయిన తర్వాత ఇక్కడ ఎవరూ ఉండటం లేదు అని మాత్రం చెప్పు. నేను ఇంకా బతికి ఉన్నట్టు ఎవ్వరికీ తెలియకూడదు. నీకేం కాదు నువ్వు ధైర్యంగా ఉండు అని చెప్పాను. సరే బాబు,, అని మామ్మ చెప్పడంతో వర్క్ స్టేషన్ మొత్తం లైట్లు అన్ని ఆపేసి మొత్తం క్లోజ్ చేసి డోర్ లాక్ చేసి కారులో కూర్చుని చీఫ్ దగ్గరకు బయల్దేరాము.
*** మేము చెప్పినట్టుగానే కొంతసేపటి తర్వాత కాటికాపరి ఫోన్ ద్వారా విషయం తెలుసుకున్న రుద్ర అండ్ టీం స్మశానానికి చేరుకుని విషయం మొత్తం తెలుసుకున్నాడు. అలాగే అక్కడ మేము వదిలివెళ్లిన DD మార్క్ కూడా చూశాడు. అక్కడికి చేరుకున్న మీడియాకి కూడా DD మార్క్ గురించి తెలియడంతో వెంటనే విషయం వైరల్ అయిపోయింది. దాంతో మళ్లీ రుద్ర మీద పై అధికారుల ఒత్తిడి పెరిగింది. దాంతో ఈ కేసు తప్ప మరే విషయం మీద రుద్రకి దృష్టి పెట్టే అవకాశం లేకుండా పోయింది. నా డైవర్షన్ ప్లాన్ వర్క్ అవుట్ అయింది.***
కారులో వెళుతుండగా, తార ఆర్ యు ఓకే? అని అడిగాను. .... యా ఐ యాం డబుల్ ఓకే. నిజం చెప్పాలంటే చాలా సంతోషంగా ఉన్నాను అని అంది. .... అంత సంతోషం దేనికో? అని అన్నాడు సోము. .... ఇందాక మన ఆపరేషన్లో ఒక చిన్న సంఘటన చోటు చేసుకుంది అని అన్నాను. .... దీనికి అంత సంతోషం కలిగించే విషయం ఏం జరిగింది? అని అడిగాడు జెస్సీ. .... చెప్పొచ్చా? అన్నట్టు తార వైపు చూశాను. .... ఇందులో దాచుకోడానికి ఏముంది? అప్పుడు ఒకడిని పీక కోసి లేపేసాను కదా! ఈ రోజు మిగిలిన రెండోవాడు దొరికాడు. వాడి సుల్ల కోసి లేపేసాను అని చాలా ధీమాగా చెప్పింది. .... వెంటనే కారు నడుపుతున్న జెస్సి స్లో చేశాడు. తార పక్కన కూర్చున్న సోము ఉలిక్కిపడి తార వైపు గుడ్లప్పగించి చూస్తున్నాడు. జెస్సీ వెనక్కి తిరిగి, నీయమ్మ అంత కర్కశత్వం ఏంటే? ఎలా చంపినా చస్తాడు కదా? ఒరేయ్ సోముగా నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండాలిరో,,, అని పకపకా నవ్వాడు జెస్సీ. .... వెంటనే తార, వీడిని అంత క్రూరంగా చంపనులే అని పక్క నుండి సోముని వాటేసుకుని నవ్వింది. అది చూసి అందరం సరదాగా నవ్వుకున్నాము.
మేము ఆఫీస్ కి చేరుకొని వెనకనుంచి గోడౌన్ రూపంలో అండర్ గ్రౌండ్ లో ఉన్న పార్కింగ్ లో కారు పార్క్ చేసి మెట్లెక్కి పైకి వెళ్లి అక్కడ ఉన్న సీక్రెట్ లిఫ్ట్ లో చీఫ్ ఉన్న ఫ్లోర్ కి చేరుకున్నాము. తార నువ్వు స్టోర్ కి వెళ్లి మనందరికీ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు, హ్యాండ్ గ్రనేడ్స్, నైట్ విజన్ గాగుల్స్, బైనాక్యులర్స్, స్నైపర్ కుదిరితే ఇంకేమైనా పవర్ ఫుల్ వెపన్స్ ఏమేమి అవసరమౌతాయో చూసుకొని రెడీ చెయ్యు అని చెప్పి మేము చీఫ్ రూమ్ దగ్గరకివెళ్ళి బయట ఉన్న స్పీకర్ నుంచి మే ఐ కమిన్ సర్,,, అని అడిగాము. యస్ కమిన్,,, అని వినపడడంతో డోర్ తెరుచుకుని ముగ్గురం లోపలికి వెళ్ళాము. మమ్మల్ని చూసిన వెంటనే చీఫ్ ఆశ్చర్యపోతూ లేచి, దీపు,,,,,, ఓ మై గాడ్,,, హౌ???? అంటూ నాకు ఎదురు వచ్చి హగ్ చేసుకున్నారు. .... సారీ సర్,,, మీకు ముందే ఇన్ఫామ్ చేయవలసింది కానీ ఈ రోజు చిన్న ఆపరేషన్ చేయాల్సి రావడంతో ఇలా సడన్ గా మీ ముందుకు రావాల్సి వచ్చింది అని అన్నాను.
నువ్వు ఈ స్థితిలో ఉండగా ఆపరేషనా? అసలు ఇదంతా ఎలా? డాక్టర్స్ నువ్వు చనిపోయావని సర్టిఫై చేశారు కదా? అని అడిగారు. .... ఏమో సార్ అలా జరిగిపోయింది అంతే. కానీ ఇప్పుడు మీతో చాలా ఇంపార్టెంట్ విషయం మాట్లాడటానికి వచ్చాను. నాకు ఒక లీడ్ దొరికింది దాని ప్రకారం మేము ఇప్పుడే బయలుదేరుతున్నాము అని భాను ఇచ్చిన సమాచారాన్ని చీఫ్ తో చెప్పాను. .... చూస్తుంటే ఇది పెద్ద సెన్సేషనల్ న్యూస్ అవుతుంది అనిపిస్తుంది. కానీ ఇంత పెద్ద ఆపరేషన్ మీరు మాత్రమే వెళ్లి ఎలా చేయగలరు? అని అడిగారు చీఫ్. .... మీ డౌట్ కరెక్టే సార్. కాకపోతే మనం మంది మార్బలంతో అక్కడికి వెళితే వాళ్లకు ఉన్న నిఘా వ్యవస్థతో మన హడావిడిని కనిపెట్టి తప్పించుకునే ప్రమాదం ఉంది. అందుకే మేము సైలెంట్ గా వెళ్లి అక్కడ పరిస్థితిని అంచనా వేసి అవసరాన్ని బట్టి ఏం చేస్తే బాగుంటుందో డిసైడ్ అవ్వడం మంచిది అనిపిస్తుంది.
ఇక్కడ మీరు ఒక బెటాలియన్ రెడీ చేసి పెట్టండి. మేము ఇప్పుడే బయలుదేరి వెళ్లి అక్కడ పరిస్థితులను అంచనా వేసి మీకు సమాచారం అందిస్తాము. ఒకవేళ మా శక్తికి మించి ఏదైనా చేయవలసి వస్తే వెంటనే మీరు ఎయిర్ స్ట్రైక్ చేయవచ్చు. అప్పుడు మేము కూడా అక్కడ కదలికలను నిశితంగా పరిశీలిస్తూ ఉంటాం కాబట్టి వాళ్ళు తప్పించుకోవడానికి ప్రయత్నించినా వెంటనే మీకు సమాచారం అందించడానికి ఉపయోగపడతాము. అన్నిటికంటే ముఖ్యంగా మనం ఏదైనా చేయాలంటే ఇప్పుడు మన దగ్గర ఉన్న సమాచారం సరైనదో కాదో కూడా తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది కదా? అని అన్నాను. .... చీఫ్ కొంచెం ఆలోచించి, నువ్వు చెప్పింది పాయింటే కానీ నువ్వు ఈ స్థితిలో ఉండగా ఈ ఆపరేషన్ కొంచెం రిస్కే కదా అని అన్నారు.
డోంట్ వర్రీ సార్,,, నావల్ల కాదు అనుకున్నప్పుడు ముందుగానే మీకు సిగ్నల్ ఇచ్చేస్తాను. నా టీం మీద నాకు పూర్తి నమ్మకం ఉంది అని అన్నాను. .... చీఫ్ ఒకసారి జెస్సీ మరియు సోముల వైపు చూసి, వాట్ అబౌట్ యు,,, మీరేమంటారు? ఆర్ యు ఓకే విత్ దిస్ ప్లాన్? అని అడిగారు. ..... దీపు ప్లాన్ పర్ఫెక్ట్ సార్. ముందుగా మనం అక్కడి పరిస్థితులను అంచనా వేయడం చాలా మంచిది. ఎలాగూ మీరు మాకు బ్యాకప్ ఉంటారు కదా? అని ఇద్దరూ ఒకేసారి అన్నారు. .... వెరీ గుడ్,, మీరు ఒక టీం గా చాలా సాలిడ్ గా ఉన్నారు. ఓకే గయ్స్,,, బీ కేర్ ఫుల్. సో మీరు ఎలా వెళ్తున్నారు? మీకు ఇంకా ఏమైనా కావలసినవి ఉన్నాయా? అని అడిగారు చీఫ్. .... సోము, జెస్సీ మీరు కూడా వెళ్లి మనకు అవసరమైన ఎక్విప్మెంట్ రెడీ చేయడంలో తారకు హెల్ప్ చేయండి నేను చీప్ తో మాట్లాడి వస్తాను అని వాళ్ళిద్దర్నీ పంపించేశాను.
ఆ తర్వాత చీఫ్ తో మాట్లాడుతూ, సార్ నాకు కొంచెం టెక్నికల్ సపోర్ట్ కావాలి. మన దగ్గర ఉన్న బెస్ట్ హ్యాకర్ ని ఇమీడియట్ గా ఏర్పాటు చేయగలరా? అని అడిగాను. .... చీఫ్ కొంచెం ఆలోచించి వెంటనే ఫోన్ తీసుకొని కాల్ చేసి, ఇమిడియట్ గా విక్రమ్ ని లైన్ లోకి తీసుకోండి అని చెప్పి ఫోన్ పక్కన పెట్టేసి, వాట్ ఈజ్ యువర్ ప్లాన్? అని అడిగారు. .... సార్ మన దగ్గర ఉన్న సమాచారం ప్రకారం వాళ్ళు అక్కడ టెక్నాలజీని వాడుతున్నారు. ఆటోమేటెడ్ గన్స్, సర్వైలెన్స్ కెమెరాలు ఆపరేట్ చేయడం కోసం ఒక ప్రత్యేకమైన రూమ్ ఏర్పాటు చేసుకున్నారు. మనం ముందుగా ఆ రూమ్ ని హ్యాక్ చేయగలిగితే 70% పని పూర్తయినట్టే అని నా అంచనా. నా అంచనా నిజమైతే మేమే ఆ పని పూర్తి చేయగలం అని అనుకుంటున్నాను. అలా కాని పక్షంలో మీరు బెటాలియన్ తో ఎయిర్ స్ట్రైక్ చేయవలసి ఉంటుంది. ఏదైనా ముందు అక్కడికి వెళ్లిన తర్వాతే డిసైడ్ చేయగలం అని అన్నాను.
ఆర్ యు ఓకే,,, ఈ ఆపరేషన్ చేయడానికి నీ బాడీ ఎనర్జీ సరిపోతాయా? అని అడిగారు. .... డోంట్ వర్రీ సార్,, ఐ థింక్ ఐ కెన్ డూ ఇట్. ఇందులో నా స్వార్థం కూడా ఉంది. ఇందాక మీరన్నట్టు ఇది ఒక సెన్సేషన్ క్రియేట్ చేయబోతోంది. అదే సమయంలో చాలా ప్రశ్నలకు సమాధానం దొరకబోతుంది. అంతేకాకుండా నా లైఫ్ బ్యాక్ గ్రౌండ్ లో జరుగుతున్న మిస్టరీ కూడా ఈ కేసులో ఉన్న వ్యక్తితో ముడిపడి ఉంది. సార్ మీరు ఇంకొక పని చేయాలి, మన ఏజెంట్ ఎవరినైనా రుద్ర కార్ లేదా మొబైల్ ట్రాక్ చేస్తూ మనం ఎప్పుడు అడిగితే అప్పుడు రుద్ర ఎక్కడున్నాడు అన్న సమాచారం అందించగలిగేలా చూడాలి అని అన్నాను. .... వాట్,,, రియల్లీ? ఇందులో రుద్ర ఇన్వాల్వ్మెంట్ ఉందా? అని అడిగారు చీఫ్. .... డైరెక్ట్ గా కనపడటం లేదు కానీ ఉన్నాడు. నాకు తెలిసిన కొన్ని విషయాలు అదే స్పష్టం చేస్తున్నాయి. అవన్నీ మాట్లాడుకోవడానికి మనకు ఇప్పుడు టైం లేదు, టైం వచ్చినప్పుడు అన్నీ తెలిసిపోతాయి అని అన్నాను.
అంతలో ఫోన్ రింగ్ అవడంతో చీఫ్ కాల్ లిఫ్ట్ చేసి, యస్,,, ఆ విక్కీ,, నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావ్?,,,,,, కం టు మై రూమ్,, అని చెప్పి ఫోన్ పక్కన పెట్టేశారు. మరో రెండు నిమిషాలకి, మే ఐ కమిన్ సార్,, అని వినపడటంతో యస్ కమిన్,,, అని చీఫ్ అనగానే డోర్ తెరుచుకుని ఒక వ్యక్తి లోపలికి వచ్చాడు. యస్ విక్కీ,, మీట్ మిస్టర్ దీపు అవర్ యాక్షన్ ఏజెంట్ అని నన్ను పరిచయం చేసి, ఈరోజు నైట్ ఈ టీం తో కలిసి నువ్వు ఒక ఆపరేషన్ లో పార్టిసిపేట్ చేయాలి. డీటెయిల్స్ అన్ని దీపుతో మాట్లాడు హీ ఈజ్ ద బాస్ అని చెప్పారు. నేను పైకి లేచి విక్రమ్ కి షేక్ హ్యాండ్ ఇచ్చి తర్వాత ఇద్దరం కలిసి చీఫ్ కి సెల్యూట్ చేసి, మీకు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తాను మీరు ఇక్కడ రెడీగా ఉండండి అని చెప్పి రూమ్ లో నుంచి బయటకు వచ్చాము.
మేమిద్దరం టెక్నికల్ వింగ్ లోకి వెళ్లి అక్కడ ఒక ఛాంబర్ లో కూర్చుని ఆపరేషన్ కి సంబంధించి నాకున్న అవసరాలు ఏంటో విక్రమ్ తో డిస్కస్ చేసాను. అయితే మనకి ఒక జామర్ కమ్ సాటిలైట్ కనెక్టివిటీ ఉన్న వెహికల్ అవసరం ఉంటుంది. ఇప్పుడు మన దగ్గర అది అవైలబుల్ ఉంది. నాకు ఒక అరగంట టైం ఇస్తే అన్నీ రెడీ చేసేస్తాను అని అన్నాడు విక్రమ్. .... గుడ్,,, అయితే మనం అరగంటలో పార్కింగ్ దగ్గర కలుద్దాం. ఈలోపు మేము కూడా కావలసిన వెపన్స్ తో రెడీగా ఉంటాము అని చెప్పి నేను స్టోర్ రూమ్ వైపు వెళ్ళాను. అప్పటికే ముగ్గురు కలిసి మాకు కావాల్సిన ఎక్విప్మెంట్ అంతా సిద్ధం చేసి ఉండటంతో మరొక బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ తీసుకొని అంతా పట్టుకెళ్లి కారులో సర్దుకున్నాము. విక్రమ్ కూడా తన వెహికల్ తో రెడీ అయిన తర్వాత నేను విక్రమ్ వెహికల్ లో కూర్చొని లొకేషన్ కి బయల్దేరాము.
దాదాపు నాలుగు గంటలు జర్నీ తర్వాత దట్టమైన అడవి ప్రాంతంలో నెమ్మదిగా ప్రయాణిస్తూ జిపిఎస్ లో లొకేషన్ గుర్తించి ఒక కిలో మీటరు దూరంలో ఆగాము. టైం దాదాపు 3:00 కావస్తోంది. వెహికల్స్ ని రోడ్డు పక్కన ఉన్న చిన్న మైదాన ప్రాంతంలో పార్క్ చేసి సోము, తార లను అక్కడే ఉండమని చెప్పి నేను, విక్రమ్, జెస్సీ నైట్ విజన్ గాగుల్స్ తగిలించుకొని నడుచుకుంటూ లొకేషన్ దగ్గరికి వెళ్ళాము. మైనింగ్ జరిగిన ప్రాంతం కావడంతో బాగా తవ్వేసిన ఒక లోయలాగా ఉన్న ప్రాంతమది. దానికి ఎదురుగా మరొక కొండ ఉండి ఈ రెండింటి నడుమ ఒక సన్నని నది ప్రవహిస్తున్నట్టు నీటి శబ్దం ద్వారా తెలుస్తుంది. వెహికల్ తీసుకుని ఆ లోయ ప్రాంతానికి వెళితే కచ్చితంగా వాళ్లకు తెలిసిపోయే ప్రమాదం ఉంది. అందువలన ఎదురుగా ఉండే కొండ మీదకి మేము చేరుకోగలిగితే వారి అండర్ గ్రౌండ్ డెన్ సిగ్నల్స్ క్యాప్చర్ చేసే అవకాశం దొరుకుతుందని విక్రమ్ చెప్పిన మీదట మేము ఎదురుగా ఉన్న కొండ వెనుకభాగం వైపు కొంత దూరం నడిచి వెళ్లి ఆ ప్రాంతాన్ని పరిశీలించాము.
అటు వైపు వెళ్లడానికి రోడ్డు ఏమీ లేదు గాని అది మరీ భారీ కొండ కాకపోవడంతో వీలైనంతవరకూ వెహికల్స్ ని లోపలికి తీసుకువెళ్లడానికి ప్రయత్నించవచ్చు అని నిర్ణయించుకొని వెనక్కి తిరిగి వచ్చి వెహికల్స్ లో బయలుదేరి లైట్లు లేకుండా పెద్దగా శబ్దం రాకుండా జాగ్రత్తగా లోపలి వరకు చేరుకొని వెహికల్స్ కనబడకుండా పచ్చటి తోపుల్లో పార్క్ చేసి మరి కొన్ని చెట్ల కొమ్మలను కూడా వాటి మీద కప్పి జాగ్రత్త పడ్డాము. ఆ తర్వాత ఆ గుట్టమీదకి ఎక్కి డెన్ ఉన్న ప్రాంతం సరిగ్గా కనబడేటట్టు ఒక ప్లేస్ చూసుకొని అక్కడ ఉన్న చెట్ల మధ్య మకాం ఏర్పాటు చేసుకున్నాము. విక్రమ్ తన వెహికల్ లోని సిస్టం ఆన్ చేసుకుని తన దగ్గర ఉన్న రెండు లాప్టాప్లు ఇంకా అవసరమైన సామగ్రి అంతా పట్టుకొని ఆ చెట్ల మాటున ఎవరికీ కనబడకుండా ఏర్పాటు చేసుకుని తన పని తాను చేయడం మొదలు పెట్టాడు.
అందరం బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు ధరించి మా వెపన్స్ అన్నీ సిద్ధం చేసుకుని విక్రమ్ ఇవ్వబోయే ఇన్ఫర్మేషన్ కోసం ఎదురుచూస్తున్నాము. అప్పటికే తెల్లవారి పోయి వెలుగు సంతరించుకుని ఎదురుగా గోడలాగా ఉన్న క్వారీ క్లియర్ గా కనబడుతోంది. బయటికి మైనింగ్ చేసి వదిలేసిన క్వారీ లాగా కనబడుతున్నా ఒక్క దగ్గర మాత్రం లోపలికి గుహలాగా ఉండి పైన మేడ ఉన్నట్టు ఓపెన్ ప్లేస్ కనబడుతోంది. రోడ్డు మీద నుంచి వెళ్తే అక్కడ అటువంటి ప్రాంతం ఒకటి ఉందని ఎవరికీ తెలిసే అవకాశం లేదు. అక్కడికి చేరుకోవడానికి ఒక మట్టి రోడ్డు ఉంది. ఆ ప్రాంతం చుట్టుపక్కల అటు ఇటు పైన కింద చెట్లు పెరిగి ఉన్నాయి. మేము బైనాక్యులర్స్ తో నిశితంగా పరిశీలించగా అప్పుడప్పుడు చెట్ల మీద నుంచి ఒకడు దిగుతుంటే మరొకడు పైకి ఎక్కుతున్నాడు. బహుశా డ్యూటీ షిఫ్టింగ్ అయి ఉంటుంది.