Episode 129.1
స్మగ్లర్లు, మారణాయుధాలు, మాదక ద్రవ్యాలు అన్నిటినీ రికవరీ చేసిన తర్వాత బయట పడి ఉన్న శవాల లెక్కల గురించి కూడా చీఫ్ తో చెప్పి మేము అక్కడ నుంచి నడుచుకుంటూ బయలుదేరి తార, విక్రమ్ లను కలిసి అక్కడి నుంచి తిరుగు ప్రయాణం అయ్యాము. అప్పటికి దాదాపు మధ్యాహ్నం 1:30 అయిపోవడంతో బాగా ఆకలిగా అనిపించి దారిలోని ఒక దాబా దగ్గర ఆగి భోజనం ఆర్డర్ చేసాము. అందరము మా బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ తీసేసి మా వెంట తెచ్చిన సామానంతా జాగ్రత్తగా సర్దిపెట్టి ఫ్రెష్ అయ్యి భోజనానికి కూర్చున్నాము. భోజనం చేస్తూ, థాంక్యూ విక్రమ్,,, నీ టెక్నికల్ సపోర్ట్ ఉండటంవల్ల ఇంత పెద్ద ఆపరేషన్ చాలా ఈజీగా పూర్తి చేయగలిగాము అని అన్నాను. .... నో నో నో,,, నేనే మీ టీంకి థాంక్స్ చెప్పాలి.
నేను సర్వీస్ లో జాయిన్ అయిన తర్వాత ఇంత పెద్ద ఆపరేషన్ అటెండ్ అవ్వడం ఇదే మొదటిసారి. ఇంతకుముందు చాలావరకూ ఆఫీస్ లోనే కూర్చుని చిన్నచిన్న ట్రాకింగ్ పనులు మాత్రమే చేసేవాడిని. ఏదో ఒకటి రెండు సందర్భాల్లో మాత్రమే సాటిలైట్ స్కానింగ్ లాంటి టెక్నాలజీ ఉపయోగించడం జరిగింది. కానీ ఈ రోజు ప్రత్యక్షంగా ఒక ఆపరేషన్ స్పాట్ లో ఉండి టెక్నాలజీ యూజ్ చేయడం నాకు చాలా సంతృప్తినిచ్చింది. ఇక మీదట కూడా ఇటువంటి ఆపరేషన్ ఉండేటప్పుడు నన్ను మీతో పాటు కలుపుకోండి. మీకు ఎప్పుడూ ఎటువంటి టెక్నికల్ సపోర్ట్ కావాలన్నా మీరు డైరెక్ట్ గా నన్ను కాంటాక్ట్ చేయండి. నేను మీకోసం ఎప్పుడూ సిద్ధంగా ఉంటాను అని అన్నాడు విక్రమ్. .... థాంక్యూ బాస్,,, నీలాంటి టెక్నికల్ పర్సన్ తోడుంటాను అంటే మేమెందుకు కాదంటాం? ఆన్ డ్యూటీయే కాదు ఆఫ్ డ్యూటీలో కూడా మనం మరింత ఎక్కువగా కలుసుకుందాం అని భోజనం ముగిసిన తర్వాత అక్కడినుంచి బయలుదేరి విక్రమ్ తన దారిన వెళ్లిపోగా మేము ఇంటిబాట పట్టాము.
అక్కడి నుంచి బయలుదేరే ముందు నేను కొంచెం పక్కకు వెళ్లి కవిత అమ్మకి ఫోన్ చేశాను. అమ్మ నేను ఇంటికి వస్తున్నాను మీరందరూ తయారయ్యి రెడీగా ఉండండి. అలాగే దేవి అక్కకి ఫోన్ చేసి వాళ్ళ అమ్మని, అభి, అను లతో సహా దినేష్ వర్మ గారి ఇంటికి రమ్మని చెప్పు అని అన్నాను. .... కానీ ఇప్పుడు మళ్ళీ అందరూ అక్కడికి ఎందుకు నాన్న, అంత అవసరం ఏమొచ్చింది? అని అడిగింది అమ్మ. .... నువ్వు వాళ్ళని అక్కడికి రమ్మని చెప్పమ్మా, కొద్దిసేపట్లో అన్ని విషయాలు నీకే తెలుస్తాయి అని అన్నాను. .... సరే నాన్న నువ్వు జాగ్రత్తగా ఇంటికి వచ్చేయ్ అని చెప్పి కాల్ కట్ చేసింది అమ్మ. .... జెస్సీ కారు నడుపుతుండగా నేను పక్క సీట్లో కూర్చొని కొంచెం రిలాక్స్ అయ్యాను. గత నాలుగు రోజులుగా జరిగిన విషయాల గురించి ఆలోచిస్తూ రవి తలంపు రవడంతో వాడితో మనసువిప్పి మాట్లాడాలి అనిపించింది.
ఒరేయ్ రవి నీతో ఒక విషయం మాట్లాడాలిరా,, .... ఏంటో చెప్పరా? .... ఇప్పుడు నేను ఆ ఇంటికి వెళ్లి ఉండలేనురా. నా కంస మామ లాంటి నీచుడి మాటలు విని అక్కడున్నవారంతా నన్ను పసివాడిని అని కూడా చూడకుండా ఇంట్లో నుంచి గెంటేశారు. అఫ్ కోర్స్ ఇప్పుడు కార్తీక అక్క తన తప్పు తెలుసుకుంది అలాగే రేపు నాన్న అత్తయ్య కూడా తమ తప్పు తెలుసుకుంటారు. కానీ వాళ్ళందరితో కలిసి ఆ ఇంట్లో ఉండటం అనే విషయం నాకు మింగుడు పడటం లేదు. .... అయితే ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? .... నేను వాళ్లతో కలిసి ఉండను. నేను కవిత అమ్మ దగ్గరే ఉంటాను. అక్కడ నన్ను ప్రేమించే ఒక మంచి కుటుంబం ఉంది. కవిత అమ్మ దగ్గర ఉంటే మనసుకి ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. అలాగే ఇంకా నన్ను ప్రేమించే పుష్ప వదిన కుటుంబం, అరుణ లాంటి మంచి మనుషులకు దగ్గరగా ఉన్నట్టు ఉంటుంది.
ఇక మన బుజ్జమ్మ సంగతి అంటావా దాన్ని నేను ఎలాగైనా కలుసుకుంటాను. అలాగే సుమతి పిన్నిని కలుసుకోవడం నాకేమీ అంత కష్టం కాబోదు. నా కోసం ప్రాణాలు ఇచ్చే స్నేహితులు ఇంతమంది ఉండగా ఇక నాకు అంతకంటే ఇంకేం కావాలి? .... నీ మనసుకు ఏది నచ్చితే అది చేయరా. .... కాకపోతే ఒక్క విషయం నా మనసుని గుంజేస్తోంది. ఒకవేళ సుప్రియ అమ్మకి తన జ్ఞాపక శక్తి తిరిగి వచ్చి నన్ను ఆ ఇంటికి తీసుకుని వెళ్ళి తన దగ్గరే ఉంచుకోవాలి అని అనుకుంటే? .... అలా ఏం జరగదు లేరా. అయినా పై వాడి రాతను ఎవరు మాత్రం మార్చగలరు? .... అవునులే నువ్వు చెప్పేది కూడా నిజమే. ఏది ఎలా జరగాలని రాసిపెట్టి ఉందో అలాగే జరుగుతుంది. సరే ముందు వెళ్లి కనీసం కార్తీక అక్కకి తన అమ్మని అప్పచెబుదాం.
కానీ ఇకముందు కూడా నేను ఐబి ఏజెంట్ గా కొనసాగాలా లేదో అర్థం కావడం లేదు. ఎందుకంటే ఇంతవరకు చేసిన పనులన్నీ ఏదో నా సొంత సమస్య కోసం చేసుకున్నట్లే ఉంది. .... అయితే మాత్రం ఏమైంది? రుద్ర విషయంలో నువ్వు చేసేది డిపార్ట్మెంట్ పనే కదా? ఇంకా నువ్వు వాడి పని కూడా ముగించాల్సి ఉంది. ఆ తర్వాత నువ్వు కావాలనుకుంటే డిపార్ట్మెంట్ నుంచి తప్పుకోవచ్చు. ఎలాగూ నీకు నీ బిజినెస్ తో ఊపిరి సలపని పని ఉండనే ఉంది కదా? అయినా నువ్వు ఇంత వరకు చేసిన చాలా సాహసాలు అన్నీ నీ కోసం చేసినవి కాదు కదా? రుద్ర ఇచ్చిన లిస్టులో నువ్వు చంపిన వారందరూ చట్ట వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న వారే కదా? వాడు వాడి స్వార్థం కోసం చేయించుకున్నా నువ్వు నీ డ్యూటీ చేశావు. .... సరేలే దీని గురించి నేను ఆలోచించి నిర్ణయం తీసుకుంటాను.
కారు సడన్ బ్రేక్ వేయడంతో కుదుపుకి తెలివి వచ్చి కళ్ళు తెరిచాను. ఇంత వరకు రవితో నా సంభాషణ అంతా కలలో జరిగింది. బయటికి చూడగా మేము సిటీలోకి ఎంటర్ అయ్యాము. జెస్సీ,, కారు కవిత అమ్మ ఇంటికి పోనియ్. నన్ను అక్కడ దించేసి మీరు దినేష్ వర్మ ఇంటికి వెళ్లి బయట వెయిట్ చేయండి. నేను అమ్మను తీసుకొని అక్కడికి వచ్చి లోపలికి వెళ్ళిన తర్వాత మీకు సిగ్నల్ ఇచ్చినప్పుడు ఈ నీచుడిని లోపలికి తీసుకొని రండి అని చెప్పాను. కొంతసేపటికి నన్ను దించేసి వాళ్లు ముగ్గురు వెళ్లిపోయారు. నేను ఇంట్లోకి వెళ్లేసరికి అందరూ సిద్ధంగా ఉన్నారు. నిన్నటికి ఈరోజుకి సుప్రియ అమ్మ అవతారంలో కొంచెం మార్పు వచ్చింది. అంకుల్ తన కారు తియ్యగా ప్రీతి ముందు కూర్చోగా నేను అమ్మలు ఇద్దరిని నా కారులో కూర్చోబెట్టుకొని బయలుదేరాను.
ఏంటి నాన్న అందర్నీ అర్జెంటుగా అక్కడికి ఎందుకు రమ్మన్నావు? అని అడిగింది కవిత అమ్మ. .... మరి కొద్దిసేపు ఓపిక పట్టమ్మ ఈ రోజు మీ అందరి ముందుకు ఒక నిజాన్ని తీసుకు వస్తున్నాను. కొద్దిసేపు ఓపికగా ఉంటే అన్ని విషయాలు మీ కళ్ళ ముందుకు వస్తాయి అని చెప్పాను. మరికొంతసేపటికి మేమంతా అక్కడికి చేరుకొని కార్లో నుంచి బయటికి దిగాము. ముందుగా కవిత అమ్మని, అంకుల్ ని లోపలికి వెళ్ళమని చెప్పాను. వాళ్ళిద్దరూ లోపలికి వెళ్లగా ఆ తర్వాత నేను ప్రీతి కలిసి సుప్రియ అమ్మను చేతులు పట్టుకుని లోపలికి నడిచాము. లోపలికి వెళ్ళిన కవిత అమ్మ అక్కడున్న వారందరితో మెయిన్ డోర్ వైపు చూడమని చెప్పింది. ఇక్కడ గేట్ దగ్గర నుంచి నడుస్తున్న సుప్రియ అమ్మ చాలా ఏళ్ల తర్వాత తన ఇంటిని పట్టి పట్టి చూస్తుంది. తన ఇంటికి చేరుకున్నాను అన్న ఆనందం ఆమె మొహంలో నాకు కనబడుతోంది.
లోపలికి అడుగు పెట్టగానే మాతో పాటు ఉన్న సుప్రియ అమ్మను చూసి నాన్న(దినేష్ వర్మ), సుమతి పిన్ని, రాధిక అత్తయ్య, హర్షవర్మ, కార్తీక అక్క, పవిత్ర, అంతకు ముందే అక్కడికి చేరుకున్న అభి, అను, దేవి అక్క, వాళ్ళ అమ్మ గాయత్రి అందరూ కూడా షాక్ అయ్యారు. కానీ అందరి కంటే ముందు తేరుకున్న కార్తీక అక్క పరిగెత్తుకుంటూ వచ్చి సుప్రియ అమ్మను కౌగలించుకుని, ఇంతకాలం ఎక్కడికి వెళ్ళిపోయావు అమ్మ,,,,, అంటూ హృదయవిదారకంగా రోదిస్తోంది. .... తన కూతురిని గుర్తుపట్టిన సుప్రియ అమ్మ మాట్లాడుతూ, అయ్యో నా బుజ్జితల్లి కార్తీ,,,, ఎలా ఉన్నావురా తల్లి నువ్వు? నిన్ను చూడాలని చాలా కాలం నుంచి కళ్ళు కాయలు కాచేలా వేచి చూస్తున్నాను. ఎంత కాలం అయిందిరా నిన్ను చూసి అని తన కూతురుని ముద్దుల్లో ముంచెత్తింది. ..... అవునమ్మా నువ్వు కనబడక చాలా ఏళ్ళు అయిపోయింది అని అంది కార్తిక అక్క.
ఆ దృశ్యం చూడగానే నా కళ్ళమ్మట నీళ్ళు తిరిగాయి. నా తల్లి నన్ను చూసి గుర్తుపట్టలేదు కానీ తన కూతుర్ని గుర్తుపట్టింది. నేనేం పాపం చేశాను? పోనీలే అక్కనైనా గుర్తుపట్టింది అని నన్ను నేను ఓదార్చుకుంటూ సర్దిచెప్పుకున్నాను. కానీ మనసులోని బాధను ఆపుకోలేక పోతున్నాను. నాకే కాదు అక్కడున్న చాలా మందికి ఆ దృశ్యం చూసి కన్నీళ్లు వచ్చేసాయి. ఆ తర్వాత నాన్న, అత్తయ్య, పిన్నితో సహా అందరూ ఒక్కొక్కరుగా సుప్రియ అమ్మను కలిశారు. అందరూ కలవడం పూర్తయిన తర్వాత వాతావరణం కొంచెం సెటిల్ అయ్యింది. అందర్నీ కూర్చోమని చెప్పి, కార్తీక గారు మీరు మీ అమ్మను తీసుకొని లోపలికి వెళ్ళండి. ఆమెకు ఇప్పుడు రెస్ట్ చాలా అవసరం అని అన్నాను. ఆ మాట విని అందరూ షాక్ అయ్యి ఆశ్చర్యంగా నా వైపే చూస్తున్నారు.
సుప్రియ అమ్మకి నేను చెప్పిన మాట ఎలా అర్థం అయిందో ఏమో, లేదు నేను ఎక్కడికి వెళ్ళను ఇక్కడే ఉంటాను అని అంటూ కార్తీక అక్కని గట్టిగా పట్టుకుంది. .... లేదమ్మా,, మీకు రెస్ట్ చాలా అవసరమని డాక్టర్ గారు చెప్పారు ప్లీజ్,, మీరు లోపలికి వెళ్ళండి అని చెప్పి సుమతి పిన్ని వైపు చూశాను. నా మాట అర్థం చేసుకున్న సుమతి పిన్ని సుప్రియ అమ్మను వాళ్ల రూమ్ లోకి తీసుకొని వెళ్ళింది. ఆ వెనుకే కవిత అమ్మ కూడా వెళ్లి నిన్న డాక్టర్లు ఇచ్చిన టాబ్లెట్లు వేసి నిద్రపుచ్చి బయటికి వచ్చారు. అప్పటిదాకా హాల్లో నించొని నా వైపు విచిత్రంగా చూస్తున్న కార్తిక అక్క, ఏంట్రా తమ్ముడు ఇది, అమ్మను ఎదో పరాయి దానిలాగా పిలుస్తున్నావేంటి? అని అడిగింది. .... బహుశా నాకు అలా పిలిచే అర్హత లేదేమో? అని అన్నాను. .... ఏంట్రా,, ఏంటా పిచ్చి మాటలు అని అంది కార్తీక అక్క.
అవును అదే నిజం. ఎందుకంటే ఆమె జీవితంలో నేననే వాడిని ఒక్కడిని ఉన్నాను అనే చాప్టర్ ఆమె మదిలోనుంచి పూర్తిగా చెరిగిపోయింది. ఆమెకు ఇప్పుడు నేను అస్సలు గుర్తులేను. నన్ను పూర్తిగా మర్చిపోయింది. అసలు తనకు నాతో ఏ బంధం ఉన్నట్టు అనుకోవడం లేదు. ఆమె జ్ఞాపకాలలో నేను లేను అంటూ కంట్రోల్ చేసుకోలేక బోరున ఏడ్చేసాను. వెంటనే ప్రీతి, పవిత్ర, కార్తీక అక్క, దేవి అక్క, దీప్తి కూడా వచ్చి నన్ను పట్టుకొని ఓదార్చడం మొదలు పెట్టారు. .... ఏంట్రా తమ్ముడు అలా మాట్లాడుతున్నావు? నువ్వు అలా చూస్తూ ఉండు తొందరగానే అమ్మకి తిరిగి జ్ఞాపకశక్తి వచ్చేస్తుంది అని అంది కార్తీక అక్క. .... రాదు,,, ఆమెకు ఎప్పటికీ జ్ఞాపకశక్తి తిరిగి వచ్చే అవకాశం లేదు. నాకు ఆ విషయం తెలుసు అని అనడంతో నా చుట్టూ ఉన్న వారందరూ కూడా బాధపడ్డారు. కానీ సుమతి పిన్ని, కవిత అమ్మ నా బాధను అర్థం చేసుకొని అందర్నీ దూరం పెట్టి నన్ను దగ్గరకు తీసుకుని ఓదార్చారు.
కొంతసేపటికి నేను మామూలు స్థితికి చేరుకున్న తర్వాత కార్తీక అక్క మాట్లాడుతూ, అమ్మ ఇంకా బతికే ఉంది అన్న విషయం నీకు ఎలా తెలిసిందిరా తమ్ముడు? అమ్మ నీకు ఎక్కడ దొరికింది? అని అడిగింది. .... నేను పూర్తిగా తేరుకొని కళ్ళు తుడుచుకుని అటెన్షన్ లోకి వచ్చి, ఆ విషయము ఇప్పుడే మీ అందరికీ తెలుస్తుంది. ఒక్క నిమిషం,,,, అని చెప్పి జెస్సీకి కాల్ చేశాను. అటువైపునుంచి జెస్సీ కాల్ లిఫ్ట్ చేయగానే, జెస్సీ వాడిని లోపలికి తీసుకొని రండి అని చెప్పి కాల్ కట్ చేశాను. ఈ ఇంటికి ప్రధాన శత్రువు, ఆమెను కిడ్నాప్ చేసిన వ్యక్తి ఇప్పుడు మీ అందరి కళ్ళు ముందుకు రాబోతున్నాడు అని చెప్పాను. కొద్ది క్షణాల్లో సోము, జెస్సీ, తార ముగ్గురు కలిసి నా కంస మామ నెత్తిన తుపాకీ గురిపెట్టి అందరి ముందు నిలబెట్టారు.
స్పృహలో లేని నా కంస మామ(మేనమామ) ను ఆ స్థితిలో చూసి అందరూ షాక్ అయ్యారు. వెంటనే నాన్న, హర్ష వర్మ, దేవి అక్క, వాళ్ళ అమ్మ గాయత్రి, అత్తయ్య రాధిక అందరూ వాడి దగ్గరికి రాబోయారు. అది చూసి వెంటనే నేను, ఎక్కడ ఉన్నవాళ్ళు అక్కడే ఆగిపొండి లేదంటే కొద్దిసేపట్లో రావాల్సిన వాడి చావు ఇప్పుడే వచ్చేస్తుంది అని గట్టిగా అరిచి చెప్పాను. నా మాట వినగానే ఎక్కడి వాళ్ళు అక్కడే ఆగిపోయారు. అందరూ నావైపే కొంచెం విచిత్రంగా భయపడుతూ చూస్తున్నారు. ఎందుకంటే నన్ను అంత కోపంగా ఇంతకుముందు ఎప్పుడూ చూసి ఉండరు. కొద్ది క్షణాల నిశ్శబ్దం తర్వాత కార్తీక అక్క మాట్లాడుతూ, ఏంట్రా తమ్ముడు ఇదంతా? మామయ్య ఎందుకు అలా ఉన్నాడు? నీ ఫ్రెండ్స్ మామయ్యని ఎందుకలా చేశారు? అని అడిగింది.
కొద్ది క్షణాల్లోనే మీ అందరికీ మనిషి రూపంలో ఉన్న ఈ రాక్షసుడు ఇలా ఈ స్థితిలో ఎందుకన్నాడో మీకు తెలుస్తుంది,,,,, అని నా మాట పూర్తికాకముందే నాన్న నా వైపు వస్తూ, ఈ రోజు నువ్వు అన్ని హద్దులు దాటేసావురా నీ కాళ్లు చేతులు విరిచెయ్యకపోతే నన్నడుగు, హద్దుమీరి ప్రవర్తిస్తున్నావు,,,, అని కోపంగా మాట్లాడుతూ నన్ను కొట్టడానికి చెయ్యి పైకి లేపారు. అంతలోనే సోము ముందుకు వచ్చి పైకెత్తిన అతని చేతిని గట్టిగా పట్టుకున్నాడు. .... మిస్టర్ దినేష్ వర్మ గారు మీరు నాకు తండ్రి అయిపోయారు కాబట్టి ఇంకా మీకు ఏమీ కాకుండా క్షేమంగా ఉన్నారు. లేదంటే ఈ పాటికి నా మీద ఎత్తిన మీ చెయ్యి తెగిపడి ఉండేది కావాలంటే మీ కూతుర్ని అడిగి తెలుసుకోండి. సోము వదిలేయ్,,, అని చెప్పి పవిత్ర వైపు చూసి, బుజ్జమ్మ లోపలికి వెళ్లి ఒక జగ్గుతో నీళ్లు పట్టుకునిరా అని చెప్పి అక్కడే ఉన్న డైనింగ్ టేబుల్ దగ్గర నుంచి ఒక కుర్చీ లాక్కుని నా కంస మామ మొహం దగ్గర వేసుకుని దాని మీద కూర్చున్నాను.
ఆ తర్వాత పవిత్ర తెచ్చిన నీళ్ళజగ్గు అందుకుని ఆ నీళ్లను స్పృహ తప్పిన మావయ్య మొహానికేసి గట్టిగా కొట్టడంతో వెంటనే తల విధుల్చుకుంటూ స్పృహలోకి వచ్చాడు. నెమ్మదిగా కళ్ళు తెరిచి ఎదురుగా ఉన్న నన్ను చూసి, నా చేతికి ఉన్న కట్లు విప్పి చూడరా, అన్నిసార్లు తప్పించుకున్నట్లు ఈసారి నా చేతుల్లోనుంచి తప్పించుకోలేవు నీ చావు నా చేతుల్లోనే ఉంది అని వీలైనంత గట్టిగా అరిచాడు. ఆ మాట విన్న వెంటనే అక్కడ ఉన్న వారందరూ షాక్ అయ్యారు. ఎందుకంటే ఇక్కడ ఉన్న వారందరికీ మేము వచ్చిన దగ్గర్నుంచి ఒకదాని వెంట మరొక షాక్ తగులుతూనే ఉంది. నాతో అయితే ఆ మాట అనేశాడు కానీ ఆ తర్వాత ఒక్కసారి చుట్టుపక్కల చూసుకునేసరికి మావయ్య నోరు మూతబడిపోయి నోట మాట రావడం లేదు. వెంటనే నేను లాగిపెట్టి నా కంస మామ చెంప మీద గట్టిగా పీకాను.
ఒరేయ్ నా కంస మామ నీకు చాలా తొందర ఎక్కువరా, పోనీలే నీ గురించి చెప్పే పని లేకుండా చాలా ఈజీ చేసేసావు. నిన్ను కంస మామ అనడంలో తప్పే లేదురా, ఎందుకంటే ఆనాటి కంసుడు కూడా తన సోదరిని ఖైదు చేసి పెట్టాడు. ఇప్పుడు నువ్వు కూడా నీ చెల్లెల్ని బంధించి పెట్టావు. ఆనాటి కంసుడు తన చెల్లెలి కొడుకుని చంపడానికి ప్రయత్నించాడు కానీ నీలాగే వాడు కూడా ఏమి పీకలేక పోయాడు. అంతా చేసి చివరికి వాడికి దక్కింది ఏమిటయ్యా అంటే మేనల్లుడి చేతిలో చావు. అది సరేగాని ముందు నువ్వు ఒక విషయం చెప్పు, నీ చెల్లెలిని ఎప్పుడు కిడ్నాప్ చేశావు, ఇంతకాలం ఎక్కడ దాచావు, అసలు ఇదంతా ఎందుకు చేసావు? తొందరగా జరిగిన నిజం అంతా బయట పెట్టెయ్ అని అన్నాను.
నా కంస మామ మళ్లీ తన బుద్ధి చూపిస్తూ, నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు బాబు? అంటూ ఏమీ ఎరుగని వాడిలా కొత్త నాటకం మొదలు పెట్టాడు. .... నీయబ్బ మంచిగా చెప్తే లొంగే రకానివి కాదురా నువ్వు, సోము వాడి చేతి కట్టు కూడా విప్పి బయట గార్డెన్ లోకి తీసుకుపదా అని అన్నాను. వెంటనే సోము, జెస్సీ కలిసి వాడిని పట్టుకుని బయటికి లాక్కెళ్లారు. నేను కూడా వాళ్లతో పాటు వెళ్లి బండిలో ఉన్న జాగ్వర్(బాకు) తీసి వాడి ఛాతి మధ్య భాగంలో గుచ్చి నొక్కి పెట్టి చిన్నగా తిప్పుతూ ఉంటే నొప్పి తాళలేక అరవడం మొదలు పెట్టాడు. లోపల ఉన్న వాళ్లందరికీ ఆ అరుపులు వినబడుతున్నాయి. ఈసారి నేను మరి కొంచెం నొక్కి పెట్టి కిందికి లాగుతూ పోతుంటే మరింత గట్టిగా అరుస్తున్నాడు. ఎలా ఉంది,,, ఇప్పుడు చెప్తావా? అని అడిగాను. .... ఆఆఆఆ,,, చెప్తాను,, చెప్తాను,,, అని అనడంతో నేను జాగ్వర్ తీసి జెస్సీకి అందించి వాడిని మళ్లీ లోపలికి లాక్కెళ్ళాము.
నేను అంత కఠినంగా వ్యవహరించడం చూసి లోపల అందరూ షాక్ లో ఉన్నారు. అసలు నిజం ఏమిటో అందరికీ ఇప్పుడు చెప్పరా,,, అని అన్నాను. నా కంస మామ చెప్పడం మొదలు పెట్టి, దీపు పుట్టడానికి కొద్దినెలల ముందు నేను స్మగ్లింగ్ లాంటి కార్యకలాపాలు చేస్తున్నానని దీపు తాతయ్యకి అంటే మా నాన్నకి తెలిసిపోయింది. అందువలన మా నాన్న నాకు డబ్బులు ఇవ్వడం మానేశాడు. దీపు పుట్టి కవితకి కూడా పెళ్లి చేసిన తర్వాత తన ఆస్తి మొత్తం మనవడు మనవరాళ్లకు సమాన వాటాలుగా పంచుతూ నిర్ణయం తీసుకుని పత్రాలు రిజిస్ట్రేషన్ చేయించాడు. నాకు ఆ విషయం తెలిసిన తర్వాత నాకు మా నాన్నకి మధ్య చాలా పెద్ద గొడవ జరిగింది కానీ మా నాన్న నన్ను పట్టించుకోలేదు.
ఫ్లాష్ బ్యాక్:
నాన్న ఏమిటి నువ్వు చేసిన పని,, నేను విన్నది నిజమేనా? అని అడిగాడు జగదీష్ వర్మ. .... నువ్వేం విన్నావో నాకు తెలీదు బహుశా నువ్వు విన్నది నిజమే అయ్యి ఉంటుంది అని అన్నాడు తాతయ్య. .... మన బిజినెస్లు ఆస్తులు అన్ని వాళ్లకు రాయడం ఏం బాగోలేదు. నువ్వు చాలా తప్పు చేశావు? అని అన్నాడు జగదీష్ వర్మ. .... ఏ రోజైతే నీ చీకటి వ్యాపారాల దందా నాకు తెలిసిందో ఆ రోజే నిర్ణయం జరిగిపోయింది అని అన్నాడు తాతయ్య. .... అలాగని నాకు అన్యాయం చేస్తావా? నా హక్కు ప్రకారం మొత్తం ఆస్తి నాకు రావాల్సిందే అని అన్నాడు జగదీష్ వర్మ. .... వెంటనే తాతయ్య లాగిపెట్టి ఒక్కటి కొట్టి, ఏంట్రా నీకు హక్కు కావాలా? అయితే ఇదిగో తీసుకో అంటూ మరో రెండు మూడు చెంపదెబ్బలు కొట్టి ఇంట్లో నుంచి గెంటేశాడు.
ఆ కోపంతో జగదీష్ వర్మ తన అడ్డాకి చేరుకుని, ఎవరిని వదిలిపెట్టను,, ముందు మా బాబుని లేపేసి ఆ తర్వాత మొత్తం కుటుంబం సంగతి చూస్తాను అని అనుకొని కొంతసేపు తీవ్రంగా ఆలోచించి ఒక పథకం రచించుకున్నాడు. అంతలో ఆ అడ్డాలోకి మరొక వ్యక్తి ప్రవేశించాడు. అతన్ని చూస్తూనే జగదీష్ వర్మ మొహంలో చిన్న చిరునవ్వు మెరిసింది. "వచ్చాడు నా బకరాగాడు" అని మనసులో చిన్నగా అనుకుని బయటికి మాత్రం, రా రాజేష్,, ఏంటి ఇలా వచ్చావు అని పలకరించాడు. అవునండి ఆ వ్యక్తి దీపు బాబాయ్ రాజేష్ వర్మే. రాజేష్ వస్తూనే, అరే బావా వదినకి కొడుకు పుట్టాడు. ఇప్పుడు ఆస్తి మొత్తం వాడికే కట్టబెట్టాలని ఆలోచనలు చేస్తున్నారు అని చిరాకుగా అన్నాడు. .... నీ పని ఇంకా నయంరా బాబు ఇంకా మీ ఇంట్లో ఆలోచిస్తున్నారు కానీ మా ఇంట్లో మా బాబు ఆల్రెడీ రాసేశాడు. ఈ విషయంలో మనం ఏదో ఒకటి చేయాల్సిందే అని అన్నాడు జగదీష్ వర్మ. .... ఏదో ఒకటి చేయరా బాబు నా ఫుల్ సపోర్ట్ నీకు ఉంటుంది అని అన్నాడు రాజేశ్ వర్మ.
దీపు పుట్టినప్పుడు దినేష్ వర్మ విదేశాలలో ఉండడం వలన ఘనంగా ఏమీ చెయ్యలేదు కాబట్టి దీపు మొదటి పుట్టిన రోజును ఘనంగా చేయడానికి నిర్ణయించుకుని అప్పుడే దీపు జాతకచక్రం కూడా తయారు చేయించాలని నిర్ణయించుకున్నారు. దీపు పుట్టినప్పటి పరిస్థితుల కారణంగా అప్పట్లో తాతయ్యే పేరు పెట్టడం జరిగింది. అందువలన ఇప్పుడు జాతకచక్రం తయారు చేయించి మొదటి పుట్టిన రోజును ఘనంగా జరిపే బాధ్యత కూడా తాతయ్య తీసుకున్నారు. ఆ సందర్భంగా జగదీష్ వర్మ మళ్ళీ మంచిగా మారిపోయి తండ్రికి సహాయం చేస్తున్నట్టుగా నటిస్తూ చురుకుగా అన్ని పనులు తన నెత్తిన వేసుకొని చేయడం మొదలు పెట్టాడు. జాతకచక్రం తయారు చేయడానికి కావలసిన పూజ అది జరిపించడానికి పండితులను తనే స్వయంగా ఏర్పాటు చేశాడు.
పూజ జరగడానికి కొద్దిసేపటి ముందు అందరికీ దూరంగా పండితులతో కొంతసేపు మంతనాలు జరిపి, నేను ఏం చెప్పానో అంతా చెప్పినట్టే జరగాలి అనవసరంగా ఎటువంటి రచ్చ చేయొద్దు అని చెప్పాడు జగదీష్ వర్మ. .... మీరేమీ కంగారు పడకండి అంతా మీరు అనుకున్నట్టే సవ్యంగా జరిపిస్తామని చెప్పారు పండితులు. .... ఎలాగైనా సరే ఆ దీపు గాడిని నష్టజాతకుడు అని చెప్పి ఈ ఇంటికి దాపురించిన రాక్షసుడు అని చిత్రీకరించాలి అని అన్నాడు జగదీష్ వర్మ. ఆ తర్వాత వాళ్లంతా విడిపోయి ఎవరి దారిన వారు ఇంట్లోకి వచ్చి దీపు పుట్టిన తేదీ తీసుకుని కొంతసేపు జన్మనక్షత్రం ప్రకారం జాతకచక్రం తయారు చేస్తున్నట్లు నటించి ఒక తప్పుడు జాతకచక్రం తయారుచేసి అందులో ఏదో జరగరాని విషయం గోచరిస్తున్నట్టు విచారం వ్యక్తం చేశారు.