Episode 130.3
మేము సీసీ కెమెరాలకు పట్టుబడకుండా బేస్మెంట్ లోని పార్కింగ్ దగ్గర్నుంచి మెట్ల మార్గం ద్వారా పైకి వెళ్లి ఒక ఫ్లోర్ లో డాక్టర్ చేంజింగ్ రూమ్ లోకి వెళ్లి డాక్టర్ కోట్స్ మరియు మాస్క్ తగిలించుకుని డాక్టర్ లాగా బిల్డప్ ఇస్తూ రిసెప్షన్ దగ్గరకు చేరుకొని రిజిస్టర్ తిరగేసి జగదీష్ వర్మ ఎక్కడున్నాడో తెలుసుకుని అటువైపు వెళ్ళాము. రూమ్ కారిడార్లో ఇద్దరు కానిస్టేబుల్స్ కాపలాగా ఉన్నారు. అది ప్రత్యేకమైన ఫ్లోర్ కావడంతో పెద్దగా హడావుడి లేకుండా ఖాళీగా ఉంది. మేము ఏమాత్రం తడబడకుండా సెక్యూరిటీ ఆఫీసర్లను దాటుకుని జగదీష్ వర్మ ఉన్న రూమ్ లోకి ఎంటర్ అయ్యాము. కానీ అక్కడ ఒక నర్స్ ఉండడంతో ముందు ఏం చేయాలో అర్థం కాలేదు. వెంటనే ఏదో ఒక పేరు చెప్పి మేము రాంగ్ రూం లోకి వచ్చాము అని చెప్పి మళ్లీ బయటకి వచ్చేసాము.
కొద్దిసేపు అదే కారిడార్లో తచ్చాడి ఆ రూమ్ లోకి వెళ్ళడానికి మరేదైనా మార్గం ఉందేమోనని అటు ఇటు చెక్ చేసుకున్నాము. లక్కీగా ఆ రూమ్ లకు బాల్కనీ ఉండడంతో అటువైపునుంచి వెళ్లడం సులువుగా కూడా అనిపించడంతో ఆ నర్స్ బయటికి వచ్చేవరకు సెక్యూరిటీ ఆఫీసర్ల కంటపడకుండా వేచి చూస్తూ నక్కి ఉన్నాము. సుమారు ఒక గంట తర్వాత ఆ రూమ్ లోకి ఎవరో ఒక డాక్టర్ వెళ్లడం చూసాము. ఆ తర్వాత మరో ఐదు నిమిషాలకి డాక్టర్ మరియు నర్స్ బయటకు వచ్చి మాట్లాడుకుంటూ కారిడార్ సెంటర్ కి వెళ్ళడం చూసాము. వెంటనే నేను సోముని అక్కడే ఉండి వాచ్ చేస్తూ నాకు ఇన్ఫర్మేషన్ అందించమని చెప్పి బాల్కనీలు దాటుకుంటూ ఆ రూమ్ లోకి వెళ్లాను. జగదీష్ వర్మ స్పృహలో లేడు. ఆక్సిజన్ తగిలించి ఉంది. అలాగే కంప్యూటర్ దగ్గర నుంచి కొన్ని వైర్లు తగిలించి వున్నాయి.
ఏమాత్రం లేట్ చేయకుండా ముందుగా ఆక్సిజన్ సిలిండర్ క్లోజ్ చేసి అక్కడే ఉన్న డస్ట్ బిన్ లో నుంచి గ్లౌజులు తీసి వేసుకుని మూతికి ఉన్న ఆక్సిజన్ మాస్క్ తీసి ఒక చేత్తో వాడి ముక్కు నోరు మూసి మరో చేతితో కంఠాన్ని పట్టుకున్నాను. ఒక నిమిషం పాటు వాడి బాడీ గిలగిల తన్నుకొని ఆగిపోయింది. అక్కడున్న కంప్యూటర్ల వైపు చూసి బాడీ హార్ట్ బీట్ ఆగిపోయింది అని కన్ఫర్మ్ చేసుకుని మళ్లీ యధావిధిగా వాడికి మాస్కు తగిలించి సిలిండర్ ఓపెన్ చేసేసరికి నర్స్ తిరిగి రూమ్ లోకి వస్తుందని సోము ఎలర్ట్ చేయడంతో వెంటనే బాల్కనీ ద్వారా తప్పించుకొని కారిడార్ లోకి ఎంటర్ అయ్యాను. ఆ తర్వాత ఇద్దరం ఏదో మాట్లాడుకుంటున్నట్టు నటిస్తూ ఎవరికీ అనుమానం రాకుండా తిరిగి డాక్టర్స్ చేంజింగ్ రూమ్ దగ్గర కోట్స్ పెట్టేసి వచ్చిన దారినే బయటపడి అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యాము.
ఈ ప్రక్రియ అంతా ముగిసేసరికి సాయంత్రం 7:00అయ్యింది. సోము కార్ డ్రైవ్ చేస్తుండగా నేను చీఫ్ కి కాల్ చేసి జగదీష్ వర్మని ఫినిష్ చేసినట్టు చెప్పి వీలు చూసుకుని సెక్యూరిటీ ఆఫీసర్లు దగ్గర్నుంచి కన్ఫామ్ చేసుకోమని చెప్పాను. ఆ తర్వాత జెస్సీకి కాల్ చేయగా లెటర్ హెడ్ విత్ స్టాంప్ సంపాదించినట్లు చెప్పడంతో అందరం వర్క్ స్టేషన్ లో కలుద్దాం అని చెప్పి కాల్ కట్ చేశాను. ఇద్దరం వర్క్ స్టేషన్ కి చేరుకున్న తర్వాత అమెరికాలో కీర్తి వదిన దగ్గర నేర్చుకున్న స్క్రిప్ట్ రైటింగ్ స్కిల్ మొట్టమొదటిసారి ఉపయోగిస్తూ ముందు రెండు మూడు సార్లు వేరే పేపర్ల మీద ట్రై చేసి చివరిగా లెటర్ హెడ్ మీద రుద్ర తన తండ్రి విషయం తెలిసిన తర్వాత అవమాన భారంతో ఆత్మహత్య చేసుకుంటున్నట్టుగా ఒక లెటర్ తయారు చేశాను. అది చూసి తార మాట్లాడుతూ, నువ్వు సామాన్యుడువి కాదురా బాబు నవ రంధ్రాల్లో ఏ రంధ్రాన్ని వదిలిపెట్టవు అని నా మీద సెటైర్ వేసింది.
ఏదో అంతా మా గురువు గారి దయ,,, అని నవ్వి ఆ లెటర్ ని మడతపెట్టి జాగ్రత్తగా పెట్టుకోమని తారకి అందించాను. ఆ తర్వాత తార దగ్గర్నుంచి కాల్ లిస్ట్ తీసుకొని పరిశీలించగా రెండు మూడు నెంబర్లకు మాత్రమే చేసి ఉండడంతో వాటన్నిటినీ ట్రేస్ చేసి చూసుకున్నాము. కానీ అన్ని స్విచ్ఆఫ్ వస్తున్నాయి. సరే చూద్దాం అనుకుని అందరం భోజనాలు చేసి మా సామగ్రిని సిద్ధం చేసుకుని ఒరిస్సా డిస్ట్రిక్ట్ లోని జైపూర్ కి బయలుదేరాము. కార్లో వెళ్తూ రుద్ర ఫోన్ నెంబర్ తో సహా మిగిలిన నంబర్లు అన్నింటిని ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ వెళ్తున్నాము. దాదాపు తెల్లవారి 3:00 టైంకి జైపూర్ చేరుకున్నాము. అక్కడ ఒక సెంటర్లో ఆగి టీ తాగి కొంచెం వెలుగు వచ్చేవరకూ అక్కడే వెయిట్ చేసాము. ఆ సమయంలో మళ్లీ ఒకసారి ఫోన్ నెంబర్లు ట్రేస్ చేసి చూడగా, గయ్స్ విజిటర్స్ కూడా సేమ్ లొకేషన్ లో ఉన్నారు అని కబురు అందించింది తార.
అయితే వీడు ఏదో ప్లాన్ లో ఉన్నాడు మనం కొంచెం అలర్ట్ గా ఉండాలి. బహుశా అక్కడ ముగ్గురు కంటే ఎక్కువ మంది కూడా ఉండొచ్చు అని చెప్పి అక్కడికి మరో గంట దూరంలో ఉన్న ఆ మూతబడ్డ పేపర్ మిల్లు వైపు బయలుదేరాము. అక్కడికి చేరుకున్న తర్వాత కొద్దిదూరంలో కారు ఆపి జాగ్రత్తగా పరిశీలించగా అంతా నిర్మానుష్యంగా ఉండడంతో. అందరం గన్స్ రెడీ చేసుకుని జాగ్రత్తగా ఆ పేపర్ మిల్ కాంపౌండ్ లోకి అడుగు పెట్టాము. ఆ తర్వాత జాగ్రత్తగా ఒకరినొకరు కవర్ చేసుకుంటూ మిల్లు సెంటర్ కి చేరుకున్నాము. చుట్టు రేకులతో కట్టిన స్ట్రక్చర్ పాడైపోయి ఉండడంతో అక్కడక్కడా గ్యాప్ లోనుంచి లోపల తుప్పుపట్టి ఉన్న మిషనరీ కనబడుతుంది. మేము జాగ్రత్తగా శబ్దం చేయకుండా మరోవైపు వెళ్లేసరికి అక్కడ ఒక ఆఫీస్ లాగా ఒక పెద్ద రూమ్ కనబడింది. అందులో లైట్ కూడా ఆన్ చేసి ఉంది. మేము దాని దగ్గరకు చేరుకుని ఒక కన్నంలో నుంచి లోపలికి చూసాను.
లోపల ఒక టేబుల్ 4 కుర్చీలు తప్ప ఇంకేమీ కనబడలేదు. అక్కడి నుంచి నెమ్మదిగా కదిలి మరొకవైపు వెళ్లేసరికి అది ఒక రేకులతో నిర్మించిన హాల్ లాగా ఉంది. అక్కడినుంచి చిన్నగా మాటలు వినబడుతున్నాయి కానీ లోపల ఏం జరుగుతుందో తెలియడం లేదు. జాగ్రత్తగా వెతికి చూడగా ఒక చిన్న కన్నం కనబడటంతో జాగ్రత్తగా అడుగులో అడుగు వేసుకుంటూ అక్కడికి వెళ్లి లోపలికి చూశాను. ముందుగా అక్కడ కొంతమంది ఆఫ్రికన్లు కనబడ్డారు. అందరూ ఏదో సీరియస్ డిస్కషన్ లో ఉన్నారు. చూడటానికి తుమ్మ మొద్దుల్లా నల్లగా అందరూ ఆరు అడుగుల పైనే పొడుగ్గా ఉన్నారు. ఇంతలో జెస్సీ నా భుజం తట్టి మరొక చోట నుంచి ఇంకా క్లియర్ గా కనబడుతోంది అని సిగ్నల్ ఇవ్వడంతో అక్కడికి వెళ్లి లోపలికి చూసాము.
మొత్తం ఎనిమిది మంది ఆఫ్రికన్లు ఉన్నారు. అందులో ఒకడు వారందరికీ లీడర్ లాగా కనబడుతున్నాడు. అంతలో లోపల ఉన్న బాత్ రూమ్ డోర్ తెరుచుకుని రుద్ర బయటికి వచ్చాడు. బహుశా వాళ్ళందరూ అప్పుడే పడుకొని లేచినట్లున్నారు. వీళ్ళు ఏదో ప్లాన్ చేస్తున్నట్టు అనిపించడంతో మొబైల్ తీసి వీడియో రికార్డ్ చేయడం మొదలుపెట్టాను. ఆ ఆఫ్రికన్ల నాయకుడు మాట్లాడుతూ, వాట్ హప్పెండ్ సార్? ఇక్కడికి ఎందుకు పిలిచారు? బాస్ రాలేదా? అని అడిగాడు. .... నో మైకెల్,,, ఐ థింక్ సంథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్? నిన్న మధ్యాహ్నం నేను ఒక న్యూస్ విన్నాను. మన హెడ్ క్వార్టర్స్ మీద ఎటాక్ జరిగింది. బహుశా అక్కడున్న సరుకు మొత్తం తీసుకొని వెళ్లి ఉంటారు. అలాగే కొంత మంది చనిపోయినట్టు కూడా తెలుస్తుంది. కానీ బాస్ గురించిన సమాచారం ఏమీ తెలియడం లేదు.
అందుకే నేను ఎందుకైనా మంచిదని ముందు జాగ్రత్తగా ఇక్కడికి వచ్చాను. బాస్ కూడా వాళ్ల చేతిలో ఉన్నట్టయితే నెక్స్ట్ వాళ్లు నన్ను వెతుక్కుంటూ వస్తారు. కానీ ఏం జరిగిందో పూర్తిగా తెలియడం లేదు. .... వాట్,,, రియల్లీ?? ఎవరు చేసి ఉంటారు? అని అడిగాడు మైకేల్. .... నాకు ఒకడి మీద అనుమానం ఉంది కానీ వాడిని కొద్దిరోజుల క్రితమే బాస్ చంపేశారు. అందుకే ఇప్పుడు ఈ పని ఎవరు చేసుకుంటారో అర్థం కావట్లేదు. .... భాను ఎక్కడున్నాడు? అని అడిగాడు మైకేల్. .... భాను ఈఙ్ నో మోర్. వాడిని DD చంపేశాడు. .... ఈ DD ఎవరు? .... కొద్ది నెలల క్రితం నుంచి మనకు సంబంధించిన చాలామంది మనుషులను ఈ DD చంపుతూ వస్తున్నాడు. చనిపోయిన దీపుయే ఈ DD అని నాకు ఒక అనుమానం ఉంది. కానీ వాడు చనిపోయిన తర్వాత భానుని చంపడం జరిగింది. అంటే ఈ పని మరెవరో చేస్తున్నారు.
మీకు ఎవరి మీదైనా అనుమానం ఉందా? అని అడిగాడు మైఖెల్. .... దీపుకి ఇద్దరు సభ్యుల ఒక టీమ్ ఉంది. బహుశా వాళ్ళు ఈ పని చేస్తున్నారేమో అని ఒక చిన్న డౌటు ఉంది. కానీ వాళ్ళకి అంత కెపాసిటీ ఉంది అని నేను అనుకోవడం లేదు. అసలు వాళ్ళు ఎవరు, ఎవరి కోసం పని చేస్తున్నారు అనే విషయాల మీద నేను పెద్దగా దృష్టి పెట్టలేదు. .... అసలు ఈ దీపు ఎవడు? అని మైకేల్ అడిగాడు. .... యాక్చువల్లీ వాడిని నేనే తయారు చేశాను. కానీ నాకు తెలియకుండా వాడు నా ఫాదర్ నే అటాక్ చేస్తాడని ఊహించలేదు. మా ఫాదర్ కి వాడికి నాకు తెలియని ఏదో లింక్ ఉంది. ముందు వాడు నా తమ్ముడిని చంపాడు ఆ తర్వాత మా ఫాదర్ వాడిని చంపారు కానీ ఆ తర్వాత అనూహ్యంగా భాను చనిపోయాడు ఇప్పుడు చూస్తే మా ఫాదర్ ఎక్కడున్నారో లేదా అటాక్ లో చనిపోయారో తెలియడం లేదు.
ఒకవేళ నా అంచనా నిజమైతే జగదీష్ వర్మ నా ఫాదర్ అని తెలిస్తే సెక్యూరిటీ అధికారి డిపార్ట్మెంట్ నా కోసం వెతుకుతుంది. అందుకే నాకు కొంచెం హెల్ప్ గా ఉంటారని మిమ్మల్ని ఇక్కడికి పిలిచాను. మనకి పూర్తి సమాచారం తెలిసిన తర్వాత కావాలంటే మళ్ళీ మన బిజినెస్ మళ్లీ ఎస్టాబ్లిష్ చెయ్యొచ్చు. కానీ ముందుగా ఈ పని చేసిన వారిని పట్టుకొని మన తడాఖా ఏంటో చూపించాలి. మా ఫాదర్ గురించి తెలుసుకోవాలి అని అన్నాడు రుద్ర. .... సో వాట్ ఈజ్ ద ప్లాన్? అని అడిగాడు మైకేల్. .... ఈరోజు సాయంత్రం వరకు వెయిట్ చేసి చూద్దాం. డిపార్ట్మెంట్ లోని నా మనుషుల ద్వారా అక్కడ జరిగే విషయాలు మనకు తెలుస్తాయి. దాన్నిబట్టి మనం ఏం చేయాలన్నది డిసైడ్ చేసుకుందాం అని అన్నాడు రుద్ర. ఈ మాత్రం చాలు అని అనుకొని నేను రికార్డింగ్ ఆపి రెడీ టు యాక్షన్,, అని నా టీం కి సిగ్నల్ ఇచ్చాను.
తారని అక్కడే కన్నం దగ్గర్నుంచి అటాక్ చేయడానికి నుంచోపెట్టి మేము ఆ షెడ్ డోర్ వైపు వెళ్లి ఒకేసారి ముగ్గురం కలిసి డోర్ తన్నగా అది ఊడి లోపలి వైపు పడింది. ఆ శబ్దానికి కలవరపడి వెంటనే తమ దగ్గర ఉన్న ఆయుధాలు తీస్తూ మా మీద ఎటాక్ చేయడానికి సిద్ధమవుతున్నారు. కానీ అంతలోనే మేము ఫైరింగ్ ఓపెన్ చేసి ముందుగా ఆఫ్రికన్లు అందరిని షూట్ చేయడం మొదలు పెట్టాము. వాళ్లు తప్పించుకుంటూ అటు ఇటు పరిగెత్తి దొరికిన చోట దాక్కుంటూ మా మీద ఫైరింగ్ మొదలుపెట్టారు. మేము కూడా వాళ్లను తప్పించుకుంటూ ఒక ఐదు నిమిషాలలో ఏడుగురు ఆఫ్రికన్లను ఫినిష్ చేసాము. మరొకడి కోసం చూస్తున్న సమయంలో రుద్ర జరిగిన ఈ హఠాత్పరిణామం నుంచి తేరుకుని తన చేతిలో ఉన్న గన్ నా వైపు చూపిస్తూ, నువ్వు ఇంకా బతికే ఉన్నావా? అని ఆశ్చర్యపోతూ, సరేలే ఎలాగూ నా దగ్గరకి వచ్చావు కదా నా తమ్ముడిని చంపినందుకు నా చేతులతో నిన్ను ఫినిష్ చేస్తాను అని కొంచెం గట్టిగా అరిచాడు.
అంతలోనే ఒక బుల్లెట్ సౌండ్ వినిపించి రుద్ర గాడి చేతిలో ఉన్న గన్ ఎగిరిపడింది. బయట ఉన్న తార ఈ పని చేసింది. అంతలో మరో మూల నుంచి గన్ పేలిన శబ్దం వినబడి మేము అలర్ట్ అయ్యి కింద నేలమీద కూర్చున్నాము ఆ వెంటనే సోము అటువైపు పాక్కుంటూ వెళ్లి షూట్ చేసేసరికి మిగిలిన వాడు కూడా ఫినిష్ అయ్యాడు. ఇప్పుడు మిగిలింది రుద్రగాడు మాత్రమే అని వాడికి కూడా ఒక క్లారిటీ వచ్చేసింది. నేను వాడి దగ్గరకు నడుచుకుంటూ వెళ్లి ముందున్న టేబుల్ మీద కూర్చుని ఎదురుగా ఉన్న కుర్చీలో వాడిని కూర్చోమని చెప్పాను. ఇక గత్యంతరం లేక రుద్ర చైర్ లో కూలబడ్డాడు. ఆ తర్వాత మాట్లాడుతూ, నువ్వు నా మనుషుల మీద ఎందుకు ఎటాక్ చేస్తున్నావు? నిన్ను తయారు చేసింది నేను. కానీ వీళ్ళందరూ ఎవరు? మీరందరూ కలిసి దేని కోసం పని చేస్తున్నారు? అని అడిగాడు.
ముందుగా నీకు ఒక విషయం చెప్పాలి. నీ బాబు జగదీష్ వర్మ చనిపోయి 12 గంటలు అవుతుంది. స్వయంగా నేనే నా చేతులతో పీక నొక్కి చంపాను అని అన్నాను. .... వాట్,,, యూ భాస్టర్డ్,,, హౌ డేర్ యు టు టచ్ మై ఫాదర్? నిన్ను వదిలిపెట్టనురా,,,,, అని అరుస్తూ కుర్చీలోంచి పైకి లేచాడు. కానీ వెనుకనుంచి జెస్సీ మరియు సోము గన్స్ గురిపెట్టి బెదిరిస్తూ నిల్చోవడంతో చేసేదేమీ లేక మళ్ళీ కూర్చున్నాడు. .... నీకోసం ఇన్ఫార్మర్ గా పని చేయడానికి నాకు ట్రైనింగ్ ఇప్పించి నువ్వు చాలా పెద్ద తప్పు చేసావు రుద్ర. కానీ నాకు మాత్రం అది మంచిదే అయ్యింది. నాకు ట్రైనింగ్ ఇప్పించి నీ చేతులకు మట్టి అంటకుండా మీ బాబుకి అడ్డొచ్చిన వాళ్లందరినీ తప్పించడానికి చాలా చక్కగా ప్లాన్ చేసుకున్నావు. కానీ నాకు ట్రైనింగ్ ఇప్పించడానికి నువ్వు ఎంచుకున్న వ్యక్తిని మాత్రం తప్పుగా సెలక్ట్ చేసుకున్నావు.
అక్కడే మన కథ మలుపు తిరిగింది. నాకు ఒక బ్లాక్ కమెండో లెవెల్ ట్రైనింగ్ ఇప్పిస్తున్నావు అనుకున్నావు గాని మీ పాలిట యముడిని తయారు చేసుకుంటున్నావు అని నీకు అప్పుడు తెలీదు. నీకో విషయం తెలుసా అసలు నేను నీ కోసం ఎప్పుడూ పని చేయలేదు. నువ్వు ఇచ్చిన ఫైల్ లో మనుషులను లేపేసాను కానీ అది చేసింది మాత్రం నీ గురించి తెలుసుకోవడానికి ఐబి ప్లాన్ చేసిన ఆపరేషన్ లో భాగంగా చేశాను. నేను అమెరికా నుంచి వచ్చిన దగ్గర్నుంచి ఐబి కోసం పని చేస్తున్నాను అని అనగానే రుద్రగాడి మొహంలో నెత్తురు చుక్క లేకుండా పోయింది. ఎంతో తెలివైన ఐపీఎస్ ఆఫీసర్ అయిన వాడినే బోల్తా కొట్టించాను అని వాడికి నమ్మశక్యంగా లేదు. కొద్దిసేపు మౌనంగా ఉండి, కానీ నా ఫ్యామిలీ గురించి నీకెలా తెలిసింది? నేను ఎప్పుడూ నా ఫ్యామిలీకి దగ్గరగా లేను అని అన్నాడు రుద్ర.
నీతో పరిచయం కంటే కూడా ముందు నాకు నీ ఫ్యామిలీతో సంబంధం ఉంది అది చాలా పర్సనల్ కూడా. నీ బాబు జగదీష్ వర్మ నా మేనమామ. నా పసితనం నుంచే నా జీవితంతో ఆడుకున్న నా కంస మామ. నీ బాబు సెకండ్ ఫ్యామిలీ కి చెందిన వాడివి నువ్వు. బహుశా నీకు ఈ విషయం తెలిసే ఉండొచ్చు కానీ నీ బాబు మిమ్మల్ని అన్నింటికీ దూరంగా ఉంచి పెంచడం వలన ఈ విషయాల మీద నువ్వు పెద్దగా దృష్టి పెట్టి ఉండవు. ఎంతైనా మాఫియా లీడర్ కదా చాలా తెలివిగా ఒక కొడుకుని ఐపీఎస్ మరొక కొడుకుని తన నేర సామ్రాజ్యానికి డాన్ లాగా తయారు చేసుకున్నాడు. కానీ చివరికి కుక్క చావు చచ్చాడు. నువ్వు నాకు చేసిన సహాయానికి నిన్ను చంపకూడదు కానీ నీ తమ్ముడు విషయంలో నా గురించి తెలిసిన తర్వాత కూడా నువ్వు నా దగ్గర ఏమీ తెలియనట్టు నటించి నన్ను చంపడానికి నీ బాబుకి లైన్ క్లియర్ చేశావు.
అందుకే ముందుగా నీ తమ్ముడు ఆ తర్వాత నీ బాబు వాడి నేర సామ్రాజ్యం మొత్తం కూల్చేశాను. ఇక మిగిలింది నువ్వే కానీ ఎందుకో నీ మీద నాకు కొంచెం జాలిగా ఉంది అని అనగానే రుద్రగాడి మొహంలో చిన్న ఆశ చిగురించింది. .... ప్లీజ్,, నన్ను వదిలేయ్,,, నేను ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోతాను అని దీనంగా అడిగాడు రుద్ర. .... ఆ పని చేయాలంటే నువ్వు నాకు ఒక పని చేసి పెట్టాలి. ఇందాక నువ్వు మాట్లాడుతున్నప్పుడు డిపార్ట్మెంట్ లో నీకోసం పనిచేస్తున్న మనుషుల గురించి చెప్పావు. వాళ్ల వివరాలు నాకు చెప్పేస్తే నిన్ను వదిలి పెట్టడం గురించి ఆలోచిస్తాను అని అన్నాను. .... వెంటనే రుద్ర గాడు ఆ వివరాలు చెప్పడానికి ఒప్పుకున్నాడు. నేను సిగ్నల్ ఇవ్వడంతో సోము మొబైల్ తీసి ఆడియో రికార్డ్ చేయడం మొదలు పెట్టాడు.
అంతా చెప్పడం పూర్తయిన తర్వాత నేను మాట్లాడుతూ, ఆఆ,, చెప్పడం మర్చిపోయాను ఇప్పటిదాకా నీకు అంతుచిక్కని DD నేనే అని జెస్సీ వైపు చూసి కన్ను కొట్టి సిగ్నల్ ఇవ్వడంతో పాయింట్ బ్లాంక్ లో రుద్ర గాడి తలలోకి బుల్లెట్ దింపేసాడు. ఆ తర్వాత సోము కూడా మరో రెండు బుల్లెట్లు దింపేసాడు. అప్పటికే లోపలికి వచ్చి జరుగుతున్న తతంగాన్ని అంతా చూస్తున్న తార తన చేతిలో లెటర్ పట్టుకొని, మరి దీన్ని ఏం చేద్దాం? అని అడిగింది. .... ఇక దాంతో పని లేదులే,,, ఇక్కడ సెటప్, ఇంకా వాడు ఇప్పుడు ఇచ్చిన కన్ఫెషన్, డిపార్ట్మెంట్ కి ఈ రెండు సరిపోతాయి అని చెప్పి ఇంకా అక్కడ పరిసరాలను కొంత వీడియో తీసి మొత్తం అన్నిటిని చీఫ్ కి ట్రాన్స్ఫర్ చేసి ఆయనకి కాల్ చేసి, సార్ రుద్ర వాడితో పాటు 8 మంది ఆఫ్రికన్లు ఎన్కౌంటర్లో చచ్చారు. డీటెయిల్స్ మీకు పంపించాను. మేము తిరిగి వచ్చేస్తున్నాము అని చెప్పి కాల్ కట్ చేసి ఆ ఫ్యాక్టరీలో నుంచి బయటికి వచ్చి కార్ లో బయలుదేరాము.
మధ్యాహ్నం లంచ్ టైం కి నేరుగా ఐబి ఆఫీసుకి చేరుకుని చీఫ్ ని కలిసి జరిగింది అంతా వివరించాము. అయితే అప్పటికే చీఫ్ అక్కడి లోకల్ సెక్యూరిటీ అధికారి కి సమాచారం అందించి ఇక్కడ కమిషనర్ కి కూడా వివరాలు అందజేశారు అని చెప్పారు. అలాగే రుద్ర కన్ఫెషన్ ఆధారంగా డిపార్ట్మెంట్లో వాడికి అనుకూలంగా పని చేసేవారిని కూడా అదుపులోకి తీసుకున్నారు. అంతే కాకుండా మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే అంతకు ముందు రోజు మేము జగదీష్ వర్మ అడ్డా మీద ఎటాక్ చేసిన సమయంలో ఇక్కడ రుద్రగాడు సెక్యూరిటీ అధికారి కస్టడీలో ఉన్న సుమతి పిన్ని తమ్ముళ్ళు వాడి భార్య ముగ్గురిని ఇంటరాగేషన్ పేరుతో క్రైం సీన్ కంఫర్మేషన్ కోసం కంపెనీకి తీసుకు వెళుతున్నాను అని చెప్పి బయటకు తీసుకువచ్చి ఎన్కౌంటర్లో లేపేసి ఆ విషయాన్ని డిపార్ట్మెంట్ కి చెప్పి అప్పటి నుంచి రుద్ర లీవ్ తీసుకొని కనబడకుండా పోయాడని చెప్పారు.
అయితే మేము అంతకు ముందు నుంచే వాడి ఫోన్ మరియు కార్ ట్రాకింగ్ చేస్తూ ఉండడంతో వాడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసినప్పటికీ IMEI నంబర్ ఆధారంగా వాడి లొకేషన్ తెలుసుకోగలిగాము. ఏదైతేనేం మొత్తానికి శత్రుశేషం లేకుండా అందర్నీ ఫినిష్ చేసాము. అందుకు చీఫ్ మా టీం అందరిని అభినందించారు. నన్ను ఏజెంటుగా తీసుకొని నా మీద అత్యంత నమ్మకం ఉంచినందుకు చీఫ్ కి నా కృతజ్ఞతలు తెలిపాను. కానీ ఇంతవరకు నేను డిపార్ట్మెంట్ కోసం చేసింది ఏమీ లేదని నాకు అనిపిస్తుందని ఇక మీదట నేను ఏజెంటుగా కొనసాగాలా లేదో ఎటూ తేల్చుకోలేక పోతున్నాను అని చీఫ్ తో అన్నాను. అందుకు చీఫ్ మాట్లాడుతూ, నువ్వు తప్పుకుంటాను అన్నా నీలాంటి వాడిని వదులుకోవడానికి నేను సిద్ధంగా లేను. నువ్వు ఎప్పటిలాగే నా ఏజెంటుగా ఉండాల్సిందే.
నేను మీ నలుగురు టీంని ఇలాగే కొనసాగించాలి అనుకుంటున్నాను. ఇప్పుడు నీకు బిజినెస్ వ్యవహారాలు, కాలేజ్ అన్నీ ఉన్నాయని నాకు తెలుసు. అందుకే ఇక మీదట నేను ఇచ్చే అసైన్మెంట్స్ నీ టీం సభ్యులు చేస్తూ ఉంటారు. నీకు వీలైనప్పుడు నీ అవసరం ఉన్నప్పుడు వాళ్లతో కలిసి పని చేసుకుంటూ ఉంటే సరిపోతుంది. నీ డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత పూర్తిస్థాయి ఏజెంటుగా నా టాప్ ప్రయారిటీ లిస్టులో నువ్వు ఉంటావు. మీ లాంటి నిబద్ధత ధైర్యసాహసాలు గల యువకులు మనలాంటి డిపార్ట్మెంట్స్ కి చాలా అవసరం. సో,,, ఎప్పటిలాగే మీ టీం ఇలాగే కంటిన్యూ అవుతూ దేశానికి సేవ చేయండి. ఒక బ్లాక్ బస్టర్ ఆపరేషన్ కంప్లీట్ చేశారు కదా కొద్ది రోజులు హ్యాపీగా రెస్ట్ తీసుకొని మళ్లీ యాక్షన్ కి రెడీ అవ్వండి అని మాకు ఆల్ ది బెస్ట్ చెప్పారు. మా మీద అంత నమ్మకం పెట్టుకున్న చీఫ్ మాటలను కాదనలేకపోయాను. పైగా ఆయన నాకు వెసులుబాటు కూడా ఇచ్చారు కాబట్టి నేను కూడా ఏజెంటుగా కొనసాగాలి అనుకున్నాను.