Episode 128.2


ఒక గంటసేపు పని చేసిన తర్వాత విక్రమ్ ఒక లాప్టాప్ లో ఆ ప్రాంతం తాలూకా శాటిలైట్ ఇమేజ్ మాకు చూపించాడు. కానీ లోపల ఎలా ఉందో తెలుసుకోవాలంటే సాటిలైట్ స్కాన్ చేయవలసి ఉంటుంది దానికి మరొక గంట సమయం పట్టే అవకాశం ఉంది అని చెప్పాడు విక్రమ్. మాకు తెలిసిన సమాచారం ప్రకారం అక్కడ మీటింగ్ జరగాలంటే చాలామంది స్మగ్లర్లు రావాల్సి ఉంది కాబట్టి మనం వెయిట్ చేయక తప్పదు అని ఒక నిర్ణయానికి వచ్చి విక్రమ్ ని తన పని చేసుకోమని వదిలేసాము. మేము మాత్రం అక్కడ జరుగుతున్న యాక్టివిటీస్ అన్నింటిని జాగ్రత్తగా వాచ్ చేస్తున్నాము. ఆ మేడ లాగా ఉన్న ప్రాంతంలో సుమారు ఒక ఐదుగురు గస్తీ కాస్తున్నారు. ఇంకా చుట్టుపక్కల చెట్ల మీద ఎంతమంది ఉన్నారు అన్నది తెలియాలంటే సాటిలైట్ స్కానింగ్ అందుబాటులోకి వచ్చే వరకు వెయిట్ చేయాలి.

మరొక గంటన్నర సమయం తర్వాత విక్రమ్ సాటిలైట్ స్కానింగ్ అందుబాటులోకి తెచ్చాడు. అందులో నుంచి ఆ డెన్ లోపలి భాగాన్ని చూసి మేమందరం విస్మయం చెందాము. ఆ కొండ లోపల చాలా వరకూ తవ్వేసి ఒక మినీ ఇండోర్ స్టేడియం లాగా తయారుచేయబడింది. ఒక పక్క గొడౌన్ లాగా ఉండి అందులో చాలా వరకు సామాగ్రి ఉన్నట్టు కనబడుతోంది. మధ్యలో ఒక వాలీబాల్ గ్రౌండ్ అంత ప్లేస్ కనబడుతుంది బహుశా అది కాన్ఫరెన్స్ హాలు అయి ఉండొచ్చు. మరోవైపు కూడా రెండు రూములు కనబడుతున్నాయి వాటికి ఆనుకొని బయటివైపు మరొక రూమ్ కనబడుతోంది. ఆ రూమ్ లో కంప్యూటర్ సెటప్ ఉన్నట్టు సిగ్నల్స్ ద్వారా తెలుస్తోంది. అంటే మా ఆపరేషన్ ముందు అక్కడి నుంచి మొదలు పెట్టాలి. గుహ లాగా ఉన్న ప్రాంతంలో కొంచెం లోపలికి ఆటోమేటిక్ ఎలక్ట్రికల్ గేట్ ఉంది.

దానికి కొంచెం పక్కన బయట నుంచి కంప్యూటర్ రూమ్ లోకి వెళ్లడానికి ఒక డోర్ ఉంది. మేము చాలా సేపు గమనించిన తర్వాత తెలుసుకున్న విషయం ఏమిటంటే, లోపలికి వెళ్లి వస్తున్న వ్యక్తులు వెళ్లేముందు తమ ఆయుధాన్ని కంప్యూటర్ రూమ్ లో ఒక పక్కన పెట్టి చేతి వేలి ముద్రలు స్కానింగ్ ద్వారా ఆ గేటు తెరుచుకుని లోపలికి వెళుతున్నారు. తిరిగి బయటకు వచ్చిన తర్వాత మళ్లీ తమ ఆయుధాన్ని తీసుకొని తమకు కేటాయించిన ప్లేస్ దగ్గరకు వెళ్లి గస్తీ కాస్తున్నారు. అంటే లోపలికి ఆయుధాలు తీసుకువెళ్లడం నిషేధము అని మాకు అర్థమైంది. బహుశా లోపల పేలుడు పదార్థాలు లేదా అంతకంటే విలువైన ఇంకేమైనా వస్తువులు ఉండి ఉంటాయి అని అనుకున్నాము. విక్రమ్ పూర్తిగా స్కానింగ్ చేసిన తర్వాత ఎక్కడెక్కడ మనుషులు నక్కి ఉన్నారు అన్న విషయం మాకు స్పష్టంగా తెలుస్తోంది.

మేము తెచ్చుకున్న ఆయుధాలలో రెండు స్నైపర్ గన్స్ ఉండడంతో నేను జెస్సీ తలా ఒకటి అందుకని రెండు వేరు వేరు ప్రాంతాల్లో సెట్ చేసుకుని రెడీ అయ్యాము. ఆ తర్వాత అందర్నీ కూర్చోబెట్టి, గయ్స్ ముందుగా మనం బయట పహారా కాస్తున్న వ్యక్తులను వీలైనంత తొందరగా ఇక్కడి నుంచే స్నైపర్స్ తో లేపేయాలి. ఆ తర్వాత తార, విక్రమ్ ఇక్కడే ఉండి మనల్ని లీడ్ చేస్తుంటే మనం ఈ లోయలోకి దిగి ఆ డెన్ దగ్గరికి చేరుకోవాలి. మనం దగ్గరకు చేరుకోగానే విక్రమ్ ఆ కంప్యూటర్ రూమ్ ని హ్యాక్ చేసి మనకు సిగ్నల్ ఇవ్వగానే మనం లోపలికి ఎంటర్ అవ్వాలి. లోపల ఎవరి దగ్గర ఆయుధాలు ఉండే అవకాశం లేదు కాబట్టి లోపలికి వెళ్లగానే కనపడిన వాడిని కనబడినట్టు కాల్చి పడేయడమే ఇక మిగిలినది అక్కడ ఎదురయ్యే పరిస్థితులను బట్టి ఉంటుంది అని అన్నాను.

విక్రమ్ మాట్లాడుతూ, మనం వాళ్ళ సిగ్నల్ ని హ్యాక్ చేసి ఒక అరగంట మాత్రమే ఆపగలం. ముందు వాళ్ళు దాన్ని గుర్తించలేకపోవచ్చు కానీ గుర్తించిన తర్వాత దానిని తిరిగి ఆర్డర్ లో పెట్టడానికి ఒక పదిహేను నిమిషాలు మాత్రమే పడుతుంది. ఇకపోతే ఇప్పటి వరకూ తేలిన లెక్కప్రకారం బయట చెట్లమీద ఆ మేడ మీద ఉన్న ఫ్లోర్ మీద మొత్తం 12 మంది ఉన్నారు. ఇప్పటికైతే లోపల మరొక 15 మంది కనబడుతున్నారు. మరి మీరు చెప్పిన దాని ప్రకారం మీటింగ్ కోసం రావలసిన వ్యక్తులు ఎంతమంది ఉంటారో? మనం వాళ్ళు వచ్చే దాక వెయిట్ చేసి చూడాల్సిందే అని అన్నాడు. .... సోము మాట్లాడుతూ, మనం ఫైరింగ్ మొదలు పెడితే ఏదో ఒక టైంలో వాళ్లకు తెలిసిపోయే అవకాశం ఉంటుంది కదా? అని అన్నాడు.

యస్,,, యూ ఆర్ రైట్. మనం ఒక పని చేద్దాం. ముందుగా కొండ పై భాగాన చెట్ల మీద ఉన్న వ్యక్తులతో మొదలుపెడదాం. ఆ తర్వాత మేడ మీద ఉన్న వ్యక్తులు ఆ తర్వాత అటు ఇటు ఉన్న వ్యక్తులు అయిపోయిన వెంటనే మనం ముగ్గురం కలిసి ఈ గుట్ట దిగి అటువైపు వెళ్లదాం ఈ లోపు తార కింద వైపు ఉన్న వ్యక్తుల పని పూర్తి చేస్తుంది. ఇక్కడ నుంచి మనం అక్కడికి చేరుకోవడానికి కొంత టైం పడుతుంది కాబట్టి తార ఈ పని ఈజీగా పూర్తి చేయవచ్చు. మనం ఎంట్రన్స్ దగ్గరికి చేరుకున్న వెంటనే సిగ్నల్ ఇస్తే విక్రమ్ తన పని మొదలుపెట్టి అక్కడ లోపల ఉన్న సిస్టం మొత్తాన్ని హ్యాక్ చేయవచ్చు. వీలైనంత తొందరగా మనం ఆ మెయిన్ గేట్ ఓపెన్ చేసి లోపలికి వెళితే మిగిలిన పని పూర్తి చేయవచ్చు. కానీ ఇదంతా ఆ మీటింగ్ మొదలైన తర్వాతే మొదలు పెట్టాలి. దాదాపు అందరూ లోపల ఉంటారు కాబట్టి బయట ఏం జరుగుతుంది అన్న విషయం వాళ్లకు తెలిసేలోపు మనం ఈ పని పూర్తి చేయాలి అని అన్నాను.

అందరూ ఆ ప్లాన్ కి కట్టుబడి ఉన్నట్టు థమ్సప్ సింబల్ చూపించుకున్నాము. తార నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండాలి నీతో పాటు విక్రమ్ సేఫ్టీ కూడా నువ్వే చూసుకోవాలి. అలాగే మేము కిందికి వెళ్లేటప్పుడు పొరపాటున మా మీద ఎటాక్ జరిగితే ఇక్కడి నుంచి నువ్వే మమ్మల్ని కవర్ చేయాల్సి ఉంటుంది. ఆర్ యూ రెడీ? అని అడిగాను. .... ఓకే మావ,,, అని నాతో అంది గాని పైకి లేచి అటూ ఇటూ దిక్కులు చూస్తుంది. .... వెంటనే సోము చెయ్యి పట్టుకుని కిందికి లాగి, మెంటల్ దాన ఏంటే నీ ఇంట్లో తిరిగినట్టు అటు ఇటు తిరుగుతున్నావు? అని అన్నాడు. .... ఎహే ఉండు,,, ఇక్కడ నేను ఆపుకోలేక చస్తుంటే నువ్వొకడివి,,, అని గసరడంతో అప్పటిదాకా సీరియస్ గా ఉన్న మేమంతా సైలెంటుగా నవ్వుకున్నాము. .... ఒసేయ్ ఇది అడివే కదా అలా పక్కకి వెళ్ళి పోసుకుని వచ్చేదానికి అంత కష్టపడటం ఎందుకు? అని నవ్వుతూ అన్నాడు జెస్సి.

సోము,, నువ్వు కూడా తోడు వెళ్లి తొందరగా పని చూసుకొని రండి అని నేను చెప్పడంతో జాగ్రత్తగా అడుగులో అడుగు వేసుకుంటూ గుట్ట వెనుక వైపు వెళ్లి పని చూసుకొని వచ్చారు. ఆ తర్వాత మిగిలిన మేము కూడా వెళ్లి తేలికపడి వచ్చి వెయిట్ చేస్తూ కూర్చున్నాము. సరిగ్గా తొమ్మిది గంటల ప్రాంతంలో అక్కడ కనిపిస్తున్న మట్టి దారి గుండా ఒక ఐదుగురు వ్యక్తులు చేతిలో ఏకే-47 లు పట్టుకొని ఆ గుహ వైపు నడుచుకుంటూ వెళ్తున్నారు. మేము బైనాక్యులర్స్ తీసి జాగ్రత్తగా పరిశీలించి చూడగా వాళ్ల మెడలో ఎర్ర కండువాలు కనబడటంతో వాళ్ళు నక్సలైట్స్ అని ఒక నిర్ధారణకు వచ్చాము. ఈ ప్రాంతంలో ఇంత పకడ్బందీగా తమ కార్యకలాపాలు నడుపుతున్నారు అంటే బహుశా వీళ్ళకి నక్సలైట్ల అండదండ ఉండి ఉంటాయి. బహుశా నక్సలైట్లకు ఆయుధాల సప్లై చేసేది కూడా వీళ్లే అయి ఉంటారు అని అనుకున్నాము.

నక్సలైట్లు లోపలికి వెళ్ళిన కొంతసేపటికి ఆ మట్టి దారి గుండా ఒక బస్సు దానికి ముందు వెనక రెండు కార్లు అక్కడికి వచ్చి ఆగాయి. ముందు ఉన్న కార్లో నుంచి దిగిన వ్యక్తిని గుర్తుపట్టి, గయ్స్,,, వాడే మన టార్గెట్. వాడిని ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రాణాలతో పట్టుకోవాలి అని చెప్పాను. సోము, జెస్సి కూడా ఆ వ్యక్తిని చూసి డన్,, అని అన్నారు. ఆ తర్వాత ఆ బస్సులో నుంచి దాదాపు పాతిక మంది వరకు కొంతమంది సూటు బూటు వేసుకుని, మరికొంతమంది స్టైలిష్ గా ముస్తాబై ఉన్న వ్యక్తులు దిగి లోపలికి నడిచారు. వెనుక ఉన్న కార్లో నుంచి కూడా నలుగురు వ్యక్తులు దిగి లోపలికి వెళ్లారు. ఒక పది నిమిషాల తర్వాత ఆ ప్రాంతం అంతా నిర్మానుష్యంగా మారింది. మళ్లీ ఒకసారి చెక్ చేసి చూడగా బయట ఆ 12 మంది వ్యక్తులు మాత్రమే గస్తీ కాస్తున్నారు అని కన్ఫామ్ అయ్యింది.

వెంటనే మేము మా ఆపరేషన్ మొదలు పెట్టడానికి సిద్ధమయ్యాము. సరిగ్గా అదే సమయంలో చీఫ్ దగ్గర్నుంచి కాల్ రావడంతో నేను కాల్ అటెండ్ అయ్యి ఇక్కడ పరిస్థితులను బ్రీఫ్ గా చెప్పి అవసరమైనప్పుడు వెంటనే మీకు సిగ్నల్ ఇస్తాము వీలైనంత తొందరగా రావడానికి ట్రై చేయండి ఈ లోపు ఇక్కడ మేము చేయగలిగింది చేస్తాము అని చెప్పి కాల్ కట్ చేసి స్నైపర్ రెడీ చేసుకుని లెట్స్ గో,, అని ఆర్డర్ వేసాను. సోము, తార బైనాక్యులర్స్ తో వాచ్ చేస్తుండగా విక్రమ్ మాకు ఆ వ్యక్తులు ఎక్కడ ఉన్నారో చూసి చెప్పడం మొదలు పెట్టాడు. అనుకున్న ప్లాన్ ప్రకారం ముందుగా పైన చెట్ల మీద ఉన్న నలుగురు వ్యక్తులను అయిదు సెకండ్ల గ్యాప్లో ఇద్దరం కలిసి షూట్ చేసేసాము. వాళ్లు చెట్లపై నుంచి కింద పడిన శబ్దం మేడ మీద ఉన్న వ్యక్తులకు వినబడినట్టు వాళ్ళు వెనక్కి తిరిగి పైకి చూశారు.

కానీ అంతలోనే మేము మళ్ళీ గురిపెట్టి ఆ మేడ మీద ఉన్న వ్యక్తులు అనుమానం నివృత్తి చేసుకునే లోపు అక్కడ ఉన్న ఐదుగురు వ్యక్తులను షూట్ చేసేసాము. గయ్స్,, అటు ఇటు ఒక్క వ్యక్తి మాత్రమే ఉన్నారు అని విక్రమ్ చెప్పడంతో మేమిద్దరం చెరొక వైపు నుంచి ఆ ఇద్దరినీ కూడా లేపేసాము. ఆ తర్వాత విక్రమ్ మొత్తం అంతా పరిశీలించి చూసి గయ్స్,,, పైన మూడు వైపులా ఆల్ క్లియర్. కానీ కిందవైపు ఒక్కడు కాదు ఇద్దరు ఉన్నారు అని స్క్రీన్ చూపించాడు. నేను లేచి స్నైపర్ తార చేతికి అందించి, గయ్స్,,, ఇట్స్ టైం టు గో,, అని చెప్పి మా గన్స్ మరియు మ్యాగజైన్స్, గ్రనేడ్స్ అన్ని చూసుకుని విక్రమ్ కి థమ్సప్ సిగ్నల్ చూపించి ఒకసారి అందరం మా మైక్రోఫోన్ లైన్ కనెక్టివిటీ చెక్ చేసుకుని ముగ్గురం కలిసి ఆ గుట్ట దిగడం ప్రారంభించాము. పైన మూడు వైపులా ఉన్న వాళ్ళందరూ చచ్చారు అన్న విషయం కింద ఉన్న వాళ్లకి తెలియదు.

మేము జాగ్రత్తగా చెట్లను తుప్పలను ఆసరాగా చేసుకుని వాటి వెనుక నక్కి ఎటువంటి అలజడి లేకుండా జాగ్రత్త పడుతూ కింద చిన్న కాలువలా పారుతున్న నది దగ్గరకు చేరుకున్నాము. దానిని దాటి అటువైపు పైకి ఎక్కడం మొదలు పెట్టి సగం వరకు పైకి వెళ్ళేసరికి కింద చెట్ల మీద ఉన్న ఇద్దరు వ్యక్తుల మాటలు వినపడటం మొదలైంది. వెంటనే మేము మైక్రోఫోన్ లో విక్రమ్ మరియు తార లకు సిగ్నల్ అందించడంతో ఒక పది సెకండ్ల గ్యాప్ లో ఆ ఇద్దరు వ్యక్తులు చెట్ల మీద నుంచి పడి కొంతదూరం కిందికి దొర్లుకుంటూ వెళ్ళిపడ్డారు. వాళ్ళిద్దరి పని అయిపోయింది అని విక్రమ్ కన్ఫామ్ చేసిన తర్వాత మేము గబగబా పైకి ఎక్కుతూ మరో పది నిమిషాల సమయానికి మెయిన్ ఎంట్రన్స్ దగ్గరకు చేరుకున్నాము. ఆలోపు విక్రమ్ మాట్లాడుతూ గయ్స్,, ఆ నక్సల్స్ తిరిగి వెళ్ళిపోతున్నారు మీరు కొంచెం వెయిట్ చేయండి అని మమ్మల్ని ఆపాడు. మళ్లీ ఒక ఐదు నిమిషాల పాటు ఒక గోడ చాటున నక్కి వెయిట్ చేసాము. మళ్లీ విక్రమ్ సేఫ్ అని సిగ్నల్ ఇవ్వడంతో గోడ చాటుగా నిల్చుని చూడగా ఆ ఎలక్ట్రికల్ ద్వారం వద్ద ఇద్దరు మనుషులు గన్స్ పట్టుకొని నిలుచొని కనబడ్డారు.

ముగ్గురం సైగలు చేసుకుని సోము లీడ్ చేయగా అటునుంచి వాళ్ళు గమనించి రియాక్ట్ అయ్యేలోపు నేను జెస్సీ వాళ్లకి ఎదురుపడి షూట్ చేసి పడేసి ఆ కంప్యూటర్ రూమ్ దగ్గరికి వెళ్లి నిలుచున్నాము. అప్పటికే విక్రమ్ వాళ్ళ సిస్టంని హ్యాక్ చేసి ముందుగా రికార్డింగ్ చేసుకుని పెట్టుకున్న వీడియో ప్లే చేస్తూ ఉండడంతో లోపల ఎటువంటి హడావుడి కనబడలేదు. సాటిలైట్ స్కాన్ సిగ్నల్ ద్వారా మేము ఆ రూమ్ బయట ఉండడం గమనించిన విక్రమ్ లోపల ముగ్గురు మనుషులు ఉన్నట్టు మాకు చెప్పి ఆ రూమ్ డోర్ లాక్ ఓపెన్ చేసి గో ఎ హెడ్,,, అని మా రూట్ క్లియర్ చేశాడు. వెంటనే మేము ఆ డోర్ తన్నేసరికి లోపల ఉన్న వ్యక్తులు అలర్ట్ అయ్యి ఒక మూలన పెట్టి ఉన్న గన్స్ వైపు పరిగెత్తబోతుండగా మేము లేట్ చేయకుండా ముగ్గురిని షూట్ చేసేసాము. కానీ వాళ్ళు పోతూపోతూ గట్టిగా అరిచి పోయారు.

బహుశా లోపల ఉన్న వాళ్లకు ఆ అరుపులు వినబడే అవకాశం ఉందో ఏమో గాని మరొక అరనిమిషంలో ఆ ఎలక్ట్రిక్ గేటు తెరుచుకున్న శబ్దం వినబడడంతో మేము అలర్ట్ అయ్యి ఆ రూమ్ లో నుంచి బయటకు పరుగెత్తి లోపలి నుంచి బయటకు వస్తున్న ఇద్దరు వ్యక్తులను షూట్ చేయడంతో వాళ్లు అక్కడే నేలకూలారు. అంతలో సోము ముందుకు పరిగెట్టి ఆ డోర్ మూసుకుపోకుండా ఆపడంతో మేమిద్దరం కూడా ముందుకు కదిలి కింద పడ్డ ఒక వ్యక్తిని ఆ రెండు డోర్లు మూసుకుపోకుండా మధ్యలో పడేసాము. గయ్స్ వెయిట్,,, అని అనడంతో జెస్సీ, సోము లోపల వారికి కనబడకుండా ఆ డోర్స్ కి అటు ఇటు నక్కి నిల్చున్నారు. నేను ఆ గుహద్వారం ఎంట్రన్స్ దగ్గరికి వచ్చి చీఫ్ ని లైన్ లోకి తీసుకొని, సర్ సగం పని పూర్తయింది. ఇక్కడ మాకు కొత్తగా తెలిసిన విషయం ఏమిటంటే కొంత మంది నక్సల్స్ ఇక్కడికి వచ్చి వాళ్ళను కలిసి వెళ్లారు . వాళ్ళు వెళ్లి 7 నిమిషాలు అవుతుంది మీకు లొకేషన్ పంపిస్తున్నాను వీలైనంత తొందరగా ఈ లొకేషన్ చుట్టుపక్కల గాలిస్తే వాళ్లను కూడా పట్టుకోవచ్చు. మీరు నాతో పాటు లైన్ లో ఉండండి మేము లోపలికి ఎంటర్ అవుతున్నాము అని చెప్పి లోపలికి వచ్చి ముగ్గురం కలిసి డోర్ దాటుకుని లోపలికి అడుగు పెట్టాము.

నాకు మైక్రోఫోన్ లో అక్కడ చీఫ్ అందర్నీ సమాయత్తం చేస్తున్న మాటలు వినబడుతున్నాయి. ఇటు విక్రమ్ కూడా, గయ్స్ లోపల హడావుడి మొదలైంది బహుశా ఆ డోర్ ఓపెన్ చేసి ఉన్నందున లోపల అలారం మోగి ఉంటుంది. మీరు తొందరగా రియాక్ట్ అవ్వాలి అని హెచ్చరించాడు. చిన్న సందు లాగా ఉన్న ఒక 20 అడుగుల ప్రాంతాన్ని దాటుకొని లోపలికి వెళ్ళేసరికి పెద్ద హాల్ లాగా కనబడింది. సరిగ్గా అదే సమయంలో అక్కడ హెలికాప్టర్లు గాల్లోకి లేస్తున్న శబ్దం నాకు వినబడుతోంది. లోపల ఒక టేబుల్ దాని వెనుక ఐదు కుర్చీలలో ఐదుగురు కూర్చుని ఉన్నారు. అందులో మధ్యలో నా టార్గెట్ కూర్చుని ఉన్నాడు. వారికి ఎదురుగా కుర్చీలలో ఒక పాతిక మంది కూర్చొని ఏదో జరిగినట్టు కంగారు పడుతూ వెనక్కి చూస్తున్నారు. అటూ ఇటూ నిల్చున్న బౌన్సర్లు లాంటి వ్యక్తులు డోర్ వైపు పరిగెత్తి వస్తున్నారు.

గయ్స్,,, ఆ బౌన్సర్లు తప్ప వీలైనంత వరకు అందర్నీ కాళ్ల మీద కాల్చండి, ముందుగా బౌన్సర్లు అందరిని టార్గెట్ చేయండి అని ఆర్డర్ వేస్తూనే దాదాపు ఇరవై మందికి పైగా ఉన్న బౌన్సర్ ల మీద బుల్లెట్ల దాడి మొదలు పెట్టాము. అది నో ఫైరింగ్ జోన్ కావడంతో లోపల ఉన్న స్మగ్లర్లు అందరూ భయంతో ఒక మూలకు చేరిపోతున్నారు. సరిగ్గా పది నిమిషాలు కాల్పులు జరిగిన తర్వాత బౌన్సర్లు అందరూ నేలకూలారు. ఆ తర్వాత అటూ ఇటూ చెల్లాచెదురుగా మూల మూలకు వెళ్లి తమ ప్రాణాలు కాపాడుకోవడం కోసం దాక్కుంటున్న స్మగ్లర్లు అందర్నీ వెతికి పట్టుకుని మరీ వాళ్లు ఎటూ పారిపోకుండా మోకాళ్ళ మీద తొడల లోను బుల్లెట్లు దింపి కట్టడి చేసాము. సరిగ్గా అదే సమయానికి చీఫ్ మాట్లాడుతూ, వుయ్ ఆర్ జస్ట్ ఫైవ్ మినిట్స్ అవే,,, అన్నారు. .... డోంట్ వర్రీ,,, మిషన్ కంప్లీట్ అయ్యింది మీకు వీలైతే విక్రమ్ ని కాన్ఫరెన్స్ లోకి తీసుకొని ఆ వెళ్ళిన నక్సల్స్ పని చూడండి అని అన్నాను.

వెల్ డన్ మై బాయ్స్,,, విల్ మీట్ ఇన్ ఫ్యూ మినిట్స్ అని చీఫ్ అనగానే నేను చీఫ్ కాల్ కట్ చేసి అక్కడ ఆర్తనాదాలు పెడుతూ చెల్లాచెదురుగా పడి ఉన్న స్మగ్లర్లు అందరిని బాగా చెక్ చేసి ఎవరూ పైకి లేవలేరు అని నిర్ధారించుకున్న తర్వాత అక్కడే ఓ మూలన ఓ కుర్చీ చాటున నక్కి ఉన్న నా టార్గెట్ ని గమనించాను. కానీ వాడిని నేను చూడలేదు అన్నట్టు నటిస్తూ అదే విషయాన్ని జెస్సీ సోము లకు సిగ్నల్ ఇచ్చాను. దాంతో వాళ్లు కూడా నటిస్తూ, దీనమ్మ,,, ఈ నాకొడుకులకి దేశాన్ని నాశనం చేయడం అంటే చాలా సరదాగా ఉన్నట్టుంది అని అన్నాడు జెస్సీ. .... అవున్రా చూడు పొద్దు పొద్దున్నే తయారయ్యి మీటింగ్ పెట్టుకోడానికి రెడీ అయ్యి వచ్చేసారు ఎదవలు అని అన్నాడు సోము. మేమందరం కెమెరాలు కూడా ధరించి ఉండటంతో సోము జెస్సి అటు ఇటు తిరుగుతూ అక్కడ ఉన్న ఏరియా మొత్తం కవర్ అయ్యేలా చూస్తున్నారు.

ఇలాంటి ఒక ఎటాక్ జరుగుతుందని ఊహించని అక్కడ పడి ఉన్న స్మగ్లర్లు అందరూ భయం భయంతో చూస్తూ వణుకుతూ గాయాలు కావడంతో అరుస్తూ ఉన్నారు. అందులో కొంతమంది స్పృహతప్పి పడి ఉన్నారు బహుశా కొంతమంది చనిపోయి కూడా ఉండవచ్చు. నేను నెమ్మదిగా ముందుకు నడుచుకుంటూ వెళ్లి నా కెమెరా మరియు మైక్ కట్ చేసి కుర్చీ వెనుక దాక్కున్న నా టార్గెట్ దగ్గరకు వెళ్లి కుర్చీ పక్కకు తప్పించాను. బహుశా వాడు ఇంతవరకు నన్ను గుర్తు పట్టలేదనుకుంటాను నేను అంత దగ్గరగా ఎదురుగా కనపడే సరికి ఉలిక్కిపడి, ను ను నువ్వు,,, ఇంకా బతికే ఉన్నావా? అని అన్నాడు. .... అవున్రా నా కంస మామ,,, నేను ఇంకా బతికే ఉన్నాను. నువ్వు ఏమనుకున్నావు,, నీ లెక్క సరి చేయకుండానే పోతాననుకున్నావా? నీ తెలివి అంతే అయితే నువ్వు చాలా పొరబడ్డావురా మామ అని అన్నాను.

కానీ నువ్వు ఇంకా చావకుండా ఎలా బతికి ఉన్నావు? నా కళ్ళ ముందే నిన్ను కొట్టి షూట్ చేసి ఆ లోయలో విసిరి పడేసారు కదా? అయినా పర్వాలేదు నువ్వు తిరిగి చావును వెతుక్కుంటూ మళ్ళీ నా దగ్గరకే వచ్చావు కదా ఇప్పుడు నిన్ను బతకనివ్వను అంటూ తన వెనక దాచుకున్న గన్ తీసి నాకు గురి పెట్టాడు. వెంటనే నేను అలర్ట్ అయ్యి ఒక్క కిక్ తో వాడి చేతిలో నుంచి గన్ దూరంగా పడేటట్టు తన్నాను. ఆ తర్వాత ఆ చేతిని పట్టుకొని మోచేయి దగ్గర మెలిపెట్టి విరిచాను. నువ్వు ఎన్ని జన్మలెత్తినా నన్ను చంపలేవురా నా కంస మామ,, అంటూ కడుపులో ఒక స్ట్రాంగ్ కిక్ ఇచ్చాను. దాంతో వాడు వెనక్కి వెళ్లి గోడకు గుద్దుకుని ఆగి అరవడం మొదలు పెట్టాడు. వాడి ఆర్తనాదాలు వింటూ ముందుకు కదిలి కొంతసేపు ఆగకుండా వాడి బాడీ తో ఫుట్ బాల్ ఆడుకున్నాను.

ఆ తర్వాత వాడిని పైకి లేపి కసితీరా నేలకేసి కొట్టి, నీయబ్బ,,, మా అమ్మని అటువంటి దుస్థితికి చేరుస్తావారా నువ్వు? నా కుటుంబం మొత్తాన్ని మానసికంగా చిత్రహింసలకు గురిచేశావు కదరా? అమ్మమ్మ తాతయ్య లను కూడా పొట్టనపెట్టుకున్నావు కదరా? నువ్వు చేసిన పాపాలు అన్నింటిని లెక్కగట్టి ఒక్కొక్క దానికి ఈరోజు బదులు తీర్చుకుంటాను. నీ మూలంగా ఇన్ని సంవత్సరాలుగా నా కుటుంబానికి దూరం అయ్యి వాళ్ల ద్వేషాన్ని భరించాల్సి వచ్చింది కదరా? అని అక్కడే కొంచెం దూరంలో కనబడిన ఒక బేస్బాల్ బ్యాట్ లాంటి కర్రని అందుకని నా మేనమామ అయినటువంటి జగదీష్ వర్మను పిచ్చికొట్టుడు కొట్టి చితగొట్టేసాను. అలా కొట్టడంలో భాగంగా ఒకసారి వాడి తల మీద తగలడంతో స్పృహ తప్పి పడ్డాడు. వెంటనే నేను తారకు కనెక్ట్ చేసి మాట్లాడుతూ, వెంటనే మీరు అన్నీ సర్దుకొని వెహికల్ తీసుకుని ఇక్కడకు రండి. కం ఫాస్ట్,,, అని గట్టిగా చెప్పాను.

ఇంతలో జెస్సి పిలుపు వినబడి ఎడమ చేతి వైపు ఉన్న గోడౌన్ దగ్గరకు వెళ్లాను. లోపల చూడగా చాలా చెక్క పెట్టెలు వరుసగా పేర్చి కనబడ్డాయి. ముగ్గురం కలిసి వాటిని ఓపెన్ చేసి చూడగా వాటినిండా లేటెస్ట్ గన్స్, ఏకే 47లు ఇంకా రకరకాల మారణాయుధాలు కనబడ్డాయి. ఆ తర్వాత ఆపోజిట్ లో ఉన్న రూములు కూడా చెక్ చేసే సరికి అక్కడ కనబడిన ప్యాకెట్లు చూసి ముగ్గురం ఒకరి మొహం ఒకరు చూసుకుని నవ్వుకున్నాము. ఎందుకంటే ఆ రోజు మేము పట్టుకున్న కంటైనర్ లోని మాదక ద్రవ్యాలు మొత్తం ఇక్కడే ఉన్నాయి. అంతే కాకుండా మరో రూమ్లో కూడా అంతకుమించి గంజాయి బస్తాలు పేర్చి కనబడ్డాయి. ఇంతలో బయట నుంచి తార వచ్చేసాము అని చెప్పడంతో నా కంస మామ బాడీని భుజానికెత్తుకుని బయటికి వెళ్లి మా కారు డిక్కీలో పడేసి కాళ్లు చేతులు కట్టేసి డిక్కీ క్లోజ్ చేసి, మీరిద్దరూ తొందరగా ఇక్కడినుంచి బయలుదేరి మళ్ళీ మనం దాక్కున్న ప్లేస్ కి వెళ్ళిపొండి అని వాళ్ళను పంపించేసాను.

వాళ్ళు వెళ్ళిన ఐదు నిమిషాలకి చీఫ్ లైన్ లోకి వచ్చి, వుయ్ ఆర్ ల్యాండింగ్,,, అని చెప్పారు. మాకు హెలికాప్టర్ చప్పుళ్ళు కూడా వినబడ్డాయి. మేము ఆ గుహలో నుంచి బయటకు వచ్చి చూడగా ముందుగా చీఫ్ ఇద్దరు గార్డ్స్ తో వస్తుండగా వెనుక ఒక పదిమంది బెటాలియన్ మార్చ్ ఫార్వర్డ్ చేస్తూ వస్తున్నారు. మేము ముగ్గురం చీఫ్ కి సెల్యూట్ చేయగా, వెల్ డన్ మై బాయ్స్,,, అంటూ మమ్మల్ని అభినందించి తనతోపాటు ఉన్న గార్డ్స్ ను అక్కడే ఆగమని చెప్పి మాతో పాటు లోపలికి నడిచారు. లోపల ఉన్న సెటప్ అంతా చూసి చీఫ్ కూడా చాలా ఆశ్చర్యపోయారు. మన కళ్ళుగప్పి ఇంత తతంగం ఇక్కడ నడిపిస్తున్నారంటే మనకు చాలా అవమానం అని అన్నారు. .... సెక్యూరిటీ అధికారి డిపార్ట్మెంట్, మరోవైపు నక్సల్స్,, వీళ్ళ అండదండలు ఉండగా ఇటువంటివి చెయ్యడం అవి మన దృష్టిన పడకపోవడం పెద్ద కష్టమేమీ కాదు సార్ అని అన్నాను.

ఓకే,, ఇంకా నేను తెలుసుకోవాల్సింది ఏమైనా ఉందా? అని అడిగారు చీఫ్. .... యస్ సర్,,, మెయిన్ కింగ్ పిన్,,, తప్పించుకొని పారిపోయాడు. వాడిని వెతికి పట్టుకుని తీసుకొచ్చి మీకు అప్పజెప్తాను. కాకపోతే వాడు బతికి ఉంటాడో చస్తాడో గ్యారంటీ ఇవ్వలేను అని అన్నాను. .... చీఫ్ నావైపు కొద్ది క్షణాలు సూటిగా చూసి, ఊఊం,,, అర్థమైంది, ఇంకా ఏమైనా ఉన్నాయా? అని అన్నారు. .... సార్ ముందు బెటాలియన్ ని పిలిపించి ఆ గొడౌన్లో ఉన్న మారణాయుధాలు, ఇక్కడ పడి ఉన్న స్మగ్లర్ల బాడీలు రికవరీ చేయించండి. ఇందులో కొంత మంది బతికి ఉండే అవకాశాలు ఉన్నాయి మనకు సాక్ష్యాలుగా ఉపయోగపడతారు అని అన్నాను. వెంటనే ఛీఫ్ బెటాలియన్ ని లోపలికి రప్పించి ఆయుధాలను, స్మగ్లర్లను బయటికి చేరవేశారు.

ఆ తర్వాత మేము చీప్ ని ఆ ఎదురుగా ఉన్న రెండు రూముల లోకి తీసుకుని వెళ్లి చూపించి, ఆరోజు రుద్ర మనం పట్టుకున్న సరుకుని పక్కదారి పట్టించి ఇక్కడికి చేరవేశాడు అని చెప్పాము. .... ఈ స్థాయిలో ఇక్కడ స్మగ్లింగ్ జరుగుతున్నా మనకు ఏమాత్రం అనుమానం కలగలేదు అంటే వీళ్ళ నెట్వర్క్ చాలా స్ట్రాంగ్ గా ఉందన్నమాట. నిజంగానే ఇది ఒక సన్సేషనల్ కేస్. ఒక బెటాలియన్ మొత్తం చేయాల్సిన పని మీ నలుగురి టీం చేయడం నాకు చాలా గర్వంగా ఉంది. అయితే వీటిని కూడా బయటకి పంపిద్దాం అంటూ చీఫ్ మాట్లాడబోయేంతలో నేను అడ్డు పడి, ఎందుకు సార్ వీటిని బయట పెట్టడం? దీన్ని మళ్ళీ సెక్యూరిటీ ఆఫీసర్ల దగ్గరకు చేర్చడం అక్కడ ఎవడో ఒకడు వీటిని పక్కదారి పట్టించడం లేదా డిస్ట్రిబ్యూట్ చేసి సొసైటీ లోకి పంపించడం తద్వారా యువతీ యువకులు తమ జీవితాలు నాశనం చేసుకోవడం ఇదంతా అవసరమా సార్? ఇక్కడే తగలెట్టేస్తే పోలా? అని అన్నాను.

నువ్వు చెప్పింది పాయింటే కానీ ఇంతపెద్ద కేసుని నిరూపించాల్సిన బాధ్యత కూడా మనమీద ఉంటుంది కదా? ఒక్కసారి వీటి లెక్కలు అన్ని మెజిస్ట్రేట్ మరియు మీడియా ముందుకు వెళ్లిపోతే ఆ తర్వాత మనం ఏదో ఒకటి చేయడానికి ప్లాన్ చేద్దాం. అంతవరకు వీటిని జాగ్రత్తగా కాపాడే బాధ్యత నాది అని హామీ ఇచ్చారు చీఫ్. ఆ తర్వాత వాటిని కూడా రికవరీ చేసి బయటకు వెళుతూ, సార్ కనీసం ముందు ముందు ఎవరికి ఉపయోగపడకుండా ఈ డెన్ నాశనం చేసేద్దామా? అని అన్నాను. .... ఓకే,, కానీ నీకెందుకు ఆ శ్రమ? అంటూ బెటాలియన్ ని పిలిచి డైనమేట్స్ పెట్టి ఆ డెన్ ని నేల కూల్చేశారు. దానికంటే ముందు ఆ కంప్యూటర్ రూమ్ లో ఉన్న హార్డ్ డిస్కులు రికవరీ చేశారు. నక్సలైట్ల సంగతి ఏంటి? అని అడగగా వాళ్ల ట్రేసింగ్ ని లోకల్ కూంబింగ్ ఆపరేషన్ అధికారులకు అప్పజెప్పినట్లు చెప్పారు. థాంక్ గాడ్,,, లక్కీగా మీడియా లేదు, ఇక మేము బయలుదేరుతాము సార్ రాత్రి లోపు వాడిని మీ ముందుకు తీసుకు వస్తాను అని చెప్పి కాలినడకన బయలుదేరి తార, విక్రమ్ లను కలిసి తిరిగి ప్రయాణం అయ్యాము.

Next page: Episode 129.1
Previous page: Episode 128.1